పరిచయము
- ఈ సంగతులు జరిగెను
- పరలోక ద్వారము తెరువబడెను
- బూరస్వరము చెప్పినది :
- ఇక్కడికి రమ్ము
- జరిగేవి కనపర్తును
- ఆత్మవశుడనైతిని
పరలోకము
ఆసీనుడు = దృష్టికి సూర్యకాంతము, పద్మరాగము పోలినవాడు
- 1) భూత
- 2) వర్తమాన
-
3) భవిష్యత్ కాలములలో
ప్రభువు:- పరిశుద్ధుడు
- పరిశుద్ధుడు
- పరిశుద్ధుడు
చెప్పుట
ప్రకటన 4వ. అధ్యాయము
1. ఈ సంగతులు జరిగిన తరువాత:- అపొస్తలుడైన యోహాను పద్మసు ద్వీపమునందు పరవాసిగా డొమినిషియన్ చక్రవర్తి వలన పంపబడిన తరువాత తన తోటి అపొస్తలు అందరు వెళ్ళిపోగా మిగిలియున్న యోహాను తనతోనున్న అపొస్తలుల వలెనే పరమునకు చేరవలెనని ఆశ కలిగియున్నట్లు తన శ్రమను గూర్చి ఆలోచించుకొనుచుండగా (ప్రకటన 1: 9,10)
యోహాను! నీవు పడిన శ్రమను గూర్చి తలంచక నేను నీ చేత చేయించవలసిన పనిచేయుటకు నావైపు తిరుగుమని ప్రభువు యోహాను వెనుకబూర ధ్వనివంటి స్వరము వినిపించి ప్రభువు వైపునకు ఆయనను త్రిప్పెను, ఇదివరకు మనుష్య కుమారుని చూచిన యీ యోహాను ఇప్పుడు మనుష్య కుమారుని పోలిన మహిమగల ప్రభువును చూచెను. ఇది మొదటి అధ్యాయము నందు చూచుచున్నాము 2,3 అధ్యాయములలో 7సంఘములకు ప్రభువు ప్రత్యక్షమైన సంగతియు. 7 సంఘముల యొక్క రూపమును, చూచునట్లు తెలియుచున్నది. 3వ అధ్యాయమునకు 4వ అధ్యాయమునకు మధ్య కొంత సంగతి జరిగినది. అది యీ స్థలములో లేదు. ప్రకటన గ్రంధములోనే వేరొకచోట నుమ్న్నది. అది ప్రకటన 12వ అ||లో మగ శిశువుగానున్న వధువు సంఘము పరలోక సిం హాసనమునకు కొనిపోబడినట్లు ఉన్నది. అదే సంగతిని 1థెస్స" 4: 16-18 1 కొరింథి 15: 51-54లోను చూపించుచున్నది.
2. ఇట్లు ప్రక 1,2,3. అధ్యాయములలోని సంగతులు జరిగిన తరువాత అంగా పద్మసు ద్వీపములో ప్రభువు యోహానుకు చూపించ వలసిన సంగతి అయిపోయిన తరువాత పరలోకములోనివి, యిక జరుగబోవునని ప్రభువు చూపించవలెను. గనుక ప్రభువు పరలోక ద్వారమును తెరచి యోహానుకు కనబరచెను. అప్పుడు యోహాను పద్మసు ద్వీపములో నుండి మోక్షలోకము నందు తెరువబడిన ద్వారమును చూచెను కనుకనే అదిగో పరలోకము నందలి తలుపు తెరువబడియుండెనని (ప్రక 4:1) నందు వ్రాసెను. యోహాను పరిశుద్ధాత్మను పొంది, పరిపూర్ణముగా నింపబడి, నడిపింపబడి, వెలిగింపబడి, స్వరమువిని, యోహాను సువార్తను, మూడు పత్రికలను, వ్రాసెను. ఆ యోహానే యిప్పుడు ప్రకటన గ్రంధము వ్రాయవలెనన్న ఆత్మవశము కావలెను. (ప్రకటన 1: 10) ఆత్మ వశమగుట అనగా; తన శరీరవశము, తన జ్ఞానవశము, యీ లోకము, దేనివశము కాక పరిపూర్ణముగా పరిశుద్ధాత్మ వశమైయుండుటయే, ఇట్లు ఆత్మవశమైనందువలననే యెవ్వరూ, యెన్నడూ చూడలేని, మహిమ గల ప్రభువును చూచెను. మరియు ఆ మహిమ గల ప్రభువునకు కలిగిన మహిమరూపము గల సంఘమునకు కూడ యోహాను చూడగలిగెను.
3. బూర ధ్వనివంటి స్వరము వినబడి ఇక్కడికి ఎక్కిరమ్ము జరుగవలసినవి నీకు కనబరతుననెను. 7 సంఘముల చరిత్ర అయిపోయిన తరువాత పద్మసు ద్వీపములో కనబడిన ప్రభువు అకస్మాత్తుగా పరమునందు కనబడి ఇక్కడికిరమ్ము. ఎక్కిరమ్ము. అని పిలుచుచున్నట్లు కనబడుచున్నది. ఆ స్వరము వినిన యోహాను పద్మసు ద్వీపములో నుండి తెరువబడిన పరలోకపు ద్వారము ద్వారా పరలోకమునకు ఎక్కిపోవలెను. యోహాను తన శరీరముతో పరమునకు ఎక్కివెళ్ళలేడు. (1కొరింథి 15:50) గనుక శరీరమును పద్మసు ద్వీపమునందుంచి తన ఆత్మను పరిశుద్ధాత్మ వశముచేసి ఆ పరిశుద్ధాత్మును ద్వారా యోహాను ఆత్మను ఇక్కడికి ఎక్కిరమ్ము అని పలికెన ప్రభువు నొద్దకు వెళ్ళవలెను. గనుక ఆయన ఆత్మవశమై వెళ్ళెను. ఇదే ఆత్మ సంచారస్థితి, పరిశుద్ధాత్మయే యోహానును పరలోకమునకు కొనిపోవు వాహనము. పరమునకు వెళ్ళిన యోహాను అక్కడ సిం హాసనమును, సిం హాసనము మీద ఆసీనుడైన ఆయనను అక్కడ ఉన్న విషయముల నన్నిటిని చూచుచుండెను. గనుక ఇక్కడ యోహానుకు ఆత్మ సంచారస్థితి ఉన్నట్లు చూచుచున్నాము. గనుకనే మూడు లోకములలోనున్న వాటిని, మూడు కాలములలో నున్న వాటిని, వెళ్ళిచూడ గలిగెను వినగలిగెను. ఇట్టిస్థితినే 11. కొరింథి 12:2; కొలసై 2:5లో పరిశుద్ధుడైన పౌలునకును, 11రాజులు 5:26 నందు ఎలీషా ప్రవక్తకును ఉన్నట్లు చూచుచున్నాము. ఈ కాలమునందు కైలాసమహర్షి సాధు సుందర్ సింగ్ గార్లకు కూడ య్ట్టిస్థితి కలదు. ఈ స్థితులన్నియు ఉన్నవని చెప్పిన దైవజనుడైన దేవదాసు అయ్యగారు కూడ ఇట్టి స్థితిని కలిగి యున్నారు. కనుకనే యీ విషయముల నన్నిటిని దివ్యముగా బోధింపగలిగినారు. ఇట్టి అనుభవమును జ్ఞానము ద్వార అర్ధము చేసికొనుట కష్టతరమైన స్థితియై యుండునుగదా !
Homeపరలోకము
ఎ) సిం హాసనము:- ఇది దేవుడు సిం హాసనము. ఈ సిం హాసనమందు ఆసీనుడైన తండ్రి సూర్యకాంత పద్మరాగములను పోలియున్నారు. మరకతమువలె ప్రకాశించుచున్నారు. సూర్యకాంత పద్మరాగములను పోలియున్నారనగా మహిమ కెరటములు కలవారు. దేవుని యొక్క మహిమయే అన్ని రీతులుగా కనబడుచున్నది. మందులు కాల్చినపుడు ఆకాశమునందు రంగులు కనబడు రీతిగా ఆయన మహిమ కనబడును. దీనిని వర్ణించుటకు మనుష్య జ్ఞానము చాలదు. సొం హాసనములో నుండి ఉరుములు, ధ్వనులు, మెరుపులు వచ్చెను. దేవుడున్న స్థానములో యిట్టి మహిమ స్థితి ఉన్నట్లు తెలియుచున్నది దేవుడు సీనాయి కొండమీదికి దిగి వచ్చినప్పుడు ఉరుములు, మెరుపులు ధ్వనులు వచ్చెను. వీటిని చూచి యిశ్రాయేలీయులు భయపడిరి. (నిర్గమ 19:16)
బి) సిం హాసనమును ఆవరించియున్న ధనస్సు :- ధనస్సు క్రీస్తు ప్రభువునకు గుర్తు. సూర్యుని చూడలేము గాని సూర్య కిరణములో నుండి ప్రత్యక్షమైన ధనస్సును చూడగలము. అట్లే దేవునిని చూడలేముగాని దేవుని పోలికను చూపించిన ధనస్సయిన క్రీస్తును చూడగలము. ఈ ధనస్సు మానవులందరికి నిరీక్షణ నిచ్చునది. జలప్రళయకాలములోని ధనస్సు (ఆది 9: 18)
మీకిక జలప్రళయమురాదని తెలియజేయుటకే దేవుడు ప్రజలకు ఈ ధనస్సును కనబరచెను. అట్లే ధనస్సయైయున్నారు. ధనస్సులోని 7 రంగులు దేవుని 7 ఆత్మలు.
సి) 24 సిం హాసనములు 24గురు పెద్దలు:- ఈ అధ్యాయములో ఇక్కడ 24గురు పెద్దలు కలరు వీరిలో పన్నిద్దరు పాతనిబంధనలోని గోత్ర కర్తలకు సంబంధించినవారు. మిగతా పండ్రెండు మంది పెద్దలు క్రొత్త నిబంధనలోని అపొస్తలులకు సంబంధించినవారు. దీనిని బట్టి చూడగా పాతనిబంధన భక్తులు క్రొత్త నిబంధన భక్తులు, పెండ్లికుమార్తె అంతస్తులోని వారని తెలియుచున్నది. పాత నిబంధన భక్తులు క్రీస్తుప్రభుని మొదటిరాక కొరకు ప్రయాసపడి పనిచేసి, విశ్వసించి తమవంతులో చేరిరి. (హెబ్రి 11: 24-26) అట్లే క్రొత్త నిబంధన విశ్వాసులు ప్రభుని రెండవరాక కొరకు ప్రయాసపడి పనిచేసి, విశ్వసించినవారు. గనుక నూతన యెరూషలేము పట్టణ ద్వార బంధములపై పన్నిద్దరు గోత్ర కర్తల పేర్లును, పండ్రెండు పునాదులపై పండ్రెండు గురు అపొస్తలుల పేర్లును గలవు. కనుక పాతనిబంధనకాల భక్తుల నివాసము, క్రొత్త నిబంధనకాల భక్తుల నివాసము పరలోకపు నూతన యెరూషలే మేనని తెలియుచ్హున్నది. కనుకనే ఇందు 24 సిం హాసనములు కలవు ఇదేకుమార్తె. ఆ 24 24 గుంపులు ఒక్కొక్క గుంపులో కోటాను కోట్లుందురు. ఈ యిరువది నలుగురు తెల్లని వస్త్రములు ధరించుకొనిన వారై సువర్ణకిరీటములు పెట్టుకొనిరి.
డి) కిరీటములు:- ఇవి జయమునకు గుర్తు. ఆ పెద్దలు పాపమును, పాపఫలితమును, సైతానును పాతాళమును, నరకమును, జయించినవారు. కనుక వారికి కిరీటములు యివ్వబడెను. వీరు భూలోకములో ఎన్నిక జయించినవారు. కనుక వారికి కిరీటములు యివ్వబడెను వీరు భూలోకములో ఎన్నిక లేని వారుగను, అజ్ఞానులుగను, నీచముగను ఎంచబడినను, వీరు తమనుతాము తగ్గించుకొని దేవుని మహిమ కొరకు జీవించినందున పరమందు వీరికి కిరీటము ఇవ్వబడెను. నీతి. తిమో 4:8; జీవ. యాకోబు 1:12 ప్రక 2:10: మహిమ కీర్త. 8:5;హెబ్రి 2:7-9; 1 పేతురు 5:4 అక్షయ;1కొరింథి :25 సువర్ణ ప్రక 4:1; 12:3; ప్రక 7:13 అ.పొ 1:10
తెల్లని వస్త్రములు:- ఈ తెల్లని వస్త్రములు పెండ్లికుమార్తె అయిన 24గురు పెద్దలు మాత్రమే ధరించుకొందురు గాని యివి రక్షణ పొందిన వారు గాని, పరదైసులోనున్నారు గాని వెయ్యేండ్ల పరిపాలనలోని వారుగాని, మరెవరు వీటిని ధరించుకొనరు పరిశుద్ధాత్మ తండ్రి పెండ్లికుమార్తెకు నానా విధములైన వరముల వలన రంగు రంగు వస్త్రములను తయారుచేసి యిచ్చు చున్నారు. ఇవి భూమిమీదనే పెండ్లికుమార్తె సంపాదించుకొన్నది. మత్త22:12 లోకములోని తెల్లని వస్త్రములు మాసినందున వాటిని మాటిమాటికి ఉతికి తెలుపుచేసికొనవలెను. కాని పెండ్లికుమార్తె తెల్లటి వస్త్రము ఎప్పటికి మాయదు. ఎందువలననగా గొర్రెపిల్ల యొక్క రక్తములో ఒక్కమారే తెలుపు చేసికొన్నది. పెండ్లికుమార్తెకు ఉండవలసిన వస్త్రములు 5 రకములు. కొందరు 5రకముల వస్త్రములు సంపాదించుకొందురు. కొందరు 4, కొందరు 3, కొందరు రెండు, కొందరు ఒకటి, సంపాదించుకొందురు. సంతోష కీర్త 30:12;సుందర; యెష 52: 1 దీనమనస్సు 1 పేతురు 5:5.
1) పాపశోధన 2) వ్యాధులు, 3) నిందలు, 4) ఇబ్బందులు, 5) అవిశ్వాసము. వీటి అన్నిటినుండి పెండ్లికుమార్తె తయారుకావలెను. ఈ శ్రమలన్నియు పెండ్లికుమార్తెకు వచ్చితీరవలె ఈ శ్రమగుండములో, తిరుగుచు ఆ వస్త్రములు సంపాదించుకొనవలెను. అవిదాటి బయటకు వచ్చిన యెడల పెండ్లికుమార్తెగా సిద్ధపడలేరు. ఈ 5 రకముల వస్త్రములు వేసికొనుట వెలుగుగా నుండదు. 5 రకములుగా ఆ మహిమ ఉండును. 5 రకములుగా ఆ వస్త్రములు మెరయును. ఇవి ధరించిన వారికి 5 రకముల సంతోషములుండును ఈ గుండమునే 1) శ్రమల గుండమందురు. దీనికే 2) కృపాగుండము 3) పరీక్షాగుండమని కూడ పేర్లు కలవు. ఈ ఐదు రకములే గాక యింకా కోటాను కోట్లు ఆయా సమయములందు వేసికొను వస్త్రములుండును, భూలోక వస్త్రముయొక్క పని శరీరమును కప్పుట గాని పరలోకపు వస్త్రము యొక్క పని ఇతడు భూలోకములో యింత శ్రమ సహించినాడు యింత శోధన జయించినాడని బయలు పరచుట, పతలోక వస్త్రములే ఆదాము అవ్వలకు మొదటి మహిమ వస్త్రముగా నున్నవి అట్టి వస్త్రములే మనకును వచ్చును. మహిమ వస్త్రముల వల్ల మన సద్గుణములు బయలు పడును. రక్షణ వత్స్త్రము అనునది సామాన్య వస్త్రము, ఇది అందరికి ఉండును. యెవరైతే తమ పాపములు ప్రభు యేసురక్తమునందు శుద్ధిచేసి కొందురో, వారందరూ ఈ వస్త్రమును కలిగి యుందురు. సంఘము ముడతయైనను, మచ్చయైనను, లేనిదైయుండవలెను. మనకు తెలిసిన తప్పులుండ కూడదు. తెలియని తప్పులు కూడ ఏదో ఒక సమయమునందు ప్రభువు తెలియజేయును చివరకు మరణ సమయము నందైనను, తెలియజేయును. ప్రతివారు సజీవుల గుంపు, మృతులగుంపు రాకడలో ఎత్తబడగానే 24 గుంపులలో ఎవరి గుంపులో వారు చేరుకొందురు. (1కొరింథి 15 : 23)
రక్షణ వస్త్రము:- యెష 61:10 తెలిసిన పాపములు ఒప్పుకొని క్షమాపణ నొందవలెను. ఇక మీదట చేయనని ప్రమాణము చేయవలెను. తెలియని పాపములు దేవుడే వారికి జ్ఞాపకము చేసి, ఒప్పింపజేసి, క్షమాపణనిచ్చును. ఇట్లు క్రీస్తు రక్తమునందు శుద్ధినొందిన వారే రక్షణ వత్రముగల వారు. ఎప్పుడు వస్త్రము మాయునో అప్పుడే ఆయన రక్తములో ఉదుకుకొనుచుండవలెను. ఎప్పుడు పొరపాటులో పడునో అపుడే రక్షణ వస్త్రము పరలోకమునకు వెళ్ళిపోవును. మరియు పాపమునుండి మరలుకొని మారుమనస్సు పొందగానే రక్షణ వస్త్రము మరల అను గ్రహింప బడును. (ప్రక 7: 10-14).
2) నీతివస్త్రము:- నేను రక్షణ పొందిననాను గనుక రక్షణ వస్త్రము ధరించుకొన్నాను గనుక నేను నీతిగా నడచుకొందును. అని తీర్మానించుకొని నీతిగా నడచునప్పుడు దేవుడు నీతి వస్త్రము నిచ్చును భూలోకములో నీతిగా నడచినందుకు నీతివస్త్రము పరలోకములోనికి వెళ్ళుటకు రక్షణ వస్త్రము యివ్వబడును. !) మనము పుట్టుకతోనే అనీతి మంతులము. 2) మన సత్ క్రియలు పరలోకమున పనికిరావు 3) యేసు ప్రభువు ద్వారా మనకు వచ్చిన నీతివల్ల పరలోకము దొరుకును. యేసు ప్రభువు చేసినవన్నియు మన కొరకేననియు ఆయన సంపాదించునవన్నియు నాకిచ్చునని నమ్ముట యేనీతి (యెష 61:10).
3) జయవస్త్రము:- నీతి వస్త్రము ధరించుకొని శోధన జయించునపుడు ప్రభువు మనకు జయ వస్త్రము నిచ్చును. ఎందుకు జయించినాడనగా ప్రభువు నన్ను పడనీయడని నమ్మినాడు గనుక జయించగలిగినాడు (ఎఫెసి 6: 10) ప్రభువు శక్తినిబట్టి. (ప్రకటన 3:5)
4) హతసాక్షి వస్త్రము :- పైమూడు వస్త్రములు పొందినపుడు ధెర్యముగా యెవరు నిలిచియుందురో శోధన వచ్చినపుడు వారు హత సాక్షులు కావచ్చును. ఇది మహాగొప్పది. అందరికి దొరుకదు. సాధు సుందర్సింగ్ గారికిదిచాల యిష్టము. ఎవ్వరికీలేని మహిమ వీరికుండును. ప్రభువు హతసాక్షి అయినారు గనుక వీరును హతసాక్షులెన యెడల ప్రభువుతో సమానులగుదురు. హతసాక్షులు 9ఒక్కమారె) అ. కార్య 7:58; 12:2 దీర్ఘకాల హతసాక్షులు (రోమా 8:36) యెష 61:3; 61:10) (లూకా 16:19).
5) ప్రకాశమైనవియు, నిర్మలమైనవియుయునగు సన్ననినారబట్టలు:-
(ప్రక 19:8) ఇవే పెండ్లి వస్ర్తములు ఇవి ధరించువారు ఎట్టి వారనగా ఆయన ప్రేమ మన యెడల యెంత వరకు ఉన్నదో మన ప్రేమయు ప్రభువు యెడల అంత సమానముగా నుండవలెను. సమానమైన ప్రేమ కాదుగాని యేసు ప్రభువునందు మిక్కుటమైన ప్రేమ కలిగియుండవలెను. ఎల్లప్పుడును ప్రభువు తలంపే కలిగియుండవలెను, దేవుడిచ్చిన పదియాజ్ఞల ప్రకారము చేయవచ్చును. కాని ప్రభువును మిక్కుటముగా ప్రేమించుట మిక్కిలి కష్టము.
పరిశుద్ధ నిత్యసహవాసము :- ఇక్కడ దేవునితో కొద్దిసహవాసమేగాని పరలోకములో ఎక్కువగాను, వృద్ధిగాను, నిత్యమును, ఉండును మనోనిదానము చెదరదు తండ్రి, మనము ఒక్క స్థలములోనే యుందుము. భూలోకము నందు నిత్యసహవాసములో ఉండవలెనని ఆశయుండునుగాని కుదరదు.
ముఖ దర్శ్నము:- ఈ నాల్గవ అధ్యాయములో పరలోకమునకు వెళ్ళిన సంఘము నిత్యము ప్రభువు యొక్క ముఖమును చూచుచునేయుండును. అందువలన గొప్పశాంతి, కాంతి వారికి దొరుకును ఇంక కొంత సేపు ప్రభువు యొక్క ముఖ దర్శ్నము చేయుదమని అనుకొందురు. పైభాగ్యములన్నియు మనము సంపాదించుకొనవలెనంటే దైవసన్నిధి బలము కలిగి ఉండవలెను. భూలోకమందు మనము ముగించవలసిన పనులన్నియు ముగించవలయును బైబిలంతా గ్రహించుచు చదివి ముగించవలెను. వివరము పూర్తిగా తెలిసికొనవలెను. వాక్యమును పూర్ణముగా నమ్మవలెను సువార్త ప్రకటించవలెను. అందరిని గూర్చి, అన్నింటిని గూర్చిన ప్రార్ధనలన్నియు ముగించవలెను. అనగా ఖండములు, దేశములు, బంధువులు, స్నేహితులు, శత్రువులు, వీటన్నిట్ని గూర్చి ప్రార్ధించి ముగించవలెను.
డి) 7 దీపములు:- (4:5) అనగా పరిసుద్ధాత్మ శక్తి 7రీతులుగా పనిచేయుచున్నది. 7అను సంఖ్య పరిపూర్ణతను సూచించు చున్నది. అనగా పరిశుద్ధాత్ముని యొక్క పని ఆ సంఘములలో 7రీతులుగా కనబడుచున్నది. పరిశుద్ధాత్ముని యొక్క పని యేదనగా; 7సంఘములలో ఒక్కొక్క సంఘము యేస్థితికి తయారు కావలెనో ఆయా రీతులుగా పరిశుద్ధాత్ముడు సంఘములను సిద్ధపరచును. 7ఆత్మలు ప్రజ్వలించుచున్నదనగా ప్రకాశించుట. అనగా యిహమందుగాని, పరమందుగాని చేయవలసిన దేవుని ప్రక్రియకు సాధనము పరిశుద్ధాత్ముడే. ఉదా:- వెలుగు కలుగునుగాక! అని పలికింది తండ్రి. ఆ పలుకే క్రీస్తుప్రభువు. వెలుగును కలిగించినది పరిశుద్ధాత్ముడే దేవుని అంతరంగములోని అనాదినుండి అనంతము వరకు ఉన్న రక్షణ కార్యక్రమమును వ్రాత మూలముగా తెలియజేయునది పరిశుద్ధాత్ముడే.
ఇ) గాజు సముద్రము :- 4:6 దీనికి ప్రత్యక్ష సముద్రమని పేరు పెట్టవచ్చును. తండ్రియు, కుమారుడును, పరిశుద్ధాత్ముడును, యేమి చెప్పుచున్నారో, ఏమి ఆలోచించుచున్నారో, యివన్నియు గాజు సముద్రములో కనబడుచున్నవి. దేవదూతలకుపైన పరలోకములో ఏమి జరుగుచున్నదో తెలిసికొనుటకే గాజు సముద్రము. పెండ్లికుమార్తె కంటె గొప్పవారు, పరిశుద్ధులు యిరువది నలుగురు పెద్దలు కూడా పైన ఏమి జరుగుచునదో తెలిసికొనవలెనని ఆశ ఉండును. ఈ లోకములో దేవుడు ఎన్ని విషయములను తెలియపరచునో, ఎన్ని అవసరమో అన్నియు మనము వినవలెను గాని నిర్లక్ష్యముగా నుండకూడదు. ఈ గాజు సముద్రము వైపు ఎన్నో కోట్ల సంత్సరముల నుండి చూచుచున్న దేవదూతలకు సహితము ఎంతో ఆశ యున్నది. తండ్రియొక్క మహిమతోను, కుమారుని యొక్క మహిమతోను, పరిశుద్ధాత్మునియొక్క మహిమతోను సిం హాసనము ఆవరించియుండును. అన్ని రకముల మహిమతో ఆ స్థలము నిండియుండును. కనుక ఆ మహిమను చూచుటకు పెండ్లికుమార్తెను గాజు సముద్రమునకు యివతలనుంచెను. భూలోకములోని గాజు సముద్రము ప్రకటన గ్రంధమే.
ఎఫ్) నాలుగు జీవులు:- 4:7,8 (యెహెజ్కేలు 1:10 ప్రకటన 4:6) మొదతి జీవి సిం హము వంటిది. మూడవ జీవి మనుష్య ముఖము గలది నాలుగవ జీవి యెగురుచున్న పక్షిరాజు వంటిది. ఈ నాలుగు జీవులును ప్రతి జీవికి ఆరేసి రెక్కలుండెను. ఇవి చుట్టును రెక్కలలో వటను, కన్నులతో నిండియున్నవి. ఈ నాలుగు జీవులు నాలుగు సజములు, ఈ నాలుగు జీవులు లోకమంతటిని గూర్చి ప్రార్ధించుచుండును. వీరు దేవుని సృష్టి అంతటిని గూర్చి ప్రార్ధింతురు.
1. సిం హము:- భయంకర అడవి మృగముల కొరకు ప్రార్ధించు ప్రతినిధి.
2. దూడ:- జంతువుల కొరకు ప్రార్ధించు ప్రతినిధి.
3. నరుడు:- మానవులందరి తరపున ప్రార్ధించు ప్రతినిధి.
4. పక్షి:- పక్షి జాతుల కొరకు ప్రార్ధించు ప్రతినిధి.
ఈ నాలుగు జీవులు దూతలే, ఆయా రూపములతో యోహానుకు దర్శ్నములో కనబడినవి నరులు సంపూర్ణనలు చేయలేరు. వారి బదులు ప్రార్ధనా స్తుతులను చేయుచు, మన ప్రార్ధనా స్తుతులను సంపూర్త్య్ చేయుదురు. ఎంత గొప సంగతి? సొం హాసనము నొద్ద సృష్టి అంతటినీ యెప్పుడునూ జ్ఞాపకము చేయుచునే యుందురు సృష్టిలోనుండు ఏ వస్తువునూ, ఏ జీవిని తండ్రి మరువరు, దేవుని సిం హాసనము నొద్దనుండు దూతలు కెరూబులు.
కెరూబులు :- (ఆది 3:24) పరలోక గవర్నమెంటులో న్యాపక్షముగా పనిచేయును. వీరు కూడా ఎల్లప్పుడు మనలను గూర్చి ప్రార్ధించుచుందురు. మనము యే యే పనులు చేయుచున్నామో, వాటిని యెప్పుడునూ తండ్రికి తెలియ జేయుదురు. దేవుని పరిశుద్ధతను ఎదిరించువారిని వీరి సహింపలేరు. దేవుని ఎదురించు వారికి దేవుని న్యార్ధమైన శిక్ష వచ్చును. తెలిసి ఉండియు పాపము చేయుత అగ్నిలో చేయిపెట్టినట్లే.
శెరూపులు :- (యెషయ6:2) కెరూపులు లేక శెరపీయులు. ఎదిరించిన పాపి రక్షించు ప్రభువా? అనగానే ఈ పాపి మారుమనస్సు పొందినాడు. రక్షించు ప్రభువా! అని దేవుని ప్రతి మాలుదురు మరియు మనిషితో యింక ప్రార్ధించుము భయపడకుము. దేవుడు నీ ప్రార్ధన అంగీకరించును. అని ధైర్యపరతురు. ప్రక 4:8-11;యెషయ 6:2లో ఆరు రెక్కలు గల దూతలు దేవుని సన్నిధిలో నున్నారు ప్రక 4:8లో కూడా ఆరు రెక్కలు గల దేవదూతలు కనబడుచున్నారు. ఈ దూతలు రెండు రెక్కలతో తమ ముఖమును దేవుని సన్నిధిలో కప్పుకొనుచు రెండు రెక్కలతో పాదములను కప్పుకొని, రెండు రెక్కలతో ఎగురుట అనుస్థితిని కలిగియున్నారు. ఈ రెక్కలు ముందు, వెనుక, కండ్లతో నింపబడియున్నవి. ఈ కండ్లకు గతకాల, నేటికాల రాబోవు కాలముల యొక్క సంగతులు చూచి వాటి వివరములు తెలిసికొనుశక్తి కలిగియున్నవి. దేవదూతలను అది అని సంబోధింపలేదు. గాని ఒక్కొక్కరిని వారు అని వాడిరి. (యోహాను 20:13) వీరు స్త్రీలుకారు,పెరుషులు కారు. మనకంటె గొప్పవారు. కనుక దేవదూతగారు అని పిలువవలెను. మన తెలుగులో అంతకంటె మరియొక గొప్పపదము లేదు.
సైన్యములకు అధిపతియగు యోహూవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. అనునది దేవుని స్థితియై యున్నది.అయితే దానిని దేవదూతలు దేవునికి స్తుతిగా మార్చి రాత్రింబగళ్ళు స్తుతి చేయుచున్నారు. స్ర్వలోకము ఆయన మహిమతో నిండియున్నది. ఇది సర్వలోకము నందలి దేవుని క్రియయై యున్నది. ఉదా:- సూర్యుడు ప్రకాశమానమైన గోళమైయున్నాడు. ఇది దాని స్థితి సూర్యుడు వేడితో లోకమునకు వచ్చుట. ఇది దాని క్రియయై యున్నది. భూత వర్తమాన, భవిష్యత్ కాలములఓ నుండు సర్వాధికారియు, దేవుడునగు ప్రభువు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని మానక రాత్రింబగళ్ళు చెప్పుచుందురు. ఎల్లప్పుడు ప్రార్ధించుడి, ఆనందించుడి అని అపొస్తలుడైన పౌలు విశ్వాసులను హెచ్చరించుచున్నాడు. ఈ మూడింటిలో ఒకటి దేవదూతలు చేయుచున్నారు. అట్లే మనమును ప్రార్ధించేస్థితి, ఆనందించే స్థితి బాగుగా తెలిసికొంటేనే గాని చేయలేము తెలిసికొనకుండ చేస్తే మతిలేని స్తుతి అగును. చివరకు పుట్టగతులు లేనివాడే అగును స్థితి లేనిదే స్తుతిరాదు.
ప్రకటన 4:9లో సిం హాసనమునందు ఆసీనుడై యుండి యుగయుగములు జీవించుచున్న వానికి మహిమయు, ఘనతయు, కృతజ్ఞతాస్తుతులు కలుగునుగాకనియు, నాలుగు జీవులు స్తుతించుచుండిరి. పై మూడు దేవుని కున్నను, దేవదూతలు వాటిని బయలుపరచి స్తుతించుట వారిపనియై యున్నది అని దేవుని కున్నపని మనము గ్రహించినమ్మితే స్తుతించగలము. పరలోక ప్రార్ధనలో నీ రాజ్యమువచ్చుగాకని ఉన్నది. మన ప్రార్ధన లేకుండ ఆయన రాజ్యము రాదా? వచ్చును గాని, ఆ మాటలు మన దగ్గర నుండి వెళ్ళవలెను.
4: 10-11 ఒకరి వద్దనుండి బహుమానము వచ్చినప్పుడు తిరిగి వందనము అని కృతజ్ఞత వెళ్ళవలెను ఈ యిరువది నలుగురు పెద్దలు సిం హాసనమునందు ఆసీనుడైయుండు వాని యెదుట సాగిలపడి నమస్కారము చేసిరి ఈ 24 గురు పెద్దలలో 12మంది పాత నిబంధనలోని 12 గోత్రములకు 12మంది, క్రొత్త నిబంధనలోని 12మంది ప్రభువు శిష్యులును కలిపి పెండ్లికుమార్తె సంఘమునకు ముంగుర్తు. పెద్దలుగా నుందురు. వీరు పెండ్లికుమార్తె సంఘమైయున్నారు. మట్టిమీద పెండ్లికుమార్తె అయిన మనము మహిమ లోకము నుండి మనస్తులు క్రియలతోను, మాటలతిఎను, చేయవలెను. మనము అట్లు చేయుటకే ఇది వ్రాయబడెను.
తమ కిరీటములను అనగా ఆ ఆ 24 గురు పెద్దలు ఎందుకు క్రిందపడవేసిరి? ప్రభువా నీవు మాకు కిరీటములు యిచ్చినావు. మేము ఆ కిరీటములు పొందుటకు యోగ్యులముక్కము నీ చాటుచాటున వాటిని ధరించుకొనుచున్నాము. ఇప్పుడు నీ యెదుట తీసివేయుచున్నాము. అని సిం హాసనము యెదుట పెట్టివేసిరి. ఉదా:- గుడిలోని ఆరాధనకు దొరలు రాగానే తమ తలలమీదనున్న టోపీలను తీసివేసి కూర్చుందురు. ఈ విధముగానే ఆ పెద్దలు అవలంభించుచున్నారు. 24 గురు పెద్దలు సాగిలపడి నమస్కారము చేయుచూ ఈ క్రింది విధముగా స్తుతించిరి. ప్రభువా ! మాదేవా! నీవు సంస్తమును సృజించితివి. నీ చిత్తమును బట్టియే అవి యుండెను. దానిని బట్టియే సృజింపబడెను గనుక నీవే మహిమ ఘనత, ప్రభావములు పొందనర్హుడవని చెప్పిరి.
షరా:- మనమును దేవుని స్తుతించునపుడు మనకున్న జీవము తెలివి, శక్తి, విశ్వాసము, బైబిలు విద్య , ధనము, గౌరవము, వరములు, మొదలగునవన్నియు క్రిందపడవేసి ప్రభువుమీద గాఢమైన గౌరవము, ప్రేమ ఆయన యెడల ఆయన సన్నిధిలో చూపించుచు స్తుతించుటయే గొప్పస్థితియై యున్నది. మనకున్న స్థితి యావత్తుదించి, ప్రభువు సమీపింపవలెను. ప్రభువా! నేను దేనికి తగను. నీవు అన్నిటికి తగుదువు అన్నిటికే సమ్ర్ధుడవు శక్తిమంతుడవు. అని గ్రహించి స్తుతించిన యెడల అదే గొప్పస్తుతి ఇదే పెండ్లికుమార్తెకు తగిన స్తుతి. స్థితియునై యున్నది.
Home