8వ అధ్యాయము - (Seal for Trumpets)

పరిచయము

  • 1) ఏడవముద్ర విప్పబడెను
  • 2) అరగంట నిశ్శబ్ధము (పరమందు)
  • 3) ఏడుబూరల దూతలు (దేవుని యెదుట)
  • 4) సువర్ణ ధూపర్తిదూత
arrow
arrow
  • సువర్ణ | నిప్పు బలిపీఠము
  • + ను. దూతకు బహుధూప ద్రవ్యములు ఇయ్యబడెను.
పరిశుద్దుల ప్రార్ధనలు ధూప ద్రవ్యములు
    దూతపని:
  • 1) ధూపార్తి తీసుకొనెను
  • 2) నిప్పులతో నింపెను
  • 3) భూమిపై పడవేసెను.
    ఫలితము:
  • 1) ఉరుములు
  • 2) ధ్వనులు
  • 3) భూకంపము
  • 4) మెరుపులు
    7గురు బూరల దూతలు
  • 1) బూరలు
  • 2) ఊదసిద్ధము
  • 1వ దూత ఊదెను
    • 1) ఫలితము:
      • 1. రక్త వడగండ్లు
      • 2. అగ్గి
      • భూమిపై పడెను
    • 2) ఫలితము:
      • 1/3 భూమికాలెను
      • 1/3 చెట్లు, పచ్చగడ్డి కాలెను
  • రెండవదూత
    • 1) ఫలితము:
      • అగ్ని పెద్దకొండ మండు సముద్రము
    • 2) ఫలితము :
      • 1) 1/3 స. రక్తమాయె
      • 2) 1/3 స. జీవరాసులు
      • 3) 1/3 ఓడలు-నాశము
  • మూడవ దూత
      1) ఫలితము :
      • 1) దివిటీ = మాచిపత్రి నక్షత్రము (పెద్ద)
      • 2.a. 1/2 నదులు
      • 2.b. 1/3 నీటిబుగ్గలపై
    • 2) ఫలితము:
      • 1) 1 / 3 నీళ్ళు చేదు
      • 2) అనేకులు +
  • నాల్గవదూత (చీకటి)
      2) ఫలితము :
      • 1) 1/3 సూర్య, చంద్ర, నక్షత్రములు (చీకటి)
      • 2) 1/2 పగలు ప్రకాశింపమి
      • 3) 1/3 రాత్రి-ప్రకాశింపమి
      ఆకాశ పక్షి రాజు (గొప్పస్వరము)
    • 1) ముగ్గురు దూతల బూరలు
    • 1) అయ్యో, అయ్యో, అయ్యో

దృశ్యము ఇప్పుడు పరలోకము

7 గురు దూతలున్నారు 7 బూరలున్నవి

6వ ముద్రకాలములో 4 జీవులున్నవి లేక వీరు నలుగున్నారు. ముద్ర ప్రారంభకాలములో వారు నలుగురు కూర్చుని ఉన్నారు. ఇప్పుడు దూతలు నిలువబడి యున్నారు. జీవులు ప్రార్ధన చేయువారు. దూతలు చాల రకములుగా నున్నారు అందరికి అన్ని పనులున్నవి భూమిమీద కొందరు పరలోకములో కొందరౌ సముద్రము మీద కొందరు, సిం హాసనమువద్ద కొందరౌ యీ రీతిని వీరికి ఎన్నో పనులున్నవి.

వానిలో ముఖ్యమైనపని యేదనగా రక్షణస్వాస్థ్యమును పొందబోవు వారికి సహాయము చేయుదురు. యే విధముగా నైనను వాక్యము వారి మనస్సులోనికి వెళ్ళునఋట్లు వాక్యయంత్రమును త్రిప్పుదురు. వారి పని కనబడదు. ఎందుకనగా వారూ కనబడరు. ఈ యధ్యాయములో ప్రార్ధన కూటమున్నది.

బూరలు అనగా తెర్పులు, శిక్షలు, వీటికిముందు దూతలు ప్రార్ధన చేయవలెను. దానికి కూడ పద్దతి ఉన్నది. ఆ ప్రార్ధనకు ఒక అరగంట సమయము కలదు. ప్రార్ధన అయిన తరువాత బూరలుగాని దానికిముందు కొంత సంగతియున్నది. అది వారు భూమిమీద ఉన్నవారికి మారుమనసు కలిగించు ప్రభువా అని ప్రార్ధించిరి. పిమ్మట శిక్ష ఇదీ ప్రోగ్రాం.

  • 1) నిశ్శబ్దము
  • 2) 7 గురు దూతలు
  • 3) 7 బూరలియ్యబడెను
ఇంకొకదూత బలిపీఠమునొద్ద నిలువబడెను. బలిపీఠము "సెలా" కీర్తనలలో నున్నది. (కీర్తన 59:5 వరకు) భక్తులు కీర్తనపాడి "సెలా" అని ఆగి వీణపాట మానివేయుదురు. ఆ "సెలా" అయిన తరువాత పాడుదురు అనగా ఎందుకు? కొంతసేపు ఆగండి. ఇంతవరకు కొంతపాట అయినది ఇంక కొన్ని పాడకముందు కొంతసేపు ఆగండి. అని అర్ధము.

మొదట శ్రమలు అయినవి. తరువాత శ్రమలు రానైయున్నవి. అవి మొదలు పెట్టకముందు తీర్పు వచ్చుచున్నది గనుక ముందు దేవదూతలు ప్రార్ధన చేసిరి. ఇది ప్రజలమీద కనికరము, ప్రార్ధన, స్తుతి కూడ అరగంట సేపు చేసిరి.పరలోకములో దూతలే బూరలు వాడినప్పుడు మనము వాడకూడదా! మనది సువార్త బూర, వేరొకదూత-ఎవరు? సువర్ణము = పరిశుద్ధము. యే కళంకములేనిది (రక్తము, కట్టెలు, మొదలయినవి లేవు గనుక గత్తరలేదు) అక్కడ పరిశుద్ధుల ప్రార్ధనలు ఉన్నవి. బలిపీఠమునుండి పొగ ప్రర్ధనలతో కలసి దేవుని సన్నిధికి చేరినది. ప్రార్ధనలు అక్కడెందుకున్నవి? నెరవేరినవిగదా? భక్తులనేకులు నేను ఎన్ని ప్రార్ధనలు చేసినను నెరవేరుట లేదు అని అనుచున్నారు అకడ ప్రార్ధనలుచూచి ఇది నా ప్రార్ధ నా ప్రార్ధన అందురు. అక్కడ నెరవేరని ప్రార్ధలుండును. ఆదాము మొదలికొని నెరవేరని వారి ప్రార్ధనలన్నీ అక్కడ ఉండును. ఇప్పుడు దూతవేసిన పొగలో యీ ప్రార్ధనలన్నియు కలిసి దేవుని సన్నిధికిపోవలెను. దేవదూత యెవరు? ఈ దూత ప్రభువే. అందరి ప్రార్ధనలు సిం హాసనము నొద్దకు పోవుటకు కారకుడు ప్రభువే. ఉరుములు = దేవుని ఉగ్రత, ధ్వని, పరలోకపు తీర్పు వినిపించుట, పరలోకపు వెలుగు మీకు కాదు అన్నట్లు పోవుట భూకంపములు = మనుష్యుల నష్టములకు యివి దేవునితీర్పు ఉగ్రత భయంకరత్వమును తెలియజేయును. దూతలకు యెవరయిన నమస్కారము చేసిన యెడల ఒప్పుకొనరు, యెహూషువాకు దూత కనబడ్శినప్పుడు నమస్కారము చేయగా ఒప్పుకొనెను. ఆయన ప్రభువే (యెహూషువ 5: 14) యెహూషువ సేనాధిపతి అని యున్నది ఇక్కడ ప్రభువే ఎందుకనగా వలవేసినది ఆయనే చేపలు పట్టునప్పుడు యోహాను ప్రభువును గురుతుపట్టెను. పేతురుకు తెలిపినట్టు యిక్కడ దూత యేసు ప్రభువని తెలిసికొని విశ్వాసులు సంఘమునకు చెప్పవలెను.

అగ్ని :- అన్యాగ్ని వేసినందున అహరోనుకు మారులు దహింపబడిరి. యోహాను నావెనుకవచ్చు అగ్ని ఆ అగ్ని పరలోకమదున్నది ప్రారధనలు యేవి? ఇతరుల రక్షణ కొరకై చేయబడిన ప్రార్ధనలు భక్తుల ప్రార్ధనలన్నీ ధూపవేదికి నుండి అగ్నివేసి, తాను కలువవలసినది కలిపి పంపెను ఆ కలిపినది యేమిటి? ధూపార్తిని = అనగా ప్రార్ధన పొగ, యజ్ఞవేదిక చేయబడిన వారికొరకు నేను చనిపోయినాను గనుక నెరవేర్పు, భక్తులు ఓ ప్రభువా! నేను వారికొరకు చనిపోయినాను అని ప్రార్ధించలేరు. ప్రభువు ప్రార్ధించెను గనుక పైకివెళ్ళిపోయెను. నెరవేర్పు జరిగెను. ప్రార్ధనలో ఉన్నవారు రక్షింపబడుదురు. మనము అందరికొరకు ప్రార్ధన చేయుచున్నాము గాని అది అందరికి అందుటలేదు. లెక్కచేయని వారికి అందరు లెక్కచేసిన వారికి అందును ఎందుకు? ఈ లోకములో పరిశుద్ధముగా ఉండవలెనని అనుకొన్నవారు ప్రార్ధన లెక్కచేయువారు.

ప్రకటన చదువు వారికొక చిక్కు. అది వీడదీయవలెను. ఏడు ముద్రలు, ఏడు బూరలు ఉన్నవి. యోహాను ముద్రలు ముగించి తరువాత బూరలు తీసి కొనవలసినది గాని అట్లు చేయలేదు. ఆరు ముద్రలు ముగించి రక్షితుల కథ చెప్పి 7ముద్రల సంగతి ఎత్తికొనెను. బూరలు కూడ ముందు 4బూరల సంగతి చెప్పి తరువాత 3 బూరలకు ముందు యింకొక సంగతి చెప్పెను. ఎందుకలా చేసెననగా పరలోకములో అలాగు జరిగెను గనుక అట్లు వ్రాసెను. ఏడు ముద్రల సంగతి పూర్తిగా ముగించండి అని అనవలసినదిగాని అట్లనక తాను చూచినది, జరిగినది కనబడినది వ్రాసెను.

1వ బూర

(8:6) బూర:- వడగండ్లు సాధరణముగా తెల్లగానుండును. మనము తినుటకు, ఆడుకొనుటకును, ఆనందించుటకును వీలుగా నుండును. మంచు వడగండ్లుగా మారి పెద్దవిగానుండి క్రిందికి వచ్చునప్పటికి గోళీలంతగా అగును. ప్రకటనలోని వడగండ్లు మనిషిని కఠినముగా శిక్షించుటకు తెల్లనివి రక్తముగా మారెను. తెల్లనివి ఆనందించి, పట్టుకొని తిందురు. రక్తమైన యెడల అసహ్యించుకొందురు. అగ్ని కూడ పుట్టెను. వద్డగండ్లలో అగ్ని ఎట్లు వచ్చును? చల్లగానున్న వడగండ్లతో వేడిగానున్న అగ్నిపడెను. రెండింటివల్ల శిక్షయే. అగ్ని వడగండ్లు ఉపయోగమైనవే. గాని వాటివల్లనే శిక్ష. వడగండ్ల వలన శరీరమునకు హాని.

3వ భాగము భూమి ఒకభాగము కావలెను గాని రెండు భాగములు ఉండెను. (ఇది కృప) ఒకభాగము శిక్ష. శిక్ష కన్న కృపయే ఎక్కువ

  • 1) చెట్లలో 3వ భాగము కావలెను.
  • 2) పచ్చగడ్డి అంతా కాలిపోయెను.
చలివల్లశిక్ష, వేడివల్ల శిక్ష వడగండ్లు తెల్లగాలేవు. రక్తమువలె నుండెను. తెల్లగాలేవు ఎందుచేత? ఉపాధ్యాయుడు పిల్లలను శిక్షించును. ఆ శిక్షను లెక్కచేయునప్పుడు ఇంకొకచోట కొట్టును. అట్లే చెట్లమీద శిక్షను బట్టి విననందున గడ్డి అంతామాడి పోయెను గడ్డి మాడినందున పశువులు చనిపోయెను. అందువల్ల వెన్న, జున్నుపాలు మొదలగునవి ఉండవు. పాలులేకపోయిన 50సం||లలో అందరు చనిపోదురు. దేవుడు ఆహార పదార్ధముల మీద శిక్షపంపెను. జంతువుల సహాయములేనిచో ఆహారమురాదు చెట్లవల్ల పండ్లు, నీడ, కర్రలు పోవుచున్నవి. చెట్లు, మొక్కలు, పాదులు ఆకుకూరలు, మొదలగునవన్నియు నశించును. ఆహార పదార్ధములకు లోటువచ్చును. పశువులవల్ల కలుగవలసిన ఉపకారములకు లోటువచ్చును. ఉదా:- వరి, జొన్న మొదలయిన ఆహారపదార్ధములు, నాశనము. ప్రస్తుతము మరలతో (ట్రాక్టర్లు) దున్నుచున్నారు. పశువులక్కరలేదు పశువులు లేనందున నరునికి కావలసిన పదార్ధములు లభింపవు. అప్పుడు మనిషి మరాను నడుపలేడు. మూడవ భాగము నాశనముకాగా ఉన్న రెండు భాగములే అందరు తినవలెను. కావలసినవన్ని ఆహార పదార్ధములు దొరుకవు. అదే రేషను దేవుడు పెట్టిన యీ రేషను వచ్చిన నాశనమును చూచి మనిషి దేవునివైపు తిరుగునని ఉద్దేశించును గాని మనిషి దేవుని దూషించుచును ఒకొక్క బూరలో ఎందరు మారుమనస్సు పొందినది వ్రాయవలెను. అయితే యిక్కడ మారుమనస్సు పొందినవారు లేరు గనుక శిక్ష కఠినమగుచున్నది.

Home


2వ బూర

2వ బూర:- సముద్రముమీద కొండపడెను. అందువలన 3వ భాగము రక్తమైనది.

  • 1) చేపలు చచ్చును,
  • 2) ఉప్పురాదు ఇప్పుడు సముద్రము నుండి వచ్చు ఆహరము పైతీర్పు
  • 3) ఓడలు నాశనము,
ఇతరదేశపుసరుకురాదు. మనదేశపు సరుకుపోదు. వ్యాపారముపై శిక్ష సరుకుపై శిక్ష, ఆహారముపై శిక్ష ప్రయాణము మీద శిక్ష ప్రయాణములు ఆగిపోవును. అన్నిటివల్ల నీరసము, అన్నిటివల్ల శిక్షయే. అన్నిటి శక్తులు ఉడిగిపోయినవి. ప్రభువా నా పాపములు క్షమించు అని నరుడు అంటే సరిపోవును గాని అనడు. ఉదా:- మురాబి (మొండి) కుర్రావాడు ఎన్నికొట్టినా తప్పు చెప్పడు అలాగే మురాబి తనము కలిగియుందురు. దేవుడు న్యాయవంతుడు గనుక పాపములకు శిక్ష పంపవలెను. ప్రేమనుబట్టి కృపచూపును శిక్షింపని యెడల కృపను పొందిన వారు (పెండ్లికుమార్తె లేక శ్రమలకు ముందు వెళ్ళినవారు) వారిని శిక్షింప లేరు. గనుక మేము కృపను పొందిన లాభమేమి? అందురు గనుక శిక్షింప వలెను. అప్పుడు శిక్షింపని యెడల రేపు పరలోములో మమ్మును శిక్షించిన మేము ఎట్లు మారుమనస్సు పొందుదుము? అందురు గనుక శిక్ష.

3వ బూర

3వ బూర :- ఇప్పుడు మంచినీళ్ళమీద పడెను. గనుక త్రాగుటకు వీలులేదు.

  • 1) చల్లదనము
  • 2) అగ్ని
  • 3) ఆహారము
ఇవన్నీ మనిషికొరకు చేసెను., అయితే మనిషి వీటన్నిటిని అనుభవించి దేవుని మరచిపోయెను. గనుక వీటన్నిటిని తగ్గించుచుండెను. ఇప్పుడు నీళ్ళను తగ్గించెను దేవుని భక్తులకు చేదునీళ్ళు మంచినీళ్ళుగా మారెను. అయితే వీరికి చేదుగా నుండెను.

Home


4వ బూర

4వ బూర:- 3వ బూర చివరివరకు భూమి, మనిషి, ఇల్లు గృహములోని నన్నిటిని శిక్షించెను. దేవుడు యిప్పుడు అన్నిదీపములను ఆర్పివేసిన మనిషి కుర్చుండుటకు లేచుటకు, లేదు. దేవుడు వెలుగును తీసివేసి అన్ని యిచ్చిన ఏమియు లాభములేదు భూమిమీద శిక్షపై శిక్ష చీకటియే. దేవుడు మనిషికి చూచేశక్తి, గ్రయించేశక్తి, అన్నియుయిచ్చెను. మారుమనస్సు పొందే శక్తిని కూడా యిచ్చెను. మనిషి వాటిని ఉపయోగించుకొననప్పుడు ఏమిలాభము? ఈ బూరలలో శిక్షలున్నవి గాని వ్రాయబడలేదు ఎందుచేత? మారుమనస్సు పొందనిచో మహావిహారము మరియొక కథ కలదు. (13వ వచనములో) పక్షిరాజు ముమ్మారు అయ్యో,అయ్యో,అయ్యో! అనెను ఎందుకనగా మూడు బూరలున్నవి గనుక, 4 బూరల కాలములో శిక్షలున్నవి గాని యింకా మానవులు సహింపలేనంత భయంకరము మూడు బూరలకు ముందు కృపకాలము వచ్చెను. అప్పుడు పక్షిరాజు వచ్చి చెప్పెను.

పక్షిరాజు:- 4జీవులలో గలదా! వారి వంతు అయిపోయినది గాని మరల వచ్చెను. పక్షిరాజు పైకెగిరి ఎక్కడ ఏమి ఉన్నదో చూచును అలాగే పక్షిరాజు యింకా 3 బూరలలోనున్న శ్రమను చూపించును పక్షిరాజు మిక్కిలి ఉన్నతస్థితికి వెళ్ళును. అక్కడనుండి చూచును, అట్లే పెండ్లికుమార్తె భక్తులు భూమిమీద నుండి పైకివెళ్ళి మహిమ సిం హాసనము యొద్దకు వెళ్ళుదురు, పక్షిరాజువలె పైకిచూడగల శక్తి ప్రకటనలోని మర్మములు రాబోవు సంగతులను తెలిసికొనగల స్థితి పెండ్లికుమార్తెకు కలదు.

  • 1) పెండ్లికుమార్తె పైకిపోగలదు
  • 2) పెండ్లికుమార్తె పైనుండి క్రిందికి చూదగలదు,
ఆ పక్షి రాజు ప్రభువుయొక్క దైవత్వమునకు గుర్తు ఆయన ఆరోహణమైనప్పుడు దేనిని పట్టుకొనక పైకి ఎగిరిపోయెను గనుక పక్షిరాజు అట్లే పెండ్లికుమార్తె కూడ ఎగిరిపోవును.

4 సువార్తలలో ప్రభువు యొక్క కథ ఉన్నది గాని యోహాను సువార్తలలో పక్షిరాజు బొమ్మ కలదు. 3 సువార్తలలో ఆయన మనుష్త్వము యోహాను సువార్తలలో ఆయన దైవత్వమున్నది. గనుక పక్షిరాజు పైకి వెళ్ళినట్లు పెండ్లి పెండ్లికుమార్తె పైకివెళ్ళును. ప్రకటనలో పక్షిరాజు ముమ్మారు హేచ్చరికను యిచ్చెను. (Warninig). గనుక మారుమనస్సు పొందవలెను. ఆ పక్షిరాజు గగనములో నుండుట ఎందుకనగా అయ్యో అనుమాట అందరికి వినుబడుటకును, కనబడుటకును.

Home