10వ అధ్యాయము - 7 Thunders
Declaration of Everlasting Gospel

పరిచయము

బలిష్టుడైన దూత
  • 1) బ||దూత (1) దిగెను
  • 2) ధరించుకొనెను
  • 3) శిరస్సు
  • 4) ముఖము
  • 5) పాదములు
  • 6) చేతిలో
  • 7) కుడిపాదము
  • 8) ఎడమపాదము
  • 9) ఆర్భాటించె


  • మేఘము
  • ధనస్సు
  • సూర్య
  • అగ్నిస్తంభ
  • విప్పిన పుస్తకము
  • సముద్రముపై
  • భూమిపై
  • సిం హమువలె
arrow
arrow

నేను వ్రాయబోతిని
పరలోక స్వరము :

  • 1) ముద్రించు
  • 2) వ్రాయవద్దు

ఐ|| దూత : కుడిచేయి ఆకాశము తట్టెత్తి

బలిష్టుడైన దూత




  • ఎ. సృజించె
  • బి. జీవించె

  • 1) పరలోకమును
  • 2) అందున్నవాటిని
  • 3) భూమిని
  • 4) అందున్న వాటిని
  • 5) సముద్రమును
  • 6) అందున్నవాటిని






ఒట్టు పెట్టుకొనెను
ఆయనతోడు:
  • 1) ఇక ఆలస్యముండదు
  • 2) దేవమర్మము పూర్తియగుట
7వ దూత
బూరప్పుడు
దేవుడు తెల్పిన
    సువార్త ప్రకారము
  • 1) దాసులకు
  • 2) ప్రవక్తలకు
    సంభాషణ:
  • 1) స్వరము:
    • ఎ. వెళ్ళు
    • బి. పుస్తకము తీసుకో
  • 2) నేను (దూతతో) ఈ చిన్న పుస్తకము నాకిమ్ము
  • 3) దూత:
    • ఎ. తీసుకో
    • బి. తిను
    • సి. కడుపునకు చేదు
    • డి. నోటికి తేనె
    N.B :
  • ఎ. తింటిని
  • బి. చేదాయెను
    వారు : (నాతో) మరల ప్రవచింప నగత్యము
  • ఎ. ప్రజలను
  • బి. జనములను
  • సి. భాషల వారిని
  • డి. అనేక రాజులను
  • గురించి

ప్రకటన గ్రంధ వివరము తెలియుచున్నది. అందుచేత

  • 1) ప్రవక్తలు మేము వ్రాసిన ప్రవచనములు నెరవేరుచున్నవని చూచి సంతోషించుచున్నారు.
  • 2) అపోస్తలలు మా వ్రాతలు నెరవేరుచున్న వని చూచి సంతోషించుచున్నారు.
  • 3) మిషనరీలు, బోధకులు మేము చేసిన పని వృధాకాలేదని సంతోషించుచున్నారు.
  • 4) నేను వ్రాసిన ప్రకటన గ్రంధము వివరించ్చుకొనుచున్నారని యోహాను సంతోషించుచున్నాడు

  • 1) సృష్టి కార్యక్రమము
  • 2) లోకచరిత్ర కార్యక్రమము
  • 3) విశ్వాసుల కార్యక్రమము
  • 4) పరలోకవాసుల కార్యక్రమము
  • 5) అంధకార రాజ్య కార్యక్రమము. ఇవన్నియు జరుగుచున్నవి.

అంధకార రాజ్య కార్యక్రమము ఏమో తెలియదు గాని అది విశ్వాసులకే తెలుసును. తుఫానప్పుడు నదులు, వాగులు, ఏర్లు వాగులలోని పిల్లవాగులు వడిగా పరుగెత్తినట్లు అన్ని కార్యక్రమములు సాగిపోవుచున్నవి.

ఇప్పుడు వార్తాపత్రికలు చూచినా చదువుచున్న వారందరికి అదురు, బెదురు, దడ, వడ కలుగుచున్నది కొందరు వస్తు భక్తి కలవారు, అన్ని పరీక్షించి మనిషిని నాశనముచేసే బాంబులు కనిపెట్టిరి. ఇట్టి బమంబులనుబట్టి లోకమంతా నాశనంకాదు గాని రక్షణ సంకల్పన నెరవేరుచున్నది కాబట్టి లోకము ఎన్నడును నాశనముకాదు.

  • 1) ప్రభువు రావలెను.
  • 2) 7సం||ల శ్రమ జరుగవలెను.
  • 3) హర్మగెద్దోను యుద్ధము జరుగవలెను
  • 4) వెయ్యేండ్ల పరిపాలన జరుగవలెను.
ఆ పిదప నాశనమే గాని అంతకుముందు లోకము ఎన్నడును నాశనం కాదు, అలాగు నాశనమైన యెడల రక్షణ సంకల్పనలు కొట్టివేయబడవలెను. ఇది ఆదికాండము నుండి ప్రకటన వరకు ఏర్పడినది.

ఆరవబూర ముగింపయిన పిదప ఏడవబూరకు ముందు కొంత సంగతులు జరిగెను. ఈ సంగతులన్నియు చూచుచున్న యోహాను విచారముగా నుండెను.

  • 1) ముసలివాడని విచారము
  • 2) ఖైదీలో ఉన్నాననే విచారము
  • 3) ఇంకా సువార్త చేయవలెనన్న విచారము
తన హృదయములో ఇన్ని విచారములుండగా ప్రభువు బాధకరమైన సంగతులను చూపించుచున్నారు. ముద్రల బాధలు, బూరలు బాధలు చూపించెను, ఇంకా విచారము చూపించుట ఎందుకనిన పరలోకములో జరుగుచున్న మహిమ సంగతులను చూపించుచుండెను.
  • 1) బాధ నివృత్తికిని
  • 2) సంతోషము కొరకును చూపించును
అన్ని పుస్తకములలో ప్రకటన చివరిది అసలైనది అని చెప్పడానికి ప్రభువు యోహాను దగ్గరకు వచ్చినారు. 7ముద్రల కాల శ్రమలను, 7 బూరల కాలశ్రమలను విశ్వాసులకును, 7 పాత్రల కాలములో జరుగు హింసలన్నియు అంతిక్రీస్తునకును, అబద్ధ ప్రవక్తకును , దయ్యములకును నియమింపబడియున్నవి. గాని, ఇంకా కఠినమైన మనుష్యులుందురు గనుక వారును అనుభవించవలెను. వారు మారుమనస్సు పొందుటకు ఇదియును గడువుకాలమే.

ఆరవ బూర కాలశ్రమ ముగిసిన వెంటనే ఏడవబూర కాలశ్రమ చూపించవలసినదే గాని అది చూపక యోహాను గారి ఓపిక తగ్గినందువలన ఆయనను బలపరచుటకు ఈ మహిమగల విషయములు చూపించెను. (10:1,2)

  • 1) బలిష్టుడైన దేవదూత పరలోకము నుండి దిగివచ్చెను.
  • 2) ఆయన మేఘము ధరించుకొని యుండెను
  • 3) శిరస్సుమీద ఇంద్రధనుస్సు ఉండెను. అందరూ బట్టలు ధరించుకొందురు కానీ మేఘమునెవరు ధరించుకొనగలరు. గానీ ఆయన మేఘమును ధరించుకొనెను.
  • 4) ముఖము సూర్యునివలె ప్రకాశించుచుండెను.
  • 5) పాదములు అగ్ని స్తంభములవలె ఉండెను.
  • 6) కుడిపాదము సముద్రముపైనను
  • 7) ఎడమ పాదము భూమిపైనను మోసియుండెను. 8) ఆయనచేతిలో విప్పబడియున్న ఒక చిన్న పుస్తకము ఉండెను.
ఈ దూత ఎవరు ఈ దూత మిఖాయేలు కాదు గాబ్రియేలుకాదు పై గుర్తులన్ని రాజఠీవిని చూపుచున్నవి పిశాచి దాని అనుచరులు భయపడుటకు దేవలోక రాజఠీవి మహిమలోక రాజటీవి. రాజాధి రాజటీవితో వచ్చిన ఈయన యేసు ప్రభువే కుడిపాదము సముద్రము మీదను, ఎడమపాదము భూమిమీద నిలిపి సిం హమువలె గర్జనతో మాట్లాడును. ఆర్భటించగా ఏడు ఉరుములు ఉరిమెను. ధనస్సు, అగ్నిగుండము, సూర్యబింబము, ధ్వని లోకమంత వినబడుట ఆ ధ్వనికి ఏడుధ్వనులు ఈ లక్షణములన్నియు చూచిన ఈయన యేసుప్రభువు అని తెలియబడుచున్నది. పెండ్లికుమార్తె కొరకు రేపటి దినమందు పెండ్లికుమారుడైన యేసుప్రభువు వచ్చునపుడు ఆయన మేఘము ధరించుకొని వచ్చును.

మేఘము ధరించుకొనుట:- అనగా మహిమను ధరించుకొని వచ్చును. అ. కా. 9లో నున్నట్లు అరోహణమగునపుడు కమ్మిన మేఘమునే ఇప్పుడు ధరించుకొని వచ్చును. 1థెస్స 4: 17 లో ఉన్నట్లు పెండ్లికుమార్తె సంఘమును ప్రభువు యెదుర్కొని తీసుకొని వెళ్ళినారు మహిమ మేఘమునే ధరించు కొనివచ్చెను.

శిరస్సుమీద ఇంద్రధనస్సు ఉండెను:- అనగా ఆయన కృపా సువార్తకు గుర్తు నోవాహు కాలమందు లోకమంతటిని జలప్రళయము వలన ఇంకను నాశనము చేయనని గుర్తుగా ఇంద్రధనస్సును చూపించి దేవుడు వాగ్ధానము చేసెను. (ఆది 9: 10-17) పాతనిబంధన యూదులకు సువార్త క్రొత్త నీబంధన క్రైస్తవులకు, అన్యులకు సువార్త అయితే ధనస్సు లోకమతటికి, అందరికి సువార్త, అలాగే లోకమంతటిలోనున్న అందరికి ఆకాల, ఈకాల ప్రజలకు సువార్త ధనస్సే అలాగే లోకమతటిలోనున మారుమనస్సు పొందిన వారిని రక్షించునది నా సువార్తయే అని చెప్పుటకు ప్రభువు ధనస్సును ధరించుకొని వచ్చెను.

ముఖము సూర్యుని వలె ప్రకాశించెను:- మత్తయి 17:2లో నున్నట్లు రూపాంతర కొండమీద ప్రభుని ముఖము సూర్యుని వలె ప్రకాశించెను సూర్యుడందుకు నీతిసూర్యుడైన ప్రభువునకు గుర్తుగా నున్నాడు? చంద్రుడు ఎందుకు లేడు? చంద్రుడు సూర్యునివల్ల వెలుగు పొందేవాడు అలాగే సంఘము కూడా నీతి సూర్యుడైన యేసుప్రభువు యొద్దనుండి వెలుగు పొందుచున్నది గనుక ఆయన సూర్యుని కాంతివలె అగపడు నీతిసూర్యుడు.

పాదములు అగ్ని స్తంభమువలె ఉండెను:- భూమిమీద ధూళిమీద నడిచేవారికి అవన్నియు అంటుకొనును గదా యేసుప్రభువు పాపుల ఇండ్లను, రోడ్లను రకరకాల పాపము ఉన్నచోటికి పోయెను గాని ఏమియు అంటుకొనలేదు. ఉదా:- ఫ్లాష్ లైట్ వేసినా ఆ కాంతికి చెత్త అంటు కొనలేదు. అలాగే సూర్యకిరణములు ఎట్టి స్థలములో పడినను మలినము వాటికి అంటుకొనదు గానీ కిరణము వేడివలన ఆ స్థలమును శుద్ధిచేయును, దేవునిలో దేవుడు, మనిషిలో మనిషి. దూతలలో దూత అని ఉంటే ప్రభువు అని ఎందుకు చెప్పవలెను అని అందురు. ఈ అన్ని లక్షణములు ఉన్న ఆయన దర్శ్నములో కనబడితే ఎందుకు భయపడవలెను.

కుడి పాదము సముద్రము మీదను ఎడమ పాదము భూమిమీదను మోపెను:- మత్త :18లో నున్నట్లు పరలోకమందును, భూలోకమందును సముద్రము మీదను నాకు సర్వాధికారమున్నదని రుజువు పరచుటకు అలాగు ప్రభువు నిలబడినారు. యోహాను ప్రజలకు కలుగుచున్న శ్రమను చూచి దిగులు ప్రభువు నిలబడినారు, యోహాను ప్రజలకు కలుగుచున్న శ్రమను చూచి దిగులు పడుచుండగా ప్రభువే యోహానుతో ఇవి వారు నాతట్టు తిరుగుటకు గడువులు గనుక మారుమనస్సు పొందితే ప్రతివారికి రక్షించుటకు నాకు సర్వాధికారమున్నదని తెలియజేయుటకు ఈలాగు కనబడుచున్నాడు.

సిం హము గర్జించినట్లు గొప్పశబ్ధముతో ఆర్భటించెను:- మత్త 5:1,2 లో ఉన్నట్లు ఆయన నోరుతెరచి అనగా గొప్ప సమూహమున్నది. గనుక బిగ్గరగా చెప్పెనని తెలియచేయుటకు గర్జించు సిం హము అని ఇక్కడున్నది.

  • 1) ఆయనకు యూదాగోత్ర సిం హమని పేరు.
  • 2) సాతానుడు కూడా గర్జించు సిం హమని పేరు.
  • 3) నాలుగు జీవులలో ఒకజీవి సిం హము వంటిదని గలదు.
  • 4) ఏడేండ్ల మహాశ్రమ కాలమునకు సిం హమని పేరు.
ఎలాగనగా ప్రార్ధన సమాజముతో ఒక సిం హమని కలదు. ఈ సిం హమే సైతాననే సిం హమును ఓడగొట్టుటకు ప్రార్ధించున్నవి. యూదా గోత్రసిం హము సైతానను సిం హమును ఏడు సం|| శ్రమలలోనికి పరుగెత్తే సాతానును శ్రమలను ఓడగొట్టుటకు ఈలాగు సిం హము వలె కనబడును.

ఆయన ఆర్భటించినపుడు ఏడు ఉరుములు వాటి శబ్ధము పలికెను:- వాటి వివరములు యోహాను వ్రాయబోవుచుండగా ప్రభువిట్లు పలికెను:- వాటి వివరములు యోహాను వ్రాయబోవుచుండగా ప్రభువిట్లు పలికెను. వాటిని వ్రాయవద్దు, ముద్ర వేయుము. ఎందుకు వ్రాయవద్దు? పరలోకములో జరుగుచున్న వీటికి ముద్రవేయుము. అనగా ప్రకటనలోని సంగతులకు ముద్రవేయవలెను. మిగతా 65 పుస్తకములోని సంగతులు చెప్పి ఈ ఆఖరి పుస్తకమైన ప్రకటనలోనిది చెప్పవలెను. లేని యెడల అర్ధము కాదు. అందుకే వ్రాయవద్దు. వ్రాస్తే చదువురు. ముద్ర విప్పవద్దు, విప్పితే ఎవరైనా చూస్తారు గనుక పరలోకములో జరుగుచున్న ఆ మహిమ గల విషయములు కొంత సమయము వరకు యోహాను అంతరంగములోనే ఉండవలెను. రహస్యముగా ఉండునది రహస్యముగానే ఉండవలెను. చెప్పవలసినవి చెప్పవలెనని దర్శనములు కనబడినా యుక్త సమయమమునందు వాటిని బయలు పరచవలెను. ( 10:5) ఇవి ఆఖరు విషయములు. ఆ దూత తనకుడిచేతిని ఏడవబూర రాలేదు గాని వచ్చిన పిదప కృపాకాలమునకు ఆఖరు ఇంక కృప ఉండదు ఆదాము మొదలు పెండ్లికుమార్తె వెళ్ళువరకు సంఘములోనికి చేరుటకు కృపాకాలము కలదు. ఇది సంఘ ఆరోహణముతో ఆఖరు అలాగే అక్కడనుండి 2) శ్రమలతో విడిపింపబడుటకు దేవునిచే ఏర్పరచబడిన కృపాకాలమున్నది. ఇదే ముద్రల కాలము, బూరల కాలము కాగా ఇ కృపాకాలము ఆఖర్గును. పెండ్లి ఎలాగయినా దాటిపోయినది. ఇప్పుడైనా మారుమనస్సు పొందండి అని అనేదీ ఈ కృపాకాలము 7 ముద్రలు. 7 బూరలు అయిన పిదప పాత్రల కాలము వచ్చును, ఈ కాలములో ఒకమేలు ఈ కృపాకాలమును గురించి చెప్పవలసినది గనుక శ్రమకాలము యొక్క కృపాకాలమునకు ఇది ఆఖరు టైం అని తెలిసికొనుటకు చెప్పవలెను ఇప్పటి వరకు కృప ఉన్నది ఇకమీదట ఉండదు అని ప్రజలకు చెప్పుటకు వారు మారుమనస్సు పొందుటకు ఇదే సమయమని ప్రభువే చెప్పవలెను. త్రియేక దేవుడు పెండ్లికుమార్తె కొరకు పని చేయుటకును, ఏడేండ్ల మహాశ్రమలలో మార్పుపొందిన వారిని రక్షించుటకు పూనుకొనెను గనుక త్రిత్వదేవుడైన ఆ ముగ్గురు వచ్చి ఆ సమయము చెప్పవలెను.

  • 1) దేవుడు తన దాసులను = తండ్రి
  • 2) దూతవచ్చెను = యేసుప్రభువు
  • 3) శ్రమలు వ్రాయించినవి = పరిశుద్ధాత్మ

ఈ అధ్యాయములో ఎప్పుడు తండ్రి, కుమారుడు బహిరంగముగానే కనబడుదురు గాని ఆత్మ కనబడదు, మన శరీరము యేసుప్రభువు శరీరము వలె కనబడును, మన క్రియలు తండ్రివల్ బహిరంగముగా కనబడవలెను. అయితే ఆత్మ కనబడదు. ఆత్మ చెప్పునది వినవలెనని ఉన్నది గాని చూడ వలెననిలేదు. ఆత్మ పని కనబడదు. గనుక వినిమాట్లాడు వారి మాట వినబడును గాని ఆత్మ కనబడదు. సమాప్తము అని ఉన్నది మర్మముల అన్నిటికి వెల్లడి ఇంకా తెలియబడును మర్మములకు ఈ కాలములో సమాప్తము కలదు. ఆత్మ పనిచేయుచున్నాడు. గనుక ఎప్పుడును చాటుగానే పనిచేయును. ఇది మర్మమే ఇది జరిగిన తరువాతనే హర్మగెద్దోను యుద్ధముగాని ప్రపంచ నాశనముకాదు. పెండ్లికుమార్తె ఎత్తబడక ముందు హర్మగెద్దోను యుద్ధము రాదు. సంఘములోనికి వచ్చుటకు సంఘము ఎత్తబడక మునుపు అందరికి గడువు ఉన్నది. ఏదేండ్ల మహాశ్రమలో అవిశ్వాసులకు తరుణమున్నది తరువాత తరువాత ముద్రలు బూరలు కాలమైన పిదప అంతిక్రీస్తుకును, అబద్ధ ప్రవక్తకును, వారి అనుచరులను ఏర్పరచిన పాత్రల కాలమున్నది ఈ కాలములో కృపాకాలమునకు అంతము.

ప్రార్ధన:- తండ్రీ భూలోకములోని విశ్వాసులు పరలోక పరిశుద్ధులు మహా పెండ్లి హడావిడిలో నున్నారు అట్లు మేమును ఉండగలందులకు కృప దయచేయుము. పరలోక పరిశుద్ధులు భూలోక పరిశుద్ధులు ప్రభువు ఎప్పుడు వచ్చునో, ఇంకా ఎంతకాలము కనిపెట్టవలెనని అనుకొనుచున్నారు. ప్రభువా నీ పనులు త్వరగా చేయుచున్నావు. అది వారికి, వీరికి కూడా తెలుసు సతాను తనకు సమయము కొంచెమేనని త్వరగా పనిచేయుచున్నది. మేమును త్వరపడే కృప దయచేయుము. కొందరు అప్పుడేనా వచ్చేది అని వెనుకబడిపోవుచున్నారు. మరికొందరు రాకడను గూర్చిన చింతలేక యున్నారు పెండ్లికుమార్తె పెండ్లి అయిన పిమ్మట జరిగే శ్రమలను నేర్చుకొనుచున్నారు నేర్చుకొన్నవి మనస్సులో ఉంచుకొని సిద్ధపడేటట్లు కృపదయచేయుము మేము ఇప్పుడు నేర్చుకొనుట ఎందుకనగా నేటికాలములో వాటి సూచనలు కనబడుచున్నవి. కనుక వాటిలో పడకుండా ఉండేటందుకు పెండ్లికుమార్తె ఆరోహణము పెండ్లికుమారుని రాక సూచనలు కనబడుచున్నవి. ఈ సూచనలను బట్టి మేము సిద్ధపడేటట్లు కృపదయచేయుము ఆమెన్.

ఆరవబూర అయిపోయినది. ఏడవబూర రానైయున్నది. గనుక వీని మధ్య ఉపాఖ్యానము ఉన్నది. బలిష్టుడైన ఒక దూత అని ఈ అధ్యాయము మొదటలో వివరించుకున్నాము. ఈ కథంతయు యోహాను వ్రాయపూను కొనగా ప్రభువే వద్దనెను. ఎందుకంటే ఆరవబూర ఏడవబూరల మధ్య బలిష్టుడైన దూతవచ్చెను గనుక ముందు ప్రభువు వ్రాయవద్దు అనెను ముందుకు కఠినమైన శ్రమలు రానైయున్నవి అందుకు ముందు పరలోక మహిమ సంగతులు వ్రాయవలెను కనుక ప్రభువు ఆపుచేయవలెను. దూత చేతిలో విప్పబడియున్న ఒక చిన్న పుస్తకమున్నది. ఆ పుస్తకమును తీసి తినుమనెను ఇస్తానని లేదుగాని నీవు తీసుకొనుమని ఉనది.

  • 1) తీసుకొనుము
  • 2) తినుము
  • 3) నోటికి తీపి
  • 4) కడుపునకు చేదు.

తీసికొనుమనునది ఇప్పుడు చెప్పెను. తినుము=దీని భావము బాగుగా చదువుము బాగుగా గ్రహించుము. బాగుగా జ్ఞాపకముంచుకొనుము ఈలాగు చేసిన నోటికి తీపి కడుపునకు చేదు. దీని భావము రాబోయే శ్రమలను గూర్చి వ్రాయబడియున్నది. ఇప్పుడు వ్రాయవద్దు, ఇప్పుడు చెప్పవద్దు. ముద్రవేయుము తరువాత నీవు తీసుకొని తినుము అని చెప్పెను. ఆరు బూరలు చూపించి ఇక్కడ ఆగిపొమ్మన్నారు. ఏడవబూర చూడక ఆగిపోయినాడు. ఆగమన్నారు గనుక ఆగిపోయినాడు. వీని మధ్య మరియొక దృశ్యము వచ్చినది. తరువాత చేదువచ్చును గనుక ఆ ఏడవబూరలో ఏమున్నదో అని యోహాను దీర్ఘముగా ఆలోచించుచున్నాడు. దూత ఈ కథ చూపించుచున్నాడు రానైయున్న శ్రమ లేమో అందులో ఏమున్నదో అని ఆశించుటయే తీపి. ఏడవబూర నెరవేర్పు ఎప్పుడు ఎప్పుడు అని యోహాను హృదయములో నున్నది. ఆ సంగతి విన్న తరువాత తన కడుపులోచేదే. తెలిసికొనక ముందు నెరవేర్పుకు నిరీక్షించిన ఆశక్తి తీపి కాని ఆ నెరవేర్పు జరిగినప్పుడు కడుపులో ఎలాగుచేదో యోహాను మనస్సునకు చేదే. యోహాను ఎందుకు ఆగిపోయినాడు అని అంటె తాను ఆ శ్రమలను చూచి సహించలేడు గనుక ఒకేసారి చెప్పకుండగా మధ్య కొంత శ్రమలను చూచి సహించలేడు గనుక ఒకేసారి చెప్పకుండగా మధ్య కొంత వ్యవధి కాలమును యేర్పరచెను. కాబట్టి యోహానుకు మనస్సున నెమ్మది కలిగెను. పిల్లలు ట్రైనింగ్ కువెళ్ళి 2 సంవత్సరములు నేర్చుకొన్నప్పుడు ఆ కాలము తీపిగానుండును గాని పనిచేసినపుడు పిల్లలవల్ల, ఇనస్పెక్టర్ల వల్ల, అధికారులవల్ల చీవాట్లు వస్తేచేదు. ఇప్పుడు నోట్సు వ్రాయుట తీపేగాని రేపు నెరవేర్పు చూచినప్పుడు చేదుగా కనబడును. ఇవన్ని చినపుడు పరలోకములో పీటలమీద జరిగే పెండ్లి అగిపోవును గనుక ఈ శ్రమలు రాకముందే ప్రభువు పెండ్లికుమార్తెను తీసికొని వెళ్ళెను.

తిసికొనుము:- మనకు కావలసిన వాటికొరకు ప్రార్ధింపగా అవి నెరవేరలేదు.

ఉదా|| ఒక దొరగారు తీసి బిళ్ళను చేతిలో తీసికొని పిల్లలకు చూపి తీసికొనండి అంటే ఎవర్యినా తీసికొంటారా? చాలామంది సందేహిస్తారు. చొరవచేసికొని తీసికొని తినేవారు కూడా ఉంటారు. ఒకపిల్ల వచ్చి దొరగారి చేతిలోని తీపి బిళ్ళను తీసికున్నట్లు విశ్వాసులు ప్రభువు చేతిలోనిది తీసికొనవలెను. అట్టివారే పెండ్లికుమార్తె వరుసలోనికి రాగలరు. అడుగుట కాద్, నమ్ముటకాదు. చనువుగా తీసికొనుట పెండ్లికుమార్తె వరుస. ప్రభువు చనువు కలిగినవారు చేతిలో ఉంచుకొని గట్టిగా బిగించుకొంటారు బిగించిన చనువుగా తీసికొనవలెను. గోజులాడిన స్త్రీవలె గోజులాడవలెను ఎందుకంటే నీవు అడిగి నావు గాని తీసికోలేదని ప్రభువు అనునేమో. గనుక తీసికొనవలెను. న్వినరయ్య వినరయ్య అనుపాటలో "అనుకొన్న పిదప" విశ్వాసమును చేయిచాపి తీసికొనుము. ఇది అడుగుట కాదుగాని తీసికొనుటయే అగును.

బైబిలులో రెండు కాలములున్నవి. బైబిలు విద్యార్ధులు వాటిని చదివి తబ్బిబ్బులు పడుచున్నారు రెండూ ఒకటే అని కొమద్రు వేర్వేరు అని కొందరు అనుచున్నారు.

పాతనిబంధన గ్రంధములో దానియేలు లాలములోనున్న రాజైన నెబుకద్నెజరునుండి మలాకీ వరకు, ప్రభువు వరకు సంఘము, రాకడ, యేడు సంవత్స్రముల శ్రమ హర్మెగెద్దోను యుద్ధము వరకు ఒక కాలము.

అపొస్తలుల కార్యములనుండి లోకాంతము వరకు రెండవ కాలము, నెబుకద్నెజరు నుండి హర్మగెద్దోను యుద్ధము వరకు ఉన్నకాలము అన్యుల కాలమందురు. రెండవ కాలము కూడ అన్యులకాలమే నెబుకద్నెజరు కాలము మొదలు హర్మగెద్దోను యుద్ధకాలము వరకు అన్యులకాలము సంపూర్తి యగును. అప్పటివరకు పరిశుద్ధ పట్టణము త్రొక్కబడును. అన్యులకాలము సంపూర్తియగు వరకు యెరూషలేము త్రొక్కబడును. (లూకా 21:24) నెబుకద్నెజరు ఏర్పాటు జనాంగమైన యిశ్రాయేలీయులను ఏలుటకు ఏర్పాట్యిన మొదటి అన్యులరాజు 1917 సంవత్సరము వరకు అన్యుల కాలము జరిగియున్నది. మనకాలము అన్యులకాలము కాదని కొందరచున్నారు. యూదులు కానివారందరు అన్యులే. అన్యుల చేతిక్రింద ఈ యూదులు ఉండుట బాధకరము. నెబుకద్నెజరు మొదలు రోమా రాజ్యము వరకు అన్యులైన వారు యెరూషలేమునేలిరి ఆ పిదప టర్కీవారు యూదారాయమును స్వాధీనము చేసికొనిరి. 1917వ సం||ములో ఇంగ్లీషువారు ఆదేశమును స్వాధీనపరచుకొనిరి. వారును అన్యులే రాకడయైన పిమ్మట హర్మగెద్దోను యుద్దము వరకు అన్యులేలుదురు. అప్పటివరకు యెరూషలేము త్రొక్కబడును. పిమ్మట వెయ్యేండ్ల ప్రభువు పరిపాలన కాలములో రెండు ప్రధాన పట్టణములుండును.

  • 1) పరలోక యెరూషలేము
  • 2) భూలోకయెరూషలేము
ప్రభువువచ్చి రాజ్యము చేయువరకు యెరూషలేము త్రొక్కబడును. ఎందుచేతననగా ఇశ్రాయేలీయులు
  • 1) విగ్రహారాధన పాపముచేసిరి. 2) దేవునిని ఎదిరించిరి.
అందువలన ఇంతకాలము వారికి శిక్ష.
  • 1) భక్తుల నెదిరించుట
  • 2) దేవునిని ఎదిరించుట
  • 3) విగ్రహములకు పూజ
  • 4) ప్రభువును సిలువవేయుట ఇవి పాపములు,
వెయ్యేండ్ల పరిపాలనా కాలములో యేసుప్రభువు బలవంతముగా అన్యుల పరిపాలన ఆపుచేసెను. నేను యూదులను గనుక అన్యులచేతి క్రిందనున్న యూదులను నాచేతి క్రింద తీసికొనవలెను, అన్యుల చేతి క్రింద యూదులు ప్రభువు చేతి క్రింద అన్యులు, ప్రభువు యూదుడు గనుక రాజ్యము యూదులది యూదులది యూదులు క్రైస్తవులయితే విశ్వాసులే కాని అన్యులుకారు. భూమి పుట్టినది మొదలుకొని అపొస్తలుల కార్యముల గ్రంధము మధ్యవరకు అన్యులున్నారు. యూదులు అప్పటివరకు దేవుడు మా దేవుడు. గ్రంధము మా గ్రంధము అని అనుకొన్నారు. అపోస్తలులకార్యముల గ్రంధము మధ్య వచ్చునప్పటికి యూదులు ఉన్నారు. అన్యులున్నరు. అన్యుల కాలము పోయినది , కాని అన్యుల పరిపాలన పోలేదు. యూదులు+అన్యులు = విశ్వాసులు.

యేసుక్రీస్తు కాలములో యూదుడనియు, హ్ల్లేనీయుడనియు లేదు అని పౌలు పలికినాడు యూదులను చూచి మీరు ఏలిక జనమే నిబంధన మీదే గాని ఇప్పుడు మాదికాదనెను అపొస్తలుల కార్యముల కాలములోని విశ్వాసులదే పరిపాలన కాని ఇప్పుడు కాదు వెయ్యియేండ్ల పరిపాలన కాలమప్పుడు చేయవచ్చెననెను. మతస్మబంధముగా అన్యులకాలము వేరు. పరిపాలన సంబంధముగా అన్యుల కాలమువేరు. యెరూషలేము 1917 డ్శంబరు 12 వరకే అన్యులచేత త్రొక్కబడెను. అప్పటినుండి టర్కీవారి యొద్దనుండి ఇంగ్లీషువారు తీసుకొని యూదులకిచ్చిరి గాని ప్రక్క ఇంగిస్షువారున్నారు గనుక అన్యులదే పరిపాలన ఇప్పుడు సంఘరాజ్య పరిపాలన వెయ్యేండ్లలో విశ్వాసులకు కలుగును. మొదట ఆయన రాజ్యమును, నీతిని వెదకుడి అప్పుడవన్ని మీకనుగ్రహింపబడును. (మత్తయి 6:33) ఇప్పుడు యెరూషలేము పాత యెరూషలేము కాదుగాని రాబోయే యెరూషలేమునకు ముంగుర్తయి యున్నవి. ప్రపంచములో అన్ని రకములెన జనులున్నారు. ఆ పట్టణము మహావైభముగా నున్నది. ఈ ఆధ్క్యత యూదులకు రాదుగాని విశ్వాసులకు వచ్చును.

10:11.

  • (1) ప్రజలు
  • (2) జనములు
  • (3) ఆయాభాషలు మాట్లాడువారు
  • (4) రాజులను గూర్చి
అంటే ఎవరు? ప్రజలందరు ప్రజలా మనుష్యులే కాని చెట్లు ఎక్కి పండ్లు తిని నీళ్ళు త్రాగు కోతులవలె నుందురు నీలగిరి అవతల కురుంబరు అను తెగవారున్నారు. వీరు వస్త్రములు ధరించుకొనని వారు. డానిష్ లూథరను వారు వచ్చి వాయిద్యములు వాయించగా విని భయపడి పారిపోయిరి. అట్లు చేయగా మరల మరల పాడి వినిపించిరి. వినుటకు వారు రాగా కొన్ని పండ్లు వారి యెదుట వేసిరి వారు తీసికొని తినగా రుచిగా కనబడినవి కొన్ని వస్తువులను చూపి వాటిపేర్లు కనుగొనగా వారి భాష ఈ దొరలు అర్ధము చేసికొని వ్రాసికొనిరికొందరు పనివారీ పాదరీలను తయారు చేసి వారి యొద్దకు పంపిరి. బట్టలు లేనివారికి బట్టలిచ్చి ధరించుకొనుటకునేర్పిరి. అలాగు బట్టలివ్వగా కొందరు పారవేసిరి. బట్టలు కట్టుకొనుటకు వారికి అలవరచుటకు చాలాకాలము అయినది. ఈలాగు రాజ్య ఏర్పాట్ళు గలవారు జనములు, భాషలు రాజులనగా సిం హాసనము మీద కూర్చొనువారు వీరందరికి యోహాను చెప్పవలెను. యోహాను ముసలివాడై మరణమయ్యెను. ఈయనకు ప్రకటన దొరికెను. ఇంత ముసలివాడను నేను మరలా ఎట్లురాగలను అని అనుకొన్నాడు ఇది జరుగునా, గాని ప్రకటన వ్రాసినాడు. ఎఫెస్సీ సంఘస్తులు దాచియుంచిరి. యోహానుగారు వ్రాసినది సంఘములవారు వ్రాసుకొన్నారు. పిమ్మట బైబిలు సొసైటీవారు వచ్చి అచ్చువేసి లోకమంతట ప్రచురపరచిరి. ఇదే యోహాను చెప్పిన నెరవేర్పు. ఇదే రెండవసారి ఆయన తిరిగి రావడము ప్రజలు, జనములు, రాజులు, ఆయా భాషలు మాట్లాడువారు ప్రకటనను చదివిరి. ఇదే నెరవేర్పు. అలాగే శ్రమకాలములో యోహానుగారు వచ్చిరి.

లూథరుగారి కలములో ప్రకటన గ్రంధము వివరణ అనేకులు వ్రాసిరి. 2000 సంవత్సరములనుండి ప్రకటన వివరము వ్రాస్తూనే వచ్చిరి. ప్రకటన చెప్పితే మనస్సు చంచలమగును. తెగుళ్ళువచ్చునని కొందరన్నారు. ఇది నిజమే తీసికొని తినుము తియ్యగానుండును. అనగా కొందరికి అర్ధము కాలేదు కొందరికి ప్రార్ధించినా అర్ధము కాలేదు అదే విచారముతో కొందరు పిచ్చివారైరి. ప్రభువు తెలిపే వరకు మనము కనిపెట్టవలెను. ప్రభువు తెలిపినదే వ్రాయవలెను. మనంతట మనము వ్రాస్తే శిక్షగాని ప్రభువే స్వయముగా చెప్పితే శ్కేమున్నది. ఆట్మానమ్మగారు ప్రభువు చెప్పగా ఒక పుస్తకము వ్రాసెను. ప్రభువు నేను చెప్పగా వ్రాయబడిన ఈ పుస్తకమును ఎవరు హేళన చేయుదురు. ఇప్పుడు అయ్యగారికి కూడా ప్రభువే స్వయముగా తెలియచేయగా వివరణ తెలియపరచిరి. ఆట్మానమ్మగారి పుస్తకములలోనికి కూడా ఈ వివరణలో వున్నది. ఆట్మానమ్మగారి యొక్క గ్రూపులో అయ్యగారు కూడా ఒక మెంబరే ఇంతకన్న ఎక్కువ యెవరికైనా ప్రభువు చెప్పిన అట్టివారు వ్రాయవచ్చు. ప్రభువు తెలియపరచినదానికి స్వయముగా ఎవరయినా ఏమైనా తెలిపిన అది తప్పు. కొన్ని మరచిపోవచ్చు ప్రభువు క్షమించును. ప్రభువు మరల వారికి తెలియ జేయునా? తెలియచేయరు గాని మరొకరికి తెలియజేయును.

Home