22వ అధ్యాయము - River of Life. Final Warning

పరిచయము

నది :
  • 1. గద్దెనుండి
  • 2. పట్నవీధిమధ్య


అ) దేవుడు
బి) గొర్రె
    వృక్షము :
  • 1. ఆ నది రెండొడ్లను
  • 2. పన్నెండు కాపులు
  • 3. ఆకులు - స్వస్థత
    N.B :
  • 1. శాపగ్రస్తము ఉండదు
  • 2. దేవుడు గొ|| గద్దె
  • 3. దాసులు దర్శింతురు
  • 4. వారి నొసళ్ళపై దేవుని నామము
  • 5. దేవుని కాంతి
  • 6. దాసులు, యుగాలు రాజ్యము
    ఆ దూత:
  • ధన్యుడు: ఈ గ్రంధ ప్రవచనకరుడు
  • యోహాను - నమస్కారము
  • ఆ దూత - వద్దు స్త్రీ శేషసంతాన
  • గైకొనువారితో సహా దాసుడు
    ఆ దూత:
  • 1. ఈ గ్రంధ ప్రవచనము ముద్రించు
  • 2. కాలము సమీపం
  • 3.
    • ఎ) అన్యాయస్తుడు _ అ
    • బి) అపవిత్రుడు _ అ
    • సి) నీతిపరుడు _ నీ
    • డి) పరిశుద్ధుడు _ ప
    ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను
  • 1. క్రియాజీవితం - నాయొద్ద ఉన్నది
  • 2. అల్ఫాయు
  • 3. ధన్యులు :
    • ఎ) వృక్షము హక్కుగలవారు
    • బి) గుమ్మములోనుండి వచ్చువారు
    • సి) బట్టలు ఉదుకుకొనువారు
  • 4. వెలుపట
    • ఎ) కుక్కలు
    • బి) మాంత్రికులు
    • సి) వ్యభిచారులు
    • డి) నరహంతకులు
    • ఇ) విగ్రహారాధికులు
    • యఫ్) అబద్ధికులు
యేసు: నేను నా దూతను పంపితిని
    నేను
  • ఎ) దావీదు చెర
  • బి) చిగురు
  • సి) సంతానము
  • డి) వేకువచుక్క
  • ఆత్మ
  • పెండ్లికుమార్తె


రమ్ము
    N.B :
  • వినువాడు: రమ్ము అనవలెను
  • దప్పిగొనువాడు - రావచ్చును
  • 2. ఇచ్చయించువాడు - పుచ్చుకొనవచ్చును

జీవజలం

    వినువానికి :
  • 1. కలిపితె తెగుళ్ళు
  • 2. తీసివేస్తె పాలులేదు
  • ఎ) వృక్షం
  • బి) పట్న

సాక్షి: త్వరగా వచ్చుచున్నాను

యోహాను: ప్రభువైన యేసు రమూ

దీవెన: యేసు కృప

పరిశుద్ధులకు

బైబిలులోని చివరి పుస్తకము చివరి శిష్యుడైన యోహాను వ్రాసిన చివరి అధ్యాయము.

ఆదికాండముమొదటి అ|| ప్రకటన అ||
  • 1. సృష్టి ఆరంభములో ప్రకాశిత
  • 2. సృష్టిలో పరిశుద్ధమైన స్థితి
  • 3. అదామునకు పాపస్థితి
  • సృష్టి చివరిలో గొప్ప ప్రకాశిత
  • మహిమ స్థితి
  • నరులకు మహిమస్థితి

ఆదాము పాపములో పడకపోయిన యెడల వాగ్ధానము, రక్షణ, అద్భుతములు, దేవునికృప, సంఘము, సిద్ధపడుట, యెత్తబడుట మొద||నవి ఉండవు. గాని పాపములో పడకపోయిన మొదటి పరిశుద్ధ స్థితి ఉండే ఉండును. ఇది దేవుని మొదటి కృప. పాపస్థితికి ముందు మహిమ స్థితి ఉన్నది. ఇది దేవుని రెండవ కృప.

ప్రార్ధన:- జ్ఞాన స్వరూపుడైన ఓ తండ్రీ నీ వాక్యము సృష్టముగా లేదు. గూఢముగా నున్నది నీవాక్యమును చదివిన యెడల లోస్థులు విమర్శ చేయుచున్నారు. నీ దాసులకు, నీ సేవకులకు నీ అత్మనుబట్టి సృష్టము గానే తెలియుచున్నది. పరలోకములో స్ఫటికమువలె మెరయునట్టి జలములవలె నున్నది. ప్రవక్తల, సువార్తల, ఉత్తరముల చివరి ముగింపు ఎలాగున్నదో అలాగే ప్రకట చివరి ముగింపుకూడ అలాగుననే యున్నది. నీ వాక్యము నదివలె మెరయుచు ఉన్నది. ప్రవహించుచు యున్నది. నీకనేక వందనములు. కొందరికి నదివలె లేదు, స్ఫటికమువలె లేదు, మెరయునట్లు లేదు, సృష్టముగా లేదు అది నీకృపనుబట్టి మాకు సృష్టపరచినందుకు స్తొత్రములు. ప్రకటన మొదటి అ|| మొదలుకొని 22వ అ|| వరకు మర్మము లేకుండా సృష్టముగా బోధపరచినావు అందుకు స్తోత్రములు. ఈ ప్రవచన వాక్యమును చదువువారిని. గైకొనువారును ధన్యులను వ్రాయించితివి. తెలిసికొన్నవారు ధన్యులేగాని, తెలిసికొననివారు ధన్యులుకారు. భూతలములను బంధించుము జ్ఞానము, విశ్వాసము, మనస్సాక్షి ధైర్యము, ప్రత్యక్షత: ప్రయత్నమును వెలిగించుమని త్వరగా రానైయున్న ప్రభువుద్వారా వేడుకొనుచున్నాము. ||ఆమెన్||

జీవ నది

ప్రక : 22:1. స్ఫటికమువలె మెరయునట్టి జీవజలముల నది దేవుని యొక సిం హాసనము యొద్దనుండి ప్రవహించెను.

నదివలె మెరయునట్టిది దేవుని వాక్యమని తెలియుచునది. స్ఫటికము వలె మెరయుచున్నది. గూఢముగను మర్మముగాను యున్నది. గాని హృదయముయొక్క స్థితి ఏలాగు యున్నదో అలాగే వాక్యముయొక్క మర్మము, ధర్మము, భావార్ధము. గూడార్ధములు తెలియపరచబడును. ఏ రంగు అద్దాలు వేసికొన్న వారికి ఆరంగే కనబడును.

ప్రక:22:2, నది ఈవలను, ఆవలను జీవ వృక్షములుండెను నెల నెలకు ఫలించు పండ్రెండు కాపులు కాయును. అ వృక్షముయొక్క ఆకులు జనములను స్వస్థ పరచుటకై వాడబడును.

చెట్టు అనగా అర్ధముకాదు మీరు ఈ సంవత్స్రము జొన్న వేసినారా, సజ్జవేసినారా అని అందురు గాని యెన్ని గింజలు వేసినారని ఎవరు అడగరు అలాగే చెట్టు అని ఉన్నది గాని దానికి పూర్తి అర్ధములేదు. ఈవిషయములు వెయ్యియేండ్ల పాలనలోనివికాదు. అంతకుదాటి రానైయున్న కాలములోనివి. భూమిమీద అనేక రకములైన జనాంగములున్నారు. ప్రభువును గూర్చిన వార్త వారు వినుచున్నారు. నూతన యెరూషలేము వెళ్ళవలెనను ఆశ వారికి ఉన్నది. అట్టి ఆ జనాంగము ఇక్కడ ఇప్పుడు అనుభవించునవి-కొన్ని కలవు.

  • 1) పాప క్షమాపణ అనుభవము
  • 2) రోగనివారణ అనుభవము,
  • 3) ఆకలి నివారణ అనుభవము.
  • 4) దాహ నివారణ అనుభవము
  • 5) వస్త్రనివారణ అనుభవము.
కొంత వరకు శరీర ఆత్మీయరీతిగా ఇవి అనుభవించిచునదియై యున్నది. భూలోకములో కొంతమట్టుకు తృప్తిని కలిగించి పరలోకములో ఇవి ఉన్నవి. అనుటవలన తృప్తి కలుగును. యెలాగు అనగా ఇచ్చట ప్రభువు సహవాసము, దర్శనము, ప్రేమ అనుభవించుదుము గాని అక్కడ పరలోకములో శాశ్వతకాలము అనుభవించుదము. ఇక్కడ తృప్తి ఉంటే శాశ్వత కాలములో అన్నియు వుండును గనుక తృప్తి ఉండవలెను.

ఈ శరీరములో స్వస్థత యున్నది. ఆత్మ శరీరమునకు, మహిమ శరీరమునకు స్వస్థత శాశ్వతకాలము ఉండును. భూలోక ఆహారమునకు బదులు పరలోకములో ఆత్మకు యేదో ఒక ఆహారము ఉండును. శాశ్వతకాలము ఉన్నది. పరలోకములో జబ్బులేని శాశ్వత స్వస్థత, దానివల్ల తృప్తికలుగ్ను. పరలోకములో ఔషదములుగా ఆకులను స్వస్థత నిమిత్తమై శాశ్వతకాలమునకు ఉండును. ఇక్కడ ఉన్న ప్రతి వస్తువునకు బదులు శాశ్వత వస్తువులు మన గ్రహింపునకు అర్ధముగాని రీతిగా ఉండును.

  • 1) ఎప్పుడు ఆకలి లేకుండా ఉండుటకు జీవవృక్షఫలములు ఉండును.
  • 2) ఎప్పుడు దాహము లేకుండా ఉండుటకు జీవజలము ఉండును.
  • 3) ఎప్పుడు జబ్బులేకుండ ఉండుతకు అకులు ఉండును.
  • 4) ఎప్పుడు చీకటిలేకుండ ఉండుటకు వెలుగు ఉండును. ఇక్కడ అన్నము అయిపోగానే తృప్తి అయిపోవును. గాని అక్కడ కోటి సంవత్స్రములైన పిమ్మట స్వస్థత లేకపోతే తిరిగి వచ్చును.
  • 1) సహవాసము దొరుకుచు ఉన్నది.
  • 2) బోధ దొరుకుచు యున్నది.
  • 3) సంతుష్టి దొరుకుచు యున్నది.
  • 4) బైబిలు దొరుకుచు యున్నది.
  • 5) ఆహారము దొరుకుచు యున్నది.
  • 6) వస్త్రములు దొరుకుచు యున్నది.
  • 7) దర్శనములు దొరుకుచు యున్నది.
  • 8) స్వస్థత దొరుకుచు యున్నది.

గాని పరలోకములో శాశ్వత స్వస్థత, మహిమ శరీరముతోపాటు దొరుకును.

ప్రభు కృబాసనములో పతినుండి ప్రవహించి - శుభమైనది

యుండి సుఖమిచ్చునచట=సుభయ తీరములందు-మండు వృక్షములు సౌ-రభ దీప్త శుభములై రక్షా ఫలములిచ్చు || పరిశుద్ధి||

ఏ భక్తునికైనను భూలోకమందు మహిమ శరీరము రాదు. రేప్చర్ నుండి మహిమ శరీరము వచ్చును. అప్పటినుండి శాశ్వత స్వస్థత కలుగును.

  • 1) శ్సరీరము పోవును
  • 2) పాపము పోవును
  • 3) జబ్బుపోవును
  • 4) ఆకలి దప్పిక పోవును
  • 5) అస్వస్థత పోవును.
ఇవన్నియు రేప్చర్ రోజుననే మనకు కలుగును. రేప్చర్ అయిన తరువాత శాశ్వతకాలము వచ్చును. ఏలాగు అనగా జనవరి నెల తరువాత ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ అను నెలలు, కాలములు వచ్చునట్లు రేప్చర్ కాలములు తరువాత మహిమ శరీరము వచ్చును. ఆ తరువాత శాశ్వత కాలము వచ్చును.

విందు రెండు భాగములు -

  • 1) లక్షణముల జాబిత
  • 2) శాశ్వత స్వస్థత.
ఈ రెండు కలిసిన పరలోకములోని విందు. శాశ్వత స్వస్థత లేక పోయిన యెడల ఇవన్నియు పోవును. మనముచేసే ప్రతిదియు తప్పు అనేవారు ఉందురు. ఏది తప్పు అని మనము రుజువు పరచుదుమో అదికాదని చెప్పేవారు ఉందురు. దీనినిబట్టి వధువు సంఘము అపాయకరమైన స్థితిలోనికి వెళ్ళిపోవును. అందునుబట్టి జాగ్రత్తగా నుండవలయున. వధువు సంఘములోనికి సిద్ధపడువారు ఒకవేళ రక్షణ పోగొట్టుకొనువారై యుందురేమో జాగ్రత్తపడవలెను.

  • 1) పాపము ఉద్దేశపూర్వకముగా చేయుదురు.
  • 2) పాపమువల్ల పడిపోము అని అనుకొని పడిపోవుట.
  • 3) కొందరు పాపమని తెలియకుండా పడిపోవుదురు. ఈ మూడు రకాల పాపములో తూలి పడిపోయి ఆఖరులో తిరిగి లేచిన పెండ్లికుమార్తె వర్సకు రాలేరు.

ప్రక: 22:3. శాపగ్రస్తమైనది ఏదియు దానిలో ఉండదు దేవుని యొక్క సిమ్హాసనము దానిలో యుండును.

ఈ వచనములో చెడుగు శాపగ్రస్తమైనది ఉండదు అని ఉన్నది. ఇంత వరకు ఇది భూమిమీద ఉన్నది. ఇక ఇది పరలోకమునకు రాదు. పరలోకము నందు సిం హాసనము ఉన్నది. ఇప్పటివరకు దేవునికి ఒక్కరికే సిం హాసనము ఉన్నది. ఇప్పుడు మనుష్యులుకూడ పరలోకమునకు వచ్చివేసిరి. ఆదికాండము మొదలుకొని రేప్చర్ దినమువరకు నమ్మిక యేమున్నది? తుదకు పెండ్లికుమార్తె వరుస నాకు దొరుకునో లేదో అని అనుకున్న పెండ్లికుమార్తె వరుసకు తయారు కాని యెడల సిం హాసనము ఉండదు. పెండ్లికుమార్తెగా తయారైన యెడల నేనే లోకమంతయు తిరిగి పెండ్లి కుమార్తెను సిద్ధముచేసి తెచ్చి నా యొద్దకు కూర్చుండ బెట్టుకొన్నానని తన జయమును బట్టి ప్రబుహ్వు కూర్చుండును.

ఉదా:- యుద్ధమునకు వెళ్ళి జయించితేనే తప్ప సిం హాసనముపై కూర్చుండబెట్టరు. అలాగే తండ్రి, కుమారుని భూలోకమునకు పంపగా కుమారుడు సిం హాసనముపై కూర్చుందురు. తండ్రిపంపిన కుమారుడు జయించెను. జయము ఇద్దరకుగాని సిం హాసనము ఒక్కటే. ఇద్దరికి సంబంధించినది ఒక్క సిమ్హాసనమే. ఇది త్రిత్వమునకు గుర్తు. మైనపు వత్తిలో వెలుగు, వేడి, జ్వాల, ఉన్నది ఈ మూడు వేరువేరుగాని ఒక్కటే. అంత్య దినములయందు అన్నిటి మీద జయముపొంది సిం హాసనముమీద కూర్చుండుట గొప్పసంగతి. బైబిలు గ్రంధమును ఆత్మ తండ్రి వ్రాయించెర్ను గనుక తండ్రియొక్కయు గొరెపిల్లయొక్కయు, సిం హాసనము అని యోహానుచేత వ్రాయించిరి. ఆత్మ తండ్రియే వ్రాయించినరు గనుక తన పేరు పెట్టుకొనవలెను.

ప్రక: 22:4. ఆయన దాసులు ఆయనను సేవించ్చూ ఆయన ముఖ దర్శనము చేయుచుందురు. ఆయన నామము వారి నొసళ్ళయందు ఉండును.

ఈ వచనములో దాసులు అని ఉన్నది వీరు పరిచర్య చేయువారు. ప్రకటన ఒకటవన అ|| ఒకటవ వచనములోకూడ దాసులని ఉనది. దేవుని దాసులకే ప్రకటన అర్ధమగుచున్నది. వారు దేవుని సేవచేయుచున్నారు గనుక దేవుడు ఏమి చెప్పిన వారికి అర్ధమగుచున్నది.

ఉదా:- ఇంట్లో పనిపిల్లకు ఏమి చెప్పిన అంతయు అర్ధమగును. రేప్చర్ లో పెండ్లికుమార్తె పరలోకమునకు వెళ్ళిపోయినది. భూలోకములో ఉన్నప్పుడు సువార్త ప్రకటించి దేవుని సేవ చేసినది గనుక పరలోకానికి వెళ్ళనప్పటికి పెండ్లికుమార్తె అయిపోయినది.

అయ్యగారు ఒక ఊరికి వెళ్ళినప్పుడు పెండ్లికుమార్తె ఇల్లంతయు ఊడ్చుచు దాసురాలువలె పనిచేసెను. సాయంకాలమగుసరికి తన్నుతాను అలంకరించుకొని పెండ్లికుమార్తెగా తయారై వచ్చినది. ఉదయము ఆమె సేవకురాలు సాయంకాలము ఆమె పెండ్లికుమార్తె.

అయ్యగారు ఒక ఊరికి వెళ్ళినప్పుడు పెండ్లికుమార్తె ఇల్లంతయు ఊడ్చుచూ దాసురాలువలె పనిచేసెను. సాయంకాలమగుసరికి తన్ను తాను అలంకరించుకొని పెండ్లికుమార్తెగా తయారై వచ్చినది. ఉదయము ఆమె సేవకురాలు సాయంకాము ఆమె పెండ్లికుమార్తె.

పెండ్లికుమార్తె పరలోకమునకు వెళ్ళిపోగా మిగిలినవారు యేడు సంవత్సరముల శ్రమలో ప్రవేశింతురు. శ్రమలలో మారు మనస్సు పొంది రక్షింపబడినారు గనుక వీరు దాసులేగాని పెండ్లికుమార్తెకు ఇప్పుడు ఉన్న వారికి తేడా ఉన్నది.

దాసులు సేవించుట: భూలోకములో ఆయన సేవ ఉన్నది. పరలోకములో సేవ అనగా పాడుట, ఆరాధించుట, ముఖదర్శనముచేయుట యివన్నియు ఆయన సేవయే. భూలోక పనులకును, పరలోక పనులకును తేడాయున్నది. ప్రభువును స్తుతించుట ఆయనను పూజించుట ఆయనతో సహవాసము కలిగియుండుట ఇవన్నియు ఉండును. వెయ్యేండ్ల పరిపాలనలో ఆరాధన చేసినను వీనికిని పరలోకములోని ఆరాధనకు తేడా ఉండును. అలాగే భూలోకములో పెండ్లికుమార్తె పరిచర్య సేవ చేయునప్పుడు దాసురాలవలెను పరలోకములో పెండ్లికుమార్తెగాను ఉండును.

ప్రక:22:4 ఆయన నామము వారి నొసళ్ళయందు ఉండును. వేల్పూరు అను గ్రామములో ఒక కాలువ యున్నది. అందులో ఇక దోనె యున్నది. ఒక క్రైస్తవుడు ఆ దోనె ఎక్కినాడు మీరు ఎవరని కొందరు హిందువులు ఆ క్రైస్తవునిని అడుగగా మేము రెడ్లము అని జవాబిచ్చినారు. అప్పుడు యే ఆక్షేపణ లేకుండా ప్రయాణము చేయనిచ్చినారు. బాప్తిస్మమప్పుడు బోధకుడు నొసటిమీద సిలువ గుర్తువేసి ఇకమీదట సిలువ చేయబడిన రక్షకును స్వాధీనములోనికి హక్కుగా వచ్చుచున్నావు అని తెలియజేయును. అలాగే పరలోకములో నొసళ్ళపై ఆయన నామము బాహటముగా గుర్తువేయుచున్నారు. ఇకమీదట నీవు రక్షకుని యొక్క హక్కుగాను నీకు రక్షకుడు హక్కుగాను ఉన్నారని బహిరంగ పరచుకొనుటయే నొసళ్ళపై ఆయన నామము ఆ దోనెలోని క్రైస్తవునికి నొసటిమీద ఏ నామము లేనందున దోనేలొనున్న అన్యులైన వారియెదుట బొంకినాడు. ప్రభువు లోకానికి వచ్చి తన ప్రజలను జయించి తీసికొని వెళ్ళిన దానికి గుర్తు ఆయన నామము. గ్యాసులైట్ మనయొద్ద ఉన్నంతసేపు వెలుగు ఉండును. క్రీస్తుప్రభువు శాశ్వతముగా మనలో ఉండునని మనము శాశ్వతముగా ఆయనలో ఉందుము అని రుజువునకే ఆయన నామము మన నొసళ్ళయందు ఉండును.

ప్రక:22:5. రాత్రి ఇక ఎన్నడును ఉండదు దీపకాంతియైనను, సూర్యకాంతియైనను వారికి అక్కరలేదు. ప్రభువే వారి మీద ప్రకాశించును. యుగయుగములు రాజ్యము చేయుదురు.

ఆది కాండము మొదటి అధ్యాయములో దేవుడు వెలుగు కలుగజేసెను. వెలుగు కలుగును గాక అని దేవుడు పలుకగా వెలుగు కలిగెను. ఈ వచనములో దేవుడు వెలుగు కమ్మని అనలేదు ఆయనే వెలుగైయుండెను: ఆదికాండములోని వెలుగుకంటే ప్రకటనలోని వెలుగు గొప్పది. పెండ్లికుమార్తె మీద, రక్షితులమీద, భూలోక మోక్షములోని వారిమీద ఆయన ప్రకాశించును. రాజుగారు దూరదేశము వెళ్ళి రాజ్యము సంపాదించునట్లుగా ప్రభువు రాజ్యమును సంపాదించెను. ఆ సంపాదించిన రాజ్యమును ప్రభువు యేలును. కొండ ప్రసంగములో ప్రభువు పరలోక రాజ్యముగూర్చి రెండుమార్లు చెప్పెను. ధీన మనస్సుగలవారు ధన్యులు పరలోక రాజ్యము వారిదనెను. దీనమనస్సు గల వారికి పరలోక రాజ్యముండును.

నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు పరలోక రాజ్యము వారిదనెను. రక్షితులు అంతా ఒక తరగతి. వీరు పెండ్లికుమార్తె మహిమలో సమానులు కారు. రక్షితులు పరదైసులో ఉందురు. పెండ్లికుమార్తె మహిమకు వీరి మహిమకు తడా ఉండును. భూమిమీద రక్షితుల మహిమ వేరు. పెండ్లికుమార్తె యొక్క మహిమ వేరు. ఈ మూడు తరగతులకు చెందినవారు పెండ్లికుమార్తె పరలోక రాజ్యములో ఉందురు గాని పెండ్లికుమార్తె మహిమలోను, రాజ్యములోను వేరుగా ఉండును. పైముగ్గురుమీద పెండ్లికుమార్తె యేలుబడి చేయును. భూలోకపు పెండ్లికుమార్తె తలవంచుకొనునుగాని పరలోకపు పెండ్లికుమార్తె యేలుబడి చేయును.

ఉదా:- బి. ఏ. క్లాసువారు మూడవ తరగతికంటే ఎక్కువవారు. పాపమువారు మూడవ తరగతిలోని ఉన్నారని అనుటయే ఏలుట. వీరు తక్కువలో ఉండుటయే వారి యేలుబడియై యున్నది. పెండ్లికుమార్తె వరుసలోనివారు రక్షితులను చూసి పాపము ప్రభువు మీకు సదుపాయములు చూపిన పెండ్లికుమార్తె మెట్టుకు మిరు సిద్ధపడలేక పోతిరే అని అనుకొనుటయే యేలుబడి.

  • 1) పెండ్లికుమార్తె ఇక్కడి పెండ్లికుమార్తె వంటిది కాదు.
  • 2) యేలుబడి ఇక్కడి యేలుబడి వంటిది కాదు.
  • 3) రాజ్యము ఇక్కడి రాజ్యము వంటిది కాదు.
  • 4) ఎక్కువ తక్కువలు ఇక్కడి ఎక్కువ తక్కువలు వంటిది కాదు.
  • 5) పెండ్లికుమారుడు ఇక్కడివంటి పెండ్లికుమారుడు కాడు.
  • 6) లోకువ ఇక్కడివంటి లోకువకాదు.

సమయము సమీపించినది

ప్రక. 22:6. మరియుదూత యిలాగు చెప్పెను. ఈ మాటలు నమ్మకములును సత్యములునై ఉన్నవి. ప్రవక్తల ఆత్మలకు దేవుడగు ప్రభువు త్వరలో సంభవింపవలసిన వాటిని తన దాసునికి చూపుటకై తన దూతను పంపెను.

  • 1) దూత
  • 2) ప్రవక్తలు
  • 3) దేవుడు
  • 4) దాసులు
దూతలు చాలామంది ఉన్నారు. ఈ వాక్యములో దూత అని ఉన్నది. దేవుని యొద్ద అనేకమంది దూతలు ఉన్నను ఒక్కొక్క పనికి ఒక్కొక్క దూత నియమింపబడును. దూతద్వారా గొప్పపని చేయుటకు దేవుడు పంపెను. కొన్ని పనులకు దూతల గుంపును పంపును. ఒక్కరిని ఒక పనికొరకు యెప్పుడు పంపునో అప్పుడు ఒక్కపని చేయించును.

ఉదా:- గవర్నమెంటువారు ఒక పనీ పదిమంది చేత చేయించెదరు. మరొక పనిని ఒకరిచేత చేయించుదురు. ఒక్కరిచె చేయించే పని గొప్పది. అలాగుననే ఇతర దూతల చేత చేయించుటకు వీలులేని పనిని ఒకరిచేత చేయింతురు.

ప్రకటనలో ఉన్న ఈ సినిమా మనకు చూపింపబడుచున్నది. యోహానుకు చూపించుటకై ఒక్క దూతే వచ్చెను. ఇంత గొప్పపని చేసేవారు గొప్పవారు. దేవదూతే ఈ గొప్పపని చేసెను. నమ్మకములైనవి. సత్యములైన పని ఈ మాటలు దేవదూత చెప్పెను. దేవుడు తన దూతను పంపెను. త్వరలో సంభవింపబోయే సంగతులను తన దాసులకు చూపుటకై పంపెను.

ప్రవక్తలు:- అబ్రహామునుండి మలాఖి వరకు మలాఖినుండి యెహాను వరకున్న ప్రవక్తల ఆత్మలకు దేవుడు తన దూతను పంపి దాసులకు బయలు పర్చెను. రాబోయే సంగతులు దేవుడు వారికి బయలుపర్చగా ప్రవక్తలు ప్రవచించేవారు.

  • 1) రాబోయే సంగతులు దేవుడు వారికి చెప్పెను.
  • 2) మనుష్యులు సంగతులు విన్నారు
  • 3) ప్రవచించినారు గనుక ప్రవక్తలైనారు.

  • 1) చెప్పిన వాడు దేవుడు
  • 2) విన్నవారు భక్తులు
  • 3) ప్రవచించినవారు ప్రవక్తలు.
దేవుడు యెవరికి చూపించునో వారు దాసులు. ఇక్కడ ప్రవక్తలున్నారు. ప్రకటన గ్రంధ ఆరంభములో, చివరిలో దాసులున్నారు.

ఇక్కడ నుండి రేప్చర్ వచ్చేవరకు జరుగబోయేది దాసులకు చూపించును. అనగా ప్రకటన వ్రాయబడినది మొదలు రేప్చర్ వరకున్న సంగతులు తన దాసులకు దేవుడు చూపించును. యోహాను ఈ ప్రకటన గ్రంధములో 22అధ్యాయములవరకు క్రీస్తు జన్మిచిన మొదటి శతాబ్ధమునుండి మన కాలము వరకు మన కాలమునుండి రేప్చర్ వరకు యేమి జరుగనైయున్నదో అవియు ఏడు సంవత్సరముల శ్రమ కాలములోను, వెయ్యేండ్ల పరిపాలన కాలములోను, అనంత కాలములోను యేమి జరగనైయున్నదో అవి తన దాసులకు చూపించవలె ననునదియే. వినేవారు ప్రవక్తలును చూచే వారు ప్రవక్తలునై యున్నారు. ప్రకటన గ్రంధము మొదటి అధ్యాయమునుండి చివరి అధ్యాయము వరకు దాసులైన వారు ఉన్నారు. మనకు చూపింపబడనైయున్నవి గనుక మనము కూడా దాసులమే. యోహానునకు దూత చూపించెను. తన దాసులకు చూపిమవలసిన భావి సంగతులు యోహానునకు చూపింపబడెను.

ప్రకటన 1:1లో కనబర్చుట అలాగే 22:6లో చూపుట అని వ్రాయబడియున్నది ఈ రెండును ఒక్కటే. దాసులలో మొదటివాడు యోహాను తరువాత వారికి రేప్చర్ వరకు వచ్చినవారికి దాసులని పేరు. అనగా ప్రకటనలో ఉన్న సంగతులు యెవరికి చూపించబడునో ఆ దాసుడును మనము వినుతవల్ల ఆఖరు దాసులమని దీని అర్ధము. రేప్చర్ వరకు ప్రకటన గ్రంధ అర్ధము వినువారు అందరు దాసులే. యోహాను జరుగకముందే వీటన్నిటిని చూచెను. వారు జరుగకముందు చూచిరి. మనము జరుగునప్పుడు చూచున్నాము. ఇదే ప్రవక్తలకు, యోహానుకు, మనకు ఉన్న తేడా. జరిగినది యేదైన చెప్పిన వృత్తాంతమని అందురు. జరగబోవునది యేదైన చెప్పిన దానిని ప్రవచనమందురు. ప్రవచనము చెప్పువారే దాసులు.

  • 1) సర్వ రాష్ట్రములకు సువార్త చెప్పుట
  • 2) బీదలను ఆదరించుట
  • 3) రోగులకు పరిచర్య చేయుట.
ఇట్టి పరిచర్య చేయుటకే దాసులు. జరిగినది చెప్పుటయే సాక్ష్యము. భూకంపములను గూర్చియు ఆయా గుర్తుల నెరవేర్పు జరుగుట చూచి చెప్పువారు దాసులు.

ఇంగ్లీషులో దాసులకు బానిసలని పేరున్నది. దాసులనగా పనివారు. బానిసలనగా జీతనాతములు లేకుండా రోజంతా పనిచేస్తే సాయంత్రము గంజి పోస్తే పోస్తరు లేకపోతే లేదు. వీరే బానిసలు. అధికారి అప్పగించు పని చేయువారు దాసులు, రక్షణ ఉచితముగా పొందునట్లు జీతనాతములు లేక యజమానులకు యెవరు సేవచేయుదురో వారే బానిసలు. అలాగే దాసులనగా ఉచితముగా పరిచర్య చేయువారు.

సంభవింపబోయే సంగతులు అనగా ఈ యేడు సంఘములలో జరుగబోయే సంగతులు చూపించేటందుకు దేవుడే యోహానును యేర్పరచెను. ఈ సంగతులన్నియు ఆయా భక్తులైన వారు ఆయా శతాబ్ధములలో జరిగిన ఆయా సంగతులను రికార్డుచేసి యుంచినారు గనుక అ రికార్డు అంతయూచూచి యోహాను చెప్పెను.

ప్రక. 22:7 ఈ గ్రంధములోని ప్రవచన వాక్యములను గైకొనువాడు ధన్యుడు.

ప్రార్ధన:- లోకైక రక్షకుడైన యేసు ప్రభువా! కడవరి మందలింపు, కడవరి వర్తమానము, కడవరి ప్రార్ధన, కడవరి అధ్యాయములో నేర్చుకొనునట్లు నమ్మకమైనవియు, సత్యమైనవియు నేర్చుకొనునట్లు నీకృప దయచేయుము. దూతలను కావలియుంచి, దయ్యములను తరిమివేయుము. కాపుదల దయచేయుము. చదువుచున్నకొలది మమ్మును వధువు సంఘములోనికి సిద్ధపడునట్లు సహాయము చేయుమని వేడుకొనుచున్నాము. ||ఆమెన్||

ప్రవక్తల యొక్క దాసుల యొక్క దేవుడై యున్నాడు. క్రొత్త నిబంధన కాలముయొక్క వర్తమానములు ప్రజలకు తెలియపర్చువారందరు ఆయన దాసులు.

ప్రకటన ప్రారంభంలో దేవుడు, దేవదూతలు, దాసులు, కనబర్చుట అని ఉన్నది. ప్రకటన చివరి అధ్యాయములో దేవుడు, దేవదూతలు దాసులు బయలుపర్చుట ప్రవక్తలు ఉన్నారు.

యెషయా నుండి మలాఖి వరకు ప్రవక్తలున్నారు. వీరికి బయలు పర్చినది వారు వ్రాసివెళ్ళిరి. ఇప్పుడు మనము అందరము చదువుచున్నాము. ఈ సంగతులు దూత మరల తెలియజేయరు. ప్రవచన వాక్యముయొక్క భావము ప్రవక్తల గ్రంధములకు సంబంధములేదు. ఈ ప్రకటన గ్రంధము ప్రవచన గ్రంధమని అర్ధము. ఇది బయలు పర్చుట కాదు గాని ప్రకటించుటకు ఆ దేవుడే ఈ దేవుడని తెలియజేయుటకు దూత దిగివచ్చెను.

భూకంపములు, యుద్ధములు, కరువులు, గందరగోళములు ఇవన్నియు జరుగునవి ప్రకటన గ్రంధము వ్రాయబడక మునుపే ప్రభువు చెప్పిరి. అలాగే పాత నిబంధన ప్రవక్తలు కూడ ప్రవచించిరి. పద్మసు లంకలోనున్న యోహానును ఈపై నాలుగు జరుగునని చెప్పెను. శతాబ్దము అనగా 100 సం||లు మొదటి సగములో యేసు ప్రభువు ఉన్నారు, రెండవ సగములో యోహాను ఉన్నారు. శతాబ్ద ఆరంభమునకు ప్రభువు ముగింపునకు యోహాను ఉన్నరు మొదటి శతాబ్దము అయిపోయినది. ఇప్పటి 20 శతాబ్దములు అయినవి.

ప్రకటనలో మొదటి శతాబ్దము యొక్క చివరి భాగము మొదలుకొని రేప్చర్ వరకు జరుగు సంగతులు తెలియపర్చుటకు దేవుడు తన దూతను పంపెను. సంఘ చరిత్ర ప్రకటన మొదటి భాగములో ఉన్నది. ఈ సంఘ చరిత్ర 20 శతాబ్దముల చరిత్ర. ఈలాగు మన కాలము వరకును రేప్చర్ వరకును సంఘ చరిత్ర ఎట్లుండెనో ప్రకటనలో వ్రాయబడి యున్నది. సంఘచరిత్ర పెంతుకోస్తు పండుగ దినమందు ప్రారంభమాయెను. క్రైస్తవ సంఘ స్థాపన ఆదినమందే జరిగెను. ఈ సంఘము ఏడు సభలు గలది. మొదటి శతాబ్దములోని క్రీస్తు మతము వారిలోని గుణము ఎఫెసు సంఘ చరిత్రకు సరిపోవును. మొదటి సంఘము ఎఫెసు. చివరి సంఘము "లవొదికయ" ఈ యేడు సభలు 20 శతాబ్దములలో యేడు రకములుగా వుండునని చెప్పుటకు ప్రభువు యేడు సభలను ఎన్నుకొనెను. చివరి సంఘము "లవొదికయ". ఈ సంఘము తరువాత ఇక సంఘములు ఉండవు. ప్రస్తుత మన గుణము "లవొదికయ" సంఘ గుణమే. సంఘములలో విబేధములు వున్నవి. మా సభ యెక్కువ మాది యెక్కువ అని వివాదములు వున్నవి. ఆ కాలమందు ఎలాగు వున్నవో ఈకాలమందు కూడ అలాగే వున్నవి.

ఉదా:- ఒక గుడిలో అన్ని మిషనుల వారిని ఆహావ్వనించి వేరువేరు బెంచీల మీద 850 బెంచీలమీద కూర్చుండబెట్టిరి. చిన్న బెంచీలు 2000 వున్నవి. అవి యెందులోను చేరనివి. కొందరు సంఘములలో బేధములు ఉన్నవని చేరుటయే మానివేసిరి. ఈ బెంచీలమీద వున్న వారందరు మాది యెక్కువ. మాది యెక్కువ అని వారివారి సిద్ధాంతములు యెత్తి తర్కించుకొనుచున్నారు. తల్లి మిషను రోమను క్యాథొలిక్ వారు. తప్పులు దిద్దినామని లూథరన్ మిషను వారు వచ్చిరి. ఆత్మను పొందినామని పెంతెకోస్తు మిషన్ వారు వచ్చిరి. ముంచడము అనే బాప్తిస్మముబాప్తిస్మము తీసికొన్నామవి బాప్తిస్టువారును అనుచున్నారు. అందరు అన్ని బెంచీలపై కూర్చుండి యున్నారు ప్రభువు ఏ బెంచీలోను లేరు. ప్రభువు బలిపీఠముపై వుంటే ఆయన మాట వినేదెవరు? గనుక ప్రభువు తలుపుయొద్ద నిలుచుండి యెవడైనన్ నా స్వరము విని తలుపు తీసిన యెడల అని పలికెను. (ప్రక:3:20) అనగా మిషనుకు కొందరు ప్రభు స్వరము విని ఆయన భక్తిలో వుండేవారు వుందురు. ఇప్పుడు 850 మిషన్లు ఉన్నవి. ఈ గందరగోళములలో మిషనులలో యెవరికైన బంధువులు వున్న వెలుపల వారి స్వజనులు వుండి బైటకు రమ్మని పిలువగా వారు రాగ ఎందుకు ఈ గందరగోళములలో వుందువు అని పిలుచుకొని వెళ్ళిపోయినట్లే, ప్రభువు రాకడలో వచ్చి యేడు సంవత్సరముల శ్రమలు తరువాత వెయ్యేండ్ల పరిపాలన జరగనైయున్నది. ఆ పాలనలో ఏ గందరగోళములు వుండవు రా అని ఏర్పాటు ప్రజలను గందరగోళములలోనుండి ప్రత్యేకించుకొని రేప్చర్ లో తీసుకొని పోవును.

ఉదా:- ఒక తండ్రి తన కుమార్తెను మూడు సంవత్సరముల క్రితము ఒక ఊరిలో ఇచ్చెను. ఆ ఊరిలో చాలా గందరగోళము జరిగెను. పార్టీలుగా నుండి ఒకరి ఇంటిమీద ఒకరుపడి కొట్టుకొనుచున్నారు. అప్పుడు ఆ తండ్రి వచ్చి తన కుమార్తెను, అలుడిని బిడ్డలు ఇద్దరిని గందరగోళమునుండి తీసికొని వెళ్ళిపోయెను. అలాగే రేచ్ర్ లో కూడ ప్రభువు చేయును.

  • 1) ప్రభువుయొక్క కన్ను మిషనులమీద లేదు.
  • 2) ప్రభువుయొక కన్ను అన్యులపై లేదు.
  • 3) ప్రభువుయొక్క కన్ను సంఘముమీద లేదు. గాని ప్రభువును హత్తియుండు ఒక్కొక్క వ్యక్తిమీద నుండును.

ప్రక:22 :8,9: నాకు చూపుచున్న దూత పాదము యెదుట నమస్కారము చేయుటకు సాగిల పడగ అతడు వద్దుసుమీ. నేము నీతోను నీ సహోదరులతోను సహదాసుడను.

పరలోకమందు కలిగిన అంతష్తులు వేరువేరు.

  • 1) భూలోక మోక్షము, ఇది తక్కువ స్థితి
  • 2) పరదైసు కొంచెము యెక్కువ స్థితి
  • 3) రక్షితుల మోక్షము ఇది కొంచెము ఎక్కువ స్థితి
  • 4) పెండ్లికుమార్తె వరుస.
ఇది ఇంకా యెక్కువ స్థితి. యోహాను మొదటి అధ్యాయములో తక్కువ స్థితిలో నేలపై పడి ప్రార్ధించెను. 22వ అధ్యాయములో దూత పాదముల యెదుట నమస్కరించెను. ఈ అధ్యాయములో ఉన్న తక్కువస్థితి
  • 1) పాదముల యెదుట
  • 2) నమస్కారము చేయుట
  • 3) సాగిలపడుట యోహాను మనస్సు ఈ మూడింటిలో కనబడుచున్నవి.
అప్పుడు దూత వదూసుమీ నేను మీతో సమానుడను. ప్రవక్తలైన సహోదరులతోను ఈ ప్రవచన వాక్యములలో ఉండే ప్రవచనములు గైకొనువారితోను సహదాసుడనని అనుకొనుచున్నాడు. ప్రవక్తలైన నీ సహోదరులని అనెను. మొదటి ప్రవక్త అబ్రహాము, పిదప యెషయా, మలాఖి, యోహానులు వీరందరితోను సహదాసుడను అనెను. ప్రవచనములు అనగా రాబోవు సంగతులు చెప్పుట. వాక్యమనగా గ్రంధములోని వాక్యము: గైకొనుట అనగా ఆ ప్రకారముగా సిద్ధపడుట. వాక్యము నమ్ముట ఆ ప్రకారము నడచుట. అలాగే ప్రవచనములులోని మొదటి ప్రవచనము ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. ప్రవచనము నెరవేరుచున్నట్లు చూచి నమ్ముట సుళువుగాని ప్రకటనలోని సంగతులు ఇంకా జరుగుట లేదు. ఈ ప్రకటన నమ్మువారే ధన్యులు. పెండ్లికుమార్తె అంతస్థు కోరుకొను వారెవరో వారు దేవ దూత చెప్పినట్లు వినయము కోరుకొనవలెను. వీరే పెండ్లికుమార్తె వరుసలోనికి వెళ్ళుదురు. మనిషి వినయము కాదుగాని దేవదూతలకు గల వినయముగలవారే పైలోకములో దూతలువలె నుందురు. దూత వినయముగా దాసుడనని చెప్పుకొనెము. నమస్కారము వద్దనెను. పై అంతస్థులోనుండు దేవదూతకే అంత వినయము వున్న మనకెంత వినయము వుందవలెను? యెహోషువాకు దూత కనబడగా నమస్కారము చేసెను. ఆ దూత వద్దనలేదు గనక ఆయన ప్రభువు (యెహూ 5:14) గాని ప్రకటనలో దూత గనుక నమస్కారము వద్దనెను. ఎవరు స్నానికుడైన యోహాను వలెను, దూతవలెను, శిష్యుడైన యోహాను వలెను తగ్గించుకొందురో అట్టి వారే పెండ్లికుమార్తె వరుసకు హెచ్చింపబడుద్రు. పెండ్లికుమార్తె అను మాట బైబిలు గ్రంధమంతటిలో ఒక్కమారే వ్రాయబడి యున్నది. గనుక ఇది విలువైనది. ప్రకటన: 21:9).

దూత ముడు గొప్ప సంగతులను తెలియజేసెను. నేను నీతో సహదాసుడను. నాకు నమస్కారము వద్దు దేవునికే నమస్కారము చేయుము.

స్నానికుడైన యోహానుకూడ ఇట్టివాడే. నీవు ప్రవకవా లేక ఆ ప్రవక్తవా (ద్వితీ 18అ|| ) నీవు క్రీస్తువువా అని అడిగినప్పుడు అవును అని అనలేదు. నేను అరణ్యములో కేకవేయు ఒకని శబ్దము అని శాస్త్రులతోను పరిసయ్యులతోను అనెను. మంచి సమరియుడు చరిత్రలో గార్ధభముపై నుండి దొంగవలన కొట్టబడిన యాత్రకుని సమరియుడు తన గాడిదపై యెక్కించుకొనెను. యేసుప్రభువు పాపిని రక్షించుటకు పరలోకమునుండి దిగివచ్చెను. యోహాను, దూత, మంచి సమరియుడు, ప్రభువు ఈ నలుగురు వినయము చూపించిరి. దైవలక్షణములోనే వినయము అని లేదుగాని ప్రేమ లక్షణములు కడిగినారు. ప్రభువు జీవితములో వినయము ఉన్నది గనుక పెండ్లికుమార్తె జీవితములో వినయము ఉండవలెను. ప్రేమ లక్షణము ఉండి నందున గగనము చీల్చుకొని ప్రభువు భూమిపైకి వచ్చెనని యెషయా వ్రాసెను.

మనిషి పాపస్థితి విడిచిపెట్టి మంచి స్థితికి రావలయును. పెండ్లికుమార్తె వరుసకు రాగోరువారు యెంత పాపస్థితిని విడిచినను మంచి స్థితికి రాలేక పోయిన మోక్షము లేదు.

ఉదా:- ఒక అన్యుడు ఉనాడు. పాపము విడిచిపెట్టెను క్రీస్తుని యెరుగని వాడు లేక సజ్జనత్వములోనికి వచ్చినవాడు. అది క్రీస్తులోనికి వచ్చిన మంచి స్థితికాదు. క్రీస్తుప్రభువు యిచ్చిన మంచి స్థితిలోనికి రావలెను.

భూతాలు రాకుండ - దూతాళి ఖడ్గాలు

చేతబట్టి నిలుచు - సేవకులైయునారు ||యేసు||

దూతలు పరిశుద్ధులు, నిరాకారులు, దేవునివంటివారు. మనకును దేవునికిని సేవచేయు పరిచారకులు.

ప్రకటన గ్రంధములోనికి రాగలిగియుంటే పెండ్లికుమార్తె వరుసకు రానై యున్న మనకు యెంతో వినయము ఉండవను. మనకు ఎన్ని మంచి గుణములు ఉన్నను వినయముకూడ ఉండవలెను. పరిసయ్యులకు ఆచారనీతి ఉన్నదిగాని రక్షణ నీతిలేదు. పరిసయ్యుల నీతికంటెను, శాస్త్రుల నీతి కంటెను మీ నీతి ఎక్కువ కాపోతే మోక్షములేదని ప్రభువు చెప్పెను. అన్ని గుణాలు ఉండిన వినయము లేకపోయిన వట్టిదే, కాబట్టి, పెండ్లికుమార్తె వరుసలోనికి వచ్చువారికి మహ గొప్ప వినయము ఉండవలెను.

ఉదా:- స్కూలులో పంతులుగారు ఉన్నారు. మంచివారు ఒకరు. ఒక దినము ఆలస్యముగా భయముతో వస్తూవున్నారు. స్కూలు మేనేజరు బడిలోనికి ఆ దారినే వచ్చుచున్నారు. అయ్యా దొరగారు వెళ్ళిపోయినారా అని అడుగగా వెళ్ళిపోయినారు. అనెను. అందుకు వారు అయ్యా నమస్కారమనెను. నాకెందుకు నమస్కరమని మేనేజరుగారు అడుగగ శుభవార్త చెప్పినందుకు అని అనెను. అలాగే ఇంత పాపాత్ముడును ముసలివాడను ఇన్ని సంగతులు పరలోకమునుండి తెచ్చి నాకు చెప్పినావు అని యోహాను దూతకు నమస్కారము చేసెను.

దేవదూతలలో ఉన్న గొప్పతనము యోహానుకు కనబడెను. అందుకే దేవునికి చేయవలసిన నమస్కారము దూతకు చేయగలిగినాడు. గొప్పతనము కనబడినందున దూతకు నమస్కరించెను. భక్తులైనను సరే వినయము లేకపోయిన పెండ్లికుమార్తె వరుసలోనికి రాలేరు.

ప్రక: 22:10,11. ఈ గ్రంధము నందున్న ప్రవచన వాక్యములకు ముద్ర వేయవలదు. అన్యాయము చేయువాడు అన్యాయము చేయనిమ్ము. అపవిత్రమైనవాడు, అపవిత్రుడుగానే యుండనిమ్ము. నీతి మంతుడు, నీతిమంతుడుగానే యుండనిమ్ము. పరిశుద్ధుడు, పరిశుద్ధుడుగానే యుండనిమ్ము.

ప్రకటన గ్రంధమునకు ముద్ర వేయకూడదు. చివరి దినములలో ఈ గుణములు కలవారు మార్పు లేక యుందురు. పరిశుద్ధులు, నీతి మంతులు: దేవుని వాక్యము గూఢముగానున్న మర్మముగా ఉన్న అది దేవుని వాక్యమే అని అందురు.

  • 1) అన్యాయస్థులు
  • 2) అపవిత్రులు
  • 3) నీతిమంతులు
  • 4) పరిశుద్ధులు.

ఆదికాండమునుండి ఈ తరగతులకు చెందినవారు వచ్చుచునేయున్నారు. అన్యాయస్థులు , అపవిత్రులు, దేవుని వాక్యము తెలియక మర్మముగా నున్న గూఢముగా నున్న అది దేవుని వాక్యము కాదని అందురు. నీతిమంతులు యెన్ని శోధనలు కష్టములు వచ్చిన నీతిమంతులుగానే యున్నారు. పరిశుద్ధులు ఎల్లప్పుడును పరిశుద్ధులుగానే యుందురు. దేవుని వాక్యమువిని నమ్మిన వారిమీద సాక్ష్యార్ధముగా మీ కాలిలోని ధూళిదులిపివేయుమని ప్రభువు చెప్పి యున్నారు. పరిశుద్ధులు, నీతిమములు ప్రసవించుదురు. మరలా చెప్పుదురు.

అన్యాయము:- దేవుడు యెంతగానో తన వాక్యము అచ్చువేయించి చేతికి యివ్వగా శ్రమలు రాగానే దేవుడు అన్యాయస్థుడందురు. ఇటివారే అన్యాయము చేయువారు.

అపవిత్రులు:- మేము యెంత పాపము చేస్తే మాత్రము, దేవుడు ప్రేమ గలవాడైన మమ్మును రక్షింపకూడదా అని అందురు. ఇట్టివారు అపవిత్రులు.

నీతిపరులు:- దేవుడు అన్యాయస్థుడు కాడు అనువారు నీతిపరుడు.

పరిశుద్ధులు:- యెన్ని పాపములు చేసిన ప్రభవా మమ్మును క్షమించు, రక్షించు మనువారు పరిశుద్ధులు. పెండ్లికుమార్తె వరుసలోనికి రావలెయునని కోరువారికి ప్రకటన గ్రంధమన్న యిష్టము.

రేప్చర్ లో వెళ్ళనివారు అవినీతిపరులుగా నేయుందురుగాని రేప్చలోనికి రారు. రేప్చర్ కు ముందు, వెనుక కూడ అవినీతిపరులు ఉందురు. మోషేకు దేవుడు పది ఆజ్ఞలు యిచ్చెను. దానిప్రకారము చేసినవారు భక్తులగుదురు. రేప్చర్ కు ముందు సిద్ధపడి ఆఖరిలో పడిపోయిన రేప్చర్ లోనికి రాలేరు.

యేసు సాక్ష్యము

ప్రక:22:12. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను.

ప్రకటన గ్రంధములోనున్న సంఘములు ఏడు. చివరి సంఘము చివరి భాగములో మనము ఉన్నాము. ఇక సంఘము లేదు. ప్రభువు వచ్చిన యెడల లవొదికయ సంఘ కాలములోనే రావలయును. ప్రభువు దృష్టికి వెయ్యి సంవత్సరములు ఒక దినము. భక్తునియొక్క ఆత్మదృష్టికి వెయ్యి సంవత్సరములు ఒక్క దినము. త్వరగా అనుటలో ఉన్నారు. వరుడు, వధువు ఒకటే గనుక త్వరగా అనుట నిజమనుచున్నది. అపవాది, నరుడు ఆటంక పర్చువారైయున్నారు. ఈ అడ్డులను హరించువాడు అనగా తీసివేయువాడైయున్నాడు.

ప్రకటన 22:20 వ వచనములోకూడ త్వరగా వచ్చుచున్నాడని వ్రాయబడి ఉన్నది. మొదటి అధ్యాయములో కూడ త్వరగా వచ్చుచున్నానని వ్రాయబడి ఉన్నది.

ప్రక: 22:14. జీవ వృక్షములకు హక్కుగలవారై గుమ్మముల గుండ ఆ పట్టణములోనికి ప్రవేశించునట్లు తమవస్త్రములను ఉతుకుకొనువారు ధన్యులు.

హక్కులేనివి రెండు కలవు-

  • 1) జీవ వృక్షములో పాలులేవు
  • 2) పరిశుద్ధ పట్టణములో పాలులేవు.
ఇక్కడ ఇవి వ్రాయబడుటకు కారణము జీవ వృక్షఫలము తినుటయు పరిశుద్ధ పట్టణములో ఉండుటయు రెండునూ సమానమే. అనగా యేది సమానముగా వ్ర్రసిన అది సమానమే. ఎఫెసు సంఘమునకు దేవుడు ఇచ్చిన బహుమానము జయించువానికి జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును. (ప్రక. 2:7).

ప్రక:22:16. నేను దావీదు వేరు, చిగురును, సంతానమును ప్రకాశమానమైన వేకువచుక్కయునైయున్నాను.

ఈ వచనములో వేరు, చిగురు, సంతానమునై యున్నానని ప్రభువు చెప్పెను. పూర్వీకులు దావీదు వేరు చిగురు, సంతానమునైయున్నారని వాగ్ధాన మిచ్చెను. అందుకొరకు అనేకులు కనిపెట్టిరి. ఈ మాటలు తట్టు ప్రభువు ప్రజల హృదయమును త్రిప్పెను.

  • 1) రాబోయే వేరు
  • 2) దావీదు చిగురు
ఇక వచ్చును ఈ మూడు వాగ్ధానములు యివి పాత నిబంధన కాలములోని వాగ్ధానములు. వాగ్ధానములునే కాక ప్రవచనము కూడనైయున్నవి. ఈ ముడును నెరవేరినది క్రొత్త నిబంధనలో. ఈమూడింటినిబట్టి మోక్షము అని మనము చదువుకొనుచున్నాము గనుక మనకు యిది ఆఖరు వాగ్ధానము, ఆఖరు ప్రవచనము. యెప్పుడైన ప్రవచనము వాగ్ధానమైయుండును. వాగ్ధానము ప్రవచనమువలె నుండును. యేలాగు అనగా "నీకు కుమారుని ఇచ్చెదను" ఇది వాగ్ధానము, ఇది ప్రవచనము, రూపమునకు లోపల ప్రవచనము తరువాత వాగ్ధానము. అబ్రహాము ఈ వాగ్ధానమును నమ్మెను గనుక ప్రవచనమైనది. ప్రవచనము నమ్మిన వాగ్ధానము నెరవేరెను.

యెషయా గ్రంధములో "మన కొరకు శిశువు పుట్టెనని వ్రాయబడియున్నది ఇది ప్రవచనము. నెరవేర్పు వాగ్ధానము.

ప్రక: 22:17, ఆత్మయు, పెండ్లికుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు.

ఇది పెండ్లికుమార్తె యొక్క ఆహ్వానము. ఇది ఆఖరు ఆహ్వానము . ఇచ్చయించువారు అనగా యిష్టమున్నవారు. యేదేను తోటలో నిరభ్యంతరముగా తినవచ్చునని ఫలములను గూర్చి దేవుడు సెలవిచ్చెను. ఇది కూడ అదే.

ప్రక:2218. యెవడైనను వీటితో మరి యేదైన కలిపిన యెడల ఈ గ్రంధములోని తెగుళ్ళు వానికి కలుగును. యెవడైనను యేదైనను తీసివేసిన యెడల ఈ గ్రంధములో వ్రాయబడిన జీవవృక్షములలో పరిశుద్ధ పట్టణములోను వానికి పాలు లేకుండా చేయును.

బైబిలు గ్రంధములోని 66 పుస్తకములలో చివరి పుస్తకము చివరి అధ్యాయములో చాలా కఠినమైన మాటలు ఉన్నవి. చివరి కాలములో ఉన్న నరులు ఈ గ్రంధమును బాగుగా చదువవలెను. ఈ గ్రంధములో యేమియు కలువకూడదు. కలిపిన ఈ గ్రంధములో ఉన్న తెగుళ్ళు వచ్చును యెవరును యేమియు తీసివేయకూడదు. తీసివేసిన జీవగ్రంధమునుండి వాని పేరు తీసివేయబడును గనుక యిది అతికష్టమైనది ఒకవేళ తెగులు వస్తే వైద్యుడు తీసివేయగలడు గామి పరల్లోక జీవగ్రంధములో నుండి పేరు తీసివేసిన దీనికి యెవరు యేమి చేయలేరు. రెండు భయములున్నవి -

  • 1) చేర్చి వేసిన భయము
  • 2) తీసివేసిన భయము.
చేర్చిన తీసివేసిన చిక్కు ఉన్నది. గనుక నేను చదువను అనువారు ఈ పుస్తకములోనిది తీసివేయలేదుగాని ప్రకటన అక్కర లేదని మొత్తము తీసివేసినారు. అట్టివారు మరీ నేరస్థులు.

తీసివేయుట అనేవి రెండు -

  • 1) వాక్యములో యేదైన తీసివేయుట 2) వాక్యములో ఉన్నవి చదవకుండ ఉండుట మొత్తము తీసివేయుట అగును.
ఈ రెండు తరగతులలో మనము చేరకూడదు. చదివి నేర్చుకొనే జాబితాలో మనము ఉండవలెను. ఇకమీదటనుండి ప్రకటన గ్రంధమంతయు చదివెను. అని తీర్మానము చేసికొనవలయును. బైబిలులో ఉన్నది గనుక తెలిసిన తెలియకపోయిన చదువవలెను. బైబిలులో పాలు లేకుండా చేయునని ఉండగా హక్కులేకుండ చేయునని అర్ధము.

క్వెకరు మిషన్ వారు: వీరు పురాతన మిషనువారు బైబిలు చదవండి గాని వివరించవద్దు అని అందురు. ఉన్నది ఉన్నట్లు చదువమని అందురు. ప్రక. 22:18. ని బట్టి యేమైన చేర్చిన తీసివేసిన తెగుళ్ళు వచ్చుననియు హక్కులేదనియు ఉన్నది. గనుక ఈరీతిగా వారు చెప్పుదురు. వీరు యెలప్పుడు ప్రార్ధనలో ఉందురు భక్తిగలవారేగాని వీరి సిద్ధాంతము ఇది. వీరియొద్దకు ఒక భక్తుడు వెళ్ళి మోషేయు, సమస్త ప్రవక్తలును మొదలుకొని లేఖనము అన్నింటిలో తన్ను గూర్చిన వచనముల భవము వారికి తెలిపెను. (లూకా 24:27) అను ఈ వచనము యొక్క భావమును వారికి వివరించెను. (లూకా24:27) అను ఈ వచనము యొక్క భావమును వారికి వివరించెను. ఆ మిషన్వారికి జ్ఞానోపదేశము చేసే నిమిత్తము వారికి వివరించెను.

  • 1) కొందరు బైబిలులోని పరమగీతము తిసివేయువలయుననుచున్నారు.
  • 2) కొందరు ప్రకటన గ్రంధము తీసివేయవలయుననుచున్నారు. దయ్యములులేవు అని అనుచున్నారు.

చదువువారు, వినువారు, గైకొనువారు ధన్యులు (ప్రక:1:3) అని వ్రాయబడియున్నది గనుక బైబిలు, ప్రకటన అద్భుతములు. మొ||లగునవన్నియు నమ్మవలెను.

ప్రక:22:20. అవును త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు ఆమెన్ ప్రభువైన యేసు రమ్ము.

పెండ్లికుమారుని ఆహ్వానము రెండు ప్రార్ధనలు, రెండు ఆహ్వానములు ఏస్తేరు గ్రంధములో రాజు, రాణికూడ విందుచేసిరి. ఏస్తేరు గ్రంధము రమ్యమైనది. వధువు సంఘముయొక్క గ్రంధము.

ప్రక. 22:21. ప్రభువైన యేసుకృప పరిశుద్ధులకు తోడైయుండును గాక ఆమెన్.

దీవెన వచనములో కుమారుని మొదట ఉచ్చరించుదురు తరువాత తండ్రి, ఆ పిమ్మట ఆత్మగాని ఈ వచనమునందు కుమారుని మాత్రమే బయలు పరచెను.

తండ్రిది ప్రేమ అన్ని మతములవారికి తండ్రి తన ప్రేమను చూపించుచున్నారు. విశ్వాసులు, అవిశ్వాసులకుకూడ తండ్రి ప్రేమ ఉన్నది.

కుమారుడు అనగా కృప. ఇది పరిశుద్ధులకుమాత్రమే. విశ్వాసులకు చెందును. పరిశుద్ధాత్మ అనగా సహవాసము.

విశ్వాసులకు రెండు విందులు ఉన్నవి -

  • 1) ప్రేమ
  • 2) కృప
ప్రభువు దగ్గరకు వచ్చినవారు కృప పొందుదురు. దేవునియొద్దకు వచ్చువారు ప్రభువును గూర్చి తెలియదు గనుక తండ్రి యొద్దకు వచ్చెదరు. ప్రభువు వచ్చినారని తెలిసి ప్రభువు దగ్గరకు వచ్చి కృపను అనుభవించుదురు. పరిశుద్ధాత్మ దగ్గరకువచ్చి సహవాసానుభవము కలిగియుందురు. దీవెన వచనములు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు దైవ అవతార పురుష్డు. అందుకే ఆయన నామము యందు యున్నది. ప్రేమైన మరియేదైన తండ్రియొద్దనుండి కుమారుని ద్వారా మనకు రావలసియున్నది. క్రీస్తు అను నామము సర్వప్రపంచముయొక్క ప్రకటనలో నున్నది.

ఈ ప్రకటన గ్రంధ వివరము మీ ఆత్మీయ జీవమునకు మేలు కలిగించి నిష్కళంకమైన పావురములుగా ఆయత్త పరచబడి మహిమ మేఘములో రానైయున్న వరుని కలిసికొను కృప మీకెల్లరకు కలుగును గాక. ||ఆమెన్||

Home