12వ అధ్యాయము - Women & Son

పరిచయము

    పరలోకమందలి సూచన:
  • స్త్రీ: 1) శరీర = సూర్య
  • 2) పాద = చంద్ర
  • 3) శిర = 12 కిరీటములు
    N.B : ఆమె =
  • 1) గర్భిణి
  • 2) వేదన
  • 3) కేకలు
    రెండవ సూచన: ఘటసర్పము
  • 1) 7 తలలు
  • 2) 10 కొమ్ములు
  • 3) 7 కిరీటములు
  • 4) తోక: 1/3 నక్షత్రము పడవేసె
  • 5) కన్నె: మగశిశువు

N.B : మ్రింగే సర్పము సిద్ధము

మగశిశువు :
  • 1) ఇనుపదండ పాలన చేయును (సర్వజన)
  • 2) దేవునికి
  • 3) సిం హాసనమునకు



కొనిపోబడె
    స్త్రీ:
  • 1) అరణ్యమునకు పారిపోవుట
  • 2) ప్రత్యేక స్థలము
  • 3) పోషణ
  • 4) 1260 దినములు
  • 1. పరలోక యుద్ధము:


    మిఖాయేలు
    • సర్పం
    • దాని దూతలు
  • 2. ఫలితము:
    N.B : సర్ప స్థలము లేదు
    • సర్ప : 1) సర్వలోకమును మోసపర్చేది
    • 2) అపవాది
    • 3) సాతాను
    • 4) ఆదిసర్పం
    N.B : పడత్రోయబడుట
    • 1) సర్పము
    • 2) దూతలు


    భూమిపై
  • 3. పరలోక స్వరము:
      అపవాది :
    • 1) నేరము మోపువాడు
    • 2) సోదరులపై
    • 3) దివారాత్రులు
    • 4) అపవాది
    • 1) రక్షణ
    • 2) శక్తి
    • 3) రాజ్యము
    • 4) అధికారము - క్రీస్తుది
    • 5) సోదరులు



    దేవునిని
    • ఎ. గొర్రెపిల్ల రక్తము
    • బి. తమ సాక్ష్యము


    బట్టి
    • 1) గెల్చిరి
    • 2) ప్రేమింపరు
    • ప్రాణములను
    • అపాయములో
    4. ఫలితము:
    • 1) ఎ. పరలోకము
    • బి. పరలోక నివాసులరా


    ఉత్సహించుడి
    • 1) ఎ. భూమి
    • బి. సముద్రము


    శ్రమ

    5. N.B : ఫలితము:

      అపవాది
    • 1) తెలిసి (కాలం స్వల్పం)
    • 2) కోపించె
    • 3) దిగె
    6. ఫలితము:
    సర్ప
    • ఎ. శిశు
    • బి. స్త్రీని



    హింసించె
    7. ఫలితము:
    • స్త్రీ 1) ఎగిరె
    • 2) పోషణ

    కాలము, కాలములు
    1|2 కాలం
    8. ఫలితము:
    • 1) సర్ప
    • 2) భూమి

    - కక్కి
    - మ్రింగె
    9. ఫలితము:


    సర్ప
    స్త్రీ శేష సంతాన
    • 1) కోపము
    • 2) వెళ్ళి
    • 3) నిల్చె ( తీరమున)
      • 1) దేవుని ఆజ్ఞగైకొనె
      • 2) యేసు సాక్ష్యమిచ్చిరి.

ప్రకటన గ్రంధములో 22 అధ్యాయములున్నవి. ఇందులో 12వ అధ్యాయము తీసి వేరుగా పెట్టవలయును. 22 అధ్యాయములలో ఉన్న సంగతులన్ని ఈ అధ్యాయములో ఉన్నవి. అది క్లుప్తముగా వ్రాయబడి యున్నవి. 13వ అధ్యాయము కూడ 12వ అధ్యాయమునకు అనుబంధించి ఉన్నది. ఈ అధాయాములు చదివిన అంత్యకాల విషయములన్నియు తెలియును. ఈ అధ్యాయములు బాగుగా చదివిన ప్రకటన గ్రంధమంతయు బాగుగా తెలిసికొనగలము. బైబిలులోని 66 పుస్తకములలో ప్రకటన గ్రంధము కఠినమైనది. ప్రకటనలోని 22 అధ్యాములలోనూ 12వ అధ్యాయము కఠినమైనది. ఈ అధ్యాయమును లోకములోని అనేకమంది భక్తులు ముట్టుకొనలేదు. ఎందుకంటే దేవుడు వారికి బయలు పరచలేదు. సమయము రాలేదు గనుక దేవుడు బయలుపరచలేదు. అంతేగాని పూర్వీకులు భక్తిహీనులైనవారనికాదు.

స్త్రీ

ఈ 12వ అధ్యాయములో పరలోకమందు ఒక స్త్రీ ఉన్నది. ఆ స్త్రీ తలమీద కిరీటమున్నది. ఆ కిరీటములో 12 నక్షత్రములున్నవి. ఆమె సూర్యుని ధరించినది. అనగా ఆమె బట్టలు ధరించియున్నది. పాదములక్రింద చంద్రుడు కనబడెను ఇదంతయు ఉప్మాన రీతిగా కనబడుచున్నది. దీని అంతర్భావమేమిటి? పై వాని వివరములు మనము తెలిసికొనవలసియున్నది. దీని అంతర్భావమేమిటి? పై వాని వివరములు మనము తెలిసికొనవలసియున్నది. ఒకరి తర్వాత ఒకరు అర్ధము చెప్పుకొనుచూ పోగా ఆ స్త్రీ కనబడును. ఎవరికి తోచినది వారు చెప్పుకొని పోగా ఆ స్త్రీ కనబడును అనగా రాకడకాలములో కనబడును.

తే|| గీ|| ఆవగింజంత విశ్వాస | మమరియున్న
కొండకదలి సముద్రాన | కూలిపడును
ఆవగింజంత చిరుపాప | మంటియున్న
వధువు సంఘములోనికి | వచ్చుటెట్లు

స్త్రీ అనగా భూమిమీదనున్న క్రైస్తవ సంఘములోని నికారసైన సంఘము అనగా విశ్వాసులలో నికారసైన విశ్వాసులు. వారు పరలోకములో వారి కొరకు సిద్ధపరచిన ఉన్నత స్థలమునకు వరుడైన క్రీస్తు తీసుకొని వెళ్ళు గుంపులోనివారు. ఈ విశ్వాసులు రెండు విధములు

  • 1) నామకార్ధ క్రైస్తవులు.
  • 2) నిజమైన క్రైస్తవులు.
వీరు విశ్వాసులేగాని గొప్ప శ్రమలు రాగా భరించలేనివారు. నిజమయిన వారిలో నిరుకైనవారు గొప్పశ్రమలు భరించువారు. శోధనలు జయించగలరు. వీరినే ప్రభువు మిక్కిలి ఉన్నతమైన స్థలము ఎక్కడో అక్కడికి తీసుకొని వెళ్ళును. ఈ గొప్ప విశ్వాసులు 2) భాగములు.
  • రేప్చర్ (రాకడ) కు ముందు మృతుల గుంపు వీరు వెళ్ళేవారే.
  • 2) రేప్చర్ (రాకడ) లో చావక సజీవులై యుండి ఎత్తబడేవారు వీరే యోహానునకు కనబడిన స్త్రీయై యున్నారు.

  • 1) శ్రమలలో
  • 2) శోధనలలో
  • 3) సేవలో


సామాన్య విశ్వాసులు ఈ మూడు విషయములలో తమ విశ్వాసమును చూపించలేరు. ఎన్నో విషయాలు వారు నేర్చుకున్నారు గాని ఎవరికిని చెప్పకా ఒక మూలన కూర్చున్నారు. అ ట్టివారి వలన ప్రయోజనమేమిమున్నది?

విశ్వాసులయొక్క విశ్వాస ప్రమాణమును బట్టి వరములుండును. విద్యార్ధులు పరీక్షలు వ్రాయగా అందరూ ఒకే విధముగా జయము పొందలేరు. మార్కులు వేరువేరుగా వచ్చును. విశ్వాసులు స్థితి కూడ అంతే. ప్రభువు గ్రుడ్డివానితో నీ నమ్మిక చొప్పున నీకు కలుగును గాక అని చెపెను. అనగా ఎంత నమ్మితే అంత జరుగును. పునరుత్థానమందు ఎవరి వరుసలో వారు లేపబడుదురు. వారు వీరే. (1కొరింథి 15: 23)

  • 1) గొప్ప విశ్వాసులును.
  • 2) రేప్చర్ కొరకు సిద్ధపడిన వారును ఈ స్త్రీయై యున్నారు.
    • 1) మార్పు చెందినవారు,
    • 2) బైబిలు చదివినవారు,
    • 3) పరిశుద్ధాత్మ పొందినవారు.
    • 4) భాషలు మాట్లాడువారు,
    • 5) సేవచేసిన వారు,
    • 6) రోగులను బాగుచేసినవారు,
    • 7) ప్రార్ధించినవారు,
    • 8) చందాలిచ్చినవారు ఇవన్నియు చేసిన రాకడను గూర్చిన వార్త నమ్మని యెడల వీరు ఎత్తబడరు. గాన పరలోకములో వేరే స్థలమునకు వెళ్ళుదురు.
విశ్వాసులుచేయు పనులు:-
  • 1) వాక్యము నమ్ముట
  • 2) బోధించుట
  • 3) బాప్తీస్మము పొందుట
  • 4) ఆత్మను పొందుట
  • 5) అద్భుతములు చేయుట
  • 6) శ్రమలను సహించి రాకడను నమ్ముట మనిషికి అవిశ్వాసముంటే పాపము యొక్క జాబితాలోనికి వెళ్ళును.
విశ్వాసమున్న యెడల విశ్వాసుల వరుసలోనే యుండును. రాకడను గూర్చి నమ్ముట చాలదు, వారు మహోన్నత స్థలములో నుందురు. దేవదాసు అయ్యగారికి వినబడిన ఒక స్వరము, మహా ఆకాశమని
  • 1) ఉన్నతమైన స్థలము.
  • 2) మహోన్నతమైన స్థలము
  • 3) అయ్యగారికి వినబడిన రీతి మహా ఆకాశము.
సూర్యుని ధరించుట:

సూర్యుని ధరించుట అంటే క్రీస్తుని వెంబడించుట, చంద్రుని తన పాదముల క్రింద అనగా విడిచిపెట్టుట, "నీ శత్రువుని నీ పాదపీఠము క్రింద ఉంచు వరకు నీవు నా కుడిపార్శ్వమందు కూర్చుందువు.

వధువు సంఘము జయించెను గనుక కాలుక్రింద ఉన్నది. ఎటువంటి జయము?

  • 1) శరీరము
  • 2) లోకము
  • 3) సైతాను
  • 4) పాపము
  • 5) పాప ఫలితము
  • 6) హెడెస్సు
  • 7) నరకము వీనిని జయించుట అనే పనిచేసెను గనుక స్వీకరించుట అని కనబడుచున్నది. పుచ్చుకొనవలయును.

వధువు సంఘము

  • 1) జయించుట చాలదు
  • 2) పుచ్చుకొనవలయును లక్షణములలో ఒక లక్షణము పుచ్చుకొనుట, ఇవ్వలేకపోయినా సరేకాని పుచ్చుకొన వలయును.
దృష్టాంత:-

సత్వికులు ధ్వనులు వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. ఇవ్వగా పుచ్చుకొనుట కాదుగాని స్వతంత్రించుకొనుట అని ఉన్నది. దీని మనస్సుగలవారు ధన్యులు వరిదే పరలోక రాజ్యము.

  • 1) జయించినది
  • 2) సూర్యుని ధరించినది
  • 3) చంద్రుని ధరించినది
  • 4) పుచ్చుకున్నది గనుక



కిరీటము పొందెను. ఆ కిరీటములో పండ్రెండు నక్షత్రములున్నవి.
ఎందుచేత పండ్రెండు, పదమూడు నక్షత్రాలు ఎందుకు లేవు. ఇవి పెండ్లికుమార్తె వరుసలోని గుంపులకు సాదృశ్యము.
  • 1) పాత నిబంధన గుంపు.
  • 2) క్రొత్త నిబంధన గుంపు ఈ రెండు గుంపులలో తయారైన గుంపే ఈ పండ్రెండు.

నక్షత్రములున్న కిరీటము గలిగిన ఆ స్త్రీకి గుర్తు. పాతనిబంధన ప్రతినిధులు పండెండు మంది ఈ ఇరువది నాలుగురును కలిసి యూదులే. గనుక ఇరువది నాలుగు ఉండవలెను. గాని అలాగు. యూదులు+అన్యులు కలిసి 4వ అధ్యాయంలో ఉన్నారు ఇక్కడ 12అధ్యా||లో యూదులని, అన్యులని భేదము లేదని చెప్పి ఆ పండ్రెండు, ఈ పండ్రెండు కలిపి పండ్రెండు నక్షత్రాలని వేసిరి. పాత నిబంఘనవారు పండ్రెండు గోత్రములు లేక భాగములు. క్రొత్త నిబంధన పండ్రెండు భాగములు అవి ఇవి కలిపిన పండెండే కాని ఇరువది నాలుగు లాలేదు. కాకపోతే గుంపులు లేక భాగములు పెద్దవి అగును. పైడ్లికుమార్తెగా వచ్చిన ఎల్నికజనము గనుక పండెండు నక్షత్రములని వ్రాసిరి. ఈ పండ్రెండు అను సంఖ్యలో యూదులు+అన్యులు కూడ నున్నారు. పండ్రెండు అనునది యూదుల చరిత్రలోని అంకెయే కనుక యోహానుకు అర్ధమయ్యేటటలుగా పండ్రెండు అని తెలిపెను. ఇరువది నలుగురును విడదీస్తే యూదులు పండెండు వచ్చి అన్యుల పండ్రెండులో కలిసెను గనుక ఇరువది నలుగురు పెద్దలైనారు ఇరువది నలుగురు పెద్దలు అని 4వ అధ్యా||. 11వ అధ్యాలలో ఉన్నది.

ప్రసవ వేదన:

పరలోకములో ప్రసవవేదన ఉండునా? లేదుగాని సూచనగా ఉన్నది. 11వ అధ్యా||లో యోనుకు వివరము చెప్పుచూ ఆరవ బూరలలో జరిగే సంగతిని చూపించి ఏడవబూర చెప్పకుండగా యోహానును సంతోషములో పడవేయుటకు దూత, సాక్షులను గురించిచెప్పి తిరిగి ఏడవ బూరలోని భయంకర విషయములను చూపి మరల స్త్రీ ధరించిన అలంకరణ విషయములను చూపి మరల యోహానును సంతోషములో పడవేసి ఇప్పుడు ఇక్కడ స్త్రీ యొద్దకు తెచ్చి ప్రసవ వేదన చూపించెను. భూలోకములో స్త్రీ ఉన్నది. ఆమె గర్భిణి స్త్రీ ప్రసవ వేదనతో ఉన్నది. కలిగిన నొప్పులకు కేకలు వేయుచున్నది. ఈమె ఎవరు?

ఆమె, ఆమె కాకముందు ఉన్న ఈమె అన్నమాట. అనగా ఆ స్త్రీ ఎవరంటే క్రైస్తవసంఘము అనగా

  • 1)నామక
  • 2) విశ్వాసము
  • 3) గొప్ప విశ్వాససులు
ఉన్న సంఘము గర్భవతి అనగా క్రెస్తవ సంఘము. మొట్ట మెదట ఇద్దరులేక ముగ్గురు ఉన్న కూడియున్న సంఘము. మొదటి శిష్యులు ఇద్దరే. వారు అంద్రెయ, పేతురు తర్వాత పండ్రెండుగురు అయినారు. ఆ తరువాత డెబ్బదిమంది అయినారు. ప్రభువు వెళ్ళిపోయిన పిదప మూడువేలమంది చేర్చబడినారు. ఈ స్త్రీ తన గర్భములోనికి మొదట డెబ్బదిమందిని చేర్చుకున్నది. తర్వాత నూట ఇరువది మందిని చేర్చుకున్నది. యింకెందరిని చేర్చుకొనునో, ఎందరిని చేర్చుకున్నా కనబడేది ఒక్కరే. దానినినే సంఘమందురు ఎత్తబడేది ఒక్కరే భూలోకములో క్రైస్తవ సంఘమున్నది. అది అనేకులను చేర్చుకొనుటయే గర్భము. ఆమె మగశిశువును కనును. అది అనేకులను చేర్చుకొనుటయే గర్భము. ఆమె మగశిశువును కనును. (ప్రకటన 12:5)

Home


సంఘము = మగశిశువు = రేప్చర్లో పైకి వెళ్ళిపోయిన శిశువు
కనునట్టి స్త్రీ = సంఘము ఎత్తబడినది శిశువు = వధువు సంఘము
అలంకారముగా స్త్రీ అనియు శిశువు అనియు వ్రాయబడెను.
అన్యులవలన శ్రమలుపడుచూ సంఘము కేకలువేయుచున్నది. చెత్తపోగా మగశిశువు వచ్చును అదే వధువు సంఘము.


చిక్కు:

ఎన్ని శ్రమలు వచ్చినా మగశిశువు తప్పకవచ్చును. భక్తి హెచ్చుకాలమిది. గనుక శ్రమలు కూడ హెచ్చే. సైతాను కనిపెట్టుకొని యున్నాడు. స్త్రీ కనగానే చూచినాడు. మగశిశువు పుట్టినా సైతానుకు కలిగిన శక్తి తగ్గిపోవును గనుక పుట్టని వ్వకుండ చూడవలెననునది సాతాను యత్నము. మగ శిశువు పుట్టగానే సంఘముయొక్క బలము తగ్గిపోవుననునది. సాతాను ముఖ్య ఉద్దేశ్యము. ఒక వేళ మగశిశువు కలిగిన పుట్టిన మగశిశువును మ్రింగివేయవలెననియు పరలోకమునకు వెళ్ళకుండ అడ్డగించవలెనని సాతానుడు కనిపెట్టుచున్నాడు. ఇదే సంఘమునకు కలిగిన ప్రసవవేదన.

  • 1) సాతానుకు తెలియకుండ
  • 2) సంఘమునకు తెలియకుండ
  • 3) దేవదూతలకు తెలియకుండ


ఆ స్త్రీ అనగా సంఘము ప్రసవించెను, వెంతనే వధువు సంఘమయిన ఈ మగశిశువు పరలోకమునకు వెళ్ళిపోయెను.

శిశువు మగశిశువు ఎందుకనవలెను? ఆడపిల్ల అని అనకూడదా? దేవుడు కలుగచేసిన సృష్టిలో పురుషుడు మొదటివాడు పురుషుడు బలమైన వాడు. అవ్వ కూడ పరిశుద్ధురాలే ఉపయోగకరమైనదే. బలమైనదే గాని నికారసైన సరుకు రావలయును గనుక మగశిశువు అని వ్రాయబడెను.

సైతాను శక్తి :

ఏడుతలలు. ఒక తల ఉంటేనే తెలివి. ఏడు తలలుంటే ఇంకా తెలివి. అట్టి తెలివిని అట్టి స్త్రీని ఎక్కువగా చిక్కులు పెట్టగలదు. చెడగొట్టుటకు, పడగొట్టుటకు, శ్రమ పెట్టుటకు ఏడు రకములు తెలివి గలిగిన సైతాను కనబడుచున్నది. పది కొమ్ములున్నవి. కొమ్ము అనగా బలము. పది కొమ్ములనగా గొప్పశక్తి గలిగినటువంటి సైతాను.

7. కిరీటములు:

పరిశుద్ధ త్రిత్వములో పరిశుద్ధ విషయములున్నవి. ఏడు అను సంఖ్య పరిశుద్ధమైన సంఖ్యకు గుర్తు. ఇది బైబిలులో మనకు కనబడుచున్నది. జనులను మోసము చేయుటకు సాతాను కూడ ఏడు అను సంఖ్యను ఏర్పర్చుకొనెను. సైతాను నరులను పాపములో పడవేసి అనేకమందిని హెడెస్సునకు పంపుచున్నాడు. భక్తులు భక్తి హీనులగుచున్నారు. పరిశుద్ధులను చల్లార్చుచున్నాడు. నరులను జయించెను గనుక కిరీటము ఏడు కిరీటములను ధరించియున్నాడు గాన వాని జయము సంపూర్ణమై యున్నది. అయినా మగశిశువును జయించలేక పోయినాడు గనుక వానికి అపజయమే. అపజయము కలిగెను.

సైతానుకు అతని దూతలను ఏర్పరచిన అగ్నిలోనికి పొండి, సైతాను కొరకే యేర్పాటుగాని మనుష్యులకు కాదు. ఇప్పుడునూ జయము కలుగుచున్నది గాన కొమ్మే హెచ్చుగానున్నది.

తోకతో లాగుట:

ఆకాశమందు నక్షత్రములున్నవి. వధువు సంఘమని, పెండ్లికుమార్తె సంఘ కిరీటములో నక్షత్రములునవి. పరలోకములో కోటానుకోట పరిశుద్ధులున్నారు. దానిలో నొకటి లూసీఫరు. సైతాను నక్షత్రమయితే దేవదూతలు కూడ నక్షత్రములే. దేవునిని ఎదిరించినందున దేవదూతల లోకములో నుండి పడవేయబడి నటువంటి సాతానుడు వచ్చియేయుచుండగా కొందరిని లాగుకొని వచ్చివేసినాడు వారు నక్షత్రములు కారు దయ్యములే. పడకమునుపు పడవేయబడిన సాతానువలే వారు కూడ నక్షత్రములే. నక్షత్రములైన ఆ దూతలను సాతానుడు తన తోకలో లాగివేసెను. బలమైన చేతితో మాత్రమే కాక తన తోకతో కూడను సుళువుగా లాగివేసినాడు తోకతో అనగా సుళువుగానని అర్ధమిచ్చునది దేవుడు యోహానుకు మూడు కాలములలోని చరిత్ర చూపించెను.

ప్రకటన 2,3 అధ్యాయములలో ఏడు సంఘముల చరిత్ర ఉన్నది.

ఇనుప దండము:

ఈ ఇనుపదండమెందుకు? చితుక గొట్టుటకు పగులగొట్టుటకు ఈ దండము ఇనుముతో చేయబడినది. ఇనుము అనగా బలమైనది. జయమునకు గుర్తు. వెయ్యేండ్ల పరిపాలనా కాలమప్పుడు యెదిరించిన వారిని శిక్షించుటకు ఈ ఇనుపదండముండును. దండము పగులగొట్టినట్టు వారిని ఇనుప దండముతో చితుక గొట్టును శాంతి పరిపాలనలో కొట్టుట ఎందుకు ? సాతానుడు వెయ్యేండ్ల పరిపాలనలో మట్టు లేని గోతిలో నుండి గోగు, మా గోగులనే అవిశ్వాసులతో కలిసి దేవునిపై యుద్ధమునకు రాగా పరలోకమునుండి అగ్నివచ్చి వారిని దహించివేసెను. కాబట్టి సాతానును వెంబడించిన వారికి శిక్ష నిమిత్తము ఇనుపదండము, కృపను ప్రేమను, ఒప్పుకొననప్పుడు దండన.

సజీవుల తీర్పు:

వెయ్యేండ్ల పరిపాలనా కాలమప్పుడు వాక్యము విన్నవారికి ఉన్నది శాంతి పరిపాలన కాలములోని అధికారము మనకు ఈ కాలములో కూడ ఉన్నది. అంగీకరించని వారి యెదుట నీ పాద ధూళి దుల్పి వేయండని ప్రభువు చెప్పెను. గనుక దేవుని వాక్యమనే ఇనుపదండము వాడుకొనవలెను. అప్పుడు అన్యులు వాక్యమునకు ఆటంకము కలిగించిన ఈ ఇనుపదండమును వాడుకొనవచ్చును. గాని మనకు బైబిలులో ఒక వాక్యమున్నది. ఒక చెంపమీద కొడితే రెండవ చెంప త్రిప్పవలెననునది. అయితే ఇనుపదండము వైపుచూచి వాడుకొనవచ్చును. ఎవరైనా సువార్తికులను శ్రమపెట్టే వారివైపు మిర్రున చూచి ఆకాశమువైపు కండెత్తి ప్రార్ధించినా శత్రువులు పారిపోవుదురు. షాంగు హై పట్టణములో క్రైస్తవులను చంపుచుండగా ప్రార్ధించినపుడు క్రైస్తవులు వారి దేవునితో చెప్పుకొనుచున్నారని శత్రువులు వెళ్ళిపోయిరి. గనుక మనము ప్రార్ధన పవర్ (శక్తి) వాడుకొనవలయును.

Home


యేసుని ప్రభావము

భూమి యంతట నీ నామము ఎంతో ప్రభావము కలది. (కీర్తన8:1)

ప్రార్ధన:

యేసుప్రభువా, నీ నామము ప్రభావము కలది, ఇదివరకు నీ నామ ప్రభావము చూపినావు. ఇప్పుడునూ ఇక్కడ ఉన్న అందరి కష్టములు తొలగింపచేసి నీ నామ ప్రభావము చూపుము. మా నామము ప్రభావము కలదు కాదుగాని నీ నామము ప్రభావము గలది. నీ నామము సంఘములో బయలు కాదుగాని నీ నామము ప్రభావము గలది. నీ నామము సంఘములో బయలు పడినది. నీ నామ ప్రభావమును మౌనముగా ధ్యానించు కృప దయచేయుము. నీ ఆత్మ ద్వారా మమ్మును శుద్ధిచేసి వెలిగించి, బోధించి రక్షించుమని వేడుకొనుచున్నాము. ఆమెన్.

ఈవేళ పండ్రెండు సంగతులు కలిపి చెప్పుచున్నాను మీరు మనస్సు నిలిపి వినండి. ఇదివరలో విన్నామని నిర్లక్ష్యము చేయకండి. ఒక బోర్డు కనబడుచున్నది. ఇక్కడ వ్యాధులు బాగుచేసికొనుటకు వచ్చినవారున్నారు. ఇద్దరును విడదీస్తూ ఉన్నాను.

  • 1) బాగుపడేవారు
  • 2) బాగుపడనివారు
బాగుపడినవారు ముందు, బాగుపడనివారు వెనుక, వీరిని జ్ఞాపకముంచుకొనండి. ఇది బోర్డుమీద ఉన్నది.

1) బోధ:

దేవుడు ఆదిలో మొదట మనకు బంతి భోజనమును యేర్పరచినాడు. పండ్లు, ఆకులు, కూరలు, నీరు మున్నగు ఆహారము పెట్టినారు. ఇవి చూచుటకు ఆకాశములో దీపములు పెట్టినారు. ఇవి లేకపోతే ఆకులు, పండ్లు, వనమూలికలు, నీరు కనబడవు. మనలో దేవుడు జ్ఞానదీపము పెట్టినాడు. ఆ భోజనము పెట్టిన పైన దీపములు పెట్టిన జ్ఞానదీపము లేకపోతే లాభములేదు. లేకపోతే గ్రహించలేదు. దేవుడు మనిషిగా వచ్చి చెప్పవలసినది చెప్పిచేయవలసినది చేసినాడు భోజనము, శరీరము, పండ్లు జ్యోతులు ఇవన్ని ఇచ్చినట్లు తన ప్రాణమును ఇచ్చినాడు.ఆయన ప్రేమ అన్నిటిలో కనబడుచున్నది. ప్రాణమిచ్చుటలో ప్రేమ కనబడుచున్నది. తన రక్తము ధారపోసి ప్రాణమిచ్చినాడు. ఇది అన్నిటికంటే గొప్పది. ఆదాము అవ్వలు పాపము చేసినందున తోటనుండి వెళ్ళగొట్టెను. ఇదివరకు పండ్లు తిన్నారు ఇంకావుంటే తింటారు గాన వెడలు గొట్టెను. ఇంకా చెడిపోదురని వెడలుగ్ప్ట్టెను. అలాగే రేపు క్రీస్తువచ్చి మనలను అనగా భూమి మీద ఉన్న మనలను మేఘములోనికి తీసుకొనివెళ్ళి మోక్షమంతా మనకు ఇచ్చును. లోకము అనే ఈ తోటలో ఇంక మనలను ఉంచరు. జబ్బు, పాపము నేడు ఉన్నది గాన ఇక్కడ ఉంచరు. ఇది బోధ. ఈ బోధ విన్నవారు వెంటనే బాగుపడుదురు. వారిని ముందుకూర్చుండ బెడుదుము, ఆయన తన వాక్కును పంపి బాగుచేసెను. (కీర్తన 107:20) మా బోధ ఆయన వాక్కు గనుక విని బాగుపడితే వారిని ముందు కూర్చుండబెడుదుము.

2) ప్రార్ధన:

బోధ వినగానే ప్రభువు పాపములు పరిహారముచేసి రక్షించి వ్యాధిక్ని బాగుచేసి మోక్షమునకు తీసుకొని వెళ్ళునని ఈ బోధవలన తెలియగానే కొందరి పాపములు, జబ్బులు పోవును. వారిని ముందు భాగమునందు కూర్చుండ బెటుదుము అలాగయితే ప్రభువా నా పాపములు క్షమించి నా వ్యాధి తీసివేసి నాకు మోక్షము దయచేయుమని ప్రార్ధన చేయవచ్చును. ఇట్టి ప్రార్ధన వలన వ్యాధి పరిహారమగును. ఇంకా కొందరు ఎందువల్ల బాగుపడలేదు.

3) ఒప్పుదల:

బోధ వినగానే మనస్సు చెప్పు వినికిడి పాపములు ఒప్పుకొందురు. అన్ని రకములైన పాపములు ఒప్పుకొనవలయును. పాపములు ఒప్పుకొన్నందున వ్యాధి నివారణ అగును. ఇంకా వ్యాధి పోనివారు కూడ ఉందురు.

4) అపనమ్మిక:

పూర్తిగా నమ్ముచున్నారు కొందరు. మనము రెండు నమ్మవలెను.

  • 1) ఈ లోకములో క్రీస్తే నాగతి
  • 2) పరలోకములో క్రీస్తే నా గతి.
మనిషిని, ఇతరులను లేక తమ్మును తామే నమ్ముకొనుట కాదు. క్రీస్తు శరీరాత్మలకు రక్షకుడని నమ్మువారికి వ్యాధిపోవును. బాగుపడినవారు వచ్చి ముందుకూర్చుండవలెను. ఈ నాలుగు విన్నా జబ్బుపోనివారు కొందరు ఉందురు.

5) సాక్ష్యము:

వ్యాధిపోయిన తర్వాత అందరికి చెప్పవలెను. పాపము, వ్యాధి పోయినదనియు యేసే రక్షకుడనియు చెప్పవలెను. ఇలాగు చెప్పగా కొందరి వ్యాధి పోవును. ఇది ఐదవగుంపు.

6) చందా:

కొందరు ప్రభువు వల్ల ఉపకారము పొందుచున్నారు, వారి వ్యాధినివారణ అగుచున్నది. అలాగు వ్యాధి పోయినందున కృతజ్ఞతో కానుకలిస్తున్నారు. దేవుని సేవ జరుగుటకు, పత్రికలు వేయుటకు, బైబిలు అమ్మువారికి బోధకులకు ఇచ్చినందువల్ల బాగుపడుదురు.

7) సేవ:

బాగుపడిన పిదప సక్ష్యము ఇచ్చుట మాత్రమే కాక మీ ఊరిలో మీరు మొదటవిన్న బోధ అంతా ఇతరులకు చెప్పవలెను. యితరులు విని బాగుపడుదురు. అదే సేవ, మీరు బాగుపడుదురు, ఇతరులు బాగుపడుదురు ఇది ఏడవ గుంపు.

  • 1) నోవాహు నావ వచ్చినది.
  • 2) పది ఆజ్ఞల పలకలు వచ్చును.
  • 3) రేపు మన్నా వచ్చును.

మానిషి పాపము చేసెను గనుక భూమి వానిని మ్రింగివేసెను. భూమి దేవునిది గనుక అది మరలా క్రక్కివేయును. ఇవన్నియు పెండ్లికుమార్తె ఆరోహణమునకు గుర్తు. ఇవన్నియు పెండ్లికుమార్తె చూచి వెళ్ళును. చేప చిన్న చిన్న చేపలను మ్రింగి యోనాను క్రక్కివేసినది. అలాగే రేపు భూమికూడ చేయును.

8) బాప్తీస్మము:

దీనినే కొందరు జ్ఞానస్నానమందురు. నీటితో ఇచ్చే స్నానము అప్పుడు ఎవరిలో కలిసినట్లు? అన్యులు బాప్తీస్మము పొందితే ఎవరిలో కలిసినత్లు? క్రైస్తవులలో కలిసినట్లు, మతములో, సంఘములో కలిపినట్లు, స్నానము పొందిన దగ్గరనుండి వారు క్రైస్తవులే. వారికున్న వ్యాధులు పోవును. కొంత మంది బోధకులు నీళ్ళు తలమీద పోయుదురు. అది పైనుండి వచ్చిన నూట ఇరువది మంది మీద వాలిన పరిశుద్ధాత్మునికి గుర్తు. కొందరు బోధకులు ఏటిలో ముంచి బాప్తీస్మము ఇచ్చెదరు. ఇదియైనా పర్వాలేదు. స్నానము పొందినపుడు పాపములు, జబ్బుపోవును కొందరు నామకార్ధముగా జరిగినంచు కొందురు. గాని వారికున్న వ్యాధిపోదు ఎందుకంటే నామకార్ధముగా చేసినారు గనుక వారిలోనున్న పాపము పోలేదు. వారిలోనున్న వ్యాధిపోలేదు. స్నానము చేయగా బాగైనవారు ఎనిమిదవ గుంపు.

9) పరిశుద్ధాత్మ బాప్తీస్మము :

బోధకుడు నీళ్ళతో ఇచ్చేది నీటి బాప్తీస్మము. పరలోకము నుండి ప్రభువిచ్చినది పరిశుద్ధాత్మ బాప్తీస్మము. ఆత్మ మనలోకి రావలెను. అప్పుడు మన ఆత్మ బాగుపడును. విగ్రహము చూడలేదు. నడువలేదు. ఎందుచేతనంటే దానికి ప్రాణములేదు. అలాగే మనలో ఆత్మలేని యెడల జీవములేనట్లే. ఇంకను మనము సరిగ్గా నడువలేము. అవన్నియు మనము నామకార్ధముగా చేయుదుము. అందువలన లాభమేమి? ప్రభువు యెక్కడ బడితే అక్కడ ఉండును. ఎక్కడబడితే అక్కడ పరిశుద్ధాత్మ బాప్తీస్మమిచ్చును. బోధకుడు అన్ని స్థలముల లోనుండలేడు. ప్రభువైతే రాత్రిబవళ్ళు మనవద్ద నుండును. బోధకుడు ఉండలేడు. భోజనము చేసినారా అని అడిగిన భోజనము చేసినమాటేగాని నీళ్ళు త్రాగినామా అనిఅందుమా? కూరవేసికొన్నారా అని అందురా? అనరు. భోజనమంటే అందులో అన్ని ఉన్నవి. అలాగే బాప్తీస్మము కూడ ఒక్కటే. నీటి బాప్తీస్మము+ఆత్మ బాప్తిస్మము ఈ రెండు కలిసిన ఒక్కటే గాని ఇవి రెండు భాగములుగా మనకు కనబడుచున్నవి. ప్రభువు నీటిలో బాప్తీస్మము పొంది వెంటనే ఆత్మ బాప్తీస్మము పొందెను. అన్నము, కూర కలిసినా భోజనము అలాగే నీటి బాప్తీస్మము, పరిశుద్ధాత్మ బాప్తిస్మము రెండు కలిపినా బాప్త్స్మమొక్కటే. ప్రభువు ఒక్కరే. బైబిలు ఒక్కటే. చాలమంది బ్బాప్తీస్మము పొంది పెడదారిన పోవుచున్నారు. ఆత్మస్నానము పొందినవారు అలాగు వెళ్ళలేరు. అట్టివారు బాగుపడుదురు. వారు మరొయొక గుంపు.

10) సంస్కారము:

బాప్తీస్మము పొందినవారు మూడు నెలలకు సంస్కార భోజనము తినమందురు. బోధకుడు రొట్టె యిచ్చుచూ ఇది ప్రభువు శరీరమని మనలోకి వస్తే మనము పరలోకమునకు వెళ్ళగలము. గనుక ఇది సంస్కార బోజనము.

మనిషి స్నానముచేసిన పిదప భోజనము చేయకపోయినా బ్రతుకునా? వేడినీళ్ళలో నలుగుతో స్నానముచేసిన భోజనము లేకపోయినా చనిపోవును. గనుక ప్రభువు శరీరము అవసరమైయున్నది పుట్టుట ఒక్కమారే. అలాగే బాప్తీస్మము ఒక్కమరే. బ్రతికినంత కాలము భోజనము తీసుకొనవలెను. గనుక సంస్కార భోజనము బ్రతికినంతకాలము ఆచరించవలెను. కొందరు బాగుపడరు. వారిలో నామకార్ధము పూర్తిగా ఉన్నందువల్ల.

11) దర్శనము:

ప్రభువు కొందరికి దర్శ్నమిచ్చి దీవించి వ్యాధి తీసివేయును. కొందరికి వ్యాధిపోదు. ఎందుకు పోదనిన ఇది ఒక కల అని వారు తలంతురు. ప్రభువు వచ్చినా? రాలేదు. దీవించినారా? దీవించలేదు. ఇది అంతా కల, ఊహ అని కొందరను కొందురు గనుక వారిలోని వ్యాధి నిలిచియుండును. కొందరు ప్రభువు దీవించిరని నమ్ముదురు గనుక బాగుపడిరి. పదకొండు గుంపుల వారు బాగుపడిరి. కొందరు బాగుపడలేదు. వారు నోరు, నెత్తికొట్టున్నారు. చాపమీద, ఇసుక మీదపడి దొర్లుచున్నారు. దేవా వారిని బాగుచేసినావు నన్ను బాగుచేయలేదు. నీకేమి న్యాయమని అన్నందున దొర్లి దూరమైనారు. దొర్లేదార్లు ఒక ఉపాయము కలవారు, కనిపెట్టినారు, పై పదకొండు అంశములు ఏమీ మాకువద్దు. ఇవన్నీ చూచినాము పొందినాము జబ్బు పోలేదు అని ఊరకుందురు.

12) స్తుతి:

నా పూర్ణ హృదయముతో యెహోవాను స్తుతించెదను. కీర్తన9:1 సంఘము హృదయముతో కాదుగాని పూర్ణ హృదయముతో స్తితించవలెను. ఈ స్తుతి దేవునికి మనిషికి వినబడేటట్లు చేయవలెను. ఓ దేవా, నేను పైనుండు పదకొండు అంశములు నెరవేర్చినాను. నాకున్న జబ్బుపోలేదు. పొయిన వారికి మేలు కలిగినది. నాకు పోలేదు గనుక ఇదియు మేలే, నా జబ్బు తీసివేస్తే అవతల నాకు కీడున్నది గాన నీకిష్టమైనప్పుడు నా వ్యాధి తీసివేయుదువు గనుక నీకు స్తొత్రములు. ఈ వ్యాధి ఇప్పుడు తీసివేస్తే నాకు ఏదో కీదుడ్శున్నది. నాకేదో అది తెలియదు. అది నీకు కనబడుచున్నది గనుక తీసివేయనందుకు నీకు స్తోత్రములు అని స్తుతి చేయవలెను. దేవా నీకు వందనములు అని చెప్పవలెను.

Home


యుద్ధము

మిఖాయేలు సైతాను

దేవునిలోకము:- దైవదూతలలోకము

దేవుని యెదిరించిన లూసిఫర్ ఇపుడు సైతానె మారినదూత వానిని వెంబడించిన ఇతర దూతలను దేవదూతల లోకము నుండి క్రిందకి త్రొయగా వాయుమండలమునకు వచ్చివేసెను. పెండ్లికుమార్తె సంఘము పరలోకానికి (నూతన యెరూషలేమునకు వెళ్ళిపోవలెను) అందరు కలిసి ఉన్నదే పరలోమందును అదే ఆకాశమందుము. వారందరిని వాయుమండల లోకమునకు పంపిరి. ఇదియు ఆకాశములో ఒక భాగము. దేవలోకము, దేవదూతలలోకము, వధువు సంఘము, రక్షితుల లోకము ఇవి అన్నియు ఉన్నది ఆకాశం. ఆఖరిది వాయుమండల లోకము పడద్రొయబడిన సైతాను, విశ్వాసములు వాయుమండల లోకమును ఆక్రమించుకొన్నారు. పరలోకమందున్న మిఖ్ఖాయేలు దూత సాతానుతో యుద్ధము చేయుటకు వాయుమండల లోకమునకు దిగివచ్చెను. మిఖ్ఖాయేలు యొద్ద వెలుగు సంబంధమైన యుద్ధోపకరణములున్నవి (కొరింథి 10:4) సాతానువద్ద చీకటి సంబంధమైన యుద్ధోపకరణములున్నవి (రోమా 13:12) తేజస్సు సంబంధమైన యుద్ధోపకరణములు మిఖాయేలువద్ద ఉండుటవల్ల మిఖాయేలునకే జయము.

స్త్రీ మూడు భాగములు

  • 1) వధువు సంఘము అయిన స్త్రీ.
  • 2) వధువు సంఘములో మిగిలిన వారు.
  • 3) రెండవ గుంపులోని మిగిలిన వారు శేషం.

వధువు సంఘము పరలోకమునకు వెళ్ళగా కొందరు మిగిలినవారు స్త్రీ సంతానము. ఆ మిగిలిన వారిలో రక్షింపబడిన వారు స్త్రీ సంతానము. ఆ స్త్రీ సంతానములో మిగిలినవారు ఇంకా కొందరు ఉండిరి. వారు శేషించిన సంఘము. వధువు సంఘము పరలోకమునకు వెళ్ళిపోగా మిగిలిన వారు మా ప్రభువు మాది తప్పే క్షమించుము అని అన్నవారికి పెండ్లికుమార్తె వరుస వేరు గాని అంతిక్రీస్తు అబద్ధ ప్రవక్త సైతాను ఏడేండ్ల మహాశ్రమకాలము వాని శ్రమ లేకుండా, హానిలేకుండా వేరొక స్థలమందుంచి పోషించెను.

అరణ్యము:- ఏమిలేని స్థలములు. అనగా ఏమి దొరకని స్థలములు అని అర్ధము. అయినను దేవుడు వారిని కాపాడి పోషించెను. ఎంతకాలము? 1260 దినములు అనగా 3 1/2 సం||వారు అక్కడ ఉందురు. ఆ పిమ్మట దేవుడు వారిని ఎక్కడికి తీసుకొని వెళ్ళునో మనకు తెలియదు. మొత్తము శ్రమకాలము 7సం|| ఈ లెక్కలో 3 1/2 సం|| మిగిలియున్నవి. దానియేలు 9: 27లో ఉన్నవి. ఒక కాలము = 1 సం||, కాలములు = 2 సం||లు. అర్ధకాలము = అర్ధసంవత్సరము = 3|2 సం||. కాలములు = 2 సం||రాలని ఎందుకు అనవలెను. 4 సం||రాలని ఎందుకు అనకూడదు. బహువచనము రెండుతో ఆరమ్ణమగ్చున్నది గనుక బహువచనమునకు ముగింపులేదు గనుక రెండే బహువచనములకు ప్రారంభము గనుక 2 సం||లు. దానియేలులో అంతిక్రీస్తు 7 రోజులు పాలించును. ఒక దినము = 1 సం||. 7దినములనగా 7సం||లు. ప్రకటన 12వ అధ్యాయములో 3 1/2 సం|| ఉన్నది. మిగతా 3 1/2 సం||లు దానియేలు గ్రంధములో ఉమ్మవి. ఘటసర్పము భూమి మీదకు త్రోసి వేయబడెను వాయుమండలము పరలోకములో ఒక భాగము గనుక పరలోకమని ఉపయోగించెను.

ఘటసర్పమని అన్నారు. ఎందుచేత? (యూదా 1:6). ఘట సర్పముపరఓకములో మొదట ప్రధానదూతగా ఉండెను. తమ ప్రధానత్వము నిలుపుకొనలేదు గనుక వాయుమండలమునకు త్రొయబడెను. వారు వెలుగును విడిచిపెట్టిరి. వారెక్కడ ఉన్నా కటిక చీకటి ఉండును. ఈ ఘటసర్పము స్ర్వవేషముతో దేవునిచేత పనియైన ఆదాము, అవ్వలను అవ్వ్లను ఏదెను తోటలో మోసపుచ్చెను. మోసపుచ్చినతరువాత ఎక్కడ ఉన్నారు. సాతాను మోసపుచ్చుటకు భూమిపైకి వచ్చెను. వాడు మోసపుచ్చున పిమ్మట దేవుడు వారిని వాయుమండలములో బంధించెను. వానిని, వాని అనుచరులను నిత్యపాశముతో వాయుమండలములో బంధించెను నిత్యపాశముతో అంటే స్వేచ్చ లేని స్థితి. అనగా ఖిదీలో ఉన్నారు, ఇదే శిక్ష, దేవుడు సెలవిస్తే వస్తారు. సాతానుకు అసలే సెలవుండదు. అందుచేతనే దయ్యాలు పట్టుచున్నవి అని అంటారు. అసలివి. అవిరావు మారుమనసు లేని మనుష్యులు చనిపోతే వారు పాతాళములో పడవేయబడుదురు. వారే దయ్యములుగా వస్తారు అసలు బంధింపబడిన పిశాచములు రావు మనుష్యులు తమ హృదయములలో పిశాచి గుణానికి స్థలము ఇచ్చెదరు. గనుక పిశాచములు వారికి సంబంధించిన వారి యొద్దకు వచ్చుటకు వీలున్నది. వారు భూమిమీదకు వచ్చెదరు. అక్కడనుండి పాతాళమునకు, అక్కడినుండి నరకమునకు వెళ్ళెదరు. ఎఫెస్సీ 6:19.

    సాతాను పాతాళమునకు దిగిపోవుట:-
  • 1) దూతల లోకము నుండి
  • 2) వాయుమండల లోకము నుండి
  • 3) భూమిమీదనుండి
  • 4) పాతాళ లోకమునకు
  • 5) ఇంకా పాతాళమునకు వెళ్ళిరి.



ఎఫె 6వ అధ్యాయములో వాయు మండల లోకమని ఉన్నది అదియు గాక అంధకారములో నిత్యపాశములతో పాతాళమును కలిపేవారికి అంధకారరాజ్యము నరులు ఆయా నివాసములకు సిద్ధపడినట్లు సైతానులు కూడా ఆయా స్థలములకు పంపబడు చున్నవి.

ఎఫెసి పత్రికనుబట్టి, యూదాపత్రికనుబట్టి పాతాళలోకములో ఉన్నట్టు ఉన్నది. ఆదాము అవ్వలను మోసముచేసిన తరువాత సైతానులో నున్న నైజము ఆదాము, అవ్వలలోనికి వచ్చెను. అక్కడ నుండి మనుష్యులందరికి వచ్చినది. దేవుడు సైతానును బంధించెను గాని మనుష్యునిలోని సైతాను నైజమును బంధింపలేదు. పిశాచములకు దయ్యములుగా మారిన మనుష్యులైన వారికి తేడా ఏమిటి?

ఉదా:- గ్లాసులో పాలున్నవి. వాటిలో కొంత నీరు, కొంత విషము కలిపిన త్రాగగలమా? ఒక విధముగా పాలు ఆ విషాన్ని మార్చగలదు. కాని ఒక గ్లాసులో అంతా విషముంటే అది త్రాగిన చనిపోదుము. ఆ విషాన్ని మార్చలేము. సైతాను గుణాలు మనిషిలోలీనమై పోయినవి. సైతాను గుణాలు = మనిషి స్వభావము కలిపిన దానిని బాగుచేయగలము అదే దయ్యములను వెళ్ళగొట్టుట.

లూసీఫర్:- అనగా తేజో నక్షత్రము ఇట్టివాడు మారిపోయినందున సర్పమనియు, అపవాది అనియు, అపొల్లోను అనియు అబద్దోము అనియు ద్రాగోను అనియు పేర్లు వచ్చినవి. ఎందుకనగా అతని దుష్ట నైజమునుబట్టి నరుడు అంగీకరించినందుకు ఆ బిరుదువచ్చినది. మత్తయి 4వ అధ్యాయములో అపవాది అని ఉన్నది. ప్రభువు అపవాది అని ఎపుడు అన్నారు నేరములు మోపువాడు గనుక అపవాది అని అన్నారు.

సాదృశ్యము:- ఒకనిలో నేరమున్నది. నేరస్థుడని సాతానుడు చెప్పుచున్నాడు గనుక అపవాది అని ప్రభువు వానికి పేరు పెట్టెను. మనిషి నా మనిషి ఆ మనిషి చెడిన నేనే బాగుచేయవలెను. నీవు అతనిని నైజములో పడవేసినావు. అయినను నీవు అతనిని బాగుచేయలేవు. నేరములు చేయించిన నీవు అతనిమీద నేరము మోపుచున్నావని ప్రభువు సాతానుకు అపవాది అని పేరు పెట్టెను.

అపవాది:- ఉన్ననేరములు మోపువాడు అపవాదికాదు. గాని లేనినేరములు మోపువాడు అపవాది ఇదే లేనిదానిని ఒకరిలో కలిగించి నేరము మోపువాడు అపవాది. ఇదే అపవాది నరులలో కలిగించుచున్నాడు. మనిషి లోపల ఆదాము ,అవ్వల కాలమునుండి నరుడు కాపీ చేసిన నైజము మనలో ఉన్నది. గనుక ఆహ్వానించుచున్నది.

  • 1) నైజము సైతానును కోరుకొనును.
  • 2) నైజము సైతానును యిష్టపడును
  • 3) నైజము సైతానును రానిచ్చుచున్నది.



లోకస్థులందరు ఒకటై ప్రభువా సైతానును మా యొద్దకు రానీయకుము.
వానిని బంధించుమని అర్జీపెడితే సైతానును బంధించును.కొంతమంది ప్రార్ధించిన కొందరికి జయము కలుగును. కొందరు పెండ్లికుమార్తె వరుసనకును, కొందరు రక్షితుల లోకమునకు యుద్ధానంతరము సిద్ధపడుచున్నారు. (10వ వచనం)
  • 1) రాత్రింబగళ్ళు
  • 2) నేరము మోపుట
  • 3) అపవాది
  • 4) మన సహోదరులమీద ( పరలోక వాస్తవ్వులనిరి)
  • 5) మన దేవుని యెదుట

పరలోకములో ఉన్నవారికి మనము సహోదరులము క్రిందకు పడిన వాడు మిగిలిన వారిమీద నేరము మోపును. భక్తునిలో చిన్న లోపమున్న వెంటనే సైతానుడు దేవునియెదుట వానిమీద నేరము మోపును. అది దేవుని కిష్టము లేదు.

సాదృశ్యము:- తండ్రి తన కుమారుని గూర్చి తుంటరి అని అసలైన తుంటరియని అంటే ఆయన కిష్టమో అపవాది నేరము మోపును. ఆ నేరమే భక్తునిలో నుండును. సైతాను గుణములున్న వారిని అచ్చం సైతానువలె ఉన్నాడు అని అందురు. అట్లే ఇది

  • 1) రక్షణ
  • 2) శక్తి
  • 3) రాజ్యము


మనదేవుని ఆయెను పెండ్లికుమార్తె భూమిమీద ఉన్నది రక్షింపబడేవరకు సందేహమే ఎల్లప్పుడు జయించలేరు. గాన శక్తి తగ్గును. రక్షణ వచ్చినది గనుక సాతానుడు నాశనము చేయలేడు.

శక్తి వచ్చినది గనుక అధికారము ఆయనదే గనుక సాతానుడు జయించలేడు. భూలోకములో పాపులున్నారు. పరలోకములో తండ్రి ఉన్నారు. భూలోకములో పరిశుద్ధులెవరైనా ఉంటే తమ్మును తాము రక్షించుకొనగలరు గాని మూడు కాలములలో ఉన్నవారిని రక్షింపలేరు. పరలోకమందున్న దేవదూతలు కూడా రక్షించలేరు. గనుక దేవుడు ప్రభువు లోకమునకు పంపెను. అలాగు పంపబడిన వారికి యేసు అను బిరుదు కలదు. రక్షించుటకు ఆయన యేర్పాటు చేసిన ఆయన గనుక ఆయన క్రీస్తు యేసు మనకు రక్షకుడు.

ప్రభువనగా ఎవరు? యూదులు క్రీస్తువారిని కఠిన ప్రశ్నవేసి జవాబు చెప్పమనిరి. అప్పుడు ప్రభువు నేను ఒక ప్రశ్న వేస్తానన్నారు,దావీదు ప్రభువు నా ప్రభువని అన్నాడు. నా ప్రభువు అనగా క్రీస్తు అని అర్ధము. యేసు అంటే చాలా దూరంగా వెళ్ళేమాట, క్రీస్తు అంటే అభిషిక్తుడని ప్రత్యేకముగా ఒక పని నిమిత్తము యేర్పాటు చేయబడిన వాడనియు అర్ధము. తండ్రి యొక్క రాజ్యయొక్క రాజ్యమందు ఈయన అభిషేకింపబడినవాడు.

యేసునామమే పావనము అను కీరనలో ఈ చరంఅ జ్ఞాపకము చేసికొందాం. భక్తజన లోక పూజ్యములు. రక్త=శిక్ష పాదప్రయోజనములు యుక్తరాజ్యాభి-శిక్తుడౌ సర్వ-శక్తియుతుడైన-స్వామియగు క్రీస్తు.

ముక్తి రాజ్యము రెండు భాగములు దీనమనసు గలవారు ద్ధన్యులు పరలోకరాజ్యము వారిదన్న, దేవుని రాజ్యము పరలోకములో ఉన్నది. పరలోక రాజ్యము భూమిమీదకు వచ్చినపుడు అదే దేవుని రాజ్యము.

యెహెజ్కేలు 4: 5,6 ఇశ్రాయేలీయులు 40 సంవత్సరములు అరణ్యములో ఉన్నారు. ఇది నిజముగా 40 దినముల ప్రయాణమే యెహెజ్కేలు గ్రంధములో దేవుడు ఒక సంవత్సరము ఒక దినమని లెక్క చెప్పెను. ప్రవక్తల గణిత శాస్త్రములో ఒక దినమని ఎక్కడ వ్రాయబడి ఉన్నదో అది ఒక సం||మని అనుకొనవలెను. నాలుగు దినములు అనగా 4 సం||రాలు అని తలంచవలెను.

దానియేలు గ్రంధములో 9వ అధ్యాయంలో ఇదియే భావమున్నది ఒకవారము అనగా 7 సం||లని ఉన్నది. దాని 9:27లో అంతిక్రీస్తును గూర్చి వ్రాయబడి ఉన్నది. అంతిక్రీస్తు కాలము ఒకవారము ఒకవారమనగా 7దినములు అని అర్ధము ఏడు దినములనగా ఏడు సం||లని అర్ధము. అనగా అంతిక్రీస్తు ఏడు సం||లు పాలించును. ఒక నిబంధన అనేకులకు స్థిరపరచును 7సం||లలో యూదులును అన్యులును రక్షింపబడుదురు. ఎక్కువ మంది అన్యులైనవారు ఉన్నారు. యూదులలో నూటనలుబది నాలుగువేలమంది రక్షింపబడితే అన్యులలో కోటానుకోట్ల మంది రక్షింపబడుదురు. అంతిక్రీస్తు అనేకులైన యూదులతో నిబంధన ఏర్పరచును. ఈ పత్రములో యూదులారా మీరు దేవుని బిడ్డలని చెప్పుచున్నారు. నేను 7సం||లు ఈ భూలోకమును పరిపాలించ బోవుచున్నాను. మీరు నా పక్షముగా ఉంటే నేను మీకు సహాయము చేయుదును.లేనియెడల మిమ్మును హింసించుదునని బాహాటముగా వారితో చెప్పును. ఈ నిబంధనలు రెండు ఉన్నవి.

  • 1) నేను మీ జోలికిరాను
  • 2) అవసరమైనపుడు నేను మీకు సహాయము చేయుదును
ఇదే నిబంధన ఇది బైబిలులో వాడబడిన మాటయే పాత ఒడంబిక, క్రొత్త ఒడంబడిక నిబంధన-అన్నా ఒడంబడిక-అన్నా ఒకటే పాతనిబంధన క్రొత్త నిబంధన అని అర్ధము

సాదృశ్యము:- ఇల్లు అద్దికి ఇచ్చేటప్పుడు నెల నెలకు ఇచ్చేది అద్దె ఇది ఒడంబడిక అయితే కాస్త ఆగుదును.

అర్ధవారము:- అనగా మూడున్నర సం||లు యూదులు అంతిక్రీస్తునకు తోడ్పడునందువల్ల అంతిక్రీస్తు మూడున్నర సం||లు కనిపెట్టి వారిపె పగపట్టును. యూదులైన వారు మత సంబంధమైన మనుష్యులు అన్యులు మతము లేనివారు గనుక ఒకరిని హింసించుటలో ఏకీభవించవలసి వచ్చినపుడు ఏకీభవించలేరు. అందునుబట్టి అంతిక్రీస్తు యూదులపై పగ బూనును అందును బట్టి అంతిక్రీస్తు యూదుల బలిని నైవేధ్యమును నివారణ చేయక ఉండెను యూదులకు మతములో గొప్ప పని ఏమిటంటే బలి బలి బల్యైతే అంతా అయినట్లే ఎందుచేతనంటే, మేము పాపము చేసినందువల్ల మా పాపమును బట్టి బలి చేయవలసినది గాని మమ్మును క్షమించి మాకు బదులుగా ఎడ్లను బలి వేయవలసి వచ్చినది. దేవుని మాట ప్రకారము వారు బలిని ఆపు చేయలేదు.

సాదృశ్యము:- కుమారుడు చావు దశలో ఉండగా నీ కుమారునికి ఫరవాలేదు ఆయనకు బదులు ఫలాని వారి ఎద్దు చనిపోవును అని అన్న వారికి సంతోషము. అలాగే బలి అర్పించుటనుబట్టి యూదులకు సంతోషము, ఆదరణ అలాగే క్రైస్తవులకు కూడా యేసుక్రీస్తు ప్రభువు స్వయముగా సిలువపై బలి అర్పింపబడెను ఈ బలి అర్ధవారము వరకు జరుగును అనగా 3 1|2 సం||లు జరుగును.

అంతిక్రీస్తునకు రెండు సంతోషములు:-

  • 1) యూదులైన ఎన్నిక జనం, నాకు సహాయకులు.
  • 2) అన్యులైనవారు నాకు సహాయకులు
అన్యుల నేమి చేయడు గాని క్రైస్తవులను ఎక్కువగా హింసించెను. పెండ్లికుమార్తె ఎత్తబడగా మిగిలిన వారిని క్రైస్తవులను హింసించుటకు సహాయకులుగా యూదులను అన్యుజనులను కుడా తీసుకొనును.

  • 1. నిబంధన కొట్టివేసెను
  • 2. బలికొట్టివేసెను
  • 3. యూదులనే కొట్టివేసెను


అంతిక్రీస్తు ఈ మూడు కొట్టివేసెను అటువంటిది కొట్టివేటటు వంటి భూమి మీదకు వచ్చినపుడు ఇతడే అంతి క్రీస్తును అని నమ్మవలెను.

  • 1) బలి
  • 2) నైవేధ్యము
  • 3) యూదులను కొట్టివేసినది అంతిక్రీస్తు అని నమ్మవలెను.
మన కాలములో ఇట్లు ఇవి మూడు కొట్టివేస్తే అతడు అంతిక్రీస్తు అని అనవచ్చు గాని అతనిలో ఈ మూడు లేవు ఏదో చిన్న చిన్న పొరబాట్లు ఉన్నవారందరిని అంతిక్రీస్తు అని అనకూడదు. ఈ క్రింది గుణాలన్ని ఉండవలెను.
  • 1) 7 సం||లు పరిపాలించవలెను.
  • 2) యూదులలో నిబంధన చేయువారు.
  • 3) బలి, నైవేధ్యము కొట్టివేయువాడు
  • 4) సర్వ ప్రపంచము ఏలువాడై యుండాలి 5) పెండ్లికుమార్తె సంఘము
పైకెత్తబడిన తరువాత వచ్చేవాడైయుండాలి. అతని గుణలక్షణాలు గమనించి అంతిక్రీస్తు అని అనాలేగాని ఇట్లర్ వంటి వారిని అంతిక్రీస్తు అని అనుకోకూడదు.

(12:4) సాతానుడు అంతిక్రీస్తునకు వైర్లస్ టెలిగ్రాం చేయును సాతానుడు చెప్పినట్లు కాక మరేవియు అంతిక్రీస్తు చేయడు. సైతాను తన పూర్ణ శక్తులు అంతిక్రీస్తునకు ఇచ్చును అప్పుడును కాలము కొంచెమేనని అపవాది ఉగ్రుడై పనిచేయును. 7 సం||ల జరిగే సైతాను పనికి ఇప్పుడు జరిగే సెతాను యొక్క కొంచెము పని ఆ పనికి ముంగుర్తు పనియై యున్నది అంతిక్రీస్తు ఆత్మను పొందినవారు ఇప్పుడనేకులు లోకము మీద ఉన్నారు.

అంతిక్రీస్తు కులము:- అబద్ధ ప్రవక్తలు ఇద్దరున్నారు. 1) అబద్ధ ప్రవక్తలు వస్తారని బైబిలులో ఉన్నది. పెండ్లికుమార్తె వెళ్ళక ముందు అబద్ధ ప్రవక్తలు వస్తారు పెండ్లికుమార్తె సంఘము పైకి వెళ్ళిన తరువాత వచ్చేవారు అబద్ధ ప్రవక్తలు, ఎవరినిబడితే వారిని అబద్ధ ప్రవక్త, అబద్ధ ప్రవక్తలని అనేవారు పెండ్లికుమార్తె వరుసలో తయారు కాజాలరు.

  • 1) పెండ్లికుమార్తె వెళ్ళక పూర్వము అంతిక్రీస్తులు వచ్చెదరు. వీరు క్రీస్తు విరోధులు.
  • 2) పెండ్లికుమార్తె పైకి వెళ్ళిన తరువాత అంతిక్రీస్తు వచ్చునని వ్రాసిరి
అంతిక్రీస్తు అనగా అంత్యదినములలో వచ్చువాడని కొందరి ఉద్దేశ్యము ఇది సరియెనది కాదు. యాంటి అనగా క్రీస్తు విరోధి అని అర్ధము యమంటి అనేది ఇంగ్లీషు పదము.

మూడవగుంపు:-

  • 1)కప్పలు, ప్రసిద్దికెక్కి ఒకటి ప్రపంచ మంతట ప్రచారము చేయగల శక్తిగలవారు.
  • 2) రాజులను యుద్ధమునకు ప్రేరేపించువారు
  • 3) పాతాళము నుండి వచ్చేవారు ఈ గుంపు రెండు భాగములు.

1) పరలోకములో నివసించేవారు, పరిశుద్ధులు, దూతలు పెండ్లికుమాత్రె ఈ మూడు ఒక గుంపు.

  • 1. ఇల్లు
  • 2) ఇంట్లో ఉన్న మనుష్యులు అలాగే పరలోక నివాస స్థలము. పరలోక వాస్తవ్యులు
  • 1. నిరాకార వస్తువు.
  • 2. జీవమున్నది.
  • 3. జీవ జలమున్నది.


ఇదే పరలోకము అలంకార రూపముగా పండి తులు చెప్పే మాటలలో ఒక మాటగా ఉన్నది. యెష 1:2 ఆకాశమును భూమియు అని వ్రాయబడెను ఇది అలంకార రూపము.

2. భూమి+భూలోక వాస్తవ్యులారా మీకు శ్రమ నేల శపించబడి ఉన్నది. ఆదాము కాలములో నేలపై పిడుగు పడెను. ఎందుకంటే భూమి శపించబడినది గనుక పిడుగు భూమిలోనికి దిగినది. నరులు చనిపోవుదురు. నరుల రక్తము కారును. ఇది భూమిలోనికి దిగును కనుక భూమికి శ్రమ. 7 ఏండ్ల శ్రమలో పిడుగు మనుష్యులపై పడగా మనుష్యుల రక్తము భూమి త్రాగును గనుక భూమికి శ్రమ. అనేకులు సముద్రములో చనిపోవుచున్నారు. గనుక సముద్రమునకు శ్రమ సముద్రము యొక్క నీరు రక్తముగా మారుచున్నందున ఉప్పు తయారు కాదు. వ్యాపారము జరుగుట దుర్లభము దేవుని వాక్యము అన్ని పుస్తకములో గూడార్ధముగా వ్రాయబడి ఉన్నది.

అపవాది:- నేరము మోపువాడు, నేరము చేయించువాడు మానవుడు కీడులో పడితే సంతోషించువాడు సైతాను యొక్క అంతము వానికి తెలియును సమయము కొంచెమని ఉగ్రుడైతిరుగులాడు చున్నాడు. 7 సం||ల పరిపాలన పిదప హర్మగెద్దోను యుద్ధము యుద్ధము పిమ్మట సాతానుకు బంధకము ఇవన్నియు వానికి పూర్తిగా తెలియును తన అంతము వానికి విచారము లేదు తన పని అయిపోవు చున్నది. నేరస్థుడగును. శిక్ష తప్పదని తెలిసిన మారుమనస్సు కలుగదు యోహాను 4: 22లో సమరయస్త్రీ కథలో రక్షణ యూదులలో నుండియే కలుగుచున్నదని ఉన్నది రక్షణ నాకుకాదు మనుష్యులకు మాత్రమేనని సైతాను తలంపులో ఉన్నది. మనుష్యులకు ఏర్పాటు చేసిన రక్షణ నాకు కూడా ఉన్నదని సాతానుడు తలంచిన అతనికున్న శిక్ష తప్పదు నేను ఇంతటిలో ఊరుకుంటే నాకు శిక్ష మాత్రము తప్పదు. వెనుక చేసిన పాపాలే అని తలంచి శిక్ష తప్పదని అంతటిల్తో ఊరుకొనక తన పనిని సాగించును. సైతాను కూడా మారుమనస్సు పొందవలెనను, తలంపు దేవునికున్నది సాతానుడు మారుమనస్సు పొందితే దేవుడు క్షమిచి రక్షించును.

నిబంధన:- నా నిబంధన స్థిరపరచి యున్నానని పితామహులతో దేవుడు చెప్పెను. ఇది భూలోక నిబంధన దేవుడు ఒక ప్రక్క మనిషి ఒక ప్రక్క ఉండుట, ప్రభువు రక్షణ పనిమీద రాకముందు ముంగుర్తుగా పశువులను వధించుట నీవు పశువును వధించుదువా అని దేవుడు అడిగిన అవును అని నాయకుడు చెప్పవలెను. ఇదియే ముంగుర్తు నిబంధన. దేవా నేను పశువును వధించి అర్పించుచున్నాను పాప పరిహారము నిమిత్తము అంగీకరించుము అని అనవలెను. ఈ బలి రానైయున్న రక్షకునికి ముంగుర్తు. ఇది రెండు పనులున్నవి.

  • 1) మనిషి చేయవలసినది=పశువును వధించుట, రక్తము చిందించుట. దేవుడు పశువును వధించడు, రక్తము చిందించడు, ఇది దేవుడు చేయకపోవుట ఎందుకనగా అసలైన బలియైన క్రీస్తు రాబోవు చున్నాడు.
  • 2) దేవుడు చేయబోవునది:- మనిషి చేసిన బలిని దేవుడు అంగీకరించుటయు దేవుడు చేయబోయే బలిని మనిషి అంగీకరించుట ఇది ఈ లోక నిబంధన.

పరలోక నిబంధన:- మనిషి బలి, దేవుని బలి అయిపోయినది, మనిషి బలి దేవుడు అంగీకరించుట, దేవుని బలి మనిషి అంగీకరించుట. దేవుని బలి మనిషి అంగీకరించుట అయిపోయిన పిమ్మట పెండ్లికుమార్తె ఎత్తబడును. మరి పరలోకములో నిబంధన ఎందుకు? దేవుడు సృష్టి యావత్తు చేసి తాను చేసిన దంతయు బాగుండుట చూచెను. ప్రకటనలో ఎక్కడ ఉన్నది? బూరలు అని ఉన్నది. ఆదికాండము 6వ అధ్యాయములో ప్రళయములో ప్రళయము ఆరంభించి 9వ అధ్యాయము వరకు సాగినది. ఇక్కడే బలిపీఠము కట్టిరి, అక్కడ ఇద్దరు ఉన్నారు. మనిషి అనగా పెండ్లికుమార్తె దేవుడు ఉన్నారు, దేవుడు మనిషితో ఉపమానము చెప్పెను, లూకా 14వ అధ్యాయంలో సమస్తము సిద్ధముగా ఉన్నది వచ్చి ఆరగించండి, నేను చేయవలసినవి ఏమిలేదు మీరు వచ్చి ఆరగించు పనిచేయవలసి యున్నరని విందు సిద్ధము చేసినట్లుగా ఉన్నది. మీరు రాకముందే ఇదంతా సిద్ధముచేసితిని అని చెప్పెను. పెండ్లికుమార్తె దేవుడు ఏమి సిద్ధపర్చెనో అది అనుభవించుటకు ప్రభువు వద్దకు వెళ్ళెను.

  • 1) ఆరు రోజులు సృష్టి అయిన పిమ్మట దేవుడు చూచి ఇది అంతా బాగున్నది అని చెప్పెను.
  • 2) లూకా 14వ అధ్యాంలో అంతా సిద్ధమైనది. అనుభవించండి అని ఉన్నది.
ఈ లోకంలో పెండ్లి విందుకు వెళ్ళిన చేయబడిన విందు పదార్ధములన్నియు బాగుండదు. అందరికి అన్ని యిష్టమతినవి ఉండవు వచ్చిన వారందరికి వచ్చేది ఉండదు గాని పరలోకవిందు అలాగు కాదు. అందరికి అన్నీ వచ్చేది.

ఉదా:- రాజమండ్రిలో ఒక ధనికుడు 7 దినములు పెండ్లి విందు ఏర్పాటు చేసి ఏ లోటు లేకుండా ఏ భేదము లేకుండ, అందరికి సంతోషకరమైన విందు చేసెను. అలాగే పరలోకములో విందు అంతా బాగుండును. అంతాసిద్ధముగా ఉన్నది. అని ప్రభువు అన్నారు విందు ఆరగించే పెండ్లికుమార్తె అంతా బాగుంది అని చెప్పవలెను.

ఉదా:- ఆఫ్రికా దేశపురాణి సొలోమోను రాజు యొక్క పరిపాలన అంతా చూచెను ఆమె చాలా ధనికురాలు, ఆమె ఏమన్నదంటే రాజును గూర్చి విన్నాను గాని, ఇంత ఉన్నదని వినలేదు. అలాగే పెండ్లికుమార్తె అంతా విన్నాను గాని ఇంత ఉన్నదని వినలేదు, అనును.

  • 1. అంతములేని విందు
  • 2. అంతములేని మహిమ
  • 3. అంతము లేని ప్రేమ
  • 4. అంతములేని సహవాసము



పెండ్లికుమార్తె అంతా బాగున్నది అనెను. ప్రభువు అంతా బాగున్నదనెను ఇదే పరలోక నిబంధన ఇలాంటిది భూలో కంలో జరుగలేదు. ఇది అనంతకాల విందు ఇద్దరు మెచ్చుకునేదే నిబంధన. బలినాకు ఇంపైన సువాసనగా ఉన్నదని మెచ్చుకొనుట నిబంధన.

పరలోకములో ప్రభువు సిద్ధపరచిన విందు మారుగా ఉన్నదని మెచ్చుకొనుట పెండ్లికుమార్తెతో నిబంధన.

  • 1) భూలోక బలిలో శ్రమ ఉన్నది.
  • 2) ప్రభువు బలిలో శ్రమ ఉన్నది.
గాని పరలోక విందులో శ్రమలేదు. ఇదే నిబంధన భూలోక సంగతి:- పెండ్లికుమారుడు ఉన్నాడు పెండ్లికుమార్తె ఉన్నది పెండ్లికుమార్తె ఊరు దూరంగా ఉన్నది. పెండ్లి అయిన పిమ్మట పెండ్లికుమార్తె పెండ్లికుమారుని ఊరు వెళ్ళును. సంతోషము కొలది పెండ్లి కుమారుడు తనకు ఉన్న వనము ప్రతి గది చూపించును షికారుకు తోడుకొని వెళ్ళి తనకున్న భూస్వాస్థ్యాము చూపించును. తనకున్న పెట్టెలు విప్పి తనకున్నదంతా తనకున్న సొమ్ము చూపించును. అలాగే పెండ్లికుమార్తె సంఘము పరలోకమునకు వెళ్ళగా పెండ్లికుమారుడైన యేసు ప్రభువు తనకున్న దంతయు పరలోకంలో చూపించును. ఇది విందుకంటే గొప్పది ఎక్కువ సంతోష ఉండును గాని భూలోక సంతోషము వంటిది కాదు. నాకున్న దంతయు మీది అని పెండ్లి కుమారుడు చెప్పెను, పెండ్లికుమార్తె భూలోకంలో ఎవరెవరి కొరకు ప్రార్ధించెనో వారందరిని విందుకు పిలుచును. ఎవరెవరి కొరకు ప్రార్ధించియున్నదో ప్రార్ధింపబడిన వారిలో ఎందరు రక్షింపబడెదరో అట్టివారికి పెండ్లి కార్డు పంపుదురు. ఎంత ప్రార్ధించిన రక్షింపబడిన వారు ఉందురు. స్వస్థత, చిక్కులు, అవమానము కొరకు ప్రార్ధించిన నెరవేరవచ్చు లేకపోతే నెరవేరక పోవచ్చు.

విందు అనగానేమి? సిలువ మ్రానుమీద వ్రేలాడదీయబడిన ఇరువురు దొంగల కొరకు ప్రభువు ప్రార్ధించెను. ఒక దొంగ రక్షింపబడెను. మరియొక దొంగ రక్షింపబడలేదు. ప్రభువు సిలువమ్రానుపై తన వంతు నెరవేర్చుకొనెను. అలాగే మనము కూడా మారుమనస్సులేని మనిషిని తీసుకొని అతడు తప్పక రక్షింపబడును అని మనస్సులో తట్టే వరకు ప్రార్ధించవలెను. ప్రయత్నించవలెను. అతనితో నీ కొరకు ప్రార్ధించుచునానని చెప్పవద్దు. ఒకవళ చెప్పిన అతడు చెలరేగునేమో. జబ్బుగా ఉన్నవారి కొరకు ప్రార్ధించుట మంచిదే గాని రక్షణ కొరకు ప్రార్ధన చేయుట అంతకంటే మంచిది. రోజునకు ఒకరికొరకైన ప్రార్ధించి ఒక సం||మునకు 365 మంది అగుదురు. మార్పు చెందినవారు పరలోకపు పెండ్లి విందునకు పిలువబడుదురు.

  • 1) అన్ని చూపించినపుడు విందుతో సమానమైన పరమానందము.
  • 2) మనము ప్రాధించిన వారు రక్షింపబడి విందుకు పిలుచుట
  • 3) "ఎందుచేత ఈ పాపిపై ఇంత ప్రేమ" ఇది ఆశ్చర్యము.
  • 4) ఓహూ నీవు కూడా రక్షింపబడినావా అని మన ప్రార్ధనవల్ల రక్షింప బడిన వారినిబట్టి ఆశ్చర్యము.

భూలోక విందు:- పండ్లు, కూరలు, రొట్టెలు, వీటిలో ఒకటి కూడా రాదు. ఈ సంబంధమే లేదు. ఈ తలంపే లేదు.

దేవుని లక్షణములు:- ప్రేమ, శక్తి, జ్ఞానము, పరిశుద్ధత, సర్వవ్యాపకత్వము, జీవము, న్యాయము, విశ్వాస్యత, వెలుగు, అనంతము పరలోకములో దేవునియొక్క ఈ లక్షణములు బాగుగా కనబడును. ఈ లోకంలో తల్లి, దేవుడు ప్రేమగల వాడా అనును. ఒకరు అన్యాయ పరిపాలనలో ఉండి దేవుడెక్కడ ఉన్నాడో అని అనును ప్రార్ధించిన నెరవేరకపోతే ఆయన విశ్వాస్యత ఏది అందురు. అక్కడ దేవుని ప్రేమ అనంతంగా కనబడును కనబడగానే ఉద్రేకంగా ఉందుము ఇక్కడ ప్రేమ అనుభవించిన తృప్తి లేదు. పరలోక మందు ఆ తలంపే ఉండదు. మనస్సునకు అక్కడ సంతోషము దేవుడు ప్రేమ గలవాడు గనుక కడుపునిండ తిందుము.

ఉదా:- ఫలాని కార్యము జరిగినపుడు దేవుని న్యాయమెక్కడ అని కొందరందురు నేరము చేయనివాడు అన్యాయము అనుభవించినపుడు అదే నిత్యజీవ పదార్ధము ఆ విందులో దేవుని లక్షణములు తెలిసికొని ఆనందించుటకు రేప్చర్ ప్రారంభకాలము అలాగు యుగయుగములు తెలియును. భూమిమీద 7సం|| శ్రమ పరలోకమునందు 7సం||లు విందు జరుగును. అపుడు వారిని వీరిని పిలుచుత మాటలాడుట మొదటిసారి 7సం|| రాలే ఆ పిమ్మట యుగయుగములు విందులో నుందురు.

"ఆనందమగు ముక్తి " అను కీర్తనలో "ముందు నా మనస్సు" దేవుని కప్పగించు-పొందబోయేడి ముక్తి భువి యందే లెంతునే. ||ఆనంద||

లోక భోజనము పళ్ళెములోనుండి కడుపులోనికి వచ్చును. అట్లే పరలోకపు విందు ఉండును ప్లేటులోని భోజనము కడుపులో మనకు కనబడదు. గాని భోజనమును బట్టి వచ్చిన శక్తులు కనబడును అలాగే పరలోకములోని ఆహారము అనగా దేవుని లక్షణాలు అన్ని మనలోనికి వచ్చి దేవుని శక్తులన్నియు మనలో అనంతకాలం ఉండును మనము ప్రభువులో ఒక భాగమై యుందుము. భూలోకమందు కూడా అలాగుండగలము కాని పాపము మనకు అడ్డముగా ఉన్నది. ఆత్మాహారము అనగా ప్రభు భోజనసంస్కారము. ఇది అక్కడ చాలదు పరలోకంలో అనుభవించినది పరలోక ఆహారము. అక్కడ పాప తలంపు ఉండదు.

విందులో భాగము:- దేవుని లక్షణాలన్ని మనలోనికి వచ్చును ఆకలి దప్పులు ఇక ఉండవు.

  • 1. అంతా వెలుగు
  • 2. అంతా ప్రేమ
  • 3. అంతా న్యాయమే
  • 4. అంతా సత్యమే
  • 5. అంతా పరమానందమే



పరలోక విందు యొక్క వివరము విన్నాము. అది మనకు అర్ధము కాదు. అది మనకు అందదు. చెప్పిన తృప్తి కలుగదు అనుభవించేటప్పుడు మనకు తెలియును

ఉదా:- ఒక దృశ్యము చూచి వచ్చినవారు మనకు చెప్పిన అది అర్ధము కాదు. మనము స్వయముగా చూచినపుడు అర్ధము కాగలదు.

విందులు:-

  • 1) అన్నము విందు,
  • 2) ప్రభురాత్రి భోజనము విందు ఇవి భూలోకంలోని విందు,
  • 3) పరలోక విందు
  • 4) మనిషి మారుమనస్సు పొందితే సంతోష కలుగును. ఇది రక్షణ విందు.

జీవితకాలమంతా రక్షణ విందు ఉండును పాపములో పడుట లేచుట ద్వారా ఈ విందు ఉండును.

పరలోక విందు జీవాహారము రక్షణ విందు, ఆత్మీయాహారము.

ఉదా:- వాత హరింపుకొరకు బ్యాటరీలో ఉంగరాలు చేయించిరి. వాతమున్నవారు అది పెట్టుకుంటే బాధ ఉండదు వాతము లేనివారు పెట్టుకుంట్తే వారికి బాధ కలుగును. అలాగే దేవుని లక్షణములు మనలోనికి రావలెను. అలాగు వచ్చిన దేవుని శక్తులు మనలో నిత్యము ఉండును. అదే విందు. ఆదియందు దేవుడు మానవుని తన పోలిక చొప్పున కలుగజేసెను. ఆ మనిషిలో దేవుడు తన శక్తులన్నిటిని ఉంచెను. గాని అతడు పాపముచేసినందున పోగొట్టుకొనెను. ప్రభువు యొక్క రాకడను బట్టి తిరిగి ఇవ్వటము ప్రారంభించగా నరులు మరలా పోగొట్టుకొనడానికి ఆరంభించెను. అయితే పెండ్లికుమార్తె ఎత్తబడిన పిమ్మట అక్కడ పోగొట్టుకొనుట ఉండదు. కాని నిత్యము అనుభవించుటయే ఉండదు ఇది అనంతకాలముండును. ప్రభువు శక్తి ఒక రోజు అనుభవించగా రేపు ఇంకా నూతనమైనవి అనంతకాలము వరకు అంభవించుదుము దేవునితో లీనమైపోదుము ఆవగింజంత విశ్వాసముంటే కొండపోయి సముద్రాన పడును. గాని ఆవగింజంత చిఱు పాపమున్న మోక్షముండదు. పాతాళములో ఉందురు 12:13.

  • 1) పెండ్లికుమార్తె అనగా సమస్తమును సమృద్దిగా అనుభవించుచు స్త్రీ
  • 2) పెండ్లికుమార్తె నూతన యెరూషలేము అనే స్థలము పట్టణములో ఉండునది.
ఇది పెండ్లికుమార్తెకు కావలసిన వన్నియు సప్లయిచేయు స్థలము సిద్ధపరచబడిన వస్తువులు ఉన్న స్థలము

అరణ్యము:- అరణ్యము అనగా అన్ని కీడులే ఆత్మ జీవనమునకు కొదువే ఏవో కొద్దిగా ప్రార్ధనలు నిలుపుటకునుట కన్న అన్ని లేవు అంతా సమృద్దిగా లేదు. అటువంటి స్థలమునకు మగశిశువును కనిన స్త్రీ యొక్క సంతానము వెళ్ళెను. స్త్రీ సంతానమును ఆ అరణ్యమందు పోషించెను. చావకుండా ఉండుటకే ఆ స్థలమునకు స్త్రీ సంతానము వెళ్ళెను. ఆ మహా శ్రమ కాలములోనే అక్కడికి వెళ్ళెను గనుక అరణ్యమని పేరు. ఈ అరణ్యము ఆ సంతతికి ఆశ్రయముగా నుండును ఇదే దాగుకొనే చోటు. శరణుజొచ్చిన చోటు. 7 సం||ల శ్రమయైన సైతానుయైన అంతిక్రీస్తుయైన అబద్ద ప్రవక్తయైన, మారుమనస్సులేని వారుయైన ఆ స్థలమునకు వెళ్ళరు. ఎందుకు? ఆ స్థలము వారికి తెలియదు అనగా అక్కడకు వెళ్ళుటకు వారికి సెలవు లేదు. మన పాపాల జాబితా అంతా సాతానుకు బాగుగా తెలుసు అది దేవుడు సెలవిస్తేనే తెలియును. లేకపోతే తెలియదు.

ఉదా:- యిర్మియాను దేవుడు దాచిపెట్టెను. గనుక దేవుడు దాచి పెట్టిన దానిని ఎవరు కనుగొనలేరు. దాచిపెట్టుటకు పోషించుటకు మాత్రమే అరణ్యమునకు తీసుకొని వెళ్ళెను. గాని చంపుటకుగాని శత్రువులకు అగుపరచుటకు గాని తీసుకొని వెళ్ళలేదు. 7సం|| లలో కలుగు మహా భయంకర శ్రమలో చిక్కుకొన్న వారి సణుగులు గాని, గొణుగులు గాని, వారికేమియు తెలియదు. వీరు పెండ్లికుమార్తె వరుసలో లేకపోయినను వారికి శ్రమలు లేవు. ఆత్మ జీవితములో అంతస్థు పోగొట్టుకొన్నాము. అని అనుకొనిరి గాని సిద్ధపడుటలో కొన్ని మహిమ జాడలు వీరు కలిగినవారే పెండ్లికుమార్తె ఎత్తబడిన వారొతో వీరు ఎత్తబడిన క్రింద విడిచిపెట్టబడిన వీరు సమానులు వీరికి కూడా ఒక విధమైన మహిమ శరీరమున్నది.

14వ:- పక్షిరాజు వంటి రెండు రెక్కలు ఆమెకు యియ్యబడును. ఆ ఆశ్రయమునకు మరియొక పేరు తన చోటు అని గలదు. అనగా స్త్రీ యొక్క సంతతి చోటు.

ప్రభువు అరణ్యములో చేసే పని ఏమి?

1. ఆస్త్రీకి ఎగిరే రెక్కలు యియ్యబడును. 2. సురక్షితముగా ఉండు ఏర్పాటు చేయును. 3. కొదువలు కలిగి ఉన్న వారికి పోషణలు కలిగించును. 4. శ్రమలయొక్క పొగరు చూడ నివ్వరు. 5. అదివరకు ఎవరికిని తెలియని చోటు తెలిసిన సైతాను జట్టు ఒకవేళ అక్కడకు వెళ్ళును గనుక తెలియజేయబడదు.

ఉదా:- డేగ ఏ లోకంలో ఉండునో ఆ లోకంలో తనకు తెలియని చోటు ఉండదు అలాగే ఈ డేగను సాతానుకు కూడా తెలియక ఉండదు గాని దేవుడే తెలియకుండ ఆపుచేయును.

రెక్కలు:- భూలోకంలోని భక్తులైన వారుగా నుండి రేప్చర్ రాక ముందు నుండిన వారైనను అప్పుడప్పుడు దేవుడు వారికి రేప్చర్ మహిమ కొంత చూపించును. 1. హనోకు, 2. ఏలియా, 3. ఫిలిప్పు, 4. పౌలు, 5. యెజ్కేలు మున్నగు వారికి ఇది అగుపర్చబడెను. ఆ రేప్చర్ నూతన యెరూషలేమునకు కాదు గాని అక్కడికి ఇక్కడికి అక్కడికి యెషయ 41 లో ఇదే రేప్చర్ పైకి వెళ్ళుటే రేప్చర్ ఇదే రేప్చర్లో ఒకభాగము. ఆ తరువాత సంఘమునకు ఒక భాగము రేప్చర్ ఇది భూమి మీద నుండి నూతన యెరూషలేమునకు వెళ్ళుట యెషయా వ్రాసినట్లు అప్పుడప్పుడు భక్తులు నూతన బలమును పొంది యెగిరి పోయిరి, వారు శ్రమ తప్పించుకొనిరి.

ఉదా:- రేపు గుంటూరునకు శత్రుదళము వచ్చి నాశనము చేయునని ఉండగా ఒక వారమునకు ముందుగానే ఉత్తరములు వచ్చి పెండ్లికి రండి అని పిలుపు వచ్చెను. ఆ పిలుపును బట్టి విశ్వాసులు ఉత్తరము వలన అక్కడి నుండి వెళ్ళిపోవుదురు.

ఇంకిత జ్ఞానము:- ఆ శ్రమ రాకముందే విశ్వాసులందరు పైకి వెళ్ళుదురు. రోమీయులు యెరూషలేమును నాశనము చేయుదురని దేవునికి ముందె తెలియును. ఆ విషయమును ప్రభువు శిష్యులకు తెలియజేసెను. ఎప్పుడో అని తెలియక పోయిన శిష్యులందరు పెల్లా అను ఊరునకు వెళ్ళిరి. పెలా అనునది దాను గోత్రములో నున్న ఊరు వీరు పనిమీద వెళ్ళిరి ఆ సమయమందే యెరూషలేము నాశనము చేయబడెను. అలాగుననే ఎత్తబడే సంఘమునకు కూడ జరుగును.

మిక్కిలి బలహీనతలో ఉండేవారు హృదయమును శుద్ధిచేసుకొంటే వారు సువార్తను నిరాటంగా చేయుదురు. హృదయ శుద్ధిని బట్టి నూతన బలము పొందుదురు దీనివల్ల శోధనలు జయింతురు అన్నీ ఆటంకాలు గెలిచెదరు అన్ని దేశమునకు తిరిగి సువార్త ప్రకటించెదరు. ఉజ్జీవ కూటములు పెట్టుదురు. స్వస్థత కూటములు పెట్టుదురు. అప్పుడు అవిశ్వాసులు చూచి ఏమిటి వీరు పక్షిరాజువలె ఎగిరి వెళ్ళుచున్నారని ఆశ్చర్యపడుదురు వారికి నిజముగా రెక్కలు లేకపోయినా ఆటంకాలున్న సువార్తకు ప్రకటించెదరు. మనిషి రెక్కలులేని పక్షి అని మనము అందుము గదా ఉదయము ఒక ఊరిలో ఉన్న మనిషి ప్రయాణముచేసి కొంత సమయానికి మరియొక ఊరులో ఉండును. కాబట్టి మనిషి పక్షిరాజువలె ఎగుదురు ఉన్నట్టే. దేవుని వాక్యము రెండంచుల ఖడ్గమంటే కనబడే, కనబడని అర్ధము కూడా ఉండును. ఆ వరము భక్తులకు ఈ సమయమందు ఇవ్వబడును.

యెహెజ్కేలు 11:1 దైవాత్మ యెహెజ్కేలును తన ప్రజల యొక స్థితిని చూపించుటకు వారున్న స్థలమునకు ఎత్తుకొని వెళ్ళును యెహెజ్కేలు 8,9 అధ్యాయములో ఈ సంఘటన కనబడుచున్నది. అపొ.కార్య 8:26లో ఫిలిప్పును సువార్త ప్రకటించుటకు దేవుని ఆత్మ ఎత్తుకొని వెళ్ళెను. 11 కొరింథి 12:1లో అపోస్తలుడైన పౌలును దేవుని ఆత్మ పరదైసునకు తీసికొని వెళ్ళెను. ప్రభువు పరదైసులోని క్రొత్త సంగతులను పౌలునకు చూపించెను. పితామహుడైన హనోకు అబ్రహము, ఇస్సాకులకు ముందే పురాతన కాలంలోనే దేవునితో నడచి దేవునితో వెళ్ళిపోయెను.

ఉదా:- ఈ రాత్రి ఎవరో తలుపు తట్టి లేపెదరు మనము తలుపు తీస్తాము ప్రభువు మనలను రమ్మనును. ప్రభువుతో మనము వెళ్ళుదము. లేడిగంతులు వేసినట్లుగా మనము కూడా గంతులు వేసుకొంటు వెళ్ళుదము ఇలాంటి ఆయన పేతురు మనకు సాదృశ్యము. అ. కా. 12వ అధ్యాయంలో జైలులోనున్న పేతురును ఇంటియొద్ద విడిచిపెట్టు వరకు ఆయన కేమియు తెలియలేదు. మన కాలంలో కుడా ప్రార్ధన చేయువారికి అలాగు జరుగును.

  • 1. అటువాంటి అవసరము ఉండవలెను.
  • 2. అటువంటి కొరత లేకుండా ఉండవలెను.
  • 3. అటువంటి భక్తులు ఉండవలెను.
  • 4. అటువంటి శక్తి పొందినవారై యుండవలెను.
  • 5. అటువంటి దర్శ్నము పొందినవారై యుండవలెను.

దేవుని వాగ్ధానములు వాక్యములో ఉన్నవి ఎవరైతే ఆవాగ్ధానముల క్రిందకు వెళ్ళి పై విషయముల ప్రకారము చెయుదురో అప్పుడు వారికి జరుగును. పరమ భక్తులైన ఆ వాగ్ధానముల క్రిందకు పోనివారికి ఏమియు జరుగదు.

  • 1. హృదయ శుద్ధి
  • 2. ఆజ్ఞలను నెరవేర్చుట.
  • 3. వాగ్ధానములను నమ్ముట.
  • 4. వాక్యము నమ్ముట.
  • 5. శక్తి పొందుట
ఇవి అన్నియు పూర్వకాలమునకు సరిపోయినది గాని మన కాలంలో జరుగదని అందురు గాన పై విషయాలను నమ్మినను ఎంత మాత్రమును జరుగదు అని అనేకులు అందురు ఎందుకంటే ఈ కాలంలో ఆకాశమున ఎగిరి వెళ్ళుటకు దేవుడిచ్చిన జ్ఞానమును బట్టి విమానములున్న వనుకొని ఆ వాగ్ధానముల యొద్ధకు ఎంత మాత్రమును వెళ్ళదు. పై భక్తులకు ఇచ్చిన అనుభవ మనకు రావలయును అంటే దేవుని చిత్తమునకు అనుగుణ్యముగా ఉంటే వచ్చును. యేసుప్రభువు నీళ్ళమీద నడిచెను. మనిషియైన పేతురు కూడ నడిచెను ఆ వాగ్ధానము వాడుకొను వారికి ఇప్పుడు కూడా ఉన్నది. పేతురు ఎందుకు సముద్రముపైన నడిచెను.

  • 1. అవసరమునకు మాదిరి చూపించుటకు.
  • 2. సముద్రము మనలను ఏమియు చేయలేదని చూపించుటకు.
  • 3. భక్తి ఉన్నది అని చూపించుటకు.
  • 4. ప్రభువు ఇచ్చిన శక్తి ఉన్నదని చూపించుటకు.
  • 5. దర్శ్నము కాదు గాని ప్రభువే స్వయముగా కనబడుచున్నాడని చెప్పుటకు యేసుప్రభువు చేసిన అద్భుతములన్ని చేయగల బోధకులు రావలెను.

"క్రైస్తవ సంఘమా ఘనకార్యములు చేయు" కాలము వచ్చెను తెలుసునా?

12: 14 సర్పము ముఖము చూడకుండా:-

ఉదా:- ఒక పిలవాడు పండ్లు కోసుకొనుటకు చెట్లుపైకి ఎక్కెను. అంతలో ఒక పులి వచ్చెను. కుర్రవాడు ఆ చెట్టుకొమ్మను గట్టిగా పట్టుకొనెను గాని ఎంతసేపుండగలడు. క్రిందనున్న పులి ఆ అబ్బాయిదిగే వరకు పోదు పులిని చూచిన కుర్రవాడు భయపడి వణికి చెట్టు కొమ్మను విడిచి పెట్టగా క్రిందకు పడిపోయెను. అలాగే స్త్రీ సంతానము సర్పమును చూచిన క్రిందకు పడిపోవును. ఇది నిజమా అని అవ్వతో సర్పము అనెను. అంతకు ముందు నిజమేగాని పేశ్నవేసిన పిమ్మట అనుమానము వచ్చి శోధనలో పడిపోయినది. భూమిమీద స్త్రీలు నికాసయిన భాగము పెండ్లికుమార్తె వెళ్ళిపోయినది మిగిలిపోయిన వారిని స్త్రీ సంతానము అన్నారు, వారిని చూచిన సర్పము వారు చావవలెనని నరులు వెళ్ళగ్రక్కెను.

  • 1.అసలు శిశువు పోయినందుకు సర్పమునకు కోపము ఈ సంతతి కూడా పోవుట మరి కోపము.
  • 2. ప్రభువు ఆ స్త్రీని అంటనివ్వలేదు.
  • 3. భూమి ప్రవాహమును మ్రిగివేసినది.
  • 4. సర్పము కోపము ఇక్కడే ఉండి పోయెను.
  • 5. సర్పము ఎంత కోపపడిన భూమిమీద ఉండి పోవలసినదే గాని ఆశ్రయ స్థలానికి వెళ్ళలేదు.
    • 1) నీళ్ళవలె కనబడెను.
    • 2) నదివలె ప్రవహించి నట్టుండెను.
    • 3) కొండ వాగువలె ఆగిపోవలెను పిల్లిమీద పెట్టి, పీఠమీద పెట్టి, అత్త తిట్టినట్లు పెండ్లికుమార్తెను రేపటి నుండి ఎందరో తిట్టెదరు.
తే|| గీ|| పిల్లి మీద పెట్టి - పీటమీది పెట్టి
తిట్టుచుండు అత్త - పట్టుగాను
నిన్ను కాదనుకొని - నెమ్మదిగా నుండ్ము
తిట్లు గాలికి పోవును - లెరవే కాంత

నీళ్ళ ప్రవాహమనగా

  • 1) తిట్టుట
  • 2) అవమాన పరచుట
  • 3) శపించుట ఫలాని,
ఫలాని పాపములు చేశామని చెప్పుట ఎంత దూరము వెళతావో నేను చూస్తాను అని అనుట అలాగు అని ప్రవాహము గ్రక్కును. స్త్రీ సంతానమునకు ఇది అంతా సర్పము చేసినపని.

ప్రక 12:17 అబద్ధ ప్రవక్తలు వచ్చి క్రీస్తు దేవుడు కాదని పేపర్లు వేయుదురు. అది క్రైస్తవులకు ఆటంకమే క్రీస్తు ప్రభువు దేవుడని రుజువు పరచగల భక్తులైన పండితులు కావలెను. భక్తులైతే క్రీస్తు దేవుడని చెప్పగలరు గాని ఇతర గ్రంధముల నుండి కూడ ఎత్తి చెప్పగల పండితులు కావలెను.

సర్పము సముద్రతీరమున నిలిచెను:- సంఘము ఎత్తబడిన పిమ్మట భూమి మీద శేషించినవారు గలరు. అందు విశ్వాసులు కూడా ఉన్నారు. వారి హృదయము ఎట్టిది అనగా అందరికంటే ఆఖరున మిగిలిపోయిన ఖఠిన ఆత్మలు వీరు వెయ్యేండ్ల పరిపానలోనికి పోయే వారు వీరిలో కొందరు భక్తులు, విశ్వాసులు కూడా ఉందురు వారి చరిత్ర అయిపోయిన తరువాత ప్లానులో హర్మగెద్దోను యుద్దము వచ్చును ఆ యుద్ధము వరకు శేషించిన వారుందురు. వారిలో భక్తులు కూడా ఉందురు. స్త్రీ సంతానమును కాపాడుటకు అరణ్యమునకు తీసికొనిపోయెను. వీరు కష్టములలో మారినవారు. శేషించిన వారిలో విశ్వాసులు కూడా ఉందురు. గనుక సైతాను భక్తులైన వారిమీద పడి వారిని శ్రమపెట్టుటకు నిశ్చయించు కొనును మిగిలిన వారిలో విశ్వాసులు అవిశ్వాసులు కూడా ఉందురు. ముందు విశ్వాసుల మీద సాతాను దండెత్తెను. తరువాత అవిశ్వాసుల మీద దండెత్తెను. భక్తులను హింస పెట్టలేదు. ఎందుకంటే అరణ్యమునకు కొనిపోబడిరి గనుక శేషించిన వారిలో సిద్ధముగా లేని వారు కొనిపోబడలేరు.

  • 1. దేవుని ఆజ్ఞలు గైకొనుచు
  • 2. యేసును గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవారు


మిగిలిన భక్తుల లక్షణములు ఇవి రెండు

1) దేవుని ఆజ్ఞలన్నిటికి లోబడేవారు. యేసు రక్షకుడని వాదించువారు ఈ రెండు గొప్పవే ఎందుకనగా పెండ్లికుమార్తె వెళ్లిపోయెను. స్త్రీ సంతానము కూడా వెళ్ళిపోయెను. కఠినులైనవారున్నారు. అయినను ఈ రెండు లక్షణములు కలిగినవారున్నారు. ఎన్ని శ్రమలున్నను వీరు ప్రభువే క్రీస్తు అనిరి. సైతాను సముద్ర తీరమున నిలిచెను అనగా ఆలోచన దానికి విచారము. ఎందుకంటే 1) పెండ్లికుమార్తెను పోగొట్టుకున్నానని, సంతానము పోగొట్టుకున్నానని ఇప్పుడు శేషించిన వారున్నారు. గనుక వారికి హాని చేయవలెనని ఈ సైతాను ఆలోచన చేయుచున్నది.

సైతానుయొక్క బిరుదులు:- 1. లోకాధికారి యోహా 12:31 యోహా 14:30, యోహా 16:11. భూమి మీద తన పని ఉన్నది గాన లోకాధికారి.

వాయుమండలాధిపతి:- ఎఫె 2:2 భూమి మీద అధికారి, పై నుండి త్రొసివేయబడినాడు గనుక వాయు మండలాధికారి.

ఈ యుగ సమబంధ దేవతల మిద్ద అధికారము గలదు. అయితే ప్రక 12 అధ్యామంలో వాయు మండలాధికారి అనే బిరుదు పోగొట్టుకున్నాడు. ఓడిపోను గనుక పోగొట్టుకొనెను. రేపు హర్మగెద్దోను యుద్ధములో పూర్తిగా ఈ లోక అధికారము పోవును గనుక పాతాళమునకు పడద్రోయబడెను. కఠినాత్ములతో విశ్వాసులు కలిసియుండుట చిక్కు గనుక యుద్ధములో చనిపోవుదురు వారికి వెళ్ళలేదు అనే చింత ఉండిపోతామనే చింత వలన ఏలాగు బ్రతుక గలరు. ఇప్పుడు వారిని సాతాను చంపిన యెడల మోక్షమునకు పోవును.

సముద్ర తీరము:- అనుమాటలే రెండు పర్యాయములు ఊడిపోయెనని అర్ధము.

చోట్లు:-
  • 1) పెండ్లికుమార్తె వెళ్ళిపోయినపుడు
  • 2) సాతానుడు వెళ్ళిపోయినపుడు
  • 3) యుద్ధములో అపజయమప్పుడును
  • 4) త్రోసివేయబడెను.

ఇన్ని అపజయముల వలన వారికి ఏమి చేయవలెనని ఆలోచనలో దిగెను. అక్కడ యుద్ధము చేయుటకే అనే పని మీద శేషించిన వారిలోని అవిశ్వాసులలో నిలువబడిరి. నిలువబడిన భక్తులనేమి చేయవలెనని ఆలోచన గనుక సముద్రమనే మాటకు భుజనాంగమనే అర్ధమున్నది. అవిశ్వాసులైన తన జనము దగ్గర నిలువబడి ఆలోచించుచుండెను. ఇప్పుడు ఉన్న విశ్వాసులను చంపుటకు సాతానుకు ఇష్టములేదు. ఎందుకంటే చంపినవారు పరలోకమునకు పోవుదురని వాడికి బాగుగా తెలుసును, గనుక వారిని జయించి తన పక్షముచేసికొనవలెనని సాతాను యొక్క ఉద్ధేశ్యము.

పరలోక స్థితి:-

  • 1) రక్షణ.
  • 2) శక్తి.
  • 3) రాజ్యము
  • 4) అధికారము,
మన క్రీస్తువి ఆయెనని స్తుతించిరి. ఈ స్తుతిలో శేషించిన వారిలో భక్తులున్నారు. వారికి రక్షణ గలదు. కనుక వారికి రక్షణ 2) సంతానమునకు రక్షణ. 3) పెండ్లికుమార్తెకు రక్షణ ఈ మాటలనుబట్టి స్తుతించిరి
  • 1) ఇవన్నియు దేవునివి. రక్షింపబడిన వారున్నారు గనుక రక్షణ దేవునిది.
  • 2) వారు పైకి వెళ్ళిరి గనుక వారికి శక్తి గలదు అందుచేత శక్తి ఆయనది.
  • 3) దేవుని రాజ్యములో చేరుటకు గనుక వారు రాజ్యములో ప్రవేశించిరి గనుక రాజ్యమని స్తుతించిరి.
రక్షణ, శక్తి రాజ్యము ఇవి అన్నియు మనుష్యులకు ఇచ్చివేసెను.

ఆ స్థితి ఎందుకు జరుగును?:- అపవాది వాయు మండలము నుండి పడద్రోయబడుట వలన దేవుడు రక్షణ యిచ్చిన తరువాత శక్తి ఇవ్వకపోతే మనిషి ఆ రక్షణ నిలుపుకొనలేడు రక్షింప బడినను దేవుని రాజ్యమునకు వెళ్ళని వారుందురు. ఇప్పుడు భూలోకంలో ఉన్నవారు రక్షణ పొందినవారై (శేషించబడినవారు) వారు రక్షింప బడినవారు గాని దేవుని రాజ్యములోనికి వెళ్ళలేక పోయినారు.

పరలోక మనుష్యులు ఏమన్నారు? :- ఆహా హా హా రక్షణ యిచ్చుట మన దేవునిపని, శక్తీచ్చుట మన దేవునిపని, రాజ్యము ఇచ్చుట మన దేవునిపని అని మెచ్చుకొనిరి. రెండు గుంపులు పోయిన దేవుడు ఇంకా రక్షిస్తూనే ఉన్నాడు సైతాను మీద జయమిచ్చే శక్తిగలవారు. అన్ని శక్తులు గలవారు.

రాజ్యమిచ్చుట ఆయనది. ప్రవచనము విన్నప్పుడు స్తుతి క్రియ జరిగిన తరువాత మరియొక స్తుతి ఆయన శక్తి గలవాడని రక్షింపబడిన వారికి ముందే తెలిసి స్తుతించిరి గాని ఆ క్రియ జరిగిన తరువాత మరలా స్తుతి చేసిరి.

Home