16వ అధ్యాయము - Bowls on Earth

పరిచయము

గర్భాలయము స్వరము

భూమిపై కుమ్మరించండి

1వ దూత కుమ్మరింపు (భూమిపై)



ఫలితము: పుండ్లు
  • 1. మృగముద్ర
  • 2. ప్రతిమ పూజ
  • ఎ. బాధ
  • బి. చెడ్ద

2వ దూత కుమ్మరింపు (సముద్రముపై )

    ఫలితము: సముద్ర
  • ఎ. పీనుగు రక్తము
  • బి. జీవులు

    3వ దూత (నదులు __ జలధారలు) కుమ్మరింపు

    • ఫలితము: రక్త
    • జలదూత


    పవిత్రుడా
    • ఎ. వర్తమాన
    • బి. భూత
      వారు
    • ఎ. పరిశుద్ధుల
    • బి. ప్రవక్తల



    రక్తము కార్చిరి



    శిక్ష:
    • ఎ. పాత్రులె
    • బి. తీర్పు తీర్చితిరి
    • సి. న్యాయవంతుడవు
      బలిపీఠము:
    • ప్రభూ
    • దేవా
    • సర్వాధికారి



    • నీ తీర్పులు
    • సత్యము
    • న్యాయము

    4వ దూత (సూర్యునిపై)

    ఫలితము: నరులను కాల్చే అధికార
      ఫలితము: నరులు
    • ఎ. కాలిరి
    • బి. దేవుని దూషించిరి
    • సి. మారలేదు

    5వ దూత (మృగ సిం హాసనముపై)

      ఫలితము: ఎ. దాని రాజ్యము చీకటాయెను
    • బి. నరులు నాలుకలు కరచుకొనిరి
    బి బి నరులు:
    • వేదన
    • పుండ్లు


    దేవుని దూషించువారు

    6వ దూత (ఫరాతుపై)

    ఫలితము : నీళ్ళుండె (తూర్పురాజుల దారి)

    ఫలితము: మూడు కప్పలు = అపవిత్రాత్మలు

    • ఎ. ఘటసర్పనోరు
    • బి. మృగనోట
    • సి. అ. ప్రవక్తలనోట


    • ఎ. సూచన చేయునది
    • బి. దయ్యముల ఆత్మలు
      ఫలితము: వాటిపని
    • ఎ. క్రీస్తునకు రాజుల పోగుచేయు
    • బి. హెర్మ గెద్దోనువద్ద
      ప్రభువు:
    • ఎ. వచ్చుచున్నాను
    • దొంగవలె బి. ధన్యుడు:
    • ఎ. మెళకువగా నుండువాడు
    • బి. వస్త్రము కాపాడుకొనువాడు
      N. B :
    • ఎ. దిగంబరుడుగా సంచరించు
    • బి. దిగంబరత్వము

    7వ దూత (వాయువుపై)

    స్వరము : సమాప్తమైనది

    నుండి సిం హాసనం

      ఫలితము:
    • ఎ. మెరుపులు
    • బి. ధ్వనులు
    • సి. ఉరుములు
    • డి. పెద్ద భూకంపములు (అపూర్వ)
    • ఇ. మహాపట్టణము (3 భాగాలాయె)
    • యఫ్. అన్యజన పట్నాలుకూలె
      వారు:
    • ఎ. బాబేలుకు పాత్రనిమ్ము
    • బి. ప్రతిద్వీపము పారిపోయె
    • సి. పర్వతాలు (అదృస్యం)
    • డి, వడగండ్లు (5 మణుగులు)

    N.B : ఫలితం: దేవుని దూషించిన

    15వ అధ్యాయములోని ఏడుగురు దేవదూతలైనవారు దేవుని కోపముతో నిండిన ఏడు బంగారు పాత్రలను పట్టుకొని యున్నట్లు చూసితిని. ఈ ఏడుగురు దూతలు పరలోకమునుండి దేవుని ఆజ్ఞ కొరకు ఎదురుచూచుచున్నారు. దైవాజ్ఞ రాగానే ఒక్కొక్క దూత తమ పాత్రను భూమి మీద కుమ్మరించెదరు. ఒక్కొక్క పాత్రకు ఒక్కొక్క రకమైన శ్రమ భూలోకములోనికి వచ్చును. కుమ్మరించుడని దైవాజ్ఞ గర్భాలయములో నుండి వెడలి వచ్చెను.

    ఉదా:- పటాలములో కమెండర్ ఆజ్ఞ కొరకు పటాలను సిద్ధముగా నుండును. సైన్యాధిపతి ఆజ్ఞ రాగానే పటాలములోనివారు నెరవేర్చుదురు. అదే రీతిగానే ఈ దూతలు నిలిచియున్నారు.

    ప్రక. 16:2

    ముద్రలు బూరల శ్రమ కాలములో పరలోకములో జరిగిన దానినిబట్టి భూమిమీద కొంత భాగము నాశనము జరిగినది. కొంతమందికి మాత్రమే శ్రమ కలిగినది. పాత్రల కాలములో కొంత భాగము అని లేదుగాని భూమి అంతటికి నాశనము సంభవించును. భూమి మీద కొందరికి శ్రమ కాదుగాని అందరికి శ్రమ కలుగును. భూగోళమంతటికి శ్రమ కలుగును. అది ఎవరికి అనగా

    • 1. అంతిక్రీస్తు ముద్రగల వారికి
    • 2. అబద్ద ప్రవక్త నిలువబెట్టించిన ప్రతిమకు నమస్కరించువారికి.
    • 3. అంతిక్రీస్తునకు సంబంధించినవారికి ఈ శ్రమ కలుగును.

    7 పాత్రలు

    మొదటి దూత తన పాత్రను గర్భాలయములో నుండి వెలుపలకి వచ్చి తన పాత్రను భూమి మీద కుమ్మరింపగా పైన చెప్పబడిన వారికి బాధకరమైన పుండ్లు పుట్టెను. ఇలాంటిది పాత నిబంధన కాలములో మోషే ఆజ్ఞను బట్టి ఐగుప్తు ప్రజలకును అందున్న జంతువులకును కలిగెను. ఆ రీతిగానే ఈ శ్రమ కాలములో కూడా అలాగు జరిగినది. (నిర్గమ 9:9)

    ప్రక. 16:3

    దేవుడు ఈ లోకములో నివసించుచున్న మనిషికి మంచి సదుపాయములు ఏర్పాటు చేసెను. అందులో ఒకటి సముద్రము, సముద్రమును బట్టి ఉప్పు ఉత్పత్తి అగుచున్నది. అలాగే సముద్రములో ఆహార పదార్ధములైన చెపలు, ఉత్పత్తి అగుచున్నవి. ఇందును బట్టి భూప్రజలు వర్తకము చేసి లాభము సంపాదించుచున్నారు. ముద్రల, బూరల కాలములో కొంత భాగమే నాశనమాయెను గాని పాత్రల శ్రమ కాలములో రెండవ దూత తన పాత్రను సముద్రములో కుమ్మరింపగా సముద్రము పీనుగ రక్తమువంటి దాయెను. భూమి పుట్టినది మొదలు దుర్మార్గులు నిరపరాదులను నరికిరి గనుక నీకు రక్త శిక్ష అని తెలుపుటకు ఈలాగు జరిగెను. పూర్వము మోషే కాలములో పది తెగుళ్ళలో ఒక తెగులు నీరు రక్తముగా మారుట. అలాంటిదే ఏడు యేండ్లు శ్రమ కాలములో జరుగనై యున్నది. ఆ దుర్జనులకు ఆ రక్తమే పాపమాయెను. యేసుప్రభువు కాలములో యేసును చూచిన యూదులు వీని రకతము మా మీదను మా పిల్లల మీదను ఉండును గాక అని రక్తపధార శిక్ష కోరు కొన్నారు యూదులు ఆ కాలములో కోరుకొన్నట్లు ఈ శ్రమల కాలములో కూడా జరిగెను.

    రక్తము వల్ల అనగా పరిశుద్ధ రక్తమువల్ల రక్షణ రావలసినదిగాని శిక్ష వచ్చెను. ప్రజల అక్రమమును బట్టి గుడి, బడిగా మారి అనగా యెరూషలేము దేవాలయమును సరిగా వాడనందు వల్ల క్రమేపి దేవాలయము కూల్చబడినది. నేటి దినములలో దేవాలయములను పాడుచేసి అన్యులకు ఇచ్చి వేయుచున్నారు. గనుక దేవుని నిరాకరించ కూడదు. నిరాకరించి నందువల్ల శిక్ష తప్పలేదు. ఈ పాత్రల శ్రమ కాలములో సముద్రములో నున్న జీవ జంతువులన్నియు చచ్చెను.

    ప్రక. 16:4-7

    మూడవ దూత తన పాత్రను, నదులలోను, జలధారలలోను, కుమ్మరింపగా అవి కూడా రక్తమాయెను. కొండల నుండి ఊట వచ్చును. ఆ ఊటలలో నుండి నదులు ప్రవహించును. ఈ నదులు కూడా రక్త మాయెను. ఇప్పుడు సముద్రములో నీరు లేవు. ఊటలలోను నదులలోను నీరు దొరకదు. మనిషికి దాహము వేస్తే నీటికి బదులు రక్తము త్రాగవలెను. చేగల్నాడు చెరుబ్వులలోని నీళ్ళు చేతిలోనికి తీసుకొంట్తే ఎర్రగా నుండును. అక్కడ ప్రజలు హిండు పగింజ వేసి నీటిని విరచి త్రాగుదురు. ప్రయాణికులు ఆ ఎర్రని నీటినే త్రాగుదురు. ఈ శ్రమల కలములోని ప్రజలు రక్తమే త్రాగవలెను. దేవున్ని సేవించువారు కొందరు ఆ కాలమునందు ఉందురు. వారికి ఈ శిక్ష ఉండదు. దేవుడు వారిని ఎక్కడో ఒకచోట ఎవరికి తెలియనిచోట వారిని పెట్టి పోషించును. ప్రవక్త అయిన ఏలియాను దేవుడు పోషించలేదా! అలాగే దేవుడు వారిని పోషించును. అది ఇతరులకు తెలియదు.

    ఉదా:- ఒక ఊరిలో ఇండ్లు కాలుచున్నప్పుడు ఒక చిన్నపిల్ల తన కోడిపిల్లను కాపాడమని ప్రార్ధించెను. ఊరంతా కాలిపోయెను గాని ఆ చిన్న పిల్ల కోడిపిల్ల బ్రతికెను.

    దేవుడు పరిశుద్ధుడు. ఇది మనకు అన్యాయముగా ఉన్నదిగాని న్యాయమే

    • 1. పరిశుద్ధులు
    • 2. ప్రవక్తలు

    • 1. సామాన్య క్రైస్తవులు
    • 2. దేవుని సేవకులు.

    ఈ రెండు గుంపుల వారిని ఈ దుర్మార్గులు చంపిరి గనుక పరిశుద్ధుడును న్యాయవంతుడునైన దేవుడు వారికి రక్తము త్రాగ నిచ్చుట న్యాయమైన శిక్షయే. దేవుడు సృష్టి నంతటిని కాపాడుటకై దేవతదూతలను నియమించెను.గనుక కొండలు, నదులు, సముద్రములు, ప్రవాహముల యొద్ద చెట్ల యొద్ద దేవతదూతలైనవారు ఉండి కాపాడుచున్నారు. నరుని ఆస్థి ఎక్కడౌండునో అక్కడ వాటిని కాపాడుటకై దేవుడు దేవదూతలను నియమించును. వాటిని పాడుచేయుటకై దయ్యములుకూడా ఉండును. చిన్న మొక్క కూడా దేవుని సృష్టియైయున్నది గనుక వాటిని కావలి కాయుటకు దేవదూతలు బ్రతికియున్న మరియొక మొక్క యొద్ద కావలి కాయుటకు వెళ్ళును. అలాగే భూలోకములోని ఘనులను దేవదూతలు కాపాడుదురు. అట్లు కాపాడకపోతే దయ్యములు వారిని పాడుచేయును.

    విశ్వాసికి ఆపద రాగానే ప్రభువా కాపాడుమని ప్రార్ధించిన మనిషి యొద్దనున్న దూత దేవునికి రిపోర్టు చేయును. వెంటనే దేవుడు కాపాడుమని ఆర్డరు చేయును. అప్పుడు దూతలు విశ్వాసులను కాపాడుదురు.

    కొన్ని సమయములలో మన కెదురైన ఆపద తప్పుకోదు. అందువల్ల హత సాక్షుల గుంపులోనికి వెళ్ళెదరు. వాక్యములో చిన్న పిల్లల దూతలు పరలోకమందున్న దేవుని ముఖమును చూచుచూ ఉందురని మనకు కనబడుచున్నది. ( మత్తయి 18:10) ఈ దూతలు చిన్నపిల్లలను

    • 1. కాపాడుట
    • 2. వారిని గూర్చి దేవుని రిపోర్టు చేయుట
    • 3. ఆర్డరు రాగానే చిన్న పిల్లలను కాపాడుట.

    ఇవి వారి పనులై యున్నవి. తమ యొద్ద నున్న దూతలను చూచుచున్న పిల్లలు వారిని చూచి ఆయా సమయములలో నవ్వుచుందురు. దూతలు చిన్నపిల్లల యొద్ద ఉందురు మీ పాదములకు రాయి తగులకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. (కీర్తన 91:12) చిన్న బిడ్డలకు ఏమియు తెలియదు గనుక పిల్లల పక్షముగా దేవుని ఆర్డరు వారి దూతలు దేవుని ముఖమును చూచుచుందురు.

    సాధు సుందర్ సింగ్గారు ఒకప్పుడు ఇలాగ అన్నారు. మనము ప్రార్ధించిన మన గదిలోని దూతలను దేవుడు చూపించును. మనము పంపించుమని అడిగిన దేవుడు చూపించును అని అర్ధము.

    జలముల దూత:- 6వ వచనములో జలముల దేవదూత అని వ్రాయబడియున్నది. గనుక పైన చెప్పిన వన్నియు దీనికి అద్ధారమై యున్నది. దుర్మార్గుల యొదాకూడ దేవదూతలు ఉందురా? దుర్మార్గులు మనస్సాక్షిని రేపుటకును నీవు చేయునది తప్పని చెప్పుటకును ఉందురు భక్తుల యొద్దకూడా వారిని ప్రోత్సాహపర్చుటకు దేవదూతలు ఉందురు. ఈ దూతలు దేవుని న్యాయమైన పనులను, దేవుడుయిచ్చు శిక్షను మెచ్చుకొందురు. న్యాయస్థానములో జడ్జిగారు యిచ్చు జడ్జిమెంటులో ఒక మనిషికి శిక్షగాని, విడుదలగాని ఉండును శిక్ష కాలమున శిక్ష తప్పదనివాక్య గ్రంధము వివరించుచున్నది.

    తీర్పులు సత్యములు న్యాయములు నైయున్నవి న్యాయస్థానములో వాధిపక్షముగాను ప్రతివాది పక్షముగాను ఇద్దరు న్యయవాదులు ఉందురు. నేర్స్తుడు తన నేరమును ప్రతివాది పక్షముగాను ఇద్దరు న్యాయవాదులు ఉందురు. నేర్స్తుడు తన నేరమును కప్పి పుచ్చుటకు అబద్దము చెప్పిన అన్యాయవాది నేరస్థుని విడిపించుటకు అబద్ద పక్షము, వాదింతురు. గనుక పరలోకములో ఇతడు చేసినది సత్యమని దేవదూతలు, వాక్రగ్రంధము మనస్సాక్షి వాదింతురు. సత్యమును అసత్యమని వాదించు పోటీదారులు ఉండరు.

    పటాలములో సైనికులు లైనుగా నిలువబడవలెను. డేరా వరకు నిలువ బడియుందురు. మార్చ్ అనగానే శత్రువులు ఎక్కడ ఉందురో అక్కడికి వరుసగా బయలు దేరుదురు. అలాగునే దేవదూతలైనవారు ఒకరి తరువాత ఒకరు, దేవుని మహిమ కొరకు తమ పనులు జరిగింతురు.

    ప్రార్ధన:- దయానిధివైన మా తండ్రీ! మాకు అనుగ్రహించిన నీకృపాసమయము వాడుకొనే కృప దయచేయుము. నీవు ఇచ్చిన సమయమును సద్వినియోగము చేసికొనకపోతే శిక్ష తప్పదు గనుక నీవు మాకు ఇచ్చిన సమయమును వాడుకొనుటద్వారా నీ వలన పొంద వలసిన దీవెన పొందే కృప దయచేయుము. యేసు నామమున వేడుకొనుచున్నాము, ||ఆమెన్||

    ప్రక. 16:8

    నాల్గవ దూత తన పాత్రను సూర్యుని మీద కుమ్మరింపగా మనుష్యులను అగ్నితో కాల్చుటకు సూర్యునికి అధికారము యియ్యబడెను. పాత్రల శ్రమ కాలములోని అవిశ్వాసులు ప్రభువా మాదే తప్పు అని అంటే శ్రమ పోవును. కాని వారు అలాగున అనక దేవునిని దూషించిరి. క్రైస్తవ సంఘములో ఉన్న విశ్వాసులపై దేవుడు తన ఆత్మను కుమ్మరించగా కుమ్మరింపు నిరాకరించిన వారికి చివరగా కోపాగ్నిపాత్ర కుమ్మరించును. పూర్ణ కోపాగ్ని యిదియే. దేవుడు తన కొలతలేని ఆత్మను ఎంతో విరివిగా అనుగ్రహించును. లూక 11:13 అదేరీతిగా ఇప్పుడు కూడా తన కొలతలేని కోపాగ్నిని భూమి మీద కుమ్మరించివేసెను.

    పాత్రలు నాలుగు విధములు:-

    • 1. రక్షణ పాత్ర
    • 2. ప్రభు భోజన పాత్ర
    • 3. ప్రార్ధన పాత్ర
    • 4. కోపాగ్ని పాత్ర

    ఈ నాల్గవ పాత్రలో దేవదూత సూర్యుని మీదకి కృమ్మరించినది. సూర్యుని వేడివల్ల చావక అవిశ్వాసులు ఇక్కడ శిక్ష బ్రతుకులోనున్నారు. దేవుడు వెలుగైయున్నాడు. ఆ వెలుగు నరులకు ఇవ్వగా నరుడు ఆ వెలుగులు అంగీకరించలేదు. వెలుగునకు బదులుగా చీకటి కోరుకున్నాడు. వారు కోరుకున్న రీతిగానే చీకటి బిలములోనికి వారిని దేవుడు పంపించివేయును.

    ప్రక. 16:10-11

    ఐదవదూత తన పాత్రను కౄర మృగము యొక్క సిం హాసనము మీద కుమ్మరించెను. ఏడుపాత్రల వలన కలిగిన శిక్షలు రెండు భాగములుగా ఉన్నవి.

    • 1. అంతిక్రీస్తును సేవించు చున్నవారికి అనగా అంతిక్రీస్తుముద్ర గలవారికి
    • 2. అంతిక్రీస్తుకు శిక్ష అబద్ద ప్రవక్తదయ్యమునకు శిక్ష.

    మనుష్యుల మీదికి అనగా

    • 1. ముద్ర గలవారికి
    • 2. ఆ కౄరమృగమునకు నమస్కరించినవారికి
    • 3. అంతిక్రీస్తు మీదికి
    • 4. అబద్దప్రవక్త మీదికి
    • 5. కప్పల మీదికి ఈ శిక్ష వచ్చును.

    దేవలోకములో దేవుని సిం హాసనము ఉన్నది. నరుడు ఆ సిం హాసనమును తృణీకరించి నందున అంతిక్రీస్తునకు సిం హాసనము లభించెను. తండ్రీ కుమార, పరిశుద్ధ త్రిత్వమున్నది. ఈ త్రిత్వమును నరుడు తృణీకరించినందున అపవిత్రమైన త్రిత్వము వచ్చెను. ఈ త్రిత్వమును నరుడు తృణీకరించినందున అపవిత్రమైన త్రిత్వము వచ్చెను. ఈ త్రిత్వములో సైతాను, అంతిక్రీస్తు అబద్ద ప్రవక్త అనువారు ఉన్నారు. ఐదవదూత పాత్రను కుమ్మరించగా అంతిక్రీస్తు రాజ్యము చీకటి కమ్మెను. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశములో ఉండగా ఐగుప్తీయులకు కలిగిన తెగుళ్ళలో ఒక తెగులు చీకటి. మోషే ఆకాశము వైపు తన చేయి ఎత్తినప్పుడు ఐగుప్తు దేశమంతయు మూడు దినములు గాడాంధకారమైనది. ఒకని నొకడు కనుగొనలేని గాడాంధకారము ఐగుప్తు దేశముపై కమ్మెను. (నిర్గమ 10:22) అలగే అంతిక్రీస్తు పాలనలో ఇట్టి గాడాంధకారము కలిగెను. ఐగుప్తులోని చీకటిని ఈ చీకటి జ్ఞాపకము చేయుచున్నది. ఇది భయంకరమైన చీకటి. దీనిని సిరా చీకటి అందురు.

    ప్రార్ధన:- దయగల ప్రభువా రాకడ విశ్వాసులు పాతాళలోకము, భూలోకము, పరలోకములో యే రీతిగ సంగతులు జరుగుచున్నవో, నీవు తెలిసికొనగలవు. అట్టి సంగతులు భూమి మీద నున్న నీ విశ్వాసులైనవారికి తెలియపరచుము. భూలోకములోని విశ్వాసులైన వారి మీదికి దుమ్ము, ధూళి పడుచున్నందున పరిపూర్ణ స్థితిలోనికి మారలేక పోవుచున్నారు. ఎక్కువగా కూడుకొనుట వాక్యపఠన చేసిన విశ్వాసులకు గొప్ప కళవచ్చును. ఆవిధముగా విశ్వాసులను నడిపించుము. కావలికాచే దూతలను మా చుట్టు ఉంచుము. భూతలములను తరివేయుము. విశ్వాసులను నీ అపరంజి వంటి సంఘముగా మార్చుము. విశ్వాసులకు ధైర్యము, నడిపింపు అనుగ్రయించుము త్వరగవస్తున్న ప్రభువును బట్టి వేడుకొనుచున్నాను. ||ఆమెన్||

    కోపములు రెండు. అదునులోనే పదునుగా ఉన్నవి.

    1. వాయు మండల కోపము:- పాతాళలోకములోనున్న దయ్యాలు దేవుని మీద కోపము గలవై తమ మిషనులకు పనిపెట్టుచున్నవి. సైతాను పని అంతమైపోయేటట్లు ఉన్నదనియు, దేవునిపని నిలిచేటట్లు ఉన్నదనియు తెలిసికొని ఆరువేల సంవత్సరముల నుండి దేవుని పనిని పాడుచేయాలని అనుకొని మినుగురు పురుగులవలె విశ్వాసులు కూటాలు పెట్టుకొనుచున్నారని తమపని తను కోసము, తమ సాధనాలు తమ అనుభవము ద్వారా ఎక్కువ చేసికొనుచు వెర్రికోపముతో నిండుకొని గందరగోళం పడుచున్నవి.

    విశ్వాసులకు ఏమితోచుననగా ఎన్నో ప్రార్ధనలుచేసి విశ్వాసాభివృద్ధి పనులు ఎన్నిచేసికొన్న సైతానుపని ఎక్కువ జరుగుచున్నదని చెప్పుకొనుచు ఉంటే సైతానుకు లోకువ. అలాగు చెప్పుకొనకూడదు.

    • 1. పాత్రలకాలములో దేవుని కోపమును
    • 2. అంధకార రాజ్యములో సైతాను దయ్యముల కోపము ఎక్కువ అగుచు ఉన్నది.

    ప్రక 16:12

    పాలస్తీన ఉన్నది. దానికి సమీపముగా ఉత్తరమున ఫరాతునది ఉన్నది. 6వ పాత్ర పట్టుకొన్న దేవదూత తన పాత్రను ఈ నదిపై కుమ్మరించెను. ఈ నదికి ప్రక్కగా కొన్ని పడమటి రాజ్యములు ఉన్నవి. ఇంకొకప్రక్క తూర్పు రాజ్యములు ఉన్నవి. ఈ నది ఆదాము పుట్టినప్పటి నుండి యున్నది. దూత ఈ పాత్రను ఇ నదిపై కుమ్మరించు వరకు ఈ నది పారుచునే యున్నది. ఈ నది ఎండ్పోయేటట్లు ఈ పాత్ర కుమ్మరింపబడినది. ఆదాము హవ్వల కాలములో ఏదెనుతోట వృద్ధికి ఈ నది సృష్టింపబడినది. ఈ ఆరోవపాత్ర కాలములో సమాప్తము అనగా నది ఎండిపోయెను. ఈ పాత్రలకు సమాప్త పాత్రనిపేరు. ఇది ఎందుకు ఎండిపోవలయును? తూర్పు దేశపురాజులు వారి సైన్యములు సుళువుగా పోవలెను నీరు అడ్డుగా నుంటె రావీలులేదు గనుక ఈనది ఎండెను.

    సృష్టి ఆరంభములో ఏదెను తోట ఎంతో పెద్దదైయున్నది ఈ తోటనంతటిని తడుపుటకై నాలుగు నదులు దేవునిచేత సృజింపబడెను. ఆ నాలుగింటిలో ఒకటి ఫరాతు అను యుఫ్రటీసు నది (ఆది 2:14) పూర్వము ఏదేను ఎంత పెద్దతోటగా నున్నదో ఇప్పుడును ప్రపంచము అంతా ఏదేనుతోటవలె కావలసి యున్నది. గాని సైతాను వచ్చి పాడుచేసెను. భూలోకమంతా ఏదేను తోటవలె ఆవరించే వరకు నీటిని ఈ నాలుగు నదులు ప్రవహింప చేయవలసినది. ఆదాము ఈ తోటంతటిని వ్యవసాయము చేయవలసియున్నది. కాని పాప ప్రవేశమును బట్టి దైవచిత్తము నెరవేరలేదు అంతపంట ఎందుకు కావాలి? దేవుడు ఆదాము హవ్వలకు వాగ్దానము ఇచ్చిరి; అదేమనగా మీరు భూమిని నింపుడి అని అన్నారు. గాన అందుకు చేయవలసి వచ్చినది. ఆదాము పాపము చేయకపోతే ఈ గుంటూరు అంతా ఏదేనుతోటగా మారి ఉండును.

    భూమి మీద నున్నతోట భూమి మీద ప్రవహించు నదుల వలన వృద్ధిలోనికి రావలసి యున్నది. పాప ప్రవేశము వలన అది నెరవేర్పులోనికి రాలేదు. అందువల్ల దేవుడు ఒక క్రొత్త ప్లానువేసెను. శరీర సంబంధముగాను లోక సంబంధముగాను తాను ఆలోచించినపని నెరవేరలేదు గనుక తాను తలంచిన ఆ తోటను వృద్ధిచేయుటకు మరొయొక ఏర్పాటుచేసెను. యెషయా 5వ అధ్యాయము ఆ తోట వృద్ధిలోనికి రానందున సంఘమనే తోట ఆరంభిచెను. ఆ తోటలో హేబేలు దేవునియొక్క మొదటి గొప్ప విశ్వాసి. ఈ హేబేలు హతసాక్షి యైనాడు. గనుక గొప్ప ఫలితము కనబడినది. హేబెలు రక్తము క్రీస్తు రక్తమునకు సూచనగా నున్నది. అప్పటి నుండి ఒక్కొక్క విశ్వాసి తోటలోని ఒక్కొక్క చెటయి యున్నారు. అవి వృద్ధికాలేదు దేవుడు ప్రత్యేక జనమైన యూదులను చేరదీసి వారిని పోషించి పెంచిన్నరు గాని వారు తగు ఫలితము యివ్వలేకపోయినారు. గనుక వారిని విడిచిపెట్టి అన్యులను ఏర్పాటు చేసుకొనుట వలన సంఘము వృద్ధి అయినది. దేవుడు తన జనాంగమును వృద్ధి చేసుకొనుచునే వచ్చును. సాతానుడు హేబేలును చంపినాడు పిమ్మట షేతు వచ్చెను. ఒకరి తరువాత ఒకరు వచ్చిన సంఘము వృద్ధి యైనదిగాని తగ్గలేదని కోపము వచ్చినది ఈ లోకములో దయ్యాలు ఎక్కువ. వానిపని ఎక్కువ వానియుద్ద సమానులు ఎక్కువ వాని ఫలితాలు చేతిలో ఎక్కువగా నున్నవి.

    ఫరాతు నది వద్ద బంధింపబడియున్న నాలుగు దయ్యములను దేవుడు విడిచిపెట్టినాడు. ఆ విడిచి పెట్టడమే అవిశ్వాసులకు శిక్ష. దేవదూత తన పాత్రను కుమ్మరింపగా ఈ ఫరాతునది ఎండిపోయెను. ఎందుకు ఎండిపోయెననగా ఆ నదిలో నుండి సైతాను పటాలములన్నియు నది దాటి హర్మగెద్దోను స్థలమునకు వచ్చి యుద్ధము చేయగా ఈ దయాలన్ని నాశనము కావాలి హర్మ్ర్మగెద్దోను యుద్ధము సమయము దగ్గరపడినది.

    ఉదా:- ఒకపల్లెటూరిలో ఒక ప్లీడరుగారు ఉన్నారు. ఆయన ఒకక్రొత్త ఇల్లు కట్టుకొన్నారు. ఒక రోజు మధ్యరాత్రి కాలములో 12 మంది దొంగలు ఆ ఇంటిలోనికివచ్చిరి. ఆ ప్లీడరుగారు మధ్యరాత్రి లేచి దొంగలు వచ్చినారని తన ఇంటి వారందరికి చెప్పి వచ్చిన దొంగలకు మా ప్రాణాలు మాత్రము ఉంచండని తాళాలు యిచ్చివేసిరి. పైబట్టతో ప్లీడరుగారు బయటపడిరి. ఈ దొంగలు ప్లీడరుగారి ఇంటిని దోచుకొని సామానులను స్టేషనకు దాటించిరి. దొంగలు వెళ్ళిపోయిన పిమ్మట ప్లీడరుగారు మరువేషము వేసుకొని దొంగలను వంటాడెను. రైల్ స్టేషనులో ఉన్న స్టేషను మాష్టరు గారికి ఇంగ్లీషులో చెవిలో ఏదో చెప్పెను. స్టేషనుమాష్టరుగారు ఆ 12 మంది దొంగలకు టికెట్లుయిచ్చిరి. దొంగలు రైలుబండి ఎక్కిరి. ప్లీడరుగారు వచ్చుట మర్మము. దొంగలకు టికెట్లు యిచ్చుట మర్మము దొంగలు రైలు పెట్టిలో ఎక్కుట మర్మము. ఈ మర్మము ఎవరికి తెలియదు. దిగవలసిన స్టేషనులో ఆ దొంగలు దిగుచుండగా పోలీసులు రెడీగా ఉండి వారిని పట్టుకొనిరి. వారు దిగవలసిన స్టేనులో ఉన్న స్ట్తేషను మాష్టరుగారికి ఈ స్టేషను మాష్టరుగారు ఫోనుచేయగా దొంగలను పోలీసులు పట్టుకొనిరి. ప్లీడరిగారి సొమ్ము అంతా తిరిగి యిచ్చివేసిరి. కాబట్టి మనిషి ఒకటి తలంచిన దేవుడు మరొయొకటి తలంచును కనుక తన సంగతి ఏమి అగునో అని తెలియని సైతాను తన పటాలమును పోగుచేసికొని తన నాశనముకై హర్మగెద్దోనునకు చేరుకొనెను.

    చుట్టు ప్రక్కన ఉన్న క్రైస్తవ రాజులు రేప్చర్లో వెళ్ళిపోవుదురు. మిగతా రాజులు తమ నాశనము నిమిత్తము హర్మగెద్దోను చేరుకొందురు. ఆ ప్లీడరుగారు పాండి మీ నాశనమునకు మీరే కారకులు అని ఆ దొంగల విషయములో చేసినట్లు దయ్యములు, అంతిక్రీస్తు, అబద్ద ప్రవక్త, కప్పలు, దయ్యములు పట్టినవారు వస్తూ ఉండగా రండి, రండి నాశనమునకు రండి అని పరిశుద్ధులు, దూతలు అనుకొందురు. హతసాక్షులైన విశ్వాసులు పరలోకమునకు వెళ్ళుట యెరుకె ఎందుకంటె వారు ఇప్పుడు తమ విరోధులను యెదిరించి వారిని హతమార్చుటకు ఇది మంచి తరుణము. ఫరాతు నది ఎండిపోయి నందువల్ల అట్లు పరిశుద్ధులకును ఇటు సైతానునకును యుద్ధము చేయుటకు అనుకూలమే. సైతాను హర్మగెద్దోనుకు తన పటాలమును తయారు చేసికొని రానైయున్నాడు. పరలోకము నుండి ప్రభువుకూడా తన పటాలమును వచ్చెదరు. విశ్వాసులు హర్మగెద్దోనుకు రాకుండ ప్రభువు పక్షముగా నుందురు సైతాను పటాలము అక్కడికి వెళ్ళెనుగాని విశ్వాసులు ప్రభువు యొద్దనే ఉందురు. ఇది తూర్పు రాజుల మార్గము. నరులు తమ పాపకార్యములు తన ఇష్టానుసారముగా చేయుటకు సాతానుడు వారిని తీసికొని పోవును. ప్రభువు యూదా ఇస్కరియోతుతో నీవు చేయవలసినపని త్వరలో చేయుమని సెలవిచ్చెను. దూత తన పాత్రను కుమ్మరించుటనుబట్టి నది ఎండుటను బట్టి విశ్వాసులకు కూడా ద్వారము తెరువబడెను. విశ్వాసి సైతాను మాటకు లోబడడుగాని అవిశ్వాసి సైతాను చెప్పిన మాటను వినును.

    తూర్పు రాజులు వచ్చెదరు:- క్రైస్తవులు ఎవరైన చనిపోతే తల భాగము పడమటివైపు పెట్టి సమాధి చేయుదురు. ఎందుకు? క్రీస్తు తూర్పునుండి వచ్చును గనుక సమాధిలోని వారు లేచి నీతి సూర్యుడైన ప్రభువు ముఖబింబమును చూచుటకు అలాగు చేయుదురు. భూలోక సూర్యుడైన అంతి క్రీస్తుకూడా తూర్పునుండి ఉదయించును. తూర్పురాజులు తూర్పు నుండియు పడమట నుండియు వచ్చెదరు. వీరిని పోగుచేయుటకై మూడు కప్పలు బయలుదేరును. ఈ కప్పలు ఘటసర్పమునోట నుండియు, కౄర మృగము నోట నుండియు, అబద్ధ ప్రవక్తనోట నుండియు బయలు వెడల్నైయున్నవి. క్రీస్తు కూడ తూర్పునుండియే వచ్చును. ఆ తూర్పు దిక్కునుండియే పరలోక పటాలము కూడా వచ్చును. వీరు పరిశుద్ధులు. మొదటి పటాలములోని వారు అవిశ్వాసులు భూమి మీదనున్న విశ్వాసులైన వారికి హానిలేకుండ ఈ హర్మెగెద్దోను యుద్ధము జరుగును. భూలోకములో యుద్ధకాలమందు ఉన్న విశ్వాసులు భయపడుదురుగాని హానిలేదు. ప్రభువే వారి మధ్య స్వయముగా నుండును గనుక ఇది ఆశ్చర్యకరమైన యుద్ధమె.

    దావీదు కాలములో బెత్లెహేము బావి యొద్ద నీళ్ళు చేదుకొనుటకై ఫిష్తీయుల కావలి వారిని ఓడించి దారిచేసుకొని గవిని దగ్గరనున్న బావినీళ్ళు తోడుకొనివచ్చి దావీదు కిచ్చిన ఆ ముగ్గురు బలాడ్యులకు యే హానికలుగలేదు. ఆ నిటిని చూచిన దావీదు యిది బావినీళ్ళుకాదు గాని యిది మీ రక్తము అని పలికి ఆ నీరు త్రాగలేదు. ఆ నీటిని దేవుని సన్నిధిలో పారపోసెను. (2సముయేలు 23:15) అలాగే యుద్ధకాలమందున్న విశ్వాసులకు యే హాని కలుగలేదు. నేటి కాలమందును పెండ్లికుమార్తె వరుసకు సిద్ధపడుచున్న వారికి సైతానువల్ల అనేక కాలమందును పెండ్లికుమార్తె వరుసకు సిద్ధపడుచున్న వారికి సైతానువల్ల అనేక శ్రమలు వచ్చినా మరణము రాకుండ దేవుడు వారిని కాపాడును. దావీదు కాలమున ముగ్గురుబలాడ్యులను కాపాడెను. ఆ హర్మగెద్దోను యుద్ధకాలమందు విశ్వాసులను కాపాడును. క్రీస్తు పటాలముతో యుద్ధము చేయుటకు సైతాను తనకు బలము చాలదని గ్రయించి మనిషి పటాలమును, వాయు మండలములోని దయ్యాల పటాలమును, పాతాళములోని దయ్యముల పటాలమును తన పటాలములో చేర్చుకొన్న అవికూడా చాలదని కప్పలను కూడా రప్పించెను. ఈ కప్పలు అపవిత్రతకు గుర్తు. అంతిక్రీస్తు జయించలేడు గదా ఐగుప్తులో కూడా ఐగుప్తు నాశనమునకై దేవుడు కప్పలను పంపెను.

    ప్రార్ధన:- దయగల ప్రభువా యెహోషువ కాలములో సైన్యాధిపతిపై కత్తి పుచ్చుకొని మైదానము మీద నీవు కనబడినావు. నీవు ఎవరి పక్షమని యెహోషువ అడుగగా నేను దేవుని పక్షపు వాడవని అన్నావు. ఇక్కడ నున్న మమ్ములను దేవదూతలు వచ్చి మేము క్రీస్తు పక్షపు వారమని చెప్పిన యెడల ఒప్పుకొనే స్థిరవిశ్వాసము దయచేయుము నీ అండలో నీ పక్షపు వారముగా జీవించే నీ కృప దయచేయుము. నూతన స్వరూపము ధరించుకొనునట్లు ప్రతివారిని మార్చుము దావీదు పటాలపువారు శ్రమల యెదుట ఉన్న త్రోసివేసి వెళ్ళునట్లు మేమును శ్రమలను త్రోసివేసే కృపదయచేయుము వాయుమండల పాతాళపు పటాలములు యేకీభవించగా మమ్ములను ఏమియు చేయనేరవనే ధైర్యము దయచేయుమని త్వరగా వస్తున్న ప్రభువును బట్టి వేడుకొనుచున్నాను.

    ప్రకటన 16: 13 -15

    ప్రార్ధన:- దయారసము గల తండ్రి. నీ వాక్యమును మాకు అనుగ్రయించినావు గనుక స్తోత్రములు. నీ పరిశుద్ధాత్మను కూడ మాకు ద్యచేయుము. వాక్యప్రకారము గ్రయించి నడిచే ప్రేరేపణ యిమ్ము. వాక్య నిజార్ధము గ్రయించే జ్ఞానశక్తి యిమ్ము. ఒక యుగములోని వారికి కొన్ని మర్మములు అనుగ్రయించినావు. మరియొక యుగములోని వారికి మరికొన్ని మర్మములు అనుగ్రయించుచున్నావు. ఈలాగు ప్రతియుగములలోను, మర్మములను బయలు పర్చుచున్నందుకు నీకు స్తోత్రములు దేవదూతలను మా చుట్టు కావలి ఉంచుము. దయ్యముల సమూహమును వెళ్ళగొట్టుము. మా అందరికి శరీర ఆరోగ్యమును దయచేయుము. మాలోని నైజముపై విజయమును దయచేయుము మీ వాక్యజ్యోతిని మా హృదయముల మీద వెలిగించుము. మన సాక్షి విశ్వాసము, జ్ఞానము, ధైర్యమును, ప్రవర్తనను వెలిగించుచున్నది. ఇక్కడ ఉన్నవారిని శాంతిపరిచే కృపదయచేయుమని త్వరగా వచ్చుచున్న ప్రభువును బట్టి వేడుకొనుచున్నాము. || ఆమెన్ ||

    ఈ వాక్యములలో ముగ్గురు ప్రముఖులు కనబడుచున్నారు.

    • 1. ఘటసర్పము,
    • 2. కౄరమృగము,
    • 3. అబద్ధ ప్రవక్త.

    ఆరవదూత తన పాత్రను కుమ్మరింపగా ఘటసర్పము నోటనుండియు, కౄరమృగము నోటనుండియు, అబద్ద ప్రవక్త నోటనుండియు కప్పలవంటి మూడు అపవిత్ర ఆత్మలు బయలు వెడలెను. ఈ కప్పలు, కప్పలు కావుగాని కప్పలవంటి ఆత్మలు కలిగినవి. వీటి జన్మష్తానముపైన ఉదహరింపబడిన ఆ ప్రముఖులె. ఇవి వారినోటినుండి వచ్చెను. అవి కప్పలవంటి దయ్యములు. ఇవి సూచన చేయు ఆత్మలు.

    వారి నోటిలోనుండి ఈ కప్పలు ఎందుకు రావలెను? నెత్తిమీద నుండి గాని, చేతిలో నుండిగాని, కాళ్ళు చేతులలో నుండిగాని అవి ఎందుకు రాకూడదు మంత్రములు చేయుటనుబట్టి ఈ కప్పలు రాలేదుగాని ఆపైన ఉన్న ముగ్గురి హృదయములె ఈ కప్పలకు స్థావరములై యున్నవి. గారడి వాడు తన మత్రమును బట్టి గొంతులో నుండి రాళ్ళుతీయును. ఇంగ్లీషులో (sligth of the hand ) అని అందురు. దీనినే తెలుగులో హస్తలాగము అందురు.

    లాగము = కాకి. = తేలిక అని అర్ధము.

    ఆ ముగ్గురిలోనుండి వచ్చుటనుబట్టి ముంగుర్తు ఏమిటి? వెలుగు కలుగును గాక అని దేవుడు పలుకగా వెలుగు కలిగెను. దేవుని క్రియకు పోటీగా ఆ త్రిత్వము కప్పలను సృజించెను. దేవుడు వెలుగును కమ్మని సెలవియ్యగా వెలుగు కలిగెను. ఇది దేవుని యొక్క మంచి కార్యముగాని ఈ అపవిత్రమైన త్రిత్వము సృష్టిలోనికి చెడుగును తెచ్చి పెట్టవలెను గనుక అలాగు దురాత్మలైన కప్పలను భూమి పైకి పంపెను.

    ఉదా:- అయ్యగారు ప్రత్తిపాడులో స్వస్థిశాల స్థాపనచేసిరి. అందుకు వ్యతిరేకముగా ఆ స్వస్థిశాలకు ఎదురుగా ఒక అన్యుడు స్వథత కొరకు మంత్రముల శాలను పెట్టెను. దేవుడు వెలుగు కలుగునుగాక అని అనుటలో మంచియున్నది చెడుగువల్ల అద్భుత క్రియలు జరిగిన అది మనకక్కరలేదు.

    ఉనికి అను ఒక గ్రామమున్నది. అందులో ఒక ముసలాయన ఉన్నాడు. అతనికి స్వప్నములో ఒక నల్లని మనిషివచ్చి కనబడి నీకున్న వాతపుజబ్బు మందులేకుండ తొలగించి వేయుదునన్నాడు. నీవు నాకు మొక్కితే పోగొట్టెదనన్నాడు. ఆ ముసలాయన మ్రొక్కక పరలోక ప్రార్ధన చేసెను. గాని జబ్బుపోలేదు. పిదప జబ్బుతీసివేస్తానన్న దయ్యపు మనిషికి మ్రొక్కెను వెంటనే జబ్బుపోయినది. అప్పుడు ఆ ముసలాయన ఓ సాతానా నిన్ను పరిక్షించటానికేగాని ప్రభువును వదలి నిన్ను ఎందుకు మొక్కుతాను అని అనెను. తెల్లవారు నప్పటికి తన వ్యాధి ఎక్కువ అయ్యెను. సాతాను వలన స్వస్థత కలిగిన తరువాత కీడు రాకమానదు. గాని దేవునివల్ల కీడు కనబడిన మేలు ఉండక మానదు.

    ఇక్కడ ఆ ముగ్గురు సెలవియ్యగానే మూడు కప్పలు బయలువెడలెను అపవిత్రత ఆత్మలు కప్పల స్వరూపము ఎత్తెను గనుక అవి అపవిత్రములే 1తిమోథి 4:1. మోస పరచు ఆత్మలు కడవరి కాలములలో రానైయున్న వని అపోస్తులుడైన పౌలు చెప్పెను. మనము నివసించు ఈ కాలము కడవరికాలము మోసముచేయు మనిషి మంచి మర్యాదస్థునివలె కనిపించును. మనమును వారి సహావాసములోనికి వెళ్ళిన చెడిపోదుము. కప్పలు మనకు హానిచెయ్యవుగాని వానిలోనుండి హానికరమైన, మోసకరమైన ఆత్మలు నచ్చును. హానిచ్య్యని కప్పలవలె కనబడి హానిచేసే మోసకరమైన దురాత్మలు ఉండునని తలంచవలెను.

    ఒక నాడు ఒక కూటములోనికి ఒక కప్ప ఎగిరి ఒక అమ్మాయి మీద పడగా అందరు గలిబిలిపడిరి. వారిలోని మనోనిదానము చెడిపోయెను కప్పలు నరులకు చిరాకు కలిగించును. ఐగుప్తులో కప్పలు అన్ని స్థలముల లోనికి వచ్చెను. అవి ఐగుప్తులోని మనుష్యులకు చిరాకు కలిగించెను.(నిర్గమ 8:2) వాటినిబట్టి అసహ్యత కలిగెను. కప్పలనుబట్టి

    • 1. అపవిత్రత
    • 2. అసహ్యత
    • 3. ఆటంకము
    • 4. దురాత్మలు
    • 5. ఏడుసం|| రాల పాలన
    • 6. భీతి వీటన్నిటిని జ్ఞాపకము చేయును.

    కప్పను మొక్కుదురు. కప్ప అపవిత్రాత్మకు గుర్తై యున్నది. ఈ కప్పలను అప్రముఖులు కలుగజేసినారుగాని దేవుడు కలుగ జేయలేదు. కప్పలు, పాములు, మున్నగునవి సైతాను సృష్టియై ఉన్నవి. అపవిత్రములైన వన్నియు సైతాను సృష్టి. అపవిత్రమైన జంతువులు దేవుని వలన కలుగలేదు. అపవిత్రమైన వాటినిబట్టి మేలు ఉండదు దేవుడు వారిని అంగీకరించడు రౌడివారిని కొట్లవద్ద కొందరు కావలి పెట్టుదురుగాని వారివల్ల మంచి ఉండదు దయ్యములు కూడా స్వస్థత కార్యములు చేయునుగాని అవి శాశ్వతమైనది కాదు.

    సర్వాధికారియైన దేవుని మహాదినము జరుగు యుద్ధమునకు లోకమంతట ఉన్న రాజులను ఈ కప్పలు పోగు చేయుటకే బయలు వెళ్ళెను.

    • 1. సర్వాధికారి,
    • 2. దేవుని మహాదినము.
    • 3. యుద్దమనేది దేవుని అంతరంగమందు ఉన్నది
    • 4. లోకమంతట ఉన్న రాజులు.
    • 5. పోగుచేయుట
    • 6. యుద్ధభూమి

    సర్వాధికారియైన దేవునిలో సంపూర్ణ అధికారము ఉన్నది. దేవుని అధికారమునకు పోటీగ కప్పలు కూడా తమకున్న అధికారమును బట్టి దేవునిని హేళనచేయు నిమిత్తము రాజులను పోగుచేసెను. రాజు లైనవారు తమ రాజ్యములలో తమకున్న అధికారముతో వెళ్ళిరి. దేవునికి అధికారమున్నది. రాజులకు అధికారమున్నది. కప్పలకు అధికారమున్నది. ఈ మూడు అధికారములలో రెండింటిలో చెడుగున్నది. దేవుని మీదకు యుద్ధమునకు సిద్ధపడు రాజులున్నారు. యోహాను12 అ.లో తూర్పు రాజులు అని వ్రాసెను. పడమటి రాజులు అనివ్రాయలేదు పడమటిరాజులు పెండ్లి కుమార్తె వరుసలోనికి వెళ్ళుదురు వారి బదులుగా వచ్చిన అవిశ్వాసుల రాజులు పడమటి నుండి యుద్ధమునకు వచ్చిరి. ఏడు సంవత్స్రముల శ్రమకాల దినములలో క్రైస్తవ రాజులైనవారు పరిపాలనలో ఉండరు.

    ఉదా:- 30 సంవత్స్రముల క్రిందట ఒకహిందు దేశస్థుడు, ఇంగ్లండును పరిపాలించు చున్న జార్జి చక్రవర్తిగారి దర్భారులోనికి వెళ్ళెను. ప్రభురాకడను గురించి రాణిగారికి తెలియజేయగా మేమందరము ప్రభు రాకడ కొరకు ఎదురు చూచుచున్నాము అని రాణిగారు జవాబిచ్చిరి. గనుక రాజులు వారి కుటుంబము ప్రభువు రాకడకొరకు సిద్ధపడుచున్నారు. విక్టోరియా మహారాణి గారు పెండ్లి కుమార్తె వరుసకు సిద్ధపడినారు. వారు అనేక మార్లు అయ్యగారికి కనిపించిరి వారు దర్శ్నములలో కూటములలోనికివచ్చిన ఏదో ఒక వర్తమానము అందించెడివారు. కొన్నిమార్లు వృద్దాప్య రూపములో కనిపించెడివారు. కొన్నిమార్లు పెండ్లికుమార్తెలు ధరించు వెయిల్ వేసికొని కనిపించెడివారు

    ప్రార్ధన:- దయగల తండ్రీ వేషధారులను గూర్చి పాఠము నేర్చుకొన్నాము వేషదారణ యొక్క వేషము వల్ల మేము మోసపోక నీ రాకడకు సిద్ధపడు కృప దయచేయుము. మంచి వారివలె చెడ్డవారు కనిపించినప్పుడు గ్రహించే కృప దయచేయుము. అపోస్తులుడైన పౌలు తెలియ జేసిన రీతిగా అంత్యదినములలో అబద్ధికులైన వేషదారులు వచ్చెదరని ఆత్మ చెప్పుచున్నాడు అనెను గనుక గ్రహించే జ్ఞానమిమ్ము ఆరవ పాత్రలోని చివరి విషయములు ఇప్పుడు జరుగక పోయిన వాటి వివరములు మాకు బయలు పర్చి నందులకు స్తోత్రములు. త్వరగా వచ్చుచున్న యేసు నామములో వేడుకొనుచున్నాము ||ఆమెన్||

    వస్త్రములు

    ప్రకటన 16:16

    1. ఇదుగో నేను దొంగవలె వచ్చుచున్నానని ప్రభువు పలికెను. దిగంబరుడుగా సంచరించుచున్నందున తనదిసములను చూతురేమోనని మెళకువగా నుండి తన వస్త్రములను కాపాడు కొనువాడు ధన్యుడు.

    • 1. ఇదిగోనేను దొంగవలె వచ్చుచున్నాను.
    • 2. మనిషి దిగంబరుడుగా సంచరించుచున్నాడు.
    • 3. ఇతరులైన జనులు ఆ మనిషి దినములను చూచెదరు.
    • 4. మెలుకువగా ఉండవలెను.
    • 5. వత్రములు కాపాడుకొనవలయును
    • 6. అట్టివాడు ధన్యుడు.

    మూడు వస్త్రములు ఉన్నవి

    1. మొదటి వస్త్రము:- ప్రస్తుతము మనము కట్టుకొనుచున్న పత్తి వస్త్రములు, మనిషి దేవుడు తనకు యిచ్చిన జ్ఞానమునుబట్టి తయారు చేసికొన్న వస్త్రము మనిషి సంపాదించుకొన్నాడు. ఇది దేవుడు ఇచ్చినదే. ఇవి భూలోకములో కాపుదలకొరకు యిచ్చిన వస్త్రములు.

    2. రెండవ వస్త్రము:- భూలోకములో కొందరు ప్రభువును ఎరుగని వారు ఉన్నారు. వారు దేవునిని ఎరుగుదురు గాని ప్రభుని ఎరుగరు. ఇతర మతములలో పుణ్యము సంపాదించుకొనుచు ఎవరిని బాధ పరచని సజ్జనులు ఉందురు. వరు మరియాదస్థులు గాను నీతిమంతులుగాను ఉందురు. మంచి పేరు సంపాదించుకొందురు. గాని వారికున్న ఆ నీతి వారిని మోక్షమునకు తీసికొని వెళ్ళనేరదు. వారి నీతిని అందరి మధ్యకు తీసికొని వెళ్ళగలరు దీనినే స్వనీతి అందురు. ఇది నిలబడినది. ఈ నీతి వస్త్రము స్వబుద్ధివల్ల సంపాదించుకొన్నది.

    3. మూడ వస్త్రము:- క్రీస్తు లోకములోనికి వచ్చి తన కార్యమువల్ల సంపాదించి యిచ్చునదే క్రీస్తు నీతివస్త్రము.

    • 1. మనిషి నేత వస్త్రము
    • 2. మనిషి నీతి వస్త్రము
    • 3. క్రీస్తు నీతి వస్త్రము
    ఈ మూడవ వస్త్రము ప్రభువు స్వయముగా నిచ్చునది.

    పెండ్లికుమార్తె పెండ్లి అగునంతవరకు ప్రశస్థ వస్త్రములు ధరించిన వివాహ సమయములో ప్రధానములో ధరించు వస్త్రము ఇంకామంచి వస్త్రమై ఉండుట పరలోకములో జరుగు పెండ్లి విందులో పెండ్లి కుమార్తె కూర్చుడవలెనన్న పెండ్లికుమారుడైన ప్రభువు పెండ్లి కుమార్తెకు ప్రధాన వస్త్రములు పంపవలయును. అదే క్రీస్తు యిచ్చు నీతి వస్త్రము. భూలోకములోని నేతవస్త్రములు పరలోకములో పనికిరాదు.

    పరలోకములో క్రీస్తు ప్రభువు కొంతకాలము దేవుడుగా నుండి తరువాత బెత్లెహేము బాలుడుగా భూలోకమునకువచ్చి 33 1|2 సంవత్స్రములు మనిషిగా మాదిరి చూపి తనను వెల్లడి పరచుకొనుటె నీతి వస్త్రమై యున్నది. భూలోకములోనికి వచ్చి సంపాదించినది నీతి వస్త్రము. ప్రభువునకు పరలోకములో నీతి వస్త్రమున్నది. ఎందుకంటే పరలోకములో నీతి ఉన్నది. నీతియావత్తు ఈలాగు జరుగ నిమ్ము (మత్తయి 3:17) అని ప్రభువు బాప్తిస్మకాలమున స్నానికుడైన యోహానుకు తెలియజేసెను. అనగా బాప్తిస్మము నీతి అని అర్ధము అనగా బాప్తిస్మమును బట్టి నీతి యావత్తు జరుగనిమ్ము అని అర్ధము.

    మోషేకాలములో ధర్మశాస్త్రమువచ్చినది. దాని ప్రకారము యూదులైన వారును అన్యులైన వారును నడువవలెను యూదులైనవారుధర్మశాస్త్రప్రకారము నడచుట అనునదినీతియావత్తు అని అర్ధముగాని యూదులు నడువవలెను. ధర్మశాస్త్రప్రకారముగా నడుచుట నీతియైయున్నది. ఆజ్ఞలు అనేక వందలున్నవి. ద్వితియోపదేశ కాండము, నిర్గమకాండము, ప్రవక్తల గ్రంధములలోను అజ్ఞలున్నవి గాని వానిలో ముఖ్యమైనవి 19 ఆజ్ఞలు

    నూతన నిబంధన గ్రంధములోని జెకర్యా, ఎలిజబెతుల నీతి మంతులుగా పేరుపొందిరి. ఎందుకంటె వారు సకల ఆజ్ఞల ప్రకరముగా నడచుకొనిరి.

    ఆజ్ఞలు రెండు రకములు

    • 1. దైవాజ్ఞ
    • 2. న్యాయవిధులు
    జెకర్యా, ఎలిజబెత్తులు పై రెండింటి ప్రకారంగా నడిచిరి. అదే ప్రభువు స్నానికుడైన యోహానుతో మనకు అన్నారు. అనగా వారిద్దరికి అని అర్ధము. నీతి తల్లిదండ్రులు నీతి నెరవేర్చినారు గాన మనమును నెరవేర్చవలసియున్నది. అని ప్రభువు యోహానుతో చెప్పెను.

    బాప్తిస్మము అనునది ఆజ్ఞలలో లేదుగాని ఈ ఆచారములలోను కట్టడలలోను న్యాయవిధులలోను తప్పక ఉండి తీరును. గనుక నీవు అందరికి యిచ్చుచున్నావు గనుక నాకుమారుడా యిమ్ము. బాప్తిస్మము అనునది యోహానుకు బయలుపడినది, గనుక బాప్తిస్మము పొందుట ఆజ్ఞలన్నిటికి సంపూర్ణత గనుక ప్రభువు యిమ్మని తీసికొనిరి. న్యాయవిధులు పెద్దలు దేవుడుకూడ ఏర్పరచినవై యుండి కొన్ని ఆజ్ఞలు కొన్నికట్టడలు కలిపి న్యాయవిధులైనవి. భూలోకమందు ప్రభువు చేయుచున్న పనులను చూచుటకు శాస్త్రులు పరిసయ్యులు వచ్చేవారు

    • 1. శాస్త్రులు
    • 2. పరిసయ్యులు,

    యేసు యూదుల ధర్మశాస్త్ర ప్రకారముగా నడచుటలేదని ప్రభువును అనేక ప్రశ్నలు వేసిరి. అసలైన ప్రశ్న విడిచిపెట్టి వేరె ప్రశ్నలు వేయుచు వచ్చిరి. అప్పుడు ప్రభువు మీరువేసిన ప్రశ్నలన్నియు నేను విన్నాను. ఇప్పుడు నేను మిమ్ములను ఒక ప్రశ్న వేస్తానని యోహాను యిచ్చిన బాప్తిస్మము పరలోకము నుండి వచ్చినదా లేక భూలోకమునుండి వచ్చినదా అని అడుగగా అందుకు వారు ఏమియు సమాధానము యియ్యలేదు, ఏది చెప్పిన శాస్త్రులకును పరిసయ్యులకును చిక్కె గనుక వారు మాకుతెలియదనిరి. యోహాను బాప్తిస్మము న్యాయవిధులలోనుండి వచ్చెను. ఇది ఆజ్ఞలలో లేకపోయిన విధులలో ఉన్నది గనుక ప్రభువే బప్తిస్మము పొందెను. ఈ బాప్తిస్మము ఆజ్ఞలనుండి ధర్మశాస్త్రమునుండి సువార్తలవరకు వచ్చెను. బాప్తిస్మము పరలోకమునుండి యోహానునకు బయలు పడినది గనుక యోహాను ద్వారా ప్రభువు పొందెను, యోహాను బాప్తిస్మము ఇవ్వవలెనని తనకు బయలు పర్చబడెను గనుక పాతనిబంధన గ్రంధములో లేనిది యోహాను ఆచర్ణలోపెట్టెను ప్రభువు స్వయముగా వచ్చి బాప్తిస్మము తీసికొనెను గనుక ఈ ఆచరణ మరింత స్థిరమైనది. ప్రభువు యోహానుతో మనకు నీతి అని అనిరి. మనకు అనగా యిచ్చుట యెహాను వంతు. పొందుట ప్రభువు వంతై ఉన్నది. ప్రభువు వల్ల సృజింప బడిన నరుని ద్వారా చూచుచున్న నరులందరి ఎదుట బాప్తిస్మము పొందుట పరాభవమే గాని నీతి యావత్తు ఈలాగు జరుగ నిమ్మని ప్రభువు పింది యున్నారు. ఆజ్ఞలను న్యాయవిధులను ఈ రీతిగా నెరవేర్చుట ద్వారా నీతి వస్త్రము ఏరీతిగా ధరించుకొన్నారో ప్రభువు ఆజ్ఞలు, న్యాయ విధులు నెరవేర్చుట ద్వారా నీతి వస్త్రము ధరించుకొనెను.

    నీటి బాప్తిస్మము, ఆత్మబాప్తిస్మము క్రూస్తు పొదెను. ఈ రెండు నీతి యావత్తు నెరవేర్చుటకు మనకు కూడా అవసరమైయున్నది ఆత్మ బాప్తిస్మము పొంది నీటి బాప్తిస్మము పొందకుండుటకు వీలులేదు. క్రీస్తుమాదిరి మనకు పంపించాడు ఈలాగు మాదిరిగా నడిచి తాను నీతి వస్త్రము ధరించి మనకు నీతి వస్త్రము ధరింపజేసెను. యోహాను తల్లిదండ్రులు నీతినెరవేర్చి నీతివస్త్రము సంపాదించు కొనెను. అలాగే ప్రభువు మనిషిగా ఉన్నాడు గనుక మనవస్త్రము ధరించుకొనెను. ప్రభువు తన క్రియలన్నింటివలన సంపాదించిన నీతి వస్త్రము మనకిచ్చుటకొరకే.

    ఉదా:- బైబిలులో పెండ్లి విందునకు పెండ్లి వస్త్రములు లేకుండ వచ్చిన వారిని రానివ్వలేదు. వారిని బయటకు త్రోసివేసిరి. మనము ధర్మశాస్త్రము పూర్తిగా నెరవేర్చలేము. నీతివస్త్రము మనముసంపాదించు కొనలేము. గనుక ప్రభువు ఇచ్చునది మనము సంపాదించు కొనవలెను. సంపాదించుకొన్న ఆ వస్త్రమును కాపాడు కొనవలెను. వస్త్రమును ధరించుకొనుమని చెప్పలేదు గాని కాపాడు కొనవలెనని చెప్పెను. ప్రకటనలో ఇది ఆరవ పాత్రకును, ఏడవ పాత్రకును మధ్య ఈ మూడు విషయములు ఉన్నవి. 1. నేను దొంగవలె వచ్చెదను. 2. నీవు దిగంబరుడవుగా ఉండవద్దు 3. నీతి వస్త్రమును కాపాడు కొనుము.

    ఏదేను తోటలో రెండు వస్త్రములు ఉన్నవి (ఆది 3:7)

    • 1. అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములను చేసికొనిరి. దేవుడైనయెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కయిలను చేయించి వారికి తొడిగించెను. ( ఆద్. 3:21) ఆదాము హవ్వలు పాపములోపడి ఆకులతో కచ్చడములను చేసికొనిరి. ఇది ఆకుల పర్ణవస్త్రము ఇది స్వనీతి వస్త్రము. ఆదాము హవ్వలకు ఆకుల వస్త్రము సిద్ధముచేసికొనుటకు సూది, దారము ఎక్కడ దొరికినదో? (ఆది 2:1) మనిషి సంపాదించికొన్నది ఆకుల వస్త్రములు.
    • 2. దేవుడు ఇచ్చినది చర్మము వస్త్రము ఆదాము హవ్వలు సంపాదించుకొన్నది స్వనీతి వస్త్రములు. దేవుడు ఇచ్చునది నీతి వస్త్రములు.

    క్రీస్తు 33 1|2 సంవత్సరములు భూమి మీద సేవచేసి మాదిరి చూపెను తన ప్రాణ రక్తములను చిందించి నీతి వస్త్రమును మనకు సంపాదించి యిచ్చెను. ఆదాము నుండి సిలువ వరకు గొర్రెపిల్ల వచ్చినది. ఇదిగో లోక పాపములను మోసికొనిపోవు దేవుని గొర్రెపిల్ల. ఒక జంతువు చంపబడితేనే తప్ప వత్ర్సము తయారు కాదు. జంతువు చంప బడుట క్రీస్తునకు ముంగుర్తు. చర్మము తియ్యబడుట నీతి వస్త్రమునకు గుర్తు. పరలోకమునకు వెళ్ళిన పిమ్మట మనకు అనుగ్రహింపబడినది నీతి వస్త్రము. ఆదాము మొదలుకొని ప్రభువు కాలము వరకు గొర్రెపిల్లలను బలిగా అర్పించిరి ఆ చంపబడిన చర్మము వారికి వస్త్రమై యున్నది. ఆదాము కాలములో ఏదేను తోటలో చంపబడిన ఆజంతువు యేసుప్రభువునకు ముంగుర్తై ఉన్నది ఆరవముద్ర ఏడవముద్ర మధ్య కాలములో క్రీస్తు ఇచ్చునది నీతి వస్త్రము. కాపాడుకొనుట అనునది మనకు అర్ధమై యున్నది. తీగ తీస్తే పాదంతా కదులునను సామెత ఉన్నది. ఇక్కడతీగలాగగా పొడుగున ఉన్న పొద కదిలెను.

    ప్రార్ధన:- ప్రియ స్వరూపుడవైన మా తండ్రీ మహాగండముల నుండి తప్పించిన తండ్రీ నీకు స్తోత్రములు, కఠినమైన వాక్యములను అందించుచున్న ప్రభువా వాక్యమును విడదీసి మర్మములను బోధించుము. సంఘ కాలములో పిలిప్పితో ఆత్మ ద్వారా క్రొత్త సంగతులను కఠినమైన సంగతులు బోధించుట ద్వారా సర్వసత్యములోనికి నడిపించుము. మాకు ఆత్మబలము వినయము సంతోషము పరలోకము యొక్క మహిమసిద్ధపర్చుమని త్వరగా రానైయున్న ప్రభువును బట్టి వేడుకొను చున్నాము ||ఆమెన్||

    దేవుడు మనుష్యులైన వారికి బుద్ధిచెప్పుటకు భయంకరమైన, అనవసరమైన అసహ్యమైన కొన్ని విషయములను బైబిలులో అక్కడక్కడ వ్రాయించెను.

    దొంగ, దిసమొల అను మాటలు భయంకరమైనవి. ఇలాంటివి బైబిలులో ఎందుకు వ్రాయవలెనని వేదాంతులు అడుగుచున్నారు. లోకములో ఉన్నది దేవుడు వ్రాయించెను. ఇవి ప్రజలకు తెలుసును గాని దాని ప్రకారముగా నడువరు గనుక వ్రాయించెను, యోహాను ప్రభువును గూర్చి దొంగవలె వచ్చునని వ్రాసెను. ఇది వివరించగా అందరికి తెలిసినది ప్రభువు వచ్చును గనుక దొంగవలె వచ్చ్ట జరుగదు.

    ఉదా:- కఠినమైన పద్యము ఏదైన ఉన్నయెడల పంతులు గారు చివరించినపిమ్మట ఆపద్యము కఠినము గాదుగాని సుళువై యుండును. అలాగే ప్రభువు దొంగవలె వచ్చుట కఠినమైనది కాదుగాని సుళువైనదే.

    • 1)
      • 1. సాతాను,
      • 2. పిచాచి,
      • 3. అంతిక్రీస్తు,
      • 4. అబద్ధ ప్రవక్త,
      • 5. కప్పలు మొదలైనవి.
    • ||)
      • 1. సాతాను యొక్కయు,
      • 2. పిశాచి యొక్కయు,
      • 3. అంతి క్రీస్తు యొక్కయు,
      • 4. అబద్ధ ప్రవక్త యొక్కయు
      • 5. కప్పల యొక్కయు ప్రయత్నములు
    • |||) వీరికి దుష్ట ఫలితములు.
    • |v) మనుష్యుల వరుస పైవారిని అనుసరించిన వారు. అనుసరించిన వారి యొక్క ప్రయత్నములు కూడ ఉన్నవి.
    • v) మనిషి చేసికొన్న పాపము వల్ల వచ్చిన దుష్టఫలితములు ఏవనగా
      • 1. వ్యాధులు,
      • 2. కరువు,
      • 3. అనుకొనని అపాయములు.
      • 4. మరణము.
      • 5. హెడెస్సు.
      • 6. నరకము ఇవి పాపము యొక్క ఫలితములు
    • v|) తీర్పుదినమందు సైతాను ప్రయత్నము లన్నియు విఫలమగును. మనుష్యులయొక్క లక్షణములు వారి ప్రయత్నములు వాని దుష్టఫలితములు ఇప్పుడు బైలుపడు చున్నవి. అప్పుడు పూర్తిగా బయటపడును. దీనిపేరే దిసములు, ప్రకటన గ్రంధములో వ్రాయబడిన నిజమైన దినముల యొక్కబండారము చివరగా నరకములో వారు ఉన్నప్పుడు సైతాను, అంతిక్రీస్తు అబద్ధ ప్రవక్త, కప్పలు, వారి అనుచరుల యొక్క పాపస్థితి బైలుపడినప్పుడు వారు అందరు సిగ్గుపడుదురు. ఇటువంటి సంఘటన జరుగునని ఆరవ, ఏడవ ముద్ర కాలములకు మధ్య ప్రభువు యోహానునకు బైలుపరచెను. మన వస్త్రములను జాగ్రత్తగా కాపాడు కొంటె దిసములు కనబడుట ఉండదు.

    సాతానుడు మొదట ప్రధాన దూత. దేవుడు తనకు ఇచ్చిన వస్త్రము కపాడు కొననందువల్ల దిగంబరి ఆయెను. ఆది తల్లి దండ్రులైన ఆదాము హవ్వలను దేవుడు తనకు అనుగ్రయించిన వస్త్రములను కాపాడుకొనలేక పోయెను. వారిని బట్టి వారిలోనుండి వచ్చిన నరులందరును తమ వస్త్రములను పోగొట్టుకొనిరి. మనిషియు దయ్యములును తనకున్న మహిమ స్థితిపోగొట్టుకొనెను. దేవుడు మరల వచ్చి తన ప్రాణ రక్తములు అర్పించి నీతివస్త్రము సంపాదించి ఇస్తే అదియు పోగొట్టుకొనిరి. జ్ఞాపకముచేసే నిమిత్తము ప్రభువు ఇవ్వబడిన నీతి వస్త్రము కాపాడుకొనుమని చెప్పిరి. సంఘములతో మాట్లాడుచున్న ప్రభువు ఎఫెసి సంఘమునకు తెలియపర్చిన సంగతి ఏమనగా నీవు ఏస్థితినుండి పడితివో ఆస్థితిని జ్ఞాపకము చేసికొనమని చెప్పెను. నీతివస్త్రమనునది మహిమ స్థితియై ఉండవచ్చు. స్థితి అనగా పెండ్లికుమార్తె వరుస

    • 1. ప్రదైసు.
    • 2. రక్షితుల యొక్క మోక్షము

    ఇవి రెండు కూడ అంతస్తులు కొందరికి పెండ్లికుమార్తె స్థితి ఇవ్వబడవచ్చు, దానిని బట్టి శక్తికలుగవచ్చు ఇవ్వబడిన స్థితిని పోగొట్టుకొనకుండ కాపాడు కొనవలెను. కాపాడుకొనకపోతే మనకుగల మహిమ పోవును. దేవుడు అందరికి మహిమ, జ్ఞానము, శక్తి, అన్నము, వస్త్రము, మున్నగునవన్నియు ఇచ్చును. ఇవన్ని పోగొట్టుకొన్నదిగంబరి అగును.

    ఉదా:- రాజమడ్రిలో ఒకప్పుడు ఇండ్లు కాలిపోవుచున్నవి. అక్కద ఉన్న ఒకపాదిరిగరు ఇల్లుకాలలేదు ఆ ఇంటి చుట్టు ప్రక్కలనున్న ఇండ్లు అన్నియు కాలిపోయినవి గాని పాదిరిగారు ఇల్లు మాత్రము కాలకుండగా కాపాడబడెను దీనికి కారణము పాదిరమ్మగారు ఇల్లు కాలుచుండగా ఇంటిలోనే ప్రార్ధనలో ఉండిరి. ప్రార్ధనలో ఉన్న పాదిరమ్మగారికి నీ ఇల్లు కాలదని ప్రభువు బయలుపరచెను. చుట్టు ప్రక్కల నున్నవారు బయటికి రండి ఇండ్లు కాలుచున్నవని కేకలు వేయుచుండగా ఆపాదిరమ్మగారు మా ఇల్లు కాలదని వారితో చెప్పెను.

    • 1) ఇంటిలో సామానులు లేకపోతే దిగంబరత్వము
    • 2) ధరించుటకు వస్త్రములు లేకపోతే దిగంబరత్వము
    • 3) దేవుడు ఇచ్చు నీతివస్త్రము లేకపోతే దిగమంబరత్వము ఉండును. కాబట్టి ప్రభువు మనకు ఇచ్చిన వాటిని మనము జాగ్రత్తగా కాపాడుకొనవలయును.

    ఏడవ పాత్ర కాలములో హర్మగెద్దోను యుద్ధము చేయుటకై పరలోకము నుండి గొప్ప సైన్యము దిగివచ్చును. అలాగే భూలోకములో అంతిక్రెస్తు అబద్ధ ప్రవక్త, కప్పలు, పోగుచేసిన సైన్యమంతా హర్మ గెద్దోను యుద్ధమునకై సిద్ధపడి వచ్చెదరు. యుద్ధములో సాతాను సంబంధమైన దంతయు నాశనమగును దుష్టులైనవారు నశించెదరు. సాతానును అతని అనుచరులను దేవుడు పాతాళములో బంధించును. అందరి పాత్ర ముగింపులోను ఏడవ పాత్ర ప్రారంభములోను అనగా ఈ రెండు పాత్రల మధ్యలో ఈ సంఘటన జరగనైయున్నది. ప్రభువు దొంగవలె వచ్చునని బైబిలులో నున్నది ప్రభువు యొక్క విషయములో అలాగు అనుటకు వీలులేదు అయిన బైబిలులో వ్రాయబడినది గనుక తగురీగ అర్ధము చేసికొనవలయును. దొంగ ఎప్పుడువచ్చును?

    • 1. తెలియకుండ
    • 2. మనుష్యులు మెళుకువగా లేనప్పుడు
    • 3. రాత్రికాలములో వచ్చును.

    రాత్రికాలం అనగా చీకటి గుర్తు. మనిషి హృదయము చీకటితో నిండియుండగా ఆసమయమందు ప్రభువు వచ్చును.

    ధనవంతుడు తనకున్న తలాంతులను ఇచ్చివేసి దూరదేశమునకు వెళ్ళిపోయెను. కొందరు యిచ్చిన తలాంతులు వృద్ధిచేసిరి అందులో ఒకడు తనకియ్యబడిన తలాంతును భూమిలో పాతిపెట్టెను. అట్టి వాని యొద్దనుండి ఆధనవంతుడు కలిగినదియు

    • 1) తీసివేసెను
    • 2) దొంగవచ్చినప్పుడు మనకు కలిగినది. ఏరీతిగా దొంగ దోచునో ఆ రీతిగానే ఆ ధనవంతుడు ఉన్నదనియు తీసివేసెను.
    • 3) మనకిచ్చిన తలాంతులు ప్రభువు నిమిత్తమై సరిగా ఉపయోగించనియెడల ప్రభువు వచ్చి ఉన్నదియు తీసివేయును.

    ఇందును బట్టి ప్రభువు దొంగవలె వచ్చునని వ్రాయబడియున్నది. సౌలు రాజు దేవుడు తన కిచ్చిన ఆత్మను పోగొట్టుకొనెను. దొంగవలె అనునది సౌలుజీవితములో నెరవేరినది.

    రాజమండ్రిలో ఒకప్పుడు అయ్యగారు పాటలు పాడుకొనుచున్నారు. ఆసమయమందు కేటగిష్టుగారు, పాదిరిగారు అయ్యగారితో ఉన్నారు. పాదిరిగారు పాటల పుస్తకము తెరచి దిక్కులు చూస్తూండగా కేటగిష్టుగరు ఆపాటల పుస్తకమును పాదిరిగారు యొద్దనుండి లాగుకొనిరి. అప్పుడు ఆయన పాడుకొనని వారికి పుస్తకము ఎందుకని తనతో నున్నవారితో అన్నారు, చేతిలోనున్న పాటల పుస్తకము తీసివేయబడెను.

    ఒక పెద్ద కవీశ్వరునితో ఒక చిన్న కవీశ్వరుడు ఈ రీతిగా చెప్పెను అయ్యా మీకు దారపోయెననెను. అందునుబట్టి మీరిదివరకువలె పాటలు పద్యములు పాడలేరు అనెను ఇది కలిగినదానిని పోగొట్టుకొనుట

    • 1) ఈ విషయములన్నియు ఎవరైతే తెలిసికొనకుండ ఉందురో
    • 2) ఎవరైతే మెళుకువగా ఉందురో
    • 3) ఎవరైతే పాపాంధకారము అనే ఊబిలో ఉందురో ఎవరైతే సిద్ధపడకుండ ఉందురో ఇట్టివారందరికి ప్రభువు దొంగవలె వచ్చునని తెలియుచున్నది. ఎవరైతే పెండ్లికుమార్తె వరుసలోనికి తయారుకాకుండ ఉన్నారో అట్టివారికి ప్రభువు దొంగవలె వచ్చును.

    హర్మగెద్దోనుయుద్ధకాలములో ఎవరు మారుమనసులేనివారై యుందురో అట్టివారికి అంతమునందు ప్రభువు దొంగవలె వచ్చును.

    ఇదిగో = అనగా మంద స్థితిలోనున్న మనిషిని లేవనెత్తుటయైయున్నది. ప్రభువు దొంగవలె వచ్చును అనగా=ప్రభువు ఇంకా దొంగవలె రావడము లేదు గనుక మనుష్యులు తమ వస్త్రములను పూర్తిగాతీసివేసి పిచ్చివారివలె తిరుగుదురు. నేటి సంఘములలో అనేకులు పాపజీవితముకలిగి అన్ని గ్రామములోనికి అన్ని సంఘములలోనికి ప్రవేశించి పెద్దమనుష్యులవలె వేషము ధరించుకొన్న వేషదారులున్నారు.

    ఉదా:- కోతి గొల్లభామయొక్క వెన్నంతా తివేసి కొంత ఇంటిలో నున్న మేక మూతికిపూసి వెళ్ళిపోయెను. ఇంటివారు తిరిగివచ్చి మేకమూతికున్న వెన్నచూచి మేకను కొట్టిరి. వేషధారణ.

    వేర్వేరు పాపములోని వారు దేవాలయములోనికి వస్తే వారు పొందిన అల్లరిని బట్టి దగ్గరకు కుర్చున్నవారు ఎలాగు వచ్చిందో చూడండి సిగ్గులేదు అని అందురు. నరకంలో ఇలాగే ఉందురు. వారికిసిగ్గులేదు. వారు దిగంబరులు నరకములో దిగంబరత్వము ఎవరుచూడగలరు పరలోక ప్రజలకు వారిని చూచే పనిలేదు. భూలోకములోనున్న భూప్రజలను చూచెదరు గాని నరకములోనున్న దిగంబరరులను ఎవరు చూస్తారు. అందువల్ల నరకములో దిగంబరత్వమే కనబడుచున్నది.

    • 1) దిగంబరిగా నుండకూడదు
    • 2) మెళుకువగా నుండవలెను
    • 3) సంచరించకూడదు
    • 4) వస్త్రము కలిగి యుండవలెను
    • 5) వస్త్రమును కాపాడు కొనవలెను

    పెండ్లికుమార్తెకు వస్త్రమున్నది రక్షితుల మోక్షములోనివారికి వస్త్రమున్నది. పరదైసులోని వారికి వస్త్రమున్నది. భూలోకమోక్షములోనివారికి వస్త్రమున్నది. ఈ నాలుగు తరగతులలోనివారికి నాలుగువిధములైన వస్త్రములున్నవి. ఈ నాలుగు స్థలములలో నున్న వారికి నీతి వస్త్రమున్నది. భూలోక మోక్షములోనివారికి వస్త్రమున్నది. భూలోకమోక్షములోనుండి పెండ్లికుమార్తె వరుస వరకు నీతి వస్త్రమే దేవుడు ఇచ్చును మనము పరలోకమునకు వెళ్ళి పోయినది మొదలు ఒకటే వస్త్రము మనకుండును.

    • 1. యేసేపు వస్త్రము.
    • 2. యేసుప్రభువువస్త్రము.

    పరలోకమునకు ముంగుర్తు వస్త్రము. మనము పరలోకములో దిగంబరులముగా నుండము. మనము వెలుగును వస్త్రముగా ధరించుకొందుము య్యుదుడని హెల్లెనీయుడని పరలోకములో బేధమేమియులేదు. అనగా స్త్రీ అని గాని పురుషుడనిగాని శరీరరీతిగా యేబేధములేదని అర్ధమిచ్చుచున్నది.మానవులు, దేవుడు తమకిచ్చిన నీతివస్త్రమును

    • 1) తెలివితక్కువ వల్ల
    • 2) దేవునికి విరుద్దమైనట్టి పాపమువలన
    • 3) సరిగా వాడుకొనుట చేతకానందువల్ల
    • 4. అజాగ్రత్తవలన పోగొట్టు కొనుచున్నారు.
    • 1) దేవుడు తానే స్వయముగా సృజించిన మరియ గర్భమునందు జన్మించుటకు సిగ్గుపడలేదు
    • 2) ఈ లోకములోనికి నరుడుగా వచ్చివేసినప్పుడు ఆ సుంకరులతోను, పాపులతోను, భోజనముచేయుటకు సిగ్గుపడలేదు.
    • 3) తాను కలుగుజేసిన అధికారి యైన పిలాతు ఎదుట చేతులు కట్టుకొని నిలువబడి అన్యాయపు తీర్పు పొందుటకు సిగుపడలేదు.
    • 4) దొంగవలె వచ్చెదనని చెప్పుటకు సిగ్గుపడలేదు.

    ప్రార్ధన:- దయగల ప్రభువా నీవు మాకిచ్చిన వరములను ముఖ్యముగా నీతివస్త్రమును పోగొట్టుకొనకుండ ఉండే కృపదయచేయుము. నీవు

    • 1) దొంగవలె
    • 2) రాజువలె
    • 3) ప్రభువు వలె
    వచ్చుచున్నావు గనుక జయము, మహిమ కోరెవారికి మహిమరూపిగా వచ్చెదవు గనుక నీకు స్తోత్రములు. త్వరగా వచ్చుచున్న ప్రభువునుబట్టి వేడుకొనుచున్నాము ఆమెన్.

    ఆరవ, ఏడవ పాత్రల మధ్య జరుగు విషయములను మధ్యాకాశమని అందురు. ప్రభువు నేను దొంగవలె వచ్చెదనని చెప్పిరిగాని దొంగగా వచ్చెదనని చెప్పలేదు. పరలోకములో ఏడుగురు దూతలున్నారు. ఆరుగురు దూతల పని ఇప్పటివరకు మనము చూచియున్నాము. ఈ ఏడవ దూత తన పాత్రను భూమిపై కుమ్మరించగా గర్భాలయములో నున్న సిం హాసనము దగ్గరనుండి సమాప్తమైనదని ఒక శబ్ధము వినబడెను. ఏదవదూత తనచేతిలోని ఏడవ పాత్రను ఏడవ పర్యాయమునకు కుమ్మరించగా యోహానుకు వినబడెను. అప్పుడు మెరుపులును ధ్వనులును, ఉరుములును కలిగెను. అందుతోపాటు మహా భూకంపము కలిగెను.

    ఆది తల్లి దండ్రులైన ఆదాము అవ్వల మూలముగా ఈ భూమిశపింపబడెను. ఆ. కాం 3:17,18 ప్రపంచమంతయు గుండ్రముగా నున్నది. ఈ భూమి శపింపబడి నందున నేల కనబడుచున్నది. ఈనేల కంటికి కనబడునంతవరకున్నది. నేల శపింపబడి నందున కష్టములు ముందుగా కలిగెను. ఆదాము కలుగజేయ బడినప్పటినుండి ఏడుసంవత్స్రముల శ్రమ వంటి శ్రమ యెన్నడును కలుగలేదు. అలాగే అద్దము కలుగజేయ బడినప్పటినుండి ఇలాంటి భూకంపమెన్నడు కలుగలేదు. ఇట్టి భూకంపము గలుగగా మహా ప్రసిద్ధికెక్కిన మహాపట్టణము మూడు భాగము లాయెను.

    ఈ భూలోకము నందు మహా బబులోను అను మహా పట్టణమున్నది పరలోకమందున్న దేవుని సన్నిధినుండి దైవోగ్రత అను మధ్యముగల పాత్ర బబులోనునకు త్రాగించవలెనని వచ్చెను. ద్వీపములు (లంకలు) పారిపోయెను లంకలు పారిపోవుట అనుమాట ఇప్పుడే వినుచున్నాము.

    బల్లమీద నీరుపడగా బల్లను వంచగ ఆనీరుఒలికిపోవును. పర్వతములు అదృశ్యములాయెను. ఐదేసి మణుగులు బరువుగల పెద్దవడగండ్లు ఆకాశము నుండి మనుష్యుల మీద పడెను.

    • 1) ఏడు సంవత్స్రముల శ్రమల వంటిది
    • 2) భూకంపము వంట్ది
    • 3) వడగండ్ల వంటిది
    భూమిపై ఎప్పుడును జరుగనటువంటిది ఈ ఏడవ పాత్ర. ఆఖరు పాత్ర ఇది కుమ్మరించబడెను
    • 1) ముద్రలు-ఇవి విప్పబడెను
    • 2) బూరలు - ఇవి ఊదబడెను
    • 3) పాత్రలు-ఇవి కుమ్మరింపబడెను

    పాత్రల కుమ్మరింపునకు వ్యతిరేకమైనది. పరిశ్ద్ధాత్మ కుమ్మరింపు పాత్రల కృమ్మరింపు అత్మకుమ్మరింపునకు గుర్తు

    సమాప్తము:- సమాత్పమూనగా దేనికి సమాప్తము? దేవుడు మానవుల యెడల కుమ్మరించిన కృపాకాలమునకు ఇప్పుడు సమాప్తము కలిగినది.

    ఆదామునుండి మలాకి వరకు

    మలాకి నుండి రేప్చర్ వరకు

    రేప్చర్ నుండి ఏడు పాత్రల కాలము వరకు

    మానవులు దేవుని యొక్క కృపను లోకువకట్టి తృణీకరించుట అను దానికి సమాప్తము. దేవుడు ఇక తనకృపను చూపించుట చాలించును. కాబట్టి సమాప్తము. వెయ్యేండ్ల పాలనలో దేవుడు కృపచూపించినను నరులు దిక్కరించరు తృణీకరించరు. శాంతిపరిపాలన నీతిపరిపాలన.

    ఏడవ పాత్రకాలములో దేవునికి వ్యతిరేకముగా శోధనకాలమువచ్చెను ఈ శోధన కాలమునకు సమాప్తమువచ్చెను.

    మానవులు శ్రమకాలములో బహు శ్రమనొందిరి. దేవుడు ఇచ్చు శిక్షను అనుభవించిరి. వడగండ్లు, భూకంపములు మున్నగు శ్రమలను అనుభవించిరి ఇలాంటి శ్రమలు ఎన్నటికిని సమాప్తముకలిగెను.

    ఏడు సంవత్స్రముల శ్రమ కాలమందుకూడ సమాప్తము కలిగెను సాతాను కాలమునకు కూడ సమాప్తము కలిగెను.

    • 1) ప్రభువు గొల్గొతాకొండపై సిలువ మ్రానుపై వ్రేలాడుచూ సమాప్తమైనదని పలికెను. తండ్రి చిత్తమును నెరవేర్చుటకు వచ్చిన కుమారుడైన ప్రభువు తండ్రి చిత్తమును నెరవేర్చి సమాప్తమాయెనని పలికెను. ప్రభును గూర్చి పాతనిబంధన కాలములో ప్రవచించిన ప్రవచనము లన్నియు ప్రభువు మొదటి రాకడను బట్టి నెరవేర్పు కలిగెను. అందునుబట్టి సమాప్తమాయెనని పలికెను.
    • 2) నరుని యొక్క జీవితకాలము మరణముతో సమాప్తమగును. అనగా భక్తులు ఇహలో జీవితమును విడిచిపరలోకమునకును పాపులైనవారు నరకమునకును వెళ్ళుదురు.
    • 3) ఇప్పటివరకు ఏడేండ్ల శ్రమల కాలములో అంతిక్రీస్తు పరిపాలనకు సమాప్తము వచ్చెను.
    • 4) ఒక మనిషి తన జీవిత మంతయు పాపములో గడిపి అకస్మికముగా మారుమనస్సు పొందిన యెడల తాను జీవించిన పాపజీవితమునకు సమాప్తము ఇదిగొప్పది.
    • 5) అనాదిలోని దేవుడు నరులను కలుగజేయవలెనన్న ఉద్దేశ్యముతో సృష్టిని కలుగజేయుటకు ఆరు దినములు పనిచేసెను. ఏడవదినమందు విశ్రాంతి తీసికొనెను గనుక సృష్టిని కలుగ జేయుట సమాప్తమాయెను.
    • 6) ప్రభువు చెప్పిన ఉపమానములో రండి విందు సిద్ధమైనది ఆరగించండి అని పిలిచిరి ఇది యుగ సమాప్తము.

    గర్భాలయమునుండి గొప్ప స్వరము సమాప్తమైనదని పలికెను ఇది సిం హాసనమునుండి వచ్చెను. అలాగే సిలువ సిం హాసనముపై నుండి సమాప్తమని ప్రభువు గొప్ప శబ్ధముతో పలుకగా భూమి వణికెను బండలు బద్దలాయెను సమాప్తమాయెననిచెప్పుచున గొప్ప స్వరమురాగా మెరుపులను ధ్వనులును, ఉరుములును పుట్టెను. గొప్ప భూకంపము కలిగెను. పరలోక సంబంధమైన గొప్ప కార్యములు భూమి యందు జరుగుచున్నప్పుడు గొప్ప మెరుపులు కలుగును మోషే కాలములో సీనాయి పర్వతములపై దేవుడుదిగి రాగానే గొప్ప మెరుపులు ఉరుములు కలిగెను. భూలోకములో ప్రభువుసిలువ మ్రానుపై ప్రాణము పెట్టిన గొప్ప పని జరుగగానే పరలోకము ఊరుకొనలేదు అయ్యో అని అనవలెను గనుక అయ్యో అని అనుచున్న పరలోకసమూహమును బట్టి మెరుపులు, ఉరుములు కలిగెను. మెరుపులు, ఉరుములు మేఘములో నుండి పుట్టునవి గాని ధ్వనులు వచ్చెనని వున్నది. దీని అర్ధమేమిటి?

    ఉదా:- ఒక గ్రామములో కొందరి ఇండ్లు కాలుచూ ఉండగా కాలని ఇంటివారు కేకలువేయుచు గొప్పధ్వని చేయుదురు. అలాగే ఒక ఇంటిలో ఉత్సవము జరుగుచూ వుండగా ఉత్సవములో బాగుగా జరుగుచున్నవని ప్రక్క ఇంటివారు ఉత్సహించి ధ్వనులు చేయుదురు ఆరీతిగానే భూలోకము నందు నరులైన వారికి విచారమైన సంగతి జరుగుచుండగా పరలోకవాస్తవ్యులు అయ్యో!అయ్యో! అని వీరిని గూర్చి గొప్పధ్వని చేయుచున్నారు.

    భూలోకములో ఒక ఆనందకరమైన పని జరుగుచుండగా పరలోక వాస్తవ్యాలు అహ ఎంత సంతోషము సర్వాధికారియైన ఓ దేవా నీకు స్తొత్రములు అని గొప్పధ్వని చేయుదురు. క్రిస్మస్ కాలములో భూలోకమందు సంతోషము. పరలోకమందు దేవదూతల సమూహములో సంతోషము. వారు భూలోకవాసులకు కనబడి గాన ప్రతిగానము చేసిరి. భూలోకమందు విచారక్రమైన సంగతి జరుగు చుండగా పరలోక వాస్తవ్యులు కూడ విచారించెదరు.

    • 1) త్రిత్వము యొక్క ధ్వనులు,
    • 2) దూత యొక్క ధ్వనులు
    • 3) పరిశుద్ధుల యొక్క ధ్వనులు ఇవి పరలోక ధ్వనులు

    యోహాను సువార్తలో ప్రభువు తన తండ్రితో మాటలాడెను. అలాగే తండ్రి కుమారునితో మాటలాడగా ఒక శబ్ధము ఆకాశమునుండి వచ్చెను. అక్కడ నిలుచుండి వినిన జనసమూహము ఉరిమెను అనిరి. (యోహాను 12:27-29) మెరుపు కాంతినిచ్చునది ఉరుము మనుష్యులను భయపెట్టునది. ఇవి రెండును పరలోక మందున్న గంభీరత్వమునకు గుర్తు. ధ్వనులు వివిధరకములు, ఇవి ఏరీతిగా నుండునో మనకు తెలియును మనుష్యులు సంతోషముగా నుంటె సంతోష ధ్వని వినబడును విచారముగానున్నయెడల విచారపు ధ్వని వినబడును. పరలోకములోని ధ్వని వినబడవలసిన ధ్వని యైనా నిశబ్ధముగా నున్నది గనుక దీనికి నిశబ్ధ ధ్వని అనిపేరు.

    ఉదా:- ఈ ప్రకటన గ్రంధము లోని గూఢమైన సంగతులువిడజెప్పుకొనుట సంతోషమే. దీనిని బట్టి పరలోక వాస్తవ్యులు సంతోష ధ్వని చేయుదురుఇది మనకు విమడుటలేదు గనుక ఆయా సమయములయందు పరలోకమందు చేయబడు ధ్వని మనకు వినబడదు గనుక దానినే నిశబ్ధధ్వని అందురు సీనాయి పర్వతారణ్యమందు దేవుడు దిగిరాగ ఉరుములు ధ్వనులు వినబడెను. మెరుపుల కాంతి ఇశ్రాయేలు ప్రజలు చూచిరి. ఇది దేవుని యొక్క గంభీరత్వమునకు గుర్తు. ఏడు సంవత్సరముల శ్రమలలో ఏడవ పాత్ర కాలములో ఈ ఉరుముల ధ్వనులు వినిపించుచూ చూపించు చున్నందుకు నీకు స్తోత్రములని చెప్పవలసినది గాని వారు మోకరించి స్తుతి చేయరు. ఇలాంటివి జరుగునని 1800 సంవత్సరములప్పుడే వ్రాయబడినది అప్పుడే ఈ చరిత్ర కొంత తెలియజేయబడెను. 1885 సంవత్సరములో ప్రకటన గ్రంధమందలి వ్యాక్యానము వ్రాయబడినది. కొందరు ప్రకటన గ్రంధము చదివితే ప్రకటన గ్రంధము లోని తెగుళ్ళు వచ్చునని బయపడి చదువరు కాని ప్రతివారు అవశ్యకముగా ప్రకటన గ్రంధములోని వివరము తెలిసికొనవలెను. బైబిలు పుస్తకములోని 65 పుస్తకములు చదివి 66వ పుస్తకమగు ప్రకటన గ్రంధ పుస్తకము చదువక పోతే ప్రయోజనములేదు. చదివి దేవునిని అడిగి అర్ధము తెలిసికొనవలెను.

    పెద్ద భూకంపము కలిగెను:- మనుష్యులు భూమి మీద పుట్టినది మొదలుకొని అట్టి మహాభూకంపము జరుగలేదు అది అంత మహా గొప్పది. ఈ భూకంపము ఎందుకు కలిగెను? దేవుడు కలుగజేసిన ఈ భూమి అంతరించనైయున్నది. మరొకనూతన భూమిని సృజించ్ప వలెనని దేవుని అంతరంగ మందున్నది. రవి, చంద్ర, తారలతో అలుముకొని యున్న ఈ భూమి సృజించ్పబడి ఇప్పటికి ఆరువేల సంవత్సరములు అయినది. ఇదిమొదట సృజించ్పబడిన బహు సృంగారమైన సృష్టి ఈ సృష్టిలోని ఆకాశ మండలము మహా తేజస్సుతో ఉండెను. ఈ రీతిగా సృజింప బడిన భూమి మీద నున్న ఆదాము పాపము చేయగా భూమి చేపలు, సముద్రము, పక్షులు, జంతువులు, వృక్షములు మొకలు, గాలి అంతా చెడిపోవుటకు ఆరంభించెను. ఇది ఏడేండ్ల శ్రమ కాలములో ఈ ఏడవ పాత్రకాలములో ఈ మహా భూకంపము వల్ల దేవుని సృష్టియైన ఈ మొదటి భూమి పూర్తిగా పాడాయెను. ఈభూకంపము సామాన్యమైనదికాదు ఇలాంటిది ఎన్నడు జరిగియుండలేదు. దీనిపేరు సర్వభూమి యొక్క భూకంపము పాతభూమి, పాత మనుష్యులు పాపములో మునిగిపోయిన వారు పాత చెట్లు, పాతపక్షులు, పాత జంతువులు, మున్నవగు పాతవి అంతటిని తీసివేసే నిమిత్తమై ఇట్టి మహా భూకంపము కలిగెను. పాతవి గతించెను సమస్తమును క్రొత్తవాయెనని బైబిలులో ఉన్నది (2కొరింథి 5:17)

    ఉదా:- బల్ల మీద ఆయా వస్తువులు పెట్టి కదిలించినయెడల అన్నికలిసిపోవును. అలాంటిదే ఈ భూకంపము ఒక ఊరిలో ఒక మంచి గట్టి ఇల్లు కొందరు వ్యక్తులు గునపములు తీసుకొని పగుల కొట్టి వేస్తుండగా అయ్యగారు ఎందుకు ఇలాగు మంచి ఇంటిని పాడు చేయుచున్నారని అడుగగా అందులో ఒకరు ఈ ఇల్లు మాకు అచ్చిరాలేదు. ఈ ఇంటి లోనివారికి ఒక కొడుకు పుట్టి చనిపోయినాడు ఇంటిని అమ్ముటకు వీలులేదు ఎందుకంటే ఇది పితామహుల ఆస్తి గనుక తిరిగి కట్టుటకు ఇట్లు త్రవ్వుచున్నమనిరి ఆరితిగానే ఇప్పుడున్న పాత పాప భూమి నంతటిని తొలగించి వేసి క్రొత్తదిగా తిరిగి సృజించి క్రీస్తు వెయ్యేండ్ల పరిపాలన ఆరంభించెను. వారు ఇల్లు ఏరీతిగా క్రొత్తదిగా కట్టుటకు ఆరంభినారో ప్రభువు వెయ్యేండు భూమిని పరిపాలన చేయునుగనుక భూమినినూతన పరిచెను.

    • 1) ఆదాము నుండి నోవాహు వరకు అదాము పరిపాలన,
    • 2) నోవాహు నుండి రెండవ రాకడ వరకు నరుల పరిపాలన.
    • 3) రాకడనుండి ఏడు సంవత్సరముల శ్రమ కాలము వరకు సైతాను పరిపాలన.
    • 4) వెయ్యేండ్లు క్రీస్తు పరిపాలన
    • వెయ్యేండ్ల పరిపాలన:- 1) ఇది ధర్మపరిపాలన అన్యాయము చేయువారు ఉండరు.
    • 2) శాంతి పరిపాలన - కలహములుండవు
    • 3) పావన పరిపాలన-కళంకము ఉండదు
    • 4) క్రీస్తు పరిపాలన - అందరికి స్వతంత్ర్యం వుండును ఈ కాలమందు ఆటంక దారులైన వారెవ్వరు ఉండరు, వ్యాధి, మరణములుండవు నీతిన్యాయ పరిపాలన జరుగును.

    భూకంపమును బట్టి మార్పు కలుగును హర్మగెద్దోను యుద్ధము వల్ల దుష్టులందరు నశింపబడుదురు పరలోక సైన్యము భూమి మీదకు వచ్చి భూలోకమందున్న శత్రు సైన్యమును శుభముగా నాశనము చేయుదురు.

    ప్రార్ధన:- ఓ కనికరముగల దేవా ఈ పాఠమువల్ల అనుదినము మా హృదయమును, శరీరమును, శరీరములోని ఆత్మను, అంతరంగమును దినదినము శుద్ధిచేసికొనుచూ నిన్నటి దినమున కన్న ఈ దినము బాగుగా ఉన్నామని ఎవరి మట్టుకు వారు అనుకోగల కృపదయచేయుము. శరీర ఆత్మలను శుద్ధిచేసి దీవించుమని త్వరగా వచ్చుచున్న ప్రభువును బట్టి వేడుకొనుచున్నాము. ఆమెన్.

    ప్రక. 16:19

    ప్రసిద్ధమైన మహా పట్టణము మూడు భాగములాయెను. దేవుడు ఏడు సంవత్సరముల శ్రమకాలములో శిక్ష పంపించి నరులందరిని ఒకేమారు తుడిచి పెట్టక క్రమక్రమముగా భాగములుగా విభాగించి అవిశ్వాసులైన వారినందరిని నశనము చేసెను. అలాగే యెరూషలేము అను మహాపట్టణము మూడు భాగములుగా విభజింపబడెను. అది మాత్రమేగాక ప్రపంచంలోని జనులందరికి శిక్షను గూర్చి దేవుడు తెలియజేయవలెను గనుక అందరికి తెలియగలుగు రీతిగా అన్ని చోట్ల నాశనము కనబడెను.

    దేవుని జనులున్న ఆపట్టణములో భూకంపముకలిగెను. అన్యజనులున్న పట్టణములో కూడ భూకంపము కలిగెను పరిశుద్ధులు, పాపులు దేవుని జనులు అన్యజనులు ఉన్నపట్టణము భూమి అంతటికి తెలిసియున్న, ఆవరించియున్న అందరు అనుభవించుచున్నా ఇవి పరిశుద్ధపట్టణములో వున్న దేవుని జనాంగమునకును అన్యజనాంగమునకు పరిశుద్ధపట్టణములోని వారికిని తెలియ నగును.

    ప్రవక్తయైన జకర్య తన గ్రంధములోని 14వ అధ్యాయము 4,5 వచనములో ప్రభువు తనకాలములో తనవారితో యుద్ధమునకు వచ్చును కొండలు పగులును ఆ కొండలమధ్య కలుగులోయలోనికి పరిశుద్ధులు ఆశ్రయములోనికి వెళ్ళుదురు అని వ్రాసెను.

    • 1) దేశము యూదులైనవారిది
    • 2) ఆపట్టణము యూదులైనవారిది
    • 3) పట్టణములోని కొండ యూదులైనవారిది
    • 4) క్రీస్తు ప్రభువు యూదుడే

    ఈ నాలుగు యూదులకు సంబంధించినవే క్రీస్తు ప్రభువు రానైయున్నారని యూదులకు, అన్యజనులకు, క్రైస్తవులకుతెలియవలెను యూదులకు ఈ విషయము ప్రతేకముగా తెలియవలెను. ప్రవక్తయైన జకర్యా వ్రాతలు యూదులు చదువవలెను వారు నమ్మవలెను వారే దానిలోని విషయములను ప్రకటించవలెను ఎందుకంటే జకర్యా వ్రాతలు యూదులకే బాగుగా తెలియును.

    • 1. నినవే పట్టణము యొద్దయున్న బబులోను గోపురము
    • 2. నెబుకద్నెజరు ఏలిన రాజ్యము
    • 3. ఈ లోకములోని లౌకిక బబులోను

    ప్రపంచ మంతయు మూడు భాగములుగా పగిలిపోవును పట్టణము ముడుభాగములుగా పగిలి పోవును రాజ్యము మూడు భాగములుగా పగిలిపోవును.

    తన తీక్షణమైన ఉగ్రతయను మధ్యముగల పాత్రను మహాబబులోనునకు ఇయ్యవలెనని దానిని దేవుని సముఖ మందు జ్ఞాపకము చేసిరి.

    ఉగ్రత పాత్ర:- తీక్షణమైన ఉగ్రత పాత్ర, ఈ పాత్రలో దేవుని ఉగ్రత ఉన్నది. దూత తీసుకొని వెళ్ళి లౌకికమనే బబులోనునకు ఈ ఉగ్రత పాత్రలోనిది త్రాగించవలెనని చెప్పిరి. ఎందుకు త్రాగించవలెను? ప్రభువు ఈ భూలోకమందు వున్నప్పుడు తన శిష్యులైన యోహాను, యాకోబులతో నేను త్రాగనైయున్న గిన్నెలోనిది మీరుత్రాగగలరా? అని ప్రశ్నించెను. ఈ రెండు గిన్నెలేమిటి

    • 1) ప్రభువు త్రాగనైయున్న గిన్నె
    • 2) ప్రకటనలోనిగిన్నె

    ప్రకటనలోని గిన్నెలో ఉగ్రత ఉన్నది. సువార్తలలోని గినెలో శ్రమ లున్నవి ప్రభువు త్రాగిన గిన్నెలోనిది శ్రమలు రేపు బాబెలూను లౌకికము త్రాగబోయే గిన్నెలోనిది ఉగ్రత. సిలువ మ్రానుపై వేలాడుచున్న ప్రభువు పలికిన ఏడు మాటలలో ఒక మాట దాహము ప్రభువు దప్పిక గొనుచున్నా నన్నప్పుడు రాణువవారు చిరకను ప్రభువునకు పట్టించాలనుకొనిరి కాని చిరకను ప్రభువు త్రాగలేదు గిన్నెలోని ఉగ్రతను బబులోను త్రాగవలెను.

    ప్రభువును సిలువ యొద్ధకునడిపించినవారుయూదులు, ఆకలమందున్న అన్యులైన రోమీయులైన వారి సహయముతో ప్రభువు కొండపైకి తీసికొని వెళ్ళి సిలువ మ్రానుకు అంటగొట్టించి చంపుటకు యూదులే కారకులు. అదేగాక చిరక ఇచ్చి చంపుటకు కూడ పూనుకొన్నారు మత్తు నిమిత్తము శ్రమ తెలియకుండా నుండుటకు యూదులు చిరక ఇవ్వబోయిరి. యూదులు పాపము చేసి పాపము భరించుటకు వచ్చిన ప్రభువును శ్రమపర్చి శిక్షించి చంపినారు. దప్పిగొనుచున్న ప్రభువునకు చిరక నందించిన యూదులైనవారికి ప్రతిఫలముగా ఈ పాత్రలోని ఉగ్రతను పట్టించవలెను. ఈ 16వ అధ్యాయములో ఈ పాత్రలోని ఉగ్రత యూదులకు బదులుగా అన్యులకు పటించినట్లుగా నున్నది. దీనికి పూర్వమే యూదులకు దేవుడు ఆ ఉగ్రత పాత్రలోనిది పట్టించియున్నారు. ఎప్పుడనగా ప్రభువు ఆరోహణమైన తరువాత క్రీ వె 70వసంవత్సరమునందు రోమీయులు వచ్చి యెరూషలేమును ముట్టడించి నాశనముచేసిరి తరువాత పట్టణము, దేవాలయము, ఆపట్టణములోని జనాంగము, నాశనము చేయబడగా కొందరు యూదులు చెలాచెదురై వారు దేశమును విడిచిపెట్టి పారిపోయిరి. దేవుడు వారికిచ్చిన వాగ్ధాన భూమికి యూదులుదూరస్థులైరి. ఇదే యూదులకు ఉగ్రతపాత్ర. ఇదిరోమీయులద్వరా యూదులకు కలిగిననాశనము యూదులు రోమీయులను సాధారణముగా చేసికొని ప్రభువును చంపిరి గనుక ఆ రోమీయుల ద్వారానే యూదులకు నాశనము వచ్చెను.

    దేవుని సముఖమందు జ్ఞాపకము చేసిరి:- ఇచ్చట దేవునికి జ్ఞాపకము చేసినట్లుగా వ్రాయబడి యున్నది. ప్రళయ కాలములో ఓడలో నోవాహును అతనితో కూడ ఓడలో నున్న సమస్త జంతువులను, పశువులను జ్ఞాపకము చేసికొనెనని వ్రాయబడియున్నది. అనగా దేవుడు అంతవరకు నోవాహును మరచిపోయినట్లుగా కనబడుచున్నది దేవునికి మరుపులేదు గాని సెలి ఆ విధముగా వ్రాసిరి.

    వడగండ్లు:- అపోస్తులుల కార్యము 7వ అధ్య్యయమునందు భక్తుడైనస్తెఫను యూదులైన వారు రాళ్ళతో కొట్టి చంపిరి. దానికి ప్రతిఫలముగా ఐదేసి మణుగుల వడగండ్లతో మంచురాళ్ళతో దేవుడు వారిని బాధపరచెను. ఐగుప్తు తెగుళ్ళలో ఏడవది వడగండ్ల తెగులు. ఈ వడగండ్లు ఆ వడగండ్లను జ్ఞాపకము చేయుచున్నది.

    పూర్వికులు ఆకాలపు భక్తులను రాళ్ళతో కొట్టినా, ఇప్పుడున్నవారిని ఎందుకుకొట్టలి? అనగా పరుల పాపములలో పాలివారెయుండకూడని ప్రభువు పలికిన రీతిగా ఆకాల ప్రజలు ఉండక పరుల పాపములో పాలివారై యుండి నందున ఇట్టి తెగులు వారికి సంభవించెను. నరుడు పాపము చేసిన అతనికే, నష్టముకాని దేవుని పరిశుద్ధతకు ఏమాత్రమును లోటులేదు. కొందరు పాపము చేయవచ్చునుగాని దేవుని మాత్రము దూషించరు. కొందరు పాపము చేయుట మాత్రమే గాక దేవునికూడ దూషించెదరు. పాపము కంటె గొప్పపాపము దేవుని దూషించ్టయే, దేవుని దూషించుటనుబట్టి దానికి తగిన శిక్ష అవసరము గనుక దేవుడు శిక్షించును ఎందుకనిన దేవునిలో కృప, న్యాయమున్నది.

    • 1. పాపక్షమాపణ - మోక్షములో ప్రవేశించుట
    • 2. శిక్ష ఎందుకంటే - క్రమశిక్షణలో పెట్టుటకు

    అసలు శిక్ష నరకమే అశిక్ష తప్పించుటకు క్రమశిక్ష కావలెను గొప్ప శిక్షయైన నరకమును తప్పించుచుటకు క్రమశిక్ష అనే శిక్షలు రానిచ్చినందున మనము దేవుని స్తుతించవలెను. ఎందుకనగా దేవుడు న్యాయవంతుడని యున్నది. గనుక ఆయనకు తెలియనిది ఏదియులేదని మనస్సును సమ్మతిపరచుకొనవలెను. దేవుని దృష్టిలో న్యాయమైనది నరుని దృష్టిలో అన్యాయముగా కనబడును గాని దేవుడు అన్యాయము చేయడు.

    • 1. వారు దేవుని దూషించిరి. 16:21
    • దేవునినామమును దూషించిరి 16:9

    క్రీస్తు ప్రభుని నామము విననివారు ప్రపంచములో కొందరు వుందురు కొందరికి దేవుడు ఉన్నాడని తెలియును గాని క్రీస్తునామము తెలియదు క్రీస్తుని నామము 2వేల సంవత్సరముల క్రిందట బైలుపర్చబడెను దేవుడు, క్రీస్తు అను ఈ రెండు పదములకు భేధములు కలవు మొదట దేవుడు దేవుడుగానే యుండెను. ఆపిదప యేసుక్రీస్తు అను నామము బయలుపడెను. కొందరు దేవుని దూషించిరి. మరికొందరు దేవుని నామమును దూషించిరి దూషించువారు రెండు తెగలు

    Home