20వ అధ్యాయము - 1000 Years & Satan in Abyss

పరిచయము

    దూత:
  • 1. దిగివచ్చె
  • 2. పెద్ద సంకెళ్ళతో
  • పాతాళ 3. తాళపుచెవి
    ఫలితము:
  • 1. పట్టుకొనె =
    • ఘటసర్పము సాతానును
    • అపవాది
    • = ఆదిసర్పము
  • బంధించె 2. పాతాళ
    • 1000 సం|| జనమొసంలేదు
  • 3. మూసె

ఫలితము: సాతాను విడుదల = కొద్దికాలం

సిం హాసనములు:
  • 1. అసీనులు
  • 2. శిరచ్ఛేదనాత్మలు


విమర్శనాధికారము
  • 1. బ్రతికిరి
  • 2. 1000 రాజ్య
  • XL తో
  • ఎ. మృగ
  • బి. ప్రతిమ
  • సి. ముద్రలేని



నమస్కరింపని
  • ఎ ఎ నొసలు
  • బిబి. చేయ
  • డి. యేసు సాక్ష్యం
  • బిబి, దేవునివాక్య సాక్ష్యం
    N.B : ఈ కాలములో కడమ మృతులు లేవలేదు
  • 1. టి. పునరుత్థానం
  • 1. టి. పునరు


1. పాలివారు
  • ఎ. ధన్యులు
  • బి. పరిశుద్ధులు
2. రెండవ + మాకధికారంలేదు
  • 3. దేవునికి
  • NL కు


యాజకులు

4. 1000 రాజ్యం చేతురు

    విడుదల :
  • 1. 1000 తర్వాత
  • 2. సాతానుకు
    • ఫలితము: సాతాను
    • 1. బైలుదేరును
      • ఎ. పోగుచేయబడుట
      • బి. స్త్రీ శేషసంతానమునకు
  • 2. ఎ. గోగు
  • మాగోగు


పోగుచేయు
    3. వారు :
  • ఎ. వ్యాపించి
  • బి. ముట్టడి పరిశుద్ధ పట్టణ శిభిర
    ఫలితము: అగ్ని:
  • ఎ. పైనుండివచ్చె
  • బి. దహించె
  • సి. సాతాను గుండములో

N.B: యుగాలబాధ

మహా ధవళ సిం హసన ఆసీనుడు

  • 1. ఆకాశము
  • 2. భూమి

పారిపోయె
చోటులేదు

2. నిల్చిరి....... మృతులందరు

  • 1. గ్రంధములు విప్పబడె
  • 2. జీవగ్రంధం విప్పబడె తీర్పునుబట్టి మృతులందరు
    అప్పగింతలు:
  • ఎ. సముద్రము ... ... మృతులను
  • బి. మరణము ... ... మృతులను
  • సి. మృతులలోకము ... ... మృతులను
పడవేత :
  • 1. మరణము
  • 2. మృతులలోకము
  • 3. జీవగ్రంధము



గుండం
2వ + మరణములోలేనివారు

ప్రార్ధన:- మా ప్రభువైన దేవా! మాబ్రతుకులో అవిశ్వాసము, విశ్వాసము కలుగవచ్చును. అయినను నీవు కృపచూపించుచున్నావు. అవిశ్వాసులు, విశ్వాసులు ఒక ప్రక్కమేలును, ఒకప్రక్క శిక్షను అనుభవించుచున్నారు. పాతనిబంధనలోని, క్రొత్తనిబంధనలోని ప్రవచనములు నెరవేర్పు జరుగుచున్నది. గుర్తులు నెరవేరుచున్నది. ప్రకటన గ్రంధ వివరము త్వరగా అచ్చు పడే కృప దయచేయుము. ||ఆమెన్||

వెయ్యేండ్ల శిక్ష:- వెయ్యేండ్లలో సాతాను బంధింపబడి యుండును. ఈ వెయ్యేండ్లు సాతానునకు కృపాకాలము. ఎందుకంటే బంధింపబడిన ఈ వెయ్యేండ్లలో సాతానుడు మారుమనస్సు పొందితే అదేరక్షణ. పరలోకములో దేవుని ఎదుట సాతానుడు ఒంటరిగా తాను చేసిన పాపమునకు పశ్చాతాపపడి ఒప్పుకొన్నట్లయితే దేవుని కృప కలుగును.

పాపములో అవిశ్వాసులకు, విశ్వాసులకు మొండివారికి, మంచివారికి అందరికి సువార్త ప్రకటింపబడుచున్నది. 20వ అధ్యాయములో సాతానునకు శిక్ష కనబడుచున్నది. అయితే వెయ్యేండ్ల పరిపాలన కాలములో దేవుని కృప ఉన్న సాతానుడు పొందనేరడు.

గాలి మరణము:- దేవుడు:- దేవుడు ఈలోకములో బహువేగమైన గాలిని రానిచ్చుటనుబట్టి మనుష్యులకు మరనము కలుగును. గాలి అనునది మనిషి ప్రాణమునకు ఆధారమైనది గాని నరుని అవిధేయత వలన ఇది జరిగెను.

కిరణము:- నరులైనవారు ఇంటిలోపల ఉన్నను సూర్యుని కిరణములను బట్టి మరణము సంభవించును. ఏడు సంవత్సరముల శ్రమకాలములో ఈ కిరణములకు ఎక్కువ శక్తి ఉండును. ఏడు సంవత్సరముల ముగింపు లోకచరిత్ర ముగింపు. అందరిని పాపములో పడవేసిన సాతానుడు ఒక్కడే మిగిలెను. ఈ 20వ అధ్యాయమనగానే సాతానునకు చాలా కష్టము. ఎవరు చదువకుండా ఎవరు వివరించకుండగా చేయవలెనని సాతానుడు యత్నించుచుండును. తక్కిన అధ్యాయములలో సాతానుయొక్క ఏజంట్లను గూర్చి వ్రాయబడినది గనుక అంతకోపములేకపోయిన 20వ అధ్యాయము చదివే వారిమీద, చెప్పెవారి మీద, వివరించే వారి మీద సాతాను నకుచాలా కోపము.

ప్రక 20:1 మరియు పెద్దసంకెళ్ళను చేతపట్టుకొని అగాధము యొక్క తాళపుచెవిగల ఒక దేవదూత పరలోకమునుండి దిగివచ్చుట చూచితిని.

మరియు అనగా తరువాత అని అర్ధము. పరలోకములో దేవదూతలున్నారు. దేవదూతవద్ద రెండు కనబడుచున్నవి.

  • 1. తాళపుచెవి
  • 2. సంకెళ్ళు
ఆ దేవదూత పరలోకమునుండి దిగివచ్చుచున్నట్లుగా యోహాను చూచెను. దేవదూతచేతిలో పెద్దసంకెళ్ళు ఉన్నవి. సైతానుడు తన ఏజంట్లకన్న పెద్ద వాడు గనుక దేవదూత పెద్దసంకెళ్ళతో వచ్చెను. సృష్టిలోని ఆదాము అవ్వలను కలుగ జేయక మునుపు సాతానుడు ప్రధాన దూతలలో ఒక దూత. ఈ ప్రధాన దూతయైన సాతానును పాతాళములో బంధించుటకు దేవదూత లైనవారు రారు. ఎందుకనగా దేవుడు దూతలను పంపరు. యూదా పత్రికలో సాతాను నకును మిఖాయేలు దేవదూతకును వివాదము ఏర్పడినప్పుడు మిఖాయేలునకు అధికారమున్నను సాతానును శిక్షింపక యెహోవ నిన్ను గద్దించును గాక అని పలికెను. ఈ వచనము నందు ప్రభువు తన స్వరూపము. నందు రాలేదు గాని దేదూత రూపముతో వచ్చెను. ఎందుకంటే సాతానుడు ప్రధాన దూత రూపములో నుండి సైతానుగా మారెను గనుక ప్రభువు తన దూతలను పంపలేదు.

ప్రభువు తన రూపముతో కాక దూతరూపముతో వచ్చుటకు కాణములు.

  • 1) ప్రధాన దూతరూపముతో నుండి సైతానుడుగా మారినారు గనుక.
  • 2) నరులను రక్షించుటకు నరుడైవచ్చెను.
  • 3) తీర్పు తీర్చు నప్పుడు నరుడుగానే వచ్చును.

అబిస్ అనగా పాతాళలోకము. ఈ లోకపు తాళపుచెవి దూతచేతిలో ఉండెను. పడిపోయిన ప్రధానదూత పాతాళలోకమందలి కటిక, చీకటి గల బిలములోనికి త్రోయబడి, బంధింపబడియున్నాడు. అప్పటి నుండి పాతాళ లోకపు యొక్క తలుపులు నేటివరకు మూయబడి యున్నవి. పాతాళలోకమున్నది. సాతానును బంధించే ఒక ప్రత్యేక భాగము పాతాళమందే ఉన్నది. అంతవరకు పాతాళపు తలుపులు తీయబడ్దవు అక్కడకు ఎవరును వెళ్ళలేరు. తీయలేరు. సాతానును సంకెళ్ళువేసి బంధించి మూసి ముద్ర వేయవలెను. అందుకుగాను.

  • 1) ప్రభువే వెళ్ళవలెను.
  • 2) ప్రభువే తీయవలెను.
  • 3) సైతానునకు సంకెళ్ళు వేయవలెను.
  • 4) సైతానును బంధించవలెను.
  • 5) సైతానుకు ముద్ర వేయవలెను.

సైతానునకు కలిగియున్న అంతస్థులు.

  • 1) దేవలోకపు వాడు,
  • 2) వాయు మండలపు వాడు.
  • 3) ఏడు యేండ్లలో భూమి మీదకు వచ్చువాడు,
  • 4) పాతాళలోకములోని వాడు,
  • 5) దిగుదల మట్టుగలవాడు,
విశ్వాసికైతే అన్నియు ఎక్కేమెట్లు. సాతానునకు అన్నియు దిగుదల మెట్లు.

ప్రభువునకు ఎంత విచారము? మహిమ సిం హాసనములో ఉన్న ప్రధాన దూత యైనవాడు పాతాళమునకు పంపబడి బంధించ్పబడియున్న వానికి ముద్ర వేయుటకు ప్రభువు దిగివచ్చుట చాలా విచారము. అయినను చేయక తప్పదు సృష్టిలో సాతానుడు ఏర్పాటగుటతోనే పాతాళముకూడ ఏర్పడినది. సాతానుని అచ్చట పెట్టవలెను. సైతాను అడుగు లోకములో ఉన్నను.

  • 1) దేవుడు ఉన్నాడని
  • 2) ప్రభువు సిలువ వేయబడినాడని
  • 3) తాను నరులను మోసము చేసినాడని,
  • 4) ప్రభువు తట్టు తిరిగిన రక్షింపగలడని.
  • 5. ప్రభువు రక్షకుడని సైతానునకు అన్నియు తెలుసును.
ప్రభువు లేనిదే రక్షణగాని, శిక్షగాని జరుగదు.

తాళపుచెవి:- ప్రభువు తాళమువేయుటకును, తీయుటకును అధికారము గలవాడు, మనుష్యకుమారునికి పరలోకములోను, నరలోకములోను సర్వాధికారము కలదు గనుక సర్వసృష్టికి మీరు సువార్త ప్రకటించుడి అని చెప్పెను. వీరికి రక్షించే అధికారము చూపించెను. క్రియలవల్ల, మాటలవల్ల ప్రభువు సాతానుపై జయము కలిగియుండెను.

మరణముయొక్కయు మృతులయొక్కయు తాళపుచెవులు నా స్వాధీనములో ఉన్నవని ప్రభువు చెప్పెను. ప్రక. 1:18. మరణము వేరు లోకమువేరు, సాతానునకున్న అధికారము, స్వతంత్రత తీసివేయబడెను. ఇదే సంకెళ్ళకు గుర్తు. వాయు మండల లోకములో సాతానునకున్న కొండంత స్వతంత్రత దేవుడు తీసివేసెను. సాతానుకున్న అంతాపోయినది. సంకెళ్ళు వచ్చినవి. ప్రభువు తాళపుచెవి అనే తన అధికారము ద్వారా సైతాను అధికారము తీసివేసెను.

  • 1) పరలోకము,
  • 2) వాయుమండలలోకము,
  • 3) భూలోకము.
  • 4) పాతాళలోకము.
పరలోకమునుండి సీసపు గుండు విడిచిపెట్టిన కోటి సంవత్సరములైన క్రిదకు దిగుచునేయుండును. దీనికే మట్టులేని గొయ్య అని అందురు.

సాతాను అగాధము

ప్రక. 20:2. అతడు ఆది సర్పమును అనగా సాతానును ఆ ఘటసర్పము పట్టుకొని వెయ్యి సంవత్సరము అగాధములో పడవేసెను.

సాతానునకు

  • 1. ఆది సర్పము
  • 2. అపవాది
  • 3. సాతాను
  • 4. ఘటసర్పము
  • 5. ద్రాగోను
  • 6. అపోల్లోను
  • 7. శోధకుడు
  • 8. లోకనాధుడు అనుపేర్లు గలవు.
ఇతనిని గోతిలో వేయుట మూతవేయబడుట ఎందుకు? ఎందుకంటే అతడు మరల రకూడదు. మరల రావాలనే తలంపు ఉండకూడదు. వాయు మండలములోనున్న అతనికి ఈ గతి పట్టినది. భూమండలములో నున్న అతనిగతి ఇదే, పాతాళములో ఉన్న వాడిగతి అంతే అని అందరికి తెలియబడుటకు మూతవేయబడెను.

  • 1. సాతానుడు భూలోకమందున్న అనేకమందిని పాతాళమునకు పంపినాడు గనుక వానిగతి పాతాళమే.
  • 2. భూలోకములో నరునికిని స్వతంత్రత ఉండగా దానిని పోగొట్టినది సాతానుడే గనుక వానికున్న స్వతంత్రత తీసివేయవలెను.
  • 3. సైతానువల్ల కృపాగుండము మూసివేయబడినది. గనుక వానిని పాతాళములో మూసివేసిరి.
  • 4. నరుడుగా వచ్చిన ప్రభువును సమాధిలో పెట్టించి మూతవేయించి ముద్రవేయించినది సాతానుడే గనుక ఇప్పుడు ఆ మూత ముద్ర ఇతనికి వచ్చెను.
  • 5. ఎవరినైన నిందించిన రేపు మనలను నిదింతురు. "ఎంచకురా ఎంచెదరు" ఇది తెలుగు సామెత.
  • 6. సైతాను తన అనుచరుడైన అంతి క్రీస్తుచేత తనను నమ్మినవారి నందరికి ముద్ర వేయించెను. గనుక ఇచ్చట అతనికి ముద్రవేయబడినది.

ప్రార్ధన:- దయగల తండ్రీ! ఈ పాఠమంతా ఒక పుస్తకముగా వ్రాయుటకు సహాయము దయచేయుము. ప్రకటన వ్రాయుటకు యోహానును దాని చెప్పుటకు భక్తులను తయారు చేసినావు. ఈవరండాలో మాట్లాడుకొన్న వివరము వ్రాయుటకు మాకును సహాయము చేయుమని ప్రభువుద్వారా వేడుకొనుచున్నాము. ||ఆమెన్||

సైతానునకు 1000 సం||లు బంధకము, ఈ వెయ్యి ఏండ్లు అతని చరిత్ర అంతా మట్టులేని గోతిలోనే. సాతానుడు గోతిలో ఉన్నాడు. కొన్ని సంగతులు తలంచుకొనుచున్నాడు.

  • 1. కొన్ని మంచి సంగతులు
  • 2. తాను చేసిన దుష్కార్యములు
  • 3. తన దుస్తితి జ్ఞాపకము చేసికొనుట.

  • 1. మంచి సంగతులు:-
    • (ఎ) నేను ఇదివరకు దేవదూతలలో దేవలోకములో సిం హాసనముమీద అధికారము కలిగియున్నాను.
      అయ్యో! ఇప్పుడు నేను పోగొట్టుకొన్నాను. నా తొటి దేవదూతలు ఎంతో సౌఖ్యము అనుభవించుచున్నారు.
    • (బి) దేవుడు నాతో స్వయముగా మాట్లాడేవాడు. నేనును మాట్లాడేవాడను. స్వయముగా నేను ఆయనను చూచేవాడను.
    • (సి) నేను మోసము చేసిన మానవులు మారుమనసు పొంది దేవలోకములో దూతల సౌఖ్యము అనుభవించుచున్నారు. అని ఈ రీతిగా మంచి సంగతులు జ్ఞాపకమునకు తెచ్చుకొనును.
  • 2. దుష్కార్యములు:-
    • 1) సాతానుడు చేసిన దుష్కార్యములకు లెక్కలేదు.
    • 2. మానవులను మొదటినుండి మోసపుచ్చుచుండెను గాని ఇప్పుడు మోసపుచ్చకుండగా బంధింపబడెను. దేవుడు చెప్పినదానికి అదికాదు అని చెప్పి మోసపుచ్చుటయే మోసము. అవ్వదగ్గరకు వచ్చి పండును దేవుడు తినవద్దని చెప్పినాడా? అని మోసపుచ్చెను.
  • 3. దుస్థితి మనుష్యులను ఏమి చేసెను. ? = మోసము చేసెను. ఇప్పుడు తానే మోసపొయెను. మోసగాడైన సాతానుడు మోసపోయెను. గొయ్యి అతనికి ఇల్లాయెను. తనకు ఎప్పుడు విడుదల కలుగును? వానికి తెలియదు.

ఉదా:- ఖైదులో వేయబడిన దోషికి ఇచ్చి నెలలు బంధకమని చెప్పిన సంతోషము. అలాగు చెప్పబడలేదు. వెయ్యి ఏండ్లు అని యోహాను వ్రాసెను గనుక మనకు తెలుసు.

సాతాను మారు మనస్సు పొందుటకు దేవుడు అనేక గడువులు ఇచ్చెను.

  • 1. వాయు మండల లోకములో మారుమనస్సు పొందవలెను
  • 2. తరువాత కాలమదైన మారు మనస్సు పొందవలెను.
  • 3. రేప్చర్ అయిన తరువాత అయిన మారుమనస్సు పొందవలెను.
  • 4. వెయ్యేండ్ల కాలమునందైన మారుమనస్సు పొందవలెను.
కాని మారుమనస్సు పొందలేదు. ఎందుకంటే సైతాను సిలువదగ్గరకు వచ్చిన సిగ్గు, సిలువదగ్గరకు వచ్చిన రక్షణ. సిలువ మనుష్యుల కొరకు చేయబడెను గాని నాకు కాదని సైతాను తలంచును. నేను, దూతను, మనుష్యులకటే ఎక్కువ వాడను అలాగు ఎక్కువ వాడనైన నేను ఎలాగు సిలువదగ్గరకు రాగాలనని సాతాను వెళ్ళలేదు. సిలువద్వారానే తప్ప వేరొక మార్గమున రక్షణలేదు. అది సైతానునకు ఇష్టములేదు. సైతానును ఎవరు మోసపుచ్చకుండగనే తనకుతానే పడెను గనుక అతనికి రక్షణలేదు.

  • 1. ఈ గొయ్యిలో సైతానునకు ఉత్తర ప్రత్యుత్తరములు నిలిచి పోయెను. వాయుమండల లోకములోనుండి దివారాత్రములు దేవునియొద్ద నరులపై నేరము మోపుచుండునని వాక్యములోగలదు. అక్కడ ఉత్తర ప్రత్యుత్తరములు కలవుగాని ఈగోతిలో లేవు.
  • 2. ఏడు ఏండ్లలో ప్రతినిధులు ఉన్నారు. ఈ భూమిని పరిపాలించనైయున్న అంతి క్రీస్తు సైతానునకు ప్రతినిధి. సాతానుడు సమస్తమును తన ప్రతినిధికి చెప్పుచుండువాడై యున్నాడు. ఆప్రకారముగా అతడు చేసేవాడు. ఇప్పుడు వారికిని తనకు మధ్య ఉన్న ఉత్తర ప్రత్యుత్తరములు కూడాలేవు దేవునితో పోయెను. తన ప్రతినిధితో కూడ పోయెను. సిలువ దగ్గరకు వెళ్ళుట అంటే సాతానునకు చాలా సిగ్గు.
    ఉదా:- గొప్పవారు చిన్నవారితో భోజనము చేయరు
  • 3. ప్రతినిధులు లేరు వారు అందరు ఎక్కడికి పోయిరో అని చూచెను.
  • 4. పోగుచేయుటకు ఎవరునులేరు.
  • 5. సైతానునకు తాను చేసిన పాపమునుగూర్చి చింతలేదు.
గనుక రాడు తేలిపోయెను. ఇందువలన మారుమనస్సు ఇకరాదు. మనుష్యులలో కూడ సిలువదగ్గరకు రానివారు పాపమంటే భయము లేనివారు. మారుమనస్సు పొందరు. సాతానుయొక్క అన్ని గుణములు మనుష్యులలోనికి వచ్చెను. దేవునితో మాట్లాడు పద్దతి మనిషికున్నది. దానినే ప్రార్ధన అందురు. దేవుడు మాట్లాడుత దీనికి నెరవేర్పైయున్నది. ఇది సాతానునకు కూడ కలదు. సాతానుడు మోసములో పడును. గోతిలోపడెను. అలాగే మనిషికూడ మోసములోను గోతిలోను పడును. తాను త్రవ్వుకొన్న గోతిలో తానేపడును. సాతానుడు దేవునికి, దూతలకు, మనుషులకు విరోధమైన పనులు చేసెను. సృష్టికి విరోధముగా పనిచేసెను తనకు తానే విరోధముగా పని చేసెను.

దేవుడు సాతానునకు అన్ని విషయములు తెలియనియ్యడు. తెలియజేయడు. పెండ్లికుమార్తెకు సంబంధించిన ఏవియు సైతానునకు తెలియజేయనియ్యడు. మనుష్యులలో కొందరు రక్షణ పొందవచ్చును. ఎవరు పొందుదురు ఎవరు పొందరో మనిషికి తెలియదు గనుక ఇతరులను గూర్చి ప్రార్ధింపవచ్చును. అయితే సాతానునుగూర్చి ప్రార్ధన చేయనక్కరలేదు. ఒక వేళ ప్రార్ధన చేసిన ఆ ప్రార్ధనయు ఆ సమయమును వ్యర్ధములగును. సాతానుడు ఆత్మ గనుక మనము చేయు పనులన్నిటిని, పాపములన్నిటికిని చూచును గనుక మనపై దేవునియొద్ద నేరములు మోపును. అయితే కొన్ని విషయములు సాతానునకు తెలియవు. పెండ్లికుమార్తె వరుసలోని కొందరు ఒక గదిలో కూర్చుండి ప్రభువుయొక్క సంగతులు మాట్లాడుకొందురు. అవి ఇతరులు ఎవ్వరికిని చెప్పరు. ఆ సంగతులు ప్రభువు సైతానునకు తెలియనివ్వరు. కొన్ని సంగతులు రక్షితులకు మాత్రమే తెలియబడవలెను. దయ్యములకు, మారుమనస్సు లేనివారికి, రక్షితులకు, కొద్ది సంగతులు తెలియబడవలెను. కొన్ని సంగతులు తెలియబడకూడదు. పెండ్లికుమారుడు త్వరగా వచ్చున్నాడు గనుక పెండ్లికుమార్తె త్వరగా తయారు కావలెనంటే ఆత్మను పొందవలెను.

ఈ సంగతులు

  • 1) రక్షితులకు
  • 2) నామక క్రైస్తవులకు
  • 3) మారుమనస్సులేనివారికి
  • 4) సువార్త విననివారికి చెప్పవచ్చును.
ఇవి చెప్పగల వారు ప్రపంచములో ఇంకా లేవలేదు. వినువారు నమ్మనక్క్రలేదు. తెలియజేయవలెను. వారికి చెప్పుచు ఉంటే సిద్ధపడుటకు సమయము ఉండదు. గనుక పెండ్లికుమార్తె అనేక విషయములు రహస్యముగా చెప్పుకొనును.

రక్షణ సంకల్పన నేర్చుకొన్నవారు ప్రకటన గ్రంధ వివరము నేర్చుకొన్నవారు ఇవి అన్నియు పొందగలరు. వీరు ఆ నాలుగు గుంపులవారికి చెప్పగలరు గనుక రహస్యకూటములు పెట్టుకొనుచున్నారు. పెండ్లికుమర్తె కూటములు ఇంకను రాలేదు. ఆ వరుసలోనివారు రాలేదు. ఆ కూటములు చూడవలెనని ఇతరులువచ్చినను నిలువలేరు. వెళ్ళిపోవుదురు. పై రెండు బోధలు నేర్చుకొని అనగా రక్షణ సంకల్పన, ప్రకటన ఇతరులకు చెప్పి పెండ్లికుమార్తె కూటములోనికి తయారు కావలెను. పెండ్లికుమార్తె కూటము జరుగుచున్నదని మనుష్యులకు తెలియదు సైతానుకు అంతకంటే తెలియదు. ప్రభువు ఈ రహస్య కూటములు లోకములో ఉన్నదని ఒకవేళ ఇతరులకు చెప్పినవరు రాలేరు.

ప్రక 20:4 అంతట సిం హసనములు చూచితిని. వాటిమీద ఆసీనులైయుండువారికి విమర్శ చేయుటకు అధికారమియ్యబడెను.

  • 1. ప్రభువు వచ్చినపుడు మేఘమునకు ఎక్కి వెళ్ళేవారు ఉందురు.
  • 2. మిగిలిపోయేవారు కొందరుందురు.
  • 3. ఏడు సంవత్సరములు పరలోకములో విందు జరుగును.
  • 4. ఏడు ఏండ్లలో భూలోకములో శ్రమలనే విందు జరుగును.
  • 5. వెయ్యేండ్ల పాలనలో క్రీస్తు ప్రభువు వచ్చి భూలోకమందు రాజ్యమేలును. ఇందులో అన్యజనులు, భక్తులుకూడా ఉందురు.
  • 6. పెండ్లికుమార్తె పరలోకమునుండి దిగివచ్చును.
  • 7. భూలోకమందు పెండ్లికుమార్తె బోధచేయుచుండగా భూలోకమందున్న భక్తులు పాటలు పాడి సహాయము చేయుదురు.
  • 8. వెయ్యేండ్లలో మూడురకములైన ప్రజలు ఉందురు. ప్రభువు పెండ్లికుమార్తె, భూలోక భక్తులు, అన్యులు ఉందురు. పెండ్లికుమార్తె బోధ చేసి ఆయా సమయములలో పరలోకమునకు వెళ్ళుచుండును.
  • 9. ప్రభువు చుట్టు పెండ్లికుమార్తె తన సిం హాసనముపై యుండును.
  • 10. పగలు, రాత్రి ఉండదు. అంతా పగలుగానే ఉండును.
  • 11. బోధచేసి పెండ్లికుమార్తెను బోధ సమయములో పట్టుకొనప్రయత్నించిన వారు ఎగిరి వెళ్ళిపోవుదురు. ఎందుకనగా వీరు పాపములు లేని వారు.
  • 12. అలసటలేదు, జబ్బులులేవు, నిద్రలేదు.
  • 13. పెండ్లికుమార్తెకు ప్రయాణ సాధనములగు రైళ్ళు, కార్లు, విమానములు ఏదియు అక్కరలేదు.
  • 14. వెయ్యేండ్లలో మహిమ జీవులుగా ఉందురుగనుక యెగరగలరు.
  • 15. ప్రకటనలో పై సంగతులన్ని యున్నవి ఈ గ్రంధము యెరచూపుచున్న గ్రంధము.
  • 16. కౄరమృగములు, సాధు జంతువులు, పాములు, పురుగులు, విషము, కరువు, యుద్ధము, కలహాలు, చావు, జబ్బులు ఉండవు.
  • 17. అన్యులు కొన్ని వందల సంవత్సరములు జీవించుదురు ఇది ఎంత గొప్ప సంగతి.

భాగ్యము, ఎంత గొప్ప రాజ భోగము, ఎంత గొప్ప సౌఖ్యము, అయితే పాపముచేసి త్రాగి, విగ్రహారధనచేసి, అబద్ధములు పలికిన వెయ్యి సంవత్సరములు బ్రతుక లేరు.

సాత్వికులు ధన్యులు వారు భూమిని స్వతత్రించు కొందురు.

ఈ వచనము వెయ్యేండ్ల కాలములో నెరవేరును. యేసుప్రభువు ఏవిధముగా భూమిమీద పంచి ఇచ్చెనో అలాగుననే వెయ్యేండ్లలో కూడ భూస్వాస్థ్యమును పంచి ఇచ్చును. పెండ్లికుమార్తె వరుసలో ఉన్నవారికి ఒక్కొక్కరికి ఎంత పంచి ఇచ్చునో అంతవరకే సువార్తపని చేయవలెను. ఇంగ్లాండులోని అధికారి ఏరీతిగా ఈ దేశములోనికి రాడో అట్టి నియమము వెయ్యేండ్లలో కూడ నుండును.

పెండ్లికుమార్తెకున్న అంతస్థులు :- ప్రభువు సిం హాసనముపైన చుట్టు ఏడు సంఘములుండును. ఈ ఏడు సంఘములను కలిపిన పెండ్లికుమార్తె సంఘమగును. ఈ ఏడు సంఘములు కలిసి యేక సంఘము. అంతస్థులో బేధముండును. ఈ ఏడు సంఘములు కలిసి భూమిమీద ఒకట్తై ఒక వరమును సంపాదించిరి. అవరమే పెండ్లికుమార్తెగా ఉండే వరము. రక్షితుల మోక్షములోనివారు, పరదైసులోనివారు భూలోక రక్షితులైనవారికి రక్షణ స్థితి మాత్రమే ఉండును. గాని ఈ ఏడు సంఘములు మహిమ స్థితిని సంపాదించుకొనును. పెండ్లికుమార్తెకు -

  • 1. మహిమస్థితి
  • 2. సిం హాసన స్థితి
  • 3. సహవాస స్థితి
  • 4. మహోన్నత స్థితి మున్నగు స్థితులను సంపాదించుకొనెను.
పెండ్లికుమార్తెకు ఏడుమెట్లు గలవు. ఏడు సంఘములు ఏడు మెట్లు. భూమి మీద సుఖభోగములు సౌఖ్యములు ఉండును. సంపాదన ఇక్కడ వరము పరలోకములో. లోకములోని, పిశాచి, ఆపదలు, ధనము, చిక్కులు, వీటితో నిమిత్తము లేకుండా ఉండే అంతస్థు వచ్చును.

  • 1. పెండ్లికుమార్తెగా తయారగుట ఒక వరము.
  • 2. తయారైన తరువాత ఆరోహణ వరము
  • 3. ఆరోహణమైన తరువాత స్తవరము.

భూమిని స్వతంత్రించుకొని ఏలుడని ఆదికామడములో దేవుడు ఆదాము అవ్వలను ఏలుబడిగా చేసెను. ఏలికలైన ఆదాము అవ్వలు ఏలుబడి చేయలేకపోయిరి. గనుక ఆఏలుబడియే వెయ్యేండ్లకాలములో భూమిని శుద్ధిచేసి యేలండని ఇనుప దండమిచ్చి పెండ్లికుమార్తె ద్వారా ప్రభువు ఏలుబడి చేయించును. మీరు సర్వరాష్ట్రములకు వెళ్ళి నా సువార్త ప్రకటించుడని ప్రభువు తన శిష్యులకు ఆజ్ఞాపించెను. నేను భూమిని కలుగజేసియున్నాను. ఇప్పుడు వెయ్యేండ్లలో సువార్త ప్రకటించుడని ప్రభువు పెండ్లికుమార్తెకు చెప్పెను. ఈ సంగతులు మరచి పోకూడదు.

భూమిమీద సువార్త ప్రకటించుటకు ఇప్పుడు అన్ని ఆటంకములే. ఇపూడు ఉన్న ఈ ఆటంకములు వెయ్యేండ్లలో ఉండదు. ఏదేను తోటలో ఏమి పోగొట్టుకొన్నామో అవి అన్నియు మరలా పొందుదుము. క్రీస్తు ప్రభువునకు పాలస్తీనా దేశములో రాజకుమారుడని పేరు ఉన్నది.

యేసు ప్రభువు చెప్పిన ఉపమానములో పది మీనా, ఐదు మీనాలు, ఒక మీనాలు ఉన్నది. పది మీనాలు అనగా పది పట్టణముల మీద అధికారి. ఐదు మీనాలు అనగా ఐదు పట్టణములమీద అధికారి. ఒక మీనలు అనగా ఒక పట్టణముమీద అధికారి. ఈలోకములో ఎంత సాత్వికముతో ఉందురో అలాగ వెయ్యేండ్లలో అంతస్థులను బట్టి పట్టణములపై దేవుడు అధికారిగా నియమించెను. మనలో సాత్వికమున్నదా? క్రైస్తవులలో సాత్వికులు ఉన్నారా?

  • 1. రక్షితులలో
  • 2. పరదైసులో
  • 3. భూలోకములో
పది పట్టణములు ఏలునట్టి సాత్వికమును సంపాదిచుకొనండి. పది అంటే సంపూర్ణము, ఐదు అంటే అసంపూర్ణము. ప్రభువా నన్ను ఏదేశమునకు పంపుదువు? ఏ జిల్లాకు పంపుదువు ? అని ప్రభువును కనుగొనవలెను. మనము ఇక్కడ సంపాదించుకొన్న ప్రభువు వెయ్యేండ్లలో ఇచ్చును. వెయ్యేండ్ల పరిపాలనలో టిబెట్టులోనో, ఏ ఇంగ్లాండులోనో ప్రభువు మనకొరకు సిద్ధపర్చును. ప్రభువునడిగి తెలిసికొందాము. అడిగిన ప్రభువు చెప్పును. ఆ కాలములో నేర్చుకొనకుండనే ఏ భాష మాట్లాడవలెనో ఆ భాషావరము దేవుడు మనకిచ్చును. అందరు నుతన యెరూషలేములోఉందురు.
  • 1. భాషా బేధము
  • 2. దేశబేధము ఇవి ఉండవు.
అప్పుడు మనస్సాక్షి నీడ జవాబిచ్చును. అప్పుడు పది పట్టణములు యేలే సాత్వికము, ఐదు పట్టాణములు యేలే సాత్వికము అని జ్ఞాపకము తెచ్చుకో అని మనస్సాక్షి జ్ఞాపకముచేయును. వెయ్యేండ్ల పాలనలో స్వాతంత్రియ ముండును. భూలోకములో నుండువారు ఏ రీతిగా అన్నము, పండ్లు తిందురో అదే రీతిగా మనమును తిందుము. ఆ కాలములో ఏదైనన ఊరు వెళ్ళినప్పుడు మన బంధువులు మనలను చూచి దేవతలు వచ్చుచున్నారని తలుపులు మీసికొందురు. అప్పుడు తలుపు వేసియున్నను మనము లోఅపలికి వెళ్ళగలము. వారు భోజనమునకు కూర్చున్న పంక్తిలో మనమును కూర్చుండగలము. భోజనము తింటూ దిగబెట్టి వెళ్ళిపోగలము. ఆ కాలమందున్న పెండ్లికుమార్తె వరుసలోని వారికి ఆహారము అక్కరలేదు. బంధువులను సంతోషపెట్టుటకు పంకిలో కూర్చుందురేగాని వారికి అసలు ఆహారము అక్కరలేదు. పాత నిబంధన కాలములో అబ్రహాము దగ్గరకు దూతలు వచ్చి భుజించిరి కదా! ఇట్టి ఈ గొప్ప ధన్యత పోగొట్టుకొనకండి. మారు మనస్సు పొంది ఇట్టి గొప్ప ధన్యత సంపాదించుకొనండి.

పెండ్లికుమార్తె పది పట్టణములు యేలు రాజులు, వీరు సువార్తికులు స్వతంత్రులు. అదే గాక ఆరాధికులై యుందురు. ఇప్పుడు ఆదివార ఆరాధన ఆలయములో జరుగుచున్నది. గాని అసలైన ఆరాధన జరుగవలసి యున్నది. ఈ ఆరాధన కొట్టివేసి వెయ్యేండ్ల పరిపాలనలో అద్భుతమైన ఆరాధన జరిగింపబడును. మనము రేప్చర్నకు ముందు ఉన్నాము గనుక ఇట్టి అద్భుతమైన ఆరాధన మనము జరిగించలేము.

భూలోక ఆరాధన మారుమనస్సు లేనివారికి. పరలోక ఆరాధన, పెండ్లికుమార్తె చేయునది.ఇదే వెయ్యేండ్ల పరిపాలనలోని ఆరాధన. ఈ ఆరాధన యెరూషలేములో జరుగును. ఈ ఆరాధనలో ప్రసంగము ప్రభువు చేయును. ప్రభువు ప్రసంగము వినుటకు భూది గంతములనుండి ప్రజలు వచ్చి వినిపోవుదురు. పాతనిబంధనలో ఒక నియమమున్నది. ఏడవ దినమైన శనివారము ఆరాధన దినము. క్రొత్త నిబంధన విశ్వాసులకు మొదటి దినమైన ఆది వారము ఆరాధన దినమైనది. పెండ్లికుమార్తెకు ఆరాధన దినము శని వారము కాదు, ఆదివారము కాదు, సత్య ఆరాధన, నిత్య ఆరాధన, అద్భుతమైన ఆరాధన ఉండును. ఇట్టి ఆరాధననుబట్టి ఏమని ప్రార్ధింతుము, ఏమని పాడుదుము. ఏమని స్తుతించగలము. ఇది గొప సంతోషము.

సూర్యభూమిని ప్రభువు పండెండు పాళ్ళుచేసి పండ్రెండు గోత్రములకు ఇచ్చును కొందరికి గుంటూరు, కొందరికి పాలస్తీనా కొందరికి అరేబియా దేశములు ఇచ్చును.

ఇంతకు ముందే పెండ్లికుమార్తె ఏడు భాగములు ఏడంతస్థులని చదివిన్నము. అయితే వీరు పన్నెండు గోత్రములుగా విభాగింప బడిరి. పెండ్లికుమార్తె పరలోకములో ఏడు అంతస్థులలో ఉండును. అందు ఆఖరు అంతస్థు లవొదికయ. భూమి మీదకు పన్నెండు గోత్రములుగా వచ్చిన వీరు ఏడు అంతస్థులవారై యున్నారు. భూమిని పండ్రెండు భాగములుగా చేసినప్పుడు ఏడుభాగములనుకూడా పండేండు భాగములుగా మార్చవలెను. స్త్రీలు, పురుషులు, పిల్లలు అందరు వరుసలో ఉన్నప్పుడు ఒకటే వరుస యగును. వేరువేరుగా పిలిచినప్పుడు ఊళ్ళవారిగా వచ్చెదరు. ఆ మొదట ఒకేవరుసలో వచ్చినవారే ఇప్పుడు వేరువ్రేరు వరుసలుగా వచ్చిరి. అలాగే పెండ్లికుమార్తె ఏడు వరుసలలోని వారిని గోత్రములుగా పిలిచినప్పుడు పండెండు గోత్రములుగా వచ్చెదరు.

ఇప్పుడు ఈలోకములోని విశ్వాసులైనవారు తమకు తెలియకుండా ఏవో ఒక గోత్రములో తయారగుచున్నారు. ఊదావలె నడిచేవారు ఊదాగోత్రమునకు సంబంధించియుందురు. ఊదా చరిత్ర అంతయు కూడా చదువవలెను. అలాగే ప్రతి గోత్రమును గూర్చి కుడా చదువవలెను. యూదా చరిత్రలో పాపచరిత్ర పరిశుద్ధ చరిత్ర ఉన్నది. పాపచరిత్రను విడిచిపెట్టి పరిశుద్ధ చరిత్రను చదువవలెను. ఆ పరిశుద్ధ చరిత్ర మనలో ఉన్నదోలేదో తెలిసికొనవలెను. ప్రతి గోత్రములో నున్న పరిశుద్ధ చరిత్రను చదివినప్పుడు ఆ చరిత్రలో ఉన్న పరిశుద్ధ గుణము మనలో ఉండునో లేదో చూచుకొనవలెను. ఏ గోత్రమునకు కూడ మనము చెందనట్లైతే హేడెస్సే మనకు గతి.

ఏడు సంఘముల చరిత్ర:- ఏడు సంఘములలో ఎఫెసు సంఘమున్నది. ఆ సంఘములో ఉన్న పాప చరిత్ర విడిచిపెట్టి పరిశుద్ధచరిత్ర ఈసుకొనవలెను. అలాగే ప్రతి సంఘముగూర్చి చదువవలెను. అప్పుడు మనలో ఏస్థితి ఉన్నదో దానినిబట్టి మనము ఆసంఘమునకు సంబంధించినవారమని తెలుసుకొనవచ్చును. ఈలాగు మనము ఏ గోత్రములోనివారమో ఏ సంఘములోనివారమో తేటగా తెలియును. సంఘములోను , గోత్రములోను మనము చేరక ఉన్నట్లయితే మనము పాపములో పడి నరకమునకు చేరుదుము. అప్పుడు హెడెస్సులోను గోగు మాగోగు మేకల వరుసలోనికి వెళ్ళిపోదురు.

నూతన యెరూషలేమునందు పండెరండు పునాదులు, పండ్రెండు ద్వారములున్నవి. ఇచ్చట పండెండు మంది అపోస్తలులు, పండ్రెండు మంది గోత్ర కర్తలు ఉందురు. పునాదులుపై శిష్యుల పేర్లను, ద్వారములపై గోత్రకర్తలు ఉందురు. పునాదులపై శిష్యుల పేర్లును, ద్వారములపై గోత్రకర్తల పేర్లును ఉండెను. ఇవి పేర్లేగాని ఆ మనుష్యులు కారు. ఏడు సంఘముల పేర్లు ఉన్నవి గాని అవి సంఘములు కావు.

పన్నెండుమంది శిష్యుల పేర్లుపెట్టి క్రొత్త నిబంధన సంఘపేర్లువేసిరి. ఈ సంఘమునకు అనగా పెండ్లికుమార్తె సంఘమునకు ద్వారములు పన్నెండుమంది గోత్ర కర్తలు.

రేప్చర్:-
  • (1) రెండవ రాకడ వరుసకు తయారైనవారు.
  • (2) రక్షితుల మోక్షములో తయారైనవారు
  • (3) పెండ్లికుమార్తె వరుసలో తయారై వెళ్ళినవారు.

భూమిమీద మిగిలిపోయి నిలిచియుండు వారు ఏడు సంవత్సరముల శ్రమకాలములో మారు మనస్సు పొంది భూమిపై ఉండిపోయినవారు ఉన్నవారు వీరుకూడ రక్షితులే. ఈ భూలోకము మోక్షమే. ఏడు సంవత్సరముల శ్రమకాలములో మారుమనస్సు పొంది చంపబడినవారు రక్షితుల మోక్షములో ఉందురు.

  • 1. శ్రమకాల భక్తులు
  • 2. శ్రమకాల పరిశుద్ధులు
  • 3. శ్రమకాల రక్షితులు.
  • 4. శ్రమకాల భూలోకనివాసులు.
చనిపోయినపిదప హర్మగెద్దోను యుద్ధమునకు ముందు వీరు దాచబడినవారు. వీరు వెయ్యేండ్ల పరిపాలనలో ఉండేవారై యుందురు.
  • 1. ముద్ర
  • 2. బూర
  • 3. పాత్రలకాలము
అను ఈ మూడుకాలముల యందును. చివరి రెండు కాలములలో వీరు మారుమనస్సు పొందినవారు. వీరే వెయ్యేండ్ల పరిపాలనకాలములో ఉందురు. బూర్ల, పాత్రల కాలములో భూమియందు అంతట ఒక కేక వినబడును. ఎవరైతే అంతిక్రీస్తు ముద్రయైన 666 అను ముద్ర నొసటిమీద, చేతిమీద వేసికొందురో వారిని నేను ఏమి చేయను అని అంతిక్రీస్తు తెలియజేయుచున్నాడని అబద్ధ ప్రవక్త ప్రకటించును. కొందరు తమ చేతిని, నొసటిని అంతిక్రీస్తునకు అప్పగింతురు. కొందరు భక్తులైతే ముద్రవేసికొనవద్దని ప్రజలకు ధైర్యము చెప్పుచుందురు. ఒక ఇంటిలోని కొందరు వేయించుకొందురు, కొందరు వేయించుకొనరు.

బూరల, పాత్రల కాలములోని భక్తులు దేవుని ముద్రవేసికొనండి అని ప్రజలకు బోధించెదర్. అట్టివారు రక్షింపబడెదరు. అంతి క్రీస్తు ముద్రవేసి కొననివారు ఈ ముద్ర వేసికొందురు. వీరు రక్షింపబడేవరకు హర్మగెద్దోను యుద్ధమురాదు. అంతిక్రీస్తు ముద్రవేసికొననివారు హర్మగెద్దోను యుద్ధము నందు అంతిక్రీస్తు సైన్యములో నుందురు. అప్పుడు ఒలీవకొండ నెరవిడిచి రెండు పాయలుగా చీలును. భక్తులు లోపలికి వెళ్ళుదురు, క్రీస్తు పటాలము, అంతిక్రీస్తు పటాలమునకును యుద్ధము జరుగును. అప్పుడు అంతిక్రీస్తుపటాలము నాశనమగును. కొండపాయలో దాగిన భక్తులు బయటకు వచ్చెదరు. అంతట భూమి శుద్ధిచేయబడును. పరలోకమందున్న పెండ్లికుమార్తె భూలోకమునకు దిగి వచ్చెను. పెండ్లికుమార్తెయు భూలోక భక్తులు కలిసికొని సంతోషముతో పనిచేయుదురు.

  • 1. పెండ్లి కుమార్తె వరుసలో మిగిలినవారు ఉందురు.
  • 2. యుద్ధములో మిగిలినవారు ఉందురు.
  • 3. ఏడు సంవత్సరముల శ్రమకాలములో మిగిలిపోయినవారు ఉందురు.

అట్టివారిని వెయ్యేండ్లపాలనలో ప్రభువు చేర్చుకొనును. మిగిలిన జనాంగమును చూచిన ప్రభువు మీరును వెయ్యేడ్ల పాలనలోనికి రండి భక్తులకువలె మీకును భోజన సదుపాయముల్ ఉండును. ఈ లోకమందున్న క్రూర జంతువులు మిమ్మునేమి చేయనేరవు మీరు మారుమనస్సు పొందుడి. అంతిక్రీస్తు సైన్యములో మీరు చేరలేదు గనుక మీకు ఈ అవకాశము కలిగినది. రేప్చర్కు ముందు మారుమనస్సు పొందలేదు గనుక ఇప్పుడైనా పొందండని తెలియజేయును.

  • 1) రేప్చర్ కాలములో
  • 2) ముద్రల కాలములో
  • 3) బూరల కాలములో
  • 4) పాత్రల కాలములో

ఈ నాలుగు కాలములలోను మనుష్యులు మిగులుచునేయుందురు.

  • 1) రేప్చర్ కాలమునకు ముందు
  • 2) ముద్రల కాలములో
  • 3) బూరల కాలములో
  • 4) పాత్రల కాలములో
  • 5) హర్మగెద్దోను యుద్ధకాలములోని

వీరికి ప్రభువు తన ఆదరణ విసెనకర్ర అన్ని కాలములో విసురుచునుండును. ప్రభువా మేము ఎంత చెప్పిన మారుమనస్సు పొందుటలేదని విసుగుకొనేవారు ఉందురు,

మూడు రకములైన విసెన కర్రలు ఉన్నవి.

  • 1) వాక్యము వినువారికి విసురునది
  • 2) విని మారుమనస్సు పొందని భక్తిహీనులకు విసురునది.
  • 3) భక్తులకు విసురునది.

రెండవ తరగతిలో శ్రమకాల భక్తులుందురు. వీరికి వ్య్యేండ్ల పరిపాలన కాలములో శ్రమలుండవు.

  • 1) పెండ్లికుమార్తెకు యాజకులు అనే బిరుదు ఉన్నది.
  • 2) శ్రమకాల భక్తులకు లేవీయులనే బిరుదు ఉన్నది.
ఇది యెషయాలో ఉన్నది. పెండ్లి కుమార్తె వెళ్ళకమునుపు ఇప్పుడున్న శ్రమలు దాటి ఏడుఏడు సంవత్సరము శ్రమలు దాటివచ్చి వెయ్యేండ్ల పాలనలోకి వచ్చినాము గనుక వీరికి లేవీయులని బిరుదు వచ్చినది. యూదులలో యాజకులు, లేవీయులైన వారు ఉన్నారు.

ఇది వీరికి శాశ్వతమైన నామముకాఫు. ఈ నామము వెయ్యేండ్ల పరిపాలన కాలమువరకె ఉండును. శ్రమలన్నీ దాటుకొని వెళ్ళిరి. గనుక వీరికి గొప సంతోషము కలిగినది. (యెషయా 66:21) యూదులు అన్యులు కలిసి సంఘమైనారు. వెరే పెండ్లికుమార్తె వరుసలోనివారు ఏడుసంవత్సరాల శ్రమలలో మార్పుచెంది వెయ్యేండ్ల పరిపాలనలోనికి వెళ్ళేవారు పెద్ద గుంపే. ఇది చూచిన యోహాను లెక్కపెట్టలేక కోట్లాదికొలది అని వ్రాసెను. అంతమట్టుకే మనిషి లెక్కపెట్ట గలిగెను. ఇంకా లెక్క ఉన్నది గాని అది దేవదూత లెక్కించవలెను.

కాలములు మూడు

  • 1 ) రక్షణ కాలము
  • 2) ఏడు సంవత్సరముల శ్రమకాలము
  • 3) వెయ్యేండ్ల పరిపాలన కాలము
ఈ మూడు కాలములు అందరికి చెందెను. గాని రేప్చర్ క్రైస్తవులలోని నిఖారసైన వారికి మాత్రమే చెందెను.

ఆదాము మొదలుకొని మన కాలమువరకు ఒకప్రక్క సంఘమును మరొక ప్రక్క సంఘములోని పెండ్లికుమార్తెయు సిద్ధమగుచున్నది. ప్రపంచములో అన్ని దేశములందు అన్యులున్నారు. సంఘములమధ్య పెండిలికుమార్తె ఉన్నది. అందరిలో తయారగుచున్న పెండ్లికుమార్తెను వెదకి బయటకు తీయవలెను. ఇది ఏలాగు సంభవించును ? మనము పెండ్లికుమార్తెగ తయారగుచున్నామా లేక అన్యులలో ఉన్నామా అని పరీక్షించు కొనగలిగితే తెలియును. ఆ నిశ్చయత ఉన్నవారే పెండ్లికుమార్తె వరుసలోనివారు . చెప్పబడుచున్న ఇందలి పాఠములను వినుటయే పరీక్షించుకొనుట.మనము పెండ్లికుమార్తె ఎచ్చట ఉండునో పరీక్షింపలేము. అది ప్రభువే కనుగొనును.

లోకములోని కోట్లకొలది ప్రజలు నేను పెండ్లికుమార్తె వరుసకు తయారైయున్నాను గాని నన్ను ఎందుకు తీసుకొని వెళ్ళలేదని ప్రభుని ప్రశ్నించెదరు. రెండవ రాకడలో ప్రభువు మేఘముమీదకు వచ్చి భూమిపై సిద్ధపడిన పెండ్లికుమార్తెను ఆకర్షించును. అప్పుడు పెండ్లికుమార్తె మేఘము పైకి ఎగిరి వెళ్ళును. ఎవరి మనస్సును వారు పరీక్షించుకొన్న మన జ్ఞానమునకు తట్టును. అది మన ప్రభువునకే తెలియును.

  • 1) పెండ్లికుమార్తె తనకు తెలిసినంతమట్టుకు సిద్ధపడును.
  • 2) తెలియనిది ప్రభువే సిద్దము చేయును.

కొందరు రేప్చర్ నకు ఏడు సంవత్సరముల శ్రమలలో వెయ్యేండ్ల పరిపాలనలో తయారు కాగలరు. మనము ఇప్పుడు మరణమునకు లేక రేపు రేప్చర్ కు యెల్లుండి శ్రమకాలమునకు ఆవలి యెల్లుండి వెయ్యేండ్ల పరిపాలనకు సిద్ధపడుచున్నాము.

  • 1) మన కాలము సంఘ కాలము
  • 2) ఏడు సంవత్సరముల కాలము రాజ్యకాలము.

శ్రమలు వచ్చును అన్నియు జరుగును. రాజ్య సువార్త జరుగనిదే అంతము రాదు. సంఘ సువార్త రాజ్య సువార్త కలిసిన సువార్త అగును.

ఏడు సంవత్సరముల పరిపాలన, వెయ్యేండ్ల పరిపాలన అనునవి లేదని కొందరి అభిప్రాయము

బైబిలు గ్రంధమంతట ప్రకటన 4వ అధ్యాయము అంతట మిక్కిలి శ్రేష్టమైనది. ఇంతకన్న ముఖ్యమైన అధ్యాయము మరొకటి దొరకదు. రేప్చ లో ఎత్తబడేవారు ఇప్పుడు లోకమందు ఉన్నారు. ఏడు సంవత్సరముల పాలనలో వచ్చెదరు. వెయ్యేండ్ల పాలనలో వచ్చెదరు. వెయ్యేండ్ల పెండ్లికుమార్తె ఎచ్చ్ట ఉన్నదో అని ప్రభువే స్వయముగా వచ్చి ఈ సంతలో కనుగొనవలెను.

  • 1) సంఘ కాలము
  • 2) రేప్చర్ కాలము
  • 3) ఏడేండ్ల పరిపాలనకాలము
  • 4) వెయ్యేండ్ల పరిపాలనా కాలము

పైన ఉన్న ఈ కాలముల అన్నిటిలో గడువుల కాలమున్నది. వెయ్యేడ్ల పాలనలో కూడా గడువు కాలమున్నది. ఈ కాలములలో మిక్కిలి కఠినాత్ములు ఉందురు. పరలోక భక్తులు వచ్చిన అది రాజ్య పరిపాలన కాలము.

  • 1) సంఘ కాలము
  • 2) రేప్చర్ కాలము
  • 3) ఏడు సంవత్సరముల పాలన కాలము
  • 4) హర్మగెద్దోను కాలము

ఈ నలుగు కాలములలో మారని మిక్కిలి కఠినులు ఉందురు.

వెయ్యేండ్లలో గడువులు-
  • 1. పెండ్లికుమార్తె ఈ కాలమందు సువార్త ప్రకటించును.
  • సైతాను అంతిక్రీస్తు, అబద్ధ ప్రవక్త వంటి శోధకులు ఉండరు
  • 3. సాతానుడు లేడు.
పెండ్లికుమార్తె బోధవిని మేము మారు మనస్సు పొందగలమని తిరుగుచు ఉందురు. అట్టివారు శిష్యులు మేడగది మీద పొందినటువంటి పరిశుద్ధాత్మ పొందుదురు.

సమాన పంక్తి:- ప్రభువు పాపులతో కలిసి భోజనము చేసినట్లు వెయ్యేండ్ల పాలనలో భక్తిహీనులు భక్తులలో కలిసి సమానముగా భోజన పంకిని కూర్చుందురు. గనుక గడువుఒకటే కాని భాగములు నాలుగు. యుద్ధ కాలమదు దేవుడు పెండ్లికుమార్తెను సిద్ధపర్చును. సంఘము, రేప్చర్, ఏడు ఏండ్ల శ్రమకాలము వెయ్యేండ్ల పాలన ఈ నాలుగు కొందరు ఒప్పుకొనరు.

గెహన్న:- యెరుషలేము తలంచుకొండి దాని దాపులో ఒక గొయ్యి ఉన్నది. అది మలిన గొయ్యి, దానిలో పట్టణములోని తుక్కు అంతయు వేసెదరు. దానిని అప్పుడప్పుడు అగ్గివేసి కాల్చెదరు ఆ అగ్గి ఆరిపోదు. దాని పేరే గెహన్న. ఇట్టి గొయ్యి వెయ్యేండ్లలో కూడ ఉండును. ఆ గొయ్యిలో ఏడు సంవత్సరముల శ్రమలకాలములో మారుమనస్సు పొందనివారి కళేబరము లుండును.

ఆ కళేబరము కృళ్ళి పురుగులతో నుండును. ఆ పురుగులు చావవు ఆ గొయ్యిలోని అగ్ని ఆరిపోదు, అందుకే పురుగుచావదు. అగ్ని ఆరదని ప్రభువు పలికిరి. ఈ వెయ్యేండ్లలోని ఈ గెహన్నకు యెరుషలేము గెహన్నకు ముంగుర్తైయున్నది, ఈ లోకమందు మారు మనస్సు పొందకపోతే అట్టివారికి గెహన్న తప్పదు. ఇవన్నియు మనుష్యులు మరు మనస్సు పొందుటకు ఇవన్నియు గడువులు.

ఉదా:- ఒక కేటగిష్టు ఒక పంతులుగారిని చూచి ఒక పెద్ద నిప్పుల గుండము చూపించి ఇది యెవరికిని అడిగెను. అప్పుడు ఆ పంతులుగారు ఇది మన ఇరువురికి అని అనెను. దేవుడు ఇచ్చిన గడువులు అనేకములు మారు మనస్సు పొందకున్న దానికి కారణము మన నైజము.

నైజము:- ఒక మనిషి పది రూపాయలకు పండ్లు కొని ఇంకా రెండు రూపాయలు సంపదించెను అతడు ఖర్చు పెట్టినది పదిరూపాయలు సంపాదించినది రెండు రూపాయలు. ఆ రీతిగానే సైతానువల్ల కొన్ని తానే స్వయముగా గడించినది కొన్ని దుర్గుణాలే నైజము. అసలు సైతాననునది వడ్డి. పాయిదాలు మనిషివి.

నైజములు రెండు-
  • 1) వంశములో నుండి వచ్చే నైజము
  • 2) మనిషిలోనే పుట్టు నైజము (దుష్టనైజము)

పరలోకములో భక్తులున్నారు అలాగే భూలోకములో శ్రేష్టులైన భక్తులున్నారు-

  • 1) వీరు సువార్త ప్రకటించుచున్నారు.
  • 2) ఆరాధన చేయుచున్నారు.
నాయిను పట్టణమందు ఉన్న ఒక విధవరాల కుమారుడు చనిపోగా ఆ శవమును సమాధికి తీసుకొని వెళ్ళుచున్న మార్గములో జీవము ఎదురు వచ్చెను. మృత్యువును, జీవమును ఎదురెదురుగా కనబడగా జీవమును కనుగొన్న మృత్యువు పారీపోయెను. ప్రభువు భూలోకములో ఒక్కమారైన సాధియొద్దకు వెళ్ళలేదు. అలాగు ఒకవేళ వెళ్ళిన మృత్యువు ప్రభువును చూచి పారిపోవును. లాజరు చనిపోయిన నాలుగు దినములైన పిదప ప్రభువు సమాధి యొద్దకు వెళ్ళెను. ప్రభువు తన ప్రభావమును యూదులకు చూపించుటకు సమాధియొద్దకు వెళ్ళెను. అప్పుడు జీవము యెదుట మృత్యువు నిలువలేదు. అలాగే క్రైస్తవ సంఘము యెదుట పాతాళము నిలువబడ నేరదు.

నీ తండ్రి యాజ్ఞలన్నిటిని - పూర్తిగ నీవు నెరవేర్తువని నీకు తెలుసునా

పాతాళము నీ - బలము ఎదుట నిలువబడనేర్దని నీకు తెలుసునా

భయపడునని నీకు తెలుసునా

పడిపోవునని నీకు తెలుసునా.

పై చరణములో ఉన్నట్లు పాతాళము సంఘ బలము ఎదుట నిలువబడనేరదు. ప్రార్ధనా బలము సంఘములో బలహీనముగా నున్నందున ఇట్టి కార్యము ఇప్పుడు జరుగుటలేదు. గనుక ప్రాధనాబలము ఎక్కువ చేసికొనవలెను. వెయ్యేండ్ల పరిపాలన కాలములో మారుమనస్సులేని ఒక మనిషి నాలుగు వందల ఏండ్లు బ్రతికి చనిపోయినాడు. ఆ శవమునకు ఎదురుగా ఒక భక్తుడు కనబడగానే ఆ శవము లేచెను. ఒకవేళ లేవకపోయిన ఆ భక్తుడు ఆ శవమును చూచి యేసు నామమున లెమ్ము అని చెప్పగానే ఆ శవము లేచి జీవము గల మనిషిగా మారి జరిగిన అద్భుత కార్యమునుబట్టి మారుమనస్సు పొందును. ప్రకటన గ్రంధము వివరించుకొను ఈ సమయమందే ఇట్టి అద్భుతములు జరుగవలెను గాని ఇప్పుడు మనలో శక్తిలేనందువల్ల జరుగుటలేదు.

ఒకరు జబ్బుగా నుండగా ఒక పరమ భక్తుడు వెళ్ళి అతనికి కనబడగా అతడు బాగుపడును. గ్రుడ్డివారు చూపు పొందును ప్రభువునకు అట్టి శక్తి యున్నది. గనుక మనము అట్లు చేయగలము. ఆహారములేని బీదలు ఉండరు. ఎవరైన కనబడి ఈదినము తినుటకు ఆహారము లేదని అన్నయెడల ప్రక్కనున్న భక్తుడు వెంటనే వారికి ఆహారము పెట్టెదరు.

లేనివారికి లెక్కపంచి పెట్టి - లేమిని తీర్చెదవు తెలుసునా -

దానబలముతోను ధనబలముగూడ - తరుగక యుండును తెలుసునా -

దారిద్ర్యముండదు తెలుసునా - దాతృత్వమిచ్చును తెలుసునా -

ఆ దినములలో బీదలు ఉండరు.

పూర్వము ప్రభువువల్ల అద్భుతములు జరిగియున్నవి ఇప్పుడు ఆయా వారివల్ల అద్భుతములు జరుగుచున్నవి. వెయ్యేండ్ల కాలములో సంఘము వల్ల అద్భుతములు జరుగును.

భక్తులైనవారు అధిక కాలము జీవించి సువార్త సేవ చేయవలెనని కోరిక కలిగియున్న ఇప్పుడు నెరవేరక పోవచ్చుగాని ఉ. ప్రార్ధన వెయ్యేండ్ల కాలములో నెరవేరును మీరు అడుగువాటి అన్నింటికంటెను ఊహించు వాటి కంటెను అత్యధికముగా ఇచ్చెదనను ఆ వాగ్ధానము ఇప్పుడు ఇక్కద నెరవేరును. పది సంవత్సరములు సువార్త సేవచేయుటకు ప్రభువును సెలవడిగిన అప్పుడు వెయ్యేండ్లు ఇచ్చును. ఏ భక్తుడైతే సువార్త ప్రకటించుటకు భూలోకమందు కూడుకొనునో ఆ భక్తునికి భూలోకములో నెరవేరకపోయినా వెయ్యేండ్ల పాలనలో నెరవేరును.

ఈ లోకములో సువార్త ప్రకటించుచు చనిపోయిన వారికి ఈ సమయము దొరుకును.

  • 1) సువార్త ప్రకటించుచు వరము
  • 2) ఆవగింజతైన పాపము లేనివారు
  • 3) ఆవగింజంత విశ్వాసమున్నవారు
  • 4) ప్రభువుతో సహావాసము చేయువారు.

ఇట్టివారు పెండ్లి కుమార్తెలో నుందురు. పెండ్లికుమార్తె వరుసలోనికి చేరవలెనంటే ఈ షరతులు నెరవేర్చవలెను. గొర్రెలు కాచుకొనే పిల్లలు మామిడిపండు తినేవారిని చూచి నోరు ఊరునుగాని తినేవారు వారికి ఇవ్వరు. ఇచ్చట సువార్త యందు ఆశక్తిగలవారికి వెయ్యేండ్ల పాలనలో అవకాశము దొరుకును. సైతానును మట్టులేని గొయ్యిలో వెయ్యేండ్లు ఉంచుట దానికి చివరి అవకాశము,మారుమనస్సు పొందకపోతే శిక్ష తప్పదు. పెండ్లికుమార్తెవల్ల వెయ్యేండ్లు సువార్తవిన్న సజీవులకు తీర్పు తీర్చుటకు భూమిపైననే సిం హాసనముండును. వెయ్యేండ్లలో సువార్త విన్నారు గనుక నీ తీర్మానము ఏమిటి అని సజీవులై యుండువారిని ప్రభువు అడుగుటయే సజీవులకు తీర్పై యున్నది, తీర్పు భూమిమీదనే గనుక మనము చూడగలము గాని -

అంత్య తీర్పు సమయములో మనముగాని దేవదూతలుగాని యెవ్వరు ఉండరు అది మనము చూడలేము.

ఒక మనిషి నేరము చేస్తే ఉరిశిక్షకు ముందు చిన్న జైలు (రిమైండ్స్) లో పెట్టెదరు. అలాగే అంత్య తీర్పునకు ముందు మారుమనస్సు పొందని వారిని పాతాళము (రిమైండ్ )లో వారిని ఉంచెదరు. భక్తులైనవారిని తప్పించెదరు.

పాతాళలోకము :- ఆత్మ హత్య చేసుకొన్నవారు. ఈ పాతాళ లోకమందు ఉందురు. ఆదాము మొదలుకొని అప్పటివరకు మారుమనస్సు పొందకుండగా ఉన్నవారు తీర్పు దినము వరకు మారుమనస్సు పొందకుండగా ఉనవారు ఈ అంత్య తీర్పులోనికి వెళ్ళెదరు.

ప్రక 20:6 మొదటి పునరుత్థానములో పాలుగొనువారు ధన్యులు పరిశుద్ధులునై యున్నారు.

మృతులైన భక్తులు బ్రతికిరాగా నీకు - మేలైన సాయము తెలుసునా -

బ్రతికియున్న నీవు - బ్రతికినవారితొ బలముగ తిరుగుదువు తెలుసునా -

విలువగల పని జరుగును తెలుసునా - హిందూదేశములోనే తెలుసునా

మొదటి పునరుత్థానమునకును, రెండవ పునరుత్థానమునకును మధ్య 7+1000=1007 సంవత్సరములు ఉండును.

ప్రభువునకు 12మంది శిష్యులు ఉండిరి. పదునొకండు మంది హతసాక్షులైరి. ప్రకటన గ్రంధము వ్రాయుటకు యోహాను ఒక్కడే జీవించి యుండెను. లోకములో యెవరికి లేని ఉద్యోగము గొప్ప ఉద్యోగము యోహానునకు ఇవ్వబడెను. అవిశ్వాసులకు మొదటి పునరుత్థానములో పాలు ఉన్నవి. రెండవ మరణములో పాలు గలవారికి రక్షణలేదు, మార్పు లేదు. మొదటి పునరుత్థానములో పాలుగలవారే మృతులైన భక్తులు, విశ్వాసులు, పెండ్లికుమార్తె.

హేడెస్సు

లూకా సువార్తలో 16 అ: లో హేడెస్సు అను మాట ఇంగ్లీషులో ఉన్నది. మిషనెరీలైన వారు ఆ పదమును చదివి తెలుగులో పాతాళమని తర్జుమాచేసి వ్రాసిరి. హెడెస్సు అనుపదము గ్రీకు భాషలోనిది. ఈ హేడెస్సునకే అదృశ్య లోకమని పేరుపెట్టిరి. డా|| ఫిల్ దొరగారు వ్రాసిన పుస్తకములో హెడెస్ అని వ్రాసిరి. తరువాత హేడెస్సు అనేది మార్చివేసి నరకమని పేరు పెట్టిరి. తరువాత నరకమను పేరు తీసివేసి అదృశ్య లోకమని పేరు పెట్టిరి.

హెడెస్సు అనగా -

  • 1) అదృశ్యలోకము
  • 2) చిన్న నరకము
  • 3) పాతాళము.
ఈ రీతిగా అనేక రకములుగా పేరు ఉన్నది. 1 పేతురు 4అ.లో ప్రభువే స్వయముగా చెరసాలకు వెళ్ళెనని వ్రాయబడియున్నది.

మలాకీ 4 అ: కట్టెలకొరకు చెట్లుకోసిన పిమ్మట క్రిందిభాగమున మిగులునది దుంపవేరు. దీనినే కొయ్యకాలు అందురు. సెవంత్ డే వారు పాతాళములోని అవిశ్వాసులు ద్బ్బుకాలినట్లు పాతాళములో కాలిపోవుదురనియు యికవారు ఉండనే ఉండరనియు చెప్పుదురు. గాని మలాకీ గ్రంధములో వ్రాయబడినది వారినిగూర్చినది కాదు. గాని గోగు మాగోగులను గూర్చి వ్రాయబడియున్నది. వెయ్యేండ్ల పాలన చివర్లో గోగుమాగోగులు కాలిపోయిరి. అందులో సైతాను ఉన్నడుగాని అతడు కాలిపోలేదు. తరువాత అతడు నరకములో వేయబడును. ఈ వెయ్యేండ్ల పాలనలో అంతిక్రీస్తు అబద్ధ ప్రవక్త నరకంలో ఉండును. సాతానుడు నరకమునకు వెళ్ళువరకు వారు అచ్చట ఉందురు. ఆ పిమ్మట అందరూ కలిసి యుగయుగములు కాలుచుందురు.

  • 1) అంతిక్రీస్తు
  • 2) అబద్ధప్రవక్త
  • 3) దయ్యము
  • 4) అవిశ్వాసులు
వీరందరు నరకములో యుగయుగములు బాధనొందుచూ ఉందురు. దీనినే నిత్య నరకమందురు.

ప్రకటన 20: 7,8 : వెయ్యి సంవత్సరములు గడచిన తరువాత సాతాను తానున్న చెరలోనుండి విడిపింపబడును. భూమి నలుదిసల యందుండు జనములను, లెక్కకు సముద్రపు ఇసుకవలె ఉన్న గోగు మా గోగు అనువారిని మోసపరిచి వారిని యుద్ధమునకు పోగుచేయుటకై వారు బయలుదేరును.

వెయ్యేండ్లు మట్టులేని గొయ్యిలోనున్న సాతానును పాతాళము తెరచి వెయ్యేండ్ల అనంతరము పైకితీయగా మారుమనస్సులేనివారి నందరిని సాతానుడు భూమిమీద పోగుచేసి రెండు పటాలములక్రింద యేర్పరచి గోగు మాగోగు అను పేర్లు పెట్టును. (యెహేజ్కే 18 అ.)

వెయ్యేండ్ల పరిపాలన తరువాత సజీవులకు తీర్పు ఉండును. ఈ తీర్పు అయినపిమ్మట సతానునకు విడుదల కలుగును. ఇదైన పిమ్మట మృతుల తీర్పుజరుగును. సజీవుల తీర్నకును మృతుల తీర్పునకును మధ్యలో కొంత కాలము సైతానునకు విడుదల కలుగును. ఏదేను తోటలో ఆదాము అవ్వలను మోసపరచిన పిదప తీర్పుచేసి దేవుడు సైతానును వాయుమండలములో ఉంచెను. ఏడు సంవత్సరముల శ్రమకాలము వరకు అతడు అచ్చట ఉండును.

  • 1) మోక్షలోకము
  • 2) వాయు మండలము
  • 3) భూలోకము
  • 4) పాతాళ లోకము
  • 5) నరకము

దేవుడు ఒక్కరోజు మాత్రమే సైతానునకు విడుదల యిచ్చి బందీఖానలో ఉంచును. దేవుడు అలాగు చేయనియెడల సాతానుడు భుజనులను నాశనముచేయును. కుక్కకు గొలుసువేసి బంధించి ఉంచినట్లు సాతానునకుకూడ దేవుడు గొలుసువేసి బంధించును. ఆ ఒక్క దినమైన దేవుడు సాతానునకు అవకాశము ఎందుకిచ్చెననగా ఓ సాతానా నీ దుష్టత్వము ఆదాము దగ్గర మొదలుకొని సజీవుల తెర్పువరకు చూపించి యున్నావు గనుక ఇప్పుడు ఇది ఆఖరు అవకాశము నీకున్నశక్తి అంత చూపించుమని సెలవిచ్చెను.

ఉదా:- ఒక పిల్లవానిని ఇంకొక పిల్లవాడు కొట్టెను. బడిలోని మాష్టరుగారు మొదటి కుర్రవాడిని కొట్టెను. అందునుబట్టి రెండవ పిల్లవానికి కోసము పోవచ్చు.

ప్రకటన 20:9 వారు భూమియందంతట వ్యాపించి, పరిశుద్ధుల శిబిరమును ప్రియమైన పట్టణమును ముట్టడివేయగా పరలోకమునుండి అగ్ని దిగివచ్చి వారిని దహించెను.

గోగు మాగోగు అను పట్టణము సైతానుతో కలిసి దేవునితో యుద్ధము చేయుటకై పరిశుద్ధ పట్టణమును ముట్టడించెను. కొంత మట్టుకు జయము కలుగును సంపూర్ణ జయము కలుగదు. సెతానుపటాలము నగరును ముట్టడించును ఆ నగరునందు మానవ పటాలము ఉండును. పరిశుద్ధ పటాలము రాగా సైతాను పటాలము నాశనమగును.

  • 1) ఆదాము దగ్గర
  • 2) జల ప్రళయములో
  • 3) సొదొమ యొద్ద
  • 4) సిలువయొద్ద సైతానునకు జయము కలిగెను
గాని ఇక్కడతనికి జయములేదు. దొంగతనముచేసిన శిక్ష ఉన్నదని తెలిసిన దొంగతనము మానివేయుటలేదు. అలాగే శిక్ష అని తెలిసిన సైతానుకూడ మార్పుచెందడు.

ఏడు యేండ్ల అంతిమ సమయములో హర్మగెద్దోను యుద్ధమునందు సైతాను పటాలమంతా నాశనమగును. అలాగే వెయ్యేండ్ల పరిపాలన కాలాంతమందు గోగు మాగోగుల యుద్ధమప్పుడుకూడ సైతాను పటాలము నాశనమగును. కాని అసలైన సైతానుడు నాశనము కాడు (మలాకి 4 అ)

పడిదెబ్బ తగిలిన - పగవారు కొట్టిన

పడిన గాయము మాన్ పి - బ్రతికింపగలవు.

మనము వెయ్యేండ్ల పాలనా కాలములో సువార్త పని చేయవలెనన్న ఇప్పుడే సువార్త ప్రకటించవలెను. ఆదామునుండి రేప్చర్ వరకు మృతులైనవారు లేవగా వారి పునరుత్థానమే మొదట పునరుత్థానము. వెయ్యేండ్ల పాలన ముగింపులో సజీవుల తీర్పు ఉండును. ఆ పిమ్మట లేచు వారు కడమ మృతులు. దీనినే రెండవ పునరుత్థానమందురు.

ప్రక 20:11 :- మరియు దవళమైన సిం హాసనమును చూచితిని. భూమి యాకాశములు పారిపోయెను. వాటికి నిలువ చోటు కనబడక పోయెను. కొద్ధివారేమి గొప్పవారేమి మృతులైన వారందరు ఆ సిం హాసనము యెదుట యుండిరి. దవళ సిం హాసనము చుట్టు అందరు ఉందురు. భక్తులకు వారి పేర్లు జీవగ్రంధమందు వ్రాయబడి యుండును. కడమ మృతులకు వేరు వేరు గ్రంధములుండును.

  • 1) సముద్రము తనలోని మృతులను అప్పగించును
  • 2) మరణము వలన చనిపోయినవారు
  • 3) మృతుల లోకములో నున్నవారు

ఈ మూడు గుంపులవారు ఈ దవళ సిం హాసనము దగ్గరకు వచ్చెదరు. ఇచ్చట చాలా గ్రంధములుండును. అనేకులుందురు. జీవగ్రంధముకూడ ఉండును. జీవగ్రంధములో పేరులేని వారిని నిత్య నరకాగ్నికి వెళ్ళుమని తీర్పు వినిపింతురు.

Home