(Commentary on Book of Revelation)

గ్రంథకర్త : యం. దేవదాసు అయ్యగారు

పరిచయము

ప్రకటన గ్రంథము :-
  • "ప్ర" - ప్రత్యక్షత కలిగిన గ్రంథము. ప్రత్యేకమైనది. బైబిలు అంతటిలో ప్రధానమైనది. ఎందుకనగా 65 పుస్తకములలో ఉన్నదంత ఈగ్రంథములోనే ఉన్నది. ప్రకటించ వలసినదే గాని దాచవలసిన గ్రంథము కాదు. ప్రపంచ మంతటికి నోటీసు వంటిది. ప్రత్యేకింపబడిన యోహానుకు ప్రత్యేకముగా చూపించి వ్రాయించినది. ఈ గ్రంథమును చదువు వారు దీనికి ప్రత్యేకత నిచ్చి చదువవలయును.

  • "క " - కనికరముచూపించు గ్రంథము. ప్రతివారి హృదయమును కదిలించే గ్రంథము. కఠినమైన గ్రంథము. కలవరపరచే గ్రంథము. కడవరి శిక్ష తెలియపరచు గ్రంథము. కన్నులను తెరిపించే గ్రంథము. కన్నీరు తుడిచే గ్రంథము. కడవరి తీర్పుగల గ్రంథము.

  • "ట " - టర్నింగ్ గల గ్రంథము. యోహాను దృష్టి అంతయు సంఘములపై నుండగా అక్కడనుండి ప్రభువు వైపునకు త్రిప్పిన తరువాత చూచిన గ్రంథము. అనేక వంపులు తిరుగుచు శ్రమలను తట్టుకొనుచు ప్రయాణము సాగించు గ్రంథము.

  • "న" - నమ్మి తీరవలెను. నమ్మకపోతే శిక్ష. అని చెప్పే గ్రంథము. నమ్మకపోతే చెడేది నీవే అని చెప్పే గ్రంథము. నమ్మకము గల వారిని నడిపించే గ్రంథము. నమ్మినవారి గతి చూపించే గ్రంథము.

నమ్మిన వారు సజీవులు, నమ్మనివారు నిర్జీవులు, సజీవుల గుంపు యొక్క నిరుకు చూపించే గ్రంథము. మృతుల గుంపుయొక్క నిరుకు చూపించే గ్రంథము గనుక ఈ ప్రకటన గ్రంథమును ప్రతివారు చదువవలయును. ప్రకటించ వలయును. ఎవరు ఈ పని పూనుకొందురో వారికొరకు పరలోకము ఎదురు చూచుచున్నది. సహాయము చేయుటకు దిగివచ్చును. ధన్యులని పిలుచును. నమ్మితే మోక్షము, నమ్మకపొతే నరకము.

యేసుక్రీస్తు తన దాసులకు కనబరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. (ప్రకటన 1: 1) నీవు చూచుచున్నది పుస్తకములో వ్రాసి 7 సంఘములకు పంపుమని ప్రభువు యోహానుకు చెప్పెను. (ప్రకటన 1 : 11) యోహాను ఆత్మ వశము, ఆత్మ ప్రత్యక్షత, ఆత్మ సంచార అనుభవము కలిగినందున వ్రాసెను. (ప్రకటన 1: 10; 1:12-20; 4:1;2) గనుక ఈయనే దాసుడు.

ఈ గ్రంథార్ధమును దేవుడు బైబిలు మిషనును బయలు పరచిన యం. దేవదాసు అయ్యగారికి తెలియజేసెను. ప్రకటన గ్రంథమును వ్రాసిన యోహానుకు కలిగిన అనుభవము ఈయనకు కలిగియున్నందున ఈ గ్రంథము యొక్క భావార్ధమును వ్రాయగలిగెను.

ప్రకటన గ్రంథ వివరమును అయ్యగారు గుంటూరునందు ఉన్న బేతేలు గృహ వరండా నందు బహు విపులముగా బోధించిరి. ఆ కాలమందున్న శిష్యులు వాటిని వ్రాసి పదిలపరుచుకొనిరి. ఈ గ్రంథము అచ్చులోనికి రావలెనని అయ్యగారు 1950వ సంవత్సరములో ప్రార్థించిరి. ఇది ప్రాముఖ్యమైన గ్రంథమై ఉన్నది. ప్రతివారును ప్రకటన గ్రంథమును చదవవలెనని అయ్యగారు బోధించిరి. ఈ గ్రంధము మీ అత్మీయ జీవితమునకు మేలుగ ఉండునట్లు ప్రచురించుచున్నాము. చదువువారికిని, గైకొను వారికిని ధన్యకరమైన జీవితమును దేవుడు అనుగ్రహించును గాక.

పెండ్లికుమారుడిగా రానైయున్న ప్రభువునందలి
రెవ. జె. జాన్ సెల్వరాజు అయ్యగారు, B.Sc.
ప్రెసిడెంట్ బైబిలు మిషను. (ముద్రణ తే.ది 8-8-1998, Note).
పుస్తకములు కావలసినవారు సంప్రదించవలసిన అడ్రస్: బేతేలు గృహము, బైబిలు మిషను, గుంటూరు.

Home


ఉపోద్ఘాతము

యోహాను :- అపొస్తలులలో ఒకరు. జెబదయి కుమారుడు. యాకోబునకు తమ్ముడు(మత్తయి 4:21) (అపొ.కా. 12:12). ఇతని తల్లి పేరు సలోమి. ఇతని తండ్రి జాలరి, యోహానును ఇదేవృత్తి కలవాడు. తన వృత్తి ప్రకారము చేపలను పట్టుకొనుచుండగా క్రీస్తు నిలువగానే తన తండ్రిని సమస్తమును వదిలి తన సహోదరుడగు యాకోబుతో కూడ ఆయనను వెంబడించెను. కొంతకాలమునకు అపోస్తలులలో ఒకడుగా నియమింపబడెను. ఈ అన్నదమ్ములిద్దరును ఉరిమెడువారని అర్థమిచ్చు బోయెనెర్గెసు అను బిరుదు వచ్చెను. క్రీస్తును వెంబడించిన తరువాత క్రీస్తుప్రభువు వలెనే సాధువైన గొఱ్ఱెపిల్లలుగా మారెను.

వారి తల్లి క్రీస్తు రాజ్యమునందు కుడిఎడమల స్థానములను అడుగుటవలన ఆయనకు రానైయున్న శ్రమల యెడల పాలివారై యుండుటకు సిద్దపడియున్నారని తెలియుచున్నది. శ్రమలయెడల వారికి కలిగిన ఆసక్తిని వారు తెలియజేసిన ప్రకారము వారి తల్లి కోరిక సార్ధకమైనట్లు యాకోబు యెరూషలేమునకు మొదటి బిషప్పుగానుండి ఖడ్గము చేత చంపబడి క్రీస్తుయొక్క హతసాక్షి ఆయెను. యోహాను కాగుచున్న నూనెలో వేయబడినను చావక సజీవుడై ఉన్నట్టు ప్రకటన గ్రంథము వ్రాయుటద్వారా అర్థమగుచున్నది.

యోహాను క్రీస్తు సంగతులను పూర్ణముగా నెరిగిన తరువాత ఆయన యందు అందరికన్న యెక్కువ ప్రేమ కలవాడయ్యెను. అందువలననే క్రీస్తు ప్రేమించిన శిష్యుడనబడెను. యయీరు కుమార్తెను బ్రతికించినపుడు, రూపాంతరమొందినప్పుడు, గెత్సెమనే వనమున మిగుల వేదన నొందినపుడు, యాకోబు పేతురులతో కూడా ఇతనిని ఆయనయొద్ద ఉంచుకొనెను. చివరి పస్కాను భుజించినపుడు ఇతడు ఆయన చెంతను కూర్చుండి ఆయన రొమ్మున ఆనుకొనెను, (యోహాను 18:15) లో నున్న ఆ మరియొక శిష్యుడు ఇతడే, మరియు ప్రదాన యాజకునికిని అతని నౌకరులకును బాగుగా తెలిసినవాడై యుండెను. క్రీస్తును సిలువ వేసినపుడు యోహాను ఆయన దగ్గర నున్నందున ఆయన తల్లియైన మరియను యోహానుకు అప్పగించెను.

యోహాను క్రీస్తు సమాధిలో లేడని స్త్రీలు తెచ్చిన కబురువిని సమాధియొద్దకు పరుగెత్తుచున్న పేతురుకన్న ముందు వెళ్ళి పేతురువెంట సమాధిలో ప్రవేశించెను. క్రీస్తు లేచిన నాటి సాయంత్రం, తరువాత ఆదివారపు సాయంకాలమునందును ఆయనను చూచిన శిష్యులలో ఇతడొకడు (యోహాను 20:19-30). తక్కిన శిష్యులతో బాటు ఇతడును గలిలయకువెళ్ళి అచ్చట సముద్రపు తీరమునందు ఆయనను చూచియుండెను. ఆ సమయనున అతనితో ప్రభువు చెప్పిన ఒక మాటను ఆదికాలపు క్రైస్తవులు ప్పొరపాటుగా అర్థము చేసికొనిరి. (యోహాను 21:22) క్రీస్తు గలిలయ కొండమీదను, ఆయన అరోహణుడైనప్పుడును, ఒలీవలకొండ మీద కనబడినప్పుడును, పరిశుద్ధాత్మ కొరకు శిష్యులు కనిపెట్టు చుండినవారిలో యోహాను ఉండెను.

యోహాను పెంతెకొస్తుదినమున పరిశుద్ధాత్మ వరమును పొందెను. తరువాత పేతురుతో కలిసి కొంతకాలము పనిచేసెను. వారిద్దరునూ కలిసి దేవాలయమునకు వెళ్ళుచుండగా పేతురు ఒక కుంటివానిని బాగుచేసెను. వీరిద్దరు అనగా పేతురు యోహాను చెరసాలయందు ఉంచబడిరి. సమరయలోని క్రైస్తవులను స్థిరపరచు నిమిత్తము అచ్చటికి పంపబడిరి. సౌలు మారుమనస్సునొంది దమస్కు నుండి తిరిగివచ్చినపుడు యోహాను యెరూషలేమునందుండెను. గాన హింసలు కలిగిన సమయమునందు యెరూషలేము విడిచివెళ్ళినట్లు కనబడుచున్నది. మరియు జీవించినంతవరకు ఇతడు యెరూషలేమును వదలి యుండలేదు అను ఒక వదంతి కలదు. కార్యముల గ్రంథమందు యోహానునుగూర్చి ఇక వ్రాయబడలేదు. ఈ యోహాను ఆసియాలోని సంఘములను చూచినవాడని ప్రకటన 1:11 వలన ఊహింపగలము. అతడా గ్రంథమును వ్రాసిన సమయమున పద్మసు ద్వీపమున ఖైదీగానుండెను. పాలికార్పు, పాపియ మొదలగువారు ఇతనికి శిష్యులై యుండిరి. పాలికార్పు శిష్యుడైన "ఐరేనియ" యోహాను తన మరణకాల పర్యంతము ఎఫెసులో నుండెనని వ్రాసెను.

treat lice
    ప్రకటన వ్రాసినది ఈ యోహానే అనుటకు
  1. యోహానును గూర్చి పైన వ్రాయబడిన అంశములన్నింటినిబట్టి చూడగా ప్రకటన గ్రంథమును యోహానే వ్రాసినట్లు అర్థమగుచున్నది.
  2. అపొస్తలుగానుండి చివరి వరకు క్రీస్తు జీవితమును ఎరిగినవాడు.
  3. యేసు రొమ్మున ఆనుకొని యేసుప్రభువుచేత ప్రేమింపబడి ప్రతి విషయమును ప్రభువునడిగి తెలిసికొనెనని యోహాను 21:20 లో ఉన్నందునను.
  4. ప్రభువు వచ్చువరకు యోహాను ఉండునని ప్రభువు పలికెను. అయితే చావడని యేసు అతనితో చెప్పలేదు. కనుక ప్రభువు రెండవమారు వచ్చువరకు యోహాను ఉండునని అపొస్తులులు అర్థము చేసికొనిరి గాని ప్రభువు చెప్పిన మాటకు అర్థము అదికాదు అని యోహాను మరణము వలన తెలియుచున్నది. గాని నేను వచ్చువరకు యోహాను ఉండును అని పలికిన మాటకు పద్మసులో నున్న యోహాను నొద్దకు ప్రభువు వచ్చువరకు, అనగా వచ్చి ప్రకటన వ్రాయించువరకు అని అర్థము కనుక ప్రకటన గ్రంథము వ్రాసినది ఈ యోహానే అని తెలియుచున్నది.
  5. పద్మసు ద్వీపములో ప్రభువు కనపడగానే మనుష్యకుమారుని పోలిన యొకడు అని యోహాను వ్రాసెను.
    1. ఈ యోహాను ప్రభువును శరీర ధారిగా ఉన్నపుడు చూచెను.(1యోహాను 1:1)
    2. రూపాంతరము పొందిన ప్రభువును చూచెను (మత్తయి 17:2)
    3. పునరుత్థానుడైన ప్రభువును చూచెను (యోహాను 20:24-26).
    4. ఆరోహణమై వెళ్ళిన ప్రభువును చూచెను(అ.కా 1:9). కనుకనే పద్మసు ద్వీపమందు ప్రభువును గుర్తించెను.
    గనుక ప్రకటన గ్రంథమును వ్రాసినది ఈ యోహానే అని తెలియుచున్నది.
Home


ప్రార్ధన

ఓ దయగల తండ్రీ! మేమిప్పుడు ప్రకటన గ్రంథమును నేర్చుకొనమొదలు పెట్టితిమి. ఈ గ్రంథములోని విషయములన్ని నేర్చుకొని మా హృదయములో భద్రపరచుకొనే కృప దయచేయుము. నీవు మహిమ శరీర స్వరూపుడవై యున్నావు. కాబట్టి మేము కూడ మహిమ శరీర స్వరూపులమై యుండవలెను. నీవు మహిమ దేవుడవై యున్నావు. మేము మహిమ సృష్టియై యుండవలెను. నీవు మహిమకు కర్తవై యున్నావు మేము మహిమ ప్రజలమై ఉండవలెను. నీవు మానిమిత్తమై మహిమ లోకమును విడచి ఈ లోకమునకు వచ్చియున్నావు. మేము యిహలోకమును విడచి ఆ మహిమలోకమునకు రావలయును. నీవు యీలోకమును, పాపమును, సాతానును వాని సంబంధములను జయించితివిగదా ! మేమును వాటిని జయించవలెనని ఈ గ్రంథము ద్వారా తెలియ జేయించుచున్న తండ్రీ ! నీకు వందనములు. పద్మసు లంకలో యోహాను బంధింపబడినను నీ మహిమను చూడగలిగినాడు. నీ మహిమను చూచుటకు యేవియును అడ్డురావు. యోహాను నీ మహిమను చూచేటంతటి పవిత్రుడు; ఆయనకు చెఱసాల, వృధాప్యము, పనిచేయని కాలమైనప్పటికిని ఆయన మహిమదృష్టి, మహిమ తలంపులు మహిమ కోరికలు కలిగి యున్నాడు. అలాగే మేము ఏలాంటి ఆటంకముల మధ్యనున్నను, యోహానువలె నీ మహిమను చూచేభాగ్యమను గ్రహింపుము. భూలోక దైవసన్నిధిలోనుండి ఆత్మీయ నేత్రములతో పరలోక దర్శనము లన్నియు చూచిన రీతిగానే మేమునుచూచే ఆత్మీయనేత్రములను దయచేయుమని మహామహిమతో రానై యున్న ప్రభువు నామమున వేడుకొనుచున్నాము తండ్రీ . -- ఆమెన్.

Home


1. రాకడ ముంగుర్తులు

  1. నేనే క్రీస్తు ననువారు వత్తురు (మత్తయి 24 : 5)
  2. అబద్ద ప్రవక్తలు వత్తురు (మత్తయి 24 : 11)
  3. యుద్ధములు (మత్తయి 24 : 6)
  4. కరువులు (మత్తయి 24 : 8)
  5. గొప్ప విపత్తులు (లూకా 21 : 10-11)
  6. ఉద్యోగములు దొరకవు (జకర్యా 8 : 10)
  7. నోవాహు దినమువలె నుండును (మత్తయి 24 : 37-39)
  8. తిండి దొరకదు (విలాప వాక్యములు 4 : 5)
  9. ఇల్లు కట్టుట, నారు నాటుట ,అమ్ముట (లూకా 17 : 28-30)
  10. ధనము విస్తరించుట (యాకోబు 5: 1-10)
  11. అక్రమమువృద్ధి (మత్తయి 24: 10)
  12. ధైర్యము చెడికూలుదురు (లూకా 21 : 25,26)
  13. ఒకనినొకడు అప్పగించును (మత్తయి 24 : 10)
  14. వాక్య కరువు (ఆమోసు 3 : 11)
  15. తల్లిదండ్రుల వలన, సోదరుల వలన (లూకా 21 : 10-17)
  16. మనుష్యుల శవములు రాలుట (యిర్మియా 9 : 22)
  17. కల్పననా కథలకు తిరుగు కాలము (2 తిమోతి 4: 3-4)
  18. నామకభక్తి (2 తిమోతి 3 : 5)
  19. వీధి రథములు (బస్సులు) (నహోము 2 : 4)
  20. ప్రవచన అర్ధము చెప్పువారు లేతురు (దానియేలు 12 : 4)
  21. యూదుల రాకవలన ఆందోళన (యెహెజ్కే 38 : 16)
  22. పరిశుద్ధాత్మ బాప్తిస్మము క్రీస్తు రాకడలో అందరూ పాలుపొందవలెను (అ.కా. 1 : 4-5)
  23. అతుకనికాలము (మన కాలము) (దానియేలు 2 : 42)
  24. విమానములు (యెష 31 : 5; 60 : 8;) క్రీ. పూ. 713 నెరవేర్పు 1917
  25. రేడియో (మత్తయి 10 : 27)
  26. సబ్రిన్ (జలాంతరగాం) (హబ 1: 14)
  27. త్రెంచెస్ (గోతులు) - (యెష్ 2 : 19) పోయిన యుద్ధకాలములో నెరవేర్పు (బాంబులు వేయగా దాగొనిరి)
  28. రాకెట్ (కీర్తన 68 : 17)
  29. ప్రేమ చల్లారును (మత్తయి 24 : 12)
  30. శాంతి నిరీక్షణ భంగము (యిర్మియా 6 : 14)
Home


2. ప్రకటన గ్రంథమునకు గల పేర్లు

ప్రకటన గ్రంథములో వ్రాయబడిన విషయములనుబట్టి ప్రకటన గ్రంథమునకు గల పేర్లు -
  1. ప్రకటన (అనగా ప్రపంచమునకు ప్రకటించవలసిన గ్రంథము.ప్రపంచమునకు నోటీసు బల్ల వంటిది దాచవలసిన గ్రంథము కాదు.)
  2. ప్రవచన గ్రంథము (అనగా ప్రవక్తలు వ్రాసిన ప్రవచనము అన్నింటిని ఈ గ్రంథములో నెరవేర్పులున్నవి. (యెష 4: 12)
  3. దర్శన గ్రంథము (అనగా దర్శనములో చూచి వ్రాయబడినది.)
  4. భయంకర గ్రంథము అనగా యీ గ్రంథములోని సంగతులు చదువారికి భయము కలిగించునట్లుండును.
  5. కఠినమైన గ్రంథము (అనగా ఈ గ్రంథములోని భావములు గ్రహించుట కష్టము ,కఠినము)
  6. తెగుళ్ళు గల గ్రంథము (అనగా 7 ముద్రలు, 7 బూరలు , 7 పాత్రలు కుమ్మరించు సమయములో ప్రవచనమునకు సంభవించబడు తెగుళ్ళను సూచించును) .
  7. యెడతెరిపి లేని గ్రంథము (అనగా అన్ని యుగములందు జరుగు సంగతులు ఈ గ్రంథములో నున్నవి.)
  8. పరలోకపు ప్రదర్శనము (అనగా శిష్యుడైన యోహాను పరలోకమునకు గొని పోబడి పరలోకములో చూచిన దర్శనములన్నియు భూలోకములో సం క్షిప్తముగా వివరించునది.

ప్రవేశ వాక్యములు

  1. ప్రకటన చదువక ముందు దానియేలు గ్రంథమును, యూదా పత్రికను చదువవలెను .
  2. ప్రకటన రాబోవు కాల సంగతులు గల పుస్తకము. అర్ధముకాని పుస్తకము. అర్ధము సరిగా చెప్పనియెడల తెగుళ్ళు వచ్చునేమో అని ఈ మూడు కారణములు తోచిన వారై అనేకులు యీ గ్రంథమును చదువుటకు, నేర్చుకొనుటకు వెనుక దీసిరి.
  3. విశ్వాసి స్వయముగా అర్ధము చేసికొని వ్రాసిన యెడల దోషము కాని ప్రభువు బయలు పరుపగా వ్రాసిన యెడల యేమీ దోషములేదు ఈ దోషము వుండదు.
  4. సువార్తలో ప్రభువు యొక్క భూలోక చరిత్ర యున్నది. అయితే ప్రకటనలో ఆయన పరలోకమునుండి వచ్చి ఈ లోకములో నడిపిన చరిత్ర బోధించబడిన యెడల అసంపూర్ణ సువార్త అగును.
  5. ప్రకటన అనగా ప్రకటింప వలసినదేగాని దాచవలసినది కాదు. (దానియేలు 12 : 9) ప్రకారము ముద్రించు కాలము అయిపోనది ఇపుడు ప్రకటింపబడవలెను. (ప్ర 10 : 11)
  6. ఈ ప్రకటన కాలములో మహామహిమ కాంతితో ప్రకాశించుచున్న క్రీస్తుకు మీ హృదయములలో సింహాసనము వేయుటకు స్థానము యియ్యవలెను.
  7. క్రీస్తు పాత నిబంధన కాలములో మరుగుగా కనిపించెను. మాట్లాడెను. అయితే సువార్తల కాలములో తన్నుతాను బాహాటముగా కనపరచు కొనెను.
  8. పత్రికలలో క్రీస్తు సిద్ధాంత కారకుడుగా బోధింపబడెను.
  9. ఆదికాండ కాలములో మహిమ స్థితిని గోల్పోయిన మానవుని తిరిగి దేవునితో సహవాసపర్చుట ప్రకటన గ్రంథములో పొందుపర్చబడినది.
  10. ఈ ప్రకటన గ్రంథములో సాతానుని అంత్యము వివరించబడి యుండుట వలన తనను గూర్చి తెలుసుకొనుటకు యిష్టపడక సాతాను యీ గ్రంథమును చదువనియ్యడు.
  11. శ్రమలలో స్తుతించువారికి నర లోకములో ఆదరణయును పరలోకములో మహిమ కలుగును అనియు బాధ పెట్టు సైతాను అనుచరులు తుదకు నిత్యనరకాగ్ని పాలగుదురనియు ప్రకటనలో ఉన్నందున మనకు ప్రకటన ఆదరణ పుస్తక మాయెను.
  12. యెరూషలేము నాశనమైన తరువాత యోహాను పద్మసు లంక చెఱలో నుండి క్రీ. వె 96 సం || గ్రంథమును వ్రాసెను. సాతానుచే ఖైదీలో వేయబడిన యోహానుచేతనే ఈ గ్రంథమును వ్రాయించెను.
  13. పరలోకములోను, భూలోకములోను, పాతాళలోకములోను యేకకాలమందే జరుగుచున్న సంగతులు పుస్తకములో వ్రాయవలెనంటే ముందు యేదైనా ఒకటి వ్రాయవలెను గదా ! అయితే యోహాను తాను దర్శనములో చూచినవి వ్రాయుట వలన కాలక్రమానుసారం సరిగా లేక ముందు సంగతులు వెనుక, వెనుక సంగతులు (chapter sequence) ముందు తన గ్రంథములో వ్రాసినట్లు చూడగలము.
  14. గ్రంథములలో గొప్ప గ్రంథము బైబిలు.
  15. బైబిలులో గొప్ప గ్రంథము ప్రకటన.
Home


బైబిలు అంశములు

ఆదికాండము ప్రకటన
1. భూసృష్టి 1. ఆది గతించిపోవును
2. జ్యోతులు 2 . వాటి అవసరము లేదు
3. దేవుని ముఖాముఖిగా చూచట 3. ఆత్మ వశము కాకుండ చూచుట
4. ఏదేను తోట ఇద్దరికి 4. నూతన యెరూషలేముపట్నం (పెండ్లి కుమార్తె సంఘము)
5. నరుని పెండ్లి 5. గొఱ్ఱెపిల్ల పెండ్లి
6. సాతాను మారు రూపముతో కనబడుట 6. సాతాను నాశనము
7. దుఃఖము 7. వాటి నివారణ
8. శాపము - శ్రమ 8. వాటి నివారణ
9. నరుడు తోలిబేయబడుట 9. నరుడు చేర్చు కొనబడుట

బైబిలు పండితులు 66 పుస్తకములుగల బైబిలు గ్రంథమును " లోగిలి " తో పోల్చిరి. లోగిలి అనగా దేవనగరము లేదా వాక్యమందిరము. ఈ 66 పుస్తకములు 66 గదులు. ఇది వారి అలంకార రచనాకృతి. ఈ లోగిలి మూడు భాగములుగల శృంగార భవనము అందు ఒకటి.

  1. పాతనిబంధన : దీనిలో 4 వేల సంవత్సరముల చరిత్ర ఉన్నది. ఇందు ప్రభువు రానై యున్నారని ఉన్నది.
  2. క్రొత్త నిభంధన- దీనిలో 100 సంవత్సరముల సంగతి కలదు.
    • (ఎ) ప్రభువు వచ్చియున్నారు
    • (బి) వెళ్ళియున్నారు
    • (సి) తిరిగి వస్తారని ఉన్నది.

క్రొత్తనిబంధనలోని చివరి పుస్తకమైన యూదా పత్రిక ప్రకటన గ్రంథము యొక్క ద్వారమై యున్నది.

Home


యూదా పత్రికలోని విషయములు

  1. మిగుల చిన్న పత్రికగా నుండి ఒక అధ్యాయమేగల దీనిలో అనేక మైన నూతన విషయములు గలవు. క్రీస్తు యొక్క రెండవ రాకడకు ముందు భూమి మీద నున్న సంఘములో నామక క్రైస్తవులు ప్రవేశించి క్రీస్తునకు విరుద్దముగా నుందురు. అందువలన భష్టత్వము కలుగును ఇది మన కాలములో కనబడుచున్నది.

  2. ఇశ్రాయేలీయులు దేవుని ప్రజలు. దేవుడు వారిని ఐగుప్తులో నుండి పంపించి రక్షించెను. అయినను వారు చెడిపోయిరి. ఇట్టి వారు ఇప్పుడు మనలో నున్నారు. మంచి స్థితిలోనికి వచ్చి తుదకు దుస్థితిలోనికి వెళ్ళిపోవువారు నేడును ఉన్నారు. మనము వారితో ఏకీభవింపక జాగ్రత్తగా ఉండవలెను.

  3. దేవదూతలలో కొందరు మంచిస్థితిలో నుండి దిగిపోయిరి అట్టివారిని దేవుడు బంధించెను. వారికి తీర్పు ఉన్నది. దేవదూతలే దుస్థితిలోనికి వెళ్ళినప్పుడు మనము కూడ వెళ్ళుటకు సందు ఉండును గనుక విశ్వాసులు జాగ్రత్తగా ఉండవలెను.

  4. సొదొమ గొమొర్రాల ప్రకటనకు ప్రజలకు లోతు అను నీతి పరుడు ఎంత చెప్పినను విననందున వారు అగ్ని గ్రంథక వశమైరి. ఇది దుస్థితికి ఫలితము. ధర్మ బోధ చెవిని బెట్టక శరీరాను సారముగా నడుచుకొనువారు మన కాలములో కూడా ఉన్నారు. పౌలు వ్రాసినట్టు పిల్లలు తల్లిదండ్రులను ఎదురించుచున్నారు. తల్లిదండ్రులు సంఘ నాయకులను తమ స్వాధీనములో నున్న వారిని సరిగా నడుపుటకు యత్నించవలెను.

  5. కొందరు ప్రభుత్వమును, గొప్పవారిని తృణీకరించుచున్నారు. కొందరు ఇట్టివారు ఇప్పుడును ఉన్నారు. మనము వారి పక్షముగా నుండరాదు.

  6. మిఖాయేలు దూత దేవుని సింహాసనము నొద్ద నున్న ప్రధాన దూత, అంతగొప్పవాడైనను దూషించుట ఎరుగడు మోషే యొక్క శవము తనకు కావలెనని అపవాది అనగా సైతాను వాదించినప్పుడు మిఖాయేలు దూషింపక యెహోవా నిన్ను గద్ధించును గాక! అని పలికెను. కొందరైతే సజ్జనులను దూషించుటకు వెనుక తీయరు. విశ్వాసులు జాగ్రత్త పడవలెను. మోహే మరణ చరిత్ర ద్వితీయోపదేశకాండము 34వ అధ్యాయములో నున్నది. కాని మిఖాయేలు సంగతి లేనేలేదు. ఇన్ని సంవత్సరములు యెన్ని వందల సంవత్సరములకు దేవుడు యూదాకు అది బయలుపరచెను ? మరియు మిఖాయేలు నామ శబ్ధము ఏదనగా యెహోవావంటివారు ఎవరు అనునదియే. (దానియేలు 10: 13, 21, 12: 1) మరియు ఈ మిఖాయేలు దూత సాతానుతో యుద్ధము చేసి అతనిని క్రిందికి పడద్రోసెను అని (ప్రకటన 12: 7) లో ఉన్నది. ఈ సంగతి ఇంకను జరుగ లేదు. సంఘము ఆరోహణము కావలసిన సమయమందు జరుగును. దేవదూతలు సాతానుతో యుద్ధము చేయుదురు వారియెడల మనము ఎంతో కృతజ్ఞులమై యుండవలెను. మిఖాయేలు అను పేరు గలవారున్నారు. అట్టివారు మా దేవునికంటె గొప్పవారు యెవరు లేరని వాదింపవలెను. సైతానుతో యుద్ధము చేయవలెను మరియు ఈ పేరు పాతనిబంధన యూదులు కూడ పెట్టుకొనిరి. సంఖ్యా 13 : 13 1 దినవృ 5: 13; 6: 40; 7:3;8: 16; 12: 20; 27 : 18

  7. కొందరు కయీనువంటివారు నేడును ఉన్నారు. వారు కయీను వలె కొంతకాలము దేవునియొద్ద ఉండి ఆయనసన్నిధిలో నుండి వెళ్ళిపోవుదురు. తమ సహోదరులకు కీడు చేయుదురు.

  8. కొందరు బిలామువంటివారు ఉన్నారు దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులను శపించుమని మోయాబురాజు బిలామును కోరెను. అతడు రాజు గారి వలన గౌరవము పొందకోరి అట్లు చేయుటకురాగా దేవుడు అతని గార్ధభముచేత బుద్ధిచెప్పెను, ఆ పశువు నరవాక్కుతో అతని మీద కోపపడెను. అతడు తన స్వదేశమునకు వెళ్ళిపోయెను. గొప్పవారి వలన గౌరవము, పలుకుబడి కోరుకొని ఈ కాలమందు కూడ కొందరు విశ్వాసులకు కీడు చేయ గోరుచున్నారు. మాటలవలనను, క్రియలవలనను విశ్వాసులకు కీడు చేయు మనస్సు యెవ్వరికి పుట్టునో వారు అట్టి దుష్ట ఆలోచనవలన విసర్జించుకొనవలెను . సంఖ్యాకాండము22, 23, 24 అధ్యాయములు చదువండి.

  9. కోరహు అతని అనుచరులను మోషేను, యెహోవాను అలక్ష్యము చేసినందున వారిని భూమి మ్రింగివేసెను. ఇది కఠినమైన శిక్ష. ఎదిరింపు పాపము ఎంత చెడ్డదో దీని వలన తెలియుచున్నది. దేవుని యేర్పాటులో నున్నవారినిదేవునిని యెదురించువారు ఇప్పుడు కూడ వున్నారు. ఈ గుణము యెవ్వరిలోనికి రాకుండా చూచుకొనవలెను.
  10. భక్తిహీనులకు తీర్పు తీర్చుటకై ప్రభువు వచ్చునని హనోకు ప్రవచించెనని యుదా వ్రాయుచున్నాడు. హనోకు చరిత్ర ఆదికాండము 5వ అధ్యాయములో నున్నది అయితే అక్కడ ఆయన ప్రవచనములేదు. ఇన్ని వందల యేండ్లకు యూదాకు బయలు పడెను.

  11. అంత్యదినములయందు అపహాసకులుందురని యేసు ప్రభువును అపోస్తలును చెప్పిరని యూదా జ్ఞాపకము చేయుచున్నాడు. మనకాలము ఆరోహణ సంఘము యొక్క అంత్యకాలము. ఇప్పుడును అపహాసకులు ఉన్నారు. వారు అనేక విషయములను అపహసించు చున్నారు. ముఖ్యముగా రెండవరాకడ రాదని చెప్పుచున్నారు.

  12. కొందరిని రక్షించుడని విశ్వాసులకు పనిచూపుచున్నాడు.

  13. దేవుడు తన భక్తులను తొట్రిల్లకుండ కాపాడువాడు అని యూదా ధైర్యము చెప్పుచున్నాడు.

  14. పత్రిక అంతములో యూదా యేసుప్రభువు విషయము ప్రస్తావించు చున్నాడు. ఇది మంచి ముగింపు. ఇప్పుడు ప్రకటన మొదటి అధ్యాయములో క్రీస్తుప్రభువు విషయము యోహాను ప్రస్తావించెను గనుక ఇది మంచి ఆరంభము. ఇప్పుడు మనము పెద్ద నగరములోనికి కడవరి గృహమున ప్రవేశించుచున్నాము. దానిలో కడవరి కాలములో జరుగవలసిన సంగతులు గలవు.

Home


3. క్రొత్త నిబంధనలోని ప్రకటన గ్రంథము


ఈ పుస్తకమును చూచిన మర్మముగానున్నది. అనగా బహిరంగ పరచబడలేదు. ఈ పుస్తకములో ఎక్కడ చూచినను, ప్రభువు వచ్చెదరని తెలియుచున్నది.

  1. లోకమంతటిలో యేమి జరుగుచున్నదో
  2. పరలోకములో యేమి జరుగుచున్నదో
  3. పాతాళ లోకములో యేమి జరుగుచున్నదో ఇది తెలియజేయు చున్నది.
  4. ప్రభువు వచ్చి పెండ్లికుమార్తె సంఘమును తీసికొని వెళ్ళునని యున్నది.
  5. సైతాను పనినంతటిని నాశనము చేయునని యున్నది.


బైబిలులో పాతనిబంధన , క్రొత్తనిబంధన; యీ రెండు భాగములలోని సంతులు బాగుగా జరిగినవి. అనగా పూర్తిగా జరిగినవి. మూడవ భాగమై యున్న ప్రకటన గ్రంథములోని సంగతులు త్వరలో జరుగనై యున్నవి. ఇందు 1915 సం||ల సంగతి జరిగినది. అనగా క్రొత్తనిబంధనలో జరిగిన 100 సం||ల సంగతి తరువాత ప్రకటన గ్రంథము బయలు పరచబడినది. కనుక యీ 2015 సం|| నుండి ఆ 100 సంవత్సరములు తీసివేయగా 1915 సం|| ప్రకటన గ్రంథకాలమై యున్నదని తెలియుచున్నది.

ప్రభువా! ప్రకటన గ్రంథ వివరములో కొన్ని జారినా చిక్కే, జేరినా చిక్కే అని దేవదాసు అయ్యగారు అన్నారు. అందుకు ప్రభువు మీరు వివరించిన అట్లు జరుగునుగాని నేను వివరించిన అట్లు జరుగదు అని పలికిరి. అప్పుడు అయ్యగారు ప్రకటన గ్రంథమును వివరించునది నేనుకాదు. ప్రభువా! మీరే అని స్తోత్రముచేసి ప్రారంభించిరి.

ఉదా:-పాదరసమును పట్టుకొనలేరు. జారిపోవును. అట్లే ప్రకటన గ్రంథము దొరుకదు; పసుపు చేతిని రాసుకొన్నయెడల పాదరసము దొరుకును. ప్రకటన గ్రంథ నెరవేర్పు కాలము సమీపించినది గనుక దైవసన్నిధి యందున్న యెడల తెలియబడును. దేవుడు యీ కాలమందు యెక్కువమందికి తెలియపరచుచుండెను. ఈ కాలము చాటించు కాలము అందరకు తెలియజేయు కాలము. ప్రభువు తెలియజేయుచున్నను కొందరు భక్తులు నిరాకరించుచున్నారు. అది అద్భుతమే. ప్రకటన అద్భుతమే.

next Home


Note: (Below content is not from book ప్రకటన గ్రంథ వివరము)

  • రెవ. జె. జాన్ సెల్వరాజ్ అయ్యగారు బైబిలు మిషనుకు దేవుడందించిన వర్తమానములను వెలుగులోనికి తీసికొనివచ్చి ప్రచురించుటలో ఎంతో ప్రయాసపడిరి. ప్రపంచములోని అన్ని భాషలకు తర్జుమా చేయబడుటకు దేవుని ఎంతో ప్రార్థించిరి. కొన్ని పుస్తకములు ఇంగ్లీషులో ట్రాన్సలేట్ అయి మనకు అందుబాటులో ఉండుటకు కారణము వారి ప్రయాసే. (Now language translators are available. We can translate easily with help of one representative from each language).

  • పైన అందించిన "పరిచయము" అను భాగము కుదించబడినది.

  • Latest edition of this book can be obtained from Bethel House, Bible Mission Guntur.

  • This book is getting online in the remembrance of first generation Reverends who dedicated their health, wealth and life for preaching Revelation of God. Some of them are Rev. B. Elisha, Rev. B. Charles, Rev. G. Samuel, Rev. S. Samuel, Rev. T. Sangeetha Rao, Rev. V. Sujeeva Raju, Rev. B. Anuraga Rao, Rev. K. Sabhapathi, Rev. R. Jacob ayyagarlu and P.J. Grasamma garu & all who are in heaven.

  • బైబిలు మహిమ (editor Rev P. Bhushanam ayyagaru) అను మాస పత్రిక ఈ రాకడ వర్తమానములను దశాబ్దములుగా పల్లెటూర్లకు సహితం పంపించుట ద్వారా అనేక ఆది భారత క్రైస్తవులు వధువుగా సిద్దపడి ప్రభువు చెంతను చేర్చబడిరి.

  • చిన్న సాక్ష్యము: ఆది బైబిలు మిషను విశ్వాసులు సంపూర్ణముగా రాకడకు సిద్దపడి, తమ జీవనాధారమమైన ఆస్తులను కూడ ప్రభువు పని కొరకు ఖర్చు పెట్టిరి. వారి పిల్లల భవిష్యత్తును లెక్కచేయక "మేము ప్రభువు పనిలో వున్నాము; ప్రభువు, అయ్యగారు చూసుకుంటారు" అనేవారు. వారిలో మా నాన్నగారైన బరగటి మోషే (ఊరు ఆరికరేవుల ) ఒకరు. ఆయన అనేవారు, బాబు! "ప్రభువు, నేను చూసుకుంటాను" అని చెప్పారని అయ్యగారు నాతో చెప్పారు. నేను ప్రార్థించినా ప్రభువు నాతో అదే చెప్పారు. ఏది ఎమైనా, ఎన్ని శ్రమలొచ్చినా, "అకాశం అగ్గై పోయినా, భూమి బుగ్గై పోయినా" ప్రభువు రాకడ వరకు బైబిలు మిషను ఏర్పాటులోనుండి తొలగను అని చెప్పింఛెవారు. హాయిగా జీవించడానికి సరిపోయే ఆస్థిని ప్రభువు సేవకు ఖర్చు చేసిరి. ప్రభువు సన్నిధినే మీకు ఆస్తిగా ఇస్తున్నాను, దీనిలోనే అన్ని వున్నాయని చెప్పి వెళ్ళిపోయారు. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, తర్వాత దేవుడు మా పట్ల చూపిన ప్రేమ గొప్పది. కాబట్టి మనం ఏమిచ్చి మన పితరులకు కృతజ్ఞత చెప్పాలి? వారు ఇంతగా ప్రేమించిన ఈ బైబిలు మిషను పత్రికలలో ఏముంది అని తరచి చూడగా, ప్రభువు ప్రేమను సంపూర్ణముగా అనుభవించుటకు కావలిసిన మాట, పాట, పద్యము, వాణి, బాణి అన్నీ వున్నాయి. బైబిలు సత్యమును స్పష్టముగా తెలిసికొనుటకు ఎంతో ఉపయోగకరముగా ఉన్నాయి. ఆనాడు పితరులు కరపత్రములు, ప్రసంగముల ప్రింటు కొరకు ప్రయాసపడిరి. ఇప్పుడు ఇంటెర్నెట్, స్మార్ట్ ఫోన్, ఐపాడ్, టాబ్ లే మాద్యమాలు. దేవుడు ఇచ్చిన కృపను బట్టి ఈ పనిలో పాలుపంచుకొనుచున్నాము.

    దేవుని పనిలో ప్రయాసపడిన తల్లి, తండ్రుల పిల్లలను దేవుడు అనాధులుగా వదలడు అను సత్యమునకు సాక్ష్యమిచ్చుటకు మాత్రమే ఈ చిన్న సాక్ష్యము.

    నీవు ఎట్టి శ్రమలగుండా వెళ్ళుచున్నను నిరాశ పడకు, కలత చెందకు, వెరవకు, భీతి దరిచేరనీయకు. వధువు సంఘమునుండి, బైబిలు పని నుండి తొలగకు. మన తండ్రి ఆదరణ కర్తయై యున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు మనలను ఆదరించును గాక! ఆమేన్.