13వ అధ్యాయము - Kingdom of Beast

పరిచయము

కౄరమృగము :
1. దానిస్థలం: సముద్రమునుండి పైకి దాని :



2. వైఖరి:
  • ఎ. 10 కొమ్ములు+ 10 కిరీటములు
  • బి. 7 తలలు+ దేవుని దూషణ పేర్లు
  • 3) సింహాసనమునకు
చిరుతపులి వంటిది
  • ఎ. పాదము ---- ఎలుగు
  • బి. నోరు ---- సిం హము
3. దాని అధికారము : సర్పబల సర్పసింహాసన సర్వాధికారి


4. దాని గాయము :
  • తలలో + దెబ్బ
  • దెబ్బ - మానె




5. ఫలితము: భూజనులందరు
  • ఎ. ఆశ్చర్యపడిరి
  • బి. వెళ్ళిరి: మృగ - వెంట
N.B: నమస్కరించిరి సర్పమునకు
  • సి . చెప్పుకొనిరి
  • ఎ. ఎవరు సాటి?
  • బి. ఎవరు చేయు

6. మృగము: నోరు
  • డంబ - మాటలు దేవుని దూషణ

7. మృగ - అధికారము
  • 42 నెలలు -- అధికార
8. ఫలితము 1 నోరు తెరచె
  • ఎ. దేవుడు దూషింప
  • బి. దూషింప (నామము)
    • ఎ. దేవుడు డేరా (గుడారం)
    • బి. డేరా (గుడారము)
  • సి. పరలోకస్థులు
9. మృగ - అధికారము
  • ఎ. పరిశుద్ధులతో

బి. వారిని
  • యుద్ధము
  • జయము
10. మృగ _ అధికారం
  • ఎ) వంశముపై
  • బి) ప్రజ
  • సి) భాష
  • డి) జన
    N.B: ఫలితము
  • భూవసులందరు
  • = వ్రాయబడనివారు



నమస్కరింతురు
    జీవగ్రంధములో
    • గొర్రెపిల్ల
    • జగదుత్పత్తి నుండి
    • వధింపబడిన
    N.B: చెవిగలవాడు వినుగాక
  • చెరపట్టువాడుగ x చెరలోకి పోవును
  • కత్తిచే చంపువాడు x కత్తిచే
    N.B: పరిశుద్ధుల
  • 1. ఓర్పు
  • 2. విశ్వాసము

మరొక కౄరమృగము :

    స్థలము:- భూమిలోనుండి
  • మృగము _ 10 కొమ్ములు
    • like lammbs రెండు కొమ్ములు (horns)
    చర్యలు :-
  • 1. మాటలాడు( పాము వలె : ఘటసర్పము)
  • 2. అధికార శేష్టలు : మృగ
  • 3. బలవంత పర్చు _ మృగ నమస్కారము
  • 4. సూచన అగ్గి దిగుట ఆకాశము నుండి భూమికి
  • 5. ప్రతిమను చేయండి _మృగ
  • 6. అధికారము _ ప్రతిమ ఎ. మాట్లాడు బి. మొక్కని వారిని చంప సి. ప్రాణమియ్యు
  • 7. బలవంత పర్చె
      అందరు ముద్ర _ వేయవలె
    • ఎ. కొద్దివారు
    • బి. గొప్పవారు
    • సి. ధనికులు
    • డి. దరిద్రులు
    • ఇ. స్వతంత్ర్యులు
    • యఫ్. దాసులు
      • 1) పేరు
      • 2) సంఖ్య

N.B: ఇతరులకు క్రయ విక్రయాధికారము లేదు.

N.B: మృగ సంఖ్య 666 ( = మనిషి పేరు జ్ఞానము)

కౄరమృగము

ఈ అధ్యాయములో ఒక క్రొత్త బొమ్మ కనబడుచున్నది. ఆ బొమ్మ అంతి క్రీస్తు. అంతి క్రీస్తునకును , సైతానుకును సంబంధమున్నది. సైతాను అంత అంటే అంతి క్రీస్తు అంతే. అంతి క్రీస్తు ఎంత అంటే సైతాను కూడా అంతే వీరిరువురు ఒక్కటే ఇప్పటి వరకు సైతాను , అంతిక్రీస్తు వేరు వేరుగా నేర్చుకున్నాము. అయితే ఇప్పుడు దాని లక్షణములన్నియు అంతిక్రీస్తులో కనబడును.

క్రూరమృగము:- సముద్రములో నుండి వచ్చినది క్రూరమృగము ఈ మృగము క్రూరమైనది ఇది సముద్రములో నుండి వచ్చెనని వ్రాయబడి యున్నది సముద్రము అనగా జనసమూహమని అర్ధము అనగా జనాంగములో నుండి వచ్చిన క్రూరమృగము. దాని స్వభావము క్ర్రురమైనది.

క్రూరము:-

  • (1) పెండ్లికుమార్తె వెళ్ళకముందు మగ సంతానము పరలోకమునకు వెళ్ళకమునుపు సైతానుకు క్రూరత్వము కలదు.
  • (2) మగ సంతానము అనగా నికారసైన పెండ్లికుమార్తె సంఘము పైకెత్తబడక మునుపు ఆపుచేయవలెనని సైతాను క్రూరత్వమును కనబరచినది.
  • (3) ఇప్పుడు వచ్చిన అంతిక్రీస్తునకు మరెక్కువ క్రూరత్వము కనబడును.

పది కొమ్ములు ఏడు తలలుగల మృగము:- అంతిక్రీస్తునకు పదికొమ్ములను ఏడు తలలును కలిగి ఉన్నటృలుగా యోహాను చూచెను. అంతిక్రీస్తు తనకుగల కొమ్ములతో పొడుచును. చీల్చును ఇది శక్తికి గుర్తు రెండు కొమ్ములుంటేనే ఎంతో శక్తి కాని పది కొమ్ములుంటే ఇంకా ఎంతో ఎక్కువ శక్తి కలిగినది. అనగా పదిరెట్లు శక్తియు కలిగియున్నది. పరలోకపు వాస్తవ్యులు పరిశోధించి చూచిన అంతిక్రీస్తునకు పది శక్తులు ఉన్నట్లు కనబడెను. దానికి శక్తి అంత గలదు. శక్తియున్నంత మాత్రమున దాని ఇష్టము కుదరదు. దానికి ఒక పరిమితి కలదు. అది

  • (1) కొంతకాలము మట్టుకే. ఆదినుండి హర్మగెద్దోను యుద్ధము వరకు.
  • (2) దాని శక్తికి కొంత పరమితి కలదు.
(3) దాని ఉపాయమునకు కొంత పరిమితి గలదు.

తల:- తల అనగా తెలివి లేక ఉపాయము, ఏడు తలలంటే ఏడు రెట్ల తెలివి దానిశక్తి పదికొమ్ముల వరకు పరిమితి దాని శక్తికి అంతు ఉన్నది. అలాగే దానికి ఏదు తలలు దానికి కూడ పరిమితి ఉన్నది. ఏడు కన్న ఎక్కువ ఇవ్వబడదు. ఆరు తలలు ఎందుకివ్వలేదు? భూలోకములోని పాపాత్ములు సైతాను ఎడల దయకలిగి సైతాను కాలమునకు సందు ఇచ్చుచున్నారు. గనుక ఆదాము మొదలుకొని హర్మగెద్దోను యుద్ధము వరకు అలాగు సైతానుపై భూజనులు దయకలిగి యున్నారు. గనుక సైతానునకు దేవుడు కాలపరిమితి జ్ఞానపరిమితి ఇచ్చియున్నాడు సందు ఉన్నది గనుకనే సైతాను భూజనులను శోధించుటకు దేవుడు సెలవిచ్చెను. మనిషి సందు ఇవ్వటమునుబట్టి సరిపోయినంత దేవుడు దానికి ఉపాయమును ఇచ్చెను.

శోధనలోనికి రానియ్యకుము:- ప్రభువును శోధనలోనికి రానియ్యకుమని పరలోక ప్రార్ధనలో మనము చెప్పుకొనుచున్నాము శోధనలోనికి దేవుడే నడిపించుచున్నాడని దాని అర్ధము కనబడుచున్నది. గాని సాతానునకు శోధించుటకు మానవులు సందు ఇస్తున్నారు గనుక శోధన వచ్చుచున్నది అందుకే శోధనలోనికి తేవద్దు అని ప్రార్ధన చేయుచున్నాము.

వాయు మండలము నుండి సైతాను క్రిందకు పడద్రోయపడెను. అది సర్పము భూలోకమును పాడుచేసినందున దానికి శాపము కలిగెను. మట్టి తినుట అనే శాపము కలిగెను. దాని అనుచరులు కూడ దానితోపాటు మట్టి తినుచున్నారు దేవుడు శపించియున్నాడు గనుక మట్టి తినుచున్నారు. సైతాను నరకములోనికి వెళ్ళును అలాగుననే దాని అనుచరులు కూడ నరకములోనికి వెళ్ళుదురు.

దేవదాసు అయ్యగారు రాజమండ్రిలో ఉన్నప్పుడు చైనా దేశస్థులు కొందరు క్రైస్తవులను హింసించిరి. ఆ హింసలలో ఒక హింస తెలియజేసిరి. యేబదిమంది మిషనరీలను కోర్టు దగ్గరలో నిలువబెట్టి వారిని కత్తితో సొరకాను నరికినట్లు ముక్కలు, ముక్కలుగా నరికిరి. ఆ సంగతి విన్న అయ్యగారు ఒక ప్రార్ధన చేసినరు. ప్రభువా చైనాదేశములోని భక్తులయొక్క రక్తము భూమిమీదపడెను గనుక ఆ స్థలములో, ఆ రక్తము విత్తనమై మొలచి మహిమ సంఘముగా వెలిసె కృప దయచేయుము. ఈ ప్రార్ధన కూటములలోను స్వంత ప్రార్ధనలలోను చేయించినారు. కొంతకలమై పోయిన పిమ్మట అయ్యగారి ప్రార్ధన నెరవేర్పులోనికి వచ్చెను. రక్తము ఒలికింపబడిన ఆ స్థలములో దేవుడు మహిమగల సంఘమును పంటగా రప్పించెను కొంతకాలమునకు మనము నిష్కారణముగా క్రైస్తవులను చంపినను వారేమి చేయలేరు ఇది వారు బైబిలు చదువుకోబట్టి కదా అట్టి సహింపు కలిగియున్నారని చెప్పుకొని బైబిలు సొసైటీ వారికి వారిభాషలో సరిపడునన్ని బైబిళ్ళు ఉన్నవా అని వ్రాసి తెప్పించుకొనిరి. అప్పటికి అచ్చుబడియున్న బైబిళ్ళు అన్నింటిని వారు తెప్పించుకున్నారు. ఇది అయ్యగారు చేసిన ప్రార్ధన కు నెరవేర్పు కనబడినది. వారికి సరిపడునన్ని బైబిళ్ళు బైబిలు సొసైటీవారు సప్లయి చేయలేకపోయిరి గనుక కష్టకాలము పిమ్మట పంటకాలము వచ్చును చనిపోయిన వారు చనిపోయిరి గాని ఉన్నవారివల్ల పంటవచ్చెను. కొంత కాలము ఆ దేశములో నెమ్మది కలిగినదిగాని ఈ మధ్య కష్టములు ఎక్కువై భక్తితగ్గి కఠినత్వము పెరిగిపోయినది. గనుక శ్రమలు ఎక్కువైనవి. ఎంత భయంకరము అనగా సైతానుకును అతని దూతలకును ఏర్పరచిన నరకము లోనికి మీరు కూడ వెళ్ళండి అని ఆ కాలమందు యేసుప్రభువు విశ్వాసులతో అన్న ఆ మాట ఇప్పుడు నెరవేరుచున్నది. గనుక సైతానుకు ఏర్పరచిన మట్టిమనకు తిండి అని చైనా వారు అన్నట్లు ఉన్నది.

"ఆవగింజంత" అను పద్య ప్రకారము నడచుకొన్న యెడల శ్రమలు రావు చిరుపాపమైన లేకుండ నడచుకుంటే శ్రమలో సంతోషము కలుగును ఇప్పుడు వారు ప్రభువు తట్టుకు తిరిగిన యెడల కష్టములు పోవునుగాని తిరుగరు మట్టి అయిన తిందురుగాని ప్రభువుతట్టు తిరుగరు. ప్రకటనలో ఓ భూమి ఓ సముద్రమా నీకు శ్రమలని వ్రాయబడియున్నది. ఓ ఆకాశమా నీకు శ్రమ అని యున్నది. అనగా ఆకాశముమీద ప్రయాణము చేయువారికి శ్రమ. భూమిమీద సముద్రమునీద ప్రయాణము చేయువారికి శ్రమ అని అర్ధము.

Home


సాతానులయొక్క భీతి:

  • (1) సాతానుకు ఎవరంటే భయము
  • (2) సైతానుకు దేనిని చూస్తే భయము.
    • (1) సిలువను చూసిన భయము సిలువ ఆదికాండమునుండి రాకుండ ప్రభువు వచ్చినపుడే క్రొత్త నిబంధనలో వచ్చినది అంతకుముందు మరేమి భయము, లోకములో ఉన్న పుస్తకముల అన్నిటికన్న బైబిలును చూడగానే ఎక్కువ భయము బైబిలు చదివినవారంటే ఇంకా ఎక్కువ భయము.
    • (2) లోకములోని పుస్తకములన్నిటికంటే బైబిలు అంటే ఎంత భయము బైబిలులోని 66 పుస్తకములలో ద్వితీయోపదేశకాండము అంటే అంత భయము. ఎందుకంటే యెసుప్రభువు భూలోకములో శరీరధారిగా ఉన్నప్పుడు సైతానును జయించుటకే ద్వెతీయోపదేశ కాండములోని ప్రవచనము ఎత్తివాని మీద బాణములుగా వేసి ప్రభువు వానిని జయించినారు. గనుక ద్వితీయోపదేశ కాండమంటే అంతభయము
    • (3) పాత నిబంధనలో ద్వెతీయోపదేశకాండమటే ఎంత్తభయమో క్రొత్త నిబంధనలో ప్రకటనా గ్రంధమంటే ఎక్కువ భయము. ప్రకటన గ్రంధము చదివేవారంటే వివరము వినేవారంటే సైతానుకు ఎక్కువ భయము. అందువలన ప్రకటన గ్రంధము చదివే వారికి వినేవారికి ఎక్కువ శ్రమలు గలిగించును. సైతానుకు ఎక్కువ ఎందుకు భయమంటే
      • 1) సాతానుయొక్క అంతము
      • 2) సాతాను యొక్క ప్రయత్నము
      • 3) సాతాను కోరికల అంతము ప్రకటన గ్రంధములో తేటగా వ్రాయబడియున్నది.
      ఈ సంగతి నరులైనవారికి తెలియుట సాతానుకు ఇష్టములేదు. 4) ప్రకటనలోని 12, 13 అధ్యాయములంటే సైతానుకు అది వరకు చెప్పిన భయములన్నిటికంటే మరింత ఎక్కువ భయము. ఎందుకంటే అక్కడనే సైతానును త్రోసివేయబడుట అతని అనుచరుల పని నెరవేరకపోవుట కనబడుచున్నది.

నాయొద్దకు వచ్చువానిని నేనెంత మాత్రమును త్రోసివేయనని ప్రభువు చెప్పెను గదా. ఈ మాటకు వ్యతిరేకమైన పని ఈ అధ్యాయములో సైతానును త్రోసివేసెనని ఉన్నది కదా.

సైతాను ప్రభు యొద్దకు ఎందుకు రాడనగా సిలువ మనుష్యులకే ఏర్పర్చబడెను. నేను వారికంటే ఎక్కువ అని సైతాను విర్రవీగుచున్నది. మనుష్యుల రక్షణ కొరకు ఏర్పరచబడిన సిలువయొద్దకు నేనెందుకు వెళ్ళవలెనని సాతనుయొక్క గర్వము అదినాకు నామూషి, చిన్నతనమని సైతాను అనుకొనును.

ఉదా:- ఒక గొప్ప అధికారి చాపమీద మనతో కూర్చుండుట నామూషి అని అనును గదా! అలాగే నేను మనుష్యులకన్న ఎక్కువ గదా అని సాతానుడు అనుకొని నరుల కొరకు ఏర్పర్చబడిన సిలువ యొద్దకు రాడు.

చైనా దేశములోనున్న మనుష్యులందరి వరుసగా నిలువబెట్టి (డ్రిల్లు వలె) నడుమునకు ఒకే త్రాడు కట్టిన అందరిని నిలువబెట్టిన ఆ త్రాడు లోకము చుట్టూ మూడు మార్లు తిరిగి వచ్చును. అట్టి చైనా దేశములో రాకడ దర్శ్న భక్తులు ఉన్నారు క్రైస్తవులు రాకడ భక్తులు, దర్శన భక్తులు ఆ దేశములో పెద్దగోల జరుగుచున్నప్పటికిని వారి ప్రార్ధన కూటములు నెమ్మదిగానే జరుపుకొనుచున్నారు. అన్యులున్నారు, దుర్జనులు ఉన్నారు, కఠినులు ఉన్నారు గాని పరమ భక్తులు కూడ ఉన్నారు. దేవుని ప్రతిజనాంగములోనుండి తన భక్తులను తయారు చేసికొనుచున్నాడు. ఆ కూటస్థుల యొక్క మాదిరి మనము అవలంభించవలెను. ఎన్ని చిక్కులు ఉన్న కూటములు మానరాదు.

ప్రకటన 13 అ: 2-10 ఈ క్రింద అంతిక్రీస్తుయొక్క వృత్తాంతము కనబడుచున్నది.

  • 1. రూపు రేఖలు ఇందు ఉన్నది.
  • 2. బలము ఉన్నది.
  • 3. పని ఉన్నది.
  • 4. అధికారం ఉన్నది.




అంతి క్రీస్తు యొక్క వర్ణన

ఎఫెసీ 2: 10 కృపచేత రక్షింపబడుటకు మన ప్రక్క విశ్వాసము, దేవుని ప్రక్క కృప ఉన్నది. ఈ రెండింటి వలన రక్షణ ఉన్నది. నరునుకి నేను కృపచేత రక్షింపబడితిననే విశ్వాసముండవలెను. విశ్వాసములోని నిఖారైన విశ్వాసము. ఇంకా రక, రకములైన విశ్వాసములున్నవి యేసు ప్రభువు భూలోకములో ఉన్నప్పుడు తనవద్దకు వచ్చిన ధర్మశాస్త్రోప దేశకునికి అదే చెప్పెను.

  • 1) క్రియవల్ల
  • 2) చందా వల్ల
  • 3) సేవ వల్ల
  • 4) శ్రమ వల్ల
  • 5) ప్రార్ధన వల్ల రక్షింపబడినానని విశ్వాసులు చెప్పకూడదు.
గాని దేవుని కృపచేతనే రక్షింపబడినానని విశ్వాసులు చెప్పకూడదు. గాని దేవుని కృపచేతనే రక్షింపబడినాననే విశ్వాసము ఉండవలెను. మనకు మంచి క్రియలు కుదరవచ్చును గాని మంచి విశ్వాసము కుదురుట కష్టము. మంచి క్రియవల్ల విశ్వాసి రక్షింపబడి నట్లయితే యేసుక్రీస్తు ప్రభువు ఈ పరలోకమునకు నరుడుగా రావలసిన అవసరమేలేదు. మంచి క్రియ వలన రక్షణలేదు గాని బహుమానము ఉండును. ముఖ్యమైనవి మూడు ఉన్నవి.

  • 1. కృప
  • 2. విశ్వాసము
  • 3. మంచి క్రియలు



చిరుపాపములే విశ్వాసిని చెడగొట్టును

విశ్వాసము చెడినది గాని రక్షణ కృప అన్ని వెనుకకుపోవును, చివరకు పెండ్లికుమార్తె వరుస కూడ పోవును. విస్తార పాపమున్నది గాని, చిరుపాపము లేదు. ఎందుకంటే విస్తార పాపమును బట్టి విస్తారమైన కృప ఉండును. కాబట్టి విస్తారమైన కృప ఉండవలెను, నరుడు ఏమి అనును?

దేవుడు నాకు కృప చూపించినందువల్ల నా విశ్వాసము తగ్గిపోయినది అని అందురు. విశ్వాసమును నిలువబెట్టుకొనుట కష్టము. నరునిలో నమ్మిక ఉన్నది. నమ్మక పోయిన మరణ సమయములో నమ్మిక వచ్చును.

  • 1. పెండ్లికుమార్తె వరుస ఉన్నది
  • 2. గురుతులు ఉన్నవి.
  • 3. పెండ్లికుమార్తె సిద్ధపడివెళ్ళిపోనే పోయింది


ఇంకా కొందరు మిగిలి ఉంటారువీరు పెండ్లికుమార్తె వరుస తెలిసిన వారే గాని,
పడిపోయినందువల్ల ఎత్త బడక ఆగిపొయినారు.
Home


అంతిక్రీస్తు రూపు

అంతిక్రీస్తు రూపురేఖలు:-

  • 1) చిరుతపులివలె కనబడుచున్నది.
  • 2) సిం హమువలె కనబడుచున్నది.
  • 3) ఎలుగబంటివలె కనబడుచున్నది.
ఇటువంటివారు వచ్చినప్పుడు పై క్రూర, మృగ గుణములు కనబడును. గర్జన, క్రూరత్వము పట్టుకొని వదలకుండ ఉండువారు ఉందురు.

కొందరు సిం హము, చిరుతపులి, ఎలుగబంటువలె ఉందురు. వీరు నాకు శక్తి ఇవ్వకపోతే ఎలాగు అని దేవునిపైన నేరము మోపుదురు. యూద పశ్చాత్తాపము పడెను గాని, మారుమనస్సు పొందలేదు.

  • 1. చిరుతపులిని చూచి కొందరు మారుమనస్సు పొందుదురు.
  • 2. చిరుతపులిని చూచి పశ్చాత్తాపము పడనివారు శ్రమలను అనుభవించుదురు.
  • 3. చిరుతపులిని చూచి కొందరు ఇదివరకు నిన్నుగూర్చి విన్నాము అని చిరుతపులి ప్రతిమకు మ్రొక్కి నిరాశలోనికి వెళ్ళిపోవుదురు.
అయితే కొందరు ఆ ప్రతిమకు మ్రొక్కక షడ్రక్, మేష్క్, అబద్నెగో, అను వారి గుంపులోనికి వెళ్ళి హత సాక్షులగుదురు. వారికి పరలోకమందు గొప్ప మహిమ ఉండును.

రెండవ గుంపువారి బాధ యేసుక్రీస్తుని గూర్చి విన్న వీరునమ్మవలెనని ఉన్నది. రక్షింపబడవలెనని ఉన్నది. అంతిక్రీస్తునకు మ్రొక్కకూడదని ఉన్నది అంతిక్రీస్తు క్రూరుడు గనుక మ్రొక్కుచున్నాము అని వారు అందురు. ఈలాగు అనువారు ఇప్పుడును కూడ ఉన్నారు.

ఉదా:- త్రాగుడునకు అలవాటుపడినవాడు మానవలెనని ఉన్నా, మానలేక ఉండి నాకు కూడ రక్షణ ఉన్నదని అనుకుంటాడు గాని లేదు. అలాగే ఆకాలమందు ఉన్నవారు మ్రొక్కకూడదని అనుకున్నా మ్రొక్కుదురు. గాని వారికి రక్షణ లేదు

పెండ్లికుమార్తె వరుసలోనికి చేరవలెనన్న మనకాలములో దేవుడు ఎంత కృప అవసరమో అంత కృప ఇచ్చుచున్నాడు. ఈ కృప సమయమును పోగొట్టుకున్న యెడల ఎంత విచారము ఏడేండ్ల మహాశ్రమలలో విచారపడుటకంటే పెండ్లికుమార్తె ఎత్తబడక మునుపే ఆ వరుసలోనికి సిద్ధపడుట మేలు. ఇప్పుడైన పొరబాట్లు దిద్దుకొనే కృప పెండ్లికుమార్తె వరుసకు సిద్ధపడే కృప గుప్,గుప్న వస్తూనే యున్నది ఏడు యేండ్ల శ్రమకాలంలో ఈ కృపనిలిచిపోయి పశ్చాత్తాపడే హృదయమును ఇచ్చుకృప మిగిలియున్నది. గాని ఈ వరుస అప్పుడు ఉండదు.

అంతిక్రీస్తు చాటుగా ఉన్నప్పుడు నేను మ్రొక్కనని మనస్సులో అనుకొని తీరా వాడు ఎదుటకు వచ్చినప్పుడు వానికి మ్రొక్కుదురు. అలాగే కప్పలు, అబద్ద ప్రవక్తకు మ్రొక్కుదురు. వీరు ఎలాగైతే మ్రొక్కనని అనుకొని మ్రొక్కరో అలాగే పెండ్లికుమార్తె వరుసలోనికి వెళ్ళుటకు ఆశ గలిగినవారు శ్రద్ధ కలిగినవారు ఉన్నారు గాని తీరా ప్రభువు వచ్చేసరికి వెళ్ళలేక ఆగిపోవుదురు. ఇదే పదిమంది కన్యకల చరిత్ర ఈ చరిత్ర, మ్రొక్కమని అనుకొని మ్రొక్కినవారి కథవలే ఉన్నది.

ఏడేండ్ల శ్రమకాలంలో అంతిక్రీస్తేకాదు. సైతాను గొప్ప ఆకర్షణకర్త సైతాను కంటెను అబద్ద ప్రవక్తకంటెను అంతిక్రీస్తు గొప్ప ఆకర్ష్ణీయంగా పనిచెయును ఇతని కంటే కప్పలు తక్కువైనను ఎక్కువ ఆకర్షణగల పని చేయును.

ఉదా:- గ్రామములోని ఒక మునుసబ్గారు ఒకరిని పిలిచి పలానా అతనిని పిలుచుకొనిరా అతనిపై కేసు ఉన్నది అని వెట్టికి చెప్పెను. ఆ వెట్టి అతని యొద్దకువెళ్లి, ఏమోయ్ నీమీద కేసు ఉన్నది. ఆర్డర్ అయినది నీవు రావాలని అతని ఇంటి యొద్ద వీధిలో నిలబడి కేకలువేసి చెప్పి అతని రావాలని అతని ఇంటి యొద్ద వీధిలో నిలబడి కేకలువేసి చెప్పి అతని చెవిలో నీవు రావద్దు ఎటైన పారిపో అని చెప్పి మునసబ్గారి ఇంటికి వచ్చి ఫలానా అతడు ఇంట్లో లేడని చెప్పెను. మునసబ్గారు మరియొకనిని పంపగా కేసువున్న అతడు పారిపోవుటకు సిద్ధముగా నుండగా ఈ రెండవ వాడు నీవు తప్పకరా నీవు పారిపోతే నీవు మరింత నేర్స్థుడగుదువు అని చెప్పి నేను ఎలాగో మునస్బ్గార్కి సర్ధి చెప్పెదని మోసగించి ఎవనిపై కేసు ఉన్నదో వానిని మునసబ్గారికి అప్పగించెను. అలాగే పెండ్లికుమార్తె వరుసలో కూడ జరుగును. పై అధికారుల కంటె క్రింద వారే ఎక్కువ ఆకర్షణీయముగా పనిచేయుదురు.

ఒకరు బురద నీటిలో స్నానము చేయకూడదని బోధ విని ఏమి వెర్రి ఏమి వెర్రి ఈ నీటిలో స్నానము చేయుటయా అని చెప్పి అయ్యగారు అక్కా ఉండగానే ఆ బురద నీటిలో మునిగి స్నానము చేసెను. అలాగే మనలనమదరిని మోసగించె కథలు జరగబోవుచున్నవి, వినిన మీ అందరికి అవిశ్వాసము వచ్చును జాగ్రత్త అనేకులు విశ్వాసములో నుండి తప్పిపోవుదురు. జాగ్రత్త ఏడు సంవత్సరముల మహాశ్రంలో మనలను పడవేయుటకు సైతాను, అంతిక్రీస్తు, అబద్ధ ప్రవక్త, కప్పలు కనిపెట్టుకొనియున్నవి. జాగ్రత్త అని చెప్పుచూ ఉన్నాము. ఇప్పుడే ఆ నాలుగింటి పొగరు ముంగుర్తుగా ఉన్నవి. గనుక వాటినుండి, వాటి పనుల నుండి తప్పించుకొనుటకు జాగ్రత్త పడవలయును ఎలాగు తప్పించుకొనవలెను? వారు స్వయముగా రాలేక పోయిన వాటి శక్తి ఇక్కడ పనిచెయుచున్నది.

తప్పించుకొను మార్గమేది :- పై కథలన్నియు విన్నాము గనుక వాటి కథలు, పనులు ఆటలు వచ్చినప్పుడు మాకు ఇవన్నియు ముందుగానే తెలిసిపోయినది గనుక నీకు ఇక్కడ స్థలము లేదని ఎప్పుడైతే మనము అనగలమో అప్పుడే పరలోకమునుండి గొప్ప శక్తి మనకు దొరుకును. రేపే రాగ ఇవన్నియు మాకు ముందుగానే తెలియును అనగా అదే మనకు గొప్ప శక్తి ఆ పరలోకపు శక్తి వెంటనే వచ్చును.

విశ్వాసములోని ఒక రకము: బైబిలు అంతా నమ్ముచూ ఉన్నాము రెండవ రక విశ్వాసము అది ఇది బాగుగా తెలియదు విన్నాము అర్ధమైనది నమ్ముచున్నాము, ఇదేగొప్ప విశ్వాసము. రెండవ రక విశ్వాసులు ఎత్తబడుదురు ఇది ఎక్కువగా పల్లెగ్రామములలో జరుగును. ఒక ముసలివాడు అయ్యా మీరు ప్రార్ధన చేయండి మీరు ప్రార్ధన చేసిన యెడల ప్రభువు విని మోక్షమునకు చేర్చునని నమ్మి కోరును. ఆ విశ్వాసము గొప్పది. విశ్వాసులకంటె జ్ఞానముకూడ గొప్పదే రక, రకములైన మనుష్యులు లోకములో ఉన్నారు.

  • 1. ప్రయాణంలో
  • 2. బజారులో
  • 3. బావులు, పంపులవద్ద



ఈ రరకాల మనుష్యులు దొరుకుదురు.
వీరు పై నాలుగు రకాల వారికి ముంగుర్తులు.

వధువు సంఘము పైకెత్తబడిన పిమ్మట మిగిలిపోయిన వారిని ఏలు నిమిత్తము భూలోకంలోనికి ప్రత్యక్షమైన వారిలో ప్రాముఖ్యముగా ముగ్గురు ఉన్నారు.

  • 1. అంతిక్రీస్తు,
  • 2. అబద్ధ ప్రవక్త
  • 3. కప్పలు
  • 1. అంతిక్రీస్తు = క్రూరమృగము
  • 2. అబద్ధ ప్రవక్త = మృగము
  • 3. కప్పలు = సైతాను
    • 1. వీరు ఈ లోకంలో పరిపాలన చేయునిమిత్తమై ప్రత్యక్షమైనవారు సైతాను కూడ వీరుతో ఉంటే
    • 1. వీరు మోక్షలోకము చూపించగలరు.
  • 2. పెండ్లికుమార్తెను తయారు చేయగలరు.
  • 3. క్రొత్త బైబిలు చూపించగలరు.
  • 4. గొప్ప సహాయకులైన వారిని అనగా దేవదూతలు వంటి వారి సహాయమును చేయగలవారిని చూపించగలవు
  • 5. లోకైక రక్షకుని చూపించగలవు.
  • 6. పరిశుద్ధాత్మ యొక్క పనిని చూపించగలవు.

మనకు త్రిత్వము అనగా దేవుడు ఏర్పాటు చేసిన ప్రకారము తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, బైబిలుసంఘము, మోక్షము పెండ్లికుమార్తె, దేవదూతలు ఏడు ఏండ్లు, మహాశ్రమకాలంలో వాని పరిపాలనలో చూపించగలడు. దేవుని పనికాంటే సైతాను పని అధికముగాను, ఆనందముగాను, ఆకర్షణీయముగాను కనిపించును. వధువు సంఘమునకు సిద్ధపడు ప్రతివాడును ఈ గుర్తులు కనిపెట్టి జాగ్రత్తగా సిద్ధపడవలెను.

  • 1. ఇరుకు మార్గము ఇది జీవమునకు పోవుమార్గము.
  • 2. విశాల మార్గము నాశనమునకు పోవుమార్గము.
  • ఏడేండ్ల పరిపాలన కాలంలో మనకు కనబడునవి అన్నియు పోటీగానే ఉండును.
    • 1. నేటి బైబిలు _ పోటీ బైబిలు
    • 2. నేటి సంఘము _ పోటీ సంఘము
    • 3. నేటి రక్షకుడు _ పోటీ రక్షకుడు

నేటి సంఘములో కనబడుచున్న కార్యములకన్న పోటీ సంఘములో దేవుని కార్యములకు మించిన కార్యములు ముమ్మరముగా జరుగును.

  • 1. తండ్రి -- సైతాను.
  • 2. కుమారుడైన క్రీస్తు -- అంతిక్రీస్తు.
  • 3. పరిశ్ద్ధాత్మ -- అబద్ధ ప్రవక్త.
  • 4. దేవదూతలు -- కప్పలు.
  • 5. సంఘము -- సైతాను సమాజము.
  • 6. క్రీస్తు పరలోకమునుండి భూలోకమునకు అందరి రక్షకుడుగా వచ్చెను దీనికి పోటీగా అంతిక్రీస్తు కూడ వచ్చును. అందరు అతని వెంబడి పోవుదురు.
  • 7. దేవుని సంఘమునకు చక్కని పాటలుండును అయితే సైతాను సంఘములో బూతు పాటలుండును.
  • 8. మనకు సంస్కారము- అక్కడ బలి మాంసము.
  • 9. ఇక్కడ సింహాసనము - అక్కడ సింహాసనముండును.
  • 10. వెలుగు రాజ్యము - చీకటి రాజ్యము.
  • 11. ఇక్కడ బోధ ఉన్నది - అక్కడ బోధ ఉన్నది.
  • 12. ఇక్కడ మోక్షము - అక్కడ నరకము.
    • 1. సాటి ఎవరు (అంతిక్రీస్తుతో)
    • 2. నమస్కారము చేసిరి
    • 3. మృగము వెంట అందరు వెళ్ళుదురు.

ఏసుక్రీస్తు దేవుడు తమ రక్షకుడు కాడని అబద్ధ ప్రవక్త భూజనులకు రుజువులు చేయును పరిశుద్ధాత్ముడు ఈ దినములలో మనకు బోధించునట్లుగా ఆ దినములలో అబద్ధ ప్రవక్త కూడా బోధించును ఈ అంతి క్రీస్తును జయించగలవారు ఎవరని భూజనులందరు వాని వెంట పోవుదురు (ప్రక 13:3) అంతిక్రీస్తు యొక్క శక్తి ఇప్పుడే మనుష్యులలో ఏలుబడి చేయుచున్నది. అంతిక్రీస్తు ఇప్పుడు లోపల ఉండి అనేకులకు తన ఊహాలను పుట్టించును. ఏడు సంవత్సరముల పరిపాలనా కాలములో బహిరంగముగా వచ్చి పని చేయును. అపోస్తులుడైన పౌలు మేము సైతాను తంత్రములను ఎరగని వారము కాము అని అన్నారు. గనుక ఈ దినములలో మనము ఎరిగిన వారమై మసలవలెను.

ప్రకటన మనము నేర్చుకొనుటకు ముఖ్యకారణము సైతాను , అంతిక్రీస్తుల అబద్ధ ప్రవక్తల మాయ తెలిసికొనుటకే వాటి మాయలో చిక్కు కొనకుండునట్లు జాగ్రత్తపడవలెను. ఈ దినములలో బోధకులు ప్రకటన వివరమును తెలియ చేయుచుండగా

  • 1) నేర్చుకొనవలెను.
  • 2) బోధించవలెను.
  • 3) అవలంభించవలెను.
ప్రకటన మనకు బైబిలులో ఉన్నది అది చదువ వలెను. చదివి వివరము తెలియకపోయినను పెండ్లికుమార్తె సంఘమునకు సిద్ధపడగలము. వివరము తెలిసిన మరి ఇంకా మంచిది.

1. అంతిక్రీస్తు గురుతులు:-

  • 1. క్రూరముగా ఉన్నాడు కొమ్ములు గలవాడు అనగా బలము గలవాడు.
  • 2. దేవుని దూషించును సర్వాధికారము గలవాడు కొమ్ములనగా బలము (ఇప్పుడే దాని పొగరు కనబడుచున్నది. మనుష్యులను చంపువారు,, చంపి దాచి పెట్టువారు, దూషించువారు) ఇప్పుడు రాబోయే అంతిక్రీస్తు లక్షణములు కలిగియుండువారు. అప్పుడు అతని వెంబడించుట సుళువు 3. చిరుతపులి పెద్దపులి కంటే కడ్డెయినది. పెద్దపులి మనిషిని చూసిన వెంటనే పైకిరాదు. చిరుతపులి మనిషిని చూసిన వెంటనే మీదికి దుముకును.
  • 4. ఎలుకబంటు వంటి పాదములు ఎలుకబంటి పారిపోదు మనిషి వద్ద ఉండును గట్టిగా పట్టుకొని మనిషిని వదిలిపెట్టదు. దానికి అజ్ఞానము ఉన్నది. ఇలాంటివాడు అంతిక్రీస్తు, చెట్టుతొర్రలో ఎలుకబంటి తన చేయి పెట్టును చీమలు కుట్టగా తొర్రలో నుండి ముడుచుకొని చేయి బయటికి లాగుటకు ప్రయత్నించునుగాని చేయిరాదు గుప్పిలి విప్పి చేయి బయటకు లాగవలెనని జ్ఞానము దానికి లేదు మొండి పట్టు పట్టును ఇదే తిక్కపట్టు. అంతిక్రీస్తు కూడ అలాంటివాడే చిరుతపులి అందముగలది అధికారము గలది గాని హృదయము చెడ్డది. నోరు పెద్దది.
  • 5. సిం హపు నోరువంటి నోరు గలవాడు సిం హమూడవిలో ఎప్పుడు బయటికి రాదుగాని ఎప్పుడెయైన బయటకు వస్తే గుర్తించగానే జంతువులన్ని లోపలికి వెళ్ళిపోవును చీమలు కూడ పుట్టలోనికి వెళ్ళిపోవును అలాగే అంతిక్రీస్తు ఒక్కకేక వేయగానే అందరును మహాప్రభూ అని హడలిపోవుదురు సిం హమువలె గర్జించుచు ఎవరిని మ్రింగుదునా, ఎవరిని పడదోయుదునా అని తిరుగులాడుచున్నాడు. (1 పేతు 5:8) అంతిక్రీస్తు మాటలను ఏమియు చేయలేడు.
  • 6. సాతానుయొక్క సర్వాధికారము అంతిక్రీస్తునకు ఇవ్వవబడెను.
  • 7. అంతిక్రీస్తునకు చావుదెబ్బ తగిలెను అది మానిపోవును దెబ్బ తగలకముందు అంతిక్రీస్తు సింహాసనముపై కిరీటము ధరించి సుఖముగా రాజ్యపరిపాలన చేయునపుడు తగులును. అంతిక్రీస్తు కిరీటము, రాజ్యము శక్తి అన్నియు కలిగినవాడే రాజ్యము చేయునప్పుడు అబద్ధ ప్రవక్త కప్పలు జనసమూహము కోట్లకొలదిగా వాని క్రింద ఉందురు. వీరి సహాయము వలన అంతిక్రీస్తు రాజ్యపరిపాలన కొనసాగించును. తన పరిపాలన క్రింద కోటానుకోట్ల జనసమూహము ఉంటుండగా అక్కడక్కడ నక్షత్రములవంటి కొద్దిమంది భక్తులు కనబడుదురు. అన్యులు ఎక్కువగా ఉందురు ఇప్పుడును క్రైస్తవుల కంటే అన్యులే ఎక్కువగా ఉన్నారు.
అంతిక్రీస్తు రాజ్యము చేయునపుడు రెండు పనులు చేయును.
  • 1) శక్తితో పనిచేయును.
  • 2) భక్తులను హతము చేయును

అనగా నాశనము చేయుటకాదు జన సంఘమునకు బోధ చేసి అంతిక్రీస్తు తట్టుత్రిప్పుదురు. అందరిని చంపనివ్వడు దేవుని కొరకు తగిన వారిని హతసాక్షులుగా చేయును దానికి దేవుడు పరిమితి పెట్టెను గనుక కొందరిని చంపును. అతని రాజ్యము అందముగా నుండును గ్ర్జనవలె నుండును ఏ పని తలంచినను అది నెరవేరును జనులు అబద్ధ ప్రవక్త బోధవిని వాని అనుచరుల బోధవినియు ఆశ్రయమివ్వక భక్తుల మాటవిని దేవుని ఆశ్రయించుదురు గనుక అంతిక్రీస్తు జనాభా తగ్గును అదే గాయము. అంతిక్రీస్తుకు భక్తులు భయపడరు వారు తమ ప్రాణమునైన సమర్పణచేసి ప్రభుని గూర్చిన బోధ చేయుదురు. భక్తులు వెంటనే అంతిక్రీస్తు అనుచరులు ఉండి మీరు అంతిక్రీస్తు విరోధముగాచేయు ఈ పని ఏమిటి మారాజు నకు మీరు భయపడరా అని అనగా వారికి భక్తులైనవారు క్రీస్తును గురించిన బోధ తెలియచేయుదురు. వారు అది విని నమ్మి క్రీస్తువైపునకు మళ్ళుదురు. అదే అంతిక్రీస్తునకు కలిగిన గాయము అప్పుడు అంతిక్రీస్తునకు జంకు కలుగును నేను అందము, బలము జ్ఞానముగలవాడను అయిన నన్ను విడచి క్రీస్తును వెంబడించుచున్నారని తెలిసి అంతిక్రీస్తు రాజ్యము కొంతకూలును.

భక్తులకు ఒక పట్టు ఉండును ప్రాణము పోయిన సరిగాని వారి పట్టు వారు విడువరు. గనుక నక్షత్రమువలె ప్రకాశించుదురు. అంతిక్రీస్తు మాట వింటే నరకము గనుక వారి మాట వినరు అది అంతి క్రీస్తునకు గాయము ప్రభువు యొద్దకు రాకముందు కొందరు ప్రజలు అంతిక్రీస్తు ఎదుట మేము నిన్ను విడువము నీకే నమస్కారము చేయుదమని ప్రమాణము చేసిరి. మీ పాలనలోనే ఉందుమని ప్రజలు అనేకులను మీ తట్టు త్రిప్పుదము అని అనిరి గాని చివరకు బోధకుల బోధ వినగా ప్రభువును వెంబడించిరి అంతిక్రీస్తు తన తల వాల్చినాడు ఇదే గాయము. ఇది మతసంబంధమైన గాయము అప్పుడు అంతిక్రీస్తు లొంగును అంతిక్రీస్తు అనుచరులలో కొందరు భక్తులోనికి వచ్చిరి. వారి అనుచరులలో మరి కొందరు దేవుని తట్టు మళ్ళవలెనని ఆశ ఉన్నది గాని అటూ, ఇటూ ఎందుకని అంతిక్రీస్తు పక్షముగానే యుందురు. అదే గాయము మానడము కొందరు భక్తులు చంపబడగా కుమరము పోయిందని కొందరు అనుకొందురు. ఇది కూడ గాయము మానుటయే ఇప్పుడు కొందరు క్రైస్తవులు అన్యులలోనికి వెళ్ళిపోవుచున్నారు. అది అంతిక్రీస్తునకు గాయము మాంపునటువంటిది ఆ గాయము పూడగానే భూజనులందరు అంతిక్రీస్తును వెంబడింతురు. ఈ పాలనలో భక్తులు కూడ ఉందురు. వీరు అంతిక్రీస్తునకును నమస్కరించిరి. ఇప్పుడు హత్యలు, నాశనము, దుర్మార్గత ఉన్న పెండ్లికుమార్తె కూడ ఉన్నది. భూజనులు అంతిక్రీస్తు, అబద్ధ ప్రవక్త, కప్పలు, సైతాను ఏడు సంవత్సరములు చేయకల్గినంత ఇప్పుడు చేయలేరు.

Home


సైతాను ఆజ్ఞలు

(ప్రక. 13:4) దేవుడు తాను ఏర్పర్చుకున్న ప్రజలైన ఇశ్రాఏలీయులకు పది ఆజ్ఞలను మోషే ద్వారా అనుగ్రహించెను అలాగే సైతాను తన అనుచరులకు పది ఆజ్ఞలను వ్యతిరేకముగా ఇచ్చును.

  • 1వ ఆజ్ఞ మీ దేవుడైన యెహోవాను మ్రొక్కవలెను - సైతానును మ్రొక్క వలెను.
  • 2వ ఆజ్ఞ దేవునినే సేవించ వలెను __ దేవునిని దూషించవలెను.
  • 3వ ఆజ్ఞ విశ్రాంతిని గైకొన వలెను __ అన్ని దినములు ఒక్కటే
  • 4వ ఆజ్ఞ తల్లిదండ్రులకు లోబడవలెను_అక్కర్లేదు.
  • 5వ ఆజ్ఞ నరహత్య చేయరాదు ___ ఎందరినైన చంపవచ్చు.
  • 6వ ఆజ్ఞ వ్యభిచరించవద్దు __ స్త్రీపురుషులు ఇష్టమొచ్చినట్లు ఉండవచ్చు.
  • 7వ ఆజ్ఞ దొంగతనము చేయవద్దు ___ దొంగతనం విస్తారము.
  • ఉదా:- ఒక దొంగవాడు దొంగతనమునకు వచ్చి ఒక స్త్రీ చేతిన ఉన్న బంగారు కడియమును తీయ ప్రయత్నించుచుండగా అన్నయ్యా చెయ్యి నొప్పి పట్టుచున్నది అని అనెను. అప్పుడు ఆ దొంగ ఓ చెలి మీ వదిన బంగారు కడియమును తెమ్మనెను అని దోచుకొనును.

    8వ ఆజ్ఞ అబద్ధ సాక్ష్యము తగదు అన్ని అబద్ధాలే పలుకవలెను.
  • 9వ ఆజ్ఞ ఆశించరాదు__ అన్ని ఆశించవచ్చు.
  • 10వ ఆజ్ఞ పొరుగువాని దేదియు ఆశించరాదు__ అన్ని ఆశించవచ్చు.

భూమి మీద ఒకరిమీద ఒకరికి అన్యాయము జరిగిన ఎడల పంచాయితీ వారు విని తీర్పు తీర్చుదురు. అక్కడ అంతా అన్యాయమే సంఘములో పంచాయితీ రాజ్యములో కోర్టులు ఉన్నవి సంఘములో మతసంబంధమైన పని. రాజ్యములో న్యాయ సంబంధమైన పని ఉండును.

ఉదా:- పోలెండు దేశంలో అందరు క్రైస్తవులే అది చిన్న దేశం పోలీసు వారు అందరు లూథరన్ మిషన్ వారే కూలీలు కూడ క్రైస్తవులే ఆదివారము గుడికిరాని వారిని పోలీసులు శిక్షించెదరు. ఎవరును సాకులు చెప్పకూడదు మనదేశములో అలాంటిదిలేదు. మనదేశములో, అన్నిరాజ్యములలో క్రైస్తవ మతమున్నది పోలెండు రాజ్యములో క్రైస్తవ రాజ్యము క్రైస్తవ మతము ఉన్నది ఆదేశములోని దొరగారు అయ్యగారితో మా దేశంలో క్రైస్తవులు ఇష్టము వచ్చినట్లు చేయుటకు వీలులేదని అన్నారు. సంఘములు రెండున్నవి.

  • 1) రాజ్యసంబంధమైన పని.
  • 2) మతసంబంధమైన పని పోటీ

సంఘమైన అంతిక్రీస్తు రాజ్యములో రాజ్యసంబంధమైన పనికి రాజు అంతిక్రీస్తు, మత సంబంధమైన పనికి అధికారి అబద్ధ ప్రవక్త గౌనువేసికొని అంతిక్రీస్తు బోధ ప్రకారంగా నడువవలెనని బోధించును. అంతిక్రీస్తు ఆజ్ఞ ప్రకారముగా నడువవలెనని ఆ అధికారి ప్రజలను బలవంతము చేయును, పై రెండును మృగములే అబద్ధ ప్రవక్త మతగురువు, శాంతముగా బోధించును అయ్యా అంతిక్రీస్తులోక రక్షకుడు అతనిని నమ్మండి నా మాట వినుడి అని దీనుడై బహునెమ్మదిగా ప్రజలకు నచ్చచెప్పును అటువంటి యుక్తిగల బోధ గలవాడు ఇతడు. భూమిలోనుండి వచ్చినవాడు. అంతిక్రీస్తు సముద్రములో నుండి వచ్చినవాడు. మనకు బైబిలు ఉన్నది గాని అబద్ధ ప్రవక్తకు బైబిలు ఇంకా తయారు కాలేదు. తయారగుచున్నది. పరిశుద్ధ త్రిత్వమునకు ఏ పరిశుద్ధ స్థితియునదో సైతానుకు వాని అనుచరులకు అంత అపవిత్రత పోటీగా నుండును. బైబిలులో ఉన్న వాటన్నిటికి వ్యతిరేకముగా పోటీ బైబిలు వ్రాయుము. మన బైబిలును సైతాను ఎత్తికొని పోవునని ఇదివరకే మనము విన్నాము. అజాగ్రత్తగా ఉన్నయెడల మన బైబిలు సాతాను ఎత్తికొని పోవును. నోవాహు ఓడలో నుండి విడిచిపెట్టిన పావురము ఏలియాకు రిట్టె తెచ్చిన కాకి, బిలాము ఎక్కిన గాడిద రేపు ఇక్కడకు సాక్ష్యము చెప్పుటకు వచ్చును. నోవాహు నావ బైలు పడెను. మోషే కాలంలో అరణ్యములో ఆకాశం నుండి కురిపింపబడిన మన్నా దొరుకును.పూర్వము భక్తులు వ్రాసిన ముఖ్య గ్రంధము లన్నియు దేవుడు భద్రము చేసి యుంచెను గనుక అవి అంత్య దినములలో బయట పడును. అరారాతు కొండ అర్మీనియా దేశంలో ఉన్నది. దీనిపై నోవాహు నావ నిలిచియున్నది. అది నేటి వరకు ఉన్నది. ఆ నావ కనబడినదని వార్తాపత్రికలో వేసియున్నారు అయితే క్రైస్తవులలో అనేకమంది బోధకులు వట్టిదంటున్నారు. ఓడ బయట పడినది గాన అన్నియు బయట పడక తప్పదు. పది ఆజ్ఞల పలకలు, యేసుప్రభువు సిలువవేయబడిన కొయ్య బయలు పడును. దేవుడు తనయొక్క పనిని నిరూపించుకొనును నోవాహు ఓడలోని కోళ్ళగూడు కూడ ఉన్నదని చెప్పుచున్నారు. రష్యా, అమెరికా, జర్మనీ చుట్టుప్రక్కల ఉన్నవారు ఈ ఓడను-చూస్తున్నారు. ఆర్మీనియా దేశమునకు సమీపములో ఇరాన్ అను చిన్న దేశం ఉన్నది. అక్కడ ఇండియా నుండి వెళ్ళినవారు కొందరు ఉన్నారు. దేవాలయం కట్టుకొనిన తెలుగువారు కూడ ఉన్నారు దేవుడు తనయొక్క పనిని రుజువు పర్చుటకు అంత్యదినము వరకు కొన్ని వస్తువులను దాచి విగ్రహములను పూజించిరి అంతిక్రీస్తు కూడ కొన్ని వస్తువులను దాచివుంచి రండి మీ పూర్వీకులు ఈ విగ్రహములను పూజించిరి మీరు కూడ పూజించుడి అని అవిగ్రహములను పెట్టి యెరూషలేము గ్రంధములో దేవాలయములో హేయమైనది పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే కొండలకు పారిపోవుడని ప్రవచించిన రీతిగా హేయ వస్తువులైన విగ్రహములను పరిశుద్ధ స్థలమందు అంతిక్రీస్తు నిలువ బెట్టును.

అబద్ధ ప్రవక్త:- ప్రకటన గ్రంధము 13వ అధ్యాయములో మరియొక కౄర మృగమని అని ఉన్నది ఇతడు అబద్ధ ప్రవక్త గొర్రెపిల్లవలె రెండు కొమ్ములతో వచ్చును గాని అంతరంగము కౄరము మొదటి కౄరమృగమైన అంతిక్రీస్తును మ్రొక్కని వారిని అబద్ధ ప్రవక్త ప్రజలను బలవంతము చేయును దానికి కూడ లొంగని భక్తులను చంపించును. ఘటసర్పమైన సైతానువల్ల అబద్ధ ప్రవక్త అధికారము పొందియున్నాడు. యేసుప్రభువు అయితే బలవంతముగా ఎవరికి బోధ చేయమనలేదు. అబద్ధ ప్రవక్త అయితే అంతిక్రీస్తును గూర్చి బలవంతముగా బోధ చేయించును. సర్వసృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించుడని ప్రభువు ఏ రీతిగ ఆజ్ఞాపించియున్నాడో ఆ రీతిగానే అంతిక్రీస్తు నిమిత్తము అబద్ధ ప్రవక్త కూడ అంతిక్రీస్తును గూర్చి ఇష్టము లేకపోయిన ప్రజలైన వారికి బలవంతమైన బోధ చేయించును.

ఏలియా అగ్ని కురిపించునట్లు అబద్ధ ప్రవక్తయు అగ్ని కురిపించును. అద్భుతములు చేయును.

Home


పోటి ప్రవక్త:

బైబిలు గ్రంధములో మనకు ప్రవక్తలు ఉన్నారు గాన అబద్ధ ప్రవక్త అని వానికి బిరుదువచ్చెను వీడు విగ్రహములను ప్రజల యెదుటనిల్పి విగ్రహముచేత మాటలాడించును చాలమంది నవ్వుదురు వానిని వెంబడింతురు నేటి దినములలో ప్రకటన గ్రంధ వివరణ బాగుగా ఎరిగిన వారు తెలిసికొన్నవారు అతనిని వెంబడింపరు.

గుంపులు:-

  • 1) కొద్దివారు.
  • 2) గొప్పవారు.
  • 3) ధనికులు.
  • 4) దరిద్రులు.
  • 5) స్వతంత్రులు.
  • 6) దాసులు.
ఈ ఆరు గుంపులు వారిని అంతిక్రీస్తు ముద్ర వేసికొన్నట్లు బలవంతము చేయును. ఆకాలమందు రాజుగా తన అధికారమును అంతిక్రీస్తు జరిగించును మతసంబంధమైన అధికార చేష్టలన్నియు అబద్ధ ప్రవక్తకు ఉండును ప్రజలు, రైలు బండ్లు, వార్తా వాణీయులు, వర్తకములు, యంత్రములు అన్ని విధములైన సాధనములు అంతిక్రీస్తు చేతిలో ఉండును క్రీస్తునందు ఉన్న విశ్వాసులను సాధనము అంతి క్రీస్తు చేతిలో ఉండును క్రీస్తునందు ఉన్న విశ్వాసులను బాధించును గాని దేవుడు విశ్వాసులకు అంతిక్రీస్తు అబద్ధ ప్రవక్త, కప్పలకు తెలియని ఆహారము వారికి పెట్టును. యోహాను సువార్త 4వ అధ్యాయములో యేసుప్రభువు మీకు తెలియని ఆహారము నాకున్నదనెను. అయ్యగారు వ్రాసిన నాకేమి కొదువ అనుకీర్తనలో పగవారు సిగ్గుపడు__ జగతి ఎరుగని సౌఖ్యభోజనము మగుపరచునీ __ హ తగినదే పెట్టునో, ఏడేండ్ల శ్రమకాలంలో యేసునందు విశ్వాసము ఉంచువారికి భూప్రజలు ఎరుగని భోజనము దేవుడే వారికి పెట్టునని తెలియుచున్నది.

యేలీయాకు దేవుడు కాకిని పంపి ఆహారమును వడ్డించిన సంగతి ఎజబేలునకు తెలియదు ఏడు సంవ్త్సరముల శ్రమకాలంలో విశ్వాసులైన వారిని దేవుడు విడిచి పెట్టరు.

అంతిక్రీస్తు రాగానే 666 అను సంఖ్య వచ్చును అప్పుడు ఉన్న భక్తులు లోకాధికారులను చూచునపుడు ఈ అంకెగలవాడే అంతిక్రీస్తు అని తెలిసికొనుటకు విధానమున్నది. మనిషి పేరు ఉండును ఆ పేరు మీద అంకెలుండును ఆ అంకెలన్నీ కూడిన యెడల 666 వచ్చును. అ,ఆ,ఇ,ఈ అని తెలుగులో యాభై ఆరు అక్షరములు ఉన్నవి అవి కూడితే మొత్తము వచ్చును. నీరో చక్రవర్తి పేరునకు 666 వచ్చును ప్రతి పేరునకు నెంబరు ఉన్నది త్రయ అను చక్రవర్తి వచ్చినాడు లాటిన్లో ఆ పేరునకు ఉన్న సంఖ్యలను కూడితే ఈ నెంబరు వచ్చును "పోప్లియో" అను క్యాథిలిక్ పోప్ వచ్చును అతని పేరుకు కూడ 666 వచ్చును, ఇతని పేరులో ఉన్న సంఖ్యనుబట్టి ఇతడే అంతిక్రీస్తు అని భూప్రజలు తలంచి వార్తాపత్రికలలో వేసిరి ఇందులో జ్ఞానమున్నదని వాక్యములో నున్నది. ప్రతి పేరునకు అక్షరాలకు గలిగిన సంఖ్యను వేసి వాటిని కూడినపుడు ఈ సంఖ్య వచ్చిన ఎడల అతడే అంతిక్రీస్తు పెండ్లికుమార్తె సంఘము ఎత్తబడి వెళ్ళిపోయిన తరువాత ఎవరి పేరునకు 666 అను సంఖ్య మొత్తము వచ్చునో అతడే అంతిక్రీస్తు.

నేటి దినములలో వస్త్రములపై అగ్గిపెట్టెలపై ఇలాటి నెంబర్లు కనబడుచున్నవి. ఏడు సంవత్సరములలో జరుగుకార్యములకు ఇది ముంగుర్తు అయిఉన్నది. పెండ్లికుమార్తె సంఘము పరమునకు ఎత్తబడిన పిమ్మట వచ్చి నిజమైన సంఖ్య అసలైన 666 సంఖ్య క్రైస్తవులు అనేకులు అంతిక్రీస్తు ఇప్పుడే వచ్చివేసినని నమ్ముచున్నారు.

Home