పరిచయము
మహాధికార దూత
N.B: అతని మహిమ
భూమి ప్రకాశించెను
మహాబాబేలు: కూలె
- ఎ. కూలె
- బి. దయ్యముల వాసము
- సి. అపవిత్రాత్మ ఉనికి
- డి. అపవిత్రపక్షి ఉనికి
- ఎ అందరు మద్యము త్రాగిరి
- బి. రాజులు వ్యభిచరించిరి
- సి. వర్తకులు సుఖులు
వేరె స్వరము:
దాని విడిచిరండి (రాకుండ)
- ఎ. దాని పాపమున పాలివారు
- బి. తెగుళ్ళు
- ఎ. దానిపాపము నంతె
- బి. దాని నేరాలు దేవుడు జ్ఞప్తి
- ఎ. అది యిచ్చినట్లివ్వండి
- బి. దాని క్రియల చొప్పున x 2 చేయండి
- సి. దానిపాత్రలో x 2 కల్ప డి
ఆది: ఎ. రాణిని
- బి. వితంతువుకాను
- సి. దఃఖము చూడను
కలిగించుడి
దానిగొప్ప + వేధన + దఃఖము
భోగ: ఒకరోజున దానికి తెగుళ్ళు |
|
కాలిపోవు
N.B: తీర్పు దేవుడు బలిష్టుడు
రాజులు:
|
|
వర్తకులు : ఎవడు కొనడు
- ఎ. బంగారు
- బి. వెండి
- సి. రత్నాలు
- డి. ముత్యాలు
- ఇ. స|| నారబట్టలు
- యఫ్. ఉదా రంగుబట్టలు
- జి. పట్టుబట్టలు
- ఎచ్. రత్న వర్ణ వ స్త్రములు
| వస్తు |
|
|
|
N.B: నీయిష్ట ఫలములు విడిచె
బచ్యములు దొరకవు కనబడవు
ఈ వర్తకులు :
- ఎ. మహాపట్నమో
- బి. ఇంత ఐశ్వర్య మొక్కగడియలో పోయె
N.B : భీతితో దూరమున నిల్చిరి
నావికుడు
సబురు వేయువారు
ఓడవారు
సముద్రపు పనివారు
ఈ పట్న సమమేది
ఓడవారు ధనికులైరి
ఒక్కగడియలో పోయెను
|
|
దేవదూత (తిరుగలి - సముద్రములోవేసె)
- 1. ఎ. ఈలాగు బాబేలు పడద్రోయబడి
- బి. నీ వర్తకులు ప్రభువులైరి
- సి. జనులు మోసపోయిరి
- డి. పాఠకుల శబ్ధము వినబడదు
- సి. శిల్పి కనబడడు
- యఫ్. తిరుగల ధ్వని వినబడదు
- జి. దీపముండదు
- ఎచ్. నూతన దంపతుల స్వరము వినబడదు
|
|
ప్రభువు జన్మ కాలములో మంద కాపరుల చుట్టు దేవుని మహిమ ప్రకాశించెను. అట్టి సమయములో యేసు జన్మవార్త తెలియజేసిన దూత మహిమతో వచ్చెను. గనుక మంద కాపరులచుట్టు మహిమ ప్రకాశించెను.
ఉదా:- అగ్గిపుల్ల ఉన్నది పెట్టెలో ఉన్నంత మాత్రమున దాని ప్రకాశత కనబడదు. అది గీచిన యెడల వెలుగుతో ప్రకాశించును. ఆరీతిగానే మహా అధికరము గల ఒక దూత భూమిపైకి రగా వారిచుట్టు మహిమ ప్రకాశించెను. ఇట్టి దూతలైనవారు యెవరి యొద్దకు వచ్చెదరో వారిని భూతాలు యేమియుచేయనేరవు.
మహా బబులోను కూలిపోయెనని యున్నది. బబులోను అనగా దయ్యములకు నివాసస్థలము, జనులు అంతిక్రీస్తును వెంబడించిన స్థలము. అనేక విధములైన దయ్యములున్నవి. అపవిత్రాత్మలకు ఉనికి పట్టిన అనేక అపవిత్ర కార్యములు జరిగించిన స్థలములు అపవిత్రమైన అసహ్యమైన కేవలము నిషేధింపబడిన పక్షులలోను మనుష్యులలోను అట్టివారుందురు భూజనులలోని అనేకులు మహోద్రేకముతో కూడిన దాని వ్యభిచార మద్యమును త్రాగి పడిపోయిరి. తప్పుడు బోధలు విన్నందువల్ల యెహ్యమైన కార్యములు జరిగించి మత్తిల్లినవారు ఉన్నారు. తప్పుడు బోధలు వినరాదు క్రీస్తుపై అభిమానముండవలెను తప్పుడు బోధలకు మన హృదయములలో స్థానమివ్వకూడదు.
భూలోకమందలి వర్తకులు దాని సుఖ భోగముల యందు ధనవంతులైరి. నేటి దినాలలో భుక్తికొరకు భక్తిని అవలంభిచినవారు ఉన్నరు. భుక్తివల్ల భక్తిరాదు భక్తిలేని యెడల సుఖభోగములకు అలవాటు పడుదురు తమ శరీరమును వారు యెక్కువగా ప్రమించు కొందురు.
ప్రార్ధన:= తండ్రీ! ఏది అపవిత్రమో ఏది పిశాచి సమధమో ఏది యెహ్యమినదో ఏది అంతి క్రీస్తు సంబంధమైనదో దాని జోలికిపోకుండా ఉండే కృప దయచేయుము. ప్రభువా పరలోకమునుడి నీమహిమ వచ్చి భూమిపై ప్రకాశించెచినా మారుమనస్సు పొందనివారు ఉన్నారు. ఈ మహిమ సంగతులను బట్టి మారుమనస్సుపొంది నీకు కృతజ్ఞతనే కానుగగా ఆర్పించి నీ మేలు లందే వుండి నిన్ను మహిమ పరచే కృపదయచేయుము. మేము జనులలో యేమి చెడుగును పూజలను చూస్తు ఉన్నామో అవి కొన్నాళ్ళకు అంతరించి పోవును. నీకు స్తోత్రము మాకు ఆనందము యే చెడుగు వినబడుచు ఉన్నదో యే అపవిత్ర కార్యము మాకంటికి కనబడుచున్నదో అది కొన్నాళ్ళకు నయమగును. అదిమాకు సంతోషము. ఆకాలపు వ్యతిరేక విషయములు చూడకూడనివి ఏవి కనబడుచున్నవో తలంపులకు ఏవి తట్టుచున్నదోమాలో ఏభీతియున్నదో యుద్ధములు, కలహములు, మతవాదములు, కుటుంబపోరాటములు ఉన్నవో అవి అన్నియు పూర్తిగా అంతరించును మాకు సంతోషము. నీకు స్తోత్రములు ప్రకటన గ్రంధములోని సంగతులను మాకును మాతరువాత ఇతరులకును అందించుము. భూతములను వెళ్ళగొట్టి కావలికాయునీ ధూతలను మాచుట్టు ఉంచుము. మనసాక్షిని, జ్ఞానమును వెలిగించుము. మా ప్రార్ధన కోరుకొనువారికి సహాయము చేయుము. మా పాఠములు త్వరగా ముగించుకొనే కృప దయచేయుమని వేడుకొనుచున్నాము ఆమెన్.
ప్రక. 18:4 నా ప్రజలారా మీరు దాని పాపములో పాలివారు కాకుండునట్లు దాని తెగుళ్ళలో యేదియు మీకు ప్రాప్తింపకుండునట్లు దానిని విడిచి రండి ఇది కేవలము ప్రవచనమేగాని నెరవేర్పులోనికిరాలేదు. రక్షణ వేరక ముందు మందచూపు. నా ప్రజలారా! అనుపిలుపు పరలోకము నుండి తండ్రి పిలిచిన పిలుపు. అందరిని నా ప్రజలారా అని పరలోకమందున్న తండ్రి పిలిచిన పిలుపు. అందరిని నా ప్రజలారా అని పరలోకమందున్న తండ్రి పిలిచెను.
ఆదాము నుండి అబ్రహాము వరకు మిశ్రమ జనము. అబ్రహాము నుండి ఎన్నిక జనము, వారిని ఇశ్రాయేలీయులని యందురు. వారినే నా ప్రజలారా అని దేవుడు పిలిచెను. ఆకాలమునందు యూదులైన వారిని నా ప్రజలని దేవుడు పిలిచెను. ఇప్పుడు నాశనమై పోవువారిని అజ్ఞానులైనవారి అవిశ్వాసులైనవారిని అందరిని నా ప్రజలారా అని పిలుచుచున్నాడు.
అవిశ్వాసులు + నాశనమగుదురు.
1. సొదోమవారు, జలప్రళయ కాలములోని ప్రజలు దేవుని మాటను అంగీకరించలేదు. ఒకవేళ నమ్మి అంగీకరించిన యెడల మహా ప్రభో అని అందురు. దేవుడు ఏదేను తోటలో పాతనిబంధలో సువార్త కాలములో పత్రికల కాలములో ప్రజలతో మాట్లాడినారు. అప్పుడు మాటలాడిన దేవుడు కుమారుని ద్వారా ఇప్పుడు స్వయముగా పిలుచుచూ ఉన్నారు.
అన్యులు = క్రైస్తవులు కలిసిన సంఘము అయినది. వీరు రేప్చర్ కాలము వరకు ఉందురు. మిగిలిపోయిన వారితో ప్రభువు మాట్లాడుచున్నారు. అవిశ్వాసులపై కనికరమొంది ప్రభువు నా ప్రజలారా మీరు దాని పాపములో పాలివారు కాకుండునట్లు దాని తెగుళ్ళలో ఏదియు మికు ప్రాప్తింపకుండునట్లు దానిని విడిచి రండి దానిపాపములో పాలివారిగా నున్నయెడల అట్టివారు అవిశ్వాసులే.
నాప్రజలారా అని ప్రభువు యెవరితోచెప్పినారు పాపములోను, తెగుళ్ళలోను ఉన్నవారితో ఈ మాటలు పలికెను.
ఉదా:- తుఫాను రానైయున్న సమయములో యెవరైన లోపలయున్న వారిని పిలిచిన అపాయము. అలాగే ఇక్కడకూడా పిలిచినట్లుగా కనబడుచున్నది. పాపము, తెగుళ్ళు ఈ రెండు కూడా అపాయములే. అబ్రహామును దేవుడు పిలిచెను పిలిచిన దేవుడు అబ్రహామును విశ్వాసులకు జనకుడుగా ఏర్పరచెను. వీరే ఏర్పాటు జనాంగము. అలాంటి పిలుపే ఈ అధ్యాయములో అవిశ్వాసులైన వారికి అందజేసెను.
ఉదా:- దారిలో నడుచుచూ ఉన్న ఒక అమ్మాయి జారిపడగా దగ్గర ఉన్న ఒకాయన అయ్యో కుమార్తె అని అనెను. నిజముగా ఆమె కుమార్తెకాదుగాని సామెతకనెను. అలాగే ఎన్నిక జనాంగమైనయూదులను పిలిచిన ఆపిలుపుతోనే ఎన్నికలో లేని అవిశ్వాసులైన జనులను కూడ నా ప్రజలారా అని పిలిచెను. ఆకేకతో ఎన్నిక జనులుగా రావలసినది గాని వారి హృదయ కాఠినత్వమును బట్టి రాలేక పోయిరి. ఇది సాధారణనైన పిలుపు కాదు. ఇది గొప్ప పిలుపు ఈ పిలుపు యేడవ పాత్రకాలము అయిపోయిన తరువాత హర్మగెద్దోను యుద్ధమునకు ముందు జరిగెను.
ప్రక 18:5 దానిపాపములు ఆకాశమును అంటుచున్నవి. దని నేరములను దేవుడు జ్ఞాపకము చేసికొనుచున్నాడు ఆదికాండము 19వ అధ్యాయములో సొదొమ వారి పాపములు ఆకాశమునకు అంటుకొనెను. మనపాపములన్నియు ఆకాశమునకు వెళ్ళి ఫలానివారు పాపము చేసినారు ఎప్పుడు తీర్పు తీర్చెదవని అన్నట్లుగా వెళ్ళును హెబెలు రక్తము నేలనుండి దేవుని యొద్ద మొర్రపెట్టినది ఆదికాండము 4: 10 ఆ రక్తము తీర్పు తీర్చుమని దేవుని సన్నిధానమున మొర్రపెట్టెను. ప్రతివారి పాపము సాక్ష్యార్ధముగా అకాశమునకు వెళ్ళును. మనము చేసిన పాపములు దేవుని దగ్గరకు వెళ్ళి శిక్షించుమని కోరెను.
ఉదా:- గుంటూరులో రహస్యగదిలో ఎవరైన ఇద్దరు ఏమైన రహస్యములు మాటలాడిన యెడల వారి మాటలు అమెరికా దేశములోని వారికి వినబడును. ఇదిచాలా ఆశ్చర్యము. ఇది ఒక క్రొత్త మర-మనుష్యులే దూర సమాచారములను విని రికార్డు చేయగలిగిన యెడల భూలోకములో రహస్యముగా మాటలాడు మాటలు దేవునికి వినబడవా? పరలోకమందు దేవుడు ఉన్నాడు. భూలోక మందూన్న మన దగ్గర దేవుని దూతలున్నారు. మనము మాట్లాడుకొనుచున్న ప్రతిమాట దేవదూత లైనవారు రికార్డుచేయుదురు గుంటూరులో ఒకరు నిలువబడి యుంటే వారి రూపమును అమెరికాలో ఫోటో తీయుదురు.
ఇరువది వందల యేండ్ల క్రిందకొండమీద ప్రభువు చేసిన ప్రసంగమును ఇప్పుడు గాలిలో నుండి యంత్రముల ద్వారా ఆకర్షుంచుటకు పశోధనలు జరుగుచున్నవి. ఆనాడు యేసుప్రభువు ఏమిచెప్పెనో ఆచెప్పినమాట చెప్పినట్ట్లు గానే రికార్డుచేయ ప్రయత్నములు జరుగుచున్నవి. బైబిలను బయటకు తీసిన భక్తుడైన మార్టిన్ లూథర్ గారు మాటలాడినమాటలు ఆస్వరముతోనే రికార్డు చేయుటకు ప్రయత్నించుచున్నరు.
క్రైస్తవులు సినిమాపటలములు తయారు చేయుచున్నారు. ప్రభువు మరియమ్మతో ఏమి పలికినారో ఆ ఒక్కమాటే అమ్మ నీతో నాకేమి. మరి యేమాటయైన కలుపకుండా ఆ ఒక్కమాటే కనబర్చుదురు. మనమైతే ప్రసంగములో కొని సంబంధమైన విషయములు కలిపి మాటలాడు కొందుము. సినిమా పటలములో ప్రభువు తల్లిని పెండ్లికుమారుని చూపించెదరు ఆరు రాతి బానలు కనబర్చుదురు. పెండ్లి పెద్దలు శిష్యులు మొదలగు వారిని చూపించెదరు. పాత్ర వహించువారికి వారు చెప్పవలసిన మాటలను కంటత చేయించెదరు. ప్రభువు, మరియమ్మ, శిష్యులు వంటి వారిని యేర్పరచీదరు ఇది ఇప్పుడు భూలోకమందు జరుగుచున్న చరిత్ర.
పాప ఫలితము
పాపములు ఆకాశమును అంటుట నేర్ములను జ్ఞాపకము తెచ్చుకొనుట అనగా అమలులోనికి తెచ్చుట అది ఇచ్చిన ప్రకారము దానికియ్యండి అనగా అది ఇచ్చిన శిక్ష అది ఇచ్చిన దానికి రెట్టింపు ఇయ్యండి అనగా అది ఏశిక్ష ఇచ్చినదో దానికి రెట్టింపు ఇచ్చుట.
ప్రక 18:6 అది కలిపిన పాత్రలో దానికొరకు రెండితలు కలిపిపెట్టండి. పాత్రలో కలుపుట విషము. పాపమును కూడా కలిపీయ్యుడి ఆవేశ్యకొన్ని సంవత్సరములు ప్రజలకు హానిచేసినది. తిరిగి మీరు దానికి రెట్టింపు హాని చేయండి. మీరు ఏకొలతతో కొలుతురో ఆకొలతతోనే మీకును కొలువబడును.
రాణిగా కూర్చుడుట
విధవరాలను కాను
దఃఖమును చూడనేచూడను
నన్ను యెవరు ఏమిచేయగలరు? నేను రాజభోగము అనుభవించుచున్నానని తనలోతాను అనుకొనెను. నేటిదినాలలో ఇలాంటి తలంపు కలిగిన వారు వేశ్య సంఘమునకు చేరువారై యున్నారు. వధువు సంఘము రాణివంటిది ఈ వేశ్యసంఘము దానికి వ్యతిరేకమైనది.
విధవరాలు:- వధువు సంఘమునకు వరుడైన క్రీస్తు అను బర్త యెలాగు ఏర్పర్చబడియున్నారో వేశ్య సంఘము కూడా తనకు కూడా ఉన్నట్లు చెప్పుకొనుచున్నది. ఇవి అన్నియు సదుపాయములే.
దఃఖమునుచూడను:- ఈలోకములో ఉన్నరాణి సుఖభోగములతో ఉండి వాసము చేయును. అలాగే వేశ్య సంఘము కూడాసుఖభోగములను అనుభవించగలదని అనుకొనును. గాని దానికి వ్యతిరేకముగా జరుగును దానికి మరణమును, దుఃఖమును, కరువును కలుగున. దానికి తీర్పు తీర్చు ప్రభువు బలిష్టుడు.
ఉదా:- నూరు శవములను తిన్న రాబందు ఒక్కగాలికి పడిపోయినట్లు అనేకులను బాధించిన ఈ వేశ్య బొత్తిగా అగ్నితో నాశనమగును.
ప్రక 18:9-10 భూరాజులు దానిబాధకు భయాక్ర్మాతులగుదురు
ఉదా:- ఇండ్లు కాలునప్పుడు దగ్గరగా నున్న ఇండ్లలోనివారు భయపడుచూ నీరుచల్లాలి అని అనుకొని వత్తురు. తీరదగ్గరకు సమీపించగానే భయపడుదురు ఆరీతిగానే ఈ యేడేండ్ల మహా శ్రమకాలములో నాశనము సమీపమగును.
- 1) వర్తకులు 2) రాజులు 3) ప్రజలు
ఈ మూడు తెగలవారు ఏడు సంవత్సరములలో ఉన్నారు. పైమూడు విషయములు స్థిరముగా నుండునని అనుకొనుచున్నారు గాని నిమిషములోనే నాశనమగును గనుక రొమ్ముకొట్టుకొనుచు ఏడ్చిరి. యేడుసంవత్సరములలో వారికి నాశనము వచ్చెను. మమ్మును ఎవరు ఏమియు చేయలేరు అనితలంచిన వారికి ఒక్కనిమిషములోనే నాశనము కలిగెను.
ఉదా:- కలరావస్తే ఊరిలోనివారు అందరు చనిపోవుదురు. గనుక సిద్ధపడకపోతే దిద్దుకొనక పోతే నాశనమనునది అందరికి రాకతప్పదు. కొందరు విశ్వాసులు ప్రభువు రాకడ ఇప్పుడేరాదు అని అందురు. అవిశ్వాసులు నాశనమునాశనము వచ్చునుగాని అది మనకాలములో రాదు అని అనుకొందురు. ప్రస్తుత కాలములో ఇలాంటి అవిశ్వాసులు అనేకులున్నారు.
ప్రక 18:11 వర్తకులు సరుకులు రావని యేడ్చిరి.
| ఇవి భూగర్భములోనివి | |
| ఇవి సముద్రములోనివి | |
| ఇవిమనిషిచేతిపనులులౌకికమురాజ భోగములనివీనిని అందురు | |
|
ఇవి అన్నియు దేవుడు చేసినవే వాటిని తీసుకొని తాముచేసినట్టు మనుష్యులు చేసిరి. దేవుడు చేసినవి, మనుష్యులు చేసినవి అన్నియు నాశనమగును.
ఎందుకు నాశనమగును? యూదులకు దేవుడు యెరుషలేములో దేవాలయము ఇచ్చెను. దేవుడే స్వయముగా క్రీస్తుగా వచ్చినప్పుడు వారు ఆయనను ఆరాధించలేదు గనుక వారికున్న దేవాలయము తొలగింపబడినది.
ప్రక 18:12 - 14,
- 1) దాల్చిన చెక్క
- 2) ఓమము
- 3 ధూపద్రవ్యము
- 4. అత్తరు
- 5. సాంబ్రాణి
- 6. ద్రాక్షరసము.
- 7. నూనె
- 8. మెత్తని పిండి
- 9. గోధుమలు
- 10. పశువులు, గొఱ్ఱెలు,
- 11. గుఱ్ఱములు రథములు,
- 12. దాసులను మనుష్యుల ప్రాణములు,
ఉదా:- ఒక సారి రాజమడ్రిలో ఇండ్లు కాలుచుండుగా అయ్యగారు అ ప్రదేశమునకు వెళ్ళిరి. అక్క్డ ఉన్న ఒక కుర్రవాడు అక్కడ కనబడిన ఒక మంగలిని చూచి తాతా నాతల గొరగవా అని అన్నాడు. అలాగే యేడు సంవత్సరముల శ్రమల కాలములో మనిషికి అవసరమైన సృష్టిలోనివి అన్నియు నాశనమగును.
ప్రాణాలు: పూర్వకాలమునందు మనుష్యులను వస్తువులను అమ్మినట్లుగా అమ్ముకొనేవారు. వర్తకులు మనుష్యులను అమ్మవారి యొద్ద వారిని కొని బానిసలుగా పెట్టుకొందురు. అయితే అప్పుడు కొన్నారుగాని హర్మగెద్దోను యుద్ధమునకు ముందు బానిసలను ప్రాణములను ఎవరు కొనరు
ఉదా:- కొయ్యలగూడెములోకి ఒక మనిషి పారిపోయి వచ్చెను. అది రాత్రి కాలము. అయ్యగారు ఉన్న బసవద్ద ఆశ్రయముకోరి ఆరాత్రికాల సమయములో పరుండెను ఉదయకాలమందు మూడు గంటలకు యింకను చీకటిగ ఉండగానే వెళ్ళిపోవుటకు సిద్ధపడెను అందుకు అయ్యగారు చీకటిలో ప్రయాణం చేస్తే పెద్ద పులులు ఉంటాయినీకు భయములేదా అని అడిగిరి అందుకు అతడు అయ్యా పరవలేద్లెండి ప్రాణాలు ఇక తిరుగవు లెండి. ఈ పాటికి అవి వాటి వాటి బసలోనికి వెళ్ళిపోవును అని అన్నాడు. ఇక్కడ ప్రాణాలు అనగా పెద్దపులులు అని అర్ధము ఈ పులులు ఉదయకాల సమయమునకు తమతమ గృహలోనికి వెళ్ళిపోవును అని అతని ఉద్దేశ్యము.
నీ ప్రాణమునకు ఇష్టమైన ఫలములు నిన్ను విడిచిపోయెను: నాశనము సమీపించెను గనుక అన్నియుయును నశించిపోయెను. ఏదేనుతోటలో మనుష్యునికి ఇష్టమైన ఫలములు ఉండెను. పాపముల వలన అవి మారిపోయెను. ఏడు సంవత్సరముల శ్రమకాలములో పూర్తిగా నాశనమగును. అటుపిమ్మట వేయి లోకమునైనను లోకములో ఉన్నవాటినైనను ప్రేమింపకుడి. ఈ వాక్యము పైపాటమునకు సరిపోయెను. క్షయమైన ఆహారము కొరకు కష్టపడక అక్షయమైన ఆహారము కొరకు కష్టపడుడని ప్రభువు చెప్పెను.
ప్రార్ధన:- తండ్రీ లోకమును లోకములో ఉన్నవాటిని ప్రేమించవద్దు అని అన్నావు మాకు లోకాశలు లేకుండాచేయుము. నీవు ఏదియిచ్చినా కృతజ్ఞతతో పుచ్చుకొనేకృప దయచేయుము. అవిశ్వాసులకు తెలియని రీతిగా నాశనము వచ్చును. ఈ సంగతులు విన్న మేము ఇప్పటినుండి లోక భోగములను తప్పించుకొని అక్షయ ఆహారము కొరకు కనిపెట్టే కృప దయచేయుము. లోకములో రాజులు, వర్తకులు, వైణికులు, కోరుకునే భోగములు కోరుకొనక తప్పించుకొనేటట్లు కృపదయచేము. త్వరగా వస్తున్న ప్రభువు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమెన్
ప్రక 18. 15-16 ధూమ రక్తవర్ణ వస్త్రము: ఒక కెతోలిక్ బిషప్గారు మొదట తెల్లబట్టలు వేసికొందురు పిమ్మట అది తీసివేసి యర్రనిబట్టలు వేసికొందురు ఆరాధనలో ఒక చరణము పాడగానే అదితీసివేసి ఇంకొకటి ధరించుకొందురు ఒకప్పుడు అంధోని అను ఒక బ్రాహ్మణ పాదిరిగారు అయ్యగారియొద్ద కూర్చున్నారు ఒకప్పుడు ఇండియా దేశములోని పాదుర్లను బిషప్ లను తాను కట్టించిన దేవాలయమునకు పిలిపించెను. ఆ దినమందు వాక్యము శరీరదారి ఆయెను అను వాక్యముపై అయ్యగారు ప్రసంగించిరి. పై విధముగా బిషప్ గారు ఒక వస్త్రము తరువాత ఒక వస్త్రము తీసివేయగా అయ్యగారి యొద్ద ఉన్న ఆ బ్రాహ్మణ పాదిరిగారు మా మతమువలె క్రైస్తవ మతములో కూడా చాదస్తము ఉన్నది అనెను. ప్రకటన వ్రాసిన యోహాను సి యం యస్, కెతోలిక్లను గూర్చి వ్రాయలేదు.
ఆ వేశ్య తాను యెర్పర్చుకొన్న సంఘములో ఒక పద్దతిపెట్టి దానిని మార్చి మరోపద్దతిపెట్టి తనకు తృప్తి కలుగువరకు రకరకములైన పద్దతులను ప్రవేశపెట్టి లోకానికి సంతోషమును కలిగించును. ఈమార్పులు ఏడవ పాత్ర అంతమగు వరకు ఉండును. ఈ వస్త్రము బిషప్గారు వేసికొను రకరకములైన వస్త్రములు వలె ఆవేశ్య ధరించుకొనును రేప్చర్ లో దైవభక్తులకు వస్త్రములు ఖనిజములు, ముత్యములు బహుకరింపబడును.
- 1. వస్త్రము __ ధరించుకొనుటకు
- 2. ఖనిజము __ వాడుకొనుటకు
- 3. ముత్యములు __ అలంకారమునకు
ఈ మూడు గలవారిని ధనికులని అందురు. లేనివారిని దరిద్రులని అందురు. వేశ్యకు సంబందించిన వారు కూడ ఇ ముడు కలిగిన వారై రేప్చర్ నకు ముందు ధనికులుగా నుందురు. ఆసమయములో పైమూడు తక్కువ ఉన్నవారు భక్తుల వరుసలో ఉందురు. రంగు బట్టల అలంకారములు వీరికి ఉండవు. అయితే వేశ్య అనుచర్లకు ఈ అలంకారము ఉండును. భలకు తగ్గింపు ఉండును. రేప్చర్ లో వధువు ఆరోహణమై యెత్తబడును. వేశ్య ఆరోహణమై దిగిపోవును.
ప్రక 18:17-19 సబురు-సముద్రపు ప్రయాణమునకు పేరు. సంఘమంతయు దేవుని రాజ్య జ్ఞాపకమునకై పూనుకొన్నవిగాన సొమ్ము కావలెను. అయితే వారు తమ లోకరాజ్య వ్యాపకము చేయగోరు చున్నారు. గాన లోక సంబంధమైన పనులకు డబ్బు, ఓడలు ఎన్నో ఉన్నవి. గత ప్రపంచ యుద్ధములో రోజునకు 23 కోట్ల రూపాయలు ఖర్చు అయినవి. గనుక నావికుడు. ధనికుడు, ధనికులు, లోకస్తులందరూ భక్తుల కంటే ధనికులే. మనము అందరము పవిత్ర ప్రవర్తనతో ప్రార్ధించి నట్లైతే లౌకికులు యుద్ధమునకు 23 కోట్లు యిస్తే సువార్త సేవకు 46 కోట్లు ఇవ్వవలసిన వారమై యున్నాము.
"ఆలించు దేవా - నామనవుల-ఆలించుదేవా"
అను పాటలో "పలుమార్లు నీవసగ-పరమభాగ్యంబులు" అనుచర్ణము పాడుకొనిన ప్రభువు మన కవసరమైన సువార్తకొరకైన సొమ్మును అనుగ్రయించును. ఒక దొరగారు స్కౌట్లాండు దేశమంతటిని నాకిచ్చివేయుము ప్రభువా అని ప్రార్దించెను. అప్రకారమే ఆ దేశములోని వారందరు ప్రభువును అంగీకరించిరి.
స్తుతియు మహిమయు అను కీర్తనలో "మాకై వాడుకొనెడి రూకల్ వ్యర్ధంబగును" మన అవసరతల కొరకు మనము ఖర్చుపెట్టు కొనుచున్నాము ప్రభువు కొరకు ఎక్కువ ఖర్చు చేసియుండగా అనేకులు ప్రభువును అంగీకరించగలరు.
ప్రక 18;20 పరలోకమా పరిశుద్ధులారా. అపోస్తులులారా, ప్రవక్తలరా దానిని గూర్చి ఆనందించుడి. మీకు కలిగిన తీర్పుకు ప్రతిగా దేవుడు ఆపట్ట్ణమునకు తీర్పుతీర్చి యున్నాడు.
- 1. పరిశుద్ధులు = ఉద్యోగస్థులు
- 2. అపోస్తలు = కొత్తనిబంధన
- 3. ప్రవక్తలు = పాతనిబంధన
ఈ మూడు రకములైన వారిని కలిగినదీ పరలోకము. ఆ వేశ్య పై మూడు రకములైన భక్తులకు తీర్పు తీర్చును. ఇప్పుడైతే తనకేతీర్పు వచ్చును.
బలిష్టుడైన ధూత తిరుగటి రాయి ఎత్తి సముద్రములో పడవేసెను ఆ రాయి ఎత్తుటకు అతడు చాలా బలము కలిగినవాడు. ఇతరులకు ఆటంకముగా ఉంటే మెడకు తిరుగటి రాయి కట్టి సముద్రములో పడవేయవలెను. సువార్తికుల పనికిగాని భక్తుల పనికిగాని లోకస్థులు ఆటంకముగా నుందురు. ఈ వేశ్య అలాగే చేసెను.
రాయి = బలమైన రాయివంటి గుణముగల వడగండ్లు కనబడకుండ సముద్రములో పడవేయుదురు. సైతాను అనేకులను పడగొట్టును రాజ్యమును పడగొట్టును సంఘములను పడగొట్టును ఇవి చివరి దినములలో జరుగును. గనుక ప్రస్తుతము దేవుడు లౌకికులపని చూచుచు ఊరుకొనుచున్నాడు. ఆ పిదప వాటికి నాశనము తటస్థించెను.
ప్రక 18:22,23,
- 1) సంగీతము అగును
- 2) గాయకులు అనగా పాటలు పాడేవారు ఆగిపోవుదురు.
- 3) మాయమంత్రములు.
- 4) వర్తకుల మాయమంత్రములు పాలలో నీరుకలిపి అమ్ముట ఇవన్నియునాశనమే. శిల్పులు ఆగిపోవుదురు.
ప్రక 18:24.
- 1. ప్రవక్తల యొక్కయు
- 2. పరిశుద్ధుల యొక్కయు
- 3) భూమిమీద వధింపబడిన వారి యొక్కయు రక్తము ఆ పట్టణములో కనబడెను.
ప్రార్ధన:- దయగల ప్రభువా మా మీదకు వచ్చే కష్టములన్నియు అంతరించి పోవునని ముందుగానే నీవువ్రాయినావు. పరిశుద్ధులరా అపోస్తులులారా సంతోషించుడి ప్రభువా నీ సంఘమును కాపాడు ఆయాఅయాస్థలములలో జరుగు యుద్ధము ఆపుచేయుటకు భక్తులు పూనుకొన్నారు. యుద్ధమును ఆపుచేయుము. త్వరగా వస్తున్న ప్రభువుద్వారా వేడుకొనుచున్నాము. ఆమెన్
Home