15వ అధ్యాయము - Declaration of Bowls

పరిచయము

    పరలోక సూచన=
  • 7తెగుళ్ళు - 7 దూఉతలు
    N.B :
  • ఎ. కడవరివి
  • బి. దేవుని కోపనసమాప్తి

అగ్ని: స్ప్టిటిక సముద్రము

జయశీలులు : 1. నిలిచిరి
  • ఎ. కౄరమృగముకు
  • బి. ప్రతిమకు
  • సి. సంఖ్యకు



లోబడక
గెల్చిరి
2. దేవుడు సేవార్ణ వీణెలు పట్టిరి
3. వారి కీర్తన :
  • ప్రభువా
  • దేవా
  • సర్వాధికారి
  • యుగాలరాజా


నీ క్రియలు ఘనము
    నీ మార్గాలు
  • ఎ) న్యాయ
  • బి) సత్యములు
    ప్రభువా
  • ఎ. నీవే పవిత్రుడవు
    • బి. భయపడనివాడెవడు
    • సి. నామ మహిమపర్చని వాడెవడు

N.B : నీ న్యాయ విధులు ప్రత్యక్ష

    N.B : నీ న్యాయ విధులు ప్రత్యక్ష
  • ఎ. జనములందరు వచ్చి
  • బి. నీ సన్నిధిని నమస్కరింతురు
    N.B :
  • ఎ. దేవదాన మోషే కీర్తనయు
  • బి. గొర్రెపిల్ల కీర్తన

సాక్ష్యగుడార గర్భాలయ తెరువబడె
ఫలితము: ఆ దూతలు వచ్చిరి

    నిర్మల
  • ఎ. రాతిని - ధరించిరి
    ప్రకాశ బంగారు
  • బి. దట్టీలు - రొమ్ముల
    ఫలితము 2: ఒక జీవి 4లో
  • ఇచ్చెను. 7 పాత్రలు 7 గుర్కి
    ఫలితము 3 : పొగ
  • 1. వచ్చె __ దేవుని మహిమనుండి
  • 2. వచ్చె __ దేవుని శక్తినుండి
  • ఫలితము 3 : నిండె __ సిం హాసనములో

N. B : తెగుళ్ళు పూర్తి వరకు ఎవడును వెళ్ళలేదు

ప్రార్ధన:-

పరలోకపు తండ్రీ నేటి దినములలో ప్రకటన గ్రంధ వివరము వినుచున్న మాకు ఆదరణ కలుగచేయుము. భయంకర విషయములు వినుచున్నప్పుడు జార్త్తగా ఉండునట్లును సంతోష విషయములు వినునప్పుడు సంతోషిచునట్లు కృప అనుగ్రహించుము. కాలక్రమముగా ప్రకటనలోని అంతరంగ విషయములు సర్వభాషలలో ప్రచురణ అగునట్లు మీ సహాయము దయచేయుము. ఏకమనస్సు, ఏకాభిప్రాయము. ఏకాత్మ అందరికీ దయచేయుము. మా విశ్వాసము. మా మనస్సాక్షి, యజ్ఞం, మా ప్రత్యక్షత మా ప్రయనమును వెలిగించుము. ఈ దినములలో భక్తులు ఎన్నో ప్రార్ధనలు చేయుచున్నారు. సువార్త విషయములలో ఉన్న ఆటంకములును తొలగించుము. సువార్తికులు తమ పని నమ్మకముగా చేయు నీ కృప దయచేయుము. విత్తువారిలో, నాటు వారిలో, నీరుపోయు వారిలో ఏమియును లేదు. నివే విత్తనములును మొలిపించుము సంఘములోని పొరపాట్లు, మన స్పర్ధనలు అన్నియు సరిచేయుము దూతలను కావలియుంచుము. త్వరగా వచ్చుచున్న ప్రభువు బట్టి వేడుకొనుచున్నాము. ఆమెన్.

దేవుని ఉగ్రతను గురించి ప్రకటన 14వ అధ్యాయములో తెలిసికొని యున్నాను. అదే ఉగ్రత 15వ అధ్యాయంలో కూడా ఉన్నది. ప్రజలు తాము చెయుచున్న పాపము మాని వేయుదురో లేదోనని దేవుడు కనిపెట్టును. జనులు మానక పోతే రోమా పత్రిక 1వ అధ్యాయంలో ఉన్నరీతిగా దేవుడు వారిని పాపమునకు అప్పగించి వేయును. ఒక పిల్లవాడు కోతితో ఆడుకొనుచుండగా ఆ పిల్లవాని అన్న చూచి గద్ధించెను. అయినా మానలేదు. అన్నం తినుటకు పోగా మరల ఆ పిల్లవాడు కోతితో ఆడుకొనుటకు వెళ్ళెను. కోతితో ఆడుకొనుచుండగా అతని అన్ని విడిచి పెట్టి వెళ్ళెను. అప్పుడు ఆ కోతి ఆ పిల్లవానిని పెరికివేసెను. అలాగే దేవుడు కూడా సహనము చూపి ఎంతకాలమైనా గడువిచ్చును. నరుడు పాపము విడుచునేమోనని కనిపెట్టును. పాపము మాననందున ఉగ్రత పాలు అగుదురు. జల ప్రళయ కాలములో దేవుడు 120 సంవత్సరములు ప్రళయమును గూర్చి బోధ చేయించెను. అయినను వారు మారనందున ఉగ్రతకు అప్పగించెను. చెప్పి చెప్పి ఊరుకొనెను. బోధకులను పంపి తెలియజేయును. మనస్సాక్షి ద్వారా మాటలాడును. జ్ఞానముద్వారా మాటలాడును. మనిషి దేవునిని లెక్కచేయక పోతే దిద్దుకొనక పోతే తన కృపను తీసివేయును. దేవుడు అనేక గడువులు ఇచ్చును. మనిషికి కావలసిన శరీర సదుపాయములను దయచేయును. ఇంకా పాపము మానకపోతే తన కృపను తీసివేయును. లోతు కాలములో సొదొమ గొమెర్రా ప్రజలకు అంధత్వమును కలుగజేసెను. అయినా వారు మారలేదు గనుక ఇచ్చిన గడువు తొలగించెను. గడువులు అన్ని అయిపోగా లోతు కుటుంబమును స్వయముగా బయటకు నడిపించెను. కొందరు ఉద్రేకమును పొంది ఆపుకొందురు. తరువాత కొంతకాలమునకు పాపములో పడ్పోవుదురు గర్వము వచ్చును. కలిగిన దర్శన వరము పోగొట్టుకొందురు. మిగతావి దేవుడు తొలగించడు. అప్పుడు సైతాను వచ్చి మోసము చేసి తప్పుడు దర్శ్నములను చూపును. ఇది దేవుని ఉగ్రత.

రాబోయే ఉగ్రతను తప్పించుకొనుటకు నీకు బుద్ధి చెప్పిన వారెవరని యోహాను అడిగెను. ఈ ఉగ్రత ఏడు సంవత్సరముల శ్రమ కాలములోనివే ప్రభువు వెళ్ళిపోయిన పిమ్మట 70 ఏండ్లకు యెరూషలేమునకు ఉగ్రత వచ్చినది. రోమావారు యెరూషలేమును నాశనము చేసిరి.

  • 1. ముద్రల కాలౌగ్రత
  • 2. బూరల కాల ఉగ్రత
  • 3. పాత్రల కాల ఉగ్రత
రానురాను ఉగ్రత హెచ్చ్యినది. గనుక ఇచ్చిన గడువును దేవుడు తొలగించి వేయును.

    1. ప్రభువు ఇచ్చిన నాలుగు వరములను తీసివేయును.
  • 2. వారు అంటించుకొన్న పాపములు మానకపోతే వారిని తీసికొని వెళ్ళి అగ్నిగుండములో పడవేయుము.
  • పై రెండు కలిసిన యెడల దేవుని ఉగ్రత.
  • 3. రేపు పెండ్లి కుమార్తె వరుసలో మేము వెళ్ళిపోదుమని కొందరు అందురు. పాపములు మానరు. వారు దర్శనాలు చెప్పెదరు. అట్టివారితో ప్రభువు ఓ మనుష్యుడా, నీవు ఈ ఏర్పాటును త్రోసివేసికొని నీవు ఉన్న పొరపాటులోనే ఉన్నావు గనుక, నీవు ఎత్తబడలేవు అని అందురు. దేవుడు అతనికి ఇచ్చిన గడువును పోగొట్టుకొన్నాడు. ఇట్టి వారిని ఆయన తీసికొని వెళ్ళరు. ఇది ఉగ్రత గనుక ఈ ఉగ్రత నుండి తపించుకొని మహిమకు సిద్ధపడుటకై ప్రతి పాపము విడిచి పెట్టవలెను.

ఒకామె అయ్యగారిని చూచి ఇన్నాళ్ళకు మీ ముఖమును చూచినాను గనుక నాకు రక్షణ ఉన్నదని చెప్పినది. అందుకు అయ్యగారు అది దేవదూషణ, రక్షణ, పాప విసర్జన, సరియైన ప్రవర్తన, సేవ! ఇవన్నీ సరిచేసికొన్న మనకన్ని దొరుకును. పైనున్నవన్ని ఉన్న దర్శ్నము లేకుండగనే పెండ్లికుమార్తె కాగలరు. ఎఫెసి 1వ అధ్యాయంలో నిన్ను సిం హాసనముపై పెట్టినాను అని ఉన్నది. ఈ పైన ఉన్నవన్ని నాకు అక్కరలేదు. అన్నవారు ఉన్నారు. పైరీతిగా మనము క్రమపర్చకపోతే పెండ్లికుమార్తె వరుసలోనికి వెళ్ళము.

ఒక బల్ల మీద మనిషికి కావలసినవన్నియు పెత్తి తీసుకోమని బల్ల దగ్గర కూర్చుండ బెట్టెను. అతడు తీసికొనకపోతే అతడిదే తప్పు. సొం హాసనము మీద కూర్చుండ బెట్టెను. అనగా సిద్ధపడి ఉన్నవారిని కూర్చుండ బెట్టెరని అర్ధము. మనిషిలో పొరపాట్లు ఉన్నను నిరాశపడక సిద్ధపడవలెను. మానవుడు తనలోని నైజము వల్ల ఎన్ని గడువులు ఇచ్చిన మారనే మారడు.

ప్ర 15:1 పరలోకములో ఏడుగురు దేవదూతలు కనబడుచున్నారు. ఆ ఏడుగురి చేతులలో ఏడు పాత్రలు ఉన్నవి. హర్మగెద్దోను యుద్ధకాలమందు పెద్ద తొట్టి యోహానునకు కనబడెను. ఆ కాలమందున్న ఉగ్రతకు గుర్తుగా ఈ తొట్టె ఆ పాత్రలకు గుర్తు. లోకములో జబ్బు రాగా దాని తరువాత మరణము ఇంకేమి లేదు. గనుక తెగుళ్ళని ఉండుటలో దేవుని కోపము అంత త్రీవముగా ఉన్నది అనుటకు గుర్తు.

పాత్ర = ఉగ్రత యొక్క పాత్రకు గుర్తు.

తెగుళ్ళు = నాశనమునకు గుర్తు.

దేవుడు ఇక నా కృపను మీకు చూపను అని అనుటద్వారా నాశనము తప్పదని ఉన్నది. దేవుడు ఒకవేళ తన కృప చూపిన మనుష్యులు దేవుని తట్టు తిరగరు.

Home


ఏడు పాత్రల సూచన

ఏడు పాత్రలు:-

మొదటి పాత్ర దేవదూతలు భూమి మీద క్రుమ్మరించగా కొంత నాశనము కనబడును. అలాగే పాత్రలు పట్టుకొని యున్న దేవదూతలు ఒకరు తమ పాత్రలను భూమిపై క్రుమ్మరించుచుండగా ఏడుమార్లు ఏడు నాశనములు భూమిపైకి వచ్చును.

ఆశ్చర్యము అగు ఒక సూచన:-

పరలోకములో స్పటిక సముద్రము ఉండెను. ఇది అగ్నితో కలిసి ఉన్నట్లు ఉండెను. ఇచ్చట రెండు వస్తువులు ఉన్నవి. స్పటికము వంటిది సముద్రము. ఇది 15వ అధ్యాయములో ఉన్నది. యోహానుగాజు సముద్రమును చూచెను. ఆది 4వ అధ్యాయములో వర్ణింపబడినది. ఒక అద్దము ఉన్న ఎడల ఆ అద్దమునకు అవతల నున్న వస్తువులు తెటగా కనబడుట స్పటిక సముద్రములో నుండి చూచిన భక్తులు ఏమి చేస్తున్నారో దూతలు ఏమి చేస్తున్నారో అవన్నియు తేటగా కనబడును. సముద్రము సిం హాసనము యొద్ద నున్నది సముద్రములో అగ్ని ఉండదు. పరలోకములో అసలే ఉండదు. ఆ సముద్రము దగ్గర నుండి తెగుళ్ళు బయలుదేరి వచ్చును. ముద్రల కాలములోను బూరలు కాలములోనువున్న భక్తులు కాదుగాని పాత్రల శ్రమల కాలములో ఉన్న భక్తులు ఈ స్పటిక సముద్రములోనుండి కనబడుచున్నారు. ఈ శ్రమ కాలములోని వారు ప్రభువును వెంబడించువారై యున్నారు. గనుక అంతిక్రీస్తు వారిని నరికి వేయును. వారి ఆత్మలు స్పటికసముద్రము క్రింద ఉన్నవి.

వీరు భూలోకమునందు అగ్ని వంటి శ్రమలు అనుభవించి వచ్చినవారు గనుక అగ్నితో నిండినట్టు స్పటిక సముద్రము కనబడెను. వీరు శ్రమలోనున్నప్పుడు పరలోకము నుండి దేవుడు వచ్చి వీరిని తీసుకొని వెళ్ళలేదు. వీరికి హతసాక్షి కిరీటము నిర్ణయింప బడినది గనుక వీరి ఆత్మలు అక్కడకు వెళ్ళి దేవుడు ఎంత గొప్పవాడో అని తెలిసికొనుము. సముద్రము అనగా గొప్ప మహిమ అని అర్ధము.

"దేవా దివ్యనంత ప్రభావా" అను పాటలో మొదటి చరణము దేవ లోకములో సిం హాసనములున్నవి.

  • 1. తండ్రి సిం హాసనము
  • 2. గొర్రెపిల్ల సిం హాసనము
  • 3. నూతన యెరూషలేము సి హాసనము
  • 4. సజీవుల తీర్పురోజు సిం హాసనము
  • 5. అంత్యతీర్పు దినమందు ధవళ సిం హాసనము.

ఈ లోకములో పాపము, శరీరము, దయ్యములు ఉన్నవి . గనుక ఇవి పెండ్లి మహిమ గ్రయించుటకు అడ్డులై యున్నది. పరలోకములో ఈ మహిమ పరలోకమునకు వెళ్ళిన పిదప మనము పొంద గలిగినదై యున్నది. అప్పుడు ఆ మహిమను గ్రయించగలము. ఈ హతసాక్షులకు గొప్ప స్థితి కలదు వారు అంతి క్రీస్తు నుండి తప్పించుకొని తమ భక్తిని నిలుపుకొన్నవారు కౄఉరమృగము నుండి, ప్రతిమ నుండి దాని పేర్ట నున్న సంఖ్య నుండి వీరు తప్పించు కొన్నవారై యున్నారు. వీటికి లోబడనివారు గొప్ప జయము పొందినారు గాన పైకి వెళ్ళును.

    సేవలు రెండు.
  • 1. అనేకులు కొరకు ప్రార్ధన చేయుట దేవుని సేవ.
  • 2. గుడులలోనికి వెళ్ళి సేవ చేయుట సేవే.
వీరు శ్రమలో జయము పొందినామని వీణెలు వాయించుట కూడా సేవయే. ఈ నేలపై వీరు కీర్తనలు పాడిరి. అట్టి మోషే కీర్తన నిర్గమ కాండము 15: 1 రెండు గొఱ్ఱెపిల్ల కీర్తన.

మోషే కీర్తన:-

ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశము నుండి వేలకొలది వచ్చిరి. అరణ్య మార్గములో ప్రయాణమై పోవుచుండగా ఐగుప్తీయులు తరుముచుండగా ఎర్రసముద్రము వారికొరకు పాయలై మార్గము సరాళము చేసెను.

అందులో ప్రవేశించిన ఐగుప్తీయులు సముద్రములో మునిగి మరణించిరి. ఈ సదర్భముగా మిర్యాము ఈ కీర్తన పాడగా ఇశ్రాయేలీయులందరు ఏకీభవించిరి. పాత్రల శ్రమకాల భక్తులకు 4000 ల సంవత్సరముల క్రిందట కట్టిన ఈ కీర్తన వారికి దొరికినది, ఇది వారికి ఆత్మ తండ్రియే అంద జేసెను.

  • 1. ఫరో యెదుట దేవుడు పది తెగుళ్ళను అద్భుతములను జరిగించినారు.
  • 2. ఎర్ర సముద్రమును అద్భుతముగా దాటించినారు.

ఈ రెండును మోషే మనసులో నున్నవి. అందును బట్టి దైవాత్మ పూర్ణుడైన మోషే ఈ పాటను కట్టగా ప్రజలందరు పాడిరి. ఆ పాట దేవాలయమునకు కూడా వచ్చెను. 400 ల సంవత్సరముల శ్రమ చరిత్రను ఈ పాట మరిచిపోయేటట్లు చేసెను. ఆహా దేవుడు ఎంత శ్రమ తప్పించెనో మనమెంత ధన్యులమని సంతొషించిరి. అందులో దేవాలయము కూడా నునది. 40 సంవత్సరములు ఈ దేవాలయము గుడారములో నుండినది. సీసము కూడా ఉన్నది. సముద్రములో సీసము మునుగునట్లు హర్మగెద్దోను యుద్ధములో క్రీస్తు విరోధులు మూలుగుదురు. ఈ కీర్తన పేరు విమోచన కీర్తన. ప్రక. 7వ అధ్యాయములో 144 వేల యూదులు 12గోత్రము లోనివారు విమోచింపబడిరి. మిగిలిపోయిన వారిలో పాత్రల శ్రమ కాలములో వీరు విమోచించింప బడినవారు గనుక ఈ కాలము అంతయు ఈ పాట పాడిరి.

గొఱ్ఱెపిల్ల కీర్తన:-

ప్రభువు సైతాను యొక్క దాసత్వము నుండి రెండవ మరణమను నరకము నుండి కొందరిని విమోచించెను. ఈయన కూడా విమోచకుడై యున్నాడు గనుక ఈయన రెండవ మనిషి ఆ మొదట మనిషి ఐగుప్తు దాసత్వము నుండి ఎర్రసముద్రము నుండి విడిపించెను. శరీర సంబంధమైన లోక సంబంధమైన మేళ్ళు మోషేను బట్టి కలిగినది గాని ప్రభువు ఆత్మ సంబంధమైన అన్ని మేళ్ళు కలిగించెను.

    గొఱ్ఱెపిల్ల కీర్తన:-
  • 1. యుగ యుగముల రాజు
  • 2. నీ మార్గములు న్యాయములు
  • 3. నీ మార్గములు సత్యములు
  • 4. నీవు పవిత్రుడవు
  • 5. నీకు భయపడనివాడు ఎవడు?
  • 6. నీ నామమును మహిమ పరచని వాడు యెవడు?
  • 7. నీ న్యాయ విధులు ప్రత్యక్ష పరచబడి యున్నవి.
  • 8. జనులందరు వచ్చి నీ సన్నిధిని నమస్కారము చేసెదరు.

బైబిలులోని మొదటి గ్రంధము తరువాత గ్రంధములోని నిర్గమకాండము 15వ అధ్యాయములో మోషే కీర్తన ఉన్నది. బైబిలులోని చివరి గ్రంధమగు ప్రకటన గ్రంధములోని 15వ అధ్యాయములో గొఱ్ఱెపిల్ల కీర్తన ఉన్నది.

ప్రార్ధన:- మహిమ స్వరూపివైన తండ్రీ నీ వాక్య వివరణ కొరకు వేచియున్నాము. ఇదివరకు నీవు తోడై యున్నట్లు ఇప్పుడును మాకు తోడైయుండుము. దయ్యములను వెళ్ళగొట్టి దూతలు కావలి యుంచుము. ప్రతివారికి దైర్యము, విశ్వాసము, కలిగించు మని త్వరగా వస్తున్న ప్రభువును బట్టి వేడుకొంటున్నాము.

ప్రభువా అని ఆయనను పిలిచిరి. దేవా సర్వాధికారి అని ఆయన అధికారమును గూర్చి పాడిరి. తరువాత ఆయన క్రియలు ఘనమైనవని స్తుతించిరి. యుగ యుగములకు రాజు అనగా ఇక ముందునకు రానైయున్న కాలములో కూడా ఆయనే రాజై యుండెనని చెప్పిరి. సర్వాధికారి గనుక భూలోక మంతటికి గొప్పవాడని క్రియలను గూర్చిన స్తుతి ఘనమైనది అనియు ఆశ్చర్యము లైనదనియు స్తుతించిరి.

మార్గము = ఆయన పద్దతులు

సత్యములు-నిజముగా నుండవలసిన పద్దతులు.

ఏడు సంవత్సరముల శ్రమ కాలములో నశించేవారున్నారు. భూమి పుట్టినది మొదలు అనేకులు దేవుని నెరుగక నశించిరి. ఇది న్యాయమా అని లోకము దేవుని న్యాయమును గూర్చి అడుగుచున్నది. ఇది న్యాయమైనది అని దేవదూతలైన వారు ఎరిగిన వారై యున్నారు. దేవుడు పరిశుద్ధుడు గనుక ఆయన క్రియలును పరిశుద్ధమైనవి.

1. దేవదూతలు భూలోకము పుట్టక మునుపే దేవుడు తన స్వభావము చొప్పున పరిశుద్ధుడై యున్నాడు. 2. లోకము, దేవదూతలు పుట్టిన తరువాత ఆయన క్రియలద్వారా పరిశుద్ధుడై యున్నాడు.

పాప ప్రవేశ కాలము నుండి ఈ శ్రమ కాలమువరకు ఆయన పరిశుద్ధుడై యున్నాడు. గనుక ఆయన క్రియలు న్యాయమైనవి. మారుమనస్సు పొందిన వారిని రక్షించును. ఆయన పరిశుద్ధుడై యున్నాడు గనుక మార్పు చెందనివారిని శిక్షించును. ఇదే పరిశుద్ధత ఆయన పరిశుద్ధుడు గనుక భూనివాసులైనవారు ఆయన యందు భయపడుచున్నారు. "నీ నామమును మహిమ పరచని వాడెవడు" మారుమనస్సు పొందక నరకమునకు వెళ్ళిన వారిని బట్టి దేవుని నామమునకు మహిమరాగలదా? మారుమనస్సు పొందినవారివల్ల ఆయనకు మహిమ వచ్చును. శిక్షించిన వారివల్లకూడా వచ్చును. ఉదా:- జడ్జిగారు నేరముచేసినవారిని శిక్షించును. శిక్ష నొందిన నేర్స్థుడు నేను తప్పు చేసినాను గనుక జడ్జిగారు న్యాయము జరిగించినాడు. అని అనును. అదే ఘనపర్చుట నీతిమంతులకు అందరును భయపడవలెను.

ఫ్రాంక్లిన్ దొరగారు ఒక ఊరువచ్చి ఆ ఊరి నివాసులైన ఒక దంపతులకు 100 రూపాయలు ఇచ్చి నేను మరలా వచ్చి తీసుకొంటాను అనెను. తిరిగి వచ్చి ఆ డబ్బు ఇమ్మని అడుగగా వారు మాకు తెలియదనిరి. సాక్షులు లేరు. ఆ దొరగారు జడ్జిగారికి ఈ సంగతి తెలియజేసెను. జడ్జిగారు ఫ్రాంక్లిన్ దొరగారి మీద కోపపడి ఆ నేర్స్తులను కోర్టునకు పిలిపించినారు. జడ్జిగారు దొరగారి యెదుట నేర్స్తుని పెట్టి అడుగగా వారు మాకు తెలియదనిరి. జడ్జిగారు భర్తచేత ఒక ఉత్తరము వ్రాయించెను అది తనభార్యకు వ్రాయించెను. ప్రియమైన భార్యకి ఫ్రంక్లిన్ దొరగారు డబ్బు ఇచ్చినప్పుడు నీవు కూడా ఉన్నావుగదా ఆ దొరగారు ఇచ్చిన 100 రూపాయలు ఈ ఉత్తరము తెచ్చు బంట్రోతు చేత పంపించు అని వ్రాసి పంపెను. ఆ బంట్రోతు ఆ నేర్స్తుని భార్య దగ్గరకు వెళ్ళెను. ఆ ఉత్తరము చూపించగా తన భర్త ఇక్కడ ఇవ్వలేదని బొంకి కోర్టులో ఇచ్చినానని ఒప్పుకొన్నాడేమో అని అనుకొని భార్య ఆ డబ్బు ఇచ్చివేసెను. ఆ నేరస్తుడు జడ్జిగారి జ్ఞానమును కొనియాడి జడ్జిగారిని ఘనపరచెను. శ్రమకాలములో నేర్స్తు లందరు దేవునిని ఘనపరిచే దినము ఒకటి రానై యున్నది.

    దేవునిని ఘనపర్చు స్తుతులు రెండు రకములు
  • 1. నీవు న్యాయ వంతుడవు
  • 2. అందరు నిన్ను ఘనపర్చుదురు.

దేవదూతల స్తుతిలోని ముఖ్య మాటలు ఈ రెండునై యున్నవి. ఈ రెండు మాటలు కూడ విశ్వాసులు న్యాయమును అన్యాయమును అనుభవించుచున్నప్పుడు తలపోసికొన వలసిన మాటలు.

    ప్ర క. 15:6
  • 1. గర్భాలయము ఉన్నది.
  • 2. రాయి ధరించుకొనిరి.

నిర్మలమును, ప్రకాశ మానమునై యున్నవి. గర్భాలయములో నుండి శ్రమ కాలములో శిక్షించునట్టి ఏడుగురు దేవదూతలు భయటకు వచ్చిరి. సైతాను యొక్క స్థానము వాయు మండల లోకము అక్కడ నుండి సైతానును, దయ్యములును, వ్యతిరేకముగా తిరుగుబాటుకై వచ్చిరి. అయితే దేవదూతలు గర్భాలయములోనుండి వచ్చిరి. వారు నిర్మలమైన రాయి ధరించుకొన్నవారు ప్రభుత్వపువారు ఎవరైనా, యేది అయినా ప్రత్యేకమైన కార్యములు చేసిన, లేక సాహస కృత్యములు చేసినవారికి ఒక మెడలు ఇస్తారు. ఆ మెడలును బట్టి వారు ప్రజల యొద్దకును పర్చబడుదురు.

    1. అవిశ్వాసులకు ఏడు విధములైన శిక్షలు విధించుటకై
    • 1. అధికారము
    • 2. హక్కు
    • 3. స్వతంత్రత గలవారై యున్నారు.
    వీరు వెలుగు రాజ్య సంబంధులు.
  • 2. విశ్వాసులును శోధించుటకు సైతానువల్ల
    • 1. అంతిక్రీస్తు
    • 2. అబద్ధప్రవక్త
    • 3. కప్పలు, అధికారము పొందియున్నారు.
వీరిది అంధకార రాజ్యము.
  • 1. దేవదూతల అధికారము:- వీరి అధికారము నిర్మలమైనదియు, ప్రకాశమానమైనదియునై యున్నది.
  • 2. దయ్యముల అధికారము :- వీరి అధికారము మలినమైనదియు, చీకటి సంబంధమైనదియునై యున్నది.

జీవులు అనగా=ప్రాణము గలవి అని అర్ధము, నాలుగు జీవులలో ఒక జీవి. యుగ యుగములు జీవించు దేవుని కోపముతో నిండియున్న ఏడు బంగారు పాత్రలును ఆ ఏడుగురు దూతల కిచ్చెను. ఆ ఏడు బంగారు పాత్రలు దేవుని కోపముతో నిండియున్నవి. ఈపాత్రలు బంగారు పాత్రలు, ఆ జీవుల పని ఏమనగా ప్రార్ధనలు చేయుట, దేవుని ఎదుట స్తుతి చెల్లించుట. వీరి ముఖ్య సవరము ప్రభువా లోకములో ఉన్నవారిని రచించుము అనునదియే. లోకములోని ఏ జీవికి కూడా హానిచేయవద్దు అనియే వారి స్వరమై యున్నది. ఈ నాలుగు జీవులు దేవుడు చేసిన సృష్టి నంతటికొరకు నాలుగు భాగములుగా పంచుకొని దేవుని యెదుట ప్రార్ధించి స్తుతించిరి. వీరి పక్షముగా అనగా మిగిలిపోయినవారి పక్షముగా దేవుని వేడుకొనగా వారు వినలేదు. గనుక ప్రభువా ఎంత ప్రార్ధించినా వారు వినలేదు గనుక ఇక మీదట శిక్షించుమని చెప్పి ఇప్పుడు వారిచేతులలో ఉన్న ఆ బంగారు పాత్రలను దూతల చేతికి అప్పగించిరి. వారు యెల్లప్పుడు రక్షణ కోరేవారే. ప్రార్ధనచేసేవారు. శిక్షను తొలగించెవారు దేవుని మహిమ అగ్నివంటిది. ఇదివరకు ఆ మహిమ చల్లగానున్నవి. ఇప్పుడు చాలా వేడిగానున్నది. ఎవరు ఎదుర్కొనలేరు. ఇదివరలో మూడు జీవుల పని అయిపోయినవి. నాల్గవ జీవి ఇప్పుడు వచ్చెను.

ప్రకటన 5వ అధ్యాయములో ప్రార్ధన పాత్రలు ఉన్నవి. 15 అధ్యాయములో శిక్ష పాత్రలు కనబడుచున్నవి. ప్రార్ధన యొక్క పాత్రలు ఆశ్రమ కాలములోని జనులు అంగీకరించనందున శిక్ష పాత్రలు రావలసి వచ్చెను. దేవుని కృపను లోకువ కట్టినారు. దేవుడు గడువులపై గడువు ఇచ్చినను వారు మారలేదు. దేవుని మహిమలో నుండి వచ్చు చలువను త్రోసి పుచ్చిరి గనుక అవిశ్వాస్లు శిక్ష అనుభవించుటకు సమయము దాపరించినది. ముందు ఉన్న ఆ మరణం మనుష్యులను కాపాడుటకు ఇప్పుడు ఉన్న ఈ బలము మనుష్యులును నాశనము చేయుటకును వచ్చెను. ఇది ఆయన శక్తి.

పొగ:- ఈ పొగ దేవుని కోపమును చూపించుచున్నది. ఇది వరకు ఉన్న పొగ దేవుని తన మహిమ శక్తి కొండమీద కనపర్చెను. ఆ మహిమ అగ్ని రూపములో పొగవలె కనబడెను. ఆ అగ్ని మోషేను కాల్చివేయ లేదుగాని మోషేను కాపాడెను. కొండ చుట్టు నున్న ఇశ్రాయేల్లీయుల ప్రజలు ఆకొండలు ముట్టుకున్న చనిపోయిరి. పొగవటి ఆ మహిమకు ఇశ్రాయేలీయులు తాళ లేకపోయిరి. ప్రభువు కాలములో 12 సంవత్సరముల నుండి రక్తశ్రావముతో బాధపడుచున్న ఆస్త్రీ ప్రభువును ముట్టుకొనగా బాగుపడినది. ప్రభువులోనుండి ఆ ప్రభావము స్త్రీలోనికి ప్రవేశించినది. కొండమీద మోషేకు చలువైనది ప్రభువు కాలములో రకశ్రావము గలిగిన స్రీకి చలువైనది గనుక బాగైనది.

అరణ్యములో ప్రత్యక్షపు గుడారమును మోషే నిర్మించెను. ఆ గుడారములోనికి ఇతరులు ఎవరును ప్రవేశించలేకపోయిరి గాని సొలోమోను వెళ్ళ్గలిగెను.

రాజుల కాలములో దైవ ఏర్పాటును బట్టి సొలోమోను గుడికట్టెను. అందులోనికి దేవుని మహిమ ప్రవేశించెను. అది అందరును చూచి సంతోషించిరి గాని ఎవరును లోపలికి వెళ్ళలేకపోయిరి.

రూపాంతరపు కొండపై ప్రభువు సూర్యకాంతి వలె ప్రకాశించెను. అట్టి మహిమను చూచిన ప్రభుని శిష్యులు బోర్ల పడిపోయిరి. వారు ఆ మహిమను చూడలేకపోయిరి.

మార్కు సువార్తలో ప్రభువు ఉత్తర ప్రయాణము చేయుచుండగా అకస్మికముగా ఆయన మహిమ వలె మెరయగా అందరూ ఒక ప్రక్క వత్తిగిలి పడిపోయిరి.

గెత్సెమనే తోటలో ప్రభువును పట్టుకొనుటకు వచ్చిన బంట్రోతులు ఆయన మహిమకు తాళలేక పడిపోయిరి.

ప్రకటనలో యోహాను కూడా ఆ మహిమకు తాళలేక చచ్చినవానివలె పడిపోయెను ఏ మహిమకు ప్రజలు పడిపోయిరో ఆ మహిమలోనే పెండ్లికుమార్తె సంచరించును.

దేవుని కోపము పరిపూర్తి అగువరకు ఎగురును గర్భాలయములో ప్రవేశింపలేరు.

ఉదా:- మండు వేసవిలో మధ్యాహ్న సమయమందు ఆ ఎండను ఎవరు సహించలేరు. మిక్కిలి చలికాలంలో ఎక్కువ చలిని కూడా మనుష్యులు సహించలేరు. అలాగే చల్లని మహిమ కాంతిని వేడిగానున్న మహిమ కాంతిని కూడా భూప్రజలు సహించలేరు.

ప్రార్ధన:- దయగల ప్రభువా నీమహిమ కాకతికి యెవరూ తాళలేక పోయిరి. సినాయికొండపై మోషేను తగురీతిగా సిద్ధపర్చి నీ మహిమ కాంతిలో ఉండ నిచ్చినావు. మమ్ములను కూడా మీ మహిమ కాంతికొరకు తయారుచేయుమని త్వరగా వచ్చుచున్న ప్రభువుద్వారా వేడుకొనుచున్నాము.

ప్రక 15:6

ఏడు తెగుళ్ళు చేత పట్టుకొని యున్న ఆ ఏడుగురు దూతలు రొమ్ముల మీద బంగారు దట్టీలు కట్టుకొన్నవారై ఆలయము నుండి భయటకు వచ్చిరి. వీరు బంగారుదట్టీలు ధరించినట్లుగా కనబడుచున్నది. పాతనిబంధన కాలములో యాజకులైనవారు ఆలయమునకు వచ్చునప్పుడు రొమ్మున దట్టీ కట్టుకొని వచ్చేవారు. ఈ దూతలు ఆ రీతిగా వచ్చియున్నారు. చర్చి, మిషనులో పాదిరిగారు నడుమునకు త్రాడు కట్టుకొందురు. బాప్టిష్టు మిషనువారు అసలు అంగీ వేసికొనరు. ఈ అచారములు ఎందుకని అంటారు లూథరన్ మిషన్ వారు, మోషే కాలములోని యాజకులైనవారు అంగీ వేసుకొన్నారు. గనుక మనము వేసికొనవలెనని అందురు. పాదిరిగార్లు తమ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనవలెను. భూలోక పాదుర్ల పని ఏమి? పాదుర్లు దేవునికి మనిషికిని మధ్యవర్తిగా ఉండవలెను. ప్రజలకు బోధ చేయవలెను. ప్రజలు తమ ప్రవర్తనను సరిచేసికొన్న మోక్షము, లేనియెడల నరకము అని చెప్పవలయును. ఆపైన ఏర్పర్చిన ఆచారము అన్నింటిని అనగా బాప్తిస్మము, సంస్కారము మున్నగు పనులన్ని జరుపుటయై యున్నది. ఇవన్ని చేసిన దేవునిని నమ్మిన ఎడల రక్షణ. నమ్మకపోయిన శిక్ష అని చెప్పవలయును. పరలోకములో నున్న దేవదూతలు కూడా దానినే చెప్పుదురు. మీరు నమ్మలేదు గనుక మీకు శిక్ష అని చెప్పుటకు దిగివచ్చియిమని చెప్పుదురు. బోధించుటకు, కాపాడుటకు ప్రార్ధించుటకు, నడిపించుటకు మేము ఇప్పుడు రాలేదుగాని శిక్ష వినిపించుటకు వచ్చి యున్నామని చెప్పుదురు. ఈ దూతలు బంగారు దట్టీ కట్టుకొని యాజక రూపము ధరించుకొని శిక్షించుటకు వచ్చిరి.

Home