19వ అధ్యాయము - Christ - The King of Kings

పరిచయము

స్వరము:

1. ప్రభువును స్తుతించుడి

    2.
  • ఎ. రక్షణ
  • బి. మహిమ
  • సి. ప్రభావము




దేవునికే చెల్లును



3. ఆయన తీర్పులు
  • ఎ. సత్యము
  • బి. న్యాయము
  • సి. ప్రభావము
4.
  • ఎ. ఆయన తీర్చెను : వేశ్యకు
    • భూమిని
    • చెరిపిన
  • బి. దండించె - వేశ్యను
    రక్తముబట్టి

వారు: (రెండవసారి)

హల్లెలూయ

ప్రభువును స్తుతించుడి

యన్. బి: పట్నపొగ యుగాలు లేచును

  • ఎ. 24పెద్దలు
  • బి. 4జీవులు
  • ఎ. సాగిలపడిరి
  • బి. చెప్పిరి

ఆమెన్

ప్రభువును స్తుతించుడి

N.B: నమస్కరించిరి

    ఒక స్వరము:
  • ఎ. జనశబ్ధ
  • బి. జలశబ్ధ
  • సి. ఉరుముశబ్ధ
  • 1. దేవుడు :
    • ఎ. ఏలుచున్నాడు బి. సుతించుడి
  • 2. గొర్రెపిల్ల: వివాహ సమయం
  • 3. భార్య : సిద్ధమౌచున్నది
  • 4. N.B :
    • ఎ. సంతోష
    • బి. ఉత్సహించి
    • సి. మహిమపర్తుము

ఆమె




యియ్యబడె పరిశుద్ధుల బట్టలు
  • ఎ. ప్రకాశ
  • బి. నిర్మల
  • సి. సన్ననార

నీతిక్రియలు

N.B: నేను నమస్కరింప సాగిలపడితిని

అతడు:
వ్రాయుము:
  • ఎ. విందుకు పిలువబడినవారు ధన్యులు
  • బి. ఈ మాటలు
  • దేవుని యదార్ధ మాటలు

N.B : అతడు

  • ఎ. వద్దు
  • బి. సహదాసుడు
  • నీతో x L
  • బి. సాక్ష్య సోదరులతో
  • సి. దేవునికే నమస్కరించుము
  • డి. యేసును గూర్చిన సాక్ష్యము ప్రవచనసారము
  • పరలోకము తెరువబడెను

    ఒకరు ::
    • 1. తెల్లని గుర్రముపై
    • 2. పేరుగలవాడు :
      • ఎ. నమ్మకమైన
      • బి. సత్యవంతు (నీతినిబట్టి)
    • 3. విమర్శ చేయుచున్నాడు
    • 4. నేత్రజ్వాల
    • 5. శిరస్సు (చాలాకిరీటాలు)
    • 6. వ్రాతనామము (ఆయనకే)
    • 7. వస్త్రము (రక్త చిలకరింపుబట్టి)
    • 8. నామము (దేవుని వాక్యము)
    • 9. ఆయన వెంబడి : సేనలు: :
      • ఎ. తెల్లనారబట్టలు
      • బి. తెల్లగుర్రాలపై
    • 10. ఆయననోట వాడిఖడ్గము : జనములను కొట్టుటకు
    • 11. ఆయన ఏలుబడి: యినుప దండముతో
    • 12. ఆయన త్రొక్కుట (మధ్యపుతొట్టె దేవుని ఉగ్రత)


    13. ఆయనపేరు:
    • ఎ. రారాజు
    • బి. ప్రభువుల ప్రభువు
    • ఎ. బట్టపై
    • డి. తొడపై

    సూర్యబింబ దూత (పక్షులతో మాసంతిన)

    రండిసేనలు
    దేవుని గొప్ప విందు
    • 1. రాజులు
    • 2. స|| అధిపతులు
    • 3. బలిష్టులు
    • 4. గుర్రాలు
    • 5. ఆసీనులు
    • 6. స్వతంత్రులు
    • 7. దాసులు
    • 8. కొద్దివారు
    • 9. గొప్పవారు




    • ఎ. కౄరమృగము
    • బి. భూరాజులు
    • సి. వారి సేనలు:
      • ఎ. అశ్వసేనలు
      • బి. ఆయన సేవ
      ఫలితము:
    • ఎ. మృగ
    • బి. అ|| ప్రవక్త
    • సి. కడమవారు



    గుండముతో
    కత్తితో

    N.B: పక్షులతిండి

    N.B: మృగ + అ. ప్ర = అద్భుత + ముద్ర + ప్రతి

    పరలోక స్తుతి

    ప్రకటన గ్రంధములోని 17, 18 అధ్యాయములలో అసత్య సంఘమున్నది. సత్యసంఘము అనే పెండ్లి కుమార్తె సంఘము ప్రభురాకడకొరకు జీవించి ప్రభువుతో వెళ్ళిపోయినది. మృతులైన భక్తులను శరీరముతో వెళ్ళి పోయిన వారును వధువు సంఘము. దీఇనికి సత్య సంఘమని పేరు మిగిలిపోయిన 144 వేల యూదా గోత్రపు వారును వెళ్ళిపోయిరి. ఈ మూడు భాగములవారు సత్యసంఘమే. వీరు రక్షితుల భాగంలో ఉన్నారు. సత్యసంఘము వచ్చివేసినదని పరలోకములో స్తుతి కూటము పెట్టుకొనిరి. ఇది పరలోకపు స్తుతి, ఈ స్తుతి గొప్పది. ఇక్కడ స్తుతించినను భూలోక శ్రమలలో నుండి నిరీక్షణతో సంతోషముతో స్తుతించుదుము. అక్కడకు వెళ్ళకపోతే ఈ స్తుతులన్నియు వట్టివే. అక్కడకు వెళ్ళిన పిమ్మట గట్టెక్కిన స్తుతి నిరీక్షణతో అవసరములేదు. అకడకు వెళ్ళిన పిమ్మట గట్టెక్కిన స్తుతి నిరీక్షణతో అవస్రములేదు. ఇదే 19వ అధ్య్యములో కనబడుచున్నది. ఈ స్తుతి కూటము ఎందుకు? అస్త్య సంఘమునకు రానైయున్న తీర్పు వినిపించుటకు, అసత్య సంఘము, సత్య సంఘము యొద్దకు వెళ్ళలేదు. ఇకవారికికనబడదు. ఇకవారికి ఆటంకముగా ఉండదు. ఈ రీతిగా సత్యసంఘము తనసంతోషము పట్టుకొనలేక పరలోకమందు స్తుతించిరి. ఒకరితో ఒకరు చెప్పుకుంటూ స్తుతించిరి.

    ప్రక.క. 19:1 అటు తరువాత అనగా ప్రకటన గ్రంధములోని 17 18 అధ్యాయములలో అస్త్య సంఘముయొక్క పని అయిపోయినది. పరలోకములోని వారు అసత్యసంఘమునకు కలుగబోవు తీర్పు కొరకు కనిపెట్టుచున్నారు. తీర్పు అయిపోయినదిగాని ఇక శిక్ష ఉన్నది పరలోకమునందు వారు స్తుతించుచున్నారు, యేమని స్తుతించిరి? ప్రభువును స్తుతించిరి ప్రభువును స్తుతించుడని వారు చెప్పుచున్నారు. ఇదేరోజు సంతోషకరమైన ఆనంద ధ్వని చేయుడి. స్తుతించుడి అని వారిలో ఒకరికి ఒకరు చెప్పుకొనుచున్నారు. అసత్య సంఘ స్థితి వారికి తెలిసి పోయినది.

    • 1. రక్షణ,
    • 2. మహిమ,
    • 3. ప్రభావము దేవునికే చెల్లును.
    ఆస్థితిలో గొప్ప అని యున్నది.

    • 1. రక్షణ:- ఎవరిది ఈ రక్షణ? ప్రభువు మనలను రక్షించక పోయినయెడల మనకు రక్షణలేదు. ఈ రక్షణ మనకు ఇచ్చినాడు.
      ఉదా:- పెండ్లికి తాను యెరుపు తీసికొని వెళ్ళి తిరిగి ఇచ్చివేసినట్లు రక్షణ మనదేగాని అక్కడ ఆయనదే.
    • 2. మహిమ:- ప్రభువు పనియొక్క సమర్ధతను చూపించుచున్నది. ఈ దినమదు ఒకవేళ మనము జయించగలము. రేపు పడిపోయే అవకాశమున్నది. నిజమునకు మహిమ మనదేగాని అది ఆయనకే చెల్లును. ఎవరైన ఒకరు ఇక గొప్పపనిచేస్తే అయ్యా ఏలాగైతేనేమి మీరు మీ మహిమను చూపించినారు అని అందురు.
    • 3. ప్రభావము:- ఇది దేవుని ప్రభావము సైతాను పంజా నుండి బయటకు లాగి తెచ్చినావు అని సత్యసంఘము దేవునిని మెచ్చుకొనును. పరలోకములో ఆయన శక్తి కనబడుచున్నది పరలోకములో దూతలు, సత్య సంఘము, త్రిత్వమున్నారు. "నీకును ని సంఘమునకును" మెదటి స్థితి రక్షింపబడినవారుతప్ప మరి యెవరు చెప్పరు మనమును రక్షించటానికే తగును. ప్రభువా మహిమ కేతగును మమ్ములను విడిపించుటకు ప్రభావము నీకేతగునని చెప్పగలము.
      • 1. సత్యము.
      • 2. న్యాయము

    ఇవి ఆయన తీర్పులు, రక్షణ, మహిమ, ప్రభావము సంఘము పొందుచున్నది. ఇవే దేవుడు పొందుచున్నాడు పై రెండు తీర్పులు అసత్య సంఘమునకు దేవుడు వినిపించును. ఈ లోకములో తీర్పు ఉంటే సత్యము, అసత్యము ఉండ వచ్చును అయితే ఈ తీర్పులో నిజముగా అసత్య సంఘతీర్పు న్యాయమే. ఈ అసత్య సంఘము చేసిన పాపములో ముఖ్యమైనది. ప్రభువు యొద్దకు రాలేదు సత్యసంఘము ప్రభువు యొద్దకు వెళ్ళెను. ప్రయాసపడి భారము మోయువారలారా నా యొద్దకు రండి అనగా వెళ్ళెను. సంఘము వెళ్ళిపోగానే తీర్చుట తప్ప ఇంకేమి కనబడుటలేదు. దేవుడిచ్చిన గడువు లన్నియు అయిపోనవి దేవుడుమనిషికి మనసాక్షి ద్వారా, వాక్యముద్వారా, బోధకులద్వారా చెప్పించెను. ఇవన్నియు సత్యసంఘము చూచి ఈ తీర్పు న్యాయమైన తీర్పు చెప్పిరి. దేవుడు తన ప్రమనుబట్టి రక్షింపకూడదా అని భూలోకములోని భూనివాసులు అందురు గాని పరలోకములో నున్న సత్య సంఘము ఈతీర్పును గ్రహించి న్యాయమే అని అనుచున్నది. అసత్య సంఘము తానుచేసిన క్రియలను బట్టి తీరౌ తన మీదకు తెచ్చుకొనెను. భక్తుల రక్తము ఒలికించి తీర్పు తమ మీదకు తెచ్చుకొనెను. అసత్య సంఘము క్రొత్త విశ్వాస్లను, పాత విశ్వాసులను చంపివేసి తీర్పును తమమీదకు త్వరిత గతిలో తెచ్చుకొనెను. భక్తులు భూజనుల జోలికి వెళ్ళక తమ గుడిసెలోనే ప్రార్ధన చేసికొనినను హేబేలువలె ఈ అసత్య సంఘము వారిని చంపి వేసినది.

    దాసులు:- తమ ఇంటిలో నుండక దేవుని తట్టు తిరుగుడని ప్రజలకు బోధించిన వారు. ఈ అసత్యసంఘము వారినికూడ చంపిరి ఇది గొప్ప నేరము. క్రీస్తుప్రభువు ప్రజలమీద ఉన్న తీర్పు అపనింద కొట్టివేయుటకుతన రక్తమును చిందించినట్లు అసత్య సంఘము తీర్పు తన పైకి తెచ్చుకొనుటకు సత్యసంఘ భక్తులను చంపెను.

    మొదటిసారి రెండు స్తుతులు:- 1. సత్యసంఘమునకు గూర్చి, అసత్య సంఘమునుగూర్చి.

    ఉప భాగములు:- రక్షణ,మహిమ,ప్రభావములు

    దీనియందు రెండు భాగములున్నవి సత్యములు, న్యాయములై యున్నవి.

    రెండవస్తుతి:- ప్రభువును స్తుతించుడి అని రెండవసారి అనిరి. వీరి స్తుతిలో ముదే ఆమెన్ ఉన్నది. ఇదిమార్కు 11:24లో ఉన్నరీతిగా ముందే నమ్మకము కలిగియుండుట. అడుగుచున్న వాటి నెల్లను పొందియున్నమని నమ్ముడి అప్పుడు అవి మీకు కలుగును అని ప్రభువు అన్నారు. అప్పుడు పొందుట కనబడును మనము ఆమెన్ అని అనలేము. మనము తీర్పునకు ఇవతల యున్నాము సత్యసంఘము తీర్పునకు అవతలౌన్నారు గనుక ముందే ఆమెన్ అని అన్నారు. మనము పరలోక ప్రార్ధనలోని అన్ని భాగములకు ఆమేన్ అని చెప్పవచ్చును.

    ఆ పట్టణపు పొగ యుగయుగములు పైకి లేచుచున్నది. లోతు నివాసము సోదోమగోమొర్రాల పట్టణము నాశనమగు చుండగా ఆ పట్టణపు పొగ ఆకాశమునంటెను. పితామహుడైన అబ్రహాము వెలుపలికి వచ్చి చూచెను. అసత్య సంఘ మనేది సమాజము, అది పట్టణములో నివసించునదియైయున్నది. పొగ అనగా పూర్తి నాశనము లోకనాశనమునకు సూచనగా దేవుడు సొదోమ నాశనమును చూపించెను. యుగయుగములు అనగా ఎల్లప్పుడు కాలుట. సత్యసంఘము యుగయుగములు మోక్షములోని నిత్య జీవమును అనుభవించుచుండును. సత్య సంఘము యుగయుగములు కాలుచూ నిత్య నాశనము బాధ అనుభవించుచుండెను. అసత్య సంఘము యుగయుగములు కాలుచూ నిత్య నాశననము బాధ అనుభవించుచుండును. ప్రటన 4వ అధ్యాయములోఇరువది నలుగురు పెద్దలున్నారు. 19వ అధ్యాయములో 24 పెద్దలున్నారు. వీరు ఆమెన్ అని చెప్పి దేవునికి నమస్కారముచేసిరి. వీరు భూలోకములోనున్న భక్తులందరిలో యెన్నిక జనమువలె ప్రత్యేకింపబడినవారు. నాలుగు జీవులు దూతలలో ప్రత్యేకింపబడినవారు. వీరు చేసేది ప్రత్యేక ప్రాధనయు స్తుతియు అయియున్నది.

    ప్రక. 19:6.
    • 1) దేవుని దాసులారా స్తుతించండి
    • 2) భయపడు వారలారా స్తుతించుడి
    • 3) కొద్దవారలారా స్తుతించండి
    • 4) గొప్ప వారలారా స్తుతించుడి అందరినికలిపి మీరు దేవుని స్తుతించండి అని చెప్పియున్నారు.

    ప్రార్ధన:- ఆదికాల పరిశుద్ధుడవైన ఓ తండ్రీ! నీ సనిధానమందు మహిమ దూతలు శుద్ధీకరింపబడిన పెండ్లికుమార్తె ఉన్నారు. పరిశుద్ధతకు లోపించినవారు నీసన్నిధిని ఉండలేరు. ఇక్కడ ఉన్నప్రతివాడుయేచిన్న పొరపాట్లు ఉన్న నేను పెండ్లి కుమార్తె వరుసలోనికి రాలేమని ఎన్నో మార్లు నేర్చుకొనుచున్నారు. ప్రకటన గ్రంధ వివరము నందు పెండ్లి కుమార్తెను గూర్చి నేర్చుకొనునప్పుడు వర్తమానములు అందించుము. కావలసినవారికి వర్తమానము అందించుము దూతలను కావలి యుంచుము. భూతలములను బంధించుము. ఈ పాఠమును అందరికి వినోదముగా నుండు కృపదయచేయుము. అందరికి వారివారి స్థితినిబట్టి కృప దయచేయుమని త్వరగా వచ్చుచున్న ప్రభువును బట్టి వేడుకొనుచున్నాము "ఆమెన్"

    • 1) సర్వాధికారి - అన్నిటి మీద అధికారము
    • 2) ప్రభువు - అందరికి ప్రభువై యున్నారు.
    • 3) ఏలుచున్నాడు - అప్పుడు ప్రభువు యేలువాడు

    ఇప్పుడు ప్రభువు, మనుష్యులను ఏలుచున్నారు. ప్రక. 19:7 ఈ స్వరము ఎందుకు అనగా ఇక మీదట సైతాను అధికారముండదు ఇక ప్రభువు తప్ప ఎవరునులేరు. ప్రభువునదే యేలుబడి.

    ఉదా:- ఒకరాజు ఏలుచుండునుగాని అధికారము చేయుటకు భయపడును. ప్రభుత్వమును నడిపించుదురు గాని అధికారముచేయుటకు భయపడుదురు. మన ప్రభువైతే పై మూడు చేయుటకు అధికారము గలవాడై యున్నాడు.

    అధికారము = ఇక్కడ నుండి వెళ్ళిపోయినదే

    ప్రభుత్వము = నెనే ప్రభువునని తన పరిపాలనతెలియ పర్చుదురు.

    ఇక్కడ ప్రభుత్వము ఎవరిది? పెండ్లికుమార్తె వరుస నిండిపోయెను రక్షితుల మోక్షము నిండిపోయెను. పరదేశి నిండిపోయెను ఇట్టి సమయమందు దేవుడు తన ప్రభుత్వమును స్థిరపర్చకపోతే మనిషి జారిపోవును ప్రభుత్వమనగా మనిషి జారకుండా పట్టుకొనుట అధికారము, ప్రభుత్వము, యేలుబడిప్రభుదైనప్పుడు ంసనకును అవసర్ము వచ్చును. అనగా అట్టియేలుబడి వరము వచ్చును. సంపూర్ణ పవిత్రతతో పెండ్లికుమార్తె యుండును.

    ఉదా:- ఒకపిలవానికి తన తల్లి స్నానముచేసి మరల బురద ఔఉసికొని కుండా తన దగ్గర కూర్చుడ బెట్టుకొనును. అందునుబట్టి పిల్లవాడు మరల బురద పూసికొనడు అలాగే ప్రభువుపరలోకము మనయొద్దనే ఉండును గనుక పడుట లేచుట యుండదు. ఇక్కడ శరీరముతో ఉన్నప్పుడు పడుట, లేచుట యుండును మనిషికి అనగా విశ్వాసికి రెండు స్థితులున్నవి.

    ఉదా:- ఒక ఇంటిలో ఒక బాలిక జన్మించెను ఆ అమ్మాయికి యుక్త వయస్సు వచ్చుటకు 18 సం||ములు పట్టును, జన్మించుటకు తొమ్మిది మాసముల కాలము పట్టును ప్రసవించినప్పుడు బాధకాలము మూడు దినములు జన్మించుటకు జన్మించుటకు పట్టు సమయము ఒక్క నిమిషము. అలాగే పాపి రక్షణ పొందుటకు బోధ బాగుగా నేర్చుకొనుటకు కొంతకాల పట్టును కొందరికి సంవత్సరములు కొందరికి నెలలు కొందరికి దినములు పట్టును.

    • 1) జనించుట:-
    • 2) యుక్తవయస్సు - ఇదిమనిషి యొక్కస్థితి,
    పాపి సువార్తవిని ఆలేచించి నిజమా యని మనసులో నిశ్చయించుకొని ప్రభువే నా రక్షకుడు బైబిలే నిజము. ఈమతమే సత్యమతమని గ్రహించుకొనును. ఇది అంతయు తొమ్మిది నెలలతో సమానము.

    ప్రసవవేదన-పాపికి ఎవరైన అడ్డులు చెప్పగా అయ్యా స్నానము పొందమంటారా అని అడిగెను ఇదే వేదన మరునాడు పాదిరిగారి యొద్దకు వెళ్ళి స్నానము పొందెను. తరువాత మారుమనస్సు పొదెను ఇదే క్రొత్త జన్మము. దీనినే పునర్జన్మము అని అందుము. ఆత్మజీవన సంబంధమైన విషయము రక్షణయు ఒక్క నిమిషము మాత్రమే. యుక్తవయస్సు- పరలోకము కొరకు పెండ్లికుమార్తెగా తయారగుట అనేది 18 సంవత్సరముల యుక్త వయస్సుతో సమానము. దీనికి చాలా అడ్డులు, ఆటంకములు ఉండును రక్షణ పొందిన తరువాత బాగుగా సిద్ధపడవలెను.

    ఉదా:-పుట్టిన బిడ్డ పాలు అక్కరలేదని అనుట ఎట్లుండునో అలాగే రక్షణ పొందినవారు బైబిలు నాకు ఇక అక్కరలేదు అని అనంట్లు ఉండును. నూతన విశ్వాసులు ఆదికామడమునుండి ప్రకటన వరకు నేర్చుకొనవలసిన క్రమమతయు చేయవలెను. బిడ్డపుట్టి పాలు త్రాగి ఆహ్హర పదార్ధములు తిని ఎదిగి బడికి వెళ్ళి బి.ఎ. పా ఎలాగు అగుదురో అలాగే రక్షణ, మారుమనస్సు విశ్వాసికి అవసరము.

    మారు మనస్సు:- అంతవరకు మనిషి ఎటువంటి జీవితము జివించి యున్నారో దానిని విడిచి ఇక మీదట పది ఆజ్ఞలకు విరోధముగా నడువను. వ్యతిరేకముగా నడువనని నిశ్చయించుకొన్న ఇదేమారుమనస్సు అనగా పశ్చాత్తాపము. ఒక మనిషి పాప జీవితము యొక్క మార్గముగా వెళ్ళు చుండగా అదికాదు ఇలాగు రమ్మని పిలువగా ఆమార్గమువిడిచి మంచి మార్గమును అవలంభించుటయే మారుమనస్సు.

    • 1) పాప విసర్జనచేసి,
    • 2) మంచిగా నడచుట మారుమనస్సైయున్నది.

    ఒక సజ్జనుడు తనకు తెలియ కుండా క్రీస్తుని యెరుగక పాపమార్గములో నడచెను. మంచి బోధవిని తెలిసికొని మారుమనస్సు పొందిన అతడు మారుమనస్సు దారిలో వెళ్ళుచుండగా ఒకక్రెస్తవుడు కనబడి అయ్యా మీరు మంచి దారిలో నడుచుచున్నారుగాని ప్రభువు ఒకమాట అన్నారూని అనెను. ఆ మాట నేనే మార్గము, సత్యము, జివమునై యున్నాను అనేదే క్రీస్తు బోధకుని వల్ల ఆ సజ్జనుడు తెలిసికొనెను. ఆసజ్జనుడు నేను నడుచునదే మార్గము. అదే సత్యమని అనలేదుగాని క్రీస్తు మార్గము ఉత్తమ మైన మార్గమని ఒప్పుకొనెను. నరునికి మరణము తరువాత జీవము కలగాలి అనెను. అప్పుడు ప్రభువే మార్గము, సత్యము, జీవము అని అంగీకరించెను. ఇదే మారుమనస్సుపొంది ప్రభువు సత్యమని ఆయనే జీవమని అంగీకరించుట మేలు సజ్జనుడు చావు అయితే ఇక్కడ జీవమైతే అక్కడని తెలిసికొనెను. గనుక రక్షణపొందెను. ఇదే నూతన జన్మము. అప్పటినుండి ప్రతిదినము బెబిలు చదువుకొనుట, ప్రారంభించుట, కానుకలిచ్చుట, స్తుతించుట ఇవి అన్నియుచేయుటయే మారుమనస్సుపొంది రక్షణపొందుట.

    • 1) పాప దారి
    • 2) మారు మనస్సుదారి
    • 3) రక్షణ దరి
    • 4)పెండ్లి కుమార్తె దారి

    • ఇది నరునుని ఎదుగుదల నరునియొక్క అంతస్తులు
      శోధన అనగా పాపదారినుండి వచ్చును పడి
      పోయినప్పుడు పడిపోవుటనుబట్టియెరుగుదుము
      నీతిమంతుడు ఏడుమార్లుపడినా లేచును పడినప్పుడు
      తిరిగిలేచి మారుమనస్సు పొందవలెను పెండ్లికుమార్తె
      వరుసలో నున్నవారు పడిపోవుట అసాధ్యము.

    ఉదా:- ఒకస్త్రీ, పురుషుడు వివాహము చేసికొనుటకు ప్రేమించు కొన్నారు గాని ఏదో కారణమును బట్టి వివాహము విఫలమైపోయినది. అలాగే పెండ్లికుమర్తె వరుసలో నున్నవారికి శోధన, పడిపోవుట ఉండును. ఒకరికి వివాహమైనది ఏకారణము చేతనో భర్తను వదిలి వేరొకరికి వివహమైనది ఏకారణము చేతనో భర్తను వదిలి వేరొకరి యొద్దకు వెళ్ళెను. అలాగే కొందరు రక్షణ పొందినను కొన్నాళ్ళకు వెళ్ళిపోవుదురు.

    Summaer Saalt అమెరికాలో ఒకతడు కొన్నాళ్ళు భక్తిగానుండి చివరకు దేవుడు లేడనెను. ఈ రీతిగా తప్పిపోయెను రాజు అయిన సౌలు ఆత్మనుపొంది చివరకు పడిపోయెను. ఇస్కరియోతు యూదా ప్రభువుతో ఉండి పడిపోయెను. అలాగే పెండ్లికుమార్తె వరుసలో ఉన్నవారు ప్రభువు సహాయము లేకపోతే సున్న.

    మారుమనస్సు పొంది దేవుని - మాటవినకున్న = భువిని పేరొందిన విశ్వాసులైన - చేరుకొనుటయె సున్న

    తీర్మానములు, ప్రయత్నములు, భక్తి అంతా క్రీస్తులేకపోయినా సున్న్, బట్లర్ దొరగారు భక్తితో పుస్తకము లెన్నో వ్రాసి తుదకు నిరాశ చెంది దేవుడు లేడని చెప్పెను. అతని సేవకుడు వచ్చి బట్లర్ దొరగారితో నివు ఈ విధముగా చనిపోతే నరకానికి వెళ్ళుదువు. అక్కడ నిత్యము వేదనతో బాధపడుదువని చెప్పగా భయముచేత తిరిగి మారు మనస్సుపొంది మరల పుస్తకములు వ్రాసెను.

    కోతి తన పిల్లలను నడుమ్నకు తగిలించుకొని పరుగెత్తిన పిల్లపడదు తల్లి పిల్లను పిల్లతల్లిని గట్టిగా పట్టుకొని వదలవు. పిల్ల తన పట్టును వదులుచున్నదని తల్లికి తెలియునప్పుడు తల్లి ఒక కొమ్మమీదనే కూర్చుండి పిల్లకు పట్టు చిక్కెవరకు కదలకుండా కూర్చుండును. అలాగే చదువరులైనవారు ఈ బోధలు విని తప్పిపోవుదురేమో అని ఈ సంగతులు తెలియజేయుచున్నాము.

    పాపమును పాపమార్గమును విడిచి నేనే మార్గమును అని అన్న ఆయన మార్గమును అవలంభించకపోతే రక్షణ లేదు.

    ఉదా:- చాగల్నాడు అక్కడ అన్ని రాగులే పండును. ఆ గ్రామ కర్ణముగారు ఒక్కరే వరి అన్నము తినేవారు. ఆ ఊరిలో విషపుచెట్లు ఉండును. (ముసిడిచెట్లు) ఒక పిల్లవాని తల్లి బిడ్డను ఇంటిలో విడిచి సంతకు వెళ్ళెను. ఆ పిల్లవాని చేతిలో చక్కగా పండిన ముసిడి పండు ఉండెను. ఇది చూచిన తల్లి బిడ్డతో ఇది తింటే నీవు చచ్చెదవని చెప్పెను. పండ్లు తింటారుగద. ఇదియు పండే కదా ఎందుకు తినకూడదని కోపపడెను. ఆ తల్లి బిడ్డతో ఆ విషపు పండు పారవేస్తే లడ్డు ఇస్తానని చూపించినది. ఆ పిల్ల వానికి పండుమీదను లడ్డుమిదను ఆశ ఉండి పండున్న చేయి వెనుకకు పెట్టి పారవేసానని చెప్పి లడ్డుకోసము చేయి చాపెను. చద్వరులారా పాపి యొక్క స్థితియు ఇలాగే ఉండును. పాపమును మానివేయలేడు రక్షణ అందుకొనలేడు. ఒక దొరగారు నాకు రక్షణ వస్తే చాలు పరలోకములో ఏదో ఒక మూల కూర్చుండబెడితేచాలు అని అనెను.

    ప్రార్ధన:- మిక్కిలి భయంకరుడవైన ఓ దేవా! మారుమనస్సు పొందనివారికి మిక్కిలి భయంకరుడవును మారుమనస్సు పొందినవారికి జాలి గల దేవుడవు. మారుమనస్సు పొందక నీవు జాలిగల వాడవని నిన్నులోకువకట్టినవారు అనేకులున్నారు. మేము అట్లు ఉండక నిన్ను గౌరవించే కృప దయచేయుమని వేడుకొనుచున్నాము. నిన్ను ధ్యానించుట అధిక మహిమ గల విషయము. పాప లోకములో, పాప శరెరములో ఉండి నిన్ను ధ్యానించవలెనంటే మాకు ఇక్కడ కుదరదు. అయినను నీ కృపనుబట్టి ధ్యానించు స్థితిని మాకు ఇచ్చినావు. భూలోకములో ఆయా ప్రాంతములలో భయంకరమైన యుద్ధములు జరుగుచున్నవి. కొన్ని ప్రాంతములలో హత్యలు జరుగుచున్నవి. సంఘములో ఐక్యత లేదు. ఇది అంతయు బాధకరమైన స్థితి. ఈ సంఘము అకడక్కడ జరిగే కూటములను ఎతివేయాలని తలంచుట విచారకరమైన సంగతి. ఉద్రేకము విశ్వాసమును చెడగొట్టే ప్రయత్నము సంఘములలో కనబడుచున్నది. ఈ శోధనకు భయపడక ధైర్యముగా నుండి జయించే కృప దయచేయుము. ఇది ఇట్లు ఉండగా తూర్పు దేశములో దైవ జనుడు లేచి వేలకొలది ప్రజలను ఉజ్జీవ కూటముల ద్వారా నీతట్టు త్రిప్పుట ఎంత సంతోషమూ స్థలము, చాలుటలేదని చెప్పుకొనుచున్నారు.

    మా దేశములోను గొప్ప ఉజ్జీవ కూటములను జరిపే శ్రద్ద, విశ్వాసము కలిగిన పనివారిని లేపుము. నీ ఆత్మచేత జ్ఞానమును, మనస్సక్షిని, విశ్వాస్మును, ప్రత్యక్షతను, వార్తను వెలిగించుము. ఎన్ని బోధలున్నను, ఎన్ని వ్రాసికొన్నను మార్పులేకపోతే ఏమి ప్రయోజనము? ఈ స్థలమందున్న ప్రతివారిని పెండ్లికుమార్తె వరుసకు శుద్ధీకరించుము. మేము గ్రహించగల సంగతులు లోకములో జరుగుచున్నవి. గ్రహించలేని సంగతులు గ్రంధములో నున్నవి. అవి గ్రహించుకొనునట్లు రాత్రులందు మెళుకువ రాగా వీటియందు దీర్ఘాలోచన చేసేకృప దయచేతుము. వైద్యశాలలు. పాఠశాలలు, అన్నిజాతులను దీవించుము. మన దేశములో కూడా అమెరికా దేశమువలె గొప్ప ఉజ్జీవ కూటములు జరిపే కృప దయచేయుమని త్వ్రగా వచ్చుచున్న ప్రభువునుబట్టి వేడుకొనుచున్నాము. "ఆమెన్"

    మహోత్సవము

    ప్రకటన 19:7 గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది.

    పెండ్లి అంటే పెండ్లికాదు. పెండ్లికుమారుడుగా పెండ్లికుమారుడుకాదు. పెండ్లికుమార్తె అనగా పెండ్లికుమార్తెకాదు. వివాహమహోత్సవము అనగా వివాహమఓత్సవముకాదు. గొర్రెపిల్ల అనగా గొర్రెపిల కాదు. పండ్లి అనగా భూలోకములో ఉన్న పెండ్లివంటిది కాదు. భూలోక పెండ్లికుమారునివంటి పెండ్లి కుమారుడు కాదు భూలోక పెండ్లికుమార్తెవంటి పెండ్లికుమార్తెకాదు. భూలోక ఊరేగింపు వంటి ఊరేగింపు కాదు. భూలోక గొర్రెపిల్ల వంటి గొర్రెపిల్ల కాదు.

    పరలోకములో పెండ్లి అని భర్తని, భార్యని అపోస్తులుడైన పౌలు ఎఫెసి 5వ అధ్యాయములో వ్రాసెను. ఈ లోక సంఘమును గూర్చియు క్రీస్తును గూర్చియు చెప్పుచున్నారు. భూలోకములో ఉన్న భార్య, భర్తల అనురాగమును బట్టి ఈ రీతిగా వ్రాసిరి. ఈ విషయాలు దుష్టామముగా తెలియజెప్పిరి. పరలోకములో పెండ్లి అనగా దేవునిలో లీనమగుట. భూలోకములో మారుమనస్సు పొందిన పరలోకమునకు వెళ్ళగలము. ప్రభువుయొద్దకు చేరుకొందురు. ఆయనతో నిత్యము ఉందుము. ఇది భూలోకములోని పెండ్లివంటిది కాదు. కొన్ని సవత్సరములుండి విడిపోయేది కాదు.

    ప్రభువు తనతండ్రికి ప్రార్ధనచేయుచు తండ్రీ నీవు నేను యేకమైయున్నామని అనెను. అలాగే ప్రభువును మనమును యేకమైయుండవలెను. ప్రభువు మనకొరకు ఏమి సంపాదించెనో అవి ఇచ్చెను. అన్ని అందలేదు పరలోకమునకు వెళ్ళిన పిమ్మట ఆయనలో ఉన్న అన్ని గుణములు కాంతి, మహిమ మొదలగునవి అన్నియు మనకు వచ్చివేయును. బేదముండదు. ఇది ఐక్యమత్యత పెండ్లి, విందును గూర్చి ఈ లోకములో మనము వివరించుకొనలేము. పరలోకమునకు వెళ్ళిన పిమ్మట అంతములేని ఆయన గుణములు యెక్కువగుచుండును. సంతోషము, మహిమ, శక్తి ఈ గుణములు అంతముగల మనలోనికి వచ్చివేయును. ఆదిలేని గుణములు అనగా ఆది అంతములేని దేవిని గుణములు ఆదిగల మనలోనికి వచ్చును. ఈ లోకములో లేని చనువు ఆ లోకములో ఉండును. ఈ లెకములో వాడనివి ఆ లోకములో వాడగలము. దీనినే శాశ్వతకాల మహిమ అందురు. ఇన్నిటిలో ఆరంభములో ఉన్నాము గనుక ఇదే వివాహము. వివాహము తరువా అనంతకాలము జీవించుచుందురు. ఆ జీవితములో పెండ్లి సంతోషము, పెండ్లి వస్త్రము, పెండ్లి కాంతి, పెండ్లి ఐక్యమత్యత. ఇదే వివాహము అనంత కాలములో ఆ పెండ్లి నాటి చనువు ఐక్యత, ప్రేమ, జీవము, అనంత జీవము, నిత్య జీవము అనుభవించుచుందుము.

    • 1. పాపములు విడువకపోవుట.
    • 2. రక్షణ అందుకోకపోవుట.
    ఇవి రెండు గొప్ప పాపములే. రక్షణపొంది అంతటితో ఊరుకొనుటయు పెండ్లి కుమార్తె వరుసకు సిద్ధపడకపోవుటయు నేరమే. అనగా పాపములు విడిచి రక్షణపొంది పెండ్లికుమర్తె వరుసలోనికి చేరకపోవుట గొప్ప నేరమైయున్నది. యేసు ప్రభువునకు భక్తుల సంఘములో గొర్రెపిల్ల అనియు బలిపశువనియు పేరువచ్చెను. క్రొత్తనిబంధనలో లోకపాపములు మోసికొనిపోవు దేవుని గొర్రెపిల్ల అని య్జము అని యున్నది. పరలోకములో ఉన్నప్పుడు పెండ్లి కుమార్తె పాపము లేనిదిగా ఉండునుగాని ఆయన పాపము మోయవలసిన పనిలేదు. గనుక పరలోకములో నిర్మలమైన గొర్రెపిల్ల అనగా హానిచేయనివారు. అందరికి స్వాధీనమయ్యేవారు. సాధువైనవారు.

    అయ్యగారు లూథర్గిరిలో టాయిలెట్ అను గొర్రెపిల్లను పెంచారు. అది యెవరిని యేమిచేయదు. అలాగే పరలోకములో ప్రభువు పెండ్లికుమ్మర్తెకును పెండ్లికుమార్తె ప్రభువునకును స్వాధీనమగుట అనునది ఉన్నది. ఇదే పెండ్లి. పెద్ద గొర్రె అయితే ఆ సంగతి వేరు. కాని చిన్న గొర్రెపిల్ల. గొర్రెపిల్ల అందరికి ముద్దుగా నుండును. ఇదే పెండ్లి భూలోకములో దేవుని గొర్రెపిల్ల అని యున్నది. హేబేలు అర్పించినది హేబేలు గొర్రెపిల్ల నోవాహు అర్పించినది నోవాహు గొర్రెపిల్ల. ఇశ్రాయేలీయులు అర్పించినది ఇశ్రాయేలు గొర్రెపిల్ల దేవుడు ఇచ్చినది దేవుని గొర్రెపిల్ల. దేవుని గొర్రెపిల్ల అనగా దేవుని దేవుని కుమారుడని అర్ధము. "మహిమ లోకంబునకు" అను కీర్తనలో 2వ వచనము "అప్పుడాపరమార్ధ - మనుభవించుచునుండు నెప్పుడు మనమికను నెడబాయకుందుము."

    ఆరంభములో సంఘమునకు పెండ్లికుమార్తె, పెండ్లికుమారుడనిపేరు. పరలోకములో భార్య, భర్తలని పేరు అదే జీవితము. అక్కడ విబేధములుండవు.

    ఆయనభార్య తన్ను తాను సిద్ధపర్చుకొని యున్నది: భూలోకములో సంఘము పెండ్లికుమర్తెగా సిద్ధపడుచున్నది. అట్లు సిద్ధముకాగా పరలోకమునకు వెళ్ళును. పరలోకములో అనంతకాల జీవితమునకు తన్నుతాను భార్యగా సిద్ధపర్చుకొనుచున్నది. భూలోకములో రక్షణ పొందియున్న భార్యగా సిద్ధపర్చుకొనుచున్నది. భూలోకములో రక్షణ పొందియున్న మనము పెండ్లికుమార్తె వరుసకు సిద్ధపడగలము. భూలోకంలో పెండ్లి కుమార్తెగా సిద్ధపడినా పరలోకములో భార్యగా సిద్ధపడగలము. ఈలోకములో ఉండగా ప్రభువే పెండ్లికుమార్తెగా సిద్ధపర్చెను. పరలోకమునకువెళ్ళిన పిమ్మట సిద్ధపరచువారు లేరు గాని గొర్రెపిల్ల భార్య తన్నుతాను సిద్ధపర్చుకొనును. చీరలు, జాకెట్లు, పండ్లు, మహిమ, శక్తి, మున్నగునవన్నియు తీసికొనును. భూలోకములో సిద్ధపడుట అనగా ముసిడికాయ పారవేసికొని రక్షణ తీసికొనవలెను. ఈ లోకములో పపమనే ముసిడికాయ ఉన్నది గాన సిద్ధపడుట కష్టము. పరలోకములో ముసిడికాయలు లేవు గనుక సిద్ధపడుట సుళువు. పరలోకములో అన్నియు తీసికొందుము. పరలోకములో పెండ్లి జీవితమునకు సిద్ధపడుదుము.

    • 1. సంతోషించుట.
    • 2. ఉత్సహించుట.
    • 3. మహిమపర్చుట.

    సంతోషించుట అనగా ఇప్పటి సంతోషము. మారుమనస్సు కలిగి రక్షణ తీసికొని పెండ్లికుమార్తె వరుసకు సిద్ధపడినాను అని పెండ్లికుమార్తె సంతోషించెను. పరలోకములోని సంతోషమునకును ఈ లోకములోని సంతోషమునకును సంబంధములేదు. పరలోకములో పెండ్లికుమార్తె అంతయును అనుభవించుచుండును.

    ఉత్సహించుట అనగా ఊరేగించుట.

    ఘనపర్చుట అనగా దినమంతా బాగుగా ఉంటే ఘనపర్చుట. ఒకవేళ జబ్బు యేవైనా సంభవిస్తే దేవుని మీద నేరముచేసి విసుగు కొందుము. పరలోకములో విసుగుదల లేదు జబ్బులేదు.

    ప్రస్తుత కాలములోను గతించిన కాలములోను విసుగు కొందుము గాని పరలోకములో ఘనపర్చుటయే గాని విసుగుకొనుట లేదు.

    ఈ గొప్ప భాగ్యము నాకు దొరికెనని పెండ్లికుమార్తె సంతోషించును. అదే సంతొషము. సంతోషమునుబట్టి లేచి గంతులు వేయును. అదే ఉత్సహించుట. కలిగిన భాగ్యమును బట్టి కృతజ్ఞత కనబర్చి మహిమపర్చును ఇదే ఘన పర్చుట.

    ప్రక 19:8: మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములును నిర్మలములునైన సన్నపు నారబట్టలు ఆమె కియ్యబడెను. అవి పరిశుద్ధుల నీతి క్రియలు.

    విలువైన నారబట్టలకు రెండు గుణములున్నవి.

    • 1. ప్రకాశమానమైనవి అనగా మెరియునది.
    • 2. నిర్మలమైనవి అనగా డాగులేనిది.
    ఇక్కడ పెండ్లి కుమారుడైన పెండ్లి కుమారుడైన ప్రభువ్నకు సన్న నార వస్త్రములు ధరింపచేయబడినవి. మత్తయి 27:59. ప్రకటన గ్రంధములో పెండ్లికుమార్తె సన్న నారవస్త్రములు ధరించెను. నిర్మలమైన మురికిలేని ప్రకాశమైన వస్త్రములు ధరించెను అని వ్రాయవలసినది. కాని అలాగు వ్రాయలేదు. ఎందుకనగా వస్త్రములు శుభ్రము చేసిన పిమ్మట ప్రకాశత వచ్చినది. పెండ్లికుమార్తె పరలోకమునకు వెళ్ళకమునుపు ప్రభుని రక్తములో కడుగబడి ప్రకాశముగా నుండి పరలోకమునకు వెళ్ళెను. ప్రకాశమానమైన బట్టలు ధరించిన పిమ్మట ఎన్ని సంవత్సరములైన మురికి అవ్వదు.

    సన్న నార బట్టలు అనగా వస్త్రములలో మిక్కిలి శ్రేష్టమైనది. రక్షణలో మిక్కిలి శ్రేష్టమైనది. పెండ్లికుమార్తె సంస్కార భోజనము పరలోకపు పెండ్లి విందు ముంగుర్తు అయ్యున్నది. ఈ సమయము మహా ముఖ్యమైన సమయము. ఇది పరలోకపు పెండ్లి విందు సమయము వంటిది. అట్టి ఈ సమయమునందు సన్న నారబట్టలు వేసికొనవలెను. అది విలువైన ఘనమైన సమయము. అక్కడ సన్న నారబట్టలున్నవి. వాటికి ముంగుర్తుగా ఇక్కడ సన్న నార బట్టలు వేసికొనవలయును. ఆ వస్త్రములు పరిశుద్ధుల నీతిక్రియలు. పెండ్లికుమార్తెగా తయారగువారు క్రియలు. సత్క్రియలు, నీతి క్రియలు కలిగి యుండవలెను. ఈ క్రియలే పరలోకములో ప్రకాశమానవిగాను నిర్మల మైనవిగా నున్న సన్న నార వస్త్రములగును. వెలుపల మాత్రమే మనము చూచియున్నాము. బాగుగా నున్నది పరలోకములో నున్న పెండ్లి కుమార్తె వరుసలోనివారు నీతిక్రియలు వస్త్రముగా ధరించుకొన్నారు.

    • 1. శ్రేష్టమైన క్రియలు.
    • 2. నిర్మలమైన క్రియలు.
    • 3. ప్రకాశమానమైన క్రియలు.
    ఇక వీరిలో కళంకములేదు పరిశుద్ధులనియున్నది. క్రియలను గూర్చి చెప్పకమునుపే పరిశుద్ధులని యున్నది.

    నీతి:- యేసుప్రభువు నీతిని సంపాదించెను. అది లేనియెడల స్వనీతియుండును. వీరు ధరించుకొన్నది ప్రభువు సంపాదించిన నీతి. ఇది వీరు పరలోకములో సంపాదించుకొనిరి.

    ప్రార్ధన:- ఓ కనికరముకలిగిన ప్రభువా రాష్ట్రములన్నిటి సువార్త ప్రకటించుమని అన్నావు. అందరికి సువార్త అందేవరకు లోక చరిత ముగింపు కాదని మేము నమ్ముచున్నాము. అదిమాత్రమే కాదు నీవు పెండ్లికుమార్తెను సిద్దపర్చుకొనుచున్నావు. మరియు శ్రమలద్వారా తప్ప నీతట్టు త్రిప్పుటకు కారణము లేదని మేము గ్రహించుచున్నాము. భూతలములను బంధించుము మనస్సాక్షిని, జ్ఞానమును, విశ్వాసమును ప్రత్యక్షతను దీవించుమని త్వరగా వచ్చుచున్న ప్రభువు ద్వారా వేడుకొనుచున్నాము.

    ప్రక 19:9. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు.

    • 1. చదువువారు
    • 2. వినువారు
    • 3. గైకొనువారు ధన్యులు

    ప్రభువునందు మృతులు ధన్యులు.

    విందునకు పిలువబడినవారు ధన్యులు.

    వస్త్రములను కాపాడుకొనువారు ధన్యులు.

    విందునకు పిలువబడినవారు పరలోకములో రెండు భాగములు.

    • 1. నూతన యెరూషలేములోనున్న పెండ్లికుమార్తె.
    • 2. నూతన యెరుషలేములోని పెండ్లికుమార్తె
    రక్షితుల మోక్షములో ఉన్నవారిని విందునకు పిలుచును. పెండ్లికుమార్తె పిలుచును గాని ప్రభువు పిలువరు.

    మరి రెండు గుంపులున్నవి.
    • 1. పాతాళనులో లేనివారు.
    • 2. మోక్షములో లేనివారు.
    మోక్షలోకములో నాలుగు భాగములు ఉన్నవి.
    • 1. రక్షితుల మోక్షము
    • 2. పరదైసు.
    • 3. ప్రార్ధన సమాజము.
    • 4. నూతన యెరూషలేము.

    నూతన యెరూషలేములోని రక్షితుల మోక్షములో నున్న కొందరిని మాత్రమే పిలుచును. రక్షితుల మోక్షమనగా ఏ విశ్వాసులైతే పెండ్లికుమార్తె వరుసలోనికి వెళ్ళలేరో వారు మోక్షములోనే మరియొక భాగమునకు వెళ్ళగలరు. ప్రకటన 20:4;14:3. పెండ్లికుమార్తె వరుసలో ఒకరు రక్షితుల మోక్షములోని పదిమందిని పెండ్లి విందునకు పిలుచును. ఆ పెండ్లి కుమార్తె వారినిమిత్తమై ఈ లోకములో ప్రార్ధించి సువార్త ప్రకటించిరిగాన ఈవిందు నకు పిలుచును. ఆ ఒక్కరే ఈ పదిమందిని గూర్చి ఈ లోకములోనుండగా ప్రార్ధించెను. ఇంకొకరు ఇరువై మందిని పిలుచును. మరొకరు ముప్పైమందిని గూర్చి ప్రార్ధించి సువార్త ప్రకటించెను గాన వారిని పిలుచును. మరొకరు ప్రార్ధనవల్ల సువార్త వల్ల యెవరిని పిలువలేదు. తాను ఒక్కడే అగ్నిలోనుండి వచ్చినట్లు వచ్చినాడు. లోకములో ప్రార్ధనవల్ల సువార్తవల్ల యెవరిని క్రీస్తులోనికి చేర్చలేదు గాన యెవరిని పిలువడు. యెవరిబోధ వినకపోయిన ప్రభువే కొందరి మనస్సాక్షిని రేపి మారుమనస్సునకు త్రిపి రక్షణకు తీసికొనివెళ్ళుదురు. అట్టివారు విందునకు పిలువబడరు.

    • 1. మన ప్రార్ధనలు ముగించవలెను.
    • 2. యెవరిని గూర్చి ప్రార్ధించవలెనో తెలియజేయబడినది.

    స్వంత ప్రార్ధనవల్ల అనేకులను ప్రభువు తట్టు త్రిప్పవలయును. అలాగే సువార్త ప్రకటించి అనేకులను ప్రభువు తట్టు త్రిప్పవలయును. ఈ రెండు చేసి నమ్మవలయును. అందరికొరకు ప్రార్దించగలము కాని అందరికి సువార్త ప్రకటించలేము.

    రక్షితుల మోక్షములో అన్నిదేశములందున్నవారు ఉందురు. ఆఫ్రికా, చైనా, టిబెట్టు మున్నగు ప్రపంచ దేశములలోని వారందరు ఉందురు. అన్ని దేశములలోని వారిని గూర్చి మనము ప్రార్ధించిన వారందరు రక్షితుల మోక్షములో నుందురు. వీరు పెండ్లివిందుకు పెండ్లి కుమర్తెను బట్టి పిలువబడుదురు.

    శ్రమలో ఉన్నవారు:- వీరు పాపము నుండి విడుదల పొందవలెనని కోరుచున్నారు. కొందరు పాపములో పడి తిరిగి లేచుచున్నారు. ఈ మూడు తరగతుల వారిని గూర్చి మనము ప్రార్ధించవలెను. దైవభక్తులు పడిపోకుండునట్లు ప్రార్ధించవలెను. ఈ నాలుగు తరగతులను గూర్చి ప్రార్ధించిన మన ప్రార్ధన సంపూర్తి అగును. ఈ రీతిగా మనము అందరికొరకు ప్రార్ధించి ముగించవలెను.

    ఎంతవరకు మనము ప్రకటించగలమో అంతవరకు ప్రకటించవలెను. ఈ రెండు చేసినప్పుడే అనగా ప్రార్ధించి, ప్రకటించి, ముగించిన పెండ్లికుమార్తె వరుసలోనికి వెళ్ళి నూతన యెరుషలేము చేరుదుము. అక్కడ నుండి రక్షితులను పిలువగలము.

    పెండ్లికుమార్తెకు వేయిల్ ఉంటుంది. ఎందుకంటే పిలువబడిన ఆ రక్షితులు పెండ్లికుమార్తె యొక్క మహిమ చూడలేరు. ఆ మహిమను సహించలేరు. కనుక ముసుకు వేసికొందురు.

    వ్రాయుము అని అన్నారు:- ఎవరైనా హేళనకు ఏమి కూరలు అని అడిగినట్లు అడుగుదురు గాన వ్రాతలో ఉంటే చూపించవచ్చును. మత్తయి 4వ అధ్యాయములో ఆకలిగా నున్న యేసుప్రభువు సాతానుతో వాదించుచు ద్వితి యోపదేశకాండములో వ్రాయబడిన విషయములను ఎత్తిచూపించగా సాతానుడు ఓడిపోయెను. గనుక వ్రాతలో ఉన్నప్పుడు చూపించుట సుళువు. ఇవి దేవుని యదార్ధమైన మాటలు. అనగా ఆ విషయములను బాగుగా బలపర్చుటకు ఈ రీతిగా వ్రాయించెను. కొందరు నమ్మరు అట్టివారు వెళ్ళలేరు. ఇట్టివారిని గూర్చి ప్రార్ధించుట మంచిది. ఇట్టివారినిగూర్చి నిరాశ చెందవద్దు అని వాక్యములో వ్రాయబడియున్నది. ప్రక 19:10. నేను నీతోను యేసుని గూర్చిన సాక్ష్యము చెప్పు నీ సహోదర్లతోను సహ దాసుడను. దేవునికే నమస్కారము చేయుము. యేసును గూర్చిన సాక్ష్యము ప్రవచనసారము.

    దేవదూత యోహానుకు ఈ విషయములన్ని చూపించెను. యోహాను దేవదూతకు నమస్కారము చేయగా నీవు ఉన్నావు. నీ సహోదరులైన దాసులున్నారు. నేను కూడ నీవలె సహదాసుడనే అని అన్నాడు. యూదా ప్రజలు స్థానికుడైన యోహానును నీవు ప్రవక్తవా లేక నీవు మెస్సియావా అని అడిగిరి. అందుకు యోహానను నేను ప్రవక్తనైనను మెస్సియా నైనను కాను అనెను. ఈయన స్థానికుడైన యోహాను.

    శిష్యుడైన యోహాను ప్రకటన గ్రంధము వ్రాసెను. ఈయన వినయవిధేయత గలవాడు. దేవుని సిం హాసనము యొద్దనుండి గొప్ప అంతస్థుగల మహిమగల సిన్ హాసనము దగ్గర ఉండే ఆ దేవదూత మిక్కిలి వినయముగల వాడై యోహాను యొద్దకు వచ్చెనని ఈ వాక్యమువల్ల తెలియుచున్నది.

    దూత తనకున్న అంతస్థును తగ్గించుకొనెను. యెషయ నుండి మలాకి వరకు ప్రవక్తలు చెప్పినది ప్రవచనము. ప్రభువు వచ్చుట స్థానికుడైన యోహాను చూచెను. అలాగుననే శిష్యుడైన యోహాను పద్మసు లంకలోనుండి యేసుప్రభువు వచ్చుటను చూచెను. యేసుప్రభువుతో ఉండినవారును ప్రభువు వచ్చినారని సాక్ష్యమిచ్చిరి. గాన ఈ సాక్ష్యమే యేసుని గూర్చిన ప్రవచన సారాంశము.

    ప్రభువు వచ్చుట ప్రవచనము యొక్క నెరవేర్పైయున్నది. దీనిని గూర్చిన సాక్ష్యమే ప్రవచన సారమైనది.

    • 1. సాక్ష్యము నెరవేర్పు యొక్క ప్రకటన,
    • 2. సాక్ష్యము ప్రవచనముయొక్క సారము.
    ఈరెండు ఉన్నవి.

    ప్రభువు మొదటిసారి వచ్చియున్నారు. రెండవసారి వస్తారు అని యున్నది. ప్రవక్తలైన వారిని యేసుప్రభువు యొక్క మొదటి రాకడ దూరమైనది. రెండవ రాకడ ఇంకా దూరముగా నున్నది గనుక రెండవ రకడను గూర్చిన ప్రవచనము ప్రవక్తలైనవారు క్లుప్తముగా వివరించి యున్నారు. గనుక రెండు రాకడలను గూర్చి సాక్ష్యమిచ్చుట ప్రవచనసారము. సాక్ష్యమిచ్చుటలో నీవు నేను సహదాసులమే.

    ప్రక 19:11 పరలోకము తెరువబడియుండుట చూచితిని. అప్పుడిదిగో తెల్లని గుర్రము కనబడెను. దానిమీద కూర్చుండి యున్నవాడు నమ్మకమైనవాడును సత్యవంతుడును నామము గలవాడు. ఆయన నీతినిబట్టి విమర్శచేయుచు యుద్ధము జరిగించుచున్నాడు.

    నమ్మకమైనవాడు:- తాను ఏమిచేయ దలంచినాడో దానిని దాచుకొనకుండా బయలుపర్చువాడు సత్యవంతుడు. బైబిలులోని 66 గ్రంధములలోనిది ఎవరు బయలుపర్చుదురో వారు నమ్మకస్థులు. ఈ రెండు చేసినవారు ప్రభువే గనుక ఆయనే నమ్మకస్థుడు సత్యవంతుడు.

    తీర్పురోజు:- ఎవరైన ప్రభువా ఈ కథ అప్పుడే నాకు తెలిసియుంటే మారుమనస్సు పొందియుందుము అని అందురు. అట్టివారికి ప్రభువు వ్రాత పుస్తకము తీసి చూపించగా నిజమేనని నమ్ముదురు.

    పరలోక పుస్తకములు:-

    • 1. జీవగ్రంధము ఇందులో రక్షించ్పబడిన వారి పేర్లు ఉండును.
    • 2. గ్రంధములు ప్రతి చిన్న, పెద్ద పాపములు అశ్రద్ద, నిర్లక్ష కార్యములుండును. నమ్మని అతనికి ప్రభువు మనస్సాక్షి ద్వారా అతనిమీద సాక్షము చెప్పించెదరు.
    కాబట్టి ప్రభువు నీతినిబట్టి విమర్శ చేయును. రికార్డులో ఉన్న మంచి వ్రాతలను బట్టి చూచి నీవు నేరస్థుడవుకావు అని విమర్శ చేయును. మరి కొందరి రికార్డుచూచి నీవు నేర్స్థుడవని తెలియుచున్నదని విమర్శచేయును. నేరములేని వానికి నిత్య జీవము నేరస్థునికి నిత్య నరకముండును.

    యుద్ధము జరిగించుట:- ప్రభువునకును అంతిక్రీస్తునకును యుద్ధము జరగనై యున్నది.

    విమర్శ = తీర్పు విధించుట.

    యుద్ధము జరిగించుట = శిక్ష విధించుట

    ప్రక 19:12 ఆయన నేత్రములు అగ్ని జ్వాలలవంటివి, ఆయన శిరస్సు మీద అనేక కిరీటములుండెను. వ్రాయబడిన ఒక నామము ఆయనకున్నది అది యెవరికిని తెలియదు.

    ప్రభువు ను తేరిచూడగలిగిన ఆయనకు ప్రకాశవంతమైన నేత్రము లుండెను. జడ్జిగారు అన్యాయపు తీర్పు తీర్చిన సత్యము ఆయనకు తెలియలేదు అని అందురు. జడ్జిగారు మనిషైయున్నాడు గనుక కొన్ని గ్రహించలేదు. ప్రభువు దేవుడైయున్నాడు గాన అన్యాయపు తీర్పులు యేవి చేయడు.

    ఉదా:- జడ్జి గారు ఒక దొంగను పట్టుకొనుటకు ఆ ఊరి బావిదగ్గరకు కొందరు గూఢాచారులను స్త్రీ వేషములు వేయించి స్త్రీల సంభాషణ వినునట్లు పంపించెను. వారు ఆ ఊరి స్త్రీలకు తెలియకుండగా వారి సంభాషణలను బట్టి ఉన్నవి ఉన్నట్లుగా తెలిసికొని న్యాయము జరిగించితీరుదురు. ప్రభువైతే అన్యాయము జరిగినది అని ప్రజలు చెప్పుకొనకుండగా దేవదూతల ద్వారా విషయము లన్నిటిని రికార్డు చేయించును.

    తెల్లని గుర్రము:- రికార్డులోగాని, విమర్శలోగాని, యుద్ధములో గాని, తీర్పులోగాని, అన్యాయముండదు. యుద్ధము చేయుటకు జయశాలిగావచ్చును. శిరస్సు మీద ఐదురకములైన కిరీటము లున్నవి. ఒక మనిషి పాపశోధనలో అనుమానములో ఉండగా ప్రభువు సహాయము చేసి జయమివ్వగా ఒక కిరీటము ప్రభువు తలపై వేయుదుము. ఆపదలలో మనకు జయము రాగానే ఆయనను మహిమ పర్చుదుము. అదే ఆయనకు కిరీటమైయున్నది:

    జయము కీర్తనలు - జయశబ్ధముతో,

    వ్రాయబడిన నామము గుర్రముమీద ఉన్నవానికి కలదు. దానిపేరు కారణము.

    • 1. జ్ఞాపకముంచుకొనుటకు.
    • 2. ఇతరులను సిద్ధపర్చుటకొరకు
    • 3. సిద్ధపడుటకొరకు.
    • 4. దేవుడే లోకములో ఆదికాండము నుండి ప్రకటన వరకు మన రక్షణ కొరకు పనిచేసి యుందురు.
    • 1. రక్షణ నిమిత్తము,
    • 2. మన నిమిత్తము.
    • 3. చెడుగును నాశనము చేయు నిమిత్తము.
    • 4. అవిశ్వాసి నిమిత్తము.

    మరియు సాతానును నాశనముచేయు నిమిత్తమును పనిచేసియుందురు. ఈ పనులన్నియు వ్రాయబడియున్నవి. వ్రాయబడకుండ సంఘమునకు తెలియును.

    • 1. ప్రభువు చేయుట నిజము.
    • 2. ప్రభువు చెప్పుట అవసరము.
    అవి అన్నియు వ్రాయబడుట ముఖ్యమే. యేసుప్రభువు ఈ పనులన్ని చేసి గ్రంధము నందు వ్రాయించినారు. ఆయన చేయించిన పనులను వ్రాయించిన విషయములు అందరికి తెలిసినదే. 12వ వచనములో వ్రాయబడిన నామము యేసుక్రీస్తు నామము కాదు. ఈ నామము భూలోకము నందు అందరికి తెలిసినదే. పరలోకములో ఎవరికిని తెలియబడని నామము అని యున్నది. ఆ నామమేది?
    • 1. వ్రాయబడిన నామము.
    • 2. ఎవరికి తెలియబడని నామము.
    • 3. ఆయనకే తెలిసిన నామము.
    • 4. దానిపేరు నామము.

    భూలోకములో ప్రభువు పనిచేసినప్పుడు తన ఉద్యోగములో ఉన్నప్పుడు యేసుక్రీస్తు అనే నామము ఆయనకున్నది. జయశీలుడై పరలోకమునకు వెళ్ళిపోయిన తరువాత ఆయనకు మరియొక నామము ఉండవలెను. ఈ లోకమునందు యేసు నామమును బట్టి దయ్యములు వెళ్ళిపోవును. వ్యాధులు కుదురును. ఇవి నరులకు తెలిసి ఈ నామము ద్వారా రక్షణ పొందుచున్నారు. ఈ నామమునుబట్టియే నరులను పాతాళమునకు పంపును. పరలోకములో ఈ నామమునుబట్టి ఏమి జరుగునో అని పరలోక వాస్తవ్యులు కనిపెట్టుచు ఉందురు. ఇకముందునకు మమ్మును ఏమిచేయునో అని రక్షియులకును పాతాళములోనున్న దయ్యాలకును ఉన్నది. ఇప్పుడు తెలియదుగాని కడవరిలో ఏమి జరుగునో కాలము గతించగా తెలియును. అలాగే వ్రాయబడిన క్రొత్త నామము ఇప్పుడు తెలియదుగాని పోగా పోగా తెలియును. అనంతకాల మహిమలోనికి వెళ్ళినకొలది ఏమి జరుగునో తెలియును. అట్లె మహిమలోకి వెళ్ళగా వెళ్ళగా ఆ క్రొత్త నామమునుగూర్చి తెలిసికొందుము. భూలోకములో రక్షణ కొరకు పరలోకములో నిత్య జీవము కొరకు దూతలను ఆ అనంత నామము జీవ నామము గురించి తెలిసి కొందురు. యోహాను తన పత్రికలో "ముందునకు ఏమి అగుమో" అది ఇంకను ప్రత్యక్షపరచబడలేదు. 1 యోహాను 3:2.

    ఈ లోకములో ప్రభువునకు నామ మున్నది. పరలోకములో ఈ నామముండదు. వేరే నామ ముండును మహిమను గూర్చి ఈ లోకములో వినుచున్నాము. ఈ లోకములో విన్న ఈ వార్త రేపు పరలోకములో చూచినప్పుడు ఏమి చెప్పలేదని అన్నట్లుగానే ఉండును.

    సొలోమోనురాజు దగ్గరకు షేబా దేశపు రాణి వచ్చి నేను ఉప్పుడు యిక్కడ చూచుచున్నదానిలో కొంతైనను నాకు వినబడలేదు అని అన్నట్లుగానే విన్న ఈ మహిమను గూర్చినవార్త ఏమియు బయలుపర్చబడలేద్న్నట్టుగానే ఉండును. పెండ్లికుమార్తె ఇప్పుడు బయటకు రావలెను పెండ్లికుమార్తె బయట పడవలెను. ఎస్తేరురాణి అయ్యగారి దర్శనములో కనబడినది. ఆమె ధరించినది విలువైన వస్త్రములే గాని రాజ వస్త్రములు కాదు. ఇప్పుడు ఎస్తేరు బయటకు రావలెను. యుగ యుగములు రాజైయుండునని ముందే వ్రాయించెను.

    • 1. వ్రాయబడినది,
    • 2. అది నామమైయున్నది. (ఊరు పేరు లేని రక్షకుడు మనకు లేడు)

    ప్రార్ధన:- దయగల ప్రభువా నీ వాక్యములో మర్మమైన సంగతులు అందించు చున్నందుకు స్తోత్రములు. ఎన్ని మర్మములు, ఎన్ని కథలు ఇముడ్చుకోగలమో అన్నిటిని బయలుపర్చుము. దయగల తండ్రీ మేము అవిశ్వాసులతో పందెము వేయుచున్నాము. మరణమును, అవిశ్వాసమును నీవు గెలిచినావు. నీవు శ్రమలను గెల్చినావు. శ్రమలు, పాతాళము మమ్మునేమి చేయజాలవు. ఈ లోక జీవితమును, మరణమును, నరకమును నీవు గెల్చినావు. మా నిమిత్తమై నీవు జరిగించిన జయ చరిత్రనుబట్టి మేము ధైర్యము వహించే కృప ఇమ్ము. అందును బట్టి మేము ముందుకు సాగిపోయే కృప దయచేయుము. త్వరగా వస్తున్న ప్రభువు ద్వారా వేడుకొంటున్నాము. "ఆమెన్"

    ప్రక 19: 13. రక్తములో ముంచబడిన వస్త్రము. ఆయన ధరించి కొని యుండెను. మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడియున్నది.

    ప్రభువు మనకొరకు రక్తము చిందించిన విషయము మనకును సైతానుకును తెలియును. రక్తముతో చిలకరింపబడిన వస్త్రములను ప్రభువు ధరించెను. గనుక సిలువమీద చిందించిన రక్తమని ఈ వచనములో తెలియుచున్నది. ప్రభువును సిలువవేసినప్పుడు ప్రభువు ధరించిన వస్త్రములను తీసివేసి రాణువవారు చీటి వేసి పంచుకొనిరి. రక్తము అంగీపై పడినదని చరిత్రలో లేదు గాని ఈ వచనములో రక్తముతో ఉన్న అంగీ అని వ్రాయబడినది.

    పాదిరిగారు ఉన్నారు వారికి అభిషేకము చేసిరి. ఆరాధన చేయునప్పుడు అంగీ ధరించి అరాధన అనంతరము తీసివేయుదురు. ఇతరులు ఆ వస్త్రములను చూచినప్పుడు గురువు అని అనుకొందురు. బజారులో ఆయనకు వస్త్రములేకపోయిన తెలిసినవారు ఆయనకు పాదిరిగారు అని అన్నప్పుడు ఇతరులు ఈయన పాదిరిగారు అని అనుకొందురు. యాజక వస్త్రము లేకపోయిన ఉద్యోగమును బట్టి పాదిరిగారు అయినట్లుగానే ప్రభువునకు సిలువపై అంగీ ఉన్న లేక పోయిన ఒకటేగాని ఈ అభిషేకము తీసివేయుటకు వీలులేదు.

    • 1. అంగీ.
    • 2. అహిషేకము.
    • 3. రక్తపు బిందువు.
    ఇవి ప్రభువు యొక్క వస్త్రములోనివి. రక్షణకు అభిషేకము రక్తము చిందించుటకు అభిషేకము అభిషేకమనే వస్త్రము ధరించియున్నట్లు కనబడెను.

    పరలోకము నుండి ప్రభువు హార్మగెద్దోనునకు రావలయును. వ్రాయబడిన నామము ఎవరికి తెలియబడుననేది అ|| కా || 4:12నకు సంబంధించినదై యున్నది. ఇది ఆయనకే తెలియును. ఈ వాక్యము వల్ల మనము మరి

    కొంత తెలిసికొందాము. ఇది ప్రత్యేక నామము, దీని వలననే రక్షణ యేసు, క్రీస్తు అను యేసుక్రీస్తు, క్రీస్తు యేసు అను ఇవి అన్నియు ప్రత్యేక నామములు. ఈ నామమున తప్ప ఏ నామమున రక్షణలేదు. ఇది అన్నిటికన్న గొప్పది. దేవుని వాక్యము అనునది ఒక ప్రత్యేక నామమైయున్నది. గొర్రెపిల్ల, మిస్సీయా, దేవుని కుమారుడు ఇవన్నియు మనకు తెలిసిన నామములే, మనకు తెలిసిన ఈ నామములు ప్రత్యేక నామములైతే వ్రాయబడి ఆయనకే తెలిసిన నామము అంతకంటే ప్రత్యేకమైన నామము.

    ప్రక 19:14, పరలోకమున నున్న సేనలు తెల్లని నార బట్టలు ధరించి తెల్లని గుర్రమెక్కి ప్రభువును వెంబడించిరి.

    ప్రభువు తెల్లని గుర్రము ఎక్కెను, తెల్లని వస్త్రములు ధరించెను. ప్రభువును వెంబడించినవారు కూడ తెల్లని గుర్రములెక్కి తెల్లని వస్త్రములు వేసికొనిరి. ప్రభువు ముందు వెళ్ళుచుండగా వీరు వెనుక వచ్చిరి. భూలోకములో శిష్యులు, విశ్వాస్లు, పెండ్లికుమార్తె ప్రభువును వెంబడించిరి. వీరు హర్మగెద్దోను యుద్ధము వరకు ప్రభువును వెంబడింతురు. ప్రభువు ఏమిచేసిన దానికి వ్యతిరేక చర్యలు సాతానుడు చేయును. ప్రభువుని శిష్యులపై సైతాను దండెత్తెను. గనుక ఇప్పుడు ప్రభువు సైతానుపై దండెత్తెను. దేవుడు తన నోటి ఊపిరి చేత సాతానుపై యుద్ధము చేసెను. 2. థెస్సు 2;8. ఈ లోకమందున్న గుర్రములు మాంసము, డెక్కలు, చర్మము, ఎముకతో చేయబడినవి. పరలోక గుర్రములు మహిమతో చేయబడినవి. ప్రభువు నరుడుగా రాకముందు దేవుడైయున్నారు. గనుక ఆత్మలను ఆత్మస్వరూపియై జయించగలరు. ప్రభువు మనిషిగా ఉన్నప్పుడు ఆయన శరీరధారులను కూడ జయించగలరు.

    హర్మగెద్దోను

    హర్మగెద్దోను యుద్ధము:- ఈ యుద్ధమునకు ముందు

    • 1. జ్ఞానము,
    • 2. విమానములు,
    • 3. క్రోథము.
    • 4. ధనము.
    • 5. దౌర్జన్యము.
    ఇవి అన్నియు ఎక్కువగును. ఇవి అన్నియు ఎక్కువకాగా హర్మగెద్దోను యుద్ధము వచ్చును. హర్మగెద్దోను యుద్ధములో ఆయుధములు పనికిరావు. రోమా 13:12 మిఖాయేలునకును, సైతానుకును జరిగే యుద్ధములో మిఖాయేలు చేతిలో ఉన్న వెలుగు ఆయుధములకు సైతానుచేతిలోఉన్న చీకటి ఆయుధములు పడిపోవును. సైతాను ఓడిపోవును.

    బైబిలులో రెండు సంగతులు ఉన్నవి.

    1. ప్రభువు వచ్చునప్పుడు రేప్చర్లో పెళ్ళికుమార్తె వరుసలో సిద్ధపడినవారు మేఘములో ప్రభువును కలిసికొనుటకు ఆరోహణమగుదురు. ఇది విశ్వాసుల గుంపు.

    2. వెయ్యేండ్ల పరిపాలన పూర్తీయిన పిమ్మట పునరుత్థానులగువారు కొందరు ఉందురు. వారు అవిశ్వాసుల గుంపులోనివారు. వీరు నిత్య నాశనము కొరకు పునరుత్థానలగుదురు. మొదటి పునరుత్థానములో అనగా రేప్చర్ కాలములో లేచిన వారు నిత్య జీవము కొరకు లేపబడినవారైయుందురు రెండవ పునరుత్థానము కాకమునుపు వెయ్యేండ్ల పరిపాలన అనంతరము జరుగకమునుపు పాతాళములోని మారుమనస్సు లేనివారు బోధ విని మార్పునొందితే రక్షణలోనికి వచ్చెదరు. మొదటి పునరుత్థానములో ఆదాము మొదలుకొని రేప్చర్ వరకు ఉన్న విశ్వాసులు లేచెదరు. ఈ రెండు పునరుత్థానము వరకు మధ్యలో సజీవుల తీర్పు జరుగును. వెయ్యేండ పరిపాలన కాలములో వాక్యము విన్నవారికిని పెండ్లికుమార్తె వరుసలో సిద్ధపడక పునరుత్థానులు కాని రక్షితులు అంత్య తీర్పు కాలమందు పునరుత్థానులగుదురు.

    పునరుత్థానము అనగా భూమిలో నుండి పైకి వచ్చుట యేసుప్రభువు మరణమై సమాధి చేయబడి భూమిలో నుండి పైకి వచ్చుట యేసుప్రభువు మరణమై సమాధి చేయబడి భూమిలో నుండి మహిమ శరీరముతో లేచెను. అలాగే విశ్వాసులలో సమాధిలో నుండి లేచుట ఆయన మాధిరిని అనుసరించుట అగును. 1 కొరింథీ 15: 42-44.

    ప్రక 19:15 జనములను కొట్టుటకై ఆయన నోటనుండి వాడి గల ఖడ్గము బయలువెడలుచున్నది. ఇనుప దండముతో వారిని యేలును. సర్వాధికారియగు దేవుని తీక్షణమైన ఉగ్రత అను మధ్యపుతొట్టి త్రొక్కును.

    ఈ వాక్యము హర్మగెద్దోను యుద్ధము యొక్క ప్రవచనము మరింత వివరముగా ఉన్నది. 14వ అధ్యాయములో జనములను కొట్టుడనే దానికి వ్యతిరేకముగా వ్రాయబడి యున్నవి. "మీరు వెళ్ళి సమస్త రాష్ట్రములకు సువార్త ప్రకటించమనెను." ప్రభువు ఈ మాట చెప్పినప్పుడు జనములు సమస్త రాష్ట్రములు సువార్త తెలియకుండా యున్నది. ఇప్పుడు అందరికి సువార్త తెలియజేయబడినను వారు మారుమనస్సు పొంద లేదు గనుక వారిని కొట్టివేయుమని వ్రాయబడియున్నది. నమ్మినయెడల ప్రభువు రక్షించియుండును. రెండువేల సంవత్సరములకు ముందుగా చెప్పబడిన ఈ మాట ముంగుర్తుగా ఉన్నది. సమస్త రాష్ట్రములు అనగా సమస్త జనములు. మనలో ఎవరైన 7సంవత్సరముల శ్రమలను, సువార్తను, పరిశుద్ధాత్మ బాప్తిస్మమును, పెండ్లికుమార్తె వరుస తెలిసికొన్నను శ్రమలను అనుభవించియు మారుమనస్సు పొందకపోతే శిక్ష తప్పదు. ఆ శిక్ష ఈ వచనములో కొట్టుట అని వ్రాయబడి యున్నది. మనలో ఎవరైన మారుమనస్సుపొందక 7సంవత్సరముల శ్రమ కాలములో మారుమనస్సు పొందవలెనన్న పొందలేరు. ఇట్టివారు పెండ్లికుమార్తె వరుస కొరకు సిద్ధపడి గట్టు దాటి 7 సంవత్సరముల శ్రమలలో ప్రవేశించిన యెడల మారుమనస్సు పొందుట చాలా కష్టము. ఆది కాండము 5వ అధ్యాయములో పితామహుడైన హనోకు జల ప్రళయమునకు ముందే జీవించి ఉన్నవారు. రేపో మాపో పడవ నీటిపైకి లేచునని అనుకొనుచున్న కాలములోనివాడు. ఆ కాలము నందు హనోకు ఆరోహణమైనాడు ఆదికాండము 5వ అధ్యాయములోని విషయము ప్రకటన 19:15లో తేల్చబడి యున్నది.

    సువార్త సర్వరాష్ట్రములకు సర్వ సృష్టికి వినిపింప బడుచున్నది. ఆ సమయములో నమ్మువారు రక్షింపబడుదురు. ఒక్కొక్కరికి వినిపింప బడెను. సువార్త అన్ని రాష్ట్రములలోని సృష్టి అంతటికిని మాత్రమే గాక సర్వజనాంగమునకును ప్రకటింపబడవలెను. సంఘము సర్వరాష్ట్రమునకు, సంఘవృద్ధికి ప్రకటించుచున్నది. కాని ఒక్కొక్కరికి వ్యక్తిగతముగా ప్రకటించవలెను. అది సంఘము యొక్క పని.

    నా యొద్దకు వచ్చువానిని నే నెంత మాత్రమును త్రోసివేయను. యోహాను 6:37. ఈ వచనములో ఖడ్గమనియున్నది. అనగా శస్త్రచికిత్స చేయనటువంటి కత్తి. హెబ్రి 4:12 లో ఉన్నది. ప్రకటనలోనిదియు, హెబ్రిపత్రికలోనిదియు ఒకటి కాదు. ఎఫెసీ 6:17,18 లోను ఖడ్గమున్నది. ప్రకటనలోని ఖడ్గము శిక్షించుటకు, హెబ్రిలోని ఖడ్గము మనలో ఇమిడ్చిన ఖడ్గము. దేవుని యొక్క ఆత్మ భక్తులకు డిక్టేషన్ చెప్పుచుండగా వ్రాయబడిన ఖడ్గము. ఈ ఖడ్గములో వాక్యము ఇమిడి యున్నది. ఈ మూడును ఒక్కటే. దేవుడు ఏ కత్తితో మనుష్యులను రక్షించునో ఆ కత్తితోనే శిక్షించును. అవిశ్వాసులు దేవుని వాక్యమనే ఖడ్గమును విసర్జించినారు గనుక రక్షణ కలుగచేసే ఆ ఖడ్గమే ఇప్పుడు శిక్షించుచున్నది.

    ఆదియందు వాక్యముండెను. ఆయన శరీరధారియై మన మధ్య నివసించెను.

    • 1. ఖడ్గ మంటే బైబిలు
    • 2. ఖడ్గ మంటే దేవుని వాక్యము
    • 3. ఖడ్గ మంటే క్రీస్తు ప్రభువు


    • ఇది ఖడ్గమునకు వివరము

    యేసు తనతోటి ఊపిరిచేత వానిని సమ్హరించెను. యేసు ప్రభువు యొక్క భక్తులను శ్రమపెట్టిన సైతానుడు నాశనము చేయబడును. బైబిలు గ్రంధమును మనము జాగ్రత్తగా దాచుకొన్న ప్రభువును దాచుకొన్న ట్లే

    • 1. పెండ్లి విందు
    • 2. హర్మగెద్దోను యుద్ధ ప్రవచనము.

    ఈ రెండును 19వ అధ్యాయములో ఉన్నది. వాడిగల ఖడ్గము దాని శక్తిని బయలు పర్చుచున్నది. ఆ ఖడ్గము బయలు వెడలుచున్నది. ఇది అవిశ్వాసులను నాశనము జేయును.

    ఇనుప దండము ప్రక 2:27. ఇనుప దండము అనగా వాక్యమనే ఇనుపదండము విశ్వాసి చేతిలో ఉండును. ఈ దండము అవిశ్వాసిని నాశనము చేయుటకు ఉపయోగించబడును. రేప్చర్ వరకు ఈ ఇనుప దండమనే వాక్య ఖడ్గము విశ్వాసిచేతిలో ఉండును. ఇనుప దండము కలిగిన సంఘము తుయతైర సంఘము. ప్రక 2:27. ఈ సంఘమే కేతలిక్ సంఘము. ఇనుప దండము అనగా అధికారము. ఈ ఇనుప దండము ఇక్కడ ప్రభువు దాచిపెట్టి వెయ్యేండ్ల పాలనలో మనకిచ్చును. ఎందుకంటే ఇక్కడ ఇవ్వబడిన అధికారమును ఉపయోగించుకొనలేము.

    ఒక పిల్లవాడిని జాగ్రత్త అని గదిమిన ఆ పిల్లవాడు భయపడి ఒక ప్రక్కగా వెళ్ళిపోవును. ఏలుట అనగా అధికారము. ఈ అధికారము శిక్షించే అధికారమైయున్నది. ఇప్పుడు ప్రభువు యేలుబడి. అప్పుడు మన యేలుబడి. ఇప్పుడు ప్రభువు యేలుబడి కొరకు అన్ని ఇచ్చెను. గాని మనము వాడలేకపోవుచున్నాము.

    ప్రభువు వెయ్యేండ్ల పాలన కాలములో ఇనుప దండముతో వచ్చును. దేవుడు తన కోపాగ్నిని బట్టి నరులను శిక్షించును. ఎందుకంటే ఆయన రాజులకు రాజును ప్రభువులకు ప్రభువైయున్నారు.

    • 1. ఆయన చేతిలో ఇనుపదండమున్నది.
    • 2. ఆయన నోటిలోవాడియైన ఖడ్గమున్నది.
    • 3. ప్రభువుని హృదయములో అధికార మున్నది. ప్రక 19:16. వస్త్రములమీదను, తొడ మీదను ఆయన నామము వ్రాయబడి యున్నది.

    మోషే కాలములో యాజకులకును, ప్రభువు కాలములో బోధకులకును వస్త్రముల మీద నామము వ్రాయబడెను. అది స్థిరమునకు గుర్తు.

    తొడమీద అనగా ఆ కాలములో కుస్తీదారులు తొడకొట్టి ఛాలెంజ్ చేసేవారు. వస్త్రము మీద ప్రభువు సంపాదించిన రక్షణకు గుర్తుగా నామము వ్రాయబడెను. త్రాగినవారు పందెము వేస్తే అది ఏమాత్రము సాగదు. అలాగే సైతాను మనమీద పందెము వేసి ప్రకటన పాడు చేయుదునని బెదిరించును గాని సంఘము లోబడదు.

    • 1. ఖడ్గము
    • 2 దండము
    • 3.రాజ్యము
    • 4. ఏలుబడి,
    • 5. పందెము
    ప్రక 19:17. ఒక దూత సూర్యుని బింబములో నిలిచి దేవుని గొప్ప విందు నకు కూడి రండి అని ఆకాశ మధ్యమందు ఎగురుచున్న సమస్త పక్షులను పిలిచెను.
    • 1. రాజులు
    • 2. సహస్రాధిపతులు
    • 3. బలిష్టులు
    • 4. గుర్రములు
    • 5. గుర్రములమీద కూర్చుండువారు
    • 6. స్వతంత్రులు
    • 7. దాసులు
    • 8. కొద్దివారు
    • 9. గొప్పవారు.
    ఇట్టివారి మాంసము విందుగా భుజించుడి రండి అని దేవదూత పిలిచెను. ముందుగా దేవుడు పరలోకమందు గొప్ప పెండ్లివిందు చేసిరి. ఆ విందునకు రానివరికి

    తొమ్మిది రకాల మాంసపు విందు. పక్షులకు, మృగములకు దేవుడు చేసియున్నాడు. ఇది ఎంతో విచారము. పెండ్లివిందుకు వెళ్ళిఉంటే పెండ్లి విందు అందియుండును.

    సృష్ట్యాది మొదలు సృష్టి అంతము వరకు లోకములో నున్న నరులకు దేవుడు గడువులను ఇచ్చెను.

    • 1. సృష్ట్యాది నుండి రేప్చర్ వరకు.
    • 2. రేప్చర్ నుండి హర్మగెద్దోను వరకు.
    • 3. హర్మగెద్దోను నుండి వెయ్యేండ్ల పరిపాలనాంతము వరకు ఇవి దేవుడు లోకములో నున్న నరులకు ఇచ్చిన మూడు గడువులు.

    మొదటి గడువు కష్ట సుఖముల గడువు. ఈ రెండింటి బట్టి యైన నరుడు దేవునితట్టు తిరుగవలెను. రెండు కష్టముల గడువు. ఈ కాలమందు సుఖమేమియు ఉండదు. కష్టకాలమునందైన తిరుగవలెను. మూడది సుఖముల గడువు. ఈ కాలము నందు కష్టము లేమియు ఉండవు. మనిషి రక్షణ కార్యక్రమమునకు దేవదూతలలో ఒక దూత కనబడుచున్నాడు ఈ దూత విందునకు పిలుచుచున్నాడు. పై ఉదహరింపబడిన తొమ్మిది రకములైనవారు పరలోక విందునకు సిద్ధపడలేదు. గనుక వీరే ఇతరులకు అనగా పక్షులకు, మృగములకు విందు కావలసివచ్చెను. స్మాఆనములోని శవములను నక్కలు, కుక్కలు, కాకులు, గ్రద్దలు తినును. పెండ్లి విందునకు సిద్ధపడిన పెండ్లికుమార్తెకు పరలోకములో విందు జరుగుచున్నది. అయితే భూలోకములోని నరులు పక్షులకును, మృగములకును విందుగా ఏర్పర్చబడినారు.

    • 1. ప్రభువు రాజు అని గ్రయ్హింపనందున భూలోకరాజులు పక్షులకు విందు కావలసి వచ్చినది.
    • 2. ప్రజలను సరిగా కాపాడక మనుష్యులకు హాని చేసినందువల్ల సహస్రాధిపతులు విందైనారు.
    • 3.కష్టకాలములో మనుష్యులకు సహాయము చేయనందువల్ల బలిష్టులు విందైనారు.
    • 4. తమకివ్వబడిన ట్రైనింగు సరిగా వాడనందున వాటిమీదకూర్చున్న నరులు దేవునిపై యుద్ధమునకు వెళ్ళినందున గుర్రములు విందాయెను.
    • 5. దేవునిపై తిరుగుబాటు చేసినందున గుర్రములమీద కూర్చున్నవారు పక్షులకు విందైరి.
    • 6. దేవుడు అనుగ్రహించిన స్వతంత్రతను మంచి రీతిగా దేవుని విషయములో వాడనందున స్వతంత్రులు విందైరి.
    • 7. నరులైన పైఅధికారులకు లోబడి దేవునికి లోబడనందున దాసులు విందైరి.
    • 8. కొద్ది స్థానములో ఉండి దేవునికి నమ్మకముగా నుండక లోబడ నందువల్ల కొద్దివారు విందైరి.
    • 9. లోకములో గొప్పవారుగా కనబడుచు దేవుని విషయములో మిక్కిలి అల్పులైన వీరు తమ గొప్పతనమును సైతాను పక్షముగా వాడుకొన్నారు. అందునుబట్టి గొప్పవారు కూడ పక్షులకు అహారమైరి.

    సూర్యబింబము:- సూర్యబింబము అనగా కాంతి, మొదట భూమిమీదకు వచ్చెను. ఇది దేవుడు ఇచ్చిన మొదటి కానుక. ఆ కాంతి. మొదట భూమిమీదకు వచ్చెను. ఇది దేవుడు ఇచ్చిన మొదటికానుక. ఆ కాంతివల్ల తమ్మును శుభ్రము చేసికొనలేదు కనుక తీర్పు సూర్యునిలోనుండి వచ్చెను. నా కాంతి మీ కందరికి వ్యయము చేసితిని నన్ను కలుగజేసిన దేవుని మ్రొక్కక నాకు మ్రొక్కితిరి గనుక మీకు తీర్పు అని సూర్యుడు గ్రహింపచేసెను. దేవదూత 14వ అధ్యాయములో నిత్యసువార్త ప్రకటించగా వినలేదు గనుక ఆ దేవదూతగారే రక్షణకు బదులు తీర్పు ప్రకటించిరి. దేవుని మీదకు యుద్ధమునకు వెళ్ళిరి గనుక తీర్పు తప్పలేదని సూర్యుడు, దేవదూత ప్రకటించిరి.

    ప్రక 19:19. గుర్రముమీద కూర్చున్నవానితోను ఆయన సేనతోను యుద్ధము చేయుటకై ఆ క్రూర మృగమును భూరాజులును వారి సేనలను కూడిరి.

    ప్రభువు గుర్రమెక్కి హర్మగెద్దోనునకు తన సైన్యముతో వచ్చెను. భూమిపైనున్న క్రూర మృగమును అతని సైన్యమును హర్మగెద్దోనునకుచేరిరి. చైనా, జపాను ఈ రెండు దేశముల మధ్య సముద్రమున్నది. ఇరుపక్షముల సైన్యములు రెండు ప్రక్కల నున్నారు. ఎవరో ఒకరు యుద్ధము ఆరంభించవలెను. చాలాసేపువరకు అందరు ఊరుకొన్నారు. ఎవరు ముందువచ్చి తుపాకి పేల్చుదురో వారు ముందు చనిపోవలెను. జపాన్వారు ముందు తుపాకి పేల్క్హిరి. చైనావారు యుద్ధము చేసిరి.

    ఇప్పుడు హర్మగెద్దోను అను భూభాగము నందు రెండు పక్షములవారు యుద్ధమునకు సిద్ధపడి యున్నారు. ఎవరు యుద్ధము ఆరంభించవలెను? భూలోకమునుండి సైతాను, సైతాను సైన్యము మొదట వచ్చెను. తరువాత ప్రభువు పరలోకము నుండి తన సైన్యముతో వచ్చెను. లోకములో జరుగు యుద్ధములలో ఉపయోగించునట్టి ప్రేలుడులు ఏవియు లేకుండనే ప్రభువు తన శ్వాస ద్వారా శత్రు సైన్యమును నాశనము చేసెను. ప్రభువు తనయొక్క ప్రభావమును బట్టి రక్తస్రావరోగిని బాగుచెసెను. ఆ రోగిని రక్షించెను. ఆ ప్రభావమే తిరుగుబాటు చేసిన వారిని హర్మగెద్దోను యుద్ధములో నాశనము చేసెను.

    • 1. రక్షణ విషయములు
    • 2. విమోచన విషయములు
    మనకు సందేహముండకూడదు. దేవుని వాక్యము చదివిన సందేహము పోవును.

    హడ్సన్ దొరగారు ఆత్మావేశముతో చెప్పిన మూడు సంగతులున్నవి

    • 1. యుద్ధములు జరుగును
    • 2. ఉజ్జీవకూటములు జరుగును
    • ప్రభువు ఆ తరువాత వచ్చునని చెప్పెను.

    • జపానుదేశము తూర్పుదేశములకును
      మొదట యుద్ధము జరుగును
      అందుకు ఇండియా హృదయమట.

    పై ఉదహరింపబడిన ఈ తొమ్మిది తరగతులవారు ప్రభువు మీద యుద్ధము నిమిత్తము ఏడు సంవత్సరముల శ్రమ కాలములో సిద్ధపడిరి. ప్రభువు సైన్యమును చూడగానేవారికి అనగా ఈ తొమ్మిది తరగతుల వారికి మోకాటి చిప్పలు వసిలిపోయెను. హర్మగెద్ద్పెను యుద్ధము ఎందుకనగా వెయ్యేండ్ల పరిపాలన కొరకే. దేవుడు ఉన్నాడని న్యాయముగా నడుచుకోవాలని అన్ని మతముల సిద్ధాంతములో ఉన్నది. అయితే వెయ్యేండ్ల పరిపాలన కాలమప్పుడు మరి ఎక్కువగా నుండును.

    ఆహారములు:-

    • 1. పండ్లు దేవుని సృష్టిలో ఇది మొట్టమొదటగా దేవుడు ఇచ్చినవి.
    • 2. కూరగాయలు:- ఇవి కొన్ని యేండ్లపిదప వచ్చినవి. 3. మాంసాహారము - అవి వచ్చిన కొన్ని యేండ్లకు ఇవి వచ్చినవి. ఈ మూడవ ఆహారములో పక్షులు కూడా ఉన్నవి.

      • 1. ఏ పక్షులైతే మనుష్యులకు మూడవ ఆహారముగా ఏర్పర్చబడినవో ఇప్పుడు ఆ పక్షులకే మనుష్యులు ఆహారమైనారు
      • 2. ఏ రక్షకుడు నరులను రక్షించుటకు వచ్చెనో, ఆ రక్షకుడే నాశనము చేయుటకు వచ్చెను.
      • 3. ఏ దేవదూత అయితే నేడు మీకొరకు రక్షకుడు పుట్టియున్నాడని గొల్లలకు ప్రకటించిరో ఆ దేవదూతయే ఇప్పుడు తీర్పు ప్రకటించెను.
      • 4. ఏ రక్షకుని నోటిమాటవల్ల రోగులు స్వస్థత నొందినారో చనిపోయినవారు బ్రతికింపబడిరో ఆ రక్షకును నోటి ఊపిరి చేత హర్మగెద్దోను యుద్ధములో నాశనమైరి.

      ప్రార్ధన:- ప్రభువా మా కండ్లు మూయుము. ఏడు సంవత్స్రముల శ్రమలోని దుష్టత్వమును మేము చూడలేము. కరువు, రోగుల మూల్గును వినలేము. మేము పరలోకము నుండి వచ్చేవారమైతే చూడగలము. పైనే మేము చూడలేకపోతే హర్మగెద్దోను యుద్ధము అసలే చూడలేము. కొండ పగిలి నెర వుడువగా విశ్వాసులు దానిలోనికి వెళ్ళిపోవుదురు. వర్షము వెలిసిన పిదప బయటకు వచ్చి చూడగలము. శత్రువులకు కలిగె కష్టములను చూడలేము. పెండ్లి విందులో కూర్చుండగల కృప దయచేయుము. దేవునిని గాని, రక్షకుని గాని, దూతలను గాని ఎదురించక ఉండే కృప దయచేయుము. మనుష్యులను నీ కృపలో నింపుము. త్వరగా వచ్చుచున్న ప్రభువునుబట్టి వేడుకొనుచున్నాము. || ఆమెన్ ||

      Home