పరిచయము
పుస్తకము
- 7 ముద్రలు
- గ్రంధము లో వ్రాత
- గ్రంధము పై వ్రాత
సింహాసనము
|
|
యోగ్యుడు |
శక్తిలేదు | ||
|
పరలోకములో క్రింద భూలోకములో |
|
యోహాను బహుగా ఏడ్చెను | ||
ఒక పెద్ద: ఏడవకు | ||
|
|
జయమొందెను |
|
1. మధ్య నిలిచెను |
-
ఆయన :
- 1) వచ్చెను
- 2) తీసుకొనెను
|
|
వీణెలు, పాత్రలు = పరిశుద్దుల ప్రార్ధనలు | |
పెద్దలు = క్రొత్త పాట | |
1. ఆ గ్రంధము తీసుకొని
|
యోగ్యుడవు |
3. కొన్నావు: | |
|
దేవునికొరకు |
4. చేసితివి | |
| మా దేవునికి |
5. వారు, ఏలుదురు : భూలోకమందు |
|
స్వరము : |
|
|
అర్హుడు |
|
|
|
శ్రమల గ్రంధము
నాలుగవ అధ్యాయములోని సిం హాసనమే యీ అధ్యాయములోను కనబడుచున్నది. సిం హాసనము మీద తండ్రియైన దేవుడు, వెలుపల, లోపల, వ్రాత గలిగి ఏడుసముద్రములు వేయబడియున్న ఒక గ్రంధము కుడిచేత పట్టుకొని కూర్చొనియుండెను. ఆ గ్రంధమును శ్రమల గ్రంధమని అందురు. లేక (Tribulation throne) అని అందురు. ఇది శ్రమకాల సిం హాసనమై యున్నది. ధవళ సిం హాసనము వెయ్యేండ్ల రాజ్య సిం హాసనము, తీర్పుకాలమందు న్యాయ సిం హాసనము నిత్య సిం హాసనములు కూడ తరువాత నున్నవి. శ్రల గ్రంధము లోపలి వ్రాత మర్మము, అనగా మనము చదువ వీలులేనిది ఇది మూసి ఉన్నది. ఈ పుస్తకము వెలుపల వ్రాతలో రాబోవు శ్రమల జాబిత రాబోవు శ్రమలలో ప్రభువుకు కలుగు సంపూర్ణ జయము, లేక సైతాను, దాని దూతలు, సైన్యము యొక్క అపజయము, కలవు.
-
ఈ గ్రంధము లోపలి వ్రాతలో
- 1) ఏడు ముద్రలు,
- 2) ఏడు బూరలు,
- 3) ఏడు పాత్రల కాల శ్రమలను గూర్చి వ్రాయబడి యున్నది.
-
యేసు క్రీస్తు ప్రభువు
- 1) చిగురై,
- 2) యూదా గోత్రపుసిం హమై,
- 3) వధింపబడిన గొఱ్ఱెపిల్లయై జయించినందున ఈ గ్రంధమును విప్పుటకు యోగ్యుడు.
1. చిగురు:- (యెషయ 11 :1) (ప్రకటన 5:5) మొద్దునుండి చిగురు పుట్టును పాతనిబంధన కాలమంతయు అనగా ప్రవచన కాలమతయు మొద్దు వంటిది. క్రొత్త నిబంధన కాలము అనగా నెరవేర్పు కాలమంతయు చిగురు వంటిది. పాతనిబంధన, క్రొత్త నిబంధన మధ్య 450 సం||లు దేవుడు యూదులకు కనబడలేదు వారితో మాట్లాడలేదు. దానికే నిశబ్దకాలమందురు ఆ కాలము వారికి మొద్దుకాలము లేక నిరాశ కాలమందురు. తరువాత యేసు ప్రభువు దావీదు వంశములోను, గోత్రములోను జన్మించుట ద్వారా యూదా గోత్రమను మొద్దును చిగురింప జేసెను. రక్షకుడు వచ్చెనని ప్రతివారికి నిరీక్షణ కలిగినది. ప్రభువు జన్మము మొదలు సిలువ వరకు కాలము చిగురువంటిది. ప్రభువు సిలువ మీద చనిపోయి సమాధి చేయబడినప్పుడు మొద్దుకాలము వంటిది. పునరుత్థానుడై పరలోకమునకు ఆరౌహణమగు వరకు మహాసంతోష కాలమును, చిగురువంటిదై యున్నది. సంఘము పరలోకమునకు ఎత్తబడిన తరువాత భూలోకమునకు 7 స||ములు శ్రమకాలము మొద్దు కాలము వంటిది. వెయ్యియేండ్లు భూలోకములో ప్రభువు సిం హాసనాసీనుడై పరిపాలన చేయుకాలము చిగురు వంటిది. మన ప్రార్ధనలకు నెరవేర్పు కనబడని కాలము మొద్దుకాలము వంటిది నెరవేర్పు కలిగిన కాలము చిగురు కాలము వంటిది కనుక చిగురైయున్న ఓ యేసుప్రభువా ! నీకు స్తోత్రము. మా నిరాశలన్నిటినుండి విడిపించుమని ప్రార్ధించవలెను. అప్పుడు మన పాపములు, లోపములు, శాపములు, మొదలైన వాటన్నిటిని విడిపించి పరిశుద్దులుగా జేసి ఫలించువారముగాను, చిగురించువారముగాను, చేయగలరు.
సిం హము:- సిం హము అనగా మృగరాజు, అన్నిటిని జయించును. అట్లే యేసు ప్రభువు ఆకాశము క్రింద ఇవ్వబడిన నామము లన్నిటికంటె గొప్పనామము మనము చేయలేనివన్ని చేయగల నామము అన్నిటిని జయించిన నామము రక్షకులని చెప్పబడిన వారందరి కంటె గొప్ప రక్షకుడు క్రీస్తే. ఈయనే యూదా గోత్రపు సిం హమై యున్నాడు సర్వశక్తిగలవాడై యున్నాడు. పరలోకమునకు వెళ్ళలేని వారిని పరమునకు చేర్చుటకై క్రీస్తు ప్రభువు యూదా గోత్రపు సిం హమై వచ్చి, గర్జించు సిం హమువలె ఎవరిని మ్రిగుదునా ! అని వెదకును, తిరుగుచున్నాడు (1 పేతురు 5:8) సైతాను నుండి విడిపించుటకు యూదా గోత్ర సిం హమైన క్రీస్తు ప్రభువు పరలోకమునకు తీసికొనివెళ్ళును. మనము ఒక పని ప్రారంభించినపుడు ప్రభువు చిగురుగాను, ముగించునపుడు సిం హముగాను తోడైయుండును ఏడేండ్ల శ్రమకాల శ్రమకాలములో గర్జించు సిం హమైయున్న సాతాను వశములోనున్న వారిలో నుండి యిశ్రాయేలీయుల 12 గోత్రములలోని 144 వేల మందిని కోటాను కోట్ల అన్యులను, యూదా గోత్ర సిం హమైన క్రీస్తు ప్రభువు రక్షించును (ప్రకటన 7:4) అల్ఫాయు, ఓ మెగయు, అనగా చిగురును, సిం హమును, నేనే అని ప్రభువు చెప్పెను.
గొఱ్ఱెపిల్ల:- (ప్రక 5:6) ఇదిగో లోక పాపములను మోసికొనుపోవు దేవుని గొఱ్ఱెపిల్ల. (యోహాను1:29) గొఱ్ఱెపిల్ల అనుమాట ప్రకటనలో 27 పర్యాయములు కలదు. యేసు ప్రభువు గొఱ్ఱెపిల్ల వంటి స్వభావముతో వచ్చెను. గొఱ్ఱెపిల్ల వధింపబడినట్లుగా యేసు ప్రభువు సిలువ మీద తన రక్తము చిందించి పాపులను రక్షించెను. రక్తము చిందించుట ఎందుకనగా రక్తము చిందించి పాపులను రక్షించెను. రక్తము చిందించుట ఎందుకనగా పాపులను వారి పాపముల నుండి విమోచించుటకు ఈ విమోచన కర్త ఆ గ్రంధమును విప్పుటకు యోగ్యుడు. శక్తిమంతుడునై యున్నాడు. ఆ గొర్రెపిల్ల సిం హాసనమునకును, 4 జీవులకును, 24గురు పెద్దలకును, మధ్యను నిలువబడి యుండెను. అన్నిటిని సంబంధమున్నట్లు కనబడుచుండెను. సిలువ మీద గాయములు పొంది, రక్తము కార్చెను. గనుక వధింపబడి, శ్రమలు సహించి, జయమొంది, వారి మధ్యను నిలువబడియుండెను. నేను శ్రమలన్నిటిని సాత్వ్కముతో సహించినాను. గనుక పెండ్లికుమార్తె సంఘమా, నీవును అట్లే సహించవలయునని బోధించుటకు వారి మధ్యను నిలువబడియుండెను. గొర్రెపిల్ల అనగా విముక్తి అని అర్ధము. మన శ్రమల నుండి శోధనలన్నిటి నుండి విమోచించువాడు నేను పాపము చేసినాను గనుక నాకు మరణము, హేడెస్సే, నరకమేగాని యేసు ప్రభువు నా కొరకు గొఱ్ఱెపిల్లగా వధింపబడి నా శిక్షను పొందెను గనుక నా ప్రతినిధియై యున్నారు. ఈయన జయించిన చిగురు. జయించిన సిం హము, జయించిన గొర్రెపిల్లయై యున్నారు. పెండ్లికుమార్తె వచ్చుచున్నది గనుక ఆయన లేచి నిలువబడవలెను సంఘమటే ప్రభువునకు గొప్ప అభిమానము. సంఘము నిమిత్తమే ప్రభువు భూమి మీదికి వచ్చెను. తండ్రి కుడిపార్శ్వమున ప్రభువు ఉండి, సంఘముకూడా ఉండవలెనని ప్రార్ధించిచెను. ఇన్నేండ్ల తరువాత పెండ్లికుమార్తె వచ్చుచున్నదని సంతోషము పట్టలేక లేచి నిలువబడెను. నా నిమిత్తము యెక్కడ ఇద్దరు ముగ్గురు ప్రార్ధింతురో వారి మధ్య నేను ఉందునని వాగ్ధానము చేసిన ప్రభువు వారి మధ్య నిలుచుండెను. నిందలు, ఆటంకములు, శ్రమలు, మరణము, మొదలగునవి యిక జరుగవు గనుక సంతోషించెను. శ్రమలలో ప్రభువు జయము తన జయమని తలంచిన వారు నిలువబడగలరు నిలువబడియుందురు గాని పడిపోరు. భూమి మీద జరుగవలసిన పని అతుపోయినది గనుక పెండ్లికుమారుని సిం హాసనము నొద్దకు వచ్చితినన్న సంతోషము సంఘమున కుండును. ప్రభువునకు కూడ సంతోషమే. ఏ సంతోషము గొప్పది? ప్రభువు కష్టపడి సంతోషించెను. గనుక ప్రభువు సంతోషమే గొప్పది శ్రమలు పాపశోధన, నిందలు, వచ్చినను నిలువబడి యుండవలెను. పరమునకు వెళ్ళకుముందు భూమి మీదనే ఆ స్థితిని అభ్యాసము చేయవలెను. ఇట్లు చేసిన పెండ్లికుమార్తెగా వెళ్ళగలము.
"దరిలేని ఆనందకరమైన నీ ప్రేమ తరమే వర్ణన చేయను" అను వచనము ఆదాము మొదలు సంఘము ఎత్తబడు వరకు, 7 స||ముల శ్రమల అంతము వరకు ఈ రెండు తెగలకు మధ్య మనుష్యులందరు ప్రభువును సమీపించుటకు గొర్రెపిల్లగా నున్నారు మనుష్యులలోని పాప, శాప, మరణములు పరిహారమగుటకు వాటికి సిం హముగా నున్నారు.
కొమ్ములు:- కొమ్ము అనగా బలమునకు గుర్తు ఈ బలమును ప్రభువు పెండ్లికుమార్తె నిమిత్తము వాడుకొనెను.
- బలము రెండు భాగములు.
- 1) పారద్రోలుట.
- 2) దరికి లాగుటకు
7కన్నులు:- చూపు మంచిని, చెడును చూచుటకు కండ్ల నిచ్చెను. పెండ్లికుమార్తె కంటికి ఈ రెండును, కనబడవలెను చెడును విసర్జించి మంచిని చేరదీయవలెను. జబ్బుకండ్లు గల వారు ఈ రెంటిని చేయలేరు దేవుడు మనకండ్లు వెలిగించవలెను. బ్యాటరీ లైటును నొక్కిన వెలుగును, గాని చేతిలో నున్నంత మాత్రమున వెలుగదు. భూమి మీద నున్న పెండ్లికుమార్తె కండ్లను వెలిగించునవి గొర్రెపిల్ల కండ్లు, సంఘమునకు బలము నిచ్చునని గొర్రెపిల్ల కొమ్ములు, కండ్లు
- 1) మంచిని
- 2) చెడుగును చూడవలెను.
- 3) యేసు ప్రభువు నా నిమిత్తము ఇదివరకు, ఇప్పుడు ఇక మీదట, యేమిచేయనై యున్నారో తెలిసికొనుట మూడవ పని
శక్తి 3 రకములు.
- 1) వధింపబడుట.
- 2) లేచుట
- 3) ఆరోహణమగుట
- 1) సహించే శక్తి,
- 2) పునరుత్తన శక్తి.
- 3) ఆరోహణ శక్తి, ఇన్ని శక్తులు కలవు.
2. లేచేశక్తి:- నిరాశ రానియ్యలేదు. చనిపోయినచో బయటికి రాగలవా? ముద్ర యేమి చేయును? రాయి యేమి చేయును? అని తప్పించుకొనలేదు. అవన్నియు జయించి లేచెను. అట్లే పెండ్లికుమార్తె అన్నిటిని జయించి పునరుత్థానముకావలెను.
3. రేప్చర్ 8వ చ|| దీనికి శక్తి కూడ ఉండవలెను. ఇది అందరికి లేకపోయినను ఆయన తన కృపనుబట్టి కొందరిని తీసికొని వెళ్ళును. పైనున అర్హతలన్నియు ప్రభువుకు మాత్రమే కలవు. గనుకనే సిం హాసనములో నున్న తండ్రి చేతిలోని గ్రంధమును విప్పుటకు యీయనే యోగ్యుడు ఆ గ్రంధము యింకను విప్పబడలేదు వధువు సంఘము పైకి వెళ్ళిన తరువాత విప్పబడును. ప్రభువువలె వధించబడి, పునరుత్థానమై, ఆరోహణమైన అర్హత పరమందున్న వారిగాని, భూమి మీదనున్న వారికిగాని, భూమి క్రింద నున్నవారికి గాని లేనందున యెవరును. ఆ గ్రంధమును విప్పలేకపోయిరి. ఉదా:- పౌలులాంటి భక్తుడువెళ్ళి ఆ గ్రంధమును విప్పుదునని పలికిన వారికై నీవు వధింపబడినావా? పునరుత్థానమైనావా? ఆరోహణమైనావా? అని అడిగిన లేదనును. అందువల్ల తీయుటకు అర్హుడవు కావు అని జవాబిచ్చును పెద్దల చేతులలో వీణెలు, పాత్రలు, కలవు. ధూపద్రవ్యములు గల సువర్ణ పాత్రలు కలవు. వీణెలు స్తుతికి గుర్తు. పాత్రలు ప్రార్ధనలకు గుర్తు. ఈ ప్రార్ధనలన్నియు పుస్తకము తీసికొను నప్పుడు నెరవేరును. సువర్ణమనగా పవిత్రత. పరిశుద్ధత అక్కడ సువర్ణములేదు. కళంకములేని ప్రార్ధనలే సువర్ణము. దేవుడు ఒక మనిషిని తీసికొనిపోవుచుండగా యింక పది సం||లు ఉంచుమని ప్రార్ధించుట కళంక ప్రార్ధన (దేవుని చిత్తమునకు వ్యతిరేకము) మన యిష్టము నెరవేరవలెననుట కళంకము. పరలోకములోని ప్రార్ధనలు కళంకములేనివి.
ధూపద్రవ్యములు:- ధూపముపైకి వెళ్ళును. అట్లే మన ప్రార్ధనలు పైకి వెళ్ళును. జఖర్యా ధూపము కప్పువరకే వెళ్ళెను. అయితే దూత నీ ప్రార్ధన వినబడెనని చెప్పెను. ప్రార్ధన అక్కడికి వెళ్ళెను.
- ప్రార్ధనలు
- 1) కొన్ని యింటికప్పువరకు వెళ్ళును.
- 2) కొన్ని మేఘముల వరకు వెళ్ళును.
- 3) కొన్ని నక్షత్రముల వరకు వెళ్ళును
- 4) కొన్ని సిం హాసనము వరకు వెళ్ళును. యీ చివర వీళ్ళు ప్రార్ధనల వలననే ఉపయోగము కలుగును.
కలశము:- అనగా సాంబ్రాణి వేయునది. ధూపము ప్రార్ధనకు గుర్తు ప్రార్ధనకు రెండు ధూపకలశములోని ధూపము. భూలోకము నుండి పరలోకములోనికి వెళ్ళిన ప్రార్ధన. కొందరి ప్రార్ధనలు సిం హాసనము వరకు వెళ్ళినను త్రోసివేయబడును. అంగీకరించబడవు. ధూప పాత్ర అక్కడ ఉండవలెను. మరల రాకూడదు. అంగీకరింపబడకుండ తిరిగివచ్చు ప్రార్ధనవలె ఉండకూడదు. ప్రార్ధనలు నెరవేరు వరకు అక్కడ ఉండును. దాని సమయములో నెరవేరును, ఇప్పుడు కొంతమంది ప్రార్ధనలు నెరవేరవు. అవి యిక్కడ ఉండును. ధూపమనగా కళంకములేనిది. అది ప్రక్కపోలేదు. పాత్రలో కలదు. అది కాపాడుచుండును అది నెరవేరు వరకు కాపాడబడుచుండును. పరిశుద్ధుల ప్రార్ధనలు అక్కడ ఉన్నవి. పాపాత్ములవికాదు.
పరిశుద్ధులు:- పరలోకములో పెండ్లి విందు జరుగును, ఆ విందుకు పిలువ బడినవారు కలరు. (ప్రకటన 19:8) 24గురు పెద్దలనగా పెండ్లికుమార్తె పరలోకములో కలదు. మిగతవారు రక్షింపబడినవారు. వారే పరదైసులో నున్నవారు, ప్లువబడిన వారు రాకముందే పెండ్లికుమార్తె విందులో ఉండును, తరువాత వారు పిలువ బడుదురు. పెండ్లికుమారుడు, తండ్రి, తనకు తెలిసినవారు, విందునకు పిలువ బడుదురు. పెండ్లికుమార్తె పక్షము వారు పిలిచెదరుగాని అందరూ క్రొత్తవారే, రక్షితులను పిలిచెదరు. పెండ్లికుమార్తె ఎవరి కొరకు ప్రార్ధించెనో వారే వచ్చెదరు. రక్షితులైన వారు వత్తురు. పిలువ బడినవారే వత్తురు. పెండ్లికుమార్తెకు ముసుకు ఉండును. ఎందుకనగా పెండ్లికుమార్తె మహిమను వీరు చూడలేరు వారికి సైకిళ్ళు అక్కరలేదు. బెంచీలు అక్కరలేదు. అంచెలమీద వెళ్ళుదురు. అనగా ప్రయాణసాధనములు అక్కరలేదు. ప్రకటనలోని ధర్మములు, మర్మమైన విషయములు, వాటిని చెప్పుట చాలకష్టము కాని ప్రభువు చెప్పిన చాల సుళువు సమయాను కూలముగా బయలు పడును. అదే ధర్మము. ఇదివరకు కొంత, తరువాత కొంత, ప్రస్తుతము కొంత, కాలక్రమముగా బయలుపడును.
9 వచనము, పెద్దలు గొర్రెపిల్లతో యేమనిరి ?
- 1) గ్రంధము తీసికొనుటకును,
- 2) ముద్రలు విప్పుటకును, నీ యోగ్యుడవనిరి తీసికొనుటకు విప్పుటకును, శక్తి, స్వాతంత్ర్యము గల వాడవనిరి
విప్పుట ఎందుకు? పుస్తకము లోపలి సంగతులను, మర్మములను, తెలుపుటకు విప్పిరి.
సిం హాసనము వద్దకు వెళ్ళుటకు:-
- 1) చనువు గలదు.
- 2) శక్తి, గలదు. విప్పుటకు అంతము లేదు. రెండవ రాకడ వరకు విప్పుచునే ఉండును ఇది వరకు విప్పెను.
5:10 ఇంగ్లీషులో (Ready made) అని కలదు. అది తెలుగులో విమోచన అనిలేదు.
ఉదా:- పిట్టలను పంజరములో నుండి ధనమిచ్చి తెప్పించి ఎగురవేసెను. ఐతే ప్రభువు మానవుల ఆత్మలను డబ్బు యిచ్చి కొనలేదు. ఆత్మ ఖరీదు ఎక్కువ గనుక స్వరక్క్తమిచ్చి కొనెను. విమోచన క్రయ ధనము రక్షించుటకు తన స్వరక్తమిచ్చికొనెను. కొనుట యెవరి కొరకు? దేవుని కొరకు, బజారులోని వస్తువులను పిల్లల కొరకు, అధికారుల కొరకు, తమ కొరకు కొనుక్కుందురు. అలాగే యేసు ప్రభువు దేవుని కొరకు కొనెను. మనిషి ఆత్మ విలువైనది. అది దేవుడే కొనవలెను. రక్తమిచ్చి కొనవలెను. ఆత్మ యొక్క విలువ ప్రభువునకే తెలియును పిల్లవానికి తండ్రి చేతిలో నున్న వజ్రము విలువ తెలియదు. దేవుని కొరకు రాజులుగాను, ఒక రాజ్యముగాను, యాజకులుగాను, చేసెను. వీరు వెయ్యియేండ్ల పాలనలో క్రీస్తు ప్రభువుతో కూడ భూమి మీద రాజ్యము చేయుటకు రాజులుగను, యాజకులుగను, ఉందురు. (ప్రకటన 20:4-6) పాత నిబంధనలో పై రెండు ఉద్యోగములవారు ఉన్నారు, గాని క్రొత్తనిబంధనలో యెవరును లేరు, ఎందుకనగా ప్రభువువచ్చి రెండు ఉద్యోగములు ఆయనే చేసెను. కనుక మనుష్యులను యేర్పరచనక్కరలేదు. నరులకును ఆయనకొని పై రెండు ఉద్యోగములను యిచ్చెను. వారే సాత్వికులై భూలోక రాజ్యమును స్వతంత్రించుకొను ధన్యులై యుందురు. వారు సాత్వికులు వీరే వెయ్యి యేండ్లలో పరిపాలింతురు. దీనమనస్సు గలవారు ధన్యులు. పరలోక రాజ్యము వారిది. అను వాక్యము వీరిదే భక్తులకు పరలోక రాజ్యము, భూలోక రాజ్యము, అంతము వచ్చును. " అంతము మనదేగదా" కీర్తన (బహుగా ప్రార్ధన చెయుడి) సాత్వీకము దీనమనస్సు ఇవి మన అర్ధము ఒకటే గాని ఒకటైనా ప్రభువు రెండు చెప్పెను. గనుక రెండు అర్ధములున్నవి. భక్తులు యీ లోకములో నున్నారు. గనుక పొలము, ధనము పండ్లు, అన్నీ కావలెనని యుండును. గొప్ప ఉద్యోగము కావలెనని భక్తులు అందురు. దేశమును బాగుచేయవలెనని అందురు. యిప్పుడు నెరవేరదు. భక్తులు అందురు. దేశమును బాగు చేయవలెనని అందురు. యిప్పుడు నెరవేరదు. భక్తులు భూలోకమును సంపాదించుకొని ధర్మ పరిపాలన చేసి బాగు చేయవలెనని చూచెదరు. భక్తులకు యీ కోర్కెనెరవేరదు. అట్లుండుటకు కారణమేమి? పాపమే కారణము పాపమును జయించి వధువు సంఘము పరమునకు వెళ్ళి ప్రభువుతో కూడ తిరిగి వచ్చును. వెయ్యియేండ్లు ప్రభువుతో కూడ పరిపాలన చేయును. అప్పుడు యిది నెరవేరును. వెయ్యియేండ్ల పాలనలో భూమిని 12 భాగములుగా చేసి 12 గోత్రముల వారు పంచుకొందురు. ఈ 12 గోత్రములలోను పాతనిబంధన, క్రొత్తనిబంధన భక్తులుందురు. ఆ పరిపాలనలో మనము యేదో ఒక గోత్రములో నుందుము. వీరిది పరలోక నూతన యెరూషలేము నివాసము అని తెలియుచున్నది. ఎందుకనగా 12 పునాదులు 12 ద్వార బంధముల మీదనున్న పేరులను బట్టి, భూమి మీద క్రైస్తవ విశ్వాసి మహాశ్రమలను భవించి, సహించి, సాత్వికము కలిగియున్నందున యీ రాజ్య పరిపాలకులైరి. అట్లే క్రైస్తవులకు కష్టముల మీద కష్టములు వచ్చినను, సహించి ప్రభువు రాజ్యమును స్వతంత్రించుకొందురు.
Homeయాజకత్వము
యాజకత్వము:- ప్రభువు కొరకు దేవుని ప్రార్ధించుట
1) ప్రజల కొరకు ఆచారములు జరుపుట. 2) బలివేయుట. 3) ధూపము వేయుట. 4) యూదులు గుడికి వచ్చినపుడు గొర్రెలు పండ్లు తెత్తురు. వాటిని యాజకులు అందుకొని సమర్పించెదరు ప్రార్ధన ఆచారము, ఉపదేడము లేక బోధ చేయుట ఉండును. అదే రేపు వెయ్యియేండ్లలో చేయుదురు. పని ముమ్మరముగా జరుగును. అప్పుడు సువార్త పూర్తిగా చెప్పగలరు. ఆరాధన పూర్తిగా చేయుదురు. అందరిని దర్శించెదరు ఇప్పుడు అందరినీ చూడలేరు. అప్పుడు అన్నీ సంపూర్ణముగా చేయుదురు. సువార్తికులు అన్ని ఊర్లు వెళ్ళుదురు. అందరి దగ్గరకు వెళ్ళుదురు. అందరికి చెప్పుదురు వెళ్ళలేని వారివద్ద్కౌ కూడ వెళ్ళుదురు. తలుపు వేసియున్న లోపలికి వెళ్ళగలరు. తలుపు తీయనక్కరలేదు. కొన్ని వందల యేండ్లకు ఒకసారి చావు వచ్చును. వానిని మోసికొని పోచుండగా పెండ్లికుమార్తె యెదురు వచ్చిన యెడల పెండ్లికుమార్తె వానిని బ్రతికించును. 1) ఇంటిలో నున్నయాయీరు కుమార్తెను, 2) దారిలో నున్న విధవరాలి కుమారును, 3) సమాధిలోనున్న లాజరును, ప్రభువు బ్రతికించెను వీరు ప్రభువునకు తటస్థించిరి గనుక బ్రతికిరి. అట్లే రేపు పెండ్లికుమార్తెకు తటస్థించిన మృతులను బతికించును. ఏ జబ్బునైన బాగుచేయుట, జీవముపోసి బ్రతికించుట, అదే వెయ్యియేండ్లలోను యిప్పుడును, జరుగును. ఆది సంఘములోనివారు బ్రతికించుట గలదు గనుక ఆఖరు సంఘములోని వారు బ్రతికింపవలెను. బ్రతికిస్తారా ? అందుకే యిప్పుడు స్వస్థిశాలలు స్థాపింపబడినవి. బ్రతికిమ్హుట ప్రభువు చిత్తమునై యుండవలెను. ఒకవేళ జరిగినను చెప్పరు ఐననూ యీ కాలములోను అక్కడక్కడ జరుగుచునే యున్నవి.ప్రార్ధన:- ప్రభువా నీవు రాజువై యుండి మమ్మును రాజులనుగా చేయుచున్నావు నీవు యాజకుడవై యుండి మమ్మును యాజకులనుగా చేయుచున్నావు. గనుక స్తోత్రములు.
క్రొత్తపాట:- 5:10 వారు భూలోకమందు ఏలుదురని క్రొత్తపాట పాడుదురు. 14: 3; 15: 4 పాత పాట ఏది? ప్రభువా! యిప్పుడు నీ విశ్వాసము శ్రమపడుచున్నారు. యీ అవిశ్వాస రాజ్యమునకు లోబడి యున్నారు. అన్నీ కష్టాలే అందురు. అదే పాతపాట. ఇశ్రాఏలీయులు ఎఱ్ఱ సముద్రము వద్ద ఐగుప్తీయులును చూచి మోషే, ఐగుప్తులో మాకు సమాధులు లేవనా? ఈ అరణ్యములో చచ్చుటకు మమ్మును రప్పించితివా? మేము యీ అరణ్యములో చచుటకంటె ఐగుప్తీయులకు దాసులమగుటయే మేలని చెప్పిరి. ఇదియే వారి పాతప్పాట. దేవుడు మోషే ద్వారా ఎర్ర సముద్రమును పాయలు చేయించి సముద్రము మధ్యను ఆరిననేలను నడిపించి ఆవలి ఒడ్డున చేర్చెను. అప్పుడు యిశ్రాఏలీయులు గొప్పస్తుతి గానము చేసిరి. యీ పాటయే క్రొత్తపాట, భూలోకమును హర్మెగెద్దోను యుద్దము వరకు నరులే ఏలుదురు. ఇది పాత పాట. ఆ తరువాత భూలోకముకు సంఘము యేలునుభూలోక వాసులు యేలరు సంఘమును, ప్రభువును యేలుదురు. నరులయేలుబడి పాప పతనము నుండి పెండ్లికుమార్తె వెయ్యి ఏండ్లలో యేలు వరకు జరుగును. ఇది క్రొత్త పాట. వెయ్యియేండ్ల పాలనలో పాడు పాట (లూక1:33) లో పూర్వము దావీదు యెరూషలేములో యేలినట్లు 1000 ఏండ్లు ప్రభువు ఏలును. దావీదు సిం హాసనమును ఆక్రమించుకొనును. (మత్త్యి 1:1) దావీదు కుమారుడు యేసు ప్రభువు గనుక శరీర రీతిగా సిం హాసవారస్త్వము ప్రభువుది. యాకోబు వంశస్థులు అనగా శరీర రీతిగా కాక విశ్వాసులైనవారు వెయ్యియేండ్లలో సంఘమును ఏలుదురు యేసు ప్రభువు యుగయుగములు ఏలును. యెరూషలేములు యెన్ని? 1)యిశ్రాయేలీయుల యేలుబడిలో దేవుడు వారి కనుగ్రహించిన పాలస్తీనా. ఇది భూగోళ శాస్త్రములోనిది. 2) వెయ్యియేండ్లలో సంఘముయేలు బడిచేయునది. ప్రభువు సిం హాసనము వేసికొనునది అది నూతన పరచబడిన యెరూషలేము. భూమి అంతయు మారినట్లు యెరూషలేమును మారును. 3) మోక్షలోకము. పెండ్లికుమార్తె స్థావరమైన యెరూషలేము స్వగృహమైన యెరూషలేము. భూలోకములో వేరే వెయ్యి యేండ్లలో పెట్టుకొనిరి. అదే పరలోకములోను పెట్టుకొనిరి. అమెరికాలో పట్టణములు స్థాపించుకొని బైబిలులోని ఫిలదెల్ఫియ అను పేరు పెట్టుకొనిరి. అట్లే పాతనిబంధన పేరు జ్ఞాపకము చేసికొనుటకు యెరూషలేము పేరు పెట్టుకొనిరి. మనుష్యుల పాలనయే ఉండదు. సంఘమే యేలును అదే క్రొత్తపాట. 10వ వచనమే క్రొత్తపాట. రాగముతో పాడవలెను. వారికి యెక్కువ సంతోషము. ఎందుకనగా పెండ్లికుమార్తె వచ్చివేసినది. గనుక పరలోకమంత కమ్ముకొనిరి.
1) కీర్తన:- శక్తి ఉన్నదని పాడిరి. భూలోకములో సాతానుయొక్క, దయ్యములయొక్క చిక్కులలో నున్న పెండ్లికుమార్తె విడిపించుకొని వచ్చెను. అబ్రహాముబలి కొరకు పొదలో చిక్కుకొని యున్న గొర్రెను విడిపించినట్లు శక్తిమంతుడైన ప్రభువు పెండ్లి సంఘమును విడిపించెను.
2) ఐశ్వర్యము:- (Riches ) ధనము, మనలను ఐశ్వర్యవంతులుగా చేయుటకు ఆయన దరిద్రుడాయెను. ఆయనకు సంఘమే ధనము. (రక్తమిచ్చికొనెను) వర్తకుడు తన ఆస్తినంతటిని అమ్మి ముత్యమును కొనెను. అతని ధనము ముత్యము. అలాగే సంఘము ఆయనకు ధనము ముత్యము.
3) జ్ఞానము:- పెండ్లికుమార్తె భూలోకములో నున్నప్పుడు పరలోకమునకు వెళ్ళువరకు నమ్మకము లేదు తయారగువరకు, చేరువరకు, నమ్మకమేమిటని పెండ్లికుమార్తె మనసులో నున్నది. అది అజ్ఞానము, పెండ్లికుమార్తె అజ్ఞానమును తొలగించి, యేసు ప్రభువు తన జ్ఞానముతో వెలిగించి తీసికొని వెళ్ళును. ఇది పెండ్లికుమార్తె జ్ఞానము కాదు. ఆయన జ్ఞానము. ఉదా:- ఏదైనా గ్రామము తెలిసినవారే. ఆ గ్రామమునకు తీసికొని వెళ్ళవలెను. తెలియనివారు తీసికొని వెళ్ళలేరు. నేనే మార్గమునై యున్నానన్న, ప్రభువే తీసికొని వెళ్ళవలెను.
4) బలము:- శక్తి, బలము, రెండు కోటే ఎందుకు రెండు? ఉదా:- వర్తకుడు సరుకు తెచ్చుకొని కొట్లులోను పెట్టెలోను, పెట్టుకొనెను. మంచిదని చూచెను. గనుక జ్ఞానవంతుడు తెచ్చుకొనెను. గనుక శక్తివంతుడు. పైవన్ని ఉన్నవి గనుక ఐశ్వర్యవంతుడు. ఎన్ని చిక్కులున్నను తెచ్చుకొనెను. గనుక శక్తివంతుడు. దాచుకొన్నాడు. ఐశ్వర్యవంతుడు. వర్తకుడు త్రాగి నిద్రించిన యెడల దొంగలు ఎత్తుకొని పోవుదురు. కొంతకాలమునకు దివాళాతీయును.అప్పుడు వర్తకునికి తన్ను కాతాడుకొనే బలములేదన్న మాట, అలాగే సంపాదించుకొన్న పెండ్లికుమార్తె పైకి వెళ్ళిన తరువాత మరల క్రింద పడకుండ నిత్యము కాపాడువాడు. గనుక బలముగలవాడు.
5) ఘనము:- 33 1|2 సం||లు ప్రభువు పని ఘనత గలది. ప్రభువు తన శక్తివల్ల పెండ్లికుమార్తెను సంపాదించుట. కాపాడుట, మొదలగు నవన్నియు చేసెను. గనుక ఆయనకు ఘనము అని దూతలు పాడిరి.
6) మహిమ:- ఘనత వలెనే యీ మాట ఉండును. ఆయన చేసిన క్రియలవల్ల, దూతలువల్ల్, మానవులవల్ల ఆయనకు మహిమ కలిగినది. అనాదిలో దూతలను, లోకములను, మానవులను వెయ్యియేండ్ల కాలము వరకు, ఆయన చేసిన పనివల్ల ఘనత, అయితే ఆయన యేమియు చేయకముందే అనాదిలోనే ఆయన ఉండుట మహిమ. క్రియచేయక ముందే మహిమ ఉన్నది. (యోహాను17:5) లోకము పుట్టకమునుపు ఉన్న మహిమ ప్రభువు భూలోకములో ఉన్నప్పుడు లేదు. ప్రభువు ప్రార్ధించుచుండగా తనకు అనాదిలో మహిమ జ్ఞాపకమునకు వచ్చి పుట్టకమునుపు ఉన్న మహిమను మానవునికి యిమ్మని అడిగెను.
స్తోత్రము:- (యిర్మియా 17:14. దేవా! నీ క్రియలు నిన్ను స్తుతించుచున్నవి. నీ శక్తి ఐశ్వర్యము జ్ఞానము బలము ఘనత, యీ ఐదు క్రియలు ఆయనను స్తుతించుచున్నవి. నీ క్రియలవల్లను నీ మహిమ వల్లను, స్తొత్రము పొంది నర్హుడవని దూతలు స్తుతించిరి(అ|| కా|| 10:4) కొర్నేలీ నీ ప్రార్ధనలు, నీ ధర్మకార్యములు, దేవుని సన్నిధిలో జ్ఞాపకార్ధముగా ఉంచబడినవి దూత చెప్పెను యిర్మియా లోనిది ఆయనకు అనాదిలో నున్నస్థితి దేవదూతల్, మానవుల స్థితికి ఆయన క్రియలే కారణము. పై ఐదు క్రియలవల్లను, నీ మహిమ స్తితికిని, స్తొత్రములు స్తోత్రములు పొందుటకు అర్హుడవని చెప్పిరి. స్తుతి చెప్పలేదు. పొందనర్హుడవని చెప్పిరి. స్తుతింపలేదు. (StaTement) యిచ్చిరి. దానిని బట్టి మనము స్తుతి చేసికొనవలెను. యేసు ప్రభువా! పై ఆరింటిలో ఒక్కొక్క దానికై నీకు స్తోత్రములు. నీవు స్తొత్రార్హుడవు. గనుక నీకు స్తోత్రములు.
7) స్తోత్రార్హుడవు:- అనాది కాలములోని స్థితిని, భూలోక స్థితిని, అంతటిని ఎత్తుకొని దూతలు సంపూర్ణ స్థితి చేసిరి. ఈ స్తుతి నేర్పుటకు ప్రకటనలో మనకు వ్రాయబడెను. అది యిప్పుడు నేర్చుకొనక దాచుచున్నాము. స్తులు రెండు. 1) దూతలస్తుతి, 2) పెండ్లికుమార్తె స్తుతి. దూతలస్తుతి కొంచెము తేడా ఎందుకనగా వారు పడలేదు. రక్షింపబడలేదు. పెండ్లికుమార్తె పడి రక్షింపబడెను. గనుక వారి స్తుతిలో తేడా ఉండును. (ప్రక 5:5) లో పెండ్లికుమార్తె స్తుతి కలదు. పెండ్లికుమార్తెకు ప్రభువు చేసిన పనీంతటి విషయమై పెండ్లికుమార్తె స్తుతి చేసెను. 5వ, వచనములో చేసిన తరువాత దూతలందరు కలసి వారు చేసినారను సంతోషముతో స్తుతి చేసిరి. దూతలు, పెండ్లికుమార్తె (ఉదా:- యిప్పుడు విమానములలో హిమాలయపర్వతములకు వెళ్ళిరి). ఇంద్రధనుస్సుకు 7 రంగులు. అట్లే వీరి స్తుతి కూడ 7విధములు. అవి 7రంగులు. క్రీస్తు ప్రభువు నా క్రియల మూలముగా కీర్తినొందురు.
1) 4 జీవుల నిత్యస్తుతి (సమాజము). 2) రక్షితుల స్తుతి. (పెండ్లికుమార్తె). 3) దేవదూతల స్తుతి (దూతలు).(5:13):- ఈ స్తుతిలో అన్ని ఉన్నవి. 1) పరలోకము. 2) భూలోకము. 3) భూమి క్రింద. 4) సముద్రములోను, అన్నిటిలోను, ఈ స్తుతిలో రక్షింపబడిన వారున్నారు. ఇందు రక్షితులు కలరు. భూలోకములో నున్నవారందరు స్తుతించిరని కలదు. రేప్చరులో మిగిలిన వారందరు వేరై తరువాత స్తుతింతురు. సిం హాసనము దగ్గర నున్న 4జీవులు. ఆయనను స్తుతించునట్లు కలదు. జీవులేకాదు. సర్వము స్తుతించెనని కలదు. పరలోకములో 4గుంపుల వారు అనగా పరలోకమంత స్తుతించెను. (4 వారు రక్షితులు), భూలోకమంత అనగా మిగిలిన విశ్వాసులు సర్వమును స్తుతించెను. గుంటూరులో ఒక ప్రక్క కీర్తన పాడగా మధ్య వారు అందుకొనిరి. అది విని చివరివారు అందుకొనిరి. అట్లే పరలోకములో మొదలు పెట్టగా భూలోకమంతా అందుకొనిరి. మిన్ను, మన్ను యేకమాయెను. ఈ స్తుతి ఎవ్వరు యెప్పుడు చేయలేరు. యిక్కడ యిద్దరికి స్తుతులు. 1) తండ్రికి 2) గొర్రెపిల్లకు, లోకమంత స్తుతించగా పరలోకములోని 4జీవులు ఆమేన్ అని వారుకూడ యేకీభవించిరి. ప్రభువుకు 12మంది 70మంది, 120 మంది, 3000లు. క్రమముగ లోకమంత ఆవరించుకొనెను. ప్రతి దేశములోను, వార్త వ్యాపించెను. భూలోకములో స్తుతి, పెండ్లికుమార్తె ద్వారా స్తుతి, పరలోకములో స్తుతి. ఈ మూడును కలిసెను. పరలోకములో దూతలు, 4 జీవులు, పెండ్లికుమార్తె, రక్షింపబడినవారు, భూలోకమందును అనగా సృష్టి అంతయు, భూమి క్రిందను, సముద్రములోనున్న ప్రతి సృష్టి అనగా వాటిలోనున్న సమస్తమును, గొర్రెపిల్లను స్తుతించిరి.
దేవదూతలు:- వీరికి ఎక్కడలేని సంతోషము కలిగినది. ఎందుకనగా పెండ్లికుమార్తె భూలోకమునుండి పరలోకమునకు వచ్చి వేసినదని భూలోకములో సైతాను యొక్క, దురాత్మల యొక్క, గుప్పిలిలో చిక్కుకున్న పెండ్లికుమార్తె సంఘము వాటిని వదలుకొని వచ్చి వేసినదని, గొప్పస్వరముతో స్తుతిచేసిరి.
4జీవులు:- ఇంతకాలమునుండి మేము యెవరి కొరకు ప్రార్ధించినామో! ఆ పెండ్లికుమార్తె పరలోకమునను వచ్చి వేసినది. మాకు బహుమానము దొరికినది. మా సమాజము ఎక్కువైనదని సంతోషముతో స్తుతించిరి.
పెండ్లికుమార్తె:- మా ప్రభువు మా కొరకు సంపాదించిన ఆస్తిని అను భవించుటకు యిక్కడికి వచ్చినాము. అనంతకాలము ఆయనతో ఉండుటకు ముఖాముఖిగా చూచి ఆనందించుటకు వచ్చినాము సమస్త కళంక బంధముల నుండి విడిపింపబడి స్వేచ్చగా నుండుటకు వచ్చి వేసినామని సంతోషముతో స్తుతించిరి.
రక్షితులు:- మావారు మకంటె యెక్కువ మహిమలో నున్నారని రక్షింపబడిన వారు స్తుతించిరి. భూలోకమందున్న విశ్వాసులందరు మహానందముతో స్తుతించిరి. సృష్టము అనగా రాయి, నీళ్ళు, చెట్లు జలచరములు, సిం హము, దూడ, పక్షి మొదలగు ప్రతి జీవరాశి స్తుతించినవి. సముద్రము, అందులోని సమస్తమును స్తుతించెను. భూలోక పరలోకముల వారందరు స్తుతించిరి. 24గురు పెద్దలు సాగిలపడి నమస్కారము చేసిరి. అనగా క్రియతోను, మాటతోను, నమస్కారము చేసిరి. సృష్టి తండ్రిని, స్తుతించినట్లున్నది గాని పరిశుద్ధాత్మ పేరులేదు. గాని స్తుతి చేయించిన వారు పరిశుద్ధాత్మయే, యిక స్తుతి చేయవలసిన వారెవరులేరు.
ప్రార్ధన:- ప్రభువా! పరలోకమును, భూలోకమును, ఏకమై స్తుతించు కాలము రానైయున్నది గనుక స్తొత్రము.
Home