1వ అధ్యాయము - The Lord of Glory

పరిచయం

ప్రకటన పుస్తకములోని మొదటి అధ్యాయము పుస్తక మంతటికి ప్రవేశ అధ్యాయమై యున్నది. ఈ అధ్యాయములోని సంగతి ఇదివరకే మొదటి శతాబ్ధములోనే జరిగియున్నది. ఈ అధ్యాయము ప్రభువుయొక్క పరిపూర్ణ ప్రత్యక్షతను కనబరచునది (ప్రకటన 1:13-20). 2, 3 అధ్యాయములలోని సంఘములకు కూడ ప్రభువు ప్రత్యక్షము కానై యున్న ప్రత్యక్షతయైయున్నది.

The Lord of glory

arrow
arrow
arrow
arrow

ఎవరి నిమిత్తము:- తనదాసులకు
విషయములకు:- త్వరలో సంభవించు సంగతులు

    యోహాను సాక్ష్యము
  1. దేవుని వాక్యమును గూర్చి
  2. యేసుక్రీస్తు సాక్ష్యము
  3. ఎంత సాక్ష్యం ? చూచినంత

    ధన్యులు:

    1. ఈ ప్రవచనములు చదువువారు
    2. వాటిని వినువారు
    3. గైకొనువారు

ఇందులో వ్రాయబడు సంగతులు
సమయము:- సమీపము

ఆసియాలోని 7 సంఘములకు యోహాను శుభమని వ్రాయుసంగతులు

కృపాసమాధానము

  1. ఉండుచున్న వానినుండి
    • ఎ. వర్తమాన
    • బి. భూత
    • సి. భవిష్యత్


    కాలములో

  2. ఏడు ఆత్మలనుండి (సిం హాసనము ఎదుట)
  3. యేసుక్రీస్తు నుండియు
  • ఎ. నమ్మకమైన సాక్షియు
  • బి. మృతులలో నుండి లేచినవాడు (ఆది సంభూతుడు)
  • సి. భూపతుల కధిపతి
మహిమ ప్రభావము యుగయుగాలు కల్గు ఆమెన్.

విడిపించినవానికి

  • ఎ. మనలను ప్రేమించి
  • బి. రక్తముచే పాపములనుండి

ఆయన చేసిన పని : మనలను

  • 1) రాజ్యము
  • 2) యాజకులు


తండ్రినే


ఆయన మేఘా రూఢుడై వచ్చుచున్నాడు భూజనులు:-
  • ఎ. ప్రతి నేత్రము (చూచును)
  • బి. ఆయనను పొడిచినవారు (చూతురు)
  • సి. భూజనులందరు (రొమ్ముకొట్టుకొందురు)
    • a. అవును
    • b. ఆమెన్


ప్రభువు ఎ.సర్వాధికారి బి. దేవుడు
  • 1) అల్ఫాయు
  • 2) ఓమెగయు
  • 3) ఉండువాడను
    • ఎ. వర్త
    • బి. భూత
    • సి. భవిష్యత్ కాలములు



యోహాను
  • ఎ. మీ సోదరుడను
  • బి. పాలివాడను
    • ఎ.ఎ. యేసుశ్రమలో
    • బి.బి. రాజ్యములో
    • సి.సి సహనములో
    • సి)యోహానును:
      • ఎ.దేవుని వాక్యము బోధించినందున
      • బి. యేసును గూర్చిన సాక్ష్యము-పద్మస్ పరవాసి

ఆత్మవశుడను:ప్రభువు దినమున బూర
  • ఎ. వ్రాయుము (చూచునది)
  • బి. పంపుము



7.సంఘములకు:
  • ఎ. ఎఫెసు
  • బి. స్ముర్న
  • సి. పెర్గెము
  • డి తుయతైర
  • ఇ. సార్దీస్
  • ఎఫ్. ఫిలదెల్ఫియ
  • జి. లవొదికయ
N.B: వెనుక వింటిని
N.B: చూడతిరిగియిని
N.B: 7నక్షత్రములు=సంఘదూతలు
N.B: 7 స్తంభములు=7సంఘాలు



7. సువర్ణదీపములు మనుష్య కుమారుని
  • ఎ. పాదముల వరకు బట్ట
  • బి. రొమ్ముకు బంగారు దట్టి
  • సి. తల తెల్లని
  • డి. వెంట్రుకలు ఉన్ని, హిమము
  • ఇ. నేత్రము:అగ్నిజ్వాల
  • ఎఫ్. పాదము: కొలిమి, అపరంజి
  • జి. కంఠస్వరం: జలధ్వని
  • ఎచ్. కుడిచేత: 7 చుక్కలు
  • ఐ. నోట: రెండు అంచులకత్తి
  • జె. ముఖము: సూర్యుని

యోహాను స్థితి : చచ్చినవానివలె ప డితిని

క్రీస్తు: కుడిచేతిని నాపై నుంచి

  1. భయపడకుము:
    • మొదటివాడను
    • కడపటివాడను
    • మృతుడను-సజీవుడను (యుగాలు)
  2. నాస్వాధీనము
    • మరణ తాళపు చెవులు
    • మృతులలోక తాళపుచెవులు
  3. వ్రాయుము
    • చూచినవాటిని = ఎ. 7 నక్షత్రాల మర్మము
    • వున్నవాటిని బి. సువర్ణ స్తంభమర్మము
    • కల్గువాటిని

ప్రకటన గ్రంధ వివరణ

ప్రార్ధన:- ఓ దయగల తండ్రీ! మేము నీ ప్రకటన గ్రంధము నేర్చుకొన మొదలుపెట్టితిమి. ఈ గ్రంధమును నేర్చుకొని వాటిని మా హృదయములో వుంచుకొనే కృప దయచేయుము. నీవు మహిమ గల దేవుడవై యున్నావు మేము మహిమ బిడ్డలమై యుండవలెను నీవు మహిమ కర్తవై యున్నావు. మేము కూడ నీ మహిమ ప్రజమై యుండవలెను. నీవు మహిమ లోకమును విడిచివిగదా! మేము నీ మహిమ లోకములోనికి రావలెను. నీవు సాతానును వాని సంబంధులను గెలిచినావు గదా! మేమును దానిని దాని సంబంధులును గెలువవలెను. యోహాను చెరలో వున్నను సంకెళ్ళలోనున్నను నీ మహిమను చూడగల్గినాడు. నీ మహిమను చూచుటకు అవి అడ్డమురావు. ఎన్ని అడ్డములున్నను ఆయన మహిమ దృష్టియే మహిమ తలంపే మహిమ కోరికే కలిగి యున్నాడు. అలాగే మేమును ఎన్ని ఆటంకముల మధ్యనున్నను యోహాను వలె మహిమ దృష్టి, మహిమ కోరిక, మహిమ తలంపు కలిగి నీ మహిమను చూచే భాగ్యము మాకను గ్రహింపుము. ఆయన వట్టి మహిమనే చూడలేదు. తన గదిలో పరలోక సిం హాసనమును పరలోక విషయములన్నియు చూచెను. ఆత్మ నేత్రములతో చూడగల్గెను గాని శరీర నేత్రములతో చూడలేదు. ఆయన ఆత్మతో పరలోకమునకు ప్రయాణము చేసెను.శరీరము ఖైదులో నున్నది.


ఓ దయగల ప్రభువా! శరీరములో నుండగనే అంత మహిమను చూపించినావు గదా! ఇప్పుడు నీ దగ్గర వున్నాడు. ఎంత మహిమ. మేము బైబిలు మిషను పెట్టినాము గాని అన్నీ శ్రమలే. అన్నీ చిక్కులే, ఎన్ని మాకు ఉన్నప్పటికిని నీ మహిమ మాకున్నది. కాబట్టి మేము పరలోకము యొక్క మహిమను తెలిసికొని ఈ శ్రమలను మరచిపోయే కృప దయచేయుము. యోహానుగారు నీతో సహవాసముచేసి నీ మహిమను చూచెను. రూపాంతర కొండ మీద సిలువ మరణ దినమున పునరుథాన దినమున ఆరోహణ దినమున ఖైదులో తానున్నప్పుడు నీ మహిమను ఒకదానికంటె ఒకటి యెక్కువగా చూడగల్గెను. కనికరముగల ప్రభువా! మేము శ్రమలలో నున్నప్పటికిని వాటిని జయించి మహిమను పొందేకృప దయచేయుము. ఆమెన్.

Home


విషయములు

ప్రకటన గ్రంధము మొదటి అధ్యాయములోని విషయములు:- యోహాను సాక్షియై యుండుట; వాక్యము బోధించు బోధ్కుడై యుండుట క్రీస్తు యొక్క స్వరము వినుట ఆత్మ వశమగుట, ముఖ్యసంఘము పేర్లు వినుట, క్రీస్తుయొక్క మహిమ శరీరమును చూచుట, క్రీస్తు తన అధికారమును గురించి చెప్పగా వినుట, క్రీస్తు భయపడకుమని చెప్పినమాట వలన ఆదరణ పొందుట.


దేవుని మహిమ క్రమక్రమముగా వెల్లడియగును ఆదికాండములో కొంత, నిర్గమ కాండములో కొంత బయలు పడినది ఈ ప్రకారముగా 65వ పుస్తకమగు యూదా పత్రిక వరకు మహిమ క్రమక్రమముగా ఎక్కువ బయలు పడుచు వచ్చెను. ఇప్పుడు ఈ ప్రకటన గ్రంధములో 65 పుస్తకముల మహిమ వెల్లడిలోనికివచ్చెను. మొదటి అధ్యాయములోనే తండ్రి, కుమారుడు. ఆత్మ బైలుపడినది. ఇదొక మహిమ పరలోకములో సంఘమున కుండనైయున్న 7అంతస్థులకు ముంగుర్తులుగానున్న భూలోక సంఘములు 7 బయలు పడినవి. ఇది మరియొక మహిమ యోహాను దురవస్థలో నుండగా ప్రత్యక్షతలు ప్రారంభమైనవి. ఇదొక మహిమ. క్రీస్తు ప్రభువుయొక్క ప్రకాశమానమైన మహిమ స్వరూపము బైలుపడినది. ఇదియొక మహిమ ఆయన వింతైన మాటలు మరియొక మహిమ.


Home


ప్రకటన 1:1-6

ప్రకటన 1:1-6 మహిమగల ప్రభువు చూపును అధ్యాయము. ప్రకటన గ్రంధమునకు ఇది ప్రవేశ అధ్యాయమై యున్నది. ఈ అధ్యాయములోని సంగతి ఇది వరకే మొదటి శతాబ్దము లోనే జరిగినది.


తండ్రి కుమారునికిని, కుమారుడు దేవదూతకును, దూత యోహానుకును, యోహాను, సంఘమునకును పంపిన వర్తమానము ఈ పుస్తకములోనున్నది. సంఘము లోకమునకు ఈ వర్తమానము పంపవలసి యున్నది. తండ్రి స్వయముగా వచ్చి లోకమునకు చెప్పకూడదా? అది క్రమము కాదు. సంగతులు ఒకరిద్వారా తెలియజేయుట క్రమమైయున్నది. వార్తలు అంచుల మీద లోకమునకు అందవలెను. ప్రకటన అంచలమీద వచ్చెను. దేవుడు ఏర్పరచిన రక్షణ అందరకు పాలుండవలెను. అదే రక్షణ. విందు వడ్డించెవారు తండ్రి, కుమారుడు, దూతలు, దూతనేవారు సేవకులు. అందరము సేవకులము. అందరికి అందినది గనుక వారు బోధించవలెను ప్రభువు జన్మ కాలమందు తండ్రి కుమారుని లోకమునకు పంపెను. కుమారుడు లోకమునకు వచ్చెను. ఈ వార్త దేవదూతలు మంద కాపరులకు తెలియజేసిరి. వారు యితరులకు తెలియజేసిరి. అట్లే ప్రకటన గ్రంధమును కూడ అంచలమీద తెలియజేసిరి.


ప్రకటన:- 1::1లో దేవుడు తన సేవకులకు తన విషయములను తెలియజేయునని యున్నది. కొన్ని విషయములు పైవారికిని తెలియజేయునని యున్నది గాని సేవకులైన వారికి మాత్రమే ప్రకటనలోని మర్మములను తెలియజేయుననియున్నది. గనుక ఇది ప్రత్యేక గ్రంధము, ప్రకటన 1:9లో నున్న విషయ మేమనగా యోహాను దేవుని వాక్యమును బోధించెనని యున్నది. ఈ వచనములో నున్నట్లు దేవుని వాక్యమును ఈయన బోధించినందున క్రొత్త సంగతులు దేవుడాయనకు బోధించెను. వాక్యము బోధించినందుకు ఆయన మర్మమును బోధించెను.

  • దేవుడున్నాడు
  • వాక్యమున్నది.
  • యోహానున్నాడు.
యోహాను బోధించినది దేవుని వాక్యము గనుక దేవుని సేవకుడు వాక్యము బోధించినాడు గనుక వాక్యసేవకుడు. ప్రజలకు బోధించినాడుగాన ప్రజల సేవకుడు.


ముందు భక్తులందరు దేవుని సేవకులే. వారు కొద్దిగాను యోహానుకు అధికముగాను బోధించెను. యోహాను యెక్కువగా దేవునితో సహవాసము కలిగియున్నాడు. గనుక ఆయనకు బయలు పరచెను. 1:9లో బోధించెనని యున్నది గాని సహవాసము కైగియుండెననిలేదు. అయినను బోధించెను గనుక అది సహవాసము వలన వచ్చినది గనుక బోధించెను అలాగుననే ఇప్పుడును క్రైస్తవ సంఘములో నున్నవారు దేవుని ద్వారా క్రొత్తసంగతులు యుండవలెను.


ప్రక 1:10వ లో యోహాను పడిపోయి చనిపోయిన వానివలె నున్నాడని యున్నది అనగా ఆత్మవశుడనైనాడు ఖెదీగా వేసినరాజు వశములో లేడు. ఆత్మ తండ్రి వచ్చి తన వశము చేసికొనెను.


"పిశాచికడిమి పడగొట్టెను తన వశాననను నిలువబెట్టెను" అని అన్నట్లు దేవుడు యోహానును లంకలోనికి తీసికొనిరాగ ఆత్మ తండ్రి తనవశము చేసికొనెను. ఎఫెసునుండి లంకకు యోహానును తెచ్చినానని రోమా చక్రవర్తి అనుకొన్నాడు గాని ప్రభువే తెచ్చియున్నాడు. యోసేపు విషయములో అన్నలు యోసేపును అమ్మివేశామను కొన్నారు గాని "మీరుకాదు దేవుడేనన్ను ఈ రాజు సంస్థానమునకు తెచ్చి"నని యోసేపు అన్నాడు. ప్రభువుయొక్క ధ్యానములో నున్నందున యోహానుకు కనిపించెను గనుక ఈ కడవరికాలము లోను ధ్యానములోనున్నవారికి తప్పక కనబడి తీరవలెను. నేను చెప్పు సంగతులు వ్రాయమన్నారు గనుక సన్నిధిలో నుండువారికి కనబడును మాట్లాడి వ్రాయించును. యోహాను 9లో బోధించుట 10లో ధ్యానించుట. 11లో స్వరము వినుట 12లో దేవుడు కనబడి వ్రాయమనుట జరిగెను గనుక యెవరైనా ఇప్పుడు ప్రభువుసన్నిధిలో నుండి కనిపెట్టుదురో అట్టివారికిట్టి అనుభవము కలుగుచున్నది.


ఎవరైనా ఎవరి ఇంటిలోనైన సన్నిధికూటము పెట్టుకోవలెను అన్న వారు యోహానువలె దేవుని సేవకులై యుండవలెను. యోహానువలె సన్నిధానవర్తులై యుండవలెను.

    అప్పుడు
  • దేవుని స్వరము వినుట.
  • దేవుడు కనబడుట
  • సంగతులను వ్రాయమనుటయు జరుగును
ఇది కడవరి కాలము గనుక సన్నిధిలో నుండుట అవసరము.


సేవకులై యున్నప్పుడు స్వరము వినుట దర్శనము చూచి వ్రాసికొనుట జరుగును. సంఘమును ఆరోహణ సంఘముగా సిద్ధము చేయగలము. యేసు ప్రభువు ఏ యే సంగతులను యోహానునకు చెప్పెనో అవి చాలా యున్నవి.ఒకటవ అధ్యాయములోని సంగతులన్నిటికి ఒకే వాక్యము "ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నా"ననిఉన్నది. ప్రభువు రాగానే సిద్ధముగా ఉన్నాను ప్రభువా అని యెవరు చెప్పుదురో వారు శరీరమరణము లేకుండ వెళ్ళుదురు. సన్నిధిలో నుండువారు వినునది వ్రాసిన ప్రకటన యొక్క ప్రకటన వచ్చును. బైబిలు ప్రకటన వచ్చును, ఆ భాగ్యము మీకందరికి గలుగును గాక!


తన దాసులకు:- శ్రమపడువారు, పరిపాలించువారు, ఆజ్ఞను పొందినవారు, కాపరులుగా నుండువారు. ఆత్మవరములు కలవారే దాసులు. క్రీస్తుప్రభువు తన దాసులకు అనగా తన సేవకులకు ఈ ప్రకటన పుస్తకములోని విషయములు బైలుపరచును అని ఆరంభమందు ఉన్నది. దీనినిబటి చూడగా దేవుని సేవచెయువారికి దైవ విషయములు బయలు ప్రచబడును. ఒక అధికారి యొద్ద పనిచేయువార్కి ఆ అధికారి తన విషయములను బయలు పరచును. గదా! ఎందుకనగా సేవకుడు యజమానుడు చెప్పిన పనులను చేయువాడు. సంఘ సేవలో ముఖ్యమైన సేవ ప్రభువును గురించిన సంగతులు యితరులకు చెప్పుటయే. దేవుడు తన హృదయములోని సంగతులనుకనపరచు భాగ్యముల దాసులు వీరే. యితరులకు కనబరచిన చెప్పరు. బూడిదలో పోసిన పన్నీరు వంటి దగును. యోహాను వ్ర్ద్ధుడైనను చెరలో వున్నను, శ్రమపడి ప్రభువు ఆజ్ఞ ప్రకారము వ్రాయుమని ప్రకటన అంతా కనబరచి వ్రాయించెను. కనపరచినందున చూచెను. వ్రాయమన్నందున వ్రాసెను. పాపం ముసలి యోహాను ఒణుకుచు వ్రాసెను. దాశుదనగా యోహానే. దేవుడు యోహానుకు చూపింపకపోతే పరమునకు వెళ్ళిన తరువాత ప్రభువా! పరలోకములో ఇన్ని సంగతులున్నవి ఎందుకు చూపించలేదు అనును గనుక ప్రభువు చూపించెను.


ఉదా:- అబ్రహాము తనయొద్దనున్నవారికి బోధచేసిన సేవకుడు సొదొమ గొమొర్రాల నాశనములు గురించి దేవుడు అబ్రహామునకు బయలు పరచెను.


"అప్పుడు యెహోవా నేను చేయబోవు కార్యము అబ్రహామునకు దాచెదనా- అబ్రహాము నిశ్చయముగా బలముగల గొప్ప జనమగును. అతని మూలముగా భూమిలోని సమస్త జనమును ఆశీర్వదింపబడును. ఎట్లనగా యెహోవా అబ్రమును గూర్చి చెప్పినది అతనికి కలుగజేయునట్లు తన తరువాత తన పిల్లలను, తన ఇంటివారును నీతి వ్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికాజ్ఞాపించునని నేనెరిగి యున్నాననెను" (ఆది 18:17-19)


అబ్రహాము తన ఇంటివారి బోధకుడు అనగా-దైవసేవకుడు గనుక ఆయన అతనికి ఈ రహస్య విషయమును బయలు పరచెను. ఈ ప్రకటన దేవుడు బయలు పరచినా తరువాత చెప్పని యెడల అవిదేయుడు. యోనాకు దేవుడు చెప్పినను అన్యులకు ఎందుకు చెప్పవలెనని ఊరుకొనెను. ఉద్దా:-చివరి గడియలో రక్షణనుండి తప్పిపోవుటబిషప్ బట్లర్ అను ఆయన లోకములో అందరికి తెలియ చెయుటకు యేసుక్రీసే దేవుడని ఒక దివ్య గ్రంధమును వ్రాసెను మరణ సమయవాటికి దేవుడు లేడు, నరకములేదు. మోక్షము లేదని పలికెను. ఈ సంగతి ఎరిగిన తనవద్ద పనిచేసిన సామాన్యపాస్టరుగారు వచ్చి బిషప్ బట్లర్ అని పిలిచి నీవు వ్రాసిన దంతావట్టిదేనా? అని గద్దించి ప్రార్ధించగా బిషప్ బట్లర్ కూడ ప్రార్ధించి ప్రభువు వున్నాడనినమ్మి రక్షణ గల మరణము పొందెను.


త్వరలో సంభవించు సంగతులు:- ఈ పుస్తకములోని సంగతులు త్వరలో సంభవించునని వ్రాయబడి యున్నది. ఇప్పటికి రెండు వేల సంవత్సరములైనది. ఇంత దీర్ఘ కాలమునకు త్వరలో జరిగినకాలమని చెప్పవచ్చునా? ఆయన దేవుడు గనుక యెప్పుడైనను రాగలడు. (రోమా 9:5) మనము యెక్కడికైనను వెళ్ళలంచిన యెడల అన్నియు ఆటంకములే. ఆయన పరలోకమునుండి ఇక్కడకు రావలసియున్న యెడల ఆయనకు ఏ ఆటంకములేవు ఆటంకముల మధ్యనుండి నడచి రాగలడు. శిష్యులొకప్పుడు తలుపులు వేసికొని యుండగా ఆయన లోపలికి వెళ్ళెను. ఆయనకు తలుపు ఆటంకమాయెనా. లేదు (యోహాను 20:19) (వధువు సంఘములోని 7చ) ఆయన మన నిమిత్తమై ఆలస్యము చేయును (11 పేతురు 3:9) ఆయన వచ్చినప్పటికి విశ్వాసుల సంఘము సిద్ధముగా వుండనేరదు అందుచేత ఆయన త్వరగా అనునది మన "ఆలస్యము" అయినది. (2) వెయ్యి సంవత్సరములు ఆయన దృష్టిలో ఒక దినమై సంవత్సరములే ఒకదినముకాదు మనదృష్టిలో ఉన్న దీర్గ కాలము ఆయనదృష్టిలో స్వల్పకాలమే. గనుక ఆయన త్వరగా త్వరగానే వచ్చునన్న మాట నిజమే (వధ్వు 3 చ) 3) విశ్వాసులును ఆయనయును ఒకటై యున్నారు. ఆయన ఏమి పలుకునో అది నిజమని విశ్వాసుల జ్ఞానమునకుతోచక పోయినను వారి విశ్వాసమునకు తోచును. అందుచేత వారు కూడా ఆయనవచ్చునని ప్రకటింతురు. (వధువు 6చ) 4) వారి ఆత్మకు దీర్ఘ కాలము స్వల్ప కాలమై యున్నది. గనుక త్వరగానే అని తొందరపడరు. (వధువు 3చ) 5) ఆయన రెండవ రాకడకు ముందు కొన్ని గుర్తులు జరుగునని వ్రాయబడి యున్నది. ఆ గురుతులన్నియు జరిగిన తర్వాత ఆయన వెంటనే వచ్చునని మనము గ్రహింపవలెను. (వధువు 2 చ) వీటిని బట్టి త్వరగానే అని అర్ధమగుచున్నది. (ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను" అని ప్రభువు చెప్పిన మాటకు కూడా ఇదే అర్ధము.


యోహాను సాక్ష్యము:- చూచినది, విన్నది, అనుభవించినది తెలుపుటయే సాక్ష్యము మా పెద్దలు చెప్పినారట. అట అనునది సాక్ష్యము కాదు యోహాను దేవుని వాక్యమును గూర్చి యేసుక్రీస్తు సాక్ష్యమును గూర్చియు తాను చూచినంతమట్టుకు సాక్ష్య మిచ్చెను. ఆది యందు వాక్యముండును.ఆ వాక్యము దేవుని యొద్ద వుండెను. ఆ వాక్యమే దేవుడై యుండెను (యో 1:1) ఆ వాక్యమే శరీరధారియై కృపాసత్య సంపూర్ణుడుగా మనమధ్య నివసించెను. (యో 1:14)ఈ వాక్యములయందు వాక్యమైన దేవుడు నరావతారియైన యేసుక్రీస్తును గూర్చి యెరిగిన యోహాను జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది వుండెనో మేమేది వింటిమో కన్నులారా ఏది నిదానించి కనుగొంటిమో మాచేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాను అని వ్రాసినసాక్షి యోహానే. యోహాను వాక్యమును గూర్చియు, యేసుక్రీస్తును గూర్చియు సాక్ష్యమిచ్చినందుకు రాజు ఖైదులోనుంచెను. ఖైదులో ఒక్క్డుగానున్న యోహాను నొద్దకు ప్రభువు జతగా వచ్చి మంచిసమయమున దొరికినది అని ప్రకటన గ్రంధంలోని 22 అధ్యాయములను చూపించి వ్రాయించెను. ఆ వ్రాత స్నేహితులు తీసికొని దాచిరి. కొన్ని తరములైన తర్వాత బయటికి వచ్చెను. రాజునకు తెలిసిన ఈ పుస్తకమును కాల్చివేయును గనుక దేవుడు ఈ గ్రంధమును కనబడనీయలేదు. ఈ గ్రంధము వ్రాయకముందే ఆది కాండము మొదలు యూదా పత్రిక వరకు వ్రాయబడి వుండెను.


సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని యిందులో వ్రాయబడిన సంగతులను గైకొనువారును ధన్యులు.(ప్రక:3) ప్రభువు రాకడకు ముందు జరుగవలసిన సంగతులు జరిగిపోయినవి గనుక సంఘము ఎత్తబడుటకు సమయము సమీపించినది. ప్రకటనలో నున్నట్లు సాతాను రాజ్యమంతయు కూలిపోవుటకును దేవుని రాజ్యము భూమిపైకి వచ్చుటకును సమీపించినది ఈ స0గతులు రాబోవు కాలములో జరుగును గనుక మనమప్పుడు ఉండము. కాబట్టి యిపుడెందుకు చదువవలెనని కొందరడుగుచున్నారు. చదువవలెనని బైబిలులో నున్నది గనుక చదువవలెను చదువువాడు ధన్యుడని కూడా వున్నది గదా! గనుక చదువని వాడు ధన్యుడుకాడనే అర్ధము చదువురానివారు ఒకరిచేత చదివించు కొనుటకంటే చదువు నేర్చుకొనుట మంచిది.


ఆసియాలోని 7 సంఘములు యోహాను శుభమనిచెప్పి వ్రాయు సంగతులు. చిన్న ఆసియాలోనున్న అనేక సంఘములలో ఏడు సంఘములకు యోహాను వర్తమానము పంపుచున్నాండు. ఈ ఏడును క్రైస్తవ సంఘములన్నిటికి మాదిరి సంఘములై యున్నవి. ఎన్ని సంఘములున్నను ఆత్మీయ స్థితిలో ఏడు అంతస్థులుగా నున్నట్లు ప్రకటన 2,3 అధ్యాయములనుబట్టి తెలియుయుచున్నది. ఈ ఏడు సంఘములు చరిత్రాత్మకమైన స్థితిని తెలుపునవి. అందుకని ఈ ఏడు సంఘములను పోల్చి వ్రాసెను.


ప్రభువు మొదటి సంఘమునకు సలాముచెప్పెను. సంఘము ప్రభువునకు ముందు సలాము చెప్పవలెను. కాని ప్రభువు వచ్చినట్లు సంఘమునకు తెలియదు గనుక ప్రభువే చెప్పెను. సంఘమునకు సలాము చెప్పుమని ప్రభువు యోహానుతో చెప్పెను.


"కృపాసమాధానము కలుగునుగాక" అని ప్రభువు ఇక్కడ సంఘముతో చెప్పెను. ఇదే సలాము మొదట ప్రభువు ఆరోహణమైన తరువాత మేడగదిలో అపొస్తులులు కూడుకొన్నప్పుడు ప్రభువు వారి మధ్య నిలిచి "మీకు సమాధానము" కలుగునుగాక! అనెను (యోహాను 20:26) అరువదిమూడు సంవత్సరములెన తరువాత ఇప్పుడు యోహానుకు పదంస్ ద్వీపమందుకనబడి "కృపాసమాధానము కలుగును గాక! అని చెప్పెను.


ప్రభువు చెప్పిన సలాము ఎక్కడనుండి వచ్చినది? ఈ సలాము దైవ త్రిత్వము నుండి వచ్చినది తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, అను త్రిత్వరూపమును (మత్తయి 28:19) క్రీస్తు ప్రభుని బాప్తిస్మ కాలమందు (మత్తయి3:16,17) కుమారుడు పరిశుద్ధాత్మ, తండి అను త్రిత్వరూపము కనబడినది. ఆరాధనాంతమందు యిచ్చు ఆశీర్వచనమందు (2కొరిథి 13:14) ప్రభువు, తండ్రి, పరిశుద్ధాత్మ అను త్రిత్వరూపమున్నది. ఈ కృపాసమాధాన సలాము వచ్చిన త్రిత్వరూప మిట్లున్నది. వర్తమాన భూత, భవిష్యత్ కాలములలో వుండుచున్న వానినుండి అనగా అన్ని కాలములోనున్న తండ్రియైన దేవుని నుండి ఏడు ఆత్మలనుండి, (సిం హాసనము ఎదుటనున్న) నమ్మకమైన సాక్షియు మృతులలోనుండి లేచినవాడు. (ఆది సంభూతుడు) భూపతులకు అధిపతియైన యేసు క్రీస్తునుండి, కృపా సమాధానము అను సలాము వచ్చెను. దీనిని బట్టియే ఆరాధన ప్రారంభమందు గురువుతండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున మీకు కృపాసమాధానము కలుగునుగాకని సంఘముతో చెప్పును.
1. జరుగుచున్న కాలము జరిగిపోయిన కాలము జరుగబోయే కాలము అనగా అనాదినుండి అనంతము వరకున్న అన్ని కాలములలో నున్న తండ్రి నుండి (అన్ని కాలంబులనున్న యెహోవాని పాట).
2. ఏడు ఆత్మలనుండి సిం హాసనము ఎదుటనున్న) ప్రకటన 4అ) సిం హాసనా సీనుడైన తండ్రి సిం హాసనమును ఆవరించిన ధనస్సైన కుమారుడు. ఆ సిం హాసనమును యెదుట ఏడు దీపములు ప్రజ్వరిల్లుచున్నవి అవి దేవుని ఏదూ ఆత్మలు ఇవి దైవాత్మ యొక్క ఏడు విధములైన శక్తులు, ఆయా సమయములయందు ఆయా పనులలో ఈ శక్తులు సహాయకరముగా నుండును సఘములయొక్క స్థితినిబట్టి ఏడురకములుగా పనిచేయును. ఏడు అను సంఖ్య బైబిలులో పరిశుద్ధ సంఖ్యయై యున్నది. ఈ ఏడు యొక్క ప్రాముఖ్యత బైబిలు అంతటిలో కనబడును. ముఖ్యముగా ప్రకటన గ్రంధములో అనేకమారులున్నవి. దైవ విషయములకుపోటీగా సాతానుకూడ తన దుష్ట శక్తులను కనపరచుటకు ఏడుతలలున్నవి (ప్రకటన 12:3) ఈ తలలు జ్ఞానశక్తులకు గుర్తు. సైతాను కూడ దైవకార్యములను నెరవేర్చకుండా చేయుటకు తనలోని ఏడుజ్ఞాన శక్తులను ఉపయోగించును.
3.(ఎ) నమ్మకమైనసాక్షి:- క్రీస్తు ప్రభువు సాక్షియైయున్నాడు త్రిత్వ దేవత్వమును పూర్తిగా బయలు పరచువాడు క్రీస్తే అనగా త్రిత్వ దేవుని గురించి సాక్ష్యము చెప్పువాడు క్రీస్తే "ఎవ్వ్వడును ఎప్పుడైనను దేవుని చూడలేదు. తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలు పర్చెను"(యోహాను 1:18) మోషే దేవునితో ముఖాముఖిగా మాటలాడెను. (నిర్గమ 33: 11:33:20-23) కాని ఆ మాటలాడుట దైవ ప్రత్యక్షతను బట్టి మాటలాడుటయై యున్నది. అనాదిని దేవుడున్నప్పుడు మోషే త్రిత్వమును చూడలేదు క్రీస్తు ప్రభువు అనాదిలో దేవుడైయుండి బెత్లెహేములో పుట్టి అందరికి త్రిత్వమును బయలు పరచెను. (మత్తయి 8:16.17) ఆయన మాదిరిని అనుసరించువారు కూడ సాక్షులై యున్నారు. వీరు క్రీస్తు వలన విన్న సంగతులను ఇతరులకుచెప్పి వారి యెదుట క్రీస్తును గురించి సాక్ష్యమిచ్చు సువార్తికులు, యోహాను కూడ అట్టివాడు.
(బి) క్రీస్తునకు ఆది సంభూతుడుగా లేచినవాడని పేరు ఎందుకనగా యాయీరు కుమార్తె నాయీను విధవరాలి కుమారుడు. బేతనియలోని లాజరు ఈ మొదలైనవారు చనిపోయి క్రీస్తువలన బ్రతికి మరల చనిపోయినారు. క్రీస్తు ప్రభువు చనిపొయి లేచెను. మరలా చనిపోలేదు. గనుక మరణములో నుండియు మృతులలో నుండియు లేచిన వారిలో ఈయనే మొదటివాడు కడవరి కాలమందు క్రీస్తునందు మృతి పొందిన భక్తులందరిని క్రీస్తు ప్రభువు లేపును. క్రీస్తునకు ఎట్లు రెండవసారి మరణము లేదో అట్లే భక్తులకు కూడ మరణముండదు. మరణము లేనివారిలో మొదటివాడు క్రీస్తే గనుక ఆదిసభూతుడు. (కొలస్సై 1:15-18)
(సి) భూపతులకు అధిపతి:- సృష్టియాదినుండి అంతము వరకు భూమి మీద ఏలువారందరికి పైగా క్రీస్తు రానైయున్నాడని ఈ మాట వలన తెలియుచున్నది. ముందునకు రానైయున్న వెయ్యేండ్ల శాంతి కాలముతో క్రీస్తు ఒక్కడే అందరికి రాజుగా ప్రత్యక్షమగును ఆ కాలము రాకముందు యిప్పుడున్న రాజులు భూమిమీద ఏలుబడి చేయుటకై క్రీస్తు వలన ఏర్పరుపబడిరి. ఆయన భూమి మీదికి వచ్చినపుడు వారిపని అంతమగును. అప్పుడు రక్షితులు కూడ క్రీస్తుతో కలసి రాజ్యపరిపాలన చేయుదురు. (19:15,16;20:4-6)


త్రిత్వ దేవుని సలాము క్రీస్తు ద్వారా క్రైస్తవ సంఘము త్రిత్వదేవునికి తిరిగి సలాము చెప్పుచున్నది. (ఎ) మనలను ప్రేమించుచు (బి) రక్తముచే పాపముల నుండి విడిపించిన వానికి మహిమ ప్రభావము యుగయుగములు కలుగునుగాక! ఆమెన్. ఈ సలాము యుగయుగములకు అని ఉన్నది గనుక ఈ సలాము పెద్దది, గొప్పది. దీనికన్న మించినది లేదు. రాత్రి నిద్రపొయిన తర్వాత మెళకువ రాగానే మొదట ప్రభువును జ్ఞాపకము చేసుకొని ప్రతిదినము ఈ స్తుతి చేసిన విశ్వాసికెంతో స్థితి కలుగును. ఈ స్తుతినిబట్టి క్రైస్తవ సంఘము ఆరాధనలో తండ్రి కుమార పరిశుద్ధాత్మకును తగు స్థుతి మహిమలు కల్గుగాక!= ఆదిని ఇప్పుడు ఎల్లప్పుడు- అయినట్లు యుగములనౌను ఆమెన్ అని పాడుకొనుచున్నది. లోకములో పాపశాపము వలన గాయపరచబడిన మానవులను ప్రేమించి తండ్రి రొమ్ముననున్న క్రీస్తుప్రభువు మానవ రూపము ధరించుకొని లోకమునకు వచ్చి మాన పాపపరిహారము కొరకు రక్తము చిందించి ప్రాణ సమర్పణ చేసెను. ఆయన రక్తము వలన మనకు విమోచన కలిగెను.


"అమూల్యమైన రక్తముచేత అనగా నిర్ధోషమును, నిష్కమ్ళకమునగు గొఱ్ఱెపిల్లవంటి క్రీస్తురక్తముచేత విమోచింపబడితిరని మీరెరుగుదురు కదా (1:పేతురు1:19) పాపికి క్రీస్తు రక్తము వలన శుద్ధి (మత్తయి 26:28; 1యోహాను 1:7-9) దేవుడు తన స్వరక్తమిచ్చి సంఘమును సంపాదించెను. (అ||కా|| 20:28) ఆదాము నుండి అంతము వరకున్న మానవులందరిని ప్రభువు తన రక్తముతోకొనెను. ఈ స్థితిని ఎరిగిన అనేకులు క్రీస్తు ప్రభువు వలన విమోచన, రక్షణ కలదని విశ్వసించి బాప్తిస్మను ముద్రను పొందుచున్నారు. ప్రభువు రెండవమారు వచ్చి ఆయన యొద్ద నుండుటకు తీసికొని వెళునని సిద్ధపడుచున్నారు. ప్రభువుయొక్క ప్రేమనెరిగి విమోచింపబడిన వారు ప్రభువును స్తుతించక మానరు.


ప్రభువు చేసిన పని:- మనలను తండ్రియైన దేవునికి ఒక రాజ్యముగాను, యాజకులుగాను చేసెను. క్రీస్తు ప్రభువురాజు యాజకుడు. పగటికాలమున ఆయన చేసిన సేవనుబట్టి ఆయన రాజు, రాత్రి కాలమందు ఆయన చేసిన ప్రార్ధనను బట్టి ఆయన యాజకుడు. సిలువలో ఆయన రాజు, యాజకుడు. ఆయన పునరుత్థానమును బట్టి ఆయన రాజు: ఆరోహణమై వెళ్ళి తండ్రి ప్రక్కను విజ్ఞాపన చేయుటను బట్టి ఆయన యాజకుడు ఆయన రెండవమారు వచ్చి సంఘమును పరమునకు తీసికొని వెళ్ళి దేవునికి రాజ్యముగా చేయును రాకడలో వెళ్ళక మిగిలినవారి రక్షణకై పరమదు ప్రార్దించు యాజకులనుగాచేయును. క్రీస్తుప్రభువు భులోకమంతటిని వెయ్యియేండ్లు పరిపాలించుటకై భూమిమీదికి వధువు సంఘముతో వచ్చును అప్పుడు ప్రభువు రాజుగాను,యాజకులుగాను వుండును. తనలోనున్న భక్తులను రాజులుగను,యాజకులుగాను చేయును. జయించినందున రాజులు, ఆరాదించినందున యాజకులు (ప్రకటన5:10-20:4)


Home


ప్రకటన 1:7

ఆయన మేఘారూఢుడై వచుచున్నాడు. (ప్రకటన 1:7) (ఎ) ప్రతినేత్రము చూచును. (బి) ఆయనను పొడిచిన వారును చూతురు. (సి) భూజనులందరు రొమ్ము కొట్టుకొందురు (డి) అవును ఆమెన్ .


ప్రభుని రాకడలు అనేకములు: 1. ఆది కాండము మొదలు ప్రభువు జన్మదినమువరకు ప్రభువు భక్తులకు ప్రత్యక్షమగుట. 2. ప్రభువు సంఘమును సంపాదించు కొనుటకు వరుడుగా జన్మించుట,(ఆది 32:30) ఇది మొదటి రాకడ్ద్ద (యోహా1:14) 3. ఎక్కడ యిద్దరు ముగ్గురు వుందురో వారి మధ్యకు ప్రభువు వచ్చుట (మత్త 18:20 4. ఇప్పుడు ప్రార్ధించిన యోహానుకు కనబడినట్లు కనబడుట. దర్శనములో కనబడుట ఇది ఒక రాకడ. 5. ప్రభువు సంపాదించిన సంఘమును తీసికొని పోవుటకు ప్రభువు వచ్చును.(ప్రక 1:13-20)ఇదే రెండవ రాకడ. ఈ రాకడ వెళ్ళువారికే తెలియును. గాని మిగిలిన వారికి తెలియదు. (1 థెస్స 4:16-18) (మత్త 24:40-44; లూకా 17:34-35) 6. ప్రభువు గుర్రములపై వచ్చి రాకడలో వెళ్ళక మిగిలిన వారిని అప్పుడప్పుడు, అక్కడక్కడ ఏడేండ్లలో తయారైన వారిని తీసికొని వెళ్ళుటకు వచ్చును (ప్ర6:1) (పరగేరుకొనునట్లు) 7. హర్మెగెద్దోను యుద్ధమునకు వచ్చుట మీరింతకాలము నా సంఘమును సృష్టిని పాడుచేసిరి. వారికొరకు వచ్చును. ఇది యోహానుకు విపులముగాతెలిపెను. (ప్రక 19:19-21; 16:12-16) 8. సైతానును మట్టులేని గోతిలో బంధించుటకు వచ్చును. సాతాను కొరకు (ప్రక.20:1-3) 9. వెయ్యేండ్లు భూమిపై శాంతి పాలన చెయుటకు వచ్చును.సృష్టి పతనమునకు ముందు కలిగిన స్థితిని అనుభవించుటకును, లోకమంతా సువార్త వినుటకును (ప్రక 20:4-6 ) 10. సజీవుల తీర్పు తీర్చుటకు వచ్చును. (వెయ్యియేండ్లలో సువార్త విన్నవారికి) మత్త25:31-46. 11. చెరలోనున్న సైతానును విడిపించుటకు వచ్చును. సాతాను కొరకు ఎదురు చూచుచున్న వారికొరకు.(ప్రక 20:7-10) 12. ఇప్పుడు అంత్యతీర్పు కొరకు వచ్చును దూత లుండరు తండ్రి, పరిశుద్ధాత్మ, భక్తులు ఉండరు. ఎక్కడ జరుగునో తెలియదు. ఎవరు సహింపలేరు. ఆయన ప్రభావము వల్ల నిలువబెట్టి తీర్పు తీర్చి పంపివేయును. అన్నీ ప్రభావము వల్లనే జరుగును. (ప్రకటన 20:11-15) తీర్పు దినమున పరిశుద్ధాత్మకు తండ్రికి కలుగు విచారము (ఆది 6:6) నందు చెప్పబడినది.


సాతానుపై విజయమునకై హర్మగెద్ధోను యుద్ధము. అప్పుడు మూడువిధములైన ప్రజలు ఆయనను చూతురు. ప్రతి నేత్రము ఆయనను చూచును. ఆయనను పొడిచినవారుకూడ చూతురు. వీరు క్రీస్తును సిలువ వేసిన యూదులయొక్క సంతతివారు. భూజనులందరు రొమ్ముకొట్టుకొందురు. ఎందుకనగా వారు క్రీస్తును తమ రక్షకునిగా అంగీకరింపలేదు. అంగీకరించినవారు మేఘములోనికి వెళ్ళుదురు. మేము సద్ధపడకముందే ప్రభువు వచ్చియున్నారను తలంపును మేము మేఘములోనికి వెళ్ళలేము అను తలంపును మేము ఇప్పటినుండి శ్రమల పాలగుదుము అను తలంపును కలిగి అనేకులు భీతిచేతను దఃఖము చేతను రొమ్ము కొట్టుకొందురు. ప్రక 6: 12-17) రొమ్ముకొట్టుకొనుట ఎరుగుదురు కాని ప్రభువా! మమ్మును క్షమించుమని ప్రార్ధించుట ఎరుగరు. తమ్ముని దీవెన అపహరించిపగోరి అది దొరకనందున ఏశావు గొళ్ళున ఏడ్చుట నేర్చుకొన్నాడు కాని నాది నేరమే క్షమించుమని పలుకుట నేర్చుకొనలేదు. (ఆంధ్ర క్రైస్తవ కీర్తన 228) నాడు వచ్చినట్లు కాదు నేడు రాకడ=తేరి- చూడరాదు క్రీస్తునింక-జొత్తుమెచ్చట.


Home


ప్రకటన 1:8

ప్రకటన 1: 8 ప్రభువు 1) అల్ఫ, 2) ఓమెగ ఎ. సర్వాధికారి, బి. దేవుడగు ప్రభువు ఎ. వర్తమానం, బి, భూత భవిష్యత్ కాలములందు ఉండువాడు.


పా||ని|| గ్రంధము హెబ్రీభాషలో వ్రాయబడినది. ఇది ఏర్పాటు సంతతి అయిన యూదుల భాష, ప్రభువు కాలమందు రోమా ప్రభుత్వము కలదు. వారి భాష రోమియు భాష. ఇప్పుడు ఇంగ్లీషు భాష లోకమంతటికి ఎట్లు తెలియుచున్నదో, అట్లే గ్రీకు భాష క్రొత్తనిబంధన వ్రాయబడిన కాలమందు లోక మంతటికి తెలియును. లోకమదున్న వారందరికి మోక్షరాజ్యమిచ్చు రాజు క్రీస్తు అని తెలియుటకు క్రీస్తు ప్రభువును, సిలువవేసిన సిలువపై హెబ్రీ, రోమా, గ్రీకు, భాషలలో యూదుల రాజని వ్రాసిరి. క్రొత్త నిబంధన గ్రీకు భాషలో వ్రాయబడినది. గ్రీకు భాషలో "అల్ఫ" అను అక్షరము మొదటి అక్షరము. "ఓమెగ" చివర అక్షరము. అందుచేత ఈ ప్రకటన గ్రంధములో "అల్ఫ ఓమెగ" అను మాటలు వాడబడెను.


1) అల్ఫ:- క్రీస్తు అల్ఫ అయి ఉన్నాడు అనగా మొదటివాడుగా ఉన్నాడని అర్ధము. భూజనులందరిలో మొదటివాడు, రక్షకులని చెప్పుకొనిన వారిలో మొదటివాడు దైవావతార పురుషులని చెప్పుకొనిన వారందరిలో మొదటివాడు, మన పనులన్నిటిలో తోడ్పడుటకు మొదటివాడు, ఈయనను మించినవారు లేరు.


2) ఓమెగ:- క్రీస్తు ఓమెగ అనగా క్రీస్తు మనకు తోడ్పడుటలో ఏలాగు మొదటివాడో అలాగే కడపటివాడునై యున్నాడు. తరువాత మరియొక సహాయకుడు లేడను భావము "ఓమెగ" లో కనబడుచున్నది ఈయన సృష్టికి ఆరంభమందును సృష్టియొక్క ముగింపునందున్నవాడు. ఈ మధ్య కాలములో కూడ యుండువాడు, భూలోక చరిత్రనుబట్టి చూడగా లోకాంతము కలదు గాని పరలోక చరిత్రనుబట్టి చూడగా ముగింపులేదు. ఆయన అనంతములో నుండును. గనుక రక్షితులు కూడా అనంతములో నుందురు. మానవ రక్షణ కొరకు క్రీస్తుప్రభువే అల్ఫ ఓమెగ మానవ రక్షణ కొరకు వ్రాయ బడిన గ్రంధము బైబిలే. ఇదే "అల్ఫ ఓమెగ". దీనిని మించిన గ్రంధము మరియొకటి లేదు మానవ రక్షణ కొరకున్న మతమే "క్రైస్తవ మతము". ఇదే "అల్ఫ ఓమెగ" దీనిని మించినది మరియొకటి లేదు.
ఎ) సర్వాధికారి:- ప్రకటనలో సర్వాధికారి అనేక మారులు కలదు. ఇహమందు పరమదు, దృశ్యమైనవి. అదృశ్యమైనవి. సర్వమునకు ఆధారమును, అధికారియు ఈయనే, (కొలొస్సై 1:15-7).
బి) దేవుడగు ప్రభువు:- ఈయన సర్వసద్గుణ లక్షణధారి యై సమస్తమును కలుగజేసిన అదృశ్యదేవుడై యున్నాడు. ఈ దేవుడే జరుగుచున్న, జరిగియున్న జరుగనైయున్న కాలములందుండి పరిపాలించు ప్రభువై యున్నాడు. ఈయన అదృశ్యదేవుడై యుండి సర్వము చేయుటకు ఆధారమైయున్న యీయనే మానవ రక్షణ కొరకు మనిషిగా వచ్చిన రక్షకుడు, దేవుడు, మనిషి, గనుక సృజించుటకును, సృష్టికి ఆది, అంతమునై యుండుటకు సరిపోయినవాడు.
Home



ప్రకటన 1:9

ప్రకటన 1:9 యోహాను:- మీ సహోదరుడను, పాలివాడను, యేసుశ్రమలో, రాజ్యములో, సహనములో. ఎ) దేవుని వాక్యము బోధించి నందున, బి) యేసును గూర్చి సాక్ష్యము సి) పద్మసు ద్వీపమునందు పరవాసి.
ఎ. మీ సహోదరుడను-గొప్ప అంతస్థు గల యోహాను మీ సహోదరుడనని వ్రాయుచున్నారు. క్రీస్తుయేసును విశ్వసించి అంగీకరించిన యే దేశస్తులైనను, యే భాషవారైనను, ఘనులైనను అల్పులైనను, విద్యావంతులైనను విద్యావిహీనులైనను, యెవరైనను, యెట్టివారైనను క్రీస్తు ప్రభువును బట్టి సహోదరులమే.
బి. పాలివాడను:- యోహాను మూడు విషయములలో పాలివాడు.
1) శ్రమలు:- క్రీస్తునుగూర్చి ప్రకటించినపుడు ఆయనకు యితరుల వలన కష్టములు కలిగినవి.
2) రాజ్యములో పాలివాడు:- ఎందుకనిన క్రీస్తు రాజ్యము భూమి మీద వ్యాపించుటకు ఆయన యెచ్చటకు వెళ్ళి సువార్త ప్రకటించినను ఆయనతో నున్నాడు. ఆ సువార్తవిని నమ్మిన సంగస్థులు యే పట్టణములో నున్నారో అక్కడే దేవుని రాజ్యము ఉన్నది. పరలోక రాజ్యము భూమిమీద ప్రకటింప బడినది. ఈ రాజ్యము భూలోక సంబంధమైన రాజ్యము కాదు.
3) సహనములో: పాలివాడని యోహాను చెప్పుచున్నాడు. రాజ్య సువార్త ప్రకటించినప్పుడు ఆయనకు కలిగిన శ్రమలకు విసుగుకొనక సువార్తపని మానివేయక సహించుచున్నాడు.
ఎ) దేవుని వాక్యములో బోధించినందున:- క్రీస్తు ప్రభువు కేవలము దేవుడని ఆయన తన సువార్తలో కనబరచినాడు. పత్రికలలో కూడ కనబరచినాడు. (యోహాను 1:1-3) (1యోహాను 5:20)
బి) యేసును గూర్చిన సాక్ష్యము:- ఆయన క్రీస్తు ప్రభువును స్వయముగా చూచినాడు. ఆయనతో ఉన్నాడు, ఆయన చరిత్రనంతయు కనిపెట్టినాడు. (1యోహాను 1:1-4)
సి) పద్మసు ద్వీపమునందు పరవాసి:- యోహాను దేవుని వాక్యము బోధించి, క్రీస్తు ప్రభువును గూర్చి సాక్ష్యమిచ్చినందున క్రీ||శ|| 93వ సం|| న డొమినీషియన్ అను రోమను చక్రవర్తి చిన్న ఆసియాలోని మధ్యధరా సముద్రమునందు గల పద్మస్ ద్వీపమునకు పరవాసిగా పంపెను. ఇక్కడ కొద్దిమంది క్రైస్తవులున్నారు.

Home


ప్రకటన 1:10

ప్రకటన 1:10 ఆత్మవశుడను:- ప్రభువు దినమున బూర ఎ) వ్రాయుము (చూచినది). బి) పంపుము 7 సంఘములకు.


ప్రభువు దినమున:- పా||ని||లో యూదులకు సబ్బాతు శనివారమై యుండెను. అప్పుడు క్రీస్తు ప్రభువు దానికి ప్రభువై యుండెను. (మత్తయి12:8) ఇప్పుడు అనగా పునరుత్థానమైన తరువాత ఆదివారమునకు ప్రభువుగా నున్నారు. ఎందుకనగా ఆయన పునరుత్థానము ఆదివారము శనివారము క్రొ||ని|| కాలశిష్యులకు దుఃఖదినమై యుండెను. ఎందుకనగా క్రీస్తు ఆవేళ సమాధిలో నుండెను. ఆదివారము వారికి సంతోషకరమైన దినమైయుండెను. అందుచేత నేటివరకు క్రైస్తవులు ఆదివారము ఆరాధన దినముగా ఆచరించుచున్నారు. మీరు ఆదివారము ఆరాధన దినముగా ఆచరించండని ప్రభువు చెప్పలేదు. అయినను ఆయన లేచిన క్రియ వలన ఆదివారము ముఖ్యదినముగా చూపించుచున్నాడు. పునరుత్థానము అయిన తరువాత శిష్యులు ఆదివారముననే గదిలో కూడుకొనిరి. ఆదివారమును ఆరాధన దినముగా ఆచరించుటకు శిష్యులు స్వతంత్రులై యున్నారు. ఆదివారము కూడుకొనుట నేరమైయున్నయెడల ప్రభువు చెప్పియుండును. అట్లు చెప్పలేదు సరికదా!వారు ఆదివారమును కూడియుండగా వారిమధ్యకు వెళ్ళి మీకు సమాధానము కలుగును గాక! అని చెప్పెను.(యోహాను 20:19) ఆదివారము ఉదయమున ఆయన పునరుత్థానుడుగా శిష్యులకు సమాధియొద్ద కనబడెను (మార్కు 16:9) పునరుత్థానుడుగా కనబడుట ఆదివారమే గనుక అది పునరుత్థాన జ్ఞాపకార్ధమై నేటివరకు ప్రసిద్ధిలో నున్నది. (అ.కార్య 20:7)


Home


ప్రకటన 1:11

ప్రకటన: 1:11 1 బూర=దగ్గరకు, దూరమునకు వినబడునది. ప్రభువు 33 1/2 సం||లలో బోధించినది మొదట శిష్యులకు వినబడెను. తరువాత భూదిగంతముల వరకు సర్వలోకమునకు వినబడుచున్నది. ఈ బూర రాబోవు రక్షణ సువార్త వ్యాపకమునకు లోకాంతము వరకు వినబడునను దానికి ముంగుర్తు. ప్రభువు చేతిలో బూరలేదు గాని బూర స్వరమువలె నున్నదని యోహాను గుర్తించెను. బైబిలులో నున్నదని మేము బూరలో సువార్త చెప్పుట ప్రారంభించినాము అన్నిబూరలకంటె పెద్దబూర సువార్త బూర. బూర:- యోహాను ఆత్మవశమై బూరధ్వనివంటి గొప్పస్వరము వినెను. ఈ స్వరము గొప్ప స్వరము. ఆత్మవశము వలన చెవిపని కట్టబడిన యోహాను ఎట్లువినెను? సందేహము గలవారు క్రీస్తును పిలిచి అడిగిన యెడల స్పష్టముగా చెప్పును.


ఆత్మవశము:- ఆత్మను పొందిన ఆత్మవలన వెలిగింపబడి, ఆత్మ వలన నడిపింపబడుచున్న యోహాను యోహాను ఆత్మ వశమాయెను. ఎందుకనగా ప్రకటన వ్రాయుటకు అనగా పరలోకములో ఇకముందు జరుగవలసిన సంగతులన్ని వినుటకు, చూచుటకు వ్రాయుటకు యోహాను ఆత్మవశమాయెను. గనుక ఇప్పుడు శరీరము యొక్క ఆటలు సాగవు ఆత్మవశములో అనేక డెగ్రీలున్నవి. యోహాను అంతస్థు యెవరికిరాదు. ఎందుచేతననగా యోహాను ప్రకటన వ్రాయవలెను పరలోక సంగతులు జ్ఞానము వలన స్వప్నము వలన, కొంతవరకు తెలిసికొనగలము. ఆత్మ వశము వలన సంపూర్ణముగ తెలిసికొనగలము. ఆత్మవశము కష్టమైనది. యోహాను నేలమీదపడి మనస్సును, జ్ఞానమును, సమయమును, శరీరమును, ప్రభువుయొక్క ఆత్మవశము చేసుకొనెను. తాను ఏమి పనిచేయలేడు. అన్నికట్టబడెను. ప్రాణము మాత్రము ఉండెను. పండురాలిపోవుటకు సిద్ధముగా నున్నట్టు యోహానుండెను. ప్రాణము కూడ అట్లే ఉండెను. పని అంత కట్టిపెట్టెను. ఆత్మవశమైన యోహాను ఆత్మ యిష్టమే నెరవేర్చును గాని తన యిష్టమును నెరవేర్చడు, శరీరవశములో నున్న వన్నియు ఆటంకములే ఆత్మ వశమైన యిక ప్రశ్నలుఉండవు. పరలోక సంగతులు వినుటకు, చూచుటకు, అర్ధమగుటకు, గ్రహించుటకుఇంతవరకుఉన్నవచనములలో వీలగును. తండ్రి కుమారుడు, ఆత్మ కనబడుచున్నారు. త్రిత్వము యీ భాగములోనే ఉన్నది. యోహాను త్రిత్వదేవుని సేవకుడు.


శరీరము ప్రాణము, ఆత్మ యీ మూడు అక్కడే ఆత్మ వశములో నున్నవి గాని ప్రభువు రాగానే శరీరము వినలేదు. ప్రాణము వినలేదు ఆత్మ ఆయన స్వాధీనములో నుండుటచేత ఆత్మకు వినబడెను. శరీరము ప్రాణము యీ రెండును కట్టబడెను. ఆత్మ ఒక్కటే విప్ప విప్పబడెను. ఆత్మచెవులకు బూర ధ్వని వంటి ఒక స్వరము వినబడెను. స్వర్గమునకు గుణవాచకము గొప్ప అనునది ఉన్నది. ఇది బైబిలులోని 66 పుస్తకములలో గొప్ప పుస్తకము గనుక గొప్ప స్వరము వినబడెను. పెండ్లికుమార్తెగొప్ప లోకమునకు వెళ్ళవలెను గనుక గొప స్వరము వినబడెను. పెండ్లికుమార్తె గొప్ప లోకమునకు వెళ్ళ వలెను గనుక గొప్ప స్వరము వినబడెను. నెమ్మదిగా చెప్పక గట్టిగా చెప్పెను. ఎందుకని? ప్రపంచమంతటికి విన బడవలెను గనుక గొప్ప స్వరముతో చెప్పెను.ప్రకటన గ్రంధము వ్రాయబడవలెను. దాచబడవలెను. బైబిలు గ్రంధమునకు చివర చేర్చ బడవలెను. చివరకు అర్ధము దాచబడవలెను. చివరకు అర్ధము బయలుపడవలెను. ప్రపంచముయొక్క చివరివరకు వినబడవలెను గనుక గొప్ప స్వరముతో చెప్పబడెను. యోహాను యీ సమయ మందు వినుచున్న పనిమీదనే ఉండవలెను. ఈ కాలములో అనేకులు ఎంత దైవ సన్నిధిలో ఉన్నను యేమి దొరుకుట లేదనుచున్నారు. కారణము ఈ లోక సంబంధమైన చెవిని మొదటి వానిని బంధింపనందున యేమియు దొరుకుట లేదు. బంధించిన యెడల గొప్ప స్వరము వినబడక పోయినను స్వరము వినబడును. లోక సంబంధ మైన స్వరములు వినరాదు.యోహానుకిచ్చిన వరముకంటె గొప్పవరము యీ కాలములో దేవుడు అక్కడక్కడ యిచ్చుచున్నారు. బైబిలులో స్వరము ఉన్నది గాని ప్రభువు స్వరము స్వయముగా వినగలవారు వినవచ్చును. ప్రభువు అందరికి యిచ్చును.మనము యోహాను వలె చెయ్యలేక పోయినను, దినమునకు రెండు గంటలు పరవశమైన ఎంత ధన్యత? ఆయన వృద్ధాప్యములో నున్నారు గనుక ఆత్మవశము సుళువుగా వచ్చెను. ఇప్పుడు యే దశలోనైనను ఆ స్థితి వచ్చును. ఈ కడవరి కాలములో ఉన్న మనకు ఆయన కనబడుట, ఆయన స్వరము వినబడుట ఎక్కువగా జరుగుచున్నది. ప్రతిదినము యీ స్థితిలో ఉండవలెను.


పంపుము: నీవు చూచుచున్నది పుస్తకములో వ్రాసి ఎఫెసు, స్ముర్ణ, పెర్గెము, తుయతైర, సార్ధిస్, ఫిలదెల్ఫియా, లవొదికయ అను ఏడు సంఘములకు పంపుము. బూర మూలముగా యోహానుకు ఒక క్రొత్త సువార్తాంశము వినబడినది. ఇది వరకు ఆయన యౌవనుడై యున్నప్పుడు ప్రకటించిన సువార్తకాదు. ఇది అనువార్త యొక్క సశేషము. అదేదనగా యిప్పుడు యోహాను చూచుచున్నది యేదో, ఇదివరకు ఆయన చూచియుండలేదు. ఇది వరకు ఆయన చూచినది క్రీస్తుయొక్క జీవితకాలము. ఇప్పుడు చూచుచున్నది, యీ ప్రకటన పుస్తకములో వ్రాయవలసి యున్నది. అది భూలోకములోని సంఘమునకు ప్రతినిధులుగానున్న 7 సంఘములకు పంపవలసినది. వాటి యొద్దనుండి అది లోకాంతము వరకు సాగివెళ్ళనై యున్న సంఘమునకు అందవలెను.


Home


ప్రకటన 1:12

ప్రకటన 1: 12 వెనుకవిని చూడతిరిగితిని:) బూర స్వరము వినబడినప్పుడు యోహాను వెనుకకు తిరిగి చూచెను. యోహాను యెదుట చెరసాల, వృద్ధాప్యము, బలహీనత కనబడుచున్నవి. ఆయన దృష్టిని వాటినుండి త్రిప్పి తనతట్టు మరల్చుకొనుటకు ప్రభువు తలంచినట్టు కనబడుచున్నది.అనగా ఆ మూడును నీ సేవకు ఆటంకములు కావు అని ప్రభువు చెప్పుచున్నట్లున్నది. పుస్తకము సంఘమునకు పంపుమని ప్ర్భువు చెప్పెను. దీనినిబట్టి చూడగా యోహాను శిష్యులు ఆయన యొద్దకు వచ్చుచు, పొవుచున్నట్టు తెలియుచున్నది. వారు ప్రకటన పుస్తకమును తమ సంఘముల యొద్దకు తీసికొని వెళ్ళిరి. అది మనయొద్దకు వచ్చినది.


ప్రకటన 1:13

ప్రకటన 1:13 పైవచనములలో ప్రభువు యోహానుకు వెనుక తన స్వరమును వినిపించెను. కాని కనబడితే యోహాను తన వెనుకకు తిరుగగా ప్రభువు ప్రత్యక్షమాయెను ప్రభువు నరావతారిగా నున్న కాలములో మొదట చూచెను. పునరుత్థానుడై యున్న ప్రభువునుచూచెను. ఆరోహణమై పరమునకు వెళ్ళుచున్న ప్రభువును చూచెను.


ఇక్కడ పద్మసులోను ప్రభువును చూచెను. ఈ స్వరూపమును చూచుట మరింతగొప్ప సంగతి. ప్రభువు పాత నిబంధనలో తెరచాటున ఉన్నారు. క్రొత్తనిబంధనలో మనరూపముతో బహిరంగములోనికి వచ్చియున్నారు. ప్రకటనలో మనుష్య కుమారుని పోలిన మహిమరూపిగా నున్నారు.

1. 7 సువర్ణ దీపస్థంభములు =7 సంఘములు ఇవి వెలుగైయున్న క్రీస్తువలన వెలిగింపబడిన దీపములై యున్నవి. పాపకళంకము సంఘములో లేకుండ క్రీస్తు శుద్ధిచేసినందున దీపమువలె ప్రకాశించు చున్నది.
2. మీరు లోకమునకు వెలుగై యున్నారని ప్రభువు చెప్పలేదా? ఈమాట ఆత్మసంబంధమైన పరిశుద్ధతకు సంబంధించియున్నది. మనము అనుదినము చూచుచున్న దీపముకాదు యెవరును దీపము వెలిగించి కుంచము క్రింద పెట్టరు. అని ప్రభువు చెప్పెనుగదా? సువర్ణము అనగా బంగారము లోహములలో శ్రేష్టమైనది. కాంతి గలది. దేవస్థానమగు మోషే గుడారములో ఏడు దీపస్థంభములు ఉన్నసంగతి యిక్కడ జ్ఞాపకము వచ్చుచున్నది.
3. యోహాను తిరిగి చూడక తన యెదుటనే అనగా వృధాప్యము బలహీనత, మొదలగు వాటిని చూచుచున్న యెడల యింత కాంతి మహిమ కనబడక పోవును గదా?
4. దీప స్తంభముల మధ్య మనుష్య కుమారుడు అనగా క్రీస్తు ప్రభువు ఉన్నాడు. ఇద్దరు ముగ్గురు యెక్కడ కూడియుందురో అక్కడ ఉందునని చెప్పిన ప్రభువే ఆయన ఇద్దరు ముగ్గురే చిన్న సంఘము అయితే కాలములో భూమియందంతటనున్న సంఘము యిద్దరు ముగ్గురుకాదు. ఎన్నో వందల మంది ఉన్న సంఘమైయున్నది. ఇది లోకమంతటికి దీపమువలె కనబడుచున్నది. అనేకమందిని దీపమువలె వెలిగించుచున్నది. ఎందుకనగా నేను లోకమునకు వెలుగైయున్నానని చెప్పిన ప్రభువు సంఘములోనున్నారు. గనుక దేవుని కుమారుడు మన మానవ జన్మమెత్తినందున మనుష్యకుమారుని బిరుదు వచ్చినది. ఇందువలన మన మనుష్యులందరికి యెంత ఘనత? ఒక చక్రవర్తియును, సేవకుడును ఒక బల్లమీద కూర్చుండుట తటస్థించిన యెడల ఆ సేవకునికి ఎంత సంతోషము! ఎంత ఘనత !! మన దేవుని కుమారుడు భూలోక రారాజుకన్న గొప్పవాడు మనచెంతనుండుట యెంతమేలు?
పాదములమట్టుకు దిగుచున్న వస్త్రములు:- ప్రభువు యూదుడు గనుక యూదులు ధరించినట్టే ధరించిన అంగీని రావణువారు చీట్లువేసి పంచుకొన్నారు, ఇప్పుడు ఇక్కడ ధరించిన అంగీ మహిమ గలది.


రొమ్మునకు కట్టుకొనిన బంగారుదట్టి:- దీనినిబట్టి చూడగా ఆయన ఆయన యాజకరూపముతో యోహానుకు కన బడ్డాడని తెలియుచున్నది. ఇది రాజ ఠీవిని కనబరచుచున్నది. యాజకులు దేవునికి, సంఘమునకును మధ్యవర్తులు. క్రీస్తుకూడ మధ్యవర్తి మనము చేయలేని పనులు ఆయన చేసిపెట్టుట వలన, మధ్యవర్తియు యాజకుడునై యున్నాడు. గుడిలో పనిచేయు యాజకులు,లేవీయులు సంఘము నిమిత్తమై జంతుబలులనర్పించువారు. అయితే క్రీస్తు తానే బలియైనాడు. గనుక నేడు జంతు బలులు ఆగిపోయినవి. యోహాను పాత నిబంధన గుడి పూజారి సంగతి బాగుగా యెరిగినవాడు. అందుచేత ఆ యాజక దర్శనము బాగుగా గ్రహింప గలడు. అందుచేతనే ప్రభువు యాజక రూపముతో కనబడెను. దర్శనములో కూడ ఇదే చూచుచున్నాడు. యాజకులు తమ వస్త్రము జారిపోకుండ నడుమునకు దట్టీ కట్టుకొందురు. విశ్వాసికి నీతి యనే మైమరువును, సత్యమనే దట్టీయు కలదు. (ఎఫెసీ 6:14) పా||ని|| లోని యాజకుడు యిశ్రాయేలీయుల పండ్రెండు గోత్రములవారి భాగమును భరిచుటకు సూచనగా పండ్రెండు రత్నములు బంగారముతో పొదగబడిన ఏఫోదును తన రొమ్మున ధరించియున్నట్టు మనము చూచు చున్నాము. (నిర్గమ 28:16-23;39:8-21) అట్లే మన ప్రధాన యాజకుడైన ప్రభువు తన సంఘమును రొమ్మున ఆనించుకొని తన రూపము గల వధువుగా సిద్ధపరచుటకు తన రొమ్మునకు బంగారుదట్టి కట్టు కొనెను. అందుచేతనే ప్రభువు యోహానును తన రొమ్మున గొఱ్ఱెపిల్లవలె ఆనించుకొని, మేపి ప్రకటన గ్రంధమును చూచి వ్రాయగలవానిగ సిద్ధపరచెను. (యోహాను 13:25)


సంఘముల మధ్య సంచరించుట యనగా సంఘములోని లోటులను సరిచేయుటకు, ఆరిపోయిన వాటిని వెలిగించుటకును, నూనె తక్కువైన వాటికి నూనెపొయుటకును, తరిగిపోయిన వత్తిని పెద్దదిగా చేయుటను, దీపస్థంభముల మధ్య సంచరించుచుండెను.


Home


ప్రకటన 1:14

ప్రకటన 1: 14 తలయు తలవెంట్రుకలును తెల్లని ఉన్నిని పోలియున్నవి. ప్రభువు సమస్త ప్రధానులకును, శిరస్సై యున్నాడు. సంఘమునకు కూడ ఆయనే శిరస్సైయున్నాడు. (కొలస్సై 1: 18;2:10) ఈయన తలయొక్క తెలుపుపరిశుద్ధతను తెలియజేయుచున్నది. ఈయన దేవుడై యుండియు, నరరూపములో నరుడుగా వచ్చినను ఆయన జీవితములో యేవిధమైన లోపములేని పరిశుద్ధ జీవితము కలిగియుండెను. అందుకే నాలో పాపమున్నదని మీలోయెవరు స్థాపించును? అని పలికెను (యోహాను 8:46) అందరికం టె, అన్నిటికంటె పరిశుద్ధుడై యున్నాడని తెలియజేయుచున్నది.


తలవెంట్రుకలు: నెరసిన వెంట్రుకలు నీతి ప్రవర్తన గలవారికి సొగసైన కిరీటము, (సామెతలు16:31) (దానియేలు7:9) ఈయన తల వెంట్రుకలు అనాదికాలమునుండి ఉన్నవాడని తెలియజేయుచున్నవి. ఈయన తలవెంట్రుకలు ఉన్నత జయశాలి ధరించిన కిరీటమును సూచించుచున్నవి. ఈయనే నీతి ప్రవర్తనగల పరిశుద్ధుడనితెలియజేయుచున్నవి. అందుచేతనే ఈయన తలవెంట్రుకలు తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత దవళముగా నుండెనని వ్రాయబడినది. నేత్రములు:- ఆయన నేత్రములు జాలిగలవి. ఇప్పుడు ఇక్కడ జ్వాలనేత్రములు (లేజర్ కిరణము) అనాదినుండి అనంతము వరకు చూడగలిగినవి. లోకమంతటిని చూడగలవి. మన అన్ని కాలముల స్థితినిచూడగలవి మంచిని చెడుగును చూడగలవి మన చెడుస్థితిని దహించునవి. మంచిస్థితిని దహించునవి. మంచిస్థితిని మనలోఅమర్చునవి. దేనిలోనికైనను చొచ్చుకొనిపోగలదు.


ప్రకటన 1:15

ప్రకటన: 1:15 పాదములు:- మేలిమి బంగారమువలె నున్నవి. ఇది ఆయన ప్రవర్తనకు సూచనయై యున్నది. ఆయన నడచిన నడకలో యేమియు దోషము లేదు. శరీరధారిగా నున్నపూడు ఆయనమాట, ఆయనచూపు ఆయనక్రియ, అన్నియు మేలిమి బంగారము వంటివి, ఈయన ఈయన పాదములు నేలమీద, నీటిమీద, గాలిలోను నడచినవి. ఆయన సువార్తను ప్రకటించు వారి పాదములే సుందరములైతే మహిమ వార్తనిచ్చు ఆయన పాదములుఇంక సుందరములైనవి. (యెషయా 52: 7: రోమా 10:15)


కంఠస్వరము:- ఆయన కంఠస్వరము దూరమునకు స ముద్రజలముల ధ్వనివలె వినబడుచున్నది. 11వ. వచనములో బూరధ్వనివలె వినబడునట్లు చూచుచున్నాము. ఇది ఆయా సమయములందు విన బడును. (పండుగ, ప్రత్యేకసమయములందు) ఈ జలముల ధ్వనియెప్పుడు వినబడును. సముద్ర జలముల శబ్ధము సమీపగ్రామములకు పట్టణములకు వినబడుచున్నట్లు యీ సువార్త ధ్వని లోక మంతటికి వినబడుచున్నది. సముద్రములోని కెరటములు అంతము లేకుండ ఒకదాని తరువాత ని వాక్యము ఒకటి వచ్చును. అలాగే దేవుని వాక్యము ఆదికాండము మొదలు ఒకదాని తరువాత ఒకటివచ్చుచునే ఉండును. భావము కూడ వచ్చుచునే ఉండును. ఆదికాండము మొదలు యూదా పత్రిక వరకు 65 పుస్తకములు 65 కెరటము, 65 శబ్ధములు. ఇవి నిత్యము ఉండునవి పాతనిబంధన వ్రాసిన తరువాత పత్రికలు వ్రాయబడెను. తరువాత సువార్తలు వ్రాయబడెను. వీటి ధ్వని అందరకు వినబడుచున్నది. గాని ప్రకటన ధ్వని ప్రత్యేకము. దీని యొద్దకు అనేకులు వచ్చుటలేదు అన్నియు చదివి ప్రకటన గ్రంధము చదువని యెడల మిగతావి కూడ చదువనట్టే. మిగతా గ్రంధములలో ఒకదానిలోని సంగతిని మరొకదానిలో చూడవచ్చును. (యెషయా 2:3) లోని సంగతి వెయ్యేండ్ల కాలములో జరుగవలసిన సంగతి గలదు. ప్రకటన 12వ. అ||లోని సంగతిమరెక్కడనులేదు. గనుక ప్రకటన స్వరము అందరును వినవలెను.


Home


ప్రకటన 1:16

ప్రకటన 1: 16 ఆయన తన కుడిచేత 7 నక్షత్రములు పట్టుకొనియుండెను.
ఎ. 7 నక్షత్రములు:- ఇవి సంఘముయొక్క బోధకులకు గుర్తులు వారికి దూతలను పేరు వాడబడినది. ఆ బోధకులు ఆ బోధకులు ఆయన యొక్క చేతిలో అనగా ఆయన స్వాధీనములో నున్నారు. క్రీస్తు వెలుగై యున్నారనియు, సంఘములు వెలుగై యున్నవనియు, సంఘములను చూచుబోధకులు కూడ వెలుగై యున్నారని తెలియుచున్నది. (మత్తయి 13:43) ( ప్రకటన 1:20) సంఘములు 7 తరగతులుగా నున్నవి. కాపరులు 7గురు ఉన్నారు. అనగా ఒకా 7 మాత్రమే కాదు. ఈ ఒకా 7లో అనేక 7లు ఉన్నవి. పరలోకపు దూతలు దేవుని వర్తమానము నందించువారు యీ కాపరులే దూతలు.
బి. ఆయన నోటనుండి రెండంచులుగల వాడియైన ఖడ్గమొకటి బయలువెడలుచున్నది. ఇది అయన నోటినుండి బయలు వెడలు వాక్యమై యున్నది. దానికి రెండంచులు వాడిగానున్నవి. ఆయన వాక్యము కొందరిని గద్దించును. ఇది ఒక అంచు, కొందరిని ఆదరించును. ఇది మరియొక అంచు. ఒక అంచు కొయుటకును, మరియొక అంచుకోసిన గాయము మానుపు టకును అయియున్నది ఆదామునకు ఆపరేషను సమయమందు దేవుని హస్తమే ఖడ్గముగా వాడబడినది. ఆ ఖడ్గమే ఒక అంచుకోసినది. మరియొక అంచు మానిపివేసినది. ఆది 2:21, ఎఫెసీ6:17 (ఇది ఆత్మఖడ్గము). హెబ్రీ 4:12 (ఇది వాక్యఖడ్గము). నోటి ఊపిరి (11 థెస్సలో 2:8 యెషయా 11:4, ప్రకటన 19:21,ప్రకటన 19:15) సి. ఆయన ముఖము మహాతేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యునివలె నుండెను. ఆయన నీతి సూర్యుడై యున్నాడు. తన వెలుతురు విశ్వాసుల మీద ప్రకాశింపజేయుచున్నాడు (మలాకీ 4:2) ఆయన శరీరధారిగా నున్న దినములలో దారిలో (మార్కు 10:32) రూపాంతరమప్పుడు, (మత్తయి 17:1) గెత్సెమనేతోటలో (యోహాను 18:6) ఆయా సమయములలో తన ప్రకాశతను చూపుచువచ్చెను. పరలోకపుయెరూషలేమునందు యీ గొఱ్ఱెపిల్లయే దీపమైయున్నది. నీతి సూర్యునికాంతి క్రింద ఉండి, సిద్దమై, పరమునకు వెళ్ళిన వధువు సంఘము కూడ నీతి సూర్యునికాంతి కలదై యుండును. (ప్రకటన 12:1మత్తయి 13:43).


ప్రకటన 1:17

ప్రకటన 1:17 ఎ) నేను ఆయనను చూడగానే, చచ్చినవానివలె ఆయన పాదముల యొద్ద పడితిని. క్రీస్తు భూమిమీద నున్నపుడు యోహాను ఆయనతో ఉండి నిర్భయముగా ఆయనతట్టు చూడకలిగెను. ఎందుకనగా క్రీస్తు అప్పుడు తనలోనున్న యింతకంతిని అనుదినము చూపించలేదు ఎరిగిన ఆయననే యోహాను చూడలేకపోయినాడు. పూర్వము యోహాను భోజన సమయమునందు క్రీస్తు చెంతనే కూర్చుండువాడు. యోహాను రూపాంతరమప్పుడు, పునరుత్థానమైనప్పుడు ఆరోహణమైనప్పుడు ప్రభువును చూచెను. గాని చచిన వాని పడిపోలేదు. అతితే ఇక్కడ పడిపోయెను 7 సంఘములకు ప్రభువు ఏ రూపముతో ప్రత్యక్షమగునో ఆ పరిపూర్ణ రూపమును యోహాను చూచి చచ్చినవానివలె ప్రభువు పాదములయొద్ద పడెను. యొకోబు బలమైన మనిషివలె కనబడినవానితో పెనుగులాడి దీవెన పొందెను. ఆ బలమైన మనిషి దేవుడని గుర్తించి నేను దేవుని ముఖాఖిగా చూచితిని. అయినను నా ప్రాణము దక్కినదనెను.(ఆది 32: 32) అట్లే యోహాను ప్రభువును మానవరూపముతో చూచినను ఆయన ప్రకాశతను బట్టి దేవుడని గ్రయించినందున చచ్చిన వానివలె పడెను (నిర్గమ 3:6 అ||కార్య 3:4) క్రీస్తు శరీరము మహిమ శరీరము యోహాను శరీ రము మానవ శరీరము, అందుచేత ఆయన ప్రభువును చూడలేకపొయెను.
బి. ఆయన తన కుడిచేతిని నా మీద ఉంచి నాతో ఇట్లనెను. వ్యాధి గ్రస్తుల మీదను, అపాయములో నున్నవారిమీదను, చిన్నపిల్లల మీదను, అందరిమీదను ప్రభువు హస్తమువేసి దీవించి ఆదరించుట. ఆయనకు యిష్టము. (మత్తయి 8:3. మార్కు 10:16. మత్తయి 8:15. మత్తయి 9:25).


Home


ప్రకటన 1:18

ప్రకటన 1: 18 ఎ) భయపడకుము. యోహానును డొమిషియన్ చక్రవర్తి కాగుచున్న నూనెలో వేసినను, భయపడలేదు చనిపోలేదు. గాని ఇక్కడ ప్రభువు యొక్క మహిమనుచూచి భయపడి ప్రభువు పాదములయొద్దపడెను. ప్రభువు సముద్రముమీద నడచినప్పుడుచూచి భయపడిరి. అప్పుడు ప్రభువు నేనే భయపడకుడని వారితో చెప్పెను. (మత్తయి 14:27) శిష్యులు ప్రభువును పూర్తిగా యెరుగరు. ఇంక విధ్యార్ధులుగానే నున్నారు. గనుక నేనే అని ప్రభువు వారికి బయలు పరచుకొనెను. ఇక్కడ యోహాను ప్రభువుయొక్క జీవితచరిత్రయు, మరణ, పునరుత్థాన, ఆరోహణ చరిత్రయు నెరును గనుక నేనే అని చెప్పనక్కర లేదు. నేనే అనే చరిత్ర అయిపోయినది తరువాత శిష్యులు తమంతట తామే జ్ఞాపకము తెచ్చుకొనవలెను. ఈయన ఆయనే అని గుర్తుపట్టవలెను. గనుక నేనే అను కథ అయిపోయి ఇప్పుడు క్రొత్తకథ వచ్చెను. అందుకనే యోహాను తన పత్రికలో ప్రభువు కన్నులారా చూచితిమని వ్రాసెను. (1 యోహాను 1:1,2) యోహాను అన్ని యెరుగును. గనుక భయపడ కూడదు. అయినను భయపడెను. యోహానుకు ఖైదు, పద్మసు ద్వీపమున పరవాసియై యుండుట, అన్నియు మార్పుగానున్నవి. గనుక భయపడెను. 60సం||ల క్రిందట ప్రభువును చూచెను. తిరిగి ఇప్పుడు చూచు చున్నాడు. గనుక భయపడెను. బి) నేనుమొదటివాడను, కడపటివాడను, జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై యున్నాను. యోహానుకు గ్రీకు భాష తెలియును గనుక ప్రభువు యొహానుతో పలికెను. అందున్న సంగతి ఇక్కడ ప్రభువు తెలియజేయుచున్నారు. ఆయన స్థితి యెట్టిదో యోహానుకు బయలు పరచుకొనుచుండెను. 8వ వచనమునందు 18వ వచనమునందు ఒకే సగతిని రెండుసార్లు తెలియజేయుటనుబట్టి ఆయన స్థితి ఇట్టిదని స్థిరపరచుచున్నది. ఇందువలన ఆయన మనుష్య కుమారుడు మాత్రమే కాక కేవలము దేవుడని తెలియుచున్నది. క్రీస్తు చనిపోవుట సిలువయొద్ద నున్న యోహాను చూచెను. ఇప్పుడు ఆయనను చూడ భయపడుచున్నాడు. క్రీస్తు చనిపోవుటయు, పునరుత్థానమగుటయు, ఆరోహణమగుటయు బాగుగా తెలిసిన విషయములే. కాని ఇప్పుడు ఆయన కనబడిన రూపము మిగుల భేదముగా నున్నది. క్రీస్తు సజీవుడుగా పునరుత్థానమైన తరువాత ఆయనకున్న మహిమ రూపమును యోహాను యితర శిష్యులు చూడగలిగిరి. అయితేయీ అధ్యాయములోనున్న రూపమును చూడలేకపోవుచున్నాడు. యోహాను యెదుట కొన్నాళ క్రిందట క్రీస్తు శవముగా కనబడెను. ఇప్పుడు యోహానే ఆయన యెదుట శవముగా అయిపోయెను. సి ) మరియు మరణము యొక్కయు పాతాళ లోకముయొక్కయు తాళపుచెవులు నా స్వాధీనములో నున్నవి.


యోహానుకు ఖైదు, తాళపుచెవుల ముందు యీ ఖైదు తాళపుచేతులెంత? అని యోహాను గుర్తు పట్టునట్లు ప్రభువు చెప్పెను, క్రీస్తుయొక్క చేతిలో తాళపు చెవులున్నవి.అనగా అధికారమున్నది. శక్తి ఉన్నది. మరణము తన స్వాధీనములో నున్నది. తాళపు చెవి తలుపును తీయగలదు. తలుపును వేయను గలదు. ఇట్టి పని మరణ విషయములోను, పాతాళ విషయములోను క్రీస్తు చేయగలడు. పరలోకములోనున్న యీయన పాతాళమునకు కూడ వెళ్ళగలడు. మరణము ఆయనను పట్టుకొని ఆపుచేయ లేదు. అందుచేతనే ఆయన మరణము నుండి బయటికి వచ్చివేసినాడు. మృతుల లోకము ఆయనను పట్టుకొనలేకపోయెను. ఈ మాటలు యోహానుకు ఎంత ధైర్యము కలిగించియుండెను?

ప్రకటన 1:19, 20

ప్రకటన 1: 19,20 కాగా నీవు చూచిన వాటిని ఉన్నవాటిని, వీటివెంట కలుగబోవు వాటిని అనగా నా కుడిచేతిలో నీవు చూచిన 7నక్షత్రములను గూర్చిన మర్మమును, ఆ సువర్ణ దీపస్తంభముల సంగతియు వ్రాయుము. ఆ 7 నక్షత్రములు 7సంఘములకు దూతలు. ఆ 7దీపస్తంభములు 7 సంఘములు. ఇప్పుడు దర్శనములో యోహాను క్రీస్తును, నక్షత్రములను, ఖడ్గమును, దీపస్తంభములను చూచెను గదా! ఈ సంగతులనుగూర్చి వ్రాయవలెనని ప్రభువు యోహనుకు చెప్పెను. 7 నక్షత్రములు, 7దీపస్తంభముల సంగతి 16వ వచనమందు వ్రాయబడెను.


Home