9వ అధ్యాయము - Trumpets


పరిచయము

    అయిదవ దూత
  • 1) ఫలితము:
    • 1) రాలిన నక్షత్రము
    • 2) పాతాళపుచెవి ఇయ్యబడెను
  • 2) ఫలితము:
    • 1) గుండము తెరువబడెను
    • 2) పొగలేచెను
  • పొగ: సూర్య-ఆకాశ (చీకటి)

    పొగ: మిడతలు (భూమిపై) తేళ్ళబలము

    మిడతలకాజ్ఞ:
  • ఎ. దేవుని ముద్ర లేనివారికి హాని
  • బి. గడ్డి
    • మొక్కలు
    • చెట్లు

    హాని చేయవద్దు
  • సి. చంప నధికారము లేదు
  • డి. అయిదు నెలల బాధ

N.B : మరణము దొరకదు

N.B : మిడతల వివరము

  • ఎ. పో. గుర్రాల వివరము
  • బి. బంగారు కిరీటము
  • సి . మనుష్య ముఖము
  • డి. స్త్రీ వెంట్రుకలు
  • ఇ. సిం హపు కోరలు, పండ్లు
  • యఫ్ . ఇనుప మై మరుపులు
  • జి. రెక్కల ధ్వని: విస్తార
    పొ|| గుర్ర రథ ధ్వని
  • హెచ్ . తేళ్ళ కొండ్లు

N.B : పాతాళ రాజు

arrow
N.B:
  • 1) మొదట శ్రమగతించె (30)
  • 2) ఇక రెండు శ్రమలున్నవి

ఆరవదూత :

ఫలితము:
N.B : ఫరాతునది నలుగురి బంధిత దూతలను విడిచి పెట్టుము
N.B : అదే సంవత్సరము



విడిచి పెట్టబడిరి
  • అదే నెల
  • అదే నెల
  • అదే దినము
  • అదే గంట


సిద్ధపడ్డ 4 దూతలు

N.B : గుర్రపు రౌతుల సేనలు (20 కోట్లు)
N.B : దర్శనము

గుర్రములు = మైమరువులు
వాటిపైవారు = మైమరువులు

నిప్పు ఎరుపు నీలవర్ణము 3) గుర్రములు : సిం హశిరస్సులు
నోట అగ్ని ధూమ గంధకం

గంధక వర్ణము ఫలితము : 1/3 నరులు (నోళ్ళు తోకలు)

  • 4) గుర్రపు బలము
  • 5) తోకలు (పాములవలె తలలు గలవు)

ఫలితము: N.B : హాని చేయుము
మిగత జనము (మారుమనస్సు లేదు)

  • 1) దయ్యములను
  • 2) విగ్రహములను

పూజించిరి
    N.B: విగ్రహములు
  • ఎ. చూడవు బి. వినవు
  • సి. నడువవు
    సాస్తకృత
  • ఎ. బంగారువి బి. వెండివి
  • సి. కంచువి
  • డి. రాతివి
  • ఇ. కర్రవి
    N.B: వారు (మారుమనస్సు లేదు)
  • 2) ఎ. నరహత్య
  • బి. మాయమంత్రము
  • సి. జారత్వము
  • డి. చోరత్వము

ముద్రకాల శ్రమలు, బూరలకాలె శ్రమలు పూర్తిగా అవిశ్వాసులకు విశ్వాసులకు కూడా ఉన్నది. పాత్రల శ్రమలలు మాత్రము అంతిక్రీస్తునకును వాని అనుచరులకును చెందును.

5వ బూర

అయిదవ బూర:- పరలోకములో ఒక సంగతి జరిగెను. భూలోకములో ఒక సంగతి జరిగెను. అందువలన ఫలితములు గలవు. వానివలన శ్రమలు, అగ్ని, భూకంపములు జరుగుచున్నవి. వీనినిబట్టి ఎవరయినా మారుమనస్సు పొందినారా అనునది ముఖ్యాంశము

  • 1) భూలోకములో శ్రమల వివరము
  • 2) ఎంతవరకు వ్యాపించెను.
  • 3) దాని ఫలితమేమి ? ఇవన్నియు ముద్రలకు బూరలకు, పాత్రలకు సంబంధించినవే.

మనుష్యులకన్న మేలుకరమైన స్థితిని తీసివేస్తే మనుష్యులు మారుదురు అనేది దేవుని ఉద్దేశ్యము. అయితే కొందరు దేవునిని అపార్ధము చేసికొనే స్థితిలో ఉందురుగాని మార్పు కలుగదు అందుకే దేవుడు నాలుగవబూర శ్రమ వరకు సృష్టి రప్పించెను. అనగా మనుష్యులకు ఉపయోగకరమైన వానికి నష్టము వచ్చినది అయితే 5వ బూరలో శ్రమ మనిషి పైకి వచ్హుచున్నది.

అయిదవదూత బుర ఊదినపుడు ఆకాశము నుండి భూమిమీదకు ఒక నక్షత్రము రాలినది అగాధముయొక్క తాళపుచెవి అతనికి ఇయ్యబడెను అని ఉన్నది. గనుక రాలినది నక్షత్రము కాదన్నమాట వేరొకరు ఎవరో ఉన్నారని తలంచవలెను. ఇక్కడ నక్షత్రమనునది అలంకార పదముగా వాడబడెను. నక్షత్రము అనగా యేసుక్రీస్తును సూచించు చున్నది. (దాని12:3, 4) దూతలు, దేవుడు, మనుష్యులు, నక్షత్రములవంటి వారే (2పేతు 1:19) ప్రభువునకు వేకువచుక్క అనునామమున్నది. గనుక ఈ నక్షత్రము యేసుప్రభువును సూచించుచున్నది. ఆయన మనిషి (ప్రక 22:16) పాతాళలోకము మీదగాని అధికారము ప్రభువునకే తప్ప మరెవరికి లేదు. (ప్రక1:18,19, మత్తయి 28:18) ఈయన మన హృదయాంతరంగంలో ప్రకాశించే వేకువచుక్క (రోమా 10:9;2 పేతురు 2:4) ఈయన పాతాళము వరకు దిగి అక్కడ ఉన్నవారిని సహితము రక్షించగలరు నేడుకూడా ప్రభువు భూమిమిదకు నక్షత్రమువలె వచ్చును. ఈయనకు పాతాళపు తాళపుచెవి ఇయ్యబడెను అని ఉన్నది. అనగా బంధించుటకును, విడిపించుటకును, పాతాళ్ఖ ద్వారము తెరుచుటకును ఈయనకధికారమియ్యబడి యున్నది. అగాధము అనగా పాతాళ లోకము లేక పాతాళగుండము.

నక్షత్రము రాలుట:- అనేది క్రియ అనగా అదివరకే ఉన్నట్లు అని అర్ధము ఉదా:- ఈతకాయలు చెట్టున ఉండును. వాటికాలముల పరిపక్వము కాగా అవి రాలును. అట్లే నక్షత్రమునకు పని వచ్చినందున రాలెను.

రాలుట:- ఇది అలంకార క్రియ యుద్ధసమయమునందు వచ్చెను. ఉదా:- మనిషిని గొర్రెపిల్ల అనుట బైబిలునందు కలదు యోహాను యేసుప్రభువు అని అనుటకు బదులు ఇదిగో లోకపాపమును మోసికొనిపోవు దేవుని గొర్రెపిల్ల అని అలంకార రూపముగా అనెను. అలాగే దావీదు చిగురు అనగా నిజముగా చిగురుకాదు గాని అలంకార పదముగా ఉపయోగింపబడెను. ఎందుకు యిలాగు వ్రాయబడెను అని అంటే మనము అడిగితెలిసికొనుటకు అందుకే భక్తులు ఈలాగు వ్రాసిరి. మనకు జ్ఞానమున్నది గనుక ఆలోచించుటకు, ఉపయోగించుటకు వాడబడెను.

పాతాళపు తాళపు చెవులు యియ్యబడెను:- అంతిక్రీస్తు అబద్ధ ప్రవక్త, హర్మెగెద్దోనువద్ద దేవునితో యుద్దము చేయగా ప్రభువు వారిని సాతానును పాతాళములో వెయ్యేండ్లు బంధించును. వెయ్యేండ్లు అయిన పిదప వారు మరలా విడిపింపబడుదురు. అక్కడదూత అని కలదు. ప్రభువునకు దూత నక్షత్రము వేకువచుక్క గొర్రెపిల్ల అని బిరుదులు కలవు. సాతానును బంధించుటకు ప్రభువు దూతను పంపలేదు గాని యేసు ప్రభువే స్వయముగా సాతానును వాని అనుచరులను పాతాళములో వెయ్యేండ్లు బంధించెను అని ఉనది. సాతాను కూడా ఒకప్పుడు దూత గనుక వానిని బంధించుటకు దేవుడు దూతకు సెలవియ్యలేదు.

తాళపుచెవి:- యేసుప్రభువునకు కట్టుటకు, విప్పుటకు శక్తి అధికారము కలదు. దానికి తాళముచెవి గుర్తై యున్నది. తాళము ఎందుకు?

  • 1) బంధించుటకు
  • 2) విప్పుటకు నక్షత్రము ఆకాశము నుండి రావలెను.
పరలోకమందున్న మా తండ్రీ అని ప్రార్ధనలో కలదు. ఆకాశమనగా పరలోకమని అర్ధము ప్రభువు పరలోకమునుండి వచ్చెను. ఆకాశములో నక్షత్రములున్నవి పరలోకములో నక్షత్రము ఉన్నది. ఈ నక్షత్రము పరలోకమునుండే బయలుదేరి నక్షత్ర మండలముదాటి భూమిమీదకు వచ్చునప్పుడు ఆకశములో కనబడును. అందుకే ఆకాశములో నుండి అని వ్రాసెను.

పాతాళము:- అని ఉన్నది ఇది ఎక్కడ ఉన్నది? భూమి క్రింద పని. పాతాళమున పని తర్వాత భూమిమీద పని పరలోకమునకును, పాతాళమునకును మధ్య భూమి ఉన్నది. భూమినిదాటి పాతాళమునకు వెళ్ళవలెను గనుక నక్షత్రము భూమిమీద వ్రాలెను. ఎంతదురము పాతాళమునకున్నదో మనము చెప్పలేము. భూమిమీద వ్రాలిన నక్షత్రము పాతాళమునకు వెళ్ళవలెను.

పాతాళమని ఉండక గుండమని ఉన్నది. ఈ పాతాళమునకే భక్తులు "బిలము" అని పేరు పెట్టిరి. దీనికే "అబిస్" అనికూడా ఉన్నది అయిదు ఖండములు కలిపినది భూలోకము. అలాగే పాతాళము, గుండము, నరకము, మట్టులేని గొయ్యి ఇవన్ని కలిసినదీ హేడెస్సు.

గుండము:- (Pit) అని ఇంగ్లీషులో ఉన్నది. దానికి మట్టులేదు. ఎంత దూరము వెళ్ళినా దానికి అంతములేదు. ఆ గుండములో ఎవరున్నారు?

ఎవరు? :- నాలుగవ బూర కాల శ్రమల వరకు ప్రభువుమాట వినని మారుమనస్సు పొందక సైతానును పూజించు అవిశ్వాసులను శ్రమపరచుటకు పాతాళమందు బంధింపబడిన దురాత్మలను మీ దగ్గరకు పంపుదును అవి మిమ్మును ఏమిచేయునో తెలిసికొనుడి అని ప్రభువే పాతాళ ద్వారము తెరచి సాతానుకును అతని సైన్యమునకును సెలవిచ్చెను. ప్రభువు సెలవిస్తేగాని వాటి అంతట అవే బయటికి వచ్చుటకు వీలులేదు. అగాధము తెరువగా దట్టమైనపొగ తీవ్రముగా నిలిచి, భూమిని దాటి సూర్యుని కూడ కమ్మెను. పొగను బట్టి చీకటికమ్మెను పరలోకమునుండి నక్షత్రము అనగా కాంతి గలది వచ్చెను రెంటికిని అనగా దట్టమైన పొగకును నక్షత్రమునకు తారతమ్యము గలదు. జ్యోతుల లోకములోనికి పొగవెళ్ళెను. భూలోకమందంతట చీకటి కమ్మెను.

కంతులు రెండు:-

  • 1)మోక్షలోక నక్షత్ర కాంతి
  • 2) జ్యోతుల కాంతి
ఒకటి ఆత్మీయజీవమునకు ఉపయోగము రెండు శరీర జీవమునకు ఉపయోగము. జ్యోతుల కాంతికన్నా మోక్షలోక కాంతి ఎక్కువ మనుష్యులకు బహిరంగముగా కనబడు జ్యోతులకాంతి మనుష్యుల పాపమునుబట్టి చీకటి ఆయెను. భూమి మీద పొగనుబట్టి కాంతిలేదు. అసలు దీపము ఆర్పివేయబడెను. గనుక ప్రక్కనున్న మనిషి కూడా కనబడనటువంటి గొప్ప భయంకర చీకటి పొగవలన కలిగినది మనకున్న చీకటి అంత భయంకరము కాదు. ఎందుకంటే వెలుగునిచ్చే నక్షత్రములు గలవు.

చీకటులు:-

  • 1) మన యెరుకలోనున్న చీకటి
  • 2) పాతాళము నుండి వచ్చిన పొగనుబట్టి వచ్చిన చీకటి.

మిడుతలు వచ్చెను, మిడుతలు పొలములోను, చెట్లమీదను ఉండును గాని అవి పాతాళలోకము నుండి వచ్చెను అలాగు వచ్చిన మిడుతలదండు భూమిమీద అంతా చీకటికమ్మగా అవి ఎక్కడబడితే అక్కడ ఎవరిమీద పడితే వారి మీద ఉండును. అటువంటి దండు తెగుళ్ళ కాలములో ఐగుప్తులో దేవునిచేత పంపబడినవి గాని ఈ మిడుతలదండు భూమిమీద నుండివచ్చినవికాదు గాని పాతాళలోకము నుండి వచ్చినవి క్రొత్తనిబంధన గ్రంధములో మిడుతలు తిను యోహానును ఎరుగుదుము. అది చిన్న కోడిపిల్ల అంత ఉండును. అసలు మిడుతలను మనము చూడనేలేదు. ఈ మిడుతలకు విషము ఉండదు. అది కుట్టదు గాని పాతాళమునుండి వచ్చిన ఈ మిడుతలు వేరొక రకము వీటికి తేళ్ళవంటి బలమున్నది.

  • 1) ఈ మిడుతలు భూమిమీద నున్న చెట్లకైనను
  • 2) మొక్కలకైనను
  • 3) వృక్షములకైనను హానిచేయరాదు
అని వాటికి ఆజ్ఞ ఇయ్యబడెను. సాధారణముగా మిడుతలు చెట్లమీద పై భాగమున వ్రాలును. ఆ కాలమున ఐగుప్తులోను మనిషి కుపయోగకరమైన చెట్లు జంతువుల కుపయోగకరమైన గడ్డి మున్నగు వాటిని హాని చేసేవి గాని ఈ మిడుతలు మనిషికి హానిచేయుటకు వచ్చెను. గాన సృష్టికి హాని కలుగచేయవు ఈ మిడుతల పని వేరుటకు వచ్చెను. గాన సృష్టికి హాని చేసేవి గని ఈ మిడుతలు మనిషికి హానిచేయుటకు వచ్చెను. గాన సృష్టికి హాని కలుగచేయవు ఈ మిడుతల పని వేరు, శక్తివేరు ఇది శిక్షాకాలము గాన మనిషికి హానిచేయుటకు వచ్చెను.

మిడుతలను చూచినమానవుడు ఇవి మమ్మును ఏమియు చేయవు సృష్టికి హాని కలుగచేయును అని అనుకొందురు గాని వాటికన్న శక్తినిబట్టి అవి మనిషికి హనిచేయును.

ఉదా:- రాజుగారు రాకముందు మంత్రులు వచ్చినట్లు ముందుగా పొగ చీకటి కలిగెను. వాటివలన బాధ, హాని, ఇప్పుడు ఎవరును మరణమును కొరరు గాని అప్పుడు మనుష్యులే మరణమును వెదుకుదురు. ఇప్పుడు మరణము మానవులయొద్ద ఉన్నదిగాని అప్పుడు మరణము పారిపోవును.

  • 1) తేలుబాధ
  • 2) మరణము పారిపోవుట మరియొక బాధ
మిడుతలు గుర్రములవలెనున్నవి అని అలంకారముగా బైబిలు గ్రంధమునందు వాడబడినది అది మిడుతలకున్న బలమునకు గుర్తు.

కిరీటము:- ఆ మిడుతలు యే పనిమీద భూమిమీదకు వచ్చెనో ఆ పనిలో వానికి భయము కలుగుటనుబట్టి వాటికి కిరీటము. అవి మానవుని ఎంతవరకు శిక్షించవలెనో అంతవరకు శిక్షించి తీరును తన పనిని తనకివ్వబడిన 5 నెలల కాలములో త్వరితముగా జరిగించును. అందుకే గుర్రములను పోలినవని అలంకారరూపముగా ఆ పదము వాడబడియున్నది.

మనుష్య ముఖము కలది

పాతాళమునుండి వచ్చిన ఈ మిడుతలు మనుష్యులకు హానిచేయునని గనుక మనుష్య ముఖము వంటిదని వ్రాయబడియున్నది. వీట్కి స్త్రీల తల వెంట్రుకవంటి వెంట్రుకలుండెను. ఇదియు అలంకారమే మిడుతలు చక్కగా ముస్తాబై మనుష్యులను బాధించుటకే వచ్చును. గుర్రమువలె నుండు ఈ మిడుతలకు కిరీటమివబడెను మనిషి ముఖమే స్త్రీల తల వెంట్రుకలు ఇవన్నీ స్వభావసిద్ధముగా వాటికుండెను. కిరీటము సంపాదించుకొన్న అలంకారము అసలు మిడుతలకన్నా ఈ మిడుతలకు అన్నిటిలో భేదమున్నది.

సిం హపు కోరలు:- మనుష్యులను బాధించుటకు ఈ మిడుతలకు గట్టిగాను, వాడిగానుండు సి సిం హ పుకోరలవంటి పండ్లు యివ్వబడెను. మానవుడు ఈ మిడుతలకు మనుష్యుడు హానిచేయకుండు కాపుదల కొరకు వాటికి ఇనుమువంటి మైమరపు వాటికివ్వబడెను గనుక ఆ మిడుతలను మనుష్యులు చంపి వాటి బాధనుండి తప్పించుకొనలేడు.

యుద్ధమునకు పరుగెత్తునట్టి విస్తారమైన గుర్రపు రథముల ధ్వనివలె వాటికుండెను. తేలు రహస్యముగా వచ్చి మానవునికి హానిచేయును, గాని ఈ మిడుతలు బహిరంగముగా హానిచేయునవి.

ధ్వనులు రెండు:-

  • 1) మిడుతల ధ్వని
  • 2) రాకడ ధ్వని "ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను" అనేది ధ్వని.
అది రమణీయమైనది. మిడుతల ధ్వని భయంకరమైనది. రాకడ ధ్వనిలో విశ్వాసులు పైకి ఎగిరిపోవుదురు గాని ఈ మిడుతల బాధను తప్పించుకొనుటకు మనుష్యులు మరణము వెదకుదురు గాని భూమిమీద భయంకరమైన చీకటి కమ్మియుండగా మరణము వారికి దొరకదు భయంకర బాధనుండి చీకటిలో యెటు వెళ్ళలేరు.

తోక:- తేళ్ళ తోకలవంటి తోకలు వాటికుండెను. గుర్రమని అలంకార రూపముగా అన్నారు గనుక ఇక్కడ తోక అని వ్రాయబడియున్నది. ఇదికూడా అలంకార రూపమే తేళ్ళని వ్రాయబ్డెను గనుక తేళ్ళకుండు కొండ్లు వాటికియ్యబడెను ఇదియు అలంకారమే.

అవన్నియు పాతాళములోని దయ్యములే ఆయా ఆకారములతో మనుష్యుని శిక్షించును వాటికి పాతాళపు దూత రాజుగా ఉంటాడు. హెబ్రీ భాషలో వానికి అబదోను అనియు, గ్రీకుభాషలో వనికి అపొల్లోను అనియు పేరు అంగా నాశనము చేయువాడని అర్ధము.

అయిదవబూర శ్రమకాలంలో మానవుడు నేర్చుకోవలసిన పాఠములు

  • 1) ఆకాశ నక్షత్రము ఎందుచేత? ప్రభువు పుట్టినపుడు బెత్లెహేములో నక్షత్రము రక్షించుటకు వచ్చెను గాని వారు ఆ రక్షణను త్రోసివేసిరి. రక్షణ శక్తి అంగీకరించలేదు. ఇప్పుడా నక్షత్రము శిక్షించుటకు వచ్చెను గనుక శిక్ష శక్తిని అంగీకరించక తప్పలేదు.
  • 2) మిడుతకు పాడుచేసే గుణము కలదు. అవిశ్వాసులు ఇది వరకే పాడైనారు గనుక ఇంకను పాడుచేయుటకు మిడుతలు భూమిపైకి వచ్చెను మిడుతలు పై చూపునకు అందమే గాని హింస, శ్రమలు కలిగించుటలో చెడుగే కనబడును అలాగే అవిశ్వాసులు పైకి సొగసుగా కనబడుదురు గాని లోపలంతా చెడుగే ఈ మిడుతలు దానికే గుర్తు
  • 3) ఇవి పాతాళమునుండి వచ్చెను. అవిశ్వాసులు పాతాళము పాలగుటకు సిద్ధపడిరి గనుక వారిని పాతాళమునకు తీసికొని వెళ్ళుటకు పాతాళమునుండియే ఈ మిడుతలు వచ్చును.
  • 4) భూలోకంలో కొందరు విశ్వాసులు పరలోకము నకు వెళ్ళుటకు సిద్ధపడిరి వారిని తీసుకొని వెళ్ళుటకు నక్షత్రము ఆకాశము నుండి వచ్చును వాటిరాకడ ప్రభువు రాకడ.
  • 5) మిడుతలు దేవుని ముద్రలేనివారిని కుటెను. దయ్యములే మిడుతలుగా వచ్చి అవిశ్వాసులను కుట్టును. అవిశ్వాసులు దూతలు, అవిశ్వాసులు ప్రభువు జట్టుగా నుండరు అవిశ్వాసులు దయ్యములు ఒకటే గనుక అవిశ్వాసులు దయ్యములను మ్రొక్కుచున్నారు గనుక మిడుతలు వారిని కుట్టకూడదు. గాని కుట్టుచున్నవి ఎందుచేత? అది దయ్యముల స్వభావము హానిచేయుట దయ్యముల స్వభావము.
  • 6) అవిశ్వాసులు దయ్యములను పూజించుచున్నారు. గనుక మొదట ధనధాన్యము, వెండి, బంగారము, సస్యసంపదలు అన్ని విధములైన మేళ్ళు మంచి స్వప్నములు మోక్షలోకము ఇచ్చునట్లు కనబడును గాని చివరకు హానిచేయగా దయ్యముల యొక్క స్వభావము ఈ బూరకాలములో ఇలాగు జరుగునని మనుష్యులు ముందుగానే తెలిసికొని రాబోయే ఉగ్రత తప్పించుకొనుటకు ఇప్పుడే మారవలెను.
  • 7) పాపము చేసేటప్పుడు దేవుడు క్షమించునని తెలిసినని మానవుడు రేపు మానివేస్త్సాను అని అనుకొనును గాని పాపమునకున్న శక్తి మనుష్యుని శక్తికన్నా ఎక్కువ గనుక పాపమునకు లోబడిపోవును.
దేవుడు దీర్ఘశాంతుడు. క్షమించని నాలుగవబూర కాలము వరకు మారుమనస్సు పొందకుండా జ్రుపుకుంటూ వచ్చాడు. నేను పూజిస్తే మేళ్ళు కలుగును అనుకొన్నాను గాని కీడు కలిగినది. నేనేమి చేయును? అని అంటాడు గాని మారడు మారలేడు, ఒకప్పుడు అయ్యగారు ప్రార్ధించగా దయ్యము కేకలువేసినది ప్రార్ధించవద్దు అన్నది, వెళ్ళను అన్నది గాని చివరకు లోబడి పోయినది కాబట్టి దయ్యముల వలన దయ్యములను పూజించువారికి కీడే మారలేరు. అయిదవబూరలో శ్రమపడేవారు అప్పుడే తయారైన వారుకారు అంతకుముందు నుండే పాపములో మునిగియున్నవారే వీరు 7వ బూరల కాలమువచ్చే సమయానికి మరింత కఠినులౌదురు. దేవుడు చదువు పాఠకులైన మిమ్ములను అట్టి ఉగ్రతనుండి తప్పించును గాక!

Home


6వ బూర

ఆరవబూర :- మొదటి అయ్యో అయిపోయెను. రెండవ అయ్యో మొదలు పెట్టెను. మూడు అయ్యోలు రాజమండ్రిలో ఒకామె ప్రసవించలేక అయ్యో స్వామి అని అన్నది. తరువాత ప్రసవించినది. వాడు పెద్దవాడై యుద్ధమునకువెళ్ళి చనిపోయెను. అప్పుడు అయ్యో స్వామీ అన్నది. ఇలాగు అయ్యా స్వామీ అనుపేరు పెట్టెను.

6వ దూత బూర ఊదినపుడు పరలోకములో దేవునియెదుట ఒక అగ్ని వేదిక ఉన్నది. దానికి కొమ్ములుండెను. అది సువర్ణవేదిక, ఆ కొమ్ములో నుండి ఒక స్వరము వచ్చెను. అది ఏమనగా ఫరాతునది యొద్ద బంధింప బడియున్న నలుగురు దూతలు ఉన్నారు. వారు దూతలు కారు కాని దయ్యాలు. అనగా దయ్యముల నాయకులు ఏదేనులోనుండి ప్రవహించు నది పిషోను, గిహూను , హిద్దెకేలు ఫరాతు (యుప్రటీసు) చీలికలుగా విడిపోయి ప్రవహించుచున్న ఒక శాఖమొన. (ఆది 3:10-15) ఈ నదివద్ద బంధంపబడియున్న నలుగురు దూతలను విడిపించుమని ఆ కొమ్ము నుండి స్వరము వచ్చినది.

పరలోకములో యజ్ఞవేదిక (ప్రక 9: 13,14 వచనములు):-

  • 1) యజ్ఞవేదిక
  • 2) మందసము
  • 3) ఆవరణము
  • 4) కరుణాపీఠము

ఇవి అన్ని నిజముగ అక్క డ ఉండవు గాని వాటి మహిమ వుండును. యేసుప్రభువు మహిమయే ఆ యజ్ఞవేదిక మహిమ, యోహానుకు దర్శనములో అలాగు కనబడెను ఇవి భూలోకములో ముంగుర్తుగా పరలోకములో నిజముగ కనబడెను. భూలోకములోనున్నవి మనకు బోధపడును గాని పరలోకములో నున్నవి బోధపడవు. ఎంత చెప్పినా రేపు పరలోకములో అసలిదియా అని ఇది మాకు తెలిసినదే అని అందురు.

పాత నిబంధనలో ఎవరైనా ఒక మనిషి వేరొక మనిషిని చంపిన ఆ చంపిన మనిషి యజ్ఞవేదిక యొక్క కొమ్ములను పట్టుకొన్నయెడల రాజుగాని, యాజకుడుగాని శిక్ష విధింపకుండ విడిచిపెట్టును. భూలోకములో కొమ్ముల యొక్క నిజమైన పని ఇదియే ఈ కొమ్ములే రక్షణ ఇచ్చునవి

ఈ బూరలో నలుగురు దూతలకు నాలుగు కాలములలో బంధింపబడి యున్నారు. ఈ దూతలు అనగా సాతాను నాయకులు ప్రకటన గ్రంధములో విడిపింపబడిరి ఏడేండ్ల మహశ్రమ కాలములో మారుమనస్సు పొందినవారు ఆ కొమ్ములు పట్టుకొన్నవారివలె రక్షింపబడవలెను గాని ఈ నాలుగు దయ్యములు విడిపింపబడెను గనుక రక్షింపబడినవారిని విడిపింపలేదు. ఈ కొమ్ములయొక్క విడుదల ఏడేండ్లలోని వారు పొందలేరు గనుక ఆ కొమ్ముల వలన దయ్యములు విడిపింపబడి వారిని బాధపరచును. రెండువేల సంవత్సరముల నుండి సువార్త వినిపింపబడెను అయినా అనేక శ్రమలు ఈ కాలములో లోకములో వచ్చుచు ఉండగా అందరు యేసుప్రభువునకు శరణు అని అనుట లేదు. నరులు పాపులై యున్నారు గాన ప్రభువా రక్షించు అని అనవలసినది గాని అనుటలేదు. గనుక వారిమీదికి దయ్యములువెళ్ళి

  • (1) పాపాలు,
  • (2) కొట్టుకొనుట,
  • (3) అపాయములు చేయ ప్రేరేపించుట,
  • (4) చంపుకొన ప్రేరేపించుట,
  • (5) నిరీక్షణ లేకుండా చేయుచు ఉన్నాడు
మన కాలములో
  • (1) బలవంతముగా దోచుకొనుట
  • (2) బలవంతముగా కొట్టుట
  • (3) చంపుట
  • (4) చనిపోవుట
అనే సాధనములు ఏర్పరచుకొని తమ పనులు సాగించుటకు దయ్యాలకు దేవుడు సెలవిచ్చెను. 7 సం||లలో సుఖపెట్టుటకు దేవుడు సెలవిచ్చును. ఎందుకనగా దేవుని సువర్తను, దేవుని సేవలకును నిర్లక్ష్యము చేయుచున్నారు గనుక ఇవి రానిచ్చెను.

రోమా 1: 28లో మనిషి శరీరేచ్చలకు లోబడి ప్రవర్తించిన దేవుడు ఊరుకొనును గాని మనిషి పాపము చేసినపుడు, నేను చెప్పిన మాటలకు, బోధకులకు మనస్సాక్షి మాటకు లోబడలేదు గనుక మనిషిని పాపేక్షకు అప్పగించును. మనిషి అయ్యో అంటే సరిలేని యెడల పాపేక్షకు అప్పగించును బైబిలులో ప్రభువు ఇస్కరియోతు యూదాకు ప్రేమతో ఆఖరిముక్క ఇచ్చెను. అతడు నా మోసము ఆయనకు తెలుసునుగదా అని మారుమనస్సు పొందలేరు. ఏమిచేసినా ఊరుకొనునని అనికొనినాడు అందుకే ప్రభువు నీవు చేయునదేమో చేయుమనెను గనుక ఇస్కరియోతు యూదాను పాపేచ్చకు వానిని అప్పగించెను. వారు ఇతరులను హింసింతురు. తమ పపేచ్చకు వదలి పెట్టబడిన వారు నామక క్రైస్తవులను హింసింతురు విశ్వాసుల నెదరినో చంపెదరు గాని రేప్చర్ అగువారిని చంపలేరు ఎందుకనగా రాకడ వచ్చును గనుక వారిని హింతురు గాని చంపలేరు. పెండ్లికుమార్తె వరుసలోనుండి విశ్వాసులుగా నుండువారు ఎత్తబడుదురు, గాని చంపలేరు. అది ఎవరి వశములోను లేదు. చంపువారు పాపేచ్చకు విడిచి పెట్టబడిన వారు.

ఆరోహణ క్రైస్తవులను చంపలేరు గాని విశ్వాసుల గుంపులో రెండవ వారైన కొందరిని వారు చంపెదరు, ఎందుకంటే వీరుహతసాక్షులు గుంపులోని వారు సజీవుల గుంపులోనివారు చంపబడెదరు.

కీర్తనల గ్రంధములోని 9వ కీర్తనలో ఉన్నట్లుగా అపాయము మీ యొద్దకు రాదు రేప్చర్ వరకు ఇదే పట్టుయని వుండండి. అప్పుడప్పుడు శ్రమలు అపాయములు వచ్చును గాని భయపడవలసిన అవసరములేదు. ఆరోహణ విశ్వాసులైన వారికి మరణము రాదు. మిగతా వారికి మరణము రాచ్చును.

  • 1) ఆరోహణ గుంపులో చేరవలెనా
  • 2) హతసాక్షుల గుంపులో చేరవలెనా
  • 3) జీవించువారి గుంపులో చేరవలెనా
  • 4) నామకా గుంపులో చేరవలెనా?
ఆరోహణ గుంపులోనివారు ఇంకా 100 సం||లకు రాకడ వచ్చినా సరే వారు తప్పక నిలిచియుందురు.

ఫరాతునది మెసపతోమీయలో నున్నది ఏదేనుతోటను తడిపినది. మెసపతోమియాలో బాబెలు దేశము ఉన్నదై. బాబెలువారు ఇశ్రాయేలీయులకు శత్రువులు బాబెలును గూర్చి ఆది 11వ అధ్యాయములో ఉన్నది. బాబెలు రాజ్యము స్థాపింపబడినది. వీరు ఇశ్రాయేలీయులను బాధపెట్టిరి. సాతానుచే ప్రేరేపింపబడిన బాబెలు దేశస్థులు ఫరాతునదియొద్ద బంధంపబడియున్న నాలుగు దయ్యములకు పరాభవము కలిగినరీతిగా బాబెలు రాజునకు, బాబెలు దేశమునకు దయ్యములకు, సాతానుకు పరాభవము కలిగేటందుకు ఫరాతునది దేవుడు ఏర్పరచెను దేవుని జనాంగమైన యిశ్రాయేలీయులను శ్రమ పెట్టినారు. పాపము ఆదాముయొద్ద ప్రారంభమాయెను. వారి సంతానమైన ఇశ్రాయేలీయులను హింసించెను ఆ నది నీళ్ళు ఏదేనునకు ప్రవహించెను.

  • 1) ఆదాము హవ్వలకాలములో
  • 2) సిలువ వేయబడినప్పుడు
  • 3) పెంతెకోస్తు కాలమప్పుడు
  • 4) సృష్టికాలమందు,
ఈ నాలుగుకాలములలో సాతానుకు అపజయము.

1) ఏదేను తోటలో అపజయము:- ఏదేనుతొటలో దేవుడు ఆదాము హవ్వలను మహిమ సహవాసములో ఆనందములోను వుంచెను. సాతానుడు వారిని దేవుని సహవాసములోనుండి దూరము చేసెను గాని దేవుడే స్వయముగా దిగివచ్చి ఆదాము, అవ్వలకు ఒకవైపు శిక్షవిధించి, మరియొక వైపు రక్షకుని పంపెదనన్న వాగ్ధానము దీవెననిచ్చి నిరీక్షించుమని చెప్పెను. బంధింపబడిన మొదటి దయ్యమునకు సాతాను అనుపేరు పెట్టి సకల నాశనమును, శాపమును కుమ్మరించి యూప్రటీసు నది దగ్గర బంధించెను. ఆదాము హవ్వల దగ్గరనుండి మలాకీ గ్రంధము ఆఖరివరకు వాగ్ధాన రక్షకుని కొరకు నిరీక్షించి ఎదురుచూచిరి కనుక వారికి జయమును సాతానుకు అపజయమును కలిగినది. లోకరక్షకుడు పుట్టకుండా చేయుటకు సాతానుడు యూదా జనాంగమును చాలా గలిబిలి చేసెను గాని నాలుగువేల సంవత్సరములకు యేసుప్రభువు జన్మించెను.

2) క్రీస్తుజన్మమును బట్టి అపజయము:- అవ్వ కయీను పుట్టినందున ఒక మనుష్యుని సంపాదించుకొంటినని సంతోషించెను. పోగొట్టుకొన్నాను గాని తెచ్చి యిచ్చే ఆయన పుట్టెనని సంతోషించినది. కాని తమ్ముని చంపెను. ఆదాము అవ్వలు నిలువబడినారు గనుక 4000 సం||రాల పిదప ప్రభువు వచ్చెను సాతానుయొక్క ప్రేరేపణ ద్వారా ఆకాలమందున్న నాయకులు బాల్యమందే ప్రభువును చంప యత్నించెను గాని వల్లపడలేదు. సహించలేని శ్రమలపాలుచేసి సిలువ మ్రానుమీద అంటగొట్టి జయించినాననుకొన్నాడు సాతాను సమాధికి కావలి పెట్టించినాడు గాని మూడవ దినమందు పునరుత్థానుడై లేచి దయ్యములయొక్క రెండవ నాయకుని బంధించెను.

3) పరిశుద్ధాత్మ కుమ్మరింపువలన సాతానుకు అపజయము:- అబ్రహామును దేవుడు పిలిచినపూడు ఏర్పాటు జనము ఏర్పడినది. ఇప్పుడు ఆత్మకుమ్మరింపునుబట్టి క్రైస్తవసంఘము ఏర్పడినది. క్రైస్తవ సంఘము స్థాపన కాకుండా సాతానుడు విశ్వాసులకు అధిక శ్రమలు కలుగజేసెను గాని ఆత్మ కుమ్మరింపు కలుగగానే సంఘము యేర్పడినది. యూదయలో ఏర్పడిన సంఘమునకు శ్రమ కలుగగా శిష్యులు లోకమంతా చెదరిపోయి క్రైస్తవ సంఘము వ్యాపింపజేసిరి. ఆత్మకుమ్మరింపు సాతానుకు కష్టము ఆత్మ పొందినప్పుడు 120 మంది ఆత్మను పొందిరి. పిదప 3000 మంది సంఘములో చేరిరి. సంఘమునకు జయము కలిగినది. అపవాదికి అపజయము కలిగినది. లోకమంతా సంఘము వ్యాపించినందున మూడవ దయ్యముల నాయకుడు బంధింపబడెను. పై రెండు దయ్యములు బంధింపబడుటకంటె మూడవ దయ్యము బంధింపబడుట ఎక్కువే.

4) సర్వసృష్టికి సువార్త అందుటను బట్టి అపజయము:- సృష్టి ముందే ఉన్నది కాని ఇప్పుడెందుకు సువార్త యేసుప్రభువు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్త బోధించుమని చెప్పెను. సువార్త సృష్టియంతటికి వెళ్ళినది. యేసుప్రభువు తన శిష్యవర్గమునకు ఇచ్చిన చివరి ఆజ్ఞ ఇది నెరవేరకుండా చేయుటకు దయ్యముల గుంపు నాలుగవ నాయకుడైన సాతానుడు ఆటంకములు కలిగించిన అన్ని దేశములకు, ప్రపంచములకు సువార్త ప్రకటించబడినది. ప్రపంచ ముఖ్య భాషలన్నింటిలోనికి దైవగ్రంధము ముద్రింపబడియున్నది. భూధిగంతముల వరకు నాకు సాక్షులై యుందురు (అపో కా. 1:8) సృష్టికి ప్రకటించుడి అన్న ప్రభువు సాక్షులై యుందురనెను. ప్రకటించుడి అనేది ఆజ్ఞ. సలహా, ప్రార్ధనార్ధకము సాక్షులై యుందురు అనునది జరుగవలసిన దానికన్న ముందే చెప్పెను. సువార్తకు, ప్రభువునకు, తన బిడ్డలకు జయము సాతానుకు అనగా దయ్యముల నాలుగవ నాయకునికి అపజయము. అందువలన వానికి బందన జరిగినది. ఈ నాలుగు దయముల నాయకులను ఒక్కొక్కరిని ఒక్కొక్కసారిగా బంధించివేసిరి. వీరికి స్వచ్చలేదు కాని మిగతా దయ్యములకు స్వచ్చ ఉన్నది. భూమి యొక్క నాలుగు దిక్కుల చివరి వరకు మీరు వెళ్ళుదురు అన్నారు. సాక్షులైయుందురని అన్నారు గనుక భూమి నాలుగు దిక్కుల చివర ఈ నాలుగు దయ్యములు బంధింపబడి యుండుట కనబడుచున్నది.

పరలోకములో అగ్నివేదిక కొమ్మునుండి స్వరము బయలు దేరెను దూతచేతిలో బూర ఉన్నది. రెండు కొమ్ములనుండి 6వ బూర పట్టుకొన్న దూతయొద్దకు నాలుగు దూతలను విడువుమన్న స్వరము వినబడింది. మూడు, మూడు, మూడు, మూడు అని నాలుగు మారులు కనబడుచున్నది.

  • 1వ మూడు: రెండు కొమ్ములు+ ఒక దూత=3
  • 2వ మూడు :
    • 1) నిప్పువలె ఎరుపు వర్ణము
    • 2) నీలవర్ణము
    • 3) గంధక వర్ణము. ఇవి మూడు
  • 3వ మూడు:
    • 1) అగ్ని
    • 2 ధూమము
    • 3) గంధకము ఇవి మూడు
  • 4వ మూడు:
    • 1) దయ్యములను
    • 2) విగ్రహములను పూజించువారు
    • 3) నానావిధములైన పాపకార్యములను చేయువారు.

6వ బూర శ్రమకాలములో విడువబడిన దయ్యములు భూమి పైకి వాటి రక్షణ కొరకు రాలేదు కాని మనుష్యుల శిక్షకొరకు వచ్చినవి. 20 కోట్ల సాతాను గుర్రములు భూమిపైకి వచ్చెను. 5వ బూరలో దయ్యములు యుద్ధమునకు సిద్ధపడిన గుర్రములను పోలిన మిడుతలవలె వచ్చెను. భూలోకములో మూడవ భాగము సమ్హరింప బడవలెనని అదే సంవ్త్సరము, అదే నెలలో, అదే దినమున, అదే గంటకు సిద్ధపరచబడిన ఆ నలుగురు దూతలు వదిలిపెట్టబడిరి. ఒక్కొక్క గుర్రపు రౌతుల సైన్యముల లెక్క 20 కోట్లు. ఇవి పాతాళగుండము నుండి వచ్చెను ఇవి దయ్యాలే. గుర్రముల మాట అలంకారముగా వాడబడెను. వీటి మైమరవులు అగ్నివలె, నీలమువలె గంధకము వలె ఉన్నవి. కాని అవి కాదు ఇవి మూడు మోసములు. ఇవి నిజమని జనులు భ్రమపడి వత్తురు గాని లోపల హాని. వాటి నోటినుండి అగ్ని ధూమగంధములవలె బయలు వెడలుచుండెను. వాటిమీద కూర్చొనువారు దయ్యాలే.ఉదా:- చిన్న చేప అని పెద్ద చేప వస్తే మ్రింగితే గాలపుముల్లు గ్రుచ్చుకొనును. అలాగే రెండు రకములైన మాయ

  • 1) నోటిమాయ,
  • 2) తోకమాయ అగ్ని.
నీల, గంధకములవలె కంపించిన ఇవి మరియాదగల మోసములు. అనేకమంది భ్రమపడి దగ్గరకు రాగా హాని కలుగును. వాటి తలలు సిం హపు తలల వంటివి. వాటినోళ్ళ నుండి అగ్ని, మనుష్యుడు ఊపిరి ఆడక అవథబడుదురు. గాని త్వరగా చావరు, ఊపిరి తిరుగక కొట్టుకు లాడుదురు. సొదొమ గొమర్రాల పట్టణములను అగ్ని కాల్చివేసినది. ఆకాశమునుండి గంధకము దిగి భూమిలోనికి పోయినది. భూమి నిస్సారమైనది. ఈ శిక్షలవల్ల మనుష్యులలో మూడవభాగము నాశనమాయెను. ఆ గుర్రముల కున్నబలము వాటి నోళ్ళ యందును తోకలయందును వున్నది. ముఖములవల్ల తోకలవల్ల పాము, తేలులవలె హాని కలుగుచున్నది. దయ్యముల పూజ విగ్రహముల పూజ, పాపము చేయువారు బయటకు రాలేక అందులోనే హత్తుకొనిపోయిరి. కనుక ఎక్కువయిన హాని, ఈకాలములో ఎన్నిబోధలు చేసినా విగ్రహములను పాపపు కార్యములను హత్తుకొని ఉన్నారు. కృపాకాలములోనే ఇలాంటివారు వుండగా శిక్షాకాలములో ఎట్లు ఉందురో చెప్పలేము.

  • 1) నోరు
  • 2) పాపమువలెనున్న తోక
  • 3) శిక్షలు
గుర్రముల సమూహము 20కోట్లు 20 =60 కోట్ల 5వ బూరలో శిక్ష పొందేవారు సాతానుముద్ర కలవారు. దేవుని ముద్రలేని వారికి శిక్ష 5వ బూరలో మిడుతల రూపమున వచ్చిన దయ్యములు, 6వ బూరలో గుర్రముల రూపమున వచ్చిన దయ్యములు, మిడుతల దయ్యముల వలన అనేకులు మిడుతల దయ్యములయ్యిరి. గుర్రముల దయ్యముల వలన గుర్రముల దయ్యములయ్యిరి. మిడుతలప్పుడే మారకపోతే గుర్రములప్పుడు ఇంకేమి మారుదురు?

దేవదూతలు, దయ్యములు ఆత్మరూపములు కలవారే ఒకప్పుడు ఆత్మల లోకములోని వారే కాని కంపార్టుమెంటు భేదముగాని లోకమొకటే దేవదూతలయొద్దకు దయ్యాలు వెళ్ళవు. దేవదూతలు దయ్యలయొద్దకు వస్తే శిక్షించటానికి వస్తారు.

బంధింపబడిన దయ్యములకు పఠాలములున్నవి. వీరు నాలుగు పఠాములకు నలుగురు నాయకులున్నారు. నాయకులు బంధింపబడియున్నారు. దయ్యములను పాతాళము కలిగినపుడే బంధించెను.

ఆది 3: 15, ఆదము కష్టపడుట. ఇది శిక్షగాని పంట అదే దీవెన దేవుడిచ్చెను. స్త్రీ శ్రమపడుట శిక్షగాని సంతానమును బహుమానమిచ్చెను. సాతానుకు అంతా శాపమే స్వచ్చగా తిరుగలేడు సాతానును బంధించకపోతే ఆదాము, హవ్వలకు పిల్లలు పుట్టరు. దేవుడు ఆదాము అవ్వలను దీవించెను. సాతాను బంధింపబడకపోతే ఆదాము అవ్వలయొక్క భూమిపంట, సంతానము అంతా నాశనమగును. ఆది (3:14) సాతానుకు శాపము దేవుడిచ్చెను. శపింప బడుదురు అనెను. ముందు సాతాను పని అయిపోయెను నీ సంతానము స్త్రీ సంతానము అప్పుడప్పుడు ముందు సంతానమునకే శిక్ష. ఆదాము అవ్వలకు శిక్ష ఉన్నా ఆశీర్వాదమున్నది.

యూదా 1: 6లో సాతాను బంధింపబడెనని ఉన్నది. సాతాను నలుగురు నాయకులను నాలుగు కాలములలో బంధింపబడిరి దయ్యములు బంధింపబడలేదు, గనుక స్వేచ్చగా బిలాములోనికి, పాతాళము లోనికి భూమికి తిరుగుచూ వీరే మిడతలవలెను, గుర్రములవలెను భూమిపైకి వచ్చిరి. దయ్యములు గాని లోకములో భూమిమీద పాతాళములో సంచరించును గాని స్వేచ్చలేదు, ఎవరినైనాశోధించవలెనంటే దేవుడు స్లవియ్యవలెను, యోబును శోధించుటకు సాతానుకు దేవుడు ముందు సెలవివ్వలేదు, గాని పిల్లలు కలుగగా మరలా అడుగగా దేవుడు సెలవిచ్చెను. దేవదూతల మీటింగులోనికి సాతానుడు వచ్చెను.

యోబు 1:7 భూమిమీద తాను తిరుగుటలేదు గాని దయ్యములు తిరుగుచున్నవి. దయ్యములు తిన్నగా ఎప్పుడూ చెప్పవు.

  • 1) దేవుని కంపార్టుమెంటు
  • 2) దేవదూతలయొక్క కంపార్టుమెంటు
  • 3) దయ్యముల కంపార్టుమెంటు.
వీరు వారితో, వారు వీరితో మాటలాడవచ్చును. వారు ఆత్మలు గనుక దేవుడు యెషయతో మాట్లాడెను. యెషయి దేవునితో మాట్లాడెను, అలాగే దయ్యములు ఎక్కడవున్నా దేవునితో మాట్లాడగలవు.

Home