11వ అధ్యాయము - Living Gospel
Last Trumpet

పరిచయము

ఒకడు (నాతో) కొలకర్రిచ్చి
  • 1) లెమ్ము
  • 2)
    • ఎ. దేవుని గుడిని
    • బి. బలిపీఠము


కొలువుము
3) లెక్కించుము : పూజించువారిని
4) కొల్వవద్దు : ఆవరణను
  • ఎ. అన్యులది
  • బి. 42. పరిశుద్ద పట్నము త్రొక్కుదురు
    5) ఇద్దరు సాక్షులు :
  • ఎ. అధికారమిత్తును
  • బి. గోనె ధరింతురు
  • సి. 1260 దినాలు ప్రవచింతురు
  • డి.
    • ఎ.ఎ. రెండు ఒలీవ చెట్లగుదురు
    • బి బి. దీప స్తంభముల గుదురు
  • ఎ. హానికరు లగ్దురు
    • అగ్ని ( from them )
  • ఎఫ్. వారి అధికారము
    • ఎ. వాన నాపుట
    • బి. నీటి-రక్తము
    • సి. తెగుళ్ళు
    • జి. సాక్ష్యముగింపు తర్వాత
      • ఎ. పాతాళ కౄరమృగము
      • బి. వారి శవములు
      • ఎ ఎ. పట్నవీధిలో
వారి ఎ. సొదొమ = ఐగుప్తు
  • ప్రభువు
    • బి బి. ప్రజలు
    • వంశములు
    • భాషలు
    • జనము


పాతనియ్యరు
సి సి. ప్రజలు
  • 1) సంతోషించిరి
  • 2) ఉత్సహించిరి
  • 3) కట్నం
డిడి. సాక్షులు (3 1/2 దినములకు)
  • 1) దైవాత్మ ప్రవేశము
  • 2) నిల్తురు
  • N.B : ప్రజలు వెరతరు
2) స్వర్మ : పరలోకమునకు రండి
N.B: వెళ్ళిరి
N.B: శత్రువులు చూచిరి
  • ఎ. భూకంపము బి. 1/10 పట్నం కూలె
  • సి. 7000
మిగతావారు దేవుని మహిమ పర్చిరి (భీతితో)
    N.B :
  • ఎ) రెండవ శ్రమ గతించె
  • బి) మూడవ శ్రమవచ్చు
ఏడవ దూత
పరలోక శబ్ధములు
ఎ. ఈ లోకరాయము = ప్రభురాజ్య మాయె
క్రీస్తురాజ్యము (క్రీస్తు యుగాలు)
24 పెద్దలు (నమస్కరించిరి)
  • ఎ. వర్తమాన భూతకాల దేవ మహాబలం సేకరించి ఏలుదురు
  • బి. జన కోపముచే నీకు కోపము
  • సి. సమయము వచ్చె
    • ఎ ఎ. మృతుల తీర్పొంద
  • బి బి. ప్రతిఫలం
    • 1) ప్రవక్తలకు
    • 2) పరిశుద్ధులకు
    • 3) నీ నామ భీతులకు
  • సి సి. నశింపజేయుటకు
4) గొప్పవారేమి
5) కొద్దివారేమి
భూమిని నశింపజేయువారిని
    పరలోక చరిత్ర :
  • 1) దేవునిగుడి తెరువబడె
  • 2) దానిలోని నిబంధ మందసము
  • 3)
    • (ఎ) మెరుపులు
    • (బి) ధ్వనులు
    • (సి) ఉరుములు
    • (డి) భూకంపము
    • (ఇ) గొప్ప వడగండ్లు

ప్రార్ధన:- త్వరగా త్వరగా వస్తున్నానని త్వరత్వరగా చెప్పుచున్న ఓ ప్రభువా ఈ ప్రకటన గ్రంధమును త్వరగా మాకు వినిపించుము. యేసుప్రభువా నీవు త్వరగా వస్తున్నావని పాతనిబంధన, క్రొత్తనిబంధనల్లలో వ్రాయించి అచ్చువేయించుము. ఈ వేళనుండి శ్రమలు వచ్చినా ఆ శ్రమలు నీటి ప్రవాహములలు కొట్టుకొని పోవునట్లుగా నీకును, నీ సంఘమునకును జయమును అనుగ్రయించుము.

10 వ అధ్యాయమునందు దేవదూత చేతిలో ఒక పుస్తకమున్నది. ఆ పుస్తకమును తీసుకొని తినుమని అన్నమాటలు వినబడినవి. అది కడుపునకు చేదుగను, నోటికి తేనెవలె మధురముగను ఉండునని పలుకగా యోహాను వినెను. తినుట అనగా వాక్యమును చదివి ధ్యానించుట, తీయగా నుండుట అనగా వాక్యమునుబట్టి కలిగే మహా ఆనందము. చేదు అనగా చదివి ధ్యానించిన వాక్యములను ఆచరణలో పెట్టకుండుట 6, 7 బూరల మధ్యలో కథా ఉపాఖ్యానమున్నది. అందులో ముగ్గురు ఉన్నారు.

  • 1) దేవదూత
  • 2) పరలోకసాక్షి
  • 3) పరలోకమునుండి దిగివచ్చిన రెండవసాక్షి
వీరు పరలోకము నుండి భూమిమీదకు వచ్చి 6,7 బూరల కాలమధ్యమున అగుపడిరి. తర్వాత ఇరువురు వస్తారు.

దూత వచ్చిన ఈ చిన్న పుస్తకములో

  • 1) విద్య అనగా చదువుట,
  • 2) తీపి,
  • 3) చేదు.
7వ బూర శ్రమకాలములో ఎంత పలికినా ఎంత బోధించినా విని అవలంభించనివారు అనేకులుందురు. వారికి ఈ వాక్యము చదివినా చేదుగా నుండును. ఇద్దరు సాక్షుల చరిత్ర ప్రకటనలోనున్న చరిత్ర లన్నింటికంటే చాలా సుళువైన చరిత్ర భూలోక యెరూషలేములో దేవాలయమున్నట్టు పరలోక యెరూషలేములో కూడా దేవాలయమున్నది. భూలోక దేవాలయమునకు బలిపీఠము, పరిశుద్ధ స్థలము, ఆవరణము ఉన్నట్లు పరలోక దేవాలయమునకు కూడ బలిపీఠము, ఆవరణము ఉన్నట్లుగా యోహాను చూచెను. యోహాను కూడ పరలోకములో ఉన్నాడు. దేవాలయమును, బలిపీఠమును కొలతవేయమని ఒక కొలకర్ర యోహానుకివ్వబడెను. ఈ కొలకర్రతో కొలత వేయుమని పలుకుచున్న శబ్ధము వినబడెను. అనగా కనబడుచున్న దేవాలయమును కాదుగాని దేవాలయములో ఎందరు చేరిరో అది కొలువుమని చెప్పెను. దేవాలయములో ఎంత జనమో అంతే దేవాలయము. ఒక వేళ జనము ఇంకా ఎక్కువవస్తే దేవాలయము ఇంకా పెద్దదగును. జనమునుబట్టి కొలత వేయవలయునని యోహానుకు తెలియబడినది సంఘములో చేరిన వారిని లెక్కబెట్టుదురు గాని గ్రామములోనున్న వారందరిని లెక్కబెట్టరుకదా. గత అధ్యాయములో వ్రాయవద్దు అని అనిరి. ముద్రవేయుమని చెప్పి ఆవరణమును కొలత వేయవద్దనిచెప్పెను. ముద్రవేయుము అని అన్నట్టు ఆలయములో పూజించువారిని లెక్కబెట్టుము అని చెప్పెను. వ్రాయవద్దు అన్నట్లుగా ఆవరణమును కొలతవేయవద్దని చెప్పెను.

పరలోకములో ఆలయము, ఆవరణము మున్నగునవి వుండునా?

యోహానుగారు లోకములో వున్నకాలమునందు ఆలయము, ఆవరణము ప్రజలు మున్నగునవి అన్నియు అలవాటే, మోషేకాలములో గుడారము, అతి పరిశుద్ధ స్థలము, పరిశుద్ధ స్థలము ఆవరణము ఉన్నవి. గుడారములోపల ఎవరుందురో తెలియును. వాటిమాదిరి ఈ స్థలమునందు కూడ మహిమతో నిండియున్న ఆలయమున్నది. ఇవన్నియు యోహానుకు అర్ధమవడానికి చూపించెను.

యోహానుకున్న తలంపు యేమనగా మా యూదులలో సంఘములోనికి ఎందరు వచ్చిరో తెలిసికొనవలెనని యున్నది అన్యుల విషయము యోహానుకు అక్కరలేదు.

ఉదా:- ప్రభువు విత్తువారి ఉపమానము చెప్పెను విత్తనమటే వాక్యము. పక్షులంటే దయ్యములని చెప్పెను, అప్పుడు శిష్యులైన వారికి సంతోషము కలిగెను. అలాగే యోహాను కూడ చెప్పెను. ఆవరణము కొలత వేయవదని చెప్పెను. ఎందుకంటే ఆవరణము అన్యులకియ్యబడెను. వారు 42 నెలలు లేక 3 1|2 సంవత్సరములు త్రొక్కుదురని ఉన్నది. లూకా 21:24లో అన్యజనుల కాలములు సంపూర్ణమగు వరకు యెరూషలేము అన్యజనములచేత త్రొక్కబడును అని ఉన్నది. యెరూషలేము పవిత్ర పట్టణము ఆలయము పవిత్రమైనది. అది యూదుల చేతికివ్వబడినది గాని యూదులు దేవునిని వ్యతిరేకించుటను బట్టియు మోషే, అహరోనులు పిదప యెహోషువవంటి ప్రవక్తలను ఎదిరించుటను బట్టియు చివరగా యేసుక్రీస్తును రక్షకుడని నమ్మక సిలువ మ్రానుమీద మరణమునకు అప్పగించుటను బట్టియు వారి పరిశుద్ధ దేవాలయము అన్యులచేతికి అప్పగింపబడి యున్నది.

అన్యులు ఎవరు?

అన్యులనగా యూదులు కానివారు, తెల్లవారు రోమా వారు, పారసీకవారు, గ్రీకు మున్నగువారు రాజైన నెబుకద్నెజరు పరిపాలన కాలము నుండి అంతిక్రీస్తు పరిపాలనవరకు యెరూషలేము త్రొక్కబడును అపొస్తలుల 10వ అధ్యాయములో విశ్వాసులకాలము వచ్చియున్నది. యూదులని, హెల్లేనీయులని యే భేదమునులేదు. యూదులలో నుండి, అన్యులలోనుండి క్రైస్తవుయులని యే భేదమునులేదు. యూదులలో నుండి, అన్యులలోనుండి క్రైస్తవులైన విశ్వాసులు వచ్చియున్నారు. ఏడేండ్ల మహాశ్రమ కాలము తొలగిపోగానే వెయ్యి సంవత్సరములు క్రీస్తుప్రభువు పరిపాలన కాలము వచ్చును. ఆ వెయ్యి సంవత్సరములు క్రీస్తుప్రభువుతో అనేక జనాంగలలో నుండి వచ్చిన విశ్వాసులెనవరు పరిపాలన చేయుదురు అంతేగాని యూదులని, అన్యజనులని భేదములేదు రాజ్యము విశ్వాసులదగును అనగా సంఘ రాజ్యము విశ్వాసులది.

ఇరువురు సాక్షుల పని:- వీరిరువురు పరలోకము నుండి దిగి వచ్చుదురు. వీరు యోనా 3:6 నుండి 10లో నున్నట్లు గోనెపట్ట కట్టుకొందురు. ఇది విచారమునకు పశ్చాత్తాపమునకు గుర్తు. వారు అలాగు ఇతరులకు కనబడుటవలన సమస్తమును విడిచిపెట్టిరని తక్కినవారు లోకమును ఇంకా హత్తుకొని యున్నారని తాము చేయునది సంపూర్ణ సమర్పణ అని తక్కినవారు ఇంకా సమర్పణ చేసికొనలేదని అర్ధము.

  • 1) వీరు వారికిష్టము వచ్చినపుడు భూమిపైకి వర్షము రప్పించుదురు.
  • 2) వారిష్టము వచ్చ్నపుడు అందరి నోళ్ళు మూయించెదరు.
  • 3) వీరు వారిష్టము వచ్చినపుడు ఏదయినా చేతలంచికొన్న చేసి తీరుదురు.
  • 4) దుర్జనుల దండువస్తే వారిని పడవేయాలంటే పడవేయుదురు.
  • 5) వీరి ప్రాముఖ్యమైన పని ఏమిటంటే క్రీస్తును గూర్చిన సువార్త ప్రకటించుటయే.

బ్బురలకాలము, ముద్రల కాలమునందు అనేకులు చనిపోయిరి గనుక ఇంకనూ వచ్చే శ్రమలలో చనిపోవుదురు గనుక ఓ భూలోక వాసులారా ఇప్పటికైనా నమ్మండి అని ప్రకటించిరి.

  • 1) ప్రజలకు ఎన్ని బోధలు అవసరమో
  • 2) ప్రజలకు ఎన్ని ఋజువులు అవసరమో
  • 3) ప్రజలకు ఎన్ని అద్భుతములు అవసరమో
  • 4) ప్రజలకు ఎన్ని శిక్షలు అవసరమో
  • 5) ప్రజలకు ఎన్ని పరిశుద్ధమైన మాయలు అవసరమో అవన్ని చూపి అందరికి మారుమనస్సు కలిగించుట వీరి పని. వీరు భూలోకమందంతట తిరిగి ప్రజలందరు హడలిపోటట్లు చేయుదురు గాని కొందరు మరుమనస్సు పొందుదురు గాని అందరూ మారుమనస్సు పొందరు.

ఈ ఇద్దరు సాక్షులను చూచుటనుబట్టి కొందరికి ఆశ్చర్యము కలుగును.

  • 1) కొందరు భయపడుదురు.
  • 2) కొందరు సంతోషించుదురు.
  • 3) కీడు చేయ తలంతురు.
  • 4) కీడు చేసినందుకు కొందరు సంతోషించెదరు.
వీరు వెయ్యి నూట అరువది దినములు ప్రవచింతురు. సాక్ష్యమిచ్చెదరు. వీరు దేవుని యెదుట రెండు ఒలీవ చెట్లవలె నున్నారు. నిజమైన దీపస్థంభములుగా కనబడుచున్నారు. వీరికి ఒలీవచెట్లు, దీపస్థభములని బిరుదులున్నవి. వీరికి ఎవరైనా హానిచేయ నుద్దేశించిన యెడలవారిని తమనోట నుండి వచ్చిన అగ్ని దహించును. వీరు అందరి నోళ్ళను మూసివేస్తారు. వారికిష్టము వచ్చినప్పుడెల్లా నీళ్ళను రక్తముగా మార్చుదురు. ఆకాశమును వర్షము కురియకుండా మూసి వేయుదురు. ఆకాసమునుండి అగ్ని కురిపించెదరు. వీరిరువురు మోషే, ఏలీయాలు.

ఒలీవచెట్లు అనగా ఎల్లప్పుడు పచ్చగా నుండి నశించనిది. రాజులకు ఇష్టమైన నూనెను తయారుచేసి ఇచ్చెడిది. వాడరాని మంచి వర్తమానము లిచ్చునది.

దీపస్థంభము అనగా ఒకే స్థలములో ఉన్ననూ వర్తమానములు, క్రియలు, బోధలు, పోలికలు , వెలుగు, కాంతి, ప్రకాశత అందరికి ఇచ్చెదరు. యెహెజ్కేలు గ్రంధములో నున్నరీతిగా వీరు రెండు ఒలీవ చెట్లవలె నుందురు పరలోక ప్రభుని భూలోక నివాసులు మహిమపరచెదరు. దీపము వెలుగు నిచ్చుచున్నది. పిల్లలెవరైనా ఎలాగుంటుందో అని చెయ్యిపెడితే (ఎదిరిస్తే) కాల్చివేయును. అలాగే దీపస్థంభములుగా నున్న ఈ సాక్షులను ఎవరయినా యెదిరిస్తే వారి నోటనుండి వచ్చిన అగ్ని కాల్చివేయును.

1వ కథ:- రాజమండ్శ్రిలో ఒక చిన్నమ్మాయి ఉన్నది. ఆ అమ్మాయి దీపమును వెలిగించి దడిలో పెట్టి దాగున్నది. ఆ అమ్మాయికి వెలుగు అని పేరు పెట్టినారు. తర్వాత వెలుగు వెలుగు నీ వెలుగును పోగొట్టుకున్నావు అని అన్నారు ఎందుకంటే వెలుగున్నది గాని వెలుగులో నుండి ఆ అమ్మాయి దాగుకున్నది.

2వ కథ:- వడ్రంగి పనిచేయు ఒక కుర్రవాడు మధ్యాహ్న సమయమందు అగ్గిపూల్ల గీచి ఇంటికిపెట్టి దాగుకున్నడు. ఒకవేళ అగ్గి అంట్కుంటే ఇల్లంతయు కలిపోవును. అలాగే దైవజనులైన వారిని యెదిరిస్తే శాపమును పొందుదురు. మన్ననచేస్తే ఎన్నో దీవెనలు పొందుదురు. వీరి బోధలను మన్నన చేయక యెదిర్స్తే నాశనము పొందుదురు. ఇప్పటికాలము కృపాకాలము. అందుకే ఎదిరించినా తప్పించుకొంటున్నారు గాని ఆ కాలము ఖ్ఠినమైన కాలము తప్పించుకొనలేరు.

ఈ ఇద్దరు సాక్షులు 6,7 బూరల కాలమధ్యమున భూమిమీద అగుపడుచున్నారు. వీరిని యెదిరించు వారిని శపించుటకు ఆత్మ ప్రేరేపించెను.

1వ కథ:- హేగు దొరగారు ఇంగ్లాండు నుంచి వచ్చి వంతెన కట్టుటకు పని చేయించుచుండెను. ఒకమారు ఒక కూలివాడు తిరుగుబాటు చేయగా వానిని కొట్టిరట. గాని మరలా వానిని పిలిచి తాను కొట్టినందుకు వానిని క్షమాపణ కోరిరట. ఈయన ఎంత గొప్ప దొరగారు.

2వ కథ:- హేగు దొరగారు ఒకమారు దారిని వెళ్ళుచుండగా పెద్దపులి ఒకటి దారిన పండుకొని ఉండెను. దొరగారివద్ద పనిచేయుచున్న కూలి వారు పులినిచూచి భయపడుచుండిరి. పరమభక్తుడైన హేగు దొరగారు పులిని చూచి ఓ పులి నీవెందుకు ఈ దారిని పండుకొనియున్నావు. నిన్ను చూచి ఈ కూలివాడ్రు భయపడుచున్నారు. వెళ్ళ్పో అని అనగా ఆ పులిగాండ్రించి కంచెలోనికి వెళ్ళిపోయెను. కూలివాండ్రు తందారిని తాము వెళ్ళిరి.

3వ కథ:- కొందరు రోడ్డుపై అడుగుకొంటూ ఒక మనిషిని రోడ్డుపై చనిపోయినట్లుగా పండుకొని పెట్టి సొమ్ము సంపాదించు కొనుచున్నారు ఆ మనిషిని చూచినవారు భూస్థాపన నిమిత్తము సొమ్మిచ్చిరి. అడుగుకొనుటము పూర్తి అయిన పిమ్మట మనుష్యులు ఎవ్వరూ లేనపుడు ఆ మనిషి లేపుటకు ప్రయత్నము చేయగా ఆ మనిషి నిజముగానే చనిపోయెను.

భూమిపై వర్షము కురవకుండగా ఆపగలిగినటువంటి ఆ సాక్షి ఏలియా నీటి ప్రవాహమును రక్తముగా మార్చుటకు అధికారము పొందిన ఆసాక్షి మోషే, వీరిలో ఏలియా సజీవుల గుంపునకు సాదృశ్యము. మోషే ఏర్పాటు జనాంగమును ఒక రాజ్యముగా ఏర్పరచినవాడు. ఏలియా ఆ రాజ్యాంగములో ప్రవేశించిన దుస్థితిని దిద్దుబాటు చేయుటకు నియమింపబడిన ప్రభువు కాలములో వారి భావికాల చర్యను చర్చించుటకై రూపాంతర కొండ మీదకు వారు దిగివచ్చిరి. ఆ పిదప ప్రకటన 11వ అధ్యాయములో మరలా వీరిని గూర్చి వ్రాయబడి ఉన్నది.

పరలోకమునుండి వీరిరువురు రాగా వీరితోబాటు కొంత పరలోక సైన్యము కూడ భూమిమీదకు చచ్చెను. వీరు రెండు గుంపులుగా నుండి వీరిరువురి క్రింద అధికారముతో భూమిపై పనిచేయుదురు. అనేక విధములైన తెగుళ్ళతో భూమిపైనున్న వానిని ఈ ఇద్దరు సాక్షులు బాధింతురు. వీరి శిక్షాకాలము అయిపోయిన పిమ్మట, అలాగేవారు చేసిన అద్భుతకార్యములు అయిపోయిన పిమ్మట, పాతాళమందు ఒక కౄరమృగము వచ్చి వారిని చంపివేసెను. అందును బట్టి భూజనులందరును సంతోషించి కట్నములు పంపుకొనిరి. భూజనులందరును సాక్షులు వచ్చారు. వచ్చిన సాక్షులు చచ్చారు అని అనుకున్నారు.

మూడున్నర దినములు అని ఉన్నది. ఈ దినములు వారు చావలేదు. కౄరమృగము నేను వారిని చంపివేసితిని అని అనుకున్నది. అలాగే ఆ కాల ప్రజలు కూడ వారు చనిపోయిరి అని అనుకున్నారు. గాని వారు పరవశస్థితిలోనున్నారు. యోహాను పద్మసు లంకలో పరవశ స్థితిలో ఉండెను. అందుకే నేను చచ్చినవానివలె పడిపోతిని అని వ్రాసెను.

ప్రార్ధనలు 4 రకములు
  • 1) మామూలు ప్రార్ధన అనగా ప్రతివారును తమకు కలిగిన విజ్ఞాపనాంశములను దేవునికి చెప్పుకొనుట. ఇది మామూలు ప్రార్ధన.
  • 2) ఉపవాస ప్రార్ధన అనగా మామూలు ప్రార్ధకన్నా కొంచెము ఎక్కువ అంతస్థు కలది తమకు కలిగిన కోర్కెలను ఉపవాస ప్రార్ధనల ద్వారా నెరవేర్చుకొనుటకు చేయు ప్రార్ధన ఇది ఉపవాస ప్రార్ధన.
  • 3) కనిపెట్టు ప్రార్ధన అనగా దేవునితో మనము మాట్లాడిన దేవుడు మనతో మాట్లాడుటకు కనిపెట్టు ప్రార్ధన. కనిపెట్టు ప్రార్ధన చేయగా చేయగా-పరవశ ప్రార్ధన జరుగును. అలాగు ఈ ఇద్దరు సాక్షులు పరవశ ప్రార్ధనలో నున్నారు.

మాయ:- కౄరమృగమును, వారి అనుచరులను ఆ ఇరువురి సాక్షులు చనిపోయిరనుకున్నారు గాని వారు చావలేదు. ఇది పరిశుద్ధమైన మాయ. ఇది మాయలాగ ఆ కాల ప్రజలకు కనబడుచున్నది. గాని మాయకాదు. పరలోకము నుండి ఈ యిద్దరు సాక్షులవెంట వచ్చిన ఆ సైన్యసమూహము అంతర్ధానమై పోయిరి.

వారికి ఉపమాన రూపముగా సొదొమ అనియు ఐగుప్తు అనియు పేరు

  • 1) సొదొమ
  • 2) ఐగుప్తు
  • 3) ప్రభువు సిలువ వేయబడిన స్థలము యెరూషలేము
ఇది ఉపమానరీతిగా చెప్పబడియున్నదిగాని సొదొమ, ఐగుప్తు యెరూషలేము కాదు.

1) సొదొమ అంటే దేనికి గుర్తు? ఆది కండము 19వ అధ్యాయములో కనబడుచున్న రీతిగా పరలోకము నుండి అగ్ని కురిసి సొదోమ పట్టణమంతటిని కాల్చివేసినది. ఆకాశము నుండి గంధకము కురవగా అట్టి గంధకమువల్ల సొదొమ పట్టణము లోపలకు దిగిపోయినది. సొదొమ పట్టణ బ్రతుకు నరలోక బ్రతుకే గాని పరలోకపు బ్రతుకుకాదు. ఆ పట్టణము లోక జీవితము కలిగినది. శిశువు, బాల్యదశ, యవ్వనదశ, వృద్దాప్యదశ లోనికి ఎదగవలసినదిగాని గంధకమును బట్టి దిగిపోయినది. ఆత్మీయస్థితిలో దిగిపోయినవారిని పట్టణము గంధకమును బట్టి దిగిపోయినది. ఆ పట్టణపు వారి యొక్క అత్మీయ జీవితము దిగిపోయినది. ఆదికాండము 19 : 24,25 వచనములు.

ఇద్దరు సాక్షుల నోటనుండి అగ్ని వచ్చి కాల్చివేసెను. భూకంపము దించి వేసినది.

  • 1) అగ్ని వచ్చినది.
  • 2) భూకంపము వచ్చి పట్టణమును కూలచేసినది.
ఆదికాండము 19:6లో ఆకాశమునుండి అగ్ని కురిపింపబడునట్లుగా ఉన్నది. ప్రకటన గ్రంధము 11వ అధ్యాయములో వారి నోట నుండి అగ్ని కురిపింపబడినట్లుగా ఉన్నది.

2) ఐగుప్తు దేశము కౄరత్వమునకు గుర్తు. ఆహారమునకై ఐగుప్తుదేశములోనికి ప్రవేశించిన ఇశ్రాఏలీయులను 430 సంవత్సరములు భయంకరమైన క్రూరత్వముతో ఐగుప్తీయులు హింసించిరి. ఐగుప్తు దేశము క్రురత్వమునకు గుర్తు మనకాలములోను యిశ్రాయేలు కాలములోను, సాక్షుల కాలములోను క్రురత్వమును చూపు ప్రజలనైజము అది గనుక అవిశ్వాసులు కౄరత్వమును పొందుదురు. ప్రజలు ఆ కాలమునకు విశ్వాసులను కౄరముగా చూచెదరు.

3) యెరూషలేము

1. సొదొమ అనగా అత్మీయ జీవితములో దిగిపోవుట. 2. ఐగుప్తు అనగా క్రూరత్వమునకు గుర్తు. 3) యెరూషలేము.

విశ్వాసులు క్రమముగా నెదిగి కష్టములు రాగా భ్రష్టులగుదురు. యెరూషలేము అనగా భ్రష్టత్వము. యిశ్రాయేలీయుల చెతిలో దైవగ్రంధమున్నది. అయిననూ వారు విగ్రహారాధనకు లొంగిపోయిరి. గ్రంధమునుబట్టి ఆత్మీయ జీవితములో ఎదుగవలసిన వారు భ్రష్టులైరి. ప్రభువు వచ్చినపుడు ఈ లోకములో వారు ఆయనను ఆరాధించి నమస్కరించవలసినది. అందుకు బదులు తృణీకరించినారు. అందునుబట్టి వారు ఇక్కడ దిగిపోయిరి. ప్రభువు వెళ్ళిపోయిన పిదప సంఘము ఏర్పడినది. ఆ సంఘమునయినా వారు అంగీకరించవలసినది గాని అంగీకరింపక దిగిపోయిరి.

  • 1) యూదులు దైవ గ్రంధమున్నా విగ్రహారాధనచేసి దిగిపోయిరి.
  • 2) ప్రభువు కాలములో కూడ ప్రభువును అంగీకరింపక దిగిపోయిరి.
  • 3) సంఘకాలములో అంగీకరించవలసినది గాని అంగీకరించనందున దిగిపోయిరి.
యూదులు భ్రష్టత్వములో దిగిపోయిరి భ్రష్టత్వము హెచ్చినది.

పరవశ స్థితిలోనున్న ఇద్దరు సాక్షులు 3 1|2 సం||లు గడచిపోగా పరలోకమునుండి జీవాత్మవచ్చి పరవశ స్థితిలోనున్న వారిలో ప్రవేశించగా వారు పాదములు మోపి నిలిచిరి. వారిని చూచిన వారికి భయము కలిగెను. పైకి ఎక్కిరమ్మని పరలోకమునుండి ఒక స్వరము వినబడెను. ప్రకటన 11:12 పైకి ఎక్కి రమ్మనగా ఇదివరకు చదువుకొన్నట్లు ఎక్కిరమ్మని అర్ధము. ఎక్కిరమ్మని చెప్పగా ఆరోహణమాయెను. రేపటి దినమందు దయ్యములు పెండ్లికుమార్తె సిద్ధపడడములేదు. వీరందరు చల్లారిపోవుచున్నారు అని అనుకొనగా ఆ విశ్వాసులు నమ్మి కుమార్తె ఏమిటి? ఎదేమిమాట? ఎత్తబడతమేమి? మేమీ సంగతులన్నియు ఎరుగుదుమని సాతాను చేసిన మాయలోపడి పోవుదురు. మోషే, ఏలీయాలు చనిపోయినారని వారందరు అనుకున్నారు వారందరు అనుకొని మాయలో పడిపోయిరి. అలాగే రేపు అవిశ్వాసులు పెండ్లికుమార్తె వెళ్ళునపుడు సాతాను పెట్టిన మాయలో పడిపోవుదురు. సాక్షులు పైకి వెళ్ళుచుండగా వారి శత్రువులు వారిని చూచిరి. వారు మేఘారూఢులై పరలోకమునకు ఆరోహణమయిరి. ఆ గడియలోనే భూకంపము వలన 7000 మంది చనిపోయిరి. మిగతావారు ఇది చూచి భయపడిరి కొందరైతే దేవునిని స్తుతించిరి. భూకంపము వలన మేలు కలిగినది. చూచినవారు దేవునిని స్తుతించిరి గనుక వారికి రక్షణ.

ఇదెప్పుడు జరుగును? పెండ్లికుమార్తె వెళ్ళిపోయిన తరువాత శత్రువులు భూకంపము వలన దేవునికి మిత్రులైరి. దేవుని మహిమ పరచిరి.

Home


7వ బూర

7వ బూర:- 6వ బూర, 7వ బూర మధ్య కొంత ఉపాఖ్యానమున్నది.

  • 1) దూత
  • 2) సాక్షులు
  • 3) పట్టణములు.

6వ బూర అయిపోయిన పిమ్మట 7వ బూరకుముందు ఈ విషయములు జరిగినవి. దూత వెళ్ళిపోయెను. ప్రకటింప వచ్చిన సాక్షులు వెళ్ళిపోయిరి. భూకంపము వలన పట్టణము కూలిపొయెను. శత్రువులు నాశనమైరి. పర్వాలేదు, భూలోకవాసులు మోక్షలోక వాసులగుదురని పరలోక వాసులనుకున్నారు. 7వ బూర కాలములో పరలోకములో జరిగిన చరిత్ర భూలోకములో జరిగిన కొంత శ్రమ చరిత్ర చూచెదము. బూరల శ్రమ గతించిన పిమ్మట పాత్రల శ్రమల కాలము. మొదట ముద్రల కాలములో దేవుని కృప ప్రత్యక్షమైన తర్వాత అనేక మంది మనుష్యులున్నారు. మారుమనస్సు లేకుండ నున్నవారున్నారు. 7 బూరల అయిపోయిన పిమ్మట మారుమనస్సు పొందనివారున్నారు. పాత్రలకాలమైన పిమ్మట మార్పు చెందని వారున్నారు. వీరు హర్మగెద్దోను యుద్ధమునకై సిద్ధపడెదరు.

  • 1) ముద్రల కాలములో మిగిలిఉన్న వారు కఠినులు, బూరల కాలములో మిగిలియున్నవారు మరీ కఠినులు.. పాత్రల శ్రమకాలములో మిగిలియున్న మరింత గొప్ప కఠినులు హర్మగెద్దోను యుద్దకాలములో సైతానుతో కలిసి యుద్ధము చేసేవారు చెప్పలేనంత మహాకఠినులై యుందురు ఇది ఎంత కాలము 7 సంవత్సరములు (ప్రకటన 6వ అధ్యాయము నుండి 19వ అధ్యాయము వరకు )
  • 2) ముద్రల కాలములో కఠినమైన శిక్ష కనబడుచున్నది. బూరల కాలములో ఇంకా కఠినమైన శిక్ష ప్రజలకుండును. పాత్రల కాలములో మరి కఠినమైన శిక్ష వుండును. హర్మగెద్దోను యుద్దకాలములో మరింకా కఠినమైన శిక్ష వుండును.
  • 3) దేవుని కృప ముద్రల కాలములో ఉంది బూరల కాలములో దేవుని కృపా ఇంకా ఎక్కువ ఉండును. పాత్రల కాలములో దేవుని కృప మరింత విస్తారముగా ఉండును.
  • నేను బ్రతుకు దినములన్నియు కృపాక్షేమములే నావెంట వచ్చును. కీర్తన 23:6 ఈ కృపాలేకపోతే హర్మగెద్దోను యుద్ధకాలశ్రమ మొదటనే వుండవలసినదే గాని ఆకాలములో నున్నవారు దేవుని కృపను లెక్కించలేదు గాని శిక్షనే లెక్కించిరి. ముద్రకాలములో ప్రభువు తనయొక్క కృపను చూపించినపుడు భూనివాసులు మాకక్కరలేదు అని అన్నారు.

నీవే నిజముగా కృపగలిగినవాడవైతే పెండ్లికుమార్తె వెళ్ళినపుడు మమ్మును ఎందుకు తీసుకొని వెళ్ళలేదని దేవుని కృపను యెదిరించి దేవునిపై నేరము మోపుదురు. దేవుడు కృపచూపినా అంగీకరించక కఠినత్వమును చూపిరి. దేవుడు అన్యాస్తుడని సాతానుచే ప్రేరేపించబడినవారు వీరు మరి ఎక్కువ కఠినులగుదురు. పై చెప్పబడిన 4 కాలములో వారు అలాగే కఠినులైరి. పరలోకమునకు పెండ్లికుమార్తె వెళ్ళినపుడు వీరు వెళ్ళవలసినదేగాని వెళ్ళలేదు. సిద్ధపడలేదు. కనుక వెళ్ళలేదు.

  • 1) వాక్యము వినలేదు గనుక వెళ్ళలేకపోయిరి.
  • 2) నమ్మలేదు గనుక వెళ్ళలేక పోయిరి.
  • 3) లోకము పుట్టినప్పటినుండి వ్యాధులు, శిక్షలు వున్నవి గాని 7 సంవత్సరముల శ్రమలు ఇంకెందుకుండును అని అనుకొనిరి.

ఈ కారణమును బట్టి అపనమ్మికను ముద్రవేసికొనిరి. ఇలాటివారు లోకములో వేరుగా నున్నారు.

  • 1) బాగుపడవలెనని కోరేవారు ప్రశ్నలు వేయరు. బాగుపడవలెనని కోరే వారు ప్రశ్నలు చేస్తారు. అది ఎట్లు? బాగుపడవలెనని ప్రశ్నలు వేయరు. ప్రశ్నలకు జన్మస్థానము అనుమానము, సందేహము, అనిశ్చయత, శంకించుట, దేవునిపై తీర్మానము, దేవునిపై కోపము, పేడలో పురుగువలె వారి హృదయములలో ఈ పురుగులుండును. గనుక నమ్మరు, సిద్ధపడరు. పెండ్లికుమార్తె వరుసలోనికి వెళ్ళరు. ఇవన్ని తీసివేసికొనుటకు బైబిలు బోధలున్నవి గాని మనరు. ఇప్పుడు 7 సంవత్సరముల శ్రమలు తప్పించుకొనుటకు ప్రకటనలోని శ్రమలు వివరింపబడుచున్నవి. ప్రభువు ఇదివరకే మనిషి కొరకు వ్రాసి భద్రపరచెను. గనుక ఎవ్వరూనూ తప్పిపోకూడదు తప్పిపోయిన మనిషిదే తప్పు. ఈ దారినవెళ్ళిన అపాయమని రోడ్డు జమ్కనులో బోర్డు వేస్తారు. ఇది చూచిన ఒకడు ఇది ఎందుకువేసినారని చిందులు వేసినాడు. గవర్నమెంటువారు ఎందుకు వేసినారు. మనుష్యులు అపాయము తప్పించుకొనుటకే అలాగే ప్రకటనలోని శ్రమలు తెలియచేయుటలో ముఖ్య ఉద్దేశ్యము రాబోవు ఉగ్రతనుండి తప్పించుకొనుటకే.
  • 2) నేను పెండ్లికుమార్తె వరుసలోనికి వెళ్ళేవాడను గనుక దీనిని చదువ నక్కరలేదు అని అనును ఒకరు అనగా ఈ శ్రమలు లోనికి నేను వెళ్ళననేది వారి నిశ్చయము.
  • 3) రాకడవచ్చు వరకు మేమెక్కడ వుందుమని అందుకొందరు వీరి దృష్టిలో ఇది సబబేకాని దేవుని దృష్టిలో తప్పే ప్రకటన గ్రంధము దేవుడు అందరి కొరకు తెలిసికొనవలెనని వ్రాయించెను చదివి గ్రహించినవాడు ధన్యుడని మొదటి అధ్యాయములోనే వున్నది. (ప్రకటన 1:3) గనుక చదువ వలెను.

ప్రకటన 11:19 పరలోకములో నున్న ఒక దూత బూర ఊదగానే గొప్ప శబ్దము వినబడెను. ఆ శబ్దము యేమనగా భూలోక రాజ్యములు ఇవి వెయ్యేండ్ల పరిపాలనా కాలములో జరుగును. మత్తయి 4:8లో ఈ లోకరాజ్యములని ఉన్నది. ప్రకటనలో లోకరాజ్యము అని ఉన్నది. ఇందులో ఉన్న తేడాను మనము గ్రహింప వలసిన వారమై యున్నాము. మత్తయి సువార్తలో సాతానుడు యేసుప్రభువుతో నీవు నమస్కరించిన యెడల ఇవన్నియు ఇచ్చి వేసెదనని చెప్పెను. గనుక ఈ లోకరాజ్యములకు ఇప్పుడు రాజు సాతానుడు. ప్రభువు కాలమప్పుడు ఈ రాజ్యములన్నియు ఒకే రాజ్యమగును. దేవుడు సృష్టిని కలుగచేసినప్పుడు ఈ భూలోకమంతయు దేవునిదే ఆదామును కలుగచేసిన దేవుడు ఈ రాజ్యమును ఆదాముచేతికి ఇచ్చి మీరు ఏలుడనెను. ఆదాము చేతిలోనున్న ఈ రాజ్యములు ఆదామునుండి సాతానుడు కైవశము చేసికొన్నాడు. లోకములో దేవుని రాజ్యమున్నది. సాతాను రాజ్యమున్నది. మనుష్యరాజ్యమున్నది. ఈ రాజ్యములన్నియు హర్మగెద్దోనుయుద్ధము వరకుండును. పూర్తిగా ఇప్పుడు దేవుని రాజ్యములేదు. మనిషి దేవుని చేతిలోనికివచ్చి సాతాను చేతిలోనికి వెళ్ళుచున్నాడు. గనుక రాజ్యము సైతానుదే. ఇందుకని ఈ రాజ్యములన్నియు అని సాతానుడు ప్రభువుతో పలికినాడు. మనిషి సాతానుకి సెలవిచ్చినాడు గనుక దేవుడు కూడా సాతానుకు సెలవిచ్చినాడు.

ప్రభువు భూలోకములో మనిషిగా నున్నప్పుడు దీనులైనవారు ధన్యులు పరలోక రాజ్యమువారిది అని అన్నారు. పరలోక రాజ్యము మనదైవున్నదని యోహానుకు పూర్తిగా తెలిసినది గనుక ముసలివడైన యోహాను పడుచు వాడాయెను, యోసేపు ఇంకను జీవించియున్నాడని మంచమునున్న వృద్ధుడైన యాకోబు వినగానే మంచము నుండి పడుచువానివలె లేచెను.

ఇప్పుడు భూలోకమందు సాతాను రాజ్యము, మనుష్యరాజ్యమున్నది గాని హర్మగెద్దోను యుద్దమప్పుడు ప్రభువే స్వయముగా ఓ మనుష్యులారా మీకు నేను మా రాజ్యమప్పగించినాను గాని మీరు ఏలులేక పెయిరి. గనుక నా రాజ్యము మరల నాకు ఇయ్యానగా ఈ భూలోకమును ఏలుచున్నట్టి భూలోకరాజులు తమతమ కిరీటములకు పడవేయుదురు. అలాగే సైతానుకు ప్రభువు నీకు ఇప్పటివరకు స్వతంత్ర రాజ్యము నిచ్చినాను గనుక అప్పగించి వేయుననును నేటి కాలములో జమిమిదారుల ఫలము గవర్నమెంటువారు తీసుకొని జమీందారులకు కొంత పేదలకు కొంత ఇచ్చివేయుటకు తీసుకొన్నామనిరి.

పిఠాపురము రాజు కుమారుడు తన కుమారునికి ఫలమిచ్చెను. గవర్నమెంటువారు వచ్చి వారి రాజ్యము స్వాధీనము చేయమనగా స్వాధీనము చేసిరి. ముందు పెండింగులో ఉండెడు గవర్నమెంటువారు రాగా రాజకుమారుడు ఇచ్చివేసెను. అలాగే సైతానుకూడ రేపటిదినమందు ఈ రాజ్యములన్నిటిని అప్పగించివేయ వలయును.

నలువది దివారాత్రములు అరణ్యములో ఉపవాసముండిన యేసు ప్రభువును శోధించుటకు వచ్చిన అపవాది ప్రభువునకు ఈ లోక రాజ్యము అన్నిటిని చూసి నీవు నాకు నమస్కరించిన యెడల ఇవన్నియు ఇచ్చివేతునని అన్ననూ అప్పుడు ప్రభువు సైతానుకు నమస్కరింపకయే ఈ లోక రాజ్యము అన్నింటిని అప్పగించివేయును నీ దేవుడయిన యెహువాకు నమస్కరించి ఆయనను మాత్రమే సేవింపవలెను (ద్వితి 6: 3) ఈ వచనము ఇక్కడ నెరవేర్పు లోనికి వచ్చినది. ప్రభువు భూమిమీద లేడు గనుక దేవునికి సంబంధించినట్లుగాని భూలోకమునకు వచ్చినాడు గనుక ప్రభువునకే ఈ వాక్యము చెందును.

  • 1) నీదేవుడైన = సర్వాధికారి
  • 2) ప్రభువుకు = నాకు = క్రీస్తుకు
  • 3) నమస్కరించి = పాదములకు
  • 4) ఆయనకు మాత్రము = యేసు ప్రభువునకు

పరలోకారాధన:- ఆరాధన చేసినవారు పెండ్లికుమార్తె సంఘస్థులు. 24గురు పెద్దలు.

  • 1) ఆరాధన స్థలము పరలోక దేవాలయము
  • 2) ఆరాధనలోని అంశములు సాష్టాంగపడుట, నమస్కరించుట, స్తుతించుట,
ఈ మూడు ఆరాధనలు యోహానుకు తెలియును ఇవి యూదుల కాలములో నున్నవి. మన ఆరాధన కూడ ఇలా ఉండవలెను. వర్తమాన కాలములో భూతకాలములో యుగయుగములు నీవు సర్వాధికారివి, మహా మహిమతో యేలుచున్నవాడవు. స్తుతిలో గడచిన కాలస్తుతి, జరుగుచున్న కాలస్తుతి, జరుగబోయే కాలస్తుతి, యుగాంత కాలము యోహాను కాలము, అనంతకాలము సర్వాధికారివి, స్తుతిలో జరిగిపోయిన కాలస్తుతి, జరుగుచున్న కాలస్తుతి, యుగయుగములు అనగా జరుగబోయే కాలస్తుతి ఉన్నది.

  • 1) సర్వాధికారి=నీవు రాజ్యము తీసుకొన్నవాడవు.
  • 2) నీవు బలముగలవాడవు=సైతాను బలమును తీసివేసిన వాడవు.
  • 3) పరిపాలించు చున్నవాడవు=అన్నికాలముల స్తుతి కలుగును గాక.

యోహానుకు సంతోషము కలిగినది. పెండ్లికుమార్తె సంతోషించుచున్నది. దూతలు చూచి సంతోషించినరు. దూతల స్తుతి అయిపోయినది. ఇప్పుడు పెండ్లికుమార్తె స్తుతిచేయు సమయము. (ప్రకటన 11:18) జనములు కోపగించెను. పెండ్లి కుమార్తె సంఘము భూమిపైనుండి పైకెత్తబడగా మిగిలినవారు కోపబడుదురు. ప్రజలకు కోపము వచ్చెను. పెండ్లికుమార్తెను తీసికొనివెళ్ళి మిగతావారిని అనగా ఎన్నికజనమైన యూదులు, అన్యులు, వీరు మిగులు జనాంగము ఎన్నిక జనమునకే యిశ్రాయేలు అని పేరు. అన్యులకు మరియొకపేరు జనములు. అన్యుల పేర్లు

  • 1)అన్యులు
  • 2) వేరే గొర్రెలు
  • 3) జనములు.
అన్యులు ముందుకు వచ్చిరా? లేక యూదులు ముందుకు వచ్చిరా? జనములు కోపగించినందున దేవునికి కోపము వచ్చినందున 7వ బూర శ్రమ వచ్చెను. జనములు కోపగించి నందున దేవుడెందుకు కోపగించవలెను? ఆయన నియము కోపించువాడు కాడు (కీర్తన 103:9) అని ఉన్నది గాని అప్పుడప్పుడు కోపగించును.

  • 1) మృతులకు తీర్పు తీర్చవలెను.
  • 2) భక్తులకు బహుమానమియ్యవలెను.

భక్తులలో భాగములు

  • 1) ప్రవక్తలకు
  • 2) పరిశుద్ధులకు
  • 3) దేవుని నామమునకు భయపడువారికి బహుమతులు,
మృతులైనవారికి తీర్పు, భక్తులైన వారికి బహుమానము. కొంతమంది ఉద్యోగము ఇక్కడనే ఉన్నది. భూమిని నశింపచేయువారు. ఆ నశింపచేయువారిని నశింపచేయవలెను. దానిని బట్టి భూమిని నశింపచేయుదురు. కొందరిని నాశనము చేయవలెనని ఇందుకలదు, అనగా భూమిని, మనుష్యులను సృష్టిని, మనుష్యుల ఉద్దేశ్యమునకు ముందు దేవుడు వారిని నాశనము చేయవలెను.
  • 1) కోపగించిన వారిమీద కోపగించెను.
  • 2) నాశనము చేయువారిని నాశనము చేయును.
నాశనము చేసేవారు గనుక వారిని నాశనము చేయవలెను. ఈ మధ్య కనుగొన్న బాంబు భూమిని నాశనము చేయును. ఈ వచనమునకిది సరిపోయినది. హైడోజన్ బాంబువల్ల ప్రపంచమంతా నాశనమగును ఈ బాంబు నాశనము చేయుటకే వారికే నాశనము. బాంబును తయారుచేసిన వారిని ఖైధీలో నుంచిరి. ఈ వాక్య ప్రకారము నాశనము చేసేవారిని నాశనము చేయునని కలదు. దేవుడు వారిని ఆ బాంబును నాశనము చేయును. ఈ వాక్యప్రకారము 7వ బూర కాలములో
  • 1) నాశనమగునని వారనుచున్నారు గాని దేవుడే వారిని నాశనము చెయును.
  • 2) విశ్వాసులు ఆ నాశనమే ఈ బాంబు వలన జరుగునని తలంచుచున్నారు.
అదే ఇదని అనుకొనుచున్నారు. కాని పెండ్లికుమార్తె వెళ్ళి పోవలెను. అప్పుడే ఈ నాశనము జరుగును.

  • 1) జనములు వేరు
  • 2) రక్షితులు వేరు
  • 3) ఎన్నిక జనాంగము వేరు
  • 4) పెండ్లికుమార్తె వేరు

(ప్రకటన 11:19) ఇవన్నియు తిలకించుచున్న యోహాను దృష్టి ఇంకనూ పరలోకమువైపే వుండెను. అక్కడవున్న దేవాలయము తెరువబడెను. నిబంధన మందసము అందులో కనబడెను. దానికే సాక్ష్యార్ధపు పెట్టె అని పేరుకలదు. వీనికి కలిగిన పేర్లు.

  • 1) మందసము
  • 2) నిబంధన పెట్టె
  • 3) సాక్ష్యార్ధపు పెట్టె

ఆలయము చూడగానే యోహానుకు యెరూషలేము జ్ఞాపకము వచ్చెను. ప్రభువు బోధించినట్టి దేవాలయము. రోగులను బాగుచేసిన దేవాలయము, జబుకుతో కొట్టిన ఆలయము.

  • 1) అరణ్యములో మోషే గుడారము.
  • 2) సొలొమోను దేవాలయము.
  • 3) పరలోక దేవాలయము.

ఇదిచూచిన యోహాను మందసమును జ్ఞాపకము చేసికొనెను. దానిపై కెరూబులున్నవి. దానికి కరుణాపీఠము పేరున్నది. అదే పరలోకమందు ఇప్పుడు కనబడుచున్నది గనుక యోహాను మా దేవాలయములో నున్న రీతిగానే కరుణాపీఠము మందసము కనబడుచున్నది గాని ఇది పూర్తిగా మారి పొయినది అని అనుకొనుచున్నాడు. అవి కర్రలు రాళ్ళుగాని, ఇవి మహిమతోనే కట్టబడి ఉన్నదని అనుకొనెను. మోషే గుడారముకన్నా యెరూషలేము ఆలయము గొప్పది. దానికన్నా గొప్పది పరలోక దేవాలయము. యోహాను అసలుది చూచెను గనుక సంతోషించెను. మందసములో

  • 1) పది ఆజ్ఞల పలుకులు
  • 2) చిగురించే కర్ర
  • 3) మన్నాపాత్ర ఉన్నవి

ఇవి అన్నియు ఛాయయేగాని నిజస్వరూపము పరలోకమందున్నవని పౌలు వ్రాసెను. (హెబ్రీ 11:1) పరలోకమందు పది ఆజ్ఞల పలకలులేవు ఎందుకనగా పరలోకములో పాపములేదు. మన్నా అక్కడలేదు ఎందుకనగా యిశ్రాయేలీయులు పాలస్తీనా దేశములోనికి ప్రవేశింపగానే ఆగిపోయెను. చిగురించుట పరలోకములో లేదు. పది ఆజ్ఞల ఛాయ నిజస్వరూపము మన్నా నిజస్వరూపము చిగురించే కర్ర నిజస్వరూపముండెను. పెండ్లికుమార్తెతో దేవుడెల్లప్పుడు మాట్లాడుచుండెను. దేవుని మాటలు బైబిలులో కలవు. అదే ఆజ్ఞ ఇంకా ఆజ్ఞలుండును గనుక ఆ మాటయే దానియొక్క నిజస్వరూపము. ఇంక ఆజ్ఞవుండదు అంతా అనుభవించుటయే నాదినీ ఇష్టము. అదే మరుగైయున్న మన్నా అని కలదు. ఆ మరుగైయున్న నిజస్వరూపమైన మన్నాను అక్కడ చూతము. యెషయా 11వ అధ్యాయములో మొద్దునుండి చిగురు పుట్టెనని కలదు, యెషయా వంశము గతించెనను కున్నప్పుడు దావీదు, మరియ, క్రీస్తుప్రభువు వచ్చెను. అది ఇంకా చిగురించుచూనే ఉండెను. ఇంకా చిగురించుచున్నది. అదే నిజస్వరూపము ఇప్పుడు సంఘములన్నియు చల్లారిపోయినవనుచున్నారు. అదే మొద్దుకాలము. కాని పెండ్లికుమార్తె రాకడ కాలములో చిగురించుచుండును. మొద్దు చావదు.

ఉదా:- యెషయా గ్రంధపు చుట్టకలదు.
  • 1) నోవాహు నావ వచ్చినది.
  • 2) పది ఆజ్ఞల పలకలు వచ్చును.
  • 3) రేపు మన్నా వచ్చును.

మానిషి పాపము చేసెను గనుక భూమి వానిని మ్రింగివేసెను. భూమి దేవునిది గనుక అది మరలా క్రక్కివేయును. ఇవన్నియు పెండ్లికుమార్తె ఆరోహణమునకు గుర్తు. ఇవన్నియు పెండ్లికుమార్తె చూచి వెళ్ళును. చేప చిన్న చిన్న చేపలను మ్రింగి యోనాను క్రక్కివేసినది. అలాగే రేపు భూమికూడ చేయును.

Home