2, 3 అధ్యాయములు ఏడు సంఘములు

పరిచయం

దేవుని మహిమ క్రమక్రమముగా వెళ్ళడియగును. ఆదికాండములోకొంత బయలు పడినది. ఈ ప్రకారముగా 65వ. పుస్తకమగు యూదా పత్రిక వరకు మహిమ క్రమక్రమముగా యెక్కువ బైలుపడుచు వచ్చెను. ఇప్పుడు ఈ ప్రకటన గ్రంధములో 65 పుస్తకముల మహిమ వెల్లడిలోనికి వచ్చెను.

మొదటి అధ్యాయములోనే తండ్రి కుమారుడు, ఆత్మ బయలు పడినది. ఇదొక మహిమ. పరలోకములో సంఘమున కుండనైయున్న ఏడు అంతస్థులకు ముగుర్తుగానున్న భూలోక సంఘములు ఏడు బైలు పడినవి. ఇది మరియొక మహిమ యోహాను దురవస్థలోనుండగా ప్రత్యక్షలు ప్రారంభమైనవి. ఇదొక మహిమ క్రీస్తు ప్రభువుయొక్క ప్రకా శమానమైన మహిమ మహిమ స్వరూపము బైలు పడినది. ఇది మరియొక మహిమ ఆయన వింతైన మాటలు మరియొకమహిమ. క్రీస్తుప్రభువు ఒక్కొక్క సంఘమునకు ఒక్కొక్క రీతిగ వాటి వాటి భక్తిని బట్టి ప్రత్యక్షమాయెను. ఆ యేడు సంఘముల వివరము రెండు మూడు అధ్యాయములలో నున్నవి కాని ఈ ప్రత్యక్షతలు యోహానుకు మొదటనే కనబడినట్లు మొదటి అధ్యాయములోనే వున్నది.

    ఏలాగనిన
  1. ఎఫెసు పట్టణ సంఘమునకు ప్రత్యక్షమెన విధము:- ఏడు నక్షత్రములు తన కుడిచేత పట్టుకొని ఏడు దీపస్తంభముల మధ్య సంచరించు వ్యక్తిగా కనబడెను. ప్రక 1:13;2:1.
  2. స్ముర్ణపట్టణ సంఘమునకు క్రీస్తు ప్రత్యక్షమైన విధము:- మొదటివాడును. కడపటివాడునై యుండి మ్రుతుడై (మరల) బ్రతికి వ్యక్తిగా కనబడెను. ప్రక 2:8;1:8.
  3. పెర్గెము పట్టణ సంఘమునకు క్రీస్తు ప్రత్యక్షమైన విధము:- వాడియెన రెండంచులుగల ఖడ్గముగల వ్యకిగా కనబడెను ప్రక 2:12; 1:6.
  4. తుయతైర పట్టణ సంఘమునకు క్రీస్తు ప్రత్యక్షమైన విధము:- అగ్నిజ్వాలలవంటి కన్నులును, అపరంజిని పోలిన పాదములను, గల దేవుని కుమారుడైన వ్యక్తిగా కనబడెను. ప్రక 2: 18:1:14.
  5. సార్ధిస్ పట్టణమునకు క్రీస్తు ప్రత్యక్షమైన విధము:- ఏడు నక్షత్రములును దేవుని ఏడాత్మలను గల వ్యక్తిగా కనబడెను. ప్రకటన 3:1;1:20;1:4.
  6. ఫిలదెల్ఫియా పట్టణ సంఘమునకు క్రీస్తు ప్రత్యక్షమైన విధము:- దావీదు తాళపు చెవికలిగి ఎవడును వేయలేకుండ తీయువాడును తీయలేకుండ వేయువాడునైన సత్య స్వరూపియగు పరిశుద్ధుడైన వ్యక్తిగా కనబడెను. ప్రక 3:7;18.
  7. లవొదికయ పట్టణ సంఘమునకు క్రీస్తు ప్రత్యక్షమైన విధము:- ఆమేన్ అనువాడును, నమ్మకమైన సత్యసాక్షియుదేవుని సృష్టికి ఆదియునైన వ్యక్తిగా కనబడెను. ప్రక 3:14;1:5.

షరా:- ఒక పాఠశాలలో ఏడు తరగతులును, వాటికి ఏడు గదులును ఉన్నవి, అన్నిటిలోను విధ్యార్దులు గలరు. అన్నిటిలోను విధ్యగలదు కాని అంతస్థు ఒకదానికంటె ఒకటె యెక్కువకాదా? అన్నియు కలసి పాఠశాల యగును, అలాగే భక్తులందరును తమ భక్తినిబట్టి భూలోకమందు ఏడు తరగతులుగా ఇప్పుడు సిద్ధమగుచున్నారు. ఈ ఏడు తరగతులే జీవాంతమందు మోక్షలోకమునకు వెళ్ళును. పాఠశాలలో కొందరు విధ్యార్ధులు నాల్గవ తరగతి వరకు చదివి శక్తిలేక బడి మానివేయుదురు. కొందరు ఆరవ తరగతి వరకు చదివి మానివేయుదురు. మరికొందరు ఏడవ తరగతి వరకు వెళ్ళుదురు. అలాగే భక్తుల విషయములో కూడ జరుగును. మోక్షమునకు వెళ్ళిన తరువాత దేవుడు అందరిని ఆయా తరగతులకు చేర్చుకొనును. నాల్గవ తరగతిలోని భక్తులు అయ్యో మేము ఏడవ తరగతికి సిద్ధపడినాము కాని మమ్మును ఎందుకు దేవుడు నాల్గవ తరగతిలో వేసెనని అనుకొనవచ్చును. చింత కలుగును. అప్పుడు చింతపడుటకన్న భూమిమీద ఉన్నప్పుడే చింతపడి ఏడవ తరగతికి సిద్ధపడుట సబబుగా! ఎవరి హృదయము ఏ తరగతికి సిద్ధమై యున్నదో దేవునికి తెలియదా భక్తి హీనులు మోక్షమునకు వెళ్ళనే వెళ్ళరు. వారు పాతాళమునకు పోవుదురు. భక్తు లారా! ఒకవేళ చివరి ఘడియలో సిద్ధపడుటకు వీలుగాక పోవచ్చు గనుక సిద్ధపడండి. మొదటి శతాబ్ధములో ఉన్న భక్తులు ఆఏడు పట్టణములస్థితి బాగుగా చదువుకొని మీరు ఏ తరగతిలో యిప్పుడున్నారో పరీక్షించుకొని లవొదికయ సంఘములోని భక్తులవలె సిద్ధపడువారు మొదటి తరగతిలో మోక్షమున ఉందురు. ఆ తరగతి దేవుని సిం హాసనము దగ్గర ఉండును. బడిగంట వాయించగానే ఆయాస్థలములలో నున్నవారు పరుగెత్తుకొని వచ్చి యెవరి తరగతిలో వారు కూర్చుందురు గదా! అలాగే మృతులు జీవాంతమందు మోక్షమునకు వెళ్ళినపుడు ఎవరి తరగతిలో వారు ప్రవేసించుదురు. ఇంకొక తరగతిలోకి వెళ్ళుటకు ప్రయత్నింపలేరు. పరలోకమందు ఏడు తరగతులలోను ప్రభువుండును. మహిమ, సంతోషము, కలిగియుండును. గనుక ఏ తరగతిలో ప్రవేసించినను చింత ఉండకూడదు. మొదటి శతాబ్ధమునుండి నేటివరకును క్రైస్తవ సంఘచరిత్రవంటి చరిత్ర జరుగుచున్నది ఇది అయిపోయిన తరువాత భూలోకసంఘ చరిత్ర ఉండదు. సంఘము రెండవరాకడ సమయములో మోక్షమునకు వెళ్ళిపోవును.

విషయములు

    2, 3 అధ్యాయములు:-
  1. సంఘములను గూర్చి ఉన్నది. అవి మన కాలములోనివికావు. అనగా ఆ 7సంఘములు చిన్న ఆసియాలోని 7 పట్టంఅములు. ప్రకటన 1: 11. ఇవి క్రైస్తవ సంఘము లన్నిటికి మాదిరి సంఘములను, చరిత్రాత్మీయక విషయములను కనబరచునవి.
  2. వాటినిపోల్చి ప్రకటనలోని 7 సంఘములోని అనుభవాంతస్థును ప్రభువు యోహానుకు బయలు పరచిరి. ఈ 2,3 అధ్యాముల వివరము తెలిసిన మిగత 20 అధ్యాయములోని సంగతియు బాగుగా తెలియును.
  3. పరిశుద్ధాత్మ కుమ్మరింపు దినమందు క్రైస్తవ సంఘము ప్రారంభింపబడినది. అప్పటినుండి ప్రభువు రెండవరాకడ వరకున్న మధ్యకాలమే క్రైస్తవ సంఘకాలము ఈ క్రైస్తవ సంఘకాలములో 7సంఘ కాలములు గలవు.
    • 1) ఎఫెసుసంఘకాలము 1-170 సం||లు
    • 2) స్ముర్ణ 170-312.
    • 3) పెర్గెము 312-606.
    • 4) తుయతైర 606-1520.
    • 5) సార్ధిస్1520-1720.
    • 6) ఫిలదెల్ఫియ 1720-1900
    • 7) లవిదికయ 1900-రెండవ రాకడవరకు.

    ఈ 7 సంఘములు కలిసి ఒకే సంఘము.దీనినే ప్రభువు వచ్చి తీసికొనివెళ్ళును. 7 పట్టణ సంఘముల పేర్లు పోయినవి. 7 సంఘకాలములలోను, ఇప్పటికి 6సంఘకాలములు జరిగిపోయినవి. ఇప్పుడు జరుగుచున్నది 7వ సంఘ కాలము. ప్రతి సంఘకాలములోను 7 సంఘాతస్థుల అనుభవము గల విశ్వాసులు గలరు. అనగా మొదటి సంఘకాలమైన ఎఫెసు సంఘకాలములో 7 సంఘాత స్థుల అనుభవము గల విశ్వాసులు గలరు. (1థెస్సలో 4:16,17)దీనిని బట్టి చూడగా మొదటి శతాభములోనే 7వ సంఘాతస్థు విశ్వాసులున్నారనితెలియుచున్నది. అట్లే ప్రతి సంఘకాలములోను 7 విధములైన అనుభవముగల విశ్వాసులు గలరు. ఈ కాలమే 7వ సంఘ కాలమైన లవొదికయ సంఘాతస్థైన పెండ్లికుమార్తె అంతస్థునకు చెందినవారై యుండవలెను. గాని 7 అంతస్థులు గలవారును యీ సంఘకాలములో గలరు. ఈ సఘ కాలమందె ప్రభువు వచ్చి సిద్ధపడిన వారిని కొనిపోవును. ఈ సంఘకాలములోనే ప్రభువు రెండవరాకడ గురుతులన్నియు జరిగిపోయినవి. గురుతులలో గొప్పగురుతు గొప్పగురువైన క్రీస్తు ప్రభువు క్రైస్తవ సంఘములో లేకుండ వెలుపలనుండి తలుపు తట్టుచున్నారు. (ప్రకటన 3: 20) క్రైస్తవులలో క్రైస్తవులలు తగవులాడుకొంటే పాదిరిగారు (క్రీస్తు ప్రభువు) వెలుపల నున్నారు. అందరు ఒకటే అయితే ప్రభువులోనికి వస్తారు ఇది గొప్ప ఆఖరిగుర్తు ఇది కీచులాటకాలము పోయేవరకు ప్రభువు వచ్చుటకు వీలుండదు. ఇది పోదు. ప్రభువు వీరిని తీసికొనిపోరు. గాని తలుపు వెలుపల ఉండి తట్టుచున్నారు. కాని ఆయన స్వరము వీరు వినుటలేదు ఎవరి గందరగోళములో వారే ఉన్నారు. కాని ప్రభువుతట్టినప్పుడు అన్ని మిషనులలోని, అన్ని గ్రూపులోని కొందరు ఆయన స్వరము విని తలుపు తీసి ఆయనను చేర్చుకొని రాకకొరకు సిద్ధపడుదురు. అట్టివారిని ప్రభు రాకడలో తీసుకొని వెళ్ళును. ఈ సంఘకాలమందే విశ్వాసులందరు లవొదికయ సంఘాంతస్థయిన 7వ అంతస్థునకు చెందినవారై యుండవలెను. గాని 7 అంతస్థులు గలవారు ఈ సంఘకాలములో గలరు. ప్రభువు తట్టినప్పుడు యెవడైనను నా స్వరము విని తలుపు తీసినయెడల" అని ప్రభువు పలికియున్నారు. అనగా అన్ని మిషనులలోని ఆయావ్యక్తులు ఆయన స్వరము విని తలుపు తీయుదురు గాని మొత్తము మిషనులోని వారందరు తలుపు తీయరు-అని అర్ధమగుచున్నది. గాని ఆయా మిషనులలో నున్న కొందరు వ్యక్తులచే ప్రభువు రెండవరాకడలో తీసికొని వెళ్ళునుగాని మిషనునంతటిని తీసికొని వెళ్ళరు ప్రభువు తలుపు వెలుపలనుండి పిలువగా ఆయన స్వరము విని వచ్చిన యేర్పాటు జనులు రాకడకొరకు సిద్ధపడి రాకడలో వెళ్ళుట వారిస్థితి. ప్రభువు పిలువగా ఆయన స్వరము వినక మాదిగొప్ప మాదిగొప్ప అని రాకడ తలంపు లేక సిద్ధపడక మిగిలిపోయి ఉండుట వీరిస్థితి, ఉండిపోయేవారికి వెళ్ళిపోయేవారి సంగతి అక్కరలేదు. పైవారికి అపరిమితానందముండును. మనము లవొదికయ సంఘములో తిన్నగా నడచిన ఆయన సింహాసనముపై కూర్చుందుము.(ప్రకటన 3:21)

    • (1) ప్రభువు పిలువగా వచ్చిరి.
    • (2) గందరగోళములో నుండకుండ ప్రభువువద్ధకు వచ్చివేసిరి.
    • (3) రాక కొరకు సిద్ధపడిరి. గాన వీరికి పెండ్లి విందులో నుండుటకును సిం హాసనముపై కూర్చుండుటకును, వీలుండును .

    వివాహ సమయములో పెండ్లి కుమారుడు, పెండ్లికుమార్తె ఒకే బల్లపై కూర్చుందురు. అలాగే పెండ్లికుమార్తెయైన సంఘము పెండ్లికుమారుడైన ప్రభువుచెంతనే యుండును. పెండ్లి విందునందు వధువు పీఠము నీ చెంతనుండు "రక్షకా" అంత గొప్ప భాగ్యమును మనము పోగొట్టుకొనకుందుము గాక! రేపు సిద్ధపడుదును అంటే రేపు రేపుగానే ఉండును. రేపు అనగా క్రీస్తుప్రభువు సంఘమును తీసికొని వెళ్ళిన తరువాత వచ్చేరేపు అగును. సంఘమును యీవేళ తీసికొనివెళ్ళితే రేపు వచ్చేది 7 ఏండ్ల మహాశ్రమ. జాగ్రత్తగా సిద్ధపడండి. ఉదా:- ప్రభువు ఒక బోధకు రాలితోఎ పరలోకముంకు వచ్చివేయుమని చెప్పెను. ప్రభువా! యిప్పుడు నేనురాను. మా అమ్మను చూడాలి అని బోధకురాలు అన్నది. ప్రభువు పిలువగా యిప్పుడు రాను అన్న బోధకురాలు తరువాత మరణము రాగా చనిపోయినది. అట్లే ప్రభువు రాకలో వెళ్ళుటకు సాకుచెప్పువారు 7ఏండ్ల శ్రమలలో ఉండిపోవ్దురు.

    • (1) లవొదికయ అంత గొప్ప సంఘములేదు. ఎందుకనగా రాకడలో చావులేకుండ వెళ్ళగలస్థితి సంఘము గనుక (1కొరింధి 15:51,52)
    • (2) లవొదికయ అంత పాడు సంఘములేదు. ఈ సంఘకాల ప్రజలస్థితి అతిభయంకరముగా నుండును (11తిమొతి3:1-5 (3) లవొదికయ సంఘమంత క్షీణసంఘములేదు. ఎందుకనగా యీ సంఘము యెంతో స్థితిగలది గాని అట్టి గొప్పస్థితిని సంపాదించుకొనక యేమిలేదని దరిద్రురాలైనది. గనుక క్షీణసంఘమైనది. ప్రకటన 3:16, 17).

1. ఎఫెసు సంఘము

  • 1. చరిత్ర:- ఎఫెసు చిన్నాసియాలోని ఒక పురాతన పట్టణము మంచి రేవు ఉండుట వలన వ్యాపార కేంద్రమయినది. గనుక ఇది ముఖ్య పట్టణము. యూదుల స్థానము, పౌలు ష్తాపించెను. (అ, కా. 18:19-21:19:17) ఆయన చెఱలోనుండి ఎఫెసీయులకు పత్రికను వ్రాసెను. అకుల ప్రిస్కిల అనువారిని అక్కడ ఉంచెను. అర్తెమీదేవి యాజకులు ఏడుగురు అక్కడ ఉన్నారు యోహాను చివరికాలములో అక్కడ ఉన్నారు రోములోని రంగస్థలములోని సిం హాసనముల ఎదుట వేయుటకు ఆసియాలోని నలుదిశల నుండి హతసాక్షులను తెచ్చిరి. అందుచే బిషప్ ఇగ్నేషియస్ ఎఫెసుకు "హత సాక్షుల రహదారి" అని పేరిడెను, కడకు దానిని "ప్రాచీన ప్రపంచపు మాయ సంత అని పిలిచిరి.

  • 2. ప్రత్యక్షత:- ఏడు దీప స్తంభముల మధ్య ప్రభువు సంచరించు చున్నట్లు కనబడెను. ఆయన కుడిచేతిలో ఏడునక్షత్రములు కలవు. నక్షత్రములనగా ప్రకాశించునవి. ఏడు నక్షత్రములు ఏడు సంఘములకు బోధకుని యోహాను వ్రాసెను. రెండవ రాకడ వరకు వీరుందురు. కనుక ఏడు సంఘములు కూడా రెండవ రాకడ వరకు ఉండును. బోధకులు నక్షత్రముల వంటివారు (దాని 12:3, ఫిలిప్పీ 2:16) ప్రపంచ జనసంఖ్య కోట్లకొలదిగా నుండెను. ఇందు మూడవ వంతు క్రైస్తవులు ఉన్నారు. ఈ ప్రకటన మతము అన్ని మతములకంటె గొప్పమతము. అనగా ఒక్కొక్క సంఘములో కోట్లకొలదిగా నుందురు. క్రైస్తవ సంఘమతము ఒకటి. అందులో ఎఫెసు సంఘమొకటి, స్థంభములు ఎలాగు కదలక యుండునో అట్లు సంఘములు స్థిరముగా నుండును. స్థంభముమీద దోమలు రాలి పడునట్లు సంఘములోని కృతిమకారులు పోవుదురు కాని సంఘము మాత్రము ఉండును. బ్యాటరీలైటు వానకు తడిచిన, గాలివీచిన ఆరిపోదు వెలుగుచు నుండును. అట్లే సంఘమునకు ఎన్ని కష్టములు ఉన్నను పడిపోదు. ఆరిపోదు స్థిరము రానే యుండును. అబద్ధబోధకులు ప్రవక్తలువచ్చి ఎన్ని బోధించిన సంఘము కదలక దీపస్తంభమువలె స్థిరముగానే యుండును. భక్తులు బోధకులు నచత్రములువలె ప్రకాశింతురు. ఎఫెసు సంఘము పొయెను. అది ఇప్పుడు టిర్కీవారి చేతిలోనున్నది. నీవు జాగ్రత్తగా నుండకపోతే తీసివేయుదునని ప్రభువు చెప్పెను అట్లే తీసివేయబడినది కాని క్రైస్తవ సంఘముపోదు. ఎఫెసు సంఘము భూమి మీద ఆ ఎఫెసు పట్టణమునుండి తీసియేయబడినను,పరలోకములో ఈ పేరు మీ ద సంఘము అక్కడ ఉన్నది. నిరుకైన సంఘములు, బోధకులు పోరు, నిరుకు లేనివారు పోవుదురు. కుంచము క్రింద పెట్టబడియున్న బైబిలు గ్రంధము అందరికి వెలుగిచ్చుటకై కుంచముపైన పెట్టబడినది. (బైబిలుదొరికిన కాలము) అట్లు ఇప్పుడు ప్రకటన గ్రంధదీపము కుంచము క్రింద పెట్టబడియున్నది. ప్రభువు ఇప్పుడు దానిని అందరికి వెలుగిచ్చుటకై కుంచము మీద పెట్టియున్నారు. కముకనే అందరకు ప్రకటించుచున్నాము. గనుక ఇక్కడున్నవారు దీపస్తంభములను జాగ్రత్తగా కాపాడుకొనవలెను. లేకపోతే తీసియేయబడును. ఎవరికైన ప్రభువు దీపస్థంభముల మధ్య సంచరించుచున్నట్లు కనబడిన యెడల వారిదీపము అనగా ఆత్మీయస్థితి ఆరిపోవుచున్నదని అర్ధము చేసికొని జాగ్రత్త పడవలెను.

  • 3. మెప్పు:- నీ క్రియలు నీ కష్టము నీ సహనము 1) క్రీస్తు ప్రభువు శ్రమపడి సంఘము కొరకు పనిచేసినట్లు క్రైస్తవుడును శ్రమపడి క్రీస్తుకొరకు పనిచేయవలెను. ఇట్లు పనిచేసినది ఎఫెసు సంఘము కనుకనే ప్రభువిట్లు మెచ్చుకొనెను. కష్టపడి పనిచేసినప్పుడు క్రియలు కనబడును. ఇట్లు క్రియలు కనబరచినది ఎఫెసు సంఘము, ఈ సంఘకాలములో అపొస్తలులు అపొస్తలుడైన పౌలు, మిగతవారు శ్రమపడి పనిచేసి సహనమును కనబరచి ప్రభువు యొక్క నామము నిమిత్తము భారము భరించిరి. 2) దుష్టులను సహింపలేవు అబద్ధికులను తెలిసికొంటివి. అపొస్తలులుకారు అపొస్తలులమని చెప్పుకొనిరి. వారిని పరీక్షించినావు. 3) సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించితివి. అలయలేదు. ఎంతటి భారమున్న అలయకుండ ఆ పనిని సాగింవ్హిరి. పైన చెప్పిన అపొస్తలులైన వారి భొధకు భిన్నముగా చెప్పువారు ఆ కాలమునందును కలరు అని గలతీ 1: 6-8 నందు క్రీస్తు సువార్తను చెరుపగోరి మిమ్మును కలవరపరచువారు కొందరున్నారని అపొస్తలుడైన పౌలు చెప్పెను. కనుక అపొస్తలులు కానివారున్నారని దీవల్ల తెలియుచున్నది. అయినను అపొస్తలులు వేసిన స్థిరమైన పునాదిమీదనే ఎఫెసు సంఘము నిలిచెను. 4) నికొలయితుల క్రియలు ధ్వేషించు చున్నావు నేనును ధ్వేషించుచున్నాను. నికొలయితులనగా నికొల అను దుర్భోధకుని శిష్యులు. వీరు ఆకాలమందు కలరు. వీరిబోధ:- సంఘములో పాదిరిగారు మాత్రమే ఆరాధన చేయవలెను. ఆయనలేని సమయమందైనను, సంఘములోని పెద్దలైన వారైనను సంఘములో కర్ర్యక్రమము చేయకూడదు అని చెప్పు బోధయే నికొలయితుల బోధ. బి) ఒక మిషనులోని గురువులు ఇంకొక మిషనువరి ప్రసంగము పీఠముపై ప్రసంగించరాదు. సి) పాదిరిగారు సంఘములో తన యిష్టమునే నెరవేర్చుకొనును గాని సంఘమెంత చెప్పిన, నెగ్గనీయరు. ట్లే సంఘము తన యిష్టమునే సంఘవిషయములో నెరవేర్చుకొనును గాని పాదిరిగారి మాట ఎంత మాత్రమును నెగ్గనీయరు. ఇదియె నికొలయితులబోధ. డి) జీవించుచున్న లోకబంధమైన జీవితమును క్రైస్తవ జీవితముతో కలిపి జీవించవచ్చునని వారందరు అనగా క్రైస్తవ్యము లోకమును మార్చుటకు బదులు లోకము క్రైస్తవయమును మార్చవలెననుటయై యున్నది.

  • 4. తప్పు:- నీ మొదటి ప్రేమ వదిలితివి ప్రభువు తప్పుఒకటి మోపవలసి యున్నదని చెప్పెను. తనమీద ప్రభువు చెప్పక ఆది ప్రేమ పోయినది అనెను. పనుల మీద నుండి క్రమముగా ప్రభువుమీద ఉన్న ప్రేమను పోగొట్టుకొనిరి. ఎఫెసు సంఘమునకు చురుకుతనమున్నది. ఇది మంచితనము ఆచారములు బాగున్నది అనగా దేవాలయమునకు వెళ్ళుట పండుగల కొరకు అలంకరణ చేయుట బోధనాచారములు కూడ బాగున్నవి కాని జీవములేదు ప్రేమలేదు విశ్వాసములేదు ఇప్పటి సంఘము కూడా పై ఆచారములో బాగున్నది కాని భక్తిలేదు అందుచేత సంఘము ఎత్తివేయబడినది. ప్రభువును మనస్సులో ఉంచుకొనక ప్రభువుమీద ప్రేమను కలిగి యుండక సంఘములో ఒకరినొకరు ప్రేమించుకొనక కేవలము ఆచారములనే చేయుచున్నారు గాన అదే తప్పు. భక్తిని వృద్ధి చేసుకొనుటకు ఆచారములు పెట్టిరి కాని భక్తి పోయి ఆచారములున్నవి. భక్తి ముఖ్యముకాని సేవ ముఖ్యము కాదు. ఆచారము ప్రధానము కాదు కాని ఆచారము సేవ ఉమండి జీవము ప్రేమ వెలుగు ప్రేమ ఉన్నా పరలోకములో ప్రవేశము కలుగును. ఎన్ని చేసిన గాని అన్నిటిలో ముఖ్యమైనది భక్తి. అదిలేదు గనుక మెచ్చుకొనుటకు వీలులేదు. ఎఫెసువారు చెడుగును ధ్వేషించిరి భక్తి, సేవ, ఆచారము పని, మనది. కృపచూపుట దేవునిపని.

  • 5. మందలింపు:- నీవు పడిన స్థితి జ్ఞాపకము చేసికొనుము. మాకు మనస్సు నొందుము. మొదటి క్రియలను చేయుము. ఎఫ్ఫెస్సు సంఘములో మారుమనస్సనగా పోగొట్టుకొన్న స్థితిని తిరిగి సంపాదించుకొనుట.

  • 6. శిక్ష :- చిన్నాసిలో ఉన్న ఎఫెసు సంఘమునకు దీపస్తంభమును తీసివేతునని ప్రభువు చెప్పిన ముప్పది సం||లకు టర్కీవారు దానిని స్వాధీనపరచుకొనినందున ఎఫెసు సంఘము లేదు. భులోకస్థానము తీసివేయబడినది కాని ఇది భక్తులు స్థాపించినారు కనుక పరలోకషానము ఉండిపోయినది. ఈ సంఘములోని విశ్వాసులైన పరిశుద్ధులు పరదైసులో అనేకమంది ఉన్నారు గాన పరమందు ఈ సంఘ్మున్నది సిలువమీద ప్రభువు మరియమ్మను యోహానుకు అప్పగించిన చరిత్ర వ్రాయబడిన వ్రాత టర్కీలో దొరికినది. బ్లిట్జి పేపరులో ఉన్నది.

  • 7. కోరిక లేక సలహా:- పా||ని|| కాలమంతటిలో దేవుని స్వరము వినబడినది. సంఘకాలములో పరిశుద్ధత్ముని స్వరము వినబడినది. (అపొ.కా. 8:29-39; 10:19: 11:12)బైబిలు వ్రాతపిమ్మట ఆత్మ సంఘములలో స్వరములో చెప్పుచుండెను. ఏడు సంఘములు వినుచుండెను. నిజముగా ఆత్మస్వరమును సంఘములోని ఒక్కొక్కరు వినవలెను. ఇప్పుడు అనేకులు ఆత్మీయ స్వరమును వినుచున్నారు. సంఘములోతో ఆత్మ చెప్పునది చెవిగలవాడు వినునుగాక! చెవులు రెండురకములు ఒకటి ఈ లోకమునకు సంబంధించిన సర్వమును విను శరీరక చెవులు, రెండు దేవుని స్వరేము విను ఆత్మీయ చెవులు లోకములో ఆత్మచెప్పు సంగతులు వినగల ఆత్మీయ చెవులు గలవారు ధన్యులు.ఇది కావలెననియే ప్రభువు కోరుచున్నారు. "సకలేంద్రియములారా" అను కీర్తనలో సకలేంద్రియము అనగా పంచేంద్రియములు అనగా చెవి, కన్ను, ముక్కు, చ్ర్మము, నాలుక, (నోరు) చూపు, వినికి, శ్వాస, స్ప్ర్శ, గ్రహింపు మనశక్తులకు పరిమితి యున్నది. కనుక మనశక్తికి మించినవి తెలిసికొనుటకు ఆత్మచెప్పవలెను. కనుక ఆత్మీయ చెవి కావలెను.

  • 8. బహుమతి:- జయించువానికి దేవుని పరదైసులోనున్న జీవవృక్ష ఫలములను భుజింపనిత్తును. జయించువానికి ఎఫెసుసంఘ అంతస్థులోని ప్రభువు మెచ్చుకొన్నరీతిని జీవించి కడవరి వరకు దైవభక్తిలో వృద్ధినొంది ప్రభువు యెడల ప్రేమ తరుగకుండ చేసికొనుటయే జయించుట. ఈ లోక జీవిత ముగింపు తరువాత పరదైసుకు చేరినప్పుడే సంపూర్ణ జయము.

    పరదైసు:- పరదైసు అనగా వనమని అర్ధము. పరదైసు అను పదము బైబిలునందు క్రొ.ని. లోని మూడుచోట్ల మాత్రమే చూడగలము (లూకా 23:43, 2 కొరింథీ 12:3,4) ఏదేను తోటను కూడా పరదైసుకు పోల్చిరి అబ్రహాము రొమ్మును కూడా పరదైసుకు పోల్చిరి ఇది పరలోకములోని మోక్షమునందు ఒక స్థానము భూమిపై క్రీస్తునందు రక్షింపబడినవారి ఆత్మలుండుచోటు.

    జీవవృక్ష ఫలములను భుజించ్పనిచ్చుట:- క్రీస్తునందు మర్పునొంది క్రొత్తగా సంఘములో చేరినవారు ఎఫెసు సంఘములో చేరినవారు. వారు జీవముకలవారు. మనిషి జీవితములోఎ శిశుస్థితి, యౌవనస్థితి, వృధాప్యస్థితి ఉన్నట్లు అత్మీయస్థితిలో కూడా స్థితులు ఉన్నది ఎఫెసు సంఘస్థితి శిశుస్థితి వంటిది. ఆత్మీయస్థితిలో శిశుస్థితిగా (ఎఫెసుస్థితిలో) చనిపోయిన పరదైసులో నుందురు. యౌవన స్థితిగల ఆత్మీయస్థితిలో చనిపోయినవారు రక్షణస్థితిలో నుందురు. ఆత్మీయస్థితిలో వృద్ధాప్యస్థితి కలవారు నూతన యెరూషలేమునకు వెళ్ళుదురు. (పెండ్లికుమార్తె) అందరకు కృప ఉన్నది. కొందరు జీవము పొంది వెలుగు చుందురు. గాన వారి దీపస్థంభములుండును. కొందరు జీవము పొంది వెలిగి పడిపోవుదురు. వీరి దీపస్థంభము తీసివేయబడును.

    క్రైస్తవుడు ఎఫెసు సంఘస్థితిలో జయముపొంది పరదైసుకు వెళ్ళును. జీవవృక్ష ఫలములు పరదైసులో భుజించును.తండ్రి జీవవృక్షఫలములను భుజింపజేయును కనుక పరదైసులోని అంతస్థుల ప్రకారము ఎరుగుదురు పరదైసుకు పైనున్న స్థితులకు పెరగరు. (ఈ ఫలములను కుమారుడియ్యక తండ్రి ఇచ్చెనని ఉన్నది. దేవుని పరదైసులో) ఎందుకనగా ఎఫెసు సంఘము యొక్క మొదటి మంచిస్థితి జీవము. ఈ స్థితిలో ఎఫెసు సంఘము శిశువు వంటిది. శిశువును తండే పోషించవలెను కనుక తండ్రి ఫలములను ఇచ్చెను. కనుక జీవమిచ్చినది తండ్రి ఈ శిశువు పెరగవలెనని అంట్త్తే వెలుగు కావలెను. ఆ వెలుగిచ్చునది వెలుగైయున్న క్రీస్తు ప్రభువే. ఈ వెలుగు జీవము స్థిరముగా ఉండవలెనంటే విశ్వాసము ఉండవలెను. వీటన్నిటిని కాపాడుకొనవలెనంటే జ్ఞాము కావలెను. ఇవన్నీ ఏకంగా ఉండవలెనంటే ప్రేమ కావలెను. (ఎఫెసి5:2) లో క్రీస్తుప్రభువు చూపిన ప్రేమవంటి ప్రేమ ఉండవలెను. ఇట్టి ప్రేమ లేకపోతే అతుకదు. వీటన్నిటిని విశ్వాసికి అందించునది పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ విశ్వాసికి వాక్యోపదేశ్సమువలన విశ్వాసమిచ్చును. కనుక ఆత్మలేకపోతే లాభములేదు. శిశువునకు మెత్తని ఆహారమును పెట్టినట్లు మెత్తని పండైన జీవవృక్ష ఫలముల నిచ్చును. తండ్రి పరదైసునందు ఈ ఫలములనీయక పోయిన ఎడల ఈ భూమి పై సంపాదించిన జీవము పోవును. ఈ జీవమునకు జీవమిచ్చే ఫలములు అక్కడ ఉన్నవని తెలియజేయుటకు జీవవృక్ష ఫలములున్నవి. ఏదేను వనమందున్న ఆదాము ఆవ్వలు మహిమ శరీరధారులు కనుక పరదైసునకు వెళ్ళివచ్చెడివారు.

  • 9. ఉపమానము:- మత్తయి 13:1-9వ విత్తువాని ఉపమానము ఎఫెసు సంఘములో ఈ విత్తనాల ఉపమానమున్నది. ఈ ఉపమానము ఎఫెసు సంఘస్థితిలో నున్నవి. ఏడు సంఘముల స్థితిరాకముందే ప్రభువు సువార్తలలో ఏడు ఉపమనములు చెప్పెను. ఈ ఏడు సంఘములు రాగానే ఉపమానములు చూచి గ్రయించుకొంటకు ముందే ప్రభువు చెప్పెను.

    విత్తనముల ఉపమానము:- విత్తువాడు విత్తనములను తీసికొని చల్లెను వాటిలోని కొన్ని రాతిపై కొన్ని ముండ్ల పొదలలోను కొన్ని మంచినేల పైనను పడినవి. ఈ మంచినేలపై పడినవి పండిన పంట నూరంతలు.అరువదంతలు, ముప్పదంతలు పండెను. విత్తువాడు అనగా బోధకుడు. విత్తనములూనగా దేవుని వాక్యము . పడిన స్థలము అనగా మానవ హృదయము. మంచినేలను పడినవారు వాక్యమును విని గ్రహించి అంగీకరించి అవలంభించి ఓపికతో ఫలించువారు త్రోవప్రక్క నుండువారు వినువారు కాని నమ్మి రక్షణ పొందకుండునట్లు అపవాది వచ్చివారి హృదయములో నుండి వాక్యమెత్తికొనిపోవును. రాతినేలనుండు వారెవరనగా విను నప్పుడు వాక్యమును సంతోషముగా అంగీకరించువారుగాని వారికి వేరులేనందున కొంచెము కాలము శోధన కాలమున తొలగిపోవుదురు. ముండ్లపొదలలో పడినవారెవరనగా విని కాలము గడచిన కొలది ఈ జీవన సంబంఘమైన విచారముల చేతను ధనభోగముల చేతను అణచి వేయబడి పరిపక్వముగా ఫలింపనివారు (లూకా8:11-15) ఇందులో నాలుగు నేలలున్నవి, మూడునేలలు ఫలింపనందున విచారమే కాని నాలుగవది ఫలించినందున సంతోషము. పంటలో ఎక్కువ తక్కువలూన్నను పంటయే. ఈ పంట భూలోకములోని రక్షితులలో గలిగిన ఫలితమును సూచించుచున్నది. విశ్వాసులందరిని పోగుచేసిన యెడల మూడు గుంపులగుదురు అందరూ నూరతలుగా ఫలింపలేరు. అందరి అందరి విశ్వాసము విశ్వాసమే. అయినను పరిమాణములో వ్యత్యాసముండును. కనుక ఫలితములోను వ్యత్యాసముండును. (రోమా 12:3) ప్రతివాడు తన తన వరుసలోనే బ్రతికింపబడును. (1కొరిథి15:23)మూడువరుసలు ఈ ఉపమానములో కలవు. ఇదే పరలోకములోను ఉండునని గ్రహించుకొనుచున్నాము.(లూకా19:18) లోని మీనాల ఉపమానములోని ఫలితములను వేరువేరుగా నున్నట్లు చూచుచున్నాము (కొరింథి15:41) నందు ఆకాశ్స్స జ్యోతులోనే కాంతి వేరువేరుగా నున్నట్లు పునరుథానులైన వారికి కలిగిన మహిమలోను వ్యత్యాసమున్నది. అనగా పరమునకు చేరువారు రకరకములైన అంతస్థులలో ఉందురు. అట్టి అంతస్థులు ఈ విత్తువాని ఉపమానములో నున్నది.

    1) ప్రకటన 21వ అధ్యాయములో నున్నట్లు క్రొత్తభూమి క్రొత్త ఆకాశమును కలుగును. ఇది మోక్షములో ఒక భాగమందుము పరలోకములో నున్న మహిమ ఆనందము పరిశుద్ధతనున్న విధముగానే ఇక్కడను ఉండును. ఈ క్రొత్త భూమి మీద నున్న వారిని ముప్పదంతల పంటకు పోల్చుదుము లోకాంతమునకు ముందు కొందరు మారుమనస్సు నొంది (ఏడేండ్ల శ్రమ కాలము) మోక్షమునందు ఒక భాగమునకు వెళ్ళుదురు. (1కొరింథి 3:15) లో అగ్నిలో నుండి రక్షింపబడినట్లు వీరు రక్షింపబడునని ఉన్నది కనుక వీరిని అరువదంతుల పంటతో పోల్చుదుము. (ప్రకటన 7:10-14)

    2) (ప్రకటన 21:2) నందు నూతన యెరూషలేము అను పెండ్లికుమార్తె అలంకరింపబడి పైనున్న దేవునివద్దనుండి భూమి పైకి దిగి వచ్చుట కలదు. ఇది మహా ఉన్నత స్థితి గల పెండ్లికుమార్తె. వీరిని మనము నూరంతల పంటతో పోల్చుచున్నాము ఈ ఉపమానములో ఫలింపనివారు ఉన్నారు. ఫలించినవారిలో ఈ మూడు అంతస్థులు కలవారు ఉన్నట్లు తెలియుచున్నది.

    • ఎ) ఎఫెసు సంఘము ఏడుసంఘములలో ప్రారంభ సంఘము అట్లే ఏడు ఉపమానములలో విత్తువాని ఉపమానము ప్రార్మభ ఉపమానము.
    • బి) ఎఫెసు సఘములో క్రీస్తు ప్రభువునందు వెలిగింపబడి జీవమును కలిగి ప్రేమయందు పరిపూర్ణమై ఎఫెసు సంఘ స్థితియందు నిలకడగా నుండిఫలితము పొందినవారు కలరు. అట్లే విత్తువాని ఉపమాములో మంచినేలను పడి ఫలించిన ఫలితమును కలదు.
    • సి) ఎఫెసు సంఘములో ప్రవేశించి ఆ సంఘస్థితిని పోగొట్టుకొనినవారు ఉనట్లుగా విత్తువాని ఉపమానములో వాక్యవిత్తనము వేయబడి కొంతవరకు పెరిగి ఎండి పోయిన స్థితియు కలదు.
    • డి) ఎఫెసు సంఘము ప్రారంభ సంఘమైనను ఏడు సంఘములలో తయారైన ఏడంతస్థులు కలవారు ఈ ఎఫెసు సంఘములో కలరు. అట్లే విత్తువాని ఉపమానములో 100,60,30 అంతస్థులవారు కనుకనే ఈ ఎఫెసు సంఘమునకు విత్తువాని ఉపమానమునకు సంభంధమున్నట్లు వీటినిబట్టి చూచున్నాము.

  • 10. మతకాలము: క్రైస్తవ సంఘ స్థాపన కాలమునుండి క్రీస్తు ప్రభువు రెండవమారు వచ్చి సంఘమును పరమునకు కొనిపోవు వరకు ఉన్న కాలమును ప్రకటనలో 7 సంఘములను బట్టి ఏడుకాలములుగా విభజించిరి. ఎఫెసు సంఘముయొక్క మతకాలము క్రీశ. 1-170సం||.

  • 11. స్థితి:- క్రీస్తు ప్రభువును మొదట తెలిసికొన్నప్పుడు ఎంత ప్రేమ యున్నదో అంత చివర వరకు నున్నది. కాని కొందరికి ప్రేమ తగ్గింది. తగ్గినా కొందరు లొంగి సంపాదించుకొన్నారు కనుక దీనస్థితి. ఆదిప్రేమ.

  • 12. పరలోక స్థానము:- ఈ ఏడు సంఘములలో భూలోకములో ఎఫెసు సంఘము మొదటిది. లవొదికయసంఘము ఏడవది పరలోక సిం హాసనము వద్దకు ఏడు సంఘములు వెళ్ళినపుడు లవొదికయ సంఘము మొదటిది ఎఫెసు సంఘము ఏడవది.

    ఎఫెసు సంఘము:-

    • 1). ఎఫెసు సంఘముచిన్న ఆసియాలో ఉన్నది. పౌలు దీనిని స్థాపించెను. పౌలు స్థాపన చేసిన 30సం||లకు పోయినది గాని పరలోకములె ఎఫెసు సంఘమున్నది. ఈ సంఘమునకు ఆచారములు బాగానే ఉన్నవి.
    • 2) చెడుగు విడిచిపెట్టుట బాగానే ఉన్నది. సేవ బాగుగానే ఉన్నది. సంఘ సంబధమైనవి, చందా పోగుచేయుట, రోగులను దర్శించుట. కూటములు చేయుట, వీధి ప్రసంఘములు చేయుట, పాదిరి గారు ఏమి చెప్పిన ఆనందముతో చేయుట, ఈ పనులు మంచివే. ఎవరు చేయుదురో వారి దృష్టిలో వారికి మంచిదే విధిప్రకారముగా పైవన్ని చేయుచున్నారు. మంచిదే కాని ముఖ్యమైనది ఒకటి ఉన్నది. అది చేయ వలెను. ఈ మూడు ఎఫెసు సంఘములో ఉన్నవి. ఏక్టీవిటీ ప్రభువుపై రూపము చూచేవారు కారు. అంతరంగరూపము చూచేవారు కనుక పైనున్నవి చూడక లోపలిభాగము చూచే వారు అదియేదనగా పైమూడు ప్రభువును బట్టి చేయ వలెను. ప్రభువు మీద గురి తక్కువ చేసుకొని వీటి మీద గురి ఎక్కువ పెట్టి చేయుటను బట్టి ప్రభువు మెచ్చుకొనలేదు. ప్రభువు తప్పు ఒకటి మోపవలసి ఉన్నది అని చెప్పెను. పనుల మీద పడి క్రక్రముగా ప్రభువు మీదనున్న ఆది ప్రేమ పోగొట్టుకొన్నది. ప్రభువు మీద ప్రేమ తగ్గుట అనగా ప్రభువునకు దూరమగుట అన్నమాట, ప్రభువును మనస్సులో ఉంచుకొనుట. ప్రభువుమీద ప్రేమ ఉంచుకొనుట.
    • 3) సంఘములో ఒకరినొకరు ప్రేమించుట మాని ఆచారములు చేయుచున్నారు గాన తప్పులోనుండు ఆచారము చేసిన విలువ ఉండదు. భక్తిని వృద్ధి చేయుటకు ఆచారములు పెట్టిరి. గాని భక్తిపోయి ఆచారములు ఉన్నవి. ఎఫెసు ఆఫీసుగాని భక్తి కాదు. పని చేయకపోతే ఆఫీసరు జీతమివ్వరు గాన ఆచారముగా పని చేయును.
    మనము ధ్యానకూటములు పెట్టుట ఆచారములమీద నున్న బలముపోయి భక్తివృద్ధి చేసుకొనుటకుగాన మీ బ్రతుకులో ధ్యానము మరువమరువ కూడదు.
    • 1. ప్రభువును కలిగి ఉండుట.
    • 2 ప్రభువు మీద ప్రేమ కలి ఉండుట
    • 3. సంఘముమీద ప్రేమకలిగి ఉండుట. ఈ మూడు వృద్ధి చేసుకొనుటకు ఆచారములు ఉండవలెను. చేసెదము అని తలూపుట వాక్కు వాక్కు లేని క్రియ. ఇట్టి స్థితి లేనందున ఎఫెసు సంఘము ఎత్తివేయబడెను. ఎఫెసుదీపస్థంభము తీసివేయబడెను.


Home


2. స్ముర్న

  • 1. చరిత్ర:- చిన్నాసియాలోని అయోనియా నగరములన్నిటిలో ముఖ్య పట్టణము. సముద్రతీరమదలి వ్యాపార కేంద్రము. ఇందు 3/4 వంతు యూదులు. వీరి పలుకుబడి విశేషముగా నుండుటృఅనుబట్టి వారు రోమా చక్రవర్తులను ప్రేరేపించి క్రైస్తవులను హింసపాలు చేసిరి. వారి బిషప్ పాలికార్పును (క్రీ.శ. 168) హతమార్చిరి. ఇది యోహాను పత్రిక పంపబడిన స్థలము. నేటివరకు ఇది వృద్ధి పొందిన పట్టణము. పట్టణములన్నిటిలో మహా సౌందర్యమైనది. కనుకనే ఇది "ఆసియాయొక్క ఆభరణము. మకుటము. పుష్పరాజ్యమని" పేరు పడినది. స్ముర్న అనుమాటకు 'చేదూ అని అర్ధము. ఇందు క్రైస్తవసంఘము పొందిన శ్రమలు అత్యధికమైనవి.

  • 2) ప్రత్యక్షత 8వ||:- మొదటివాడు కడపటివాడు మృతుడై మరల బ్రతికినవాడు (యెషయా 44:6:48:12) అనగా రక్షకులను వారిలో మొదటివాడు కడపటివాడు. అనగా ఈతనకు ముందు, వెనుక రక్షించే రక్షకులెవ్వరూలేరు. కనుకదైవకార్యములో ప్రతిదానికి ఈయనే మొదటిమొదటివాడు ఈయనే కడపటివాడు మానవులుచేయు ప్రతి మంచిపనికి ఈయనే ఆది, అంతము. విశ్వాసికి కలిగే శ్రమలలో విశ్వాసికి ఆదరణ జయము కలిగించుటకు ఈయనే ఆది అంతము. మానవునియొక్క జీవిత ప్రారంభమునకు ఆది ఈయనే జీవితాంతమునకు అంతయు ఈయనే. దైవత్వమును పరిపూర్తిగా మానవత్వములోనికి మార్చి కనబరచుటకు ఆది ఈయనే అంతము ఈయనే (కొలస్సై 2:9)

    మృతుడై మరల బ్రతికినవాడు:- ప్రభువు దేవుని కుమారుడు . మనుష్య కుమారుడు గనుక మ్రుతుడయ్యెను. దేవుని కుమారుడు గనుక మరల బ్రతికెను. క్రీస్తు ప్రభువు పాపము లేనివాడైనను సర్వ జనుల పాపపరిహారము కొరకు మరణమొందెను. మరణము చంపుటకై మరణములోనికి వెళ్ళి బ్రతికి వచ్చెను. ఈయనను పాతాళమైనను, సమాధియైనను, ముద్రలైనను, రాయి అయినను, రాణువ వారైనను, ఆపలేకపోయిరి. ప్రభువు సాతానును జయించుటకు ఈ లోకములోనికి వచ్చి యున్నారు. గనుక వాడు ఎక్కడెక్కడికి తీసికొనివెళ్ళిన అక్కడికివెళ్ళి వానిని జయించెను. సాతానుని రమ్మని తీసికొని వెళ్ళిన స్థ్తలమునకు ప్రభువు వెళ్ళలేకపోయిన ప్రభువు నన్ను జయించలేరు. కనుక రాలేదు అని సాతాను పలుకవచ్చును. మరణము రమ్మని ప్రభువును పిలిచినప్పుడు ప్రభువు మరణములోనికి కూడా వెళ్ళి దానిని చంపివేసెను. ఆదాము మొదలుకొని మరి ఎందరినో ఓ మరణమా మ్రిగావు నీ ఆకలి తీరలేదు కనుక నన్ను కూడా మ్రింగు అని ప్రభువు అనగానే మరణము ఆయనను మ్రింగివేసినది. ఉదా:- సూర్యగ్రహణమందు భూమి సూర్యునికి అడ్డుగా వచ్చినందువల్ల కొంచెము కొంచెముగా సూర్యునిని సృష్టి మ్రింగియేయుచున్నట్లు కనబడుచున్నది. భూమి పూర్తిగా సూర్యునికి అడ్డువచ్చినప్పటికిని సూర్యుడు మ్రింగివేయబడినట్లు కనబడుచున్నాడు. మరల సృష్టి భూమిని క్రక్కియేయుచున్నది. అట్లే క్రీస్తు ప్రభువు పాపములేని వాడైనను మరణమొంది దానిని జయించివేసెను.

    ప్రభువు స్ముర్న సంఘమునకు, మొదటివాడు కడపటివాడు మృతుడై మరల బ్రతికిన వాడుగా ఎందుకు కనబడెనెననగా స్ముర్న సంఘములో మరణకరమైన శ్రమలున్నవి కనుక స్ముర్న సంఘమా నేను మరణమై బ్రతికినాను గనుక మరణ కరమైన శ్రమలు మిమ్మునేమియు చేయవు అని వారిని ధైర్య పరచుటకే. ప్రభువు సజీవుడుగా ప్రత్యక్ష మాయెను.

  • 3) మెప్పు:- 9వ|| నీకు శ్రమ, దరిద్రత, దూషణ కలిగినను నీవు ధనవంతుడవే. సంఘకాలములో క్రైస్తవులకు భయంకరమెన హింసలు కలిగినవి. వీరికి కలిగిన హింసను బట్టి దరిద్రత కలిగినది. రాజులే పూనుకొని వీరిని దోచుకొని ఏమీ లేకుండ చేసినందువల్ల దరిద్రులైరి. వీరు ఎంత దైవ భక్తి కలిగియున్నారో లోకస్థులకు తెలియదు వారికి కలిగిన శ్రమలు. దరిద్రతనుబట్టి అనేకులు వీరిని దూషించిరి.

    శ్రమ:- పొదబోవు మహిమ ఎదుట ఇప్పటికాలపు శ్రమలు ఎన్నతగినవి కావు. (రోమా 8:18). ఈ లోకపు శ్రమలు పరలోకపు మహిమ భగ్యమును సంపాదిచేవి. శ్రమలు మార్పులేని మానవునికి మార్పు కలిగించేవి. మార్పు కలిగి దేవునితో జీవించువారికి దైవభక్తిని పరిపూర్తి చేసి మహిమ భాగ్యమును అందించేవి.

    "శ్రమలుపకారం-శ్రమలే హారం శ్రమలాత్మకు శృంగారం=శ్రమలవల్లనే సకల స్వనీతి సమసిపోవునుగాన-శ్రమలయందె-సంతోషించుము." "శ్రమల మార్గమే-విమల మార్గము-శ్రమభక్తుని కాశ్రమము=శ్రమలె సంపూర్ణంబగుదైవ-మానవునిగా జేయుగదా;శాంతి గలుగు కాంతి వెలుగు"

    దరిద్రత:- క్రీస్తునందు దరిద్రులెనవారికి పరమందు మహిమ భాగ్యము కలదు. కనుకనే ప్రభువు నీవు ధనవంతుడవే అని పలుకుచ్న్నాడు. ఈ లోక రీతిగా ధనవంతులనుకొనువారు దరిరులని (ప్రకటన 3:17) లోనున్నది. దేవుని పిలుపునుబట్టి పరలోకధనమును. భూలోకధనమును కలిగినవారు కలరు. కనుక క్రీస్తునందు భక్తిగా జీవించు వారియొక్క దరిద్రత కాదుకాని మహిమ భాగ్యము కలదని దీనినిబట్టి తెలియుచున్నది కనుకనే ఈ దరిద్రతలో సంతోషింతురు. (లూకా6:20)

    "పేద క్రైస్తవుడా సేద తీర్చుకో-నీదేఅగదయా ముక్తి=బాధలు పొందిన-భేధము పొందకు- వాదములాడకు మరల- మోదమోందుము-మోక్షమొందుము".

    దూషణ:- క్రీస్తునుబట్టి దూషణ పొందువారికి పరలోకములో ఫలము అధికమగును. (మత్తయి 5:11) దూషించువారిని దీవించుటయే వీరికి కలిగిన భాగ్యము (లూకా 6:28) ఇట్టి శ్రమ దరిద్రత దూషణ విశ్వాసి కలిగి యుండుట పరలోక ధనమును అభివృద్ధి చేసుకొనుటకే కనుకనే ప్రభువు ఈ సంఘమును నీవు ధనవంతుడవే అని మెచ్చుకొను చుండెను.

  • 4) తప్పు:- లేదు స్ముర్న తప్పులేని సంఘము.

  • 5) మందలింపు:-

    • ఎ) పొందు శ్రమలకు భయపడకుము.
    • బి) సాతాను కొందరిని చెరలో వేయించును.
    • సి) శ్రమ పది దినములే.
    • డి) ప్రాణాపాయము వచ్చినను నమ్మకముగా నుండుము.
    • ఎ) స్ముర్న సంఘము శ్రమలకు భయపడక క్రొత్తనీటి ప్రవాహమునకు జీవించున్న చేప ఎదురెక్కినట్లు వీరు శ్రమలకు ఎదురేగిరి. భయపడకుమని ప్రభువు చెప్పిన మాటలే వీరిని ధైర్యపరచి శ్రమలకు ఎదురేగినట్లు చేసినవి.
    • బి) సాతాను కొందరిని చెరలో వేయించును:- వీరు చెఱలో వేయబడి అన్ని రకములైన శ్రమల పాలైనా, వారి ఇష్టమునకు స్వేచ్చలేకపొయిన వారు చెరకు భయపడలేదు.
    • సి) శ్రమ పది దినములు అనగా పదిమంది రోమా చక్రవర్తులు పెట్టిన హింసకాలము, ఆ పదిమంది చక్రవర్తులెవరనగా
      • 1) నీరో
      • 2) డొమిషియన్
      • 3) ట్రేజను
      • 4) మార్కిస్ అరివేలియన్
      • 5) సెవిరస్
      • 6) మాక్సిమం
      • 7) డెసియస్
      • 8) టెరిలియస్
      • 9) అమలియన్
      • 10) డయోక్లేషియన్
      స్ముర్ణ సంఘ శ్రమకాలములో మిక్కుటముగా పెట్టబడిన శ్రమ 10) సం|| అనగా కొలది కాలమే అని అర్ధము క్రైస్తవ సంఘకాలము 20 శతాభముల కాలము దేనిలో స్ముర్న సంఘకాలము 142సం|| (17-312) కనుక ఈ సంఘము యొక్క అనుభవకాలమంతటటిలో శ్రమకాలము కొద్దికాలమే కదా! కనుక ప్రభువు పలికిన 10 దినముల శ్రమకాలముతో పోల్చవచ్చును.
    • డి) ప్రాణాపాయము వచ్చినను నమ్మకముగా నుండుము:- నమ్మకముగా నుండుము అను వాక్య ప్రకారము స్ముర్న సంఘకాలములో ఉన్న అనేక రకములైన ప్రాణాపాయకరములిఎన హింసలలోను నమ్మకముగా నుండిరి. ఉదా:- శిరచ్చేదనము, ఎర్రగా కాలినకుర్చీపై కూర్చుండబెట్టుట, కౄఉరమృగములకు ఆహారముగా వేయుట సజీవదహనము ఒకకాలును ఒక చెట్టుకొమ్మకు, రెండవ కాలును మరొక చెట్టుకొమ్మకు, కట్టివదిలివేయుట వలన మధ్యకు రెండుగా చీల్చబడుట, స్థంభమునకు కట్టివేసి తారుపోసి నిప్పంటించుట, మరిగేతారులో కొంచెము కొంచెముగా ముంచి చంపివేయుట మొ|| అనేకరకములైన చిత్రహింసలు పెట్టినా నమ్మకముగానే ఉండిరి.

  • 6) శిక్ష:- స్ముర్న సంఘములో తప్పులేనందువల్ల శిక్ష లేదు.

  • 7) కోరిక:- పై సంఘములో ఎఫెసు వ్రాయబడినట్లే ఈ సంఘమునకు చెందును. ఎఫెసు సంఘములో శ్రమ లేకపోయిన ఆత్మ చెప్పినది చెవి గలవారును వినియున్నారు. స్ముర్నలో కర్ణకఠోరమైన శ్రమలున్నవి. ఇప్పుడును ఆత్మ చెప్పునని వినవలెను. నీవు శ్రమలో ఉన్నావు. నేనెరుగుదును అన్న మాట, సంఘమునకెంత ఆదరణ? కనుక ఆత్మ చెప్పునది చెవిగలవాడు వినుగాక రెండవ మరణము హానిచేయునపుడు ఈ శ్రమలు ఏమి చేయకలుగును? ఇది గొప్ప ఆదరణ కదా

  • 8) బహుమానము:-

    • ఎ) జీవ కిరీటమును ఇచ్చెదను.
    • బి) రెండవ మరణము వలన హానిలేదు.
    ఎ) కిరీటము: జయమునకు గుర్తు. లోకములో యుద్ధముచేసి శత్రురాజులను జయించిన రాజులు ధరించిన కిరీటము. అలాగే మోక్ష రాజ్యముల కిరీటధారులైయుండడానికి పాతాళ లోకధారితైన సాతానును ఈ లోకములో జయించవలెను. విశ్వాసికి ఈ లోకము యుద్ధభూమి. పలోకవాసియైన క్రీస్తు ప్రభువు మానవలోకమనే ఈ యుద్ధభూమికివచ్చి సాతానును, పాపమును, నరకమును జయించి విజయవంతుడై ఆయన నామమందు జయించినవారికందరికీ అన్నిరకములైన కిరీటములును సంపాదించెను. ఈ కిరీటములు విశ్వాసులు పొందుటకు ప్రభువు పొందిన ముండ్లకిరీటమే సాధనము. అందువల్ల క్రీస్తు యేసు నందు ఈ లోకములో ఉన్న శ్రమలను,

    శత్రువులను, జయించువారు బైబిలునందుగల అనేక కిరీటములను పొందుదురు.

    • 1) అక్షయ కెరీటము (1 కొరింథి9:26)
    • 2) మహిమకిరీటము(1పేతు 5:4)
    • 3) నీతికిరీటము (2తిమోతి4:8) ఆనందాతిశయ కిరీటము (1థెస్స2:19)
    • 4) జీవకిరీటము (ప్రక2:10) స్ముర్ణ అంతస్థులోని వారికి కలిగే కిరీటము జీవకిరీటము.
    మిగతా సంఘములలో కలిగిన అనుభవములను బట్టి ఆయా కిరీటములు కలుగును. ఎఫెసు సంఘస్థితిలో జీవము ప్రవేసించినది. ఇట్లు ప్రవేసించిన జీవమును చంపివేయడానికి స్ముర్న సంఘములో శ్రమ వచ్చినది. కాని ఎన్ని శ్రమలు కలిగినను స్ముర్న సంఘములో క్రీస్తునందున్న వారిలో ఉన్న జీవమును చంపలేకపోయిరి. వారిలో ఉన్న జీవమే జయించినది. గనుక వారికిజీవ కిరీటము కలిగినది. స్ముర్న సంఘములోని జయమునకు కలిగిన బహుమానము జీవకిరీటము.

    బి) రెండవమరణము వలన హానిలేదు:- క్రీస్తు యేసునందు జీవము కలిగి జయించిన వారికి మొదటి మరణమనబడిన శరీర మరణము పరలోక ప్రవేశమునకు ద్వారమైనది. రెండవ మరణమైయున్న నరకము వీరి నేమియు చేయలేదు. ఎందుకనగా మొదటి మరణమును రెండవ మరణమును జయించిన జయశీలుడైన క్రీస్తు ప్రభువు జీవము వీరిలో ఉన్నది.

  • 9. ఉపమానము:- (మత్తయి13:24-30) గురుగులు గోధుమలు ఉపమానము. మంచి విత్తనము విత్తువాడు మనుష్య కుమారుడు.పొలము లోకము. మంచి విత్తనములు రాజ్య సంబంధులు అనగా రక్షణను అంగీకరించినవారు. గురుగులనగా దుష్టుని సంబంధులు మారుమనస్సు లేనివారు. మనుష్యులు అజాగ్రత్తగా నున్నప్పుడు శత్రువు తనపనిచేసెను వాటిని విత్తిన శత్రువు అపవాది గురుగులు ముందుగా పెరికివేయబడకుండా రెండును కోతల కాలమువరకు ఈ లోకములో ఎదుగును. రాజ్య సంబంధులై రక్షణ నొందువారు కొట్టులో (పరలోకమందు) చేర్చబడుదురు. గురుగులు (మార్పులేనివారు) అగ్నిగుండములో పడవేయబడుదురు. స్ముర్న సంఘమునకు ఈ ఉపమానమునకు పోలిక.
    ఎ) స్ముర్న సంఘము ఏడు సంఘములలో రెండవది. అట్లే ఏడు ఉప ఉపమానములలో గోధుమలు గురుగుల ఉపమానము రెండవది.
    బి) ఈ ఉపమానములో గోధుమలు అనగా పరలోక రాజ్యసంబంధులు. పరలోక రాజ్య సంబంధులను హింసపరచే గురుగులను పోలిన దుష్టుని సంబంధులు కలరు.
    సి) ప్రతి ఉపమానములోను, ప్రతి సంఘములోను చివర ఫలితములు కలవు. స్ముర్న సంఘ కాలములో ప్రభువు ప్రాణాపాయము వచ్చినను నమ్మకముగా నుండువారికి జీవకిరీటమిచ్చెదనని పలికెను. అనగా దీని ఫలితము ఇక్కడకాదు పరమందు అనగా చివరికాలమునందు. అట్లే ఈ ఉపమానములో గోధుమల పంటకును గురుగుల పంటలకును ఫలిత చివరికాలమే. రెండవ రాక కాలమందు గోధుమలైన రాజ్యసంబంధులు నూతన యెరూషలేము మహిమ ధనాగారములోనికి వెల్లుదురు. అట్లే అంత్యకాలమందు గురుగులైన దుష్టుని సంబంధులుఅగ్నిగుండములోనికి వెళ్ళుదురు.

  • 10) మతకాలస్థితి:- పరలోక సిం హాసనము వద్దనుండి 6వ స్థానము.

  • 11)) పరలోక స్థానము:- పరలోక సిం హాసనము వద్దనుండి 6వ స్థానము.

  • 12) స్థితి:- అనేక రకములైన శ్రమలుగల సంఘము ఎన్ని శ్రమలు ఉన్నను, శ్రమలకు ఎదురెక్కి సహనము కలిగి జయము పొందినది. ఈ సంఘముయొక్క స్థితి సహనము కలస్థితి. ఇది కలిగియుండుట కష్టము అయినను కలిగియున్నది. ఎందుకనగా ఈ సంఘమునకు కలిగిన ప్రత్యక్షత సజీవుడుగా కనబడిన క్రీస్తు. అట్లే ఎన్ని శ్రమలు మరణకరమైన శ్రమలున్నను సహనము కలిగియున్నందున సజీవ రూపమును కనబరచకలిగినది. స్ముర్న సంభుస్థితి: (ప్రక 2:8-11) స్ముర్న చరిత్ర మరణ చరిత్ర వంటిది ఇది భక్తుల స్మరణ చేసే చరిత్రలో నడచువారికి పరలోకమహిమ దొరుకును. స్ముర్న యొక్క స్మర్ణ దేవునికి. ఎందుకనగా భూలోకములో నా సంఘమున్నది. నేను ఆ సంఘములకు శ్రమలు రానిచ్చుచున్నాను. ఆ శ్రమలలో నా సంఘమునకు బలమిచ్చి, జయమిచ్చి తౠవాత శ్రమలు లేకుండాచేసి పరలోకమునకు తీసికొనివెళ్ళి కిరీటము ధరింపజేయుదును. అని స్ముర్నను గూర్చి దేవుని స్మరణ స్ముర్న చరిత్ర వలననే భక్తులకు పరలోకమునందు హరణము దొరుకును. శ్రమలేకపోతే మహిమలేదు. సువార్తికులకు ఇట్టి శ్రమలుయెక్కువ. "శ్రమల మార్గమే విమలమార్గము. శ్రమభక్తునికాశ్రమము" "మానవుడు శ్రమలు పొందక" అను యీ కీర్తన స్ముర్న సంఘ చరిత్రకు సంబంధించినది. స్ముర్న చరిత్రను వర్ణన చేయుటకు వీలులేదు. ఏసంఘమైనను వివరింపవచ్చునుగాని యీ సంఘమును వర్ణించుటకు యెవరికిని యిష్టముండదు. ఎందుకనిన జబ్బు ఉండవలెనని ఎవరైనా కోరుదురా? సాధుసుందరసింఘ్గారు బైబిలు చదివిన, ప్రార్ధించిన, ప్రకటించిన యెక్కువ ఉద్రేకమున్నదనియెరిగి శ్రమ పంపుమని ప్రార్ధించిరి మహిమ కిరీటము కావలెననికోరువారు స్ముర్న సంఘ చరిత్రలోనికి వెళ్ళకపోతే మహిమ కిరీటము రాదు.

    • 1) జీవకిరీటము
    • 2) మహిమ కిరీటము
    • 3) సువర్ణ కిరీటము.
    ఈ మూడు ఒకటే గాని స్ముర్న స్థితి లేకపోయిన యివి రావు. సృష్టిలోని ఎండ, మంచు, వర్షమువల్ల శ్రమలు వచ్చును. పురుగుల వల్ల దయ్యములవల్ల మనుష్యుల తెలివి తక్కువ వల్ల, అశ్రద్దవల్ల, పాపమువల్ల శ్రమవచ్చును. ఎన్ని ప్రార్ధించినా జబ్బు పోనందున కలిగేశ్రమ మరీ ఎక్కువయినది దేవుడు ప్రార్ధన విననందున మరి ఎక్కువైన శ్రమ. బిడ్డబ్రతుకునని దర్శనము వచ్చినది గాని బిడ్డ చనిపోయినది. ఇది మరి ఎక్కువయిన శ్రమ. ఇట్టివి ఎన్నో కలవు. ఒక సువార్తికుడు సువార్త ప్రకటించినందున అతనిని పట్టుకొని కొట్టిరి. అతడు దానిని సంతోషముతో అనుభవించిన మహిమజీవ సువర్ణ కిరీటములు దొరుకును. దెబ్బలు తిని చావవలసివాడేగాని బ్రతికెను. మరియొకరు దెబ్బలుతిని చనిపోయెను ఈ ఇద్దరు హతసాక్షి కిరీటములు వచ్చును. దెబ్బలు తిని బ్రతికినవానికంటె చనిపోయినవారికి యెక్కువ మహిమ. మాకు శ్రమ వచ్చినది. మహిమ ఇవ్వవలెనని శ్రమ రానిచ్చినావు. నీ చిత్తమును బట్టి తీసియేయుము. లేదా ఉంచుము అని ప్రార్ధించుటే స్ముర్న సంఘ వర్తమానము, ఎఫెసు సంఘములో జీవము, వెలుగు, ప్రేమ, ఉద్రేకము వాగ్ధానము, జీవవృక్ష ఫలములు, చెడుగును విసర్జించుట అనునవన్నియు ఉన్నవి. ఇవి ఎఫెసు సంఘ భాగ్యములు, ఇవి పొందిన తరువాత స్ముర్న స్థితి వచ్చును. ఎఫెసు సంఘ భాగ్యములు సంఘము సంపాదించిన స్ముర్న సంఘములో శ్రమలు వచ్చినను లెక్కలేదు ఓ స్ముర్న సంఘమా! ప్రాణాపాయము వచ్చినను నమ్మకముగా ఉండుమని ప్రభువు చెప్పుచున్నారు. పెనున్న ఎఫెసు సంఘ భాగ్యములన్నియు ఇచ్చినాము గనుక శ్రమ ఉండును. ఎఫెసు స్థితిదాటి స్ముర్నకు వచ్చి యీ బహుమానము కూడా పొందవలెననే గాని నిన్ను శ్రమ పెట్టవలెననికాదు. లోకములో ఉన్నావు. గనుక శ్రమరాకమానదు "మానవుడుశ్రమలు పొందక దైవ మానవుడెటుకాగల్డు". ఈయన చాల గొప్ప భక్తుడు అని అనేకమంది అనుకొనిన ఒక ఆయన దేవదాసు అయ్యగారి యొద్దకు రాగా అయ్యగారు ఆయనను చూచి నీకెన్ని శ్రమలు వచ్చినవి? అని ప్రశ్నించగా ఈ 50సం||లలో నాకేమి శ్రమరాలేదు అనగా నీవు సజ్జనుడవే గాని భక్తుడవుకావు అని అయ్యగారు అనిరి. మహమ్మదీయుడుగానున్న కైలాస మహాఋషి సెయింట్గ్జేవియర్గారు ఒక క్రొత్తనిబంధన యివ్వగా చదివి, మార్పుచెంది, క్రైస్తవుడై, సువార్తను ప్రకటించి, చివరికాలములో కైలాస పర్వతమునకువెళ్ళి ధ్యానములోనే తన జీవితమును ముగింపజూచెను ప్రభువు ప్రత్యక్షమై నేను రెండవరాకడలో వచ్చువరకు ఇక్కడ నీవు సజీవుడుగా నుందువని పలికెను. ఇప్పటికి సుమారు 394 సం||లు ఆయన వయస్సు. ఈ ఋషిగారి స్థితిని అనేకులకు తెలియజేసినవారు సాధుసుందర్సింగ్గారె. వీరిద్దరు కైలాస పర్వతమునందలి గుహలోఉన్నారు. వీరు ప్రభువు రెండవరాకడవచ్చు పర్యంతము ఉందురు. లోకములోనున్న యితరులతో సంబంధములేని రుషిగారికిని శ్రమ ఉన్నది. ఆ శ్రమ ఏదనగా రుషిగారు యిన్నివందల సం|| బ్రతికి ఉన్నారా? ఇది వట్టిదే. అని అనువారి మాటలన్నియు ఆయన అక్కడ ఉండే వినుచున్నారు. ఇది ఆయనకు బాధకాదా? ఈయనకు కలిగియున్న కృపావరము (కొలస్సై2:5)ఉన్న పౌలుగారి, కృపావరము వంటిది. కనుక భక్తులైన వారికి లోకములో ఎవరిస్థితి కొలదివారికి శ్రమలున్నవి.
    • 1) స్ముర్న చరిత్ర మరణ చరిత్రవంటిది. శ్రమ అనుభవించుచున్నవారు మరియొకరితో చావుగా ఉన్నదీందురు. ఇది చావుకాదుగాని చావుతో సమానము. ఇవి ఒకేరకమైన చావు.
    • 2) (ఎఫెసి 2:1) పాపములచేతను, అపరాధములచేతను చచ్చినవారు, అపరాధము పాపము దేవునికి విరోధమైనది మనిషికి విరోధమైనది కూడపాపమే. మనిషి యీ రెంటిలో మునిగి ఉండగా అతనికి శ్రమరాగా ఆశ్రమతనలోని పాపమును వెళ్ళగొట్టుటకు సాధనమైనది. ఎందుకనగా తన అపరాధము వలన కీడున్నదని తెలిసికొని ఈ చావునుండి తప్పించి జీవింపజేయునది క్రీస్తే అని విశ్వసించి క్రీస్తు ప్రభువును ఆశ్రయించి క్రీస్తునందు భక్తిగలవాడై శ్రమరాబట్టి క్రీస్తునందు నాకీభక్తి అబ్బినదని దేవునికి వందనములు చెల్లించుటే అతనికి హరణము దేవునికి మనిషి యిచ్చుహరణము వందనము చేయుట.
    • 3) సంఘ ప్రారంభమునందు, ముగింపునందు ప్రభువు ఉన్నాడు. మధ్య సంఘమున్నది గాన శ్రమ యేమి చేయలేదు.
    • 4) శ్రమ ప్రారంభమునందు, ముగింపునందు ప్రభువువున్నారు, గనుక శ్రమ యేమియు చేయలేదు. ప్రభువు లోకములో 3 1/2సం||లు శ్రమపడెను. ముఖ్యమైన శ్రమ సిలువపై అనుభవించెను. ఇక్కడితో ప్రభువునకు శ్రమలేదు. అట్లే మన శ్రమలకు ముగింపు ఉన్నది
    • 5) భూమిమీద క్రీస్తునందున్న విశ్వాసి బైబిలు చదువుట, ప్రార్ధించుట. కీర్తనలుపాడుట, సువార్త ప్రకటించుట, పరిశుద్ధముగా జీవించుట, శ్రమసహించుటవలన పరలోకములో కిరీటము తయారగును. బంగారమును కొలిమిలో కాల్చిన మష్టు పొయి మేలిమి బంగారమగునట్లు భక్తుని శ్రమవలన మలినముపోయి మేలిమియగును. భక్తునికి శ్రమ యెక్కువగుకొలది సహనము యెక్కువగును. సహనము యెక్కువగుకొలది మహిమకాంతి యెక్కువగును. భూమిమీద ఒక్కొక్క శ్రమవచ్చి విశ్వాసిని కొట్టుచుండును.
    • 6) ఈ భక్తుడు సహించుకొనుటకు శ్రమలను వాడుకొనవలెను. ఉదా:- ఒకరికి జ్వరము గనుక పనిచేయలేరు. తినలేరు గాని ప్రార్ధనలో గడుపుదురు. వారెరిగినవారి యొక్క శ్రమలను గూర్చి ప్రార్ధింతురు. యిది యే శ్రమలను వాడుకొనుట.
    • 7) శ్రమ వలన పాపి మార్మనస్సు పొందును. శ్రమవలన విశ్వాసి భక్తిని ఎక్కువచేసికొనును. ఈ రెండు రకముల శ్రమలలో మనిషి (విశ్వాసి) దేవునిని కొనియాడును. మనిషి యీ రెండు తరుణములను ప్రార్ధనలో వాడుకొనును. శ్రమలను ప్రార్ధనల ద్వారా యితరుల కొరకు వాడును. భక్తునికి శ్రమ ఆఖరు అగుసరికి సంపూర్ణ భక్తుడగును. 8) భక్తుడు శ్రమలో ఉండినా పని అయిపోయినది. మృతునితో సమానముగా నున్నాను. అని తలంచినప్పుడు ప్రభువు దగ్గర ఉండి సజీవుడుగా కనబడి అతనికి జీవము పోయుచుండును. శిశువుగానున్న ఎఫెసు సంఘమునకు ప్రభువు జీవము పోసినట్లు స్ముర్నలో శ్రమ వలన చావనైయున్న నరునికి బ్రతుకుటకు జీవము పోసెను.
      • 1) స్ముర్న సంఘము శ్రమపడుచున్న సంఘము.
      • 2) ఎప్పటికప్పుడే ప్రభువు వలన జీవము పొదుచున్న సంఘము.
      • 3) దరిద్రత కలిగిన సంఘముగా నున్నను ప్రభువు వలన నీవు ధనముగల ధన్యసంఘమై యున్నావని పేరుపొందిన సంఘము.

    మనకు శ్రమవచ్చినప్పుడు శ్రమపడుచున్నను జీవము పొందుచు ధన్యతకలవారమ ని తలంచవలెను. ప్రభువు శ్రమ పడి మహిమకు వెళ్ళినట్లు శ్రమలేనిదే మహిమరాదు. లోకములో నున్నమంచివారు, చెడ్దవారు శ్రమలు పొందుటనుబట్టి దేవుడు న్యాయస్థుడు కాడని అనుచున్నాడు. కాని దేవుడు న్యాయవంతుడని శ్రమలోనున్న దైవ భక్తులే పలుకగలరు.ఉదా:-యోబు మహాశ్రమ నొందినను, తుదకు వ్యాధిగ్రస్తుడైనను, భార్య దేవుని దూషించి చనిపొమ్మని పలికిననూ, దేవునివలన మేలు అనుభవించినాము కీడు అనుభవింప తగదా! అని దేవుని న్యాయమును కొనియాడెను.

    • 1) దేవుడు చేసినవి నచ్చిననూ, నచ్చకపోయినను యిష్టమున్నను లేకున్నను, మేలున్ననూ, కీడున్ననూ, అర్ధమైనను అర్ధముకాక పోయిననూ అన్యాయమనిపించిననూ, దేవుడు చేయునది న్యాయమే అని పలుక గలవారే భక్తులు.
    • 2) దేవుడు చేయకపోయిననూ యితరులుచేయు అన్యాయమును చూచి దేవుడు ఊరుకొనుచున్ననూ దేవుడు న్యాయవంతుడే కృపకలవాడని అని అనువారే దైవభక్తులు.
    • 3) లోకస్తులుగాక దైవభక్తులు ప్రార్ధించిననూ, వినిదేవుడు ఊరుకొన్ననూ దేవుడు న్యాయవంతుడే అని అనువారే భక్తులు.
    • 4) దేవుడు న్యాయవంతుడని వ్రాయగల భక్తును లేపుమని ప్రార్ధించించుట అవస్రము. ఇదే న్యాయము. ప్రార్ధించక, తెలిసికొనక, దేవుడు అన్యాయస్తుడనుట మంచిదికాదు. ఈ విధ్యయెక్కడ నేర్చుకొనలేము. ఇదిచాల కష్టము. దైవసన్నిధిలో నేర్చుకొనగలము. అప్పుడు మనతప్పు తెలిసికొనగలము అజ్ఞానులమని గ్రహింపగలము. దైవ సహవాసము కుదిరిన ఇది అంతయు అర్ధమగును స్ముర్న అను పట్టణమునకు అర్ధము చేదు.
    ఎన్నిశ్రమలున్నన్నా, ఎంతచేదుగానున్నా, దైవభక్తులు మధురమనుకొనవలెను. శ్రమఫలితము మధురము దేవుడు న్యాయకర్త అని వ్రాసిన పుస్తకము ఒకటి ఉన్నది. ఎడారిలోని నీటి బుగ్గలు. చేదు మందు త్రాగిన జబ్బుపోవును. మనకు లాభమే ఒకరు యీ పుస్తకము చదివి శ్రమలలో ఆదరణ పొందిరి.
    • 1. ఎఫెసు సంఘ బహుమానము జీవవృక్షము స్ముర్న సంఘములో ఒక మ్రాను ఉన్నది. అది సిలువ మ్రాను ఎఫెసు సంఘస్థితి తల్లిపాలనవంటిది. గాన శ్రమ లేదు. స్ముర్నసంఘము ఒక శతాబ్ధము దాటిన తరువాత వచ్చినది. గనుక బలమున్నది సహించగలదు గనుక శ్రమ ఉన్నది. పరలోకములో మహిమ కావలెనంటే శ్రమ వచ్చును. మహిమ కావలెనని ప్రార్ధన మానివేసిన సుఖముగా నుండవచ్చును. గాని మహిమ ఉండదు అంగా స్ముర్నస్థితి ఉండౌ. శ్రమస్థితి ఉంటే మహిమ తేజస్సు, ప్రభువుయొక్క ప్రత్యక్షత ఉండును.
    • 2. మహిమ కోరినందున శ్రమ వచ్చినది. శ్రమ వచ్చినదని విసుగుకొనరాదు. గాని శ్రమతొలగునట్లు ప్రార్ధింపవలెను. ఈ ప్రార్ధనతోపాటు సహవాసము కొరకును, జయించు స్థితి కొరకును పాపమును బట్టి శ్రమ, మహిమ కోరుకొందున శ్రమ, వచ్చినది. ఇది నామేలు నిమిత్తము పంపినావు వందనములు నీ చిత్తమునుబట్టి నాకు సహాయము చేయుము నేను మాత్రము విసుగుకొనను అనవలెను.
    • 3. ప్రభువు శ్రమలు రానిచ్చును.వాటిని తీసివేయును. నిత్యము ఉన్న ఆత్మ నశించిపోవును. గనుక ఆయన వాటిని ఆపివేయును. సహించుకొనుటకు ఒక సాధనమున్నది.
      • 1) దేవుని న్యాయము
      • 2) దేవునియొక్క కృప.
    మనిషి శ్రమలు అనుభవించునప్పుడు దేవుని న్యాయమునొద్ద ఉండును. ప్రభువు న్యాస్థుడన్న యెడల క్రమ క్రముగా కృప యొద్దకుచేరి శ్రమను నివారణ చేసికొనును కృప లక్షణమునొద్ద గ్రహింపగలము. శ్రమను తగ్గించుమని కృప వాదించును. న్యాయము వ్యతిరిక్తముగానున్నను, కృపయెక్కువ కాలముండును. దరిద్రత కలిగియున్నను ధన సంపత్తి కలిగియున్నను యీ శ్రమలవల్ల ఆత్మీయ జీవమునకు వృద్ధి కలుగును. భూలోకములో ఆత్మజీవమునకు వృద్ధి, పరలోకములో మహిమవృద్ధి, పేద్రికమూన్నను, ప్రార్ధనచేసి, నాకేమికొదువ అన్నయెడల జీవనములో పేదరికము తీసివేయబడును. శ్రమలు కూడా తొలగిపోవును. పైలోకములో మహిమ, ఆత్మజీవనాభివృద్ధి కలుగును ఈ పాఠము యొక్క ఉపకారము సహవాసములో కష్టమున్నను సంతోషము కలుగును. అన్ని ఉపకారములు కలుగును. ఎఫెసు సంఘములో వెలుగు, ప్రేమ, ఉన్నవి. ఈ సఘములో శ్రమలు ఉన్నవిగాని చివరికి ఒక రాజుగారు క్రైస్తవ మతములోనికి వచ్చెను. ఆ రాజుగారిపేరు "కాన్ స్టంటైన్ " ఈయన యుద్ధమునకు వెళ్ళినప్పుడు ఆయన దర్శనములో ఆకాశములో సిలువకనబడినది. దానివలననే జయమని వ్రాత కూడ కనబడినది.అప్పటినుండి ఆయన సిలువను వెంబడించెను.ఈయన క్రైస్తవ మతములోనికి రాగా సంఘమునకున్న శ్రమలన్నింటిని తొలగించి సౌఖ్యమునిచ్చెను. అప్పటినుండి పెర్గెము సంఘకాలము ప్రారంభమైనది.


Home


3. పెర్గెము

  • 1:- చరిత్ర:- చిన్నాసియాలోని మూసియాలోని ముఖ్య పట్టణము. యోహాను ఈ ప్రకటన గ్రంధము రచించినప్పటికి 100 సం|| వరకిదియొక ముఖ్యపట్టణమై ఉండును. పేరు గాంచిన లైబ్రరీ దీని యందు ఉన్నది. పెర్గెము పెద్ద మత కేంద్రము దీనియందు గొప్ప గుడులు కలవు.ఒకటి అదేని దేవత దేవళము, కెదురుగా కట్టిన జ్యూస్ బలిపీఠము, రెండవది ఎస్ క్లిపియాన్ ఆరాధకైన గుడి. దీని ఆరాధికులు ఎస్క్లిపియానును రక్షకుడని పిలిచిరి. రక్షకుడను నామము క్రీస్తునకు కాక మరెవరికి తగినదికాదు అందువల్ల క్రైస్తవులు అసహ్యించుకొనిరి.అంతియే కదు. దీనియందు రోమాచక్రవర్తి ఆరాధనసహా జరుగుచుండెడిది ఆరాధికులు "సీజరు" ప్రభువనిరి.

  • 2. ప్రత్యక్ష త:- వాడిగల రెండంచుల ఖడ్గము కలవాడు ఇది ప్రభువు నోటినుండి వచ్చు వాక్యము. (ఎఫెసి 6:17; ప్రక 1:16;2:12;హెబ్రీ 4:12;ప్రక 19:21)ఎఫెసు సంఘమునకు ప్రభువు సంచారకుడుగా కనబడెను. ఇక్కడ ఈ పెర్గెము సంఘములో ఉండకూడని దుర్భోధలు దురాచారములను ఖండించి సవరణచేయుటకు వాడిగల రెండంచుల ఖడ్గము గలవాడుగా ప్రత్యక్షమాయెను.

    ఖడ్గము:- వంటమనిషి చేతిలో, డాక్టరుగారి చేతిలో కత్తి ఉండును. ఒంటరిగా అరణ్యములోని ప్రయాణికునికి శత్రువులమధ్య పోవునపుడు కత్తి ఉండును. మొదటికత్తి భయముల్నిదే. డాక్టరుగారి చేతిలోని కత్తి భయమును పుట్టించేదేకాని క్షేమమునిచ్చేది. సముద్రముపై ఓడమీద ఒక దొరగారు దొరసాని ప్రయాణము చేయుచుండగా తుఫాను వచ్చెను. దొరసాని తుఫానుకు భయపడుచుండగా దొరగారు కత్తితీసి ఆమె గుండెలపిఎ పెట్టెను. అప్పుడామె నవ్వెను ఎందుకునవ్వుచున్నావు అని దొరగారు అడుగగా నీవు నన్ను ఈ కత్తితో చంపవు అనెను. అందుకు దొరగారు తుఫాను ప్రభువు చేతిలో ఉన్నది ఆయన మనలను ప్రేమించుచున్నారు కనుక హానిచేయరనెను. పెర్గెము సంఘమునకు ప్రభువు రెండంచుల వాడియైన ఖడ్గముతో ప్రత్యక్షమాయెను. ఈ ఖడ్గము పైమూడుఖడ్గములవంటిదికాదు. విశ్వాసులకు సత్యము నేర్పుటకు మంచి సంగతులు తెలియపరచుటకు ఒక అంచు, రెండవాంచు మనిషిలో చెడుగును శస్త్రముచేసి చెడుగు తీసివేసి బాగుచేయునది. కనుకనే ఇది రెండంచుల వాడిగల ఖడ్గము వాక్యమను ఈ ఖడ్గము మనిషిలోని చెడుగును ఖండించునపుడు మనిషికి బాధ కలుగును. ఆ బాధకరమైన స్థితిలో మనిషిని విడిచిపెట్టక ఆదరణగల వాక్కును వినిపించి ఆనందపరచును. ఇట్టి స్థితి నిచ్చునదే రెండంచులుగల వాడియైన ఖడ్గము.క్రైస్తవులను శ్రమపరచుటకై అన్యులచేతిలో కత్తి ఉన్నది. ఇది హానికరమైనది. ప్రభువు చేతిలో కత్తి ఉన్నది, ఇది సంఘముయొక్క కాపుదల నిమిత్తము పరిశుద్ధాత్మ చేతిలోని దేవుని వాక్యఖడ్గము. ఈ వాక్యఖద్గమువల్ల విశ్వసించిన విశ్వాసికి చెడుగుపోయి మంచిచేరుచున్నది. ఈ ఖడ్గమువల్ల కీడు కాపుదల కలుగుచున్నది. కాపరియైన ప్రభువు చేతిలో కర్ర సాతాను పారద్రోలి మనలను ఆయనదరికిలాగును."నాకేమికొదువ" అనుకీర్తనలో మీదబడును నట్టి శోధనలన్ నాదరికి రానీకదండము - నన్నులాగుచును-నా-కాదరణయౌను గనుక ||నాకేమి||

    అమెరికాలో ఆత్మఖడ్గము అను పత్రిక అచ్చువేయు చున్నారు. అందులో రోగులు నమ్మి బాగుపడుటకు బైబిలు గ్రంధములోని మారుమూలలోనున్న వాక్యములను వ్రాయుచున్నారు. అనేకులు ఇది చదివి బాగుపడుచున్నారు. వారి సాక్ష్యములు కూడా అందు వ్రాయబడుచున్నవి. కాన్ స్టంటైన్ కాలములోనే ముఖ్యమైనపని 318 మంది బిషప్పులను చేర్చి సిద్ధాంతములను బాగుగా నేర్పెను. అదితే వాక్య ఖడ్గము. ఈయన కాలములో అనేకమంది భక్తులున్నారు. నామక క్రైస్తవులూన్నారు. నామక క్రైస్తవులు విశ్వాసమును పోగొట్టుకొన్నందువల్ల విశ్వాసకాపుదల కొరకు ఈయన కాలమదే విశ్వాసప్రమాణమును వ్రాసిరి.

  • 3. మెప్పు:- ప్రక2:13) సాతాను సిం హాసనమున్న స్థలములో నీవు కాపురమున్నావని నేనేరుగుదును. మరియు సాతాను కాపురమున్న ఆ స్థలములో, నాయందలి విశ్వాసియైయుండి నన్ను గూర్చి సాక్షియైన అంతిపయను వాడు మీమధ్యను చంపబడిన దినములలో నీవు నానామమును గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసమును విసర్జింపలేదని నేనెరుగుదును. పెర్గెములో 318 మంది బిషప్పుల ద్వారా వ్రాయబడిన సిద్ధాంతములు విశ్వాస ప్రమాణము అను దేవుని వాక్యఖడ్గమున్నను అక్కడే సాతాను సమాజము సాతాను సిం హాసనమున్నది. అక్కడే అంతిపయ అను భక్తుడు హతసాక్షి ఆయెను. ఇత్తడి దూడనుచేసి దానికడుపులో ఆయననుపెట్టి ఆయన మరణమగు వరకు మంటపెట్టి కాల్చివేసిరి. ఆయన అంతటి శ్రమలో ప్రాణము పోవువరకు అగ్నిలో ప్రభువును ప్రార్ధించి స్తుతించెను. ఈలాటి ఘోరహత్య జరిగినను పెర్గెము సంఘములోనివారు ప్రభువు నామమును గట్టిగా చేపట్టి ఆయన యందలి విశ్వాసమును విసర్జింపలేదు.

  • 4. తప్పు:- ఎ) విగ్రహములకు బలియిచ్చిన వాటిని తినుట: పెర్గెము సంఘములోని నామక క్రైస్తవు విగ్రహములకు బలియిచ్చిన వాటిని తినియున్నారు. యిప్పుడును నామక క్రైస్తవులు తినుచున్నారు. బలి అర్పించిన వాటిని తినువారు బలిపీఠములో పాలివారుకారా? అన్యజనులర్పించు బలులు దేవునికికాదు. దయ్యములకే అర్పించుచున్నారు. మీరు దయ్యములతో పాలివారగుట నాకిష్టములేదు మీరు ప్రభువు పాత్రలోనికి దయ్యముల పాత్రలోనిది కూడా త్రాగనేరరు. ప్రభువు బల్లమీద ఉన్నదానిలోను, దయ్యముల బల్లమీద ఉన్నదానిలోను కూడా పాలు పొందనేరరు (1 కొరింథి 10: 18-21) కనుక విగ్రహార్పితమైన వాటిని మనము తినకూడదు.

    బి) జారత్వము చేయుట:- బైబిలు వ్రాయబడినట్లు దేవుని పూజించుట విసర్జించి దేవతలను, విగ్రహములను, పూజించుటయే జారత్వము, ఇది పెర్గెము సంఘములో ఉన్నది. వారి అవసరతలను ప్రభువు యొద్ద విచారించి తెలిసికొనక దేవతలయొద్ద తెలిసికొనుట. జ్యోతిష్యము శకునము, సోదె చెప్పించు కొనుట. ఇట్టివి ఈ కాలములో యున్నవి. క్రైస్తవ పాదిరిగారు పెండ్లిచేసినా ఆ పెండ్లి ఘడియలు మంచివా అని అన్యులయొద్దకు వెళ్ళి విచారించిచుటకు విచారించుటకు కూడా జారత్వమే.

    సి) బిలాముబోధ:- (సంఖ్యాకాండము 22-24 అ||) బిలాము అన్యప్రవక్త. యూదుడు కాదు. బాలాకురాజు ఇశ్రాయేలీయులను శపించుటకు బిలామును పిలిపించగా ధనము. నమునకు ఆశించి వచ్చెను. గార్ధభము అతనితో మాట్లాడెను కొంతకాలమునకు చంపబడెను ఆత్మీయఫలమును పోగొట్టుకొని మనుష్యులవల్ల, అధికారులవల్ల, ఉధ్యోగమువల్ల కలుగు ధనమును ఆశించి దేవుని చిత్తమునకు విరోధముగా వెళ్ళుట బిలాము బోధ. ఇది ఇప్పుడును సంఘములలో కనబడుచున్నది. దేవుడిచ్చినవి పుచ్చుకొనుట మంచిదికాని ఆశించి పుచ్చుకొనుట బిలాము బోధకు సంబంధించినది.

    డి) నికొలయితులబోధ :- పెర్గెములో సంఘము రాజునుబట్టి వృద్ధి అయినది. రాజుగారి మాటేనెగ్గెను. అట్లే సంఘములో పాదిరిగారిమాటే నెగ్గెను. ఈ రెండూ తప్పే ఇదే నికొలయితులబోధ. ఎఫెసువారు ఈ బోధను ద్వేషించిరి. పెర్గెమువారు, నికొలయితుల క్రియలను అనుసరించిరి మన సంఘములలో ఈ రెండు ఉంటే ప్రభువును తిరస్కరించినట్లే. నామకార్ధభక్తి, మాయ, తంత్రములు, మంత్రములు మనిషిమీద, రాజుగారిమీద ఆధారపడుట అన్యజనులతో కల్సి, ఉండుట. వారు అనుసరించినదే వీరు అనుసరించుట. వీరు తుదకు అన్యజనులతో ఏకమైపోవుట జరుగును.

  • 5. మందలింపు:- కావున మారుమనస్సు పొందుము. పెర్గెము సంఘములో ఉండకూడని దురాచారముల స్థితినుండి మళ్ళుకొని పెర్గెము సంఘములో అనుసరించవలసిన వాటిని అనుసరించుటయె మారుమనస్సుపొందుట. దుర్భోధకులతో ఏకీభవించకపోతే వారిని వెళ్ళగొట్టవలెను సంఘమునకు వెళ్ళగొట్టే శక్తి లేకపోతే ప్రభువువచ్చి, వారితో యుద్ధముచేసివెళ్ళగొట్టెను.

  • 6. శిక్ష:- లేనియెడల నేను నీయొద్దకువచ్చి నా నోటనుండి వచ్చు ఖడ్గముతో యుద్దము చేసెదను. ఈ వాక్యఖడ్గము కీడును చ్హూపించి దానిని పరిహారముచేసి మేలును సమకూర్చును. కాని ఇక్కడ ఆ ఖడ్గముతోనే యుద్దముచేయును అని ఉన్నది. ఇది భయంకరమైనది. ఖడ్గమెయున్న దేవుని వాక్యమునకు లోబడని వారెవరైనను దేవుని వాక్య ఖడ్గముచేతనే శిక్షనొందుదురు. హర్మగెద్దోను యుద్ధకాలమునందు ప్రభువుతో యుద్ధము చేయుటకు వచ్చిన భూరాజులను వారి సేవలను ప్రభువు నోటనుండి వచ్చు ఖడ్గముచేత వధించబడిరి. (ప్రక 19:19-21)

  • 7. కోరిక:- సంఘములతో ఆత్మ చెప్పుమాట చెవికలవాడు వినునుగాక.

  • 8. బహుమతి:- ఎ) మరుగైయున్న మన్నాను భుజింపనిత్తును బి) తెల్లరాతిని ఇత్తును. సి) ఆ రాతిపై చెక్కబడిన క్రొత్తపేరు అది పొందిన వారికే తెలియును.

    ఎ) మన్నా:- జయించినందున మన్నా యుచ్చెను. మన్నా వలన యుద్ధము చేయుటకు బలము వచ్చును. యిశ్రాయేలీయుల అరణ్యములో భుజించిన మన్నా ఆహారము వారికి గాని లోకములో ఎన్ని జనాంగములు ఉన్నా వారికి దీని సంగతి తెలియదు. కనుక ఈ మన్నా మరుగైనదే ఇది వీరికే ఇచ్చెను. అట్లే పెర్గెము సంఘ అంతస్థు కలవారికి ఇతరులకులేని మన్నావంటి మరుగైన ఆహారము ప్రభువు యిచ్చును. ఇది వీరికే చెందును. వీరు ఈ స్థితిని సంపాదించుకొన్నారు. ఆత్మీయస్థితిలో శిశుస్థితి కలిగిన ఎఫెసు వారికి జీవవృక్ష ఫలములు యిచ్చిరి. ఈ జీవన వృద్ధికొరకు జీవనవృక్ష ఫలములు యిచ్చిరి అని ఎఫెసు సంఘములో చూచియున్నాము. ఇక్కడ జీవిత స్థ్తిలో వృద్ధి పొందినవారు కనుక మన్నా ఆహారమును యిచ్చిరి.

    బి) తెల్లరాయి:- పాతనిబంధన కాలమునందు యాజకులు రొమ్ము మీద ఏఫోదుకుపైగా పతకము ఉన్నది. (నిర్గమ 39:21) వీరికి తెల్లరాయి పరలోకములో ఇవ్వబడును దానికి సూచనైనస్థితి ఇక్కడ ఇవ్వబడును వాక్యగ్రంధములోని భావము ప్రభువును అడిగి తెలిసికొనగలషితియే ఇక్కడ సూచనగా ఇయ్యబడినరాయి ఈ రాయి ఎందుకనగా అన్ని మిషనులవారు బైబిలులో ఇంత ఉన్నదో అంతే చాలు అనుచున్నారు. ప్రభువును అడిగి తెలిసికొనగల సాధనమే ఈ రాయి కాగితము మీద వ్రాయబడిన పేరు పోవును కనుక శాశ్వతముగా ఉండుటకు గుర్తుగా రాతిమీద చెక్కెను.

    సి) క్రొత్తపేరు:- అయా బోధకులు వాక్యార్ధమును రకరకములుగా వారికి అర్ధమగునట్లు తెలియజేయుదురు. ఈ రాయిగలవారు ప్రభువునడిగి తెలిసికొందురు. వీరు ఎంతటి గడుచువారో అట్టి గడుచు తనమునే క్రొత్త పేరు అందురు. యితరులకు లేనిది, ప్రభువును అడిగి తెలుసుకొనుస్థితిగల క్రొత్త పేరు సంపాదించుకొనవలెను. అట్టివారిస్థితి వారికే తెలియును.

  • 9. ఉపమానము:- (మత్తయి 13:31,32) ఆయన మరియొక ఉపమానము వారితో చెప్పెను. పరలోకరాజ్యము, ఒకడు తన పొలములో విత్తిన ఆవగింజను పోలియున్నది. అది విత్తనములన్నిట్లో చెన్నదే కాని పెరిగినప్పుడు కూరమొక్కలన్నిటిలో పెద్దదై ఆకాశ పక్షులువచ్చి దాని కొమ్మల యందు నివసించునంతచెట్టగును. చిన్నగింజ పరలోకమునకు పోల్చబడినది. అది భూలోకములోని క్రైస్తవమతము దెనిలోనే పరలోకమున్నది ప్రభువును అంగీకరించిన సంఘము. మొదట పన్నిద్దరు తరువాత డెబ్బదిమంది తరువాత నూటయిరువదిమంది. తరువాత మూడువేలు. ఇప్పుడు కోటానుకోట్లు, లోకాంతమునకు ఇంకా విస్తరించి పోవును. ఎక్కడతే క్రీస్తుమతములేదో అక్కడకూడ వ్యాపించెను. నరమాంస భక్షమువరకు సంఘము వెళ్ళినది. అక్కడకూడ వ్యాపించెను. నరమ్మంస భక్షమువరకు సంఘము వెళ్ళినది. అసాధ్యస్థలమునకు వెళ్ళినది విస్తారమైన కొమ్మలు వేసెను. ఇది వృద్ధికిగుర్తు.

    పెర్గెము సంఘమునకు ఆవగింజ ఉపమానమునకు గల పోలిక:-

    • 1) ఏడు సంఘములలో పెర్గెముసంఘము 3 వది. ఉపమానములలో ఆవగింజ ఉపమానము కూడా మూడవది.
    • 2) ఆవగింజ చిన్నది అట్లే పెర్గెము సంఘకాలము వరకు క్రైస్తవ సంఘము చిన్నది.
    • 3) ఆవగింజ పెద్ద చెట్టుగా పెరిగినది. అట్లే పెర్గెము సంఘకాలములో కాన్ స్టంటైన్ రాజునుబట్టి క్రైస్తవ సంఘము పెద్దదయినది.
    • 4) చెట్టునకు పక్షులకు సంబధము లేకపొయినా సంఘము పెద్దదయినది. 1) చెట్టునకు పక్షులకు సంబంధము లేకపోయినా పక్షులు చెట్టుపై నివసించును ట్లే క్రైస్తవ మతములోనికి రానటువంటి అన్న్యులు క్రైస్తవుల సంఘముచే స్థాపించబడినదిన అనేక సంస్థలలో పనిచేయుచుండిరి దీనివల్ల క్రైస్తవులకు క్రైస్తవేతరులకు కూడ సౌఖ్యము కలిగినది.
    • 5) లోకము, సంఘము రెండును షేక్ హెండు తీసికొంటున్నవి. అనగా లోకములోని దురాచారములు, అన్యాచారములు, మతాచారములు క్రైస్తవసంఘములోనికి ప్రవేశించినవి.రాజుగారినిబట్టి క్రైస్తవమతము వేగముగా పెరిగినందున ఈ అనాచారములు కూడా వృద్ధి అయినవి. ఆ కాలములో భక్తులున్నారు. కాని కేవలము ఉద్యోగముల నిమిత్తము క్రైస్తవ మతమును అంగీకరించిన వారును ఉన్నారు.

  • 10. మతకాలము:- క్రీశ. 312-606 సం|| వరకు.

  • 11. పరలోకస్థానము:- పరలోక సిం హాసనము వద్దనుండి 5వ స్థానము.

  • 12. స్థితి:- సిద్ధాంతనిశ్చయత, బైబిలును బాగుగా తరచి నుగ్గు అనగా సారమును తీసి ఈ సిద్ధాంతములను ఏర్పరచిరి. ఈ సిద్ధాంతము ప్రకారము నడచుటకు తీర్మానించిరి. సిద్ధాంతములలో ఏదైనా లోపముంటే బైబిలువైపు చూచి వాక్యమునకు సరికాకపోతే తీసివేతుమని తీర్మానించిరి. బైబిలులో లేకపోతే ఈ సిద్ధాంతము మాకు అవసరములేదు. ఇదే ఈ సంఘముయొక్క తీర్మానము.

    ఎఫెసు సంఘములో క్రైస్తవ సంఘము యొక్క లేతస్థితి యున్నది శ్రమ అధికమైనా స్ముర్న సంఘములో విశ్వాసము ముదిరినది. పెర్గెములో శ్రమ అంతరించి సౌఖ్యము పెరిగినది. దానిలో భక్తి అంతరించింది. రాజుగారు క్రైస్తవుడు కనుక ప్రజలలో క్రైస్తవులకు శ్రమవస్తేరాజుగారే సహాయము చేస్తారు గవర్నమెంటులో ఉద్యోగములు వారికే ఇబ్బందులు జబ్బులు ఉన్నా రాజుగారే సహాయము చేయుదురు. శ్రమలు లేవు కనుక రాజభోగము భక్తిలేదుకాని పైఆచారములు మాత్రము ఉన్నవి. రాజుగారు చనిపోతే రాజు భక్తి మతముపోతుంది. ఇండియాలో 1947 వరకు ఇంగ్లీషు వారు రాజ్యపాలన చేసిరి. వీరు క్రైస్తవులు కనుక 1947 వరకు రాజమతములో రాజభోగము అనుభవించిరి. వారు భాగ్యవంతులు కనుక క్రైస్తవమతమున్నది. వారు పోగానే క్రైస్తవమతము పోవునని అనేకులు ఉపదేశించిరి. కాని వారు పోయినా క్రైస్తవ మతముపోలేదు. ఎందుకనగాఎందుకంటే ఇది దేవునిమతము. విధ్యలేని గడుచువాడైన భోధకుడు ఒక మెజిశ్త్రేటు గారి దగ్గరకు వెళ్ళి నిలువబడెను అప్పుడు ఆయన ఏమోయ్ యింత దగ్గరగా నిలువబడుచున్నావనగానే గేటు దాటి వెళ్ళిపోవుచు మా దొరగారు క్రైస్తవుడు మా దొరగారికి చెపుతాననెను, అదే పెర్గెములో జరిగిన సంగతి కోర్టులోను క్రైస్తవుడని చె ప్పుకొనుటసరా, తమ కాలములో క్రైస్తవులు సుఖపడవలెనని కాన్ స్టంటైన్ రాజుగారి ఉద్దేశము ఆయన పేరుమీద ఒక పట్టణము కట్టబడినది. ఇటలీ, గ్రీసు, చిన్నాసియాలలో క్రైస్తవ మతమున్నది. 318 మంది బిషప్పులు కలసి నికేయా పట్టణములో ముఖ్యసిద్ధాంతములు వ్రాసిరి.

    1) అపోస్తలుల విశ్వాస ప్రమాణము,

    2) నికేయా విశ్వాస ప్రమాణము.

    3) అతనాసియాలో విశ్వాసప్రమాణము,

    ఇవి మూడు పూర్తిగా వ్రాయుటకు 300 సం||లు పట్టినది. అతనాసియా అనుభక్తుడు పై రెంటినిమించి వ్రాసినాడు. దీనిలో సృష్టిక్రమమున్నది. దేవుండు ముగ్గురులేరు ప్రభువులు ముగ్గురులేరు. తండ్రులు ముగ్గురులేరు. ఒక్కరే అని వ్రాసెను. ఈయన స్ముర్నకాలము లోనివాడు బ్రతుకాలమంతా శ్రమలే.ప్రతిదానిలోని ముఖ్యమైనమాట నమ్ముచున్నానూనునది ఇది లేకపొతే బాప్తిస్మములేదు. (1894-95) వరకు రాజమండ్రిలో మిషనెరీ కాన్ ఫరెన్సులో అయ్యగారు మిషనెరీలు అందరూ ఉండగా ఈ మూడు ప్రమాణములు పుట్టకమునుపుగల కారణములను చెప్పిరి. మిషనెరీలు అందరూ ఇవన్నీ ఎక్కడివని ఆశ్చర్యపడిరి. 1938వ సం||లో అయ్యగారు ఇంకొక విశ్వాస ప్రమాణము వ్రాసిరి. ఇదే బైబిలు మిషనువారు అయ్యగారు ఇంకొక విశ్వాస ప్రమాణము వ్రాసిరి. ఇదే బైబిలు మిషనువారు వాడుకొను విశ్వాస ప్రమాణము. అపొత్సలుల విశ్వాస ప్రమాణము తరువాత 1200 సం|| లూథరుగారు చిన్న ప్రశ్నోత్తరి వ్రాసిరి. ఈయన తరువాత స్టంపు దొరగారువచ్చి లూథరుగారి విశ్వాస ప్రమాణమునకు అర్ధము వ్రాసిరి. ఈయన తరువాత లియోదొరగారు లియోకేటకీజం వ్రాసిరి. పరిశుద్దుల సహవాసమనగా క్రైస్తవులు సమాజముగా కూడుకొనుటయే అనుచున్నారు. అపొస్తులుల వ్రాసినది ఇది కాదు. మనము ప్రార్ధించుచుండగా పరలోక పరిశుద్దులు పరలోక పరిశుద్ధులు వచ్చెదరు. అసలు భక్తులు, పరిశుద్ధులు పరమందే ఉన్నారు. అదేపూర్ణమైన విశ్వాసము. పరిశుద్ద క్రైస్తవ సంఘమను పరిశుద్ధుల సహవాసమునునమ్ముచున్నాము. ఎఫెసులో పరిశుద్ధులు అనగానివ్రాసిరి. అనగావిశ్వాసులని అర్ధము. పరిశుద్ధులు అనగా అనివ్రాసిరి. అనగావిశ్వాసులని అర్ధము. పరిశుద్ధులనగా పరలోక పరిశుద్దులని ఇంకొక అర్ధము. రోమన్ వారి నిష్టమాట:- ఎవ్వరు కాథలిక్కులు కారోవారు ఎంతటి పరమభక్తులైనా వారి తోమాకు సొంగత్యము లేదనియు అట్టి భక్తుల చేతమిషనుపనులు చేయనియ్యము. ఇదేవారినిష్ట.

    1) పెర్గెము కథవేరు

    2) పెర్గెములో ఉన్న కథవేరు.

    3) పెర్గెము సంఘములోని ఆత్మీయస్థితి వంటి మత స్థితి వేరు.

    ప్రతి సంఘములో అనగా 7 సంఘములలో పైస్థితులు ఉండును. స్థలమును బట్టికాదు. సంఘమునుబట్టికాదు మతకాలములో యున్న సంఘస్థితిని బట్టి యుండును.

    1) పట్టణస్థితిలోకము

    2) సంఘస్థితి ఆత్మజీవనము,

    3) సంఘమతస్థితి ఆత్మజీవనము సంఘముయొక్క స్థితిలోకముతో కలిసి మరల సర్ధుకొనుచుండును.

    ఇట్లు చివరి వరకు ఉండును. జీవిత కాలమంతయు పాపములో యుండి చనిపోయినప్పుడు మార్పుచెందిన, మహిమ సహవాస అంతస్థు పోవునుగాని రక్షణమాత్రము బొటాబొటిగా దొరకును. ఆది సంఘములో అపొస్తలులు ఆదివారము ఆరాధన చేసిరి. (కొరింథి 16:2) అది ఎఫెసు సంఘకాలము తరువాత స్ముర్న సంఘకాలము వచ్చినది. శ్రమలవల్ల ఆరాధన క్రమక్రమముగా జరుగుటకు వీలులేకపోయినది. పెర్గెము సంఘకాలములో కాన్ స్టాం టైన్ మొదట ఆచరించిన ఆదివారమునే స్థిరపరచెను సెవెంత్ డేవారు దానియేలు గ్రంఘములో ఒకరాజువచ్చి మార్చునని ఉన్నది (దాని 9:27) కనుక కాన్ స్టాంటైన్ ఆ రాజు అని చెప్పుచున్నారు. కాని దానియేలు గ్రంఘములోని రాజు ఏడేండ్ల శ్రమకాలములో వచ్చు అంతి క్రీస్తు. అంతేకాని కాన్ స్టాం టైన్ రాజు కాదు. ఈయన మార్చలేదు కాని ముందు జరిగిన దానినే స్థిరపరచెను.

    పెర్గెము చరిత్రకు ముందు స్ముర్నలోను ఎఫెసులోను సంఘము ఉన్నది. ఆ కాలాంతమైన తరువాత రోమన్ వారి సంఘము వచ్చినది. ఇదైన తరువాత కాన్ స్టాంటైన్ వరకు సంఘము సరిగా వచ్చినది. అదైన తరువాత లూథరు, బాప్టిష్టు సంఘములు వచ్చినవి. నిర్గమలో ఇశ్రాఏలీయులారా మీరు సబ్బాతును ఆచరించవలెనని యున్నది. అది ఎత్తుకొని సెవెంత్డే వారు మిషనును ఆరంభించిరి. అనేక మిషనులైన తరువాత నిర్గమునుబట్టి శనివారము మిషను వచ్చినది. అనేక మిషనులు అయిన తరువాత అ||కార్యమును బట్టి పెంతెకొస్తు మిషను వచ్చినది. బైబిలులోనిదే కాని బైబిలు పూర్తి అయిన తరువాత ఏర్పర్చుకొనిరి కాని పెంతెకోస్తువారు మాది ఆదిసంఘము తల్లిసంఘము అనుచున్నారు ఆది సంఘమువారు మిషనువేరు. ఆది సంఘము మిషనుకాదు. కాన్ స్టాంటైన్ తరువాత 1500 సం|| వరకు సంఘము స్పీడుగా వచ్చినది. అది ఆది సంఘమని వారు అంటున్నారు, వీరు అన్నీ అన్నా యెరూషలేము లోనిదే ఆది సంఘము. అపొస్తలులవంటి విశ్వాసమున్నవారే ఆది సంఘతులు, సంఘమును దేవుడు అపొతలుల 2వ|| అధ్యాయములో స్థాపించెనుకాని మిషనును మనిషి తన అనుకూలతను బట్టి ఏర్పరచుకొని బైబిలు మిషను బైబిలు అంతా ఆదికాండము మొదలు ప్రకటన గ్రంధమంతా ఆక్రమించుకొన్నది. ప్రకటన అయిన తరువాత బైబిలు వచ్చినది. అటు తరువాత మిషనులు వచ్చినవి బైబిలు మాత్రమే కాక అనాది అనంతములు కూడా కలుపుకొన్నది బైబిలు మిషను.


Home


4. తుయతైర

  • 1. చరిత్ర:- ఆది చిన్నాసియాలోని లిడియాకు ఉత్తరముగానున్న పట్టణము. హెర్మస్, కయకస్ అను నదుల లోయల రెంటినికలుపు ఒక పెద్ద లోయలో ఉన్నది. ఇది ప్రసిద్ధికెక్కిన వ్యాపార కేంద్రం. ఇది ధూమ వస్త్రములను నేయుటకు (అ||కా|| 16:14) ఇత్తడి పనికి (ప్రక2; 18 ప్రసిద్ధి. ఉరిద్నుస్ అను ఒక వీరుని ఈ పట్టణస్థులు కొలుతురు సంబతే అను అదృష్టములను తెలుపు దేవతకొక గుడి కట్టి యున్నారు. సంబతే ఒక సోదెకత్తె. యూదులు ఈ సోదెనడుగుటకు అలవాటుపడిరి. (అ.కా. 19:13; 13:6; ప్రక 2:20-24) క్రైస్తవులు ఈ సమాజములో చేరుటకు సమ్మతింపరైరి. ఎందుకనగా ఈ సమాజములో చేరిన వారందరు కలసి ఒక విందులో భోజనము భుజింతురు. ఈ భోజనము వారి దేవతలకు నిర్మించిన దేవాలయముల యందుకాని మరి వేరుచోట్లకాని కూడా భుజింతురు. ఈ భోజనమందలి మాంసమును మొదటవారి దేవత కర్పింతురు. విగ్రహార్పితమైన భోజనమును క్రైస్తవులు తినరు తినకూడదు. తినుట అపరాధము. మరియు భోజనమైన తదుపరి వారు సామాన్యముగా త్రాగుట యందును అవినీతి కార్యక్రమములోను మునిగి పోవుదురు. ఈ రెండు కారణములను బట్టి క్రైస్తవులు వ్యాపార సమాజములలో చేరరు.

  • 2. ప్రత్యక్షత:- అగ్ని జ్వాలలు వంటి నేత్రములను, అపరంజిని పోలిన పాదములను కలిగిన దేవుని కుమారుడుగా కనబడెను. ప్రతి సంఘముల స్థితిని బట్టి ప్రభువు ఆయా రూపములతో ఆయాసంఘములకు ప్రత్యక్షమాయెను. స్ముర్న సంఘమునకు సజీవునిగాను, పెర్గెము సంఘమునకు రెండంచులగల వాడియైన ఖడ్గముగల వానిగాను ప్రత్యక్షమైన ప్రభువు తుయతైర సంఘములో అగ్నిజ్వాలలవంటి నేత్రములను అపరంజిని పోలిన పాదములుగల దేవుని కుమారునిగా ప్రత్యక్షమాయెను. పెర్గెము సంఘము రాజుల చేతిలోనున్నది తుయతైర భక్తుల చేతిలో నుంచుటకై ప్రభువు దేవుని కుమారుడుగా ప్రత్యక్షమాయెను.

    దేవుని కుమారుడు:- క్రీతుప్రభువు శరీర జీవితమునుబట్టి మనుష్య కుమారుడుగా లోకములో జీవించినను పునరుత్థానమును బట్టి దేవుని కుమారుడాయెను. అట్లే దేవుని కుమారుడుగా ప్రత్యక్షమగుటకు కారణము. ఈ సంఘము నుద్ధరించుటకు వచ్చిన మార్టీనులూథరు . ఈయన బహిరంగముగా దేవకుమారునిగా పనిచేసెను. అంతరంగముగా దేవునికుమారుడే ఈ పని చేసెను.

    అగ్ని జ్వాలలవంటి నేత్రములు:- అనగా మనిషియొక్క హృదయాంతరంగమందున్న చెడుగును, మంచినిచూచి, చెడుగును దహించి వేయుటకును మంచిని పరిపక్వముగా మార్చి స్థిరపరచి వృద్ధి చేయుటకును శక్తిగల కన్నులతో తుయతైర సంఘమునకు ప్రత్యక్షమాయెను.

    అపరంజిని పోలిన పాదములు: అసత్యమైన సిద్ధాంతములను సమస్త చెడుగును తనపరిశుద్ధ ప్రవర్తనగల పాదములతో త్రొక్కివేయుటకు వచ్చెను. ఈ సంఘములోని మార్టిన్ లూథరు అను దేవకుమారుని కంటికి దేవకుమారుడైన ప్రభువు బైబిలు గ్రంధమును కనబరచెను. అనగా ఈ ఆత్మీయ కన్ను ఆయనలో ప్రవేశించినందుకు ఆయన బైబిలును చూడగలిగినారు. ఆయన బైబిలును చదివి సంఘములోని తప్పులన్నిటిని గుర్తించి వాటిని సంఘములో సవరణచేసి సంఘమునకుండ వలసిన మంచి స్థితిని స్థిరపరచుటకు తన ప్రవర్తన దిద్దుకొని సంఘమును సరిదిద్దినందున దేవుని కుమారుని పాదముల క్రింద ఈ సమస్తమైన చెడుగును త్రొక్కివేయుటకు సాధనముగా లూథరు గారు వాడబడిరి. కనుకనే ప్రభువు ఈ రీతిని తుయతైర సంఘమునకు ప్రత్యక్షమాయెను.

  • 3. మెప్పు:- నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును నీపరిచర్యను, నీ సహనమును నేనెరుగుదును నీ మొదటి క్రియలకన్న నీ కడపటి క్రియలు మరియెక్కువైనవని యెరుగుదును. తుయతైర సంఘమునకు విశ్వాసక్రియలున్నవి. ప్రేమ ఉన్నది. విశ్వాసమున్నది. పరిచర్య ఉన్నది. శ్రమల యందు కనపరచు సహనమున్నది. పైవన్ని ప్రారంభముకంటె ఇంకా ఎక్కువ వృద్ధిలో నున్నవి. సాధారణముగా మొదట ఎక్కువగానుండిచివరకు తగ్గిపోవును గాని ఈ సంఘములో ఎక్కువగా నున్నవి. ఎఫెసు మొదట వృద్ధిలో నున్నది చివరకు ఆది ప్రేమ పోయింది. ఇప్పుడును సంఘములలో మొదట భక్తులుగా నుండి చివరకు తగ్గిపోవుచున్నారు. తుయతైరలోనైతే మొదట బాగుగానేయుండి చివరకు ఇంకా బాగున్నది. అయినను ఈ సంఘములో పొరబాటులు కూడానున్నవి. మంచి ఉన్నదని సంతోషిస్తే చాలదుగాని చెడుగును ఏమాత్రము చేరనివ్వకూడదు. చెడుగును చేరనిస్తే భక్తి అంతా వ్యర్ధమే మంచి క్రియలు లోకము ఎదుట బాగుండును. కాని చెడుగును చేరనిచ్చి నందున పరలోకములో ప్రభువు ఎదుట పనికిరావు. కనుక ప్రతివారును జాగ్రత్తగా నుండవలెను. చాలామంచి ఉన్నదికాని ఒక్క తప్పు ఉన్నా నాకు మోక్షమనుకొనకూడదు. ఆ ఒక్క తప్పు సరిదిద్దుకుంటేనే మోక్షము. ఆవగింజంత చిరుపాపమంటియున్న వధువు సంఘములో చేరలేరు.

  • 4. తప్పు:- తాను ప్రవక్తనని చెప్పుకొనుచున్న యెజెబెలును ఉండనిచ్చు చున్నావు. జారత్వము చెయుటకు, విగ్ర్హబలికి, బలి అర్పించిన వాటిని తినుటకు అది తన దాసులకు, బోధించుచు వారిని మోసపరచుచున్నది.

    యెజెబెలు:యూదా మతములో నున్న ఈమె అహాబురాజు భార్య ఈమె విగ్రహారాధ్న చేయకూడదు కాని ఈమె అన్యురాలైనందున, చేసెను. గనుక విగ్రహములకు బలియిచ్చుటకై 450 మంది అబ్ద్ధ ప్రవక్తలను తయారుచేసినది. కాని (1రాజు 18అ||) ఏలీయా వారినందరిని చంపి వేసెను. కారణము బయలు పూజారులు ప్రార్ధింపగ వర్షముకాని, అగ్ని కాని రాలేదు. ఏలీయా ప్రార్ధింపగా వచ్చెను. అప్పుడు యెజెబెలు మారుమనస్సు పొందవలసినది కాని పొందలేదు. తిరిగి యేలీయాను చంపింపబోయెను. అట్టి స్థితి తుయతైర సంఘములో నుండెను. కష్టములలో కూడా మారుమనస్సు పొందనివారున్నారు. విగ్రహములకు బలి ఇచ్చినవాటిని తాముతిని తమ పిల్లలకు పెట్టుట అను బలహీనత తుయతైరలో కలదు. దేవతల దగ్గరిది ఎవరైనను మనకు పెట్టిన మనము తినకూడదు. ప్రభువు సంబంధమైన బొమ్మనుచూచి మనము ఆనందించవలెను కాని వాటిని పూజింపకూడదు. జారత్వము :- క్రీస్తు పూజను తప్పించి ఇతర దేవతల తట్టు తిప్పు దురాచారము ఈ సంఘములో నున్నది. ఇదే జారత్వము. ప్రభువునందున్న విశ్వాసము నుండి తప్పించకూడదు. హిందువులు శకునము అడిగినట్లు క్రైస్తవులు కూడా శకునములు అడుగుచున్నారు. అది తప్పు. ఎట్లనగా 2రాజులు 1:15,16.లోనున్నట్లు ఇశ్రాయేయులరాజు అన్యులయొద్దకు శకునానికి పంపుచుండగా ఏలీయా ఎదురుగావచ్చి దేవుని ప్రవక్తలులేరని నీవు ఎక్రోను దేవతగు బయల్జెబూబు నొద్దకు విచారణ చేయుటకై దూతలను పంపితివే నీవెక్కిన మంచము మీదినుండి దిగకుండ నిశ్చయముగా నీవు మరణమౌదువు అని చెప్పెను పాపాలు, అక్రమము, అవినీతి అసూయ, ఎక్కువైన ఈ కాలములో అట్టి యేలీయాలు ఇప్పుడు కావలెను, నేను దేవుని సన్నిధిలో నిలబడినవాడను నా సెలవు లేనిదే ఒక్క చుక్క వర్షమైనను ఆకాశమునుండి పడదని చెప్పెను. ఈ మాటలు చాలా గొప్పవి (1రాజులు 17:1) తుయతైరలో అన్ని మంచి గుణములున్నవిగాని యెజెబెలు క్రియలతట్టు వాలిరి.యేలీయా కాలములో యెజెబెలుతట్టు వాలకుండ బయలుకు మోకాళ్ళూనని 800 మంది ప్రవక్తలు కూడా ఉన్నారు. అట్లే ఈ సంఘములోను భక్తులు భక్తిహీనులు కూడా ఉన్నారు.

  • 5. మందలింపు:- మీపైని మరి ఏ భారము పెట్టను. కలిగియున్న దానిని గట్టిగా పట్టుకొనుడి. ఆది ప్రేమ కలిగి, సహనముతో సహించి సిద్ధాంత నిశ్చయత సంపాదించుకొని ఏది సత్యమో అది ఏర్పరచుకొని భక్తిగా ఉన్ననీవు ఈ భక్తిలో స్థిరముగా నుండుము. ఇంత కన్న ఎక్కువైన భారము నీపై లేదు.

  • 6. శిక్ష: యెజెబెలును మంచము పట్టింతును ఆమె వారిని శ్రమల పాలు చేసి ఆమె పిల్లలను చంపెదను.

    మంచము పట్టించుట:- మారుమనస్సు పొందుటకు యెజెబెలునకు ప్రభువు సమయమిచ్చినను తన ప్రవర్తన దిద్దుకొననందున తన మేడపైనుండి క్రిందపడునట్లు చేసిన చివరకు మారుమనస్సు లేకుండ చనిపోయెను. దానిని వెంబడించినందున దాని అనుచరులు కూడా అట్టి ఘోర మరణము పొందిరి. మీలో ప్రతివారికిని వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చెదను అట్లే ఈ సంఘములోని మార్పులేని వానికిని అట్టి స్థితియే సంభవించును. విగ్రహారాధికులైన వారికి అందరికి కలిగే భయంకరమైన శిక్ష శ్రమలు, మరణము. అని ఇక్కడ చూచుచున్నాము.

  • 7. కోరిక: సంఘములలో ఆత్మచెప్పుచున్న మాట చెవిగలవాడు వినునుగాక సంఘ ప్రత్యక్షత హెచ్చుచున్న కొలది సంఘస్థితి పెరుగుతునది. కనుక ఆత్మ చెప్పే విషయములు మరి ఎక్కువగా వినవలెనని విను అనుభవములో పెరగవలెనని ప్రభువు కోరిక.

  • 8. బహుమానము:- జనులపై అధికారము నిచ్చెదను వారు ఇనుప దండముతో ఏలుదురు. వేకువచుక్క నిచ్చెదను.

    జనులపై అధికారము:- రాజ్యాధికారుల అధికారము, మతాధికారుల అధికారము, యెజెబెలు యొక్క అధికారమును, పడగొట్టి దేవుని కుమారుడు తన యెడల భక్తిగలవారికే అధికారము నిచ్చెను.

    ఇనుపదండము:- భక్తులైన వారికి శక్తివంతమైన వాక్యము నిచ్చెను. ఇదే ఇనుపదండము. ఇనుపదండము కుమ్మరివాని పాత్రలను పగుల గొట్టునట్లు మనుష్యులలోని పాపమును ఈ వాక్యమను ఇనుపదండము ద్వంసముచేయును. లూథరుగారు ఈ వాక్యదండమనే ఇనుపదండమును వినియోగించి సంఘములోని చెడుగంతటిని ద్వంసము చేసెను.

    వేకువచుక్క:- ప్రభువు తక్కిన సంఘముల కంటె ఎక్కువ ప్రత్యక్షతానుభవము ఈ సంఘమునకే ఇచ్చెను. ఇదే వేకువచుక్కను బహుమతిగా నిచ్చుట ఇందులో దేవుని కుమారుడు కనబడుట ఉన్నది. ప్రభువు సంఘములో ఉండుట వేరు. సంఘము ఆయనను చూచుటవేరు. ఆయన వచ్చినందువల్ల, కనిపించినందువల్ల నీవు ఆయనను చూచుమేలే వేకువచుక్క. ఈ మేలు అనుభవించిన వేకువచుక్క బహుమతి,ఇచ్చుమేలు అనుభవించకపోతే బహుమతి లేదు.

  • 9. ఉపమానము:- ఆయన మరియొక ఉపమానము వారితో చెప్పెను.పరలోక రాజ్యము, ఒకస్థ్రీ తీసికొని పిండి అంతయు పులిసి పొంగువరకు మూడు కుంచముల పిండిలో దాచిపెట్టిన పుల్లని పిండిని పోలి యున్నది. మత్తయి. 13: 31, 32.

      పులిసినపిండి:- పులిసినపిండి అనగా తప్పుడు బోధ అని అర్ధము ఇది
    • 1) పరిసయ్యుల పులిసినపిండి అనగా జీవము శక్తిలేని మతాచారములు.
    • 2) సద్దూ కయ్యుల పులిసినపిండి:- అనగా పునరుత్థానమునుగాని దేవదూతలనుగానినమ్మనిబోధ.
    • 3. హేరోదీయుల పులిసినపిండి:- అనగా లోకమునకు మనమును కలిసి ఉండవలయునను మిశ్రమబోధ.
    ఈ మూడు రకములైన బోధలు సంఘముల మతోద్ధారణ కాలములో ప్రవేసించినవి అంతకుముందున్నప్పటికి ఇప్పుడు సంఘవృద్ధినిబట్టి బయలుపడినవి మతోద్ధారణ కాలమందు బైబిలు వెల్లడిలోనికి వచ్చినందున సంఘము అంతయు పూర్తిగా దిద్ధుబాటు లోనికి రావలసినది కాని శాఖలై పోయినది. ముఖ్యమైన శాఖలు మూడు.

    1. 1) రోమన్ కాథలిక్ సంఘము.
    2. 2) గ్రీక్ కాథలిక్ సంఘము.
    3. 3) ప్రొటస్టంట్ సంఘము.
    మూడు కుంచముల పిండి అనగా ఇదే. అసలుపిండి మంచిదే కాని ప్రవేశించినది పులిసినపిండి ఈ మూడు శాఖలు ఎప్పటికైన ఒక్కటి కావలసినదే. అపోత్సలుల, నికేయ అతనాసియా అనుమూడు విశ్వాస ప్రమాణములున్నను, నూతన సంవత్సరములు వచ్చుచున్నకొలది నూతనమైన శాఖలు వచ్చుచున్నవి సంఘము ఇప్పటికి ఎన్నోమిషన్లు అయినది. బేధమైన బోధనలను బట్టి ఇది కలిగినది. మంచిపిండిలో పులిసిన పిండి కలిసిపోగా విడదీయవిలుండునా? పిండి తెచ్చినది. ఒక స్త్రీ.
    1) నిజమైన విశ్వాసుల గుంపునకు పెండ్లికుమార్తె అని పేరు.
    2) దుర్భోధకుల గుంపునకు కూడ స్త్రీ అని పేరు అనగా చెడ్డస్త్రీ అని పేరు. అనగా పులిసిన పిండి ఇది తప్పుడు బోధ అని తెలియకుండ మంచిపిండిలో దాగియుండు పులిసినపిండి.
    ఉపమానములో పిండి అంతయు పులిసిపొంగు వరకు అని ఉన్నది, మంచి పిండి అంతయు పులిసిపోవు వరకు సంఘమతా పులిసిపోవు వరకు అనగా అనేక రకములైన మిషనులు, అనేక రకములైన సిద్ధాంతములు, బోధలు, వీటినిబట్టి ఏది నిరుకో తెలియక అంతా పులిసిపోయినట్లే కంబడును. అట్లే ఏర్పరచబడినవారు సహితము ఈ గలిబిలివల్ల తప్పిపోవుదురు ఎవరిమట్టుకు వారే మాది మంది బోధ అందురు. ఫలాని వారిది దుర్భొధ అందురు గురుగులు అంతము వరకు ఉండును. అట్లే పులిసిన పిండి అంతమువరకు ఉండును. ప్రభువు యొక్క ప్రత్యక్షతవల్లనే మంచి చెడ్డలు బయలు పడును ఇప్పుడు అన్ని మిషనులవారు ప్రభువును అడిగిన యెడల ఆయన సత్యమును వినిపించును గాని అట్లు సంఘము అడుగదు. బైబిలులో ఉన్నది కనుక అడుగుట ఎందుకు? అందురు. బైబిలు వాక్య అర్ధములను మనబోధకులను అడుగుటలేదా? మరి ప్రభువునే ఎందుకు అడుగ కూడదు? తుయతైర సంఘమునకు పులిసినపిండి ఉపమానమునకును గలపోలిక:
    • 1) ఏడు సంఘములలో తుయతైర నాలుగవ సంఘము అట్లే ఏడు ఉపమానములలో పులిసిన పిండి ఉపమానము నాలుగవది.
    • 2) పై ఉపమానములో మంచి పిండి ఉన్నది పులిసిన పిండి కూడ ఉన్నది అట్లే తుయతైర సంఘములో భక్తులున్నారు. మంచి వాక్యోపదేశమున్నది. ఇది మంచి పిండి. కాని మనిషి కల్పించిన సిద్ధాంతములున్నవి. ఈ మనిషి కల్పనే పులిసిన పిండి.
    • 3) ఉపమానములో మూడు కుంచముల పిండి కలదు అట్లే సంఘములో మూడు శాఖలు కలవు ఇవి.
    • 4) ఉపమానములో పులిసిన పిండి కలిపినది ఒక స్త్రీ అని కలదు. అట్లే తుయతైర సంఘములో యెజెబెలు అను స్త్రీ గలదు. అనగా విగ్రహార్పితమైన చెడుగును తెచ్చిన స్త్రీ యెజెబెలు.
    • 5) గురుగులు, గోధుమలు అంతమువరకు ఉండును. అట్లే మంచి పిండి పులిసిన పిండి కలిసి అంతము వరకు ఉండును. అనగా మంచిబోధలు దుర్బోధలు అంతము వరకు ఉండును.
    • 6) మతకాలము:- క్రీ.శ.606 నుండి 1520 వరకు
    • 7) పరలోక స్థానము:- పరలోక సొ హాసనము వద్దనుండి 4వ స్థానము.
    • 8) స్థితి:- ఆది ప్రేమ, శ్రమలో సహనము. సిద్ధాంతనిశ్చయత కలిగియున్న భక్తులు తుయతైర సంఘములో ఈ సిద్ధాంత నిశ్చయతకు వ్యతిరేకముగానున్న వారినందరిని ఎదిరించి సత్య ప్రకటనకై దిగ్గజములుగా నున్నారు. ఇదే సత్య ప్రకటన ఈ స్థితి కలదే తుయతైర సంఘస్థితి.

    పెర్గెము గోగుమొక్కవలె ఎదిగినది. కాని బలములేదు. అనగా రాజు గారి వలన సంఘము పెరిగినది కాని భక్తిలేదు. పెర్గెము వలన మనము నేర్చుకొను పాఠమేమనగా మనము సంఘ రిపోర్టును చూచి సంతోషింపక, సంఘము ఎంత స్థిరముగా నున్నదో చూడవలెను. పండుగ దినములలోనే కాక ప్రతి ఆదివారము గుడికి రావలెను. భక్తిహీనతనను ఎదిరించుటకు భక్తిలో స్థిరముగా నుండవలెను. పై సంఘములలో కొందరికి ఆది ప్రేమ ఉన్నది. కొందరు శ్రమ సహించిరి. పెర్గెములో ఊబి ఏమిటో తెలిసికొన్నారు. గానీ అన్నీ తెలిసినవారు తుయతైరలో ఉన్నారు. పై సంఘములలో భక్తులున్నారుగాని దుష్టత్వమును ఎదిరించలేకపోయిరి తుయతైర కాలములో పండితులు తక్కువైన బలముగలవారు వీరు భక్తిహీనులను ఎదిరించిరి. ఉదా:- గిద్యోను కాలములో తక్కువమంది సైనికులునా అందరినీ యెదిరించి గెలిచెను. ఎదిరించి రోమన్ కాథలిక్ నుండి ప్రొటస్టంటులు వేరైరి. ఎదిరించి వేరు కాకపోతే వారితో కలసి ఉందురు. ఏమి లాభము? పై సంఘములలో ఒకొక్కరుగా నున్నవారు తుయతైరలో కల్సి గుంపు అయిరి. రోమన్ కాథలిక్ కాలములో రాజులు పోపుల క్రింద ఉండిరి. పోపులు రాజులను సయితము చంపించిరి. వీరు విక్లిప్ను చంపి పాతిపెట్టి, కొన్ని సంవత్సరముల తరువాత శవమును తీసి, కాచి నదిలో కలిపిరి. గూస్ అను భక్తుడు సత్యమును గురించి చెప్పగా అతనిని కొయ్య మీద ఉంచి గడ్డి వేసి కాల్చిరి అప్పుడు ఆయన ఒక మాట చెప్పెను. నేను బాతు వంటివాడను. నన్ను చంపినను నా తరువాత 100 సం||లకు హింస వచ్చును. ఆయనను మీరు పట్టుకొనలేరు. ఆయనే మార్టిన్ లూథర్. ఈయన ధైర్యముగా పోపులమధ్య చెప్పవలసినవి చెప్పెను. అప్పుడు ఒక పోపు మన బోధ బైబిలు వెలుపలనున్నది లూథరు బోధ బైబిలులో నున్నది అనెను. ఆ సమయములో లూథరును చంపిన యెడల ప్రజలు ఊరుకొనరని చంపుటమాని లూథరును చంపవలెనని ఆర్డరు ఇవ్వగా ఒకరాజు ఆయనను చెఱలో నుంచెను. అప్పుడు ఆయన చెరలో నుండి క్రొత్త నిబంధనను తర్జుమాచేసి అచ్చు వేయించెను. అయినను ఆయనను యేమీచేయలేక పోయిరి. కాని అంతకన్నా గొప్ప భక్తుడైన గూస్ ను చంపిరి. ఆ కాలము అటువంటిది. లూథరు ఉంగరముపై హంస ఉండెడిది. గూస్ ప్రవచనము లూథరునకు తెలియదు కాని ఎందుకో అది వేసుకొనెను. లూథరుయొక్క లీను అను పుస్తకముపై హంస ఉన్నది, పై సంఘములలో ప్రభువు వచ్చినను ఆయనను సత్కరించేవారు లేరు. గనుక ఆయన దేవుని కుమారుడుగా ప్రత్యక్షము కాలేదు. గాని తుయతైరలో సమస్తము వృద్ధియైనది. లూథరు బైబిలు తీసి హన్నా చరిత్ర చదివి నాకు ఒక బైబిలు యిమ్మని ప్రార్ధించెను. ప్రభువు అప్పుడు చిరు నవ్వు నవ్వి ఉండవచ్చు నీకు మాత్రమే కాదు 1951వ సం||లో 1091 భాషలలో చదువవలెనని అందరికి యిచ్చుచున్నానన్నట్లు నవ్వి ఉండవచ్చు సభలో భయపడెను. కాని ధైర్యము తెచ్చుకొనెను. సంఘ చరిత్రలో భక్తులతో దేవుడు మాటలాడక పోయినను వారు చేయవలసినది చేసిరి. లూథరుతో దేవుడు మాట్లాడినట్లు ఒక దొరగారు వ్రాసిరి. తుయతైర కాలములో బైబిలు బైటికి తీయబడెను. సంఘాధికారులతో శ్రమ ఉన్నడని తెలిసిన తీయకపోవును. కాని ప్రభువు ఆయనను అట్లు నడిపించెను. 7 న సంఘములలో మధ్యది తుయతైర. తుయతైర నుండి సంఘము వృస్షియగుట ప్రారంభించినది పై మూడు సంఘంకాలములలో సంఘము యొక్క వృద్ధిని యెవరు ఆపు చేయలేదు. ఆకాలములో రోమన్ ప్రభుత్వమున్నది. చిన్న మొక్కగా నున్నపుడే లాగవలసినది. కాని లాగలేకపోయిరి. ఇప్పుడు పెద్ద చెట్టు అయినది. బైబిలు కంఠత అయినది. ప్రార్ధనా పరులు లేచిరి. లూథరు తరువాత బైబిలు అన్నీ అచ్చు ఆఫీసులకు వెళ్ళినది. అట్లు లోకమంతట తెలియపరచ బడినది. కాని యెవరు ఆపలేక పోయిరి. అన్యులకు సువార్త చెప్పవలెనని కౌన్సిలు పెట్టిరి. అప్పుడు యోకోబు బిషప్గా ఉండి జరిపెను. అప్పటికి పౌలు మార్పు చెందెను. పౌలు అన్యులకు సువార్త ప్రకటించుటకు అపోస్తలులు వద్దు అనిరి. కాని పౌలు మార్పు చెందినాడని తెలిసి అన్యులకు సువార్త ప్రకటించుటకై పేతురును యేర్పాటు చేసిరి. యాకోబు (బిషప్) యెరూషలేములో నున్నాడని బర్నబాను, పౌలును అంతియోకయకు వెళ్ళిరి. యెరూషలేము హెబ్రీయులకు క్రైస్తవులకు, యూదులకు సెంటరు. గ్రీకు భాషకు అంతియోకయకు సెంటరు. పౌలు 14 సం||ల తరువాత పరదైసుకు వెళ్ళి చెప్పశక్యముకాని భాష వినెను. ఫిలిప్పు కొలస్సై సంఘములను స్థాపించెను ఈ సంఘములు మా పట్టణములు గొప్ప సంఘములనిరి. యెరూషలేము వారు ప్రభువు ఇక్కడ సంఘమును స్థాపించిచెను, గనుక మా పట్టణము గొప్పదనిరి. అంతియొకైవారు మాకు క్రైస్తవౌలని పేరు వచ్చినది గనుక మాది గొప్పదనిరి. కొరింథివారు పౌలు మా భాషలో చెప్పెను క్రొత్త నిబంధన గ్రీకులో వ్రాయబడెను గనుక మాది గొప్పదనిరి. రోమావారు అంతియొకై రోమా క్రిందనున్నది గనుక మాది గొప్పదనిరి. సువార్త:- అలాగే ఆదాము హవ్వలు పాపములో పడినప్పుడు నీ సంతానమునకును స్త్రీ సంతానమునకును, వైరము కలుగును. నీ సంతానములో నుండి రక్షకుడు వచ్చుననుట హవ్వకు మొదటి సువార్త. ధెర్యము, ఆదరణ, బైబిలులో లోకమంతటికి దేవుడు సువార్త ప్రకటించినకథ ముమ్మారు ఉన్నది.

    • 1) ఆదాము+అవ్వ, యిద్దరు ఉన్న లోకమునకు సువార్త.
    • 2) ప్రభువు కల్వగిరి మీద సిలువవేయబడినపుడు యూదుల రాజని గ్ర్రెకు, రోమా, హెబ్రీ మూడు భాషలలో వ్రాసియున్నారు.
    • 3) ఆ కాలమున సర్వ లోక ప్రజలు వచ్చిరి. పెంతెకోస్తు దినమందు జనులందరు హాజరైరి, ఇట్లు మూడు పర్యాయములు సువార్త ప్రకటించినట్లు ఉన్నది.
    • 4) లోక చరిత్రలోనిది రావాలి. పునరుథానమైన 40 దినములకు ఆరోహణమైన 10 దినములకు పెంతెకోస్తు, ఇప్పుడు రేప్చర్ దినాలలో నున్నాము. వెళ్ళిపోవువారికి సువార్త. ఉండిపోవువారికి దుఃఖవార్త.
    • 5) వెయ్యి యేండ్ల పాలనలో పెండ్లి కుమార్తె తిరిగి ప్రభువుతో భూమి మీదికి వచ్చి సువార్త ప్రకటించును తరువాత అంతము వచ్చును. దీనితో సువార్తను గూర్చిన కథ అయిపోవును.
    సంఘము రెండు పనులు చేయుచున్నది
    • 1). సువార్త ప్రకటించుచున్నది.
    • 2) . ప్రార్ధన చేయుచున్నది.

    ఆకాశము క్రింద లోకమునకు సువార్త ప్రకటింప బడవలెనని, క్రైస్తవులేకాక అన్యులు కూడ ప్రార్ధించవలెనని దేవుడు కోరుచున్నాడు. కనుక అన్యులకు సువార్త అందవలెను. ఆది సంఘమునకు సువార్త అందినది ప్రార్ధన చేయవలెనని బైబిలులో నున్నది ఇప్పుడు లోక చరిత్ర జరగవలెను. 1893 నుండి 1951 వరకు లోక చరిత్రలో నెరవేరినది. ఒక గ్రామము ఉన్నది. వారు భూమిని సంపాదించుట కొరకు కలెక్టరుగారికి అర్జీ పెట్టుకున్నారు. 10 సంతకాలే ఉన్నవి. గ్రామములో ఎంతమంది ఉన్నారని మునసబుగారిని అడిగితే 500 మంది ఉన్నారూనెను. మిగతా వారి సంతకాలు కూడ ఉంటేనేగాని భూములు రావని కలెక్టరుగారు అన్నారు. అట్లే ఒక్క క్రైస్తవులు మాత్రము ప్రార్ధిస్తేకాదు అన్యులు కూడా ప్రార్ధిస్తేనే గాని అంతము రాదు. 1 93వ సంవత్సరములో కలక్త్తా దగ్గర ఒక యౌవ్వనుడు అన్ని మత గ్రంధములను చదివెను ఆయన పేరు వివేకానందుడు. మహమ్మదీయులు హిందువులు, క్రైస్తవులు, పూజించు గురువు నాకు కనబడవలెనని రామకృష్ణను ప్రార్ధింపగా ముగ్గురు కనబడిరి. క్రైస్తవుల దేవుడు ధన్యుడుగా వ్రాసెను అని వివేకానంద చెవిలో రామకృష్ణ చెప్పెను. ప్రభువు నా గురువుకు కనుపించెనని అందరికి ప్రకటంచి కాషాయ వస్త్రములతో ఇంగ్లండు వెళ్ళి భక్తులకు చెప్పెను అమెరికాలో, లోకమతటిలో గొప్ప దైన చికాగోలో ప్రకటించెను చికాగోలో అన్ని మతములవారికి మీటింగు జరిగెను. పెంతెకోస్తు దినమువలె అన్ని మతములవారు అక్కడ ఉండిరి. మీటింగులో వివేకానందుడు హిందూమతమును గూర్చి ప్రకటించినాడు. ఎవరి ప్రసంగము బాగున్నదో నిర్ణయించు జడ్జీలు వివేకానందస్వామి చెప్పుటలో నేర్పరి. కాని క్రీస్తుమతము లోకమంతటికి ప్రకటింపబడెను అనిరి. ఇది తలో మొదటిది సభలో ముగింపయినది. మతభేదము లేకుండ ముగిసినది. చివరి ప్రార్ధన చేస్తామని అనుకొన్నారు ప్రభువు ప్రార్ధనలో యే దేవుని పేరు లేదు. చిక్కేమి లేదు. అనుకొని ముగింపులో పరలోక ప్రార్ధన చేసిరి. కనుక సువార్త ప్రకటన అయినది ప్రార్ధన అయినది. ఒక మతము ఒక దేశము, ఒక జనమని లేక లోకమంతా కలిపి 1893వ సం||లో ప్రార్ధింపగా ప్రభువు కోరిక నెరవేరినది. ప్రపంచములో ఇన్ని మతములున్నవి. వానిలో ఏది గొప్ప? ప్రపంచ యుద్ధము జరుగుట ముఖ్యము. అమెరికా సామాగ్రి అంతా సిద్ధముగా ఉన్నది. ఇంగ్లాండు క్రైస్తవులు ఇంకా ప్రారంభించలేదు. వీరు మిత్ర దేశాలతో మాతో ఏకీభవించుమని వ్రాస్తారు. వారందరు ఏకీభవించగానే యుద్ధము ప్రారంభమగును. వీరు ఇండియాను కూడ అడిగిరి. మేము ఎవరి సంబంధము కాదని ఉత్తరైండియా వేదాంతులు బయలుదేరి మనము వెళ్ళి వారు కూడా వెళ్ళకుండా ప్రార్ధన పెట్టుకుందామని నెహ్రు గారిని అడిగిరి. చికాగోలో వలె అన్ని మతముల ప్రతినిధులు ఢిల్లీకి రావలయుననిరి. అందరు ప్రభువును ప్రార్ధించిరి. అందరూ యిక్యముగా నున్నారు. గనుక ఏ చికాకు లేదు. అన్ని భాషలవారిని, అన్ని మతముల వారిని మార్చేది క్రైస్తవ మతమే. పూర్వము ఇంటింటికి వెళ్ళి రొట్టెవిరిచిరి. మనమును అలాగు చేయాలి. ఆరాధనలో ఆరాధించాలని చాలా గలిబిలి వచ్చినది. బైబిలుకు వ్యతిరేకముగా నున్నది మానాలి. అయితే క్షమాపణకు సీటు యివ్వాలని బైబిలులోలేదు హిందూ మతములోను గందర గోళము వచ్చినది. అట్లే క్రైస్తవులలులోలేదు హిందూమతములోను గందర గోళము వచ్చినది. అట్లే క్రైస్తవులలోను వచ్చినది. కందుకూరి వీరేశలింగము జంధ్యము ఎందుకు వేసికోవాలి? వేదాలలో ఎక్కడ ఉన్నదని వాదించగా ఆయనను హిందూవులు వెలివేసిరి. బ్రాహ్మణుడవై పుట్టి ఎదిరించుచున్నావేమనిరి. బాపనయ్యగారికి ఇంకా చాలా పట్టు. మనస్సాక్షికి విరుద్ధమైన పనులు చేయలేదు కులమే లేదనేవారు విగ్రహారాధన వద్దు అనేవారు కూడ తమ మతమును దిద్దుకొనవలెననికోరిరి. విలియం బెంటింగ్ కాలములో రాజారాం మోహనరాయ్ బయలుదేరి క్రైస్తవమత మత సంగతులు చాలా బాగున్నవనిరి. నేను క్రీస్తు మతములోను ఉండను. హిందూమతములోను ఉండను అని బ్రహ్మసమాజ మందిరములో నుండెను. దీనిలో హిందూ మతములోనున్న మంత్రతంత్రములు, క్రైస్తవులలోనున్న బాప్తీస్మ సంస్కారములు లేవు. బాబరు, అక్బరు మీటింగు పెట్టిరి. క్రైస్తవ మతముకాక ఇంకొకరు బోధించే మతము చూచి అదేమి? అని అడుగుదురు. వీరేశలింగముగారికి క్రెస్తవ మతమును గూర్చి బాగానచ్చ చెప్పినవారు షణ్ముఖరావుగారు. బాప్తిస్మము కొరకు వీరు కాకినాడ వరకు వెళ్ళగా పిచ్చివాడా! నీ మతమే శుద్ధిచేసుకొని అందులో ఉండుమనెను. క్రీస్తు మతము పరమతమని చెప్పెను. లాలమోహన్ పట్నాయక్, దర్శనములు, భాషలు, నమ్మవలెనని చెప్పి రీడింగ్ రూంలో ప్రసంగించిరి. ప్రతి మతములోను, మన మతములోను, వివాదములు లేచినవి. పెర్గెము, తుయతైర సార్ధిస్లోను, ఈ వాదమే లేచినది. నాగరికతలో, విద్యలో, వైద్యములో ప్రమాణ సాధనములలో వృద్ధి ఉన్నట్లు మతాచారములలోను, వృద్ధి ఉండవలెను నగలు, నార బట్టలు వేసికొన కూడదని బైబిలులో ఉన్నదని ఆకివీడులో మురిగే జాన్ గారు బోధించగా అందరూ నగలు తీసివేసిరి. బరంపురంలో అట్మన్ మిస్సమ్మగారు వచ్చి పరలోకములో పెండ్లికుమార్తె అలంకరింపబడునని ఉన్నది రాబోవు పెండ్లికుమార్తె నగలు, వస్త్రములు ధరించుకొనవచ్చునని బోధించగా మరల అందరు ధరించిరి. (లూకా 15:22) పోయి తిరిగి వచ్చిన కుమారునికి తండ్రి ఉంగరము ప్రశస్త వస్త్రము, ధరింపజేసెనని ప్రభువు చెప్పెను. యెవరి శక్తి కొలది వారు ధరించుకొనవచ్చును. బాప్తిస్మము నదిలోనే పొందవలెనని అనుచున్నారు. గుడిలో, చెరువులో, బేసిన్లో వద్దు అనుచున్నారు. కొన్ని దేశ్సములలో నదులులేవు. పెంతెకోస్తు దినమదు మూడువేలమంది బాప్తిస్మము పొందిరి. యెరూషలేములో ఏ నది ఉన్నది? రక్షణ సైన్యపువారు జండా, ప్రమాణమును చేయుట నమ్మవలెను బాప్తిస్మము పొందవలెను. కొలతలేదు. గాని నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించినవాడే రక్షణ పొందునని ప్రభువు చెప్పెను.

    • 1) దేవుడు పైన ఉన్నాడు. నరులు క్రింద ఉన్నారు. పైనున్న వెలుగు క్రింది వారికి వచ్చెను
    • 2) మేఘములకు పైన దేవుడున్నాడు గాన నరునికి పైనుండి వర్షము వచ్చినది.
    • 3)గొప్ప బాప్తిస్మమైన పరిశుద్ధాత్మ పైనుండి క్రిందనున్న నరుల మీదికి వచ్చెను.
    • 4) దేవుడిచ్చిన దానములన్నియు పైనుండే వచ్చినవి. ఇక నరుడు క్రిందమునుగుట ఎందుకు? దేవుడిచ్చిన నగలు వేసికొనవద్దన కూడదు. మందులు వద్దనకూడదు. అంజూరపు పండ్లముద్ద, మంచినీరు, బురద, నరుని వ్యాధులు పోగొట్టుటకు సాధనములు పెర్గెము తుయతైర సార్ధిస్ సంఘములోను సిద్ధ్హాంతములు పెట్టి ఆత్మ అభివృద్ధిని పోగొట్టుకొన్న ఛాదస్తులు ఉన్నారు.

    1) ఎక్కువ నీరైన బాప్తిస్మమే, తక్కువ నీరైన బాప్తిస్మమే.

    2) మెల్లగా చేసిన స్తుతియైనాస్తుతే గట్టిగా చేసిన స్తుతియైనాస్తుతే

    3) రొట్టె ద్రాక్షారసము కొంచెము కొంచెముగా వాడిరి. ఇది సంస్కారము కాని అల్లరిరిస్తుతి చేయమనలేదు సంఘము మర్యాదగా స్తుతించవలెను.


Home