17వ అధ్యాయము - Kingdom of Antichrist

పరిచయము

    దూత: (7గురిలో ఒకడు)
  • రమ్ము
  • జలవేశ్య తీర్పుచూపెద
    • ఎ. రాజులు వ్యభిచరించిరి
    • బి. భూనివాసులు|| మత్తులు||
యోహాను: ఆత్మవశము : అరణ్య
1) మహావేశ్య:
  • ఎ. దేవుని దూషణపేర్లు
  • బి. 7 తలలు
  • సి. 10 కొమ్ములు
  • డి. ఎర్రమృగముపై
2) దానిధారణ ఎ. ధూమరక్తవస్త్రం
అలంకారం
  • ఎ ఎ. బంగారం
  • బి బి. రత్నములు
  • సి సి. ముత్యములు
    3) సువర్ణపాత్ర :
  • ఎ. ఏహ్యకర్య
  • బి. వ్య. అపకార్య

4) నొసలు : పేర్లు:

వేశ్యలకు

ఏహ్య
  • ఎ. మర్మము =
  • బి. తల్లి
  • సి. మహాబాబేలు
    5) మత్తు
  • : ఎ. పరిశుద్ద రక్త
  • : బి. యేసు హతసాక్షుల రక్తం

ఆదూత: నీవే ఆశ్చర్యపడితివి

1) స్త్రీ మర్మమును

ఎ.
  • 7 తలలు
  • 10 కొమ్ములు
  • మోయు
కౄరమృగ-మర్మ

= మృగ: ఎ. ఉండెను

బి. ఇప్పుడులేదు

సిద్ధము= పాతాళమునుండు వచ్చు

బి. నాశనముకు పోవ

2) జీవగ్రంధ
    పేరులేనివారు
  • ఎ. ఉండెను
  • బి. లేదు
  • {సి. వచ్చును
ఆశ్చర్య

ఇందులో జ్ఞానము

  • 7 త = 7 కొండలు
  • 7 రాజులు
  • 5 గురు కూలిరి
  • ఒకడున్నాడు
  • 7వ లేదు
  • N.B : వచ్చి కొద్దికాలముండు
  • మృ. 7 గురిలో 8వ వాడు
  • 10 కొమ్ములు = 10 రాజులు
కౄర. మృగాధికార
బల

అధికార
  • అప్పగింతు
  • N.B: మృ __ కౄ

యుద్ధము:

  • 1 గొర్రెపిల్ల
    • 10 రాజు
    • ఎ. ప్రభువులకు రాజు
    • బి. రాజులకు రాజు
    • 2. సైన్య:
    • ఎ. పిలువబడి
    • బి. ఏర్పర్చబడి
    • సి. నమ్మకస్తులు

దూత:

జలవేశ్య:
  • ఎ. ప్రజ
  • బి. జనసమూహ
  • సి. జన
  • డి. భాష

ఆ వేశ్యను : వారు

  • ఎ. ద్వేషించి
  • బి. దిక్కులేనిది
  • సి. దిగంబరి
  • డి. మాంసభక్ష
  • ఇ. కాల్చివేతురు

N.B: దైవసంకల్పన

N.B: ఆ. స్త్రీ = భూరాజ మహాపట్నం

క్రైస్తవ విశ్వాసులు పారమార్ధికముగా సంఘమును స్త్రీనిగాను పెండ్లి కుమార్తెగానుసంబోధించుచున్నారు. అలాగే ప్ర.క. 17:1లో దుష్టసంఘమునకు వ్యతిరేక సమాజమునకు వేశ్య అనుపేరు ఉన్నది. వేశ్య అనగా సైతాను సంఘము. భూరాజులు ఆమెతో వ్యభిచరించిరి అని వ్రాయబడియున్నది దీనికి సంఘము. భూరాజులు ఆమెతో వ్హ్యభిచరించిరి అని వ్రాయబడియున్నది దీనికి రెండు అర్ధములున్నవి.

  • 1. లోకములో భర్తకు వేరైపోయినవారు వ్యభిచరించువారు.
  • 2. పారమార్ధిక విషయములలో దేవునికి యెడమైపోయిన భక్తులైనవారు
వేరై పోయినందున వ్యభిచరించువారైరి. అనగా పారమార్ధిక విషయములను విడిచి లౌకిక విషయములో మునిగి పోయిరి.

ప్రక 17:1 ఆ స్త్రీ విస్తార జలముల మీద కూర్చుండెను.

స్త్రీ అనగా స్త్రీ కాదు నీరు అనగా నీరు కాదు పాత్ర అనగా పాత్రకాదు

వస్త్రము అనగా వస్త్రము కాదు మూడు విధములైన అర్ధములున్నవి.

  • 1. ఆత్మార్ధము.
  • 2. అంతరార్ధము.
  • 3. లౌకికార్ధము

దేవుని వాక్యము చెప్పుకొనునప్పుడు ఆత్మార్ధము అవసరము. అంతరార్ధము, లౌకికార్ధము కలిసియున్నవి. అంతరార్ధము లౌకిక విషయములలో తెలిసికొనవలెను.

జలములపైన్నున్న ఆస్త్రీ స్థితి అంతా ఏడుసవత్సరముల పరిపాలనలో పూర్తిగా జరుగును. ఏడవ పాత్రకాలములో శిక్షలేదుగాని నాశనమున్నది. ఇప్పుడు లోకములో అక్కడక్కడ భయంకరముగా శిక్ష కనబడుచునే యున్నది. అలాగే నాశనముకూడా జరుగుచున్నది నోవాహు కాలములో శిక్షకాదు గాని నాశనమే. అలాగు ఏడు సంవత్సరముల కాలములో ఈ స్త్రీ విషయములో శిక్షకాదుగాని నాశనమే జరిగెను.

  • 1. అన్నిమతములలోనివారికి తెలిసినంతవరకు భక్తులున్నారు. భక్తి హీనులున్నారు.
  • 2. క్రైస్తవ మతములో కూడా భక్తులు. భక్తిహీనులున్నారు. 3. క్రైస్తవ మిసహనులో కూడా భక్తులు, భక్తిహీనులున్నారు.

ఈ మూడు తరగతులలోని భక్తిహీను లందరిని కలిపిన యెడల ప్రకటన 17వ అధ్యాయములోనికి వచ్చెదరు ప్ర.క. 4:1లో ఇక్కడకు ఎక్కిరమ్మని యోహాను నకు స్వరము వినబడెను. అలాగుననే ప్రక. 17:1లో కూడా ఇక్కడకు ఎక్కి రమ్మని యోహాను నకు స్వరము వినబడెను నూతనమైన విషయములు బైలుపరచబడినప్పుడు ఇలాగు వ్రాయుట అలవాటు. సంఘమనె స్త్రీ పరిశుద్ధమైన స్త్రీ లౌకిక స్త్రీ అపవిత్రమైన స్త్రీ జలముల మీద కూర్చుండి యుండెను. అనగా లౌకిక మనే ఈ అపవిత్రతగల స్త్రీ ప్రజలందరిమీద రాణిగా నుండి యేలుబడి చేయుచున్నది.

సమాప్తములు మూడు
  • 1) దేవుని కృపకు సమాప్తము.
  • 2) చెడునకు సమాప్తము
  • 3) వేశ్యకు సమాప్తము.

భూమిమీద వధువు సంఘమున్నది. వధువు సంఘమునకు క్రీస్తు అనే వరుడున్నాడు. వారికి ఒక పట్టణమున్నది ఈ పట్టణమేనూతన యెరూషలేము అలాగుననే వేశ్యసంఘమున్నది. దానికి అంతిక్రీస్తు అనే వరుడున్నాడు వారికి బబులోను అను పట్టణము ఉన్నది.

ఉద:- బలమైన వర్షమునకు భూమిమీద నున్న చెత్తాంతా ఒక చోటికి పోగైనట్టుగా ఏడు ఏండ్ల శ్రమ కాలములో కొందరు అవిశ్వాసులు పాతాళమునకు పోగా కొందరు విశ్వాసులు మోక్షమునకు పోగా మిగిలియున్న చెత్త అనే అవిశ్వాసులు ఏడవ పాత్ర కాలమునకు వచ్చిపోగైరి. అదియే పదియవ రాజ్యము. వడ్లు ధంచి, జల్లెడపట్టి, మరలా మరలా వడ్లు ధంచి మిగిలిపోయినవాటిని పారవేసినట్లుగా ముద్రల కాలములో జల్లించగా మిగిలినవి భూరల కాలములో జల్లించగా ఆమిగిలినవి ఆరు పాత్రల కాలములో పోసి మిగిలినవి ఏడవ పాత్ర కాలములో చెత్తగా కూర్చబడెను. ఏడు సంవత్సరముల శ్రమల కాలములో మార్పుపొందని వారి విషయమే రెండుకఠినమైన మాటలు వాక్యగ్రంధమందు వ్రాయబడియున్నది. ప. క. 16:19 ప్ర.క. 16:21 మన కాలములోనే దేవుని దూషించువారు ఉన్నారు. శ్రమ కాలములోను దేవుని దూషించువారు ఉన్నారు. దేవుని కుమారుని ఒప్పుకొననివారు అంతిక్రీస్తులును అబద్ధ ప్రవక్తలును అగుదురు. దేవుని కుమారుని ఒప్పుకొననివారు దేవుని ఒప్పుకొననట్టె. యేసు దేవుని కుమారుని అవతారమని మనమునమ్మవలయును. దేవుడు మా కంటికి కనబడవలయునని భూజనుల కోరిక. అట్టి జనుల కోరికను బట్టి దేవుడు క్రీస్తు అను నరావతారమెత్తి భూలోకమందు ప్రత్యక్షమాయెను. శ్రమలు కలుగుటను బట్టి నరునికి నమ్మికపుట్టదు నమ్ముటకు ఈ లోకములో అవకాశములున్నవి సృష్టి యావత్తు నరునికొరకు ఏర్పరిచిన సదుపాయములె, సదుపాయములతోపాటు భూలోకమునందు శ్రమలుకూడా నున్నవి. శ్రమల కంటె దేవుడిచ్చిన దానములె ఎక్కువ. గనుక అవతారపురుషుడైన యేసును నమ్మవలెను. ఆయన మనకిచ్చిన సదుపాయములను నమ్మగలిగిన ఆయనను నమ్మినట్లే అనుగ్రహించిన సదుపాయములనుబట్టి నమ్మిక ఎక్కువ చ్వసికొనవలెను. పాపములను బట్టి శ్రమలు వచ్చెను. శ్రమలు ఒకమేలె అని శ్రమల యందు ఆనందించవలయును. చూచి నమ్మినవారు ధన్యులు చూడక నమ్మినవారు ఇంకా ధన్యులు. కనబడినప్పుడు శరీర కంటిని ప్రభువు తృప్తి పరచును కనబడక పోయినా విశ్వాస నేత్రమునకు ఈ దినములలో ఆయన కనబడును. గనుక తృప్తి నొందవలెను.

  • 1. వేశ్య.
  • 2. వేశ్యజనము
  • 3. వేశ్యపట్టణము

ఇవి ఏడవ పాత్రలో నున్నవి, మత సంబంధ విషయములో క్రీస్తు ప్రభువునకు పెండికుమార్తె యున్నట్లు ఆత్మ సంబధ దేవుడు ఆత్మయెయున్నాడు గనుక దేవదూతలు కూడ ఆత్మస్వరూపులై యున్నారు. సంఘము ఆత్మ సంబంధమైనది. బైబిలు ఆత్మ సంబంధమైనది. అలాగే సైతాను సైతాను దూతలు కూడ ఆత్మలే వీరి జీవితము దురాత్మ జీవితమే, గ్రంధము దురాత్మ జీవితమే. ఆజ్ఞలు దురాత్మ జీవితమే వాని నివాసము దురాత్మ సంబంధమైననివాసము. దీనికి మతమున్నది అది లౌకిక దురాత్మ. మతము కలిపిన వేశ్య.

ఒక దరినుండి క్రీస్తు మతమును సాతాను (అంతిక్రీస్తు) మతము ప్రబలును ప్రపలిన ఈ మతములు ఏడవ పాత్ర యొద్ద సమాప్తి అగును. సమాప్తి అని యోహాను వ్రాసెను. క్రీస్తు మతముగా పెండ్లికుమార్తె సంఘము ఇది ఒకటవ శతాబ్ధమున ప్రారంభింపబడినది. అప్పటినుండి 20వ శతాబ్ధములో రేప్చర్లో ఈ సంఘము వెళ్ళిపోయినది. దీనినే సంఘారోహణము అని అందురు. ప్రకటన 17వ అధ్యాయములో సాతాను సమాజపువారు పాతాళ లోకమునకు అవరోహణము అయిపోదురు. వీరినే వేశ్య సంఘమని అందురు.

క్రెస్తు సంఘము మేలిమి సరుకు. సజీవులుగా ఆరోహణమైన రీతిగానే వేశ్య సంఘములో కూడా అసలైన చెత్త సరకు సజీవులుగానే పాతాళమునకు వెళ్ళిపోవుదురు. అన్ని మతములలోని చెత్త సరుకు సజీవులుగానే పాతాళమునకు దిగిపోదురు. అన్ని మతములలోను మేలిమి భక్తులు తయారై క్రీస్తును అంగీకరికరించి పెండ్లికుమార్తెగా తయారగుదురు. ఏడు సంవత్సరముల పాలన వచ్చునప్పటికి అప్పుడున్న ధనము, ఉపాయములు, జ్ఞానము, విమానములు, యుకులు అన్నియును చెడ్డ సంబంధమైనవియై యుండును. సాతాను యొక్క శక్తి వృద్ధియగును. ప్రకటనలో 6వ అధ్యాయము నుండి ఆరంభమైన సాతాను శక్తి 16వ అధ్యాయము ఏడవ పాత్ర సమాప్తము వరకు వృద్ధి అయ్యెను.

పాతనిబంధనలో ముఖ్యమైన పరిశుద్ధసంఖ్య ఏడు. దేవుడు సృష్టిని కలుగ చేసి ఏడవ దినమందు విశ్రమించెను. ఇశ్రాయేలియులు ఏడవదినమును విశ్రాంతి దినముగా ఆచరించిరి. అలాగే సైతాను విషయములోను ఏడు సంవత్స్రములు శ్రమలు, ప్రకటనలోని కౄరమృగము నకు యేడు కొమ్ములు యేడు తలలు ఉన్నట్లుగా యోహాను చూచెను. అన్ని మతములలో నున్న తపుడు సిద్ధాంతములు రెండు 1. దేవునికి నామము, లేదనియు, 2. దేవునికి అపకారము లేదనియు బోధించెదరు. ఈ రెండును కలిపితే వేశ్య. క్రీస్తు సత్ పురుషుడు ప్రవక్త అని అన్న యెడల ఒప్పుకొందురు గాని దేవుడు, రక్షకుడు అని అంటే అసలు ఒప్పుకొనరు.

ఒక హిందువుడు లోకములోని సజ్జనులందరిని వరుసగా మెట్లమీద కూర్చుండ బెట్టి పై మెట్టుమీద క్రీస్తును కూర్చుండ బెట్టెను. ఈ రీతిగా వారు ప్రభువును సజ్జనుల వరుసలో చేర్చుదురు గాని దేవుడు అనిన ఒప్పుకొనరు.

నాస్థికులు

సంఘారోహణ కాలము ఒకప్రక్క దగ్గర పడుచుంటే ఈ కాలమునందు నాస్థికులు ఎక్కువగగుచున్నారు. రేప్చర్ దగ్గర పడిన కొలది రేప్చర్ శక్తి సంఘములలోనికివచ్చి సంఘములోనివారు సిద్ధపడుమని చెప్పుచుందురు.

  • 1) ఏడు సంవత్సరముల పాలన దగ్గరపడుచున్నందున దానిశక్తివచ్చి దేవుని నామములేదని. దేవుడే లేడని కొందరు చెప్పుదురు.
  • 2) దేవుడు లేడని అనుటకు వీలులేదుగాని ఉన్నాడు గాని ఆయనకును మనకును ఎట్టి సంబంధము లేదని అకాలమున కొందరు అందురు.
  • 3) దేవుడు ఉన్నాడు, కొందరిని బాగుగా చూచునుగాని నన్నేమిచూచును అని కొందరు నిరాశచెంది అందురు.
  • 4) దేవుడున్నాడు కష్టము రాగనే లేడని అందురు. ఇది నాస్థికత్వము.
సగము నాస్థికత్వము నిండు నాస్థికత్వము
  • 1. దేవుడు లేడు
  • 2. అవతారము లేదు
  • 3. దేవదూతలు లేరు
  • 4. మోక్షములేదు
  • 5. పరిశుద్ధులు లేరు
  • 6. బైబిలు లేదు
  • 1. సాతాను లేదు
  • 2. పాపము లేదు
  • 3. దయ్యములులేవు
  • 4. నరకములేదు
  • 5. పాపులు లేరు
  • 6. చనిపోయినవారీఅత్మలు
    గాలిలో కలిసిపోవును.

ఒక ప్రక్క సముద్రమున్నది మరియొక ప్రక్క కొండయున్నది, సముద్రములో ఓడ యున్నది ఈ ఓడ కొంద దగ్గరకురాగా ఇంజనుశక్తి లేకుండగనే గబగబా నడుచును. దీనికి కారణము ఓడకు ఎదురుగా సూదంటు రాయి కొండ యున్నది. ఓడలో అక్కడక్కడ ఇనుము ఉండుట వల్ల త్వరగా వెళ్ళి ఆసూదంటు రాయి కొండకు కొట్టుకొని నాశనమై పోవును గనుగ పైరెండు విషయములను బట్టి చూడగా సైతాను శక్తి నరులను ఆకర్షించి నాశనము చేయును, ఇండియా దేశములో దేవుడున్నాడని ప్రతివారు ఒప్పుకొందురు గాని పాశ్చాత్య దేశములో దేవుడు లేడను నాస్థికులు అనేకులున్నారు.

యోహానునకు రెండు ప్రత్యక్షతలు కలిగినవి.
  • 1. ఇదిగో పెండ్లికుమార్తె సిద్ధపడెనని చూపించెను.
  • 2. పెండ్లికుమార్తె సంఘమునకు వ్యతిరేకముగా వేశ్య సంఘమును కూడ దేవుడు యోహానుకు చూపెను.

దేవుడు ఒకేమారు భూమిని నాశనముచేయుట న్యాయ విరుద్ధమని ఆగెను.

ప్ర.క. 17:3 ఇక్కడ ఒక క్రొత్త సంగతిని యోహాను గమనించెను పరలోక విషయములను యెక్కువగా చూచు నిమిత్తము యోహాను ప్రార్ధనలో యుండెను పిమ్మట యోహాను ఆత్మ వశుడయ్యెను యోహాను ప్రకటన మొదటి అధ్యాయములో ఆత్మ వశుడై మంచివిషయములను చూచెను. ఇక్కడ ఆత్మవశుడైన యోహానుకును ఎఱ్ఱని మృగము కనబడెను. అనగా హతసాక్షుల యొక్క రక్తము త్రాగి ఆ మృగము ఎఱ్ఱగా నున్నది. ఆ రక్తము చేత ఈ మృగము మత్తిల్లియుండెను. మనుష్యుల రక్తము త్రాగిన లేత నల్లి ఎఱ్ఱగా కనబడెను.

మృగము మీద కూర్చుండుట: కొందరు పెండ్లికుమార్తెను నడిపించుచు ఊరేగుదురు. మరికొందరు గుర్రము మీద ఎక్కించి ఊరేగుదురు. ఈ వేశ్య మృగము మీద ఎక్కి ఉరేగుచున్నది అనగా ఈ వేశ్యకు గల కౄరత్వము, గర్వము ఎక్కువైనది గనుక ఎక్కి కూర్చుడెను. ప్రక. 17:4 ఆ స్త్రీ ధూమ్ర రక్తవర్ణము గల వస్త్రము ధరించుకొని బంగారముతోను, రత్నములతోను ముత్యములతోను అలంకరింపబడియున్నది.

క్రీస్తు ప్రభువులు వరములు అనే ఆభరణములతో వధువు సంఘమును అలంకరించును. అలాగే ఈ వేశ్య కూడ లోకముతో అలంకరింపబడియున్నది. ఆ వేశ్య చేతిలో సువర్ణ పాత్ర ఉన్నది. ఈ పత్ర బాహాటమునకు మెరయుచున్నది. గాని లోపల యేహ్య కార్యములతోను, అపవిత్ర కార్యములతోను నిండియున్నది. ఆ స్త్రీ నొసట మర్మమనియున్నది. దేవుని పేరు భక్తులు తమనొసట చేయించుకొందురు. దానికి వ్యతిరేకముగా ఈ స్త్రీ తన నొసట మర్మమని వ్రాయించుకొనెను. ప్రకటన మర్మమైనదే గాని భక్తుడైన యోహానునకు ఇవి వివరింపబడియున్నది. చదివినకొలది అర్ధమగును అలాగే వేశ్య విషయములో అన్నియు మర్మమే బహిరంగమునకు అలంకరించుకొన్న రీతిగ కనబడుచున్న దాని వెంబడించుచున్నవారికి వెనుక నాశనమున్నది ఎండాకాలములో పైకి మంచి నీటివలె ఎండమావులు కనబడును. అలాగే వేశ్య క్రియలన్నియు పైకి మంచిగ కనబడుచున్న తరువాత నాశనమే వారి అంతము.

ఆ స్త్రీ పరిశుద్ధుల రక్తము చేత మత్తిల్లియున్నది (17:6) లోకానుభవమునుండి క్రీస్తు రాకవరకు దేవుని నమ్మిన భక్యులున్నారు. వారిని పిచాచి చంపించెను. ఏదేను తోటలో హేబేలును పిచాచి చంపెను ప్రభువు వచ్చువరకు ఈ రీతిగా చనిపోయిన వారిని పరిశుద్ధులు అని అందురు. యేసుయొక్క హతసాక్షుల రక్తమని యున్నది. క్రీస్తు పిమ్మట సంఘ స్థాపన కాల ఆరంభములో సాతానుడు అనేకులను శ్రమ పెట్టి క్రీస్తు భక్తులను చంపించెను. వీరు క్రెస్తువచ్చిన తరవాత చంపబడిన వారై యున్నారు వీరు హతసాక్షులు. ఆ స్త్రీ వీరి రక్తముచేత మత్తిలియుండెను. అనగా వీరి రక్తమును బట్టి సమృత్ప్తిచెందెను. క్రీస్తు మతమును పాడుచేయుచు భక్తులను చంపుచున్నాననే సంతోషముతో ఆ వేశ్య మత్తిల్లెను.

రోమన్వారు రంగు వస్త్రములు వేసికొందురుదానినిబట్టి కొందరు ప్రొటస్టెంట్లు వేశ్యకున్న వస్త్రములను బట్టి ఈ వేశ్య రోమన్ కేథలిక్ వారు ఎక్కడికైనా వెళ్ళినపుడు ప్రభువు భోజన రొట్ట్తె మోసికొని వెళ్ళుదురు. రొట్టె సిలువ, పాత్ర మోసికొని వెళ్ళుదురు ఎవరైన అడిగితే ఇవి అప్పటి కాలములోనివి అని అందురు వీటిని మోయుట పైనున్న వాటిని మోయుటకు గుర్తు అని అందురు.

బబులోను:- అనగా ఆదికాండములో షినారు మైదానములో కట్టిన గోపురము ఇది రాజులు పరిపాలన చేసిన స్థలము వేశ్య అనగా మత సిద్ధాంతము. షీన్యారు మైదానములో ఆకాలపు ప్రజలు ప్రపంచ ప్రభుత్వము నెలకొల్పవలెనని ప్రయత్నిచిరి. ఈ బబులోను గోపురము దగ్గర కట్టబడిన స్థలమందే రాజ్యస్థాపన చేసిరి ఆ పిమ్మట దానియేలు గ్రంధములో బబులోను కనబడుచున్నది ఇది నినవే పట్టణము యొద్ధ యున్నది బోధింప వలసి వచ్చినప్పుడు వేరు వేరుగా బోధింపవలెను. ఇది ఇరాక్ దగ్గర మెసపతోమియా దగ్గర ఉన్న రాజ్యము మొదటి అన్యరాజు నెబుకద్నెజరు.

పాలస్తీనలో యూదులున్నారు. వారిని అన్యులు త్న్నగా బబులోనుకు తెచ్చిరి. షద్రకు, మెషెకు, అబెద్నెగో అనే యౌవనస్థులు బబులోను లోనికి చరగొని పోబడిరి. వారు అచ్చట నుండి తిరిగి పాలస్తీనాకువచ్చినట్లు కనబడుటలేదు. రాజైన నెబుకద్నెజరు యూదులయందు దయగలవాడు బాబెలు అను పేరు రాజ్యమును స్థాపన చేసినప్పుడు బబులోనుగా మారెను.

బాబెలు= తారుమరు ఇది భూలోకములో స్థాపింపబడనెయున్న దేవుని జనాంగముల రాజ్యములకు వ్యతిరేకమైనది లోకములో బలముగా స్థాపింపబడినది బబులోను సామ్రాజ్యము. ఇది చరిత్రలో మొదటిది. ప్రకటన 18వ అధ్యాయము బాబెలు కూలిపోయెను. అని ఉన్నది. అనగా రెండు బబులోను రాజ్యములు కనబడుచున్నవి ఆత్మార్ధములో అది కాదు+ అదికాదు దానివంటిది. దానివంటిది ప్రపంచ మంతా వ్యాపించిన అది సతాను రాజ్యము ఇది బబులోను వంటిది. సాతాను దేవుని బిడ్డలను, రాజ్యములను గలిబిలి చేయుచున్నది దేవుని రాజ్యమును దేవుని రాజ్యములోని అధికారులను హింసించుచున్నది.

లోక స్త్రీ

వేశ్య:-
  • 1. యూదా,
  • 2. బౌద్ధ,
  • 3. హిందు
  • 4. నాస్తిక,
  • 5. జైను
  • 6. క్రైస్తవ మతములోని వారుకూడా ఈ వేశ్య అనే గుంపునకు చేరుదురు
ఎందుకంటే దైవ సిద్ధాంతములను విడిచిపెట్టి తమ సొంత సిద్ధాంతములను అవలంభించుటను బట్టి వీరు ఈ గుంపునకు చేరుదురు. ఈ లోకమందు అనేక మతములున్నవి. అనేక మిషనులున్నవి మతములలోను మిషనులలోను వారికున్న బోధలలో తేడా ఉన్నది ఇట్టి తేడా ఉండుటను బట్టి బైబిలులోని సిద్ధాంతములను భిన్నముగా ఉండుటనుబట్టి వీరందరు వేశ్యానే గుంపులోనికి వెళ్ళిపోవుదురు. అన్ని మతములలో ఉన్నవారు దేవుడూన్నాడని ఒప్పుకొన వచ్చును గాని వారి బోధలలో బైబిలునకు విరుద్దమైన బోధలున్నవి గనుక ఇట్టివారు అందరు ఈ గుంపులోనికి వెళ్ళుదురు. తప్పుబోధ చేయువారును తప్పుబోధ వినువారును ఈ గుంపులోనివారే.
  • 1. యుదా గోత్రము
  • 2. బౌద్ధ మతము.
  • 3. జైనమతము
  • 4. హిందుమతము
  • 5. నాస్తిక మతము
  • 6. పారసీకమతము
  • 7. క్రైస్తవ మతము ఇన్ని మతములు లోకములో ఉన్నవి.

ఒకరిబోధ ఒకరికి నచ్చదు ఎప్పుడైతే నచ్చదో తారుమారు అనే బాబెలు వచ్చినట్లె. అన్ని మతములలోనివారు 1893వ సంవత్సరములో అమెరికా దేశములోని చికాగో అను పట్టణమందు కూడుకున్నారు. అన్ని మతముల పెద్దలైనవారు కలిసి మాటలాడు కున్నరు. మతములలోని బేధములను తొలగించుకొని మనము సహోదర ప్రేమ కలిగి యుందము అని మాటలాడుకొనిరి. అన్ని మతములు ఒకటేనని మాటలాడుట బైబిలు గ్రంధము నకు వ్యతిరేక విషయము. అన్ని మతములలోని గొప్పతనమును ఏమతములవారు హాజరైనారో వారిని చెప్పమని అడిగిరి. కొందరు విగ్రహారాధన చేయుట ద్వరా భక్తివృద్ధి అగునని తెలియజేసిన, ఇదికేవలము వాక్యమునకు విరుద్ధము. మరొకనాడు స్వామి వివేకానంద అను మత గురువు వచ్చెను ఎవరి ఉపన్యాసము బాగుగా ఉండునో అని జడ్జీలను ఏర్పాటుచేసిరి. వివేకానంద గారి ప్రసంగము బాగున్నదని ఆ కూటములలోనివారు అందరు ఆయనను మెచ్చుకొనిరి. ప్రతివారు కూడా ఇచ్చిన ఉపన్యాసము పుస్తకముల రూపమున అచ్చు వేయించుమని కోరిరి. కూటము చివర ముగింపులో పరలోక ప్రార్ధన చేయవలెను ఒక తీర్మానము చేసిరి పరలోక ప్రార్ధనలో ఒకరి మతమనేది కనబడదు. రాజ్యము చిత్తము, అన్నదాన సహాయము, క్షమాపణ, మహిమ అను అనే అంశములు అందులో ఉన్నది గనుక కూటములోనివారు అందరునూ ప్రార్ధించిరి. ఇదే అన్ని మతములకు ఆ దినమందు సువార్త ప్రకటించిన దినమాయెను అన్ని మతముల వారు అన్ని మిషనుల మిషనులు ఒక మిషనుగా కానేరవు తమకున్న సిద్ధాంతములను విడిచిపెట్టుటకు వారికి మనస్సు లేనందున మానలేదు అందరు కలిసి ప్రకటన

17వ అధ్యాయములోనివేశ్య అనే సంఘములోనికి వెళ్ళుదురు. ఇప్పుడు మాట బేధమేగాని అంతా ఒక్కటే యని పైకి పలుకుచున్న లోపల వారి అంతరంగము విరోధముగా నున్నది పైకి మర్మము గాను లోపలకు వారు 3 సంవత్సరముల కొకమారు కలిసి కొని కూటము ఏర్పాటు చేసికొని అందరును ఐక్యమత్యముగా నుండవలెనని తీర్మానము చేసికొనిరి ఎందరు ఎన్ని ప్రయత్నాలు చేసిన అన్ని మతములు ఒక మతము కాదు అన్నికర్మముగాను ఉన్నది మతమనగా అన్ని మతములని తప్పుడు సిద్ధాంతములవారు అందులో చేరుదురు. అన్ని మతముల వారు కలువరు గనుక అన్ని మిషనులలో నుండి అన్ని మతములలోనుండి యదార్ధ హృదయులైనవారిని దేవుడు ఏర్పాటుచేసికొనెను. క్రియలలో తప్పులున్న వారిని శుద్ధిచేసి పెండ్లి కుమాత్రె వరుస లోనికైన మోక్షలోకములోనికైన పరదైదులోనికన్న చేర్చుకొనును. మిగిలిపోయినవారు ఏడు సంవత్సరముల పరిపాలన కాలములోని వేశ్య అను సంఘములోనికి చేరిపోవుదురు 18వ అధ్యాములోని వేశ్య అను సంఘములోనికి చేరిపోవుదురు 18వ అధ్యాయములో వేశ్యను మాటలేదు.

బబులోను గోపుర స్థలము:- బాబెలు భూలోకమునకు సంబంధించిన స్థలము. తప్పు సిద్ధాంతములు గల స్థలము నాశనము. అట్టిరాజ్యములు నాశనమగును. సిద్ధాంతమును అవలంభించిన జనులకు కూడ నాశనమే. సాతాను అంతిక్రీస్తు, అబద్ధ ప్రవక్తలు, కప్పలు, సిద్ధాంతములు మున్నగువాటికి గొప్ప శక్తి ఉన్నది. తప్పుడు సిద్ధాంతములను విన్న ప్రజలకు అప్రజలున్న స్థలములకు నాశనము కలుగును అట్టివారు అందరు నిర్మూలము కాగా ఈ భూమి పరిశుభ్రమగును. దుర్మార్గతను బట్టి దుర్మార్గులున్న స్థలములును మనుష్యులును నాశనమగుదురు. భూలోక రాజ్యము లన్నియు అంతరించిపోవును. రాజ్యములున్న స్థలములను రాజ్యములను కూడా అంతరించిపోవును. ఈ లోకమందు రాజ్యములు తాము సంపాదించు కొన్నవి అనేకములున్నవి.

  • 1. సొమ్ము సంపాదించినవారు
  • 2. ఘనత సంపాదించినవారు
  • 3. వస్త్రమును సంపాదించినారు
  • 4. పొలమును సంపాదించినారు.
  • 5. విధ్య సంపాదించినారు.
  • 6. పేరు ప్రఖ్యాతులు సంపాదించినారు.
  • 7. లౌకికమును సంపాదించినారు.
  • 8. మనుష్యులు లోకరాజ్య మహిమ యని పైనున్న వాటికి పేరు భూలోక రాజ్యముల మహిమలన్నిటిని చూపించిన సాతానుడు వీటన్నిటిని నీకిచ్చెదను నీవు నాకు నమస్కారము చేయుమని పలికెను.

గనుక సాతాను ప్రభువునకు చూపించిన ఈ మహిమ ఇప్పుడు బబులోను అను పేరుతో ఉన్న రాజ్యములు అంతరింప జేసినట్లుగా 18వ అధ్యాయములో యోహానునకు దేవుడు చూపించెను.

సైతానునకు ఈ లోకములోని భవిషత్తును గూర్చిన సంగతులు ంభావముగా తెలియును సాతానుడు ఎంతశక్తి ఉన్నప్పతికిని అది అంతము 7వపాత్ర కాలములో పూర్తిగా అంతరించి పోవును ప్రక. 17,18 అధ్యాయములోని విషయములు ముభావముగా ఇప్పుడు మనము ఎగిరియున్నాము సంపూర్ణముగా ఎప్పుడైతే వచ్చునో అట్టి సమయమునందు ఆ సంపూర్ణత కొట్టివేయబడెను. ఇదివరకు ఒక మతము ఒక్క దేశములోనే ఉండెడిది.

ఉదా:- హిందు మతము ఇండియా దేశములోనే వున్నది. కాలక్రమేణా ఇప్పుడు అమెరికా దేశమందుకూడ ఉన్నది. ఇండియాలో క్రీస్తుమతము ఏరీతిగా బోధించుచున్నరో అలాగే అమెరికాలో కూడా బోధించుచున్నారు. అమెరికాలో ఒక పత్రిక వేసిరి. దానికి లెట్ ఆఫ్ ఇండియా అని పేరు పెట్టిరి.. అమెరికాలోని దొరలు దొర్సానులు జైగోవిదా అని పాటలు పాడుచూ వీధులవెంట తిరిగిరి. హింధువులు ఆచరించునట్లు పుణ్యనది అనికొన్ని నదులలో స్నానము చేసిరి.

అయ్యగారికి అందరికిని ఒక కఠినమైన వాక్యమున్నది. మతములలోను మిషనులలోను ఉన్న బోధలలో ఏదిమీకు ఇష్టములేదో దానిని మానివేయుడి సరికాదని తెలిసికూడ అవలంభించిన యెడల వేశ్యసంఘములోనికి వెళ్ళుదురు సరియని తోచినయెడల అవలంభించి స్థిరపడుట మేలు మనిషిలో దేవుడు మనస్సాక్షిని పెట్టెను. అది తెలియజేసిన రీతిగా వ్యతిరేకమైన దానిని విడిచి పెట్టుట మంచిది. అప్పుడు పెండ్లికుమార్తె వరుసలోనికి వెళ్ళగలము.

  • 1. జ్ఞానము
  • 2. మనస్సాక్షి
  • 3. విశ్వాసము
  • 4. ప్రత్యక్షత

దేవదాసు అయ్యగారు ఈ నాల్గింటిని వెలిగించుమని ప్రార్ధించిరి. ఏదైన ఒక సంగతి జ్ఞానమునకు తెలియజేయబడవలెను. అది మనస్సాక్షికి నచ్చవలయును. ఇవి దేవుడు నరునికిచ్చిన వరములు పుట్టుక నుండి ఈ లక్షణములను దేవుడు నరులలో ఉంచెను. జ్ఞానానికి తెలియ జేయబడినది అది మనస్సాక్షికి ఇష్టమై యుండవలెను. మనస్సాక్షికి ఇష్టమైనప్పుడు క్రియనుబట్టి అవలంభించవలెను.

ప్రార్ధన:- పరలోకములో నున్న మాతండ్రి భూలోక జనసంఘమును పెండ్లికుమార్తె అనుభవించనున్న సంతోషమును చూపించుచున్న మీకు స్తోత్రములు. నీకు ఆశ్చర్యము కలిగించు విధముగా శతాధిపతి విశ్వాసమును బలపరచిన నీవు మా విశ్వాసమును కూడా బలపరచుము. కావలికాయుదూతలును మా చుట్టూ ఉంచుము భూతలమును వెళ్ళగొట్టుము జ్ఞానమును, మనస్సాక్షిని వెలిగించుము ఆమెన్.

ఏడు సవత్సరముల శ్రమ పాలన ఏడు పాత్రల ముగింపు అగువరకు పెండ్లికుమార్తె పరలోకములో ఏడు యేండ్ల విందులో నున్నది. తీర్పు జరిగినది గాని శిక్ష జరగలేదు.

ఉదా:- దోషిని కొంతకాలము అన్వషనలో నుంచి ఆ పిమ్మట తీర్పు వినిపించి తరువాత ఉరి కొయ్య యొద్దకు ఉరితీయుటకు తీసుకొని వెళ్ళ్దురు. అలాంటిదే ఏడు సంవత్సరముల శ్రమకాలము శ్రమకాలములో అవిశ్వాసులైన వారికి దేవుడు గడువు ఇచ్చుచున్నాడు తీర్పు విధించుట జరుగును గాని శిక్ష రాలేదు హర్మ గెద్దోను యుద్ధకాలములో జరగనైయున్న కార్యములను దేవుడు స్పష్టముగా తెల్య జేయును. సాతాను చెరలోనికి అంతి క్రీస్తు అబద్ధ ప్రవక్త కప్పలకు నరకమని తెలియజేసినవారికి మార్పు రాలేదు. ప్రక. 17, 18 అధ్యాయములలో తీర్పు వినిపించినారు. ఆఖరు పాత్ర కాలములో వినిపించుటయేగాని శిక్షరాలేదు. తీర్పు విధించుటకు, శిక్ష విధించుటకు మధ్య 19వ అధ్యాయమున్నది 19వ అధ్యాయములో అంతిక్రీస్తు అబద్ధ ప్రవక్త నాశనము వ్రాయబడియున్నది. పరలోకములో పెండి విందులోనున్న పెండ్లికుమార్తె స్తుతి గానము చేయుచుండెను. ఈ లోకమునకు తీర్పు విధించు నిమిత్తమై దేవునిని స్తుతించుచు నుందురు తరువాత పెండ్లికుమార్తె దిగివచ్చును.

19వ అధ్యాయము ప్రారంభములో బహుజనమువంటి గొప్ప స్వరము వినబడెను. అక్కడ స్తుతి కనబడుచున్నది ఆదాము మొదలుకొని ఏడుయేండ్ల శ్రమకాలమువరకు ఆరువేల సంవత్సరములు దేవుడు గడువుచ్చెను. ఏండుయేండ్ల పాలనా కాలమప్పుడుకూడా గడువు ఇయ్యబడెను. ఈ రెండు కాలములోకూడా తీర్పువినిపించుచుండును ఇప్పుడు ఆఖరి తీర్పులో ఈ స్తుతి గానము చేయును. 17వ అధ్యాయములోని తప్పుడు సిద్ధాంతము గల సంఘవ్యతిరేకులైన వారును వారి సిద్ధాంతములును నాశనమగును. అన్నిమతములలోని తప్పుడు సిద్ధాంతములు నాశనమగును. 17వ అధ్యాయములో లోకములోని మతములు అన్ని పోయినవి గాని లోక రాజ్యములున్నవి. ఈ లోక రాజ్యము లన్నియు క్రీస్తు ప్రభువు పరిపాలించు వెయ్యేండ్ల పరిపాలనలో ఆయనకు స్వాధీనమగును. ఇప్పుడు మతములోక రాజ్యము వర్తకము లన్నియు నాశనమగును.

మతము __ అన్ని మతములు కలిసి యున్నవి.

వెయ్యేండ్ల పరిపాలనా కాలములో రాజ్యసువార్త ప్రకటింపబడును రాకడ వార్త కాదు, సిలువ వార్తకాదు. క్రొత్తసువార్త అనగా క్రీస్తు రాజ్యము యేలుచున్నాడు గాన తప్పు సిద్ధాంతముండకూడదు. కరువులు, యుద్ధములు, శిక్షలు ఇక ఉండవు లోకమంతట సమాధానముండును. పెండ్లికుమార్తె లోనికి వెళ్ళనివారు అజ్ఞాన విశ్వాసులై యుందురు. దుష్టులు నరకములో జీవింతురు పెండ్లికుమార్తె ఆఖరి తీర్పుకొరకు కనిపెట్టుచున్నది. ఆ తీర్పు వినిపించగానే పెండ్లికుమార్తె కీర్తన పాడును అప్పుడు తీర్పుజరుగును.

ప్రక17:8 నీవు చూచిన ఆ మృగము ఉండెనుగాని ఇప్పుడులేదు. అంతిక్రీస్తుఇంకా రాలేదు. గాని అతని గుణము సూచనలు కనబడుచున్నవి. పెండ్లికుమార్తె ఎత్తబడిన పిమ్మట అంతిక్రీస్తు వచ్చును. అంతిక్రీస్తు ఏర్పాటులో ఉన్నాడు. అతడు చరిత్రలోలేడు. ఇంకను పైకిరాలేదు. పెండ్లికుమార్తె పైకి ఎత్తబడగా రావలయునను ఏర్పాటులో నున్నాడు. ప్రస్తుత కాలములో ఆయా స్థలములలో బయలుపడుచున్న వారిని చూచిన అంతి క్రీస్తు వచ్చినాడని కొందరు భ్రమపడుచున్నారు. జ్ఞానము తెలిసినవారు అట్టివారిని అంతి క్రీస్తు అని అనరు.

ప్రక 17:9,10 యేడు తలలని యోహాను వ్రాసెను యేడు తలలు అనగా యేడు కొండలు, యేడు కొండలు అనగా యేడు రాజ్యములు. సీయోను కొండ అని వాక్యములో ఉన్నది. ఈ కొండ రాజ్యమునకు గుర్తు. ఆస్త్రీ కొండలపై కూర్చున్నట్లుగా నున్నది. ఆ కొండలు అంతిక్రీస్తు రాజ్యమునకు గుర్తు ప్రపంచములో యేడు కొండలున్నవి. అచ్చట ఒక పట్టణమును కట్టిరి. ఈ వేశ్య ఈ రాజ్యము లన్నిటిని పరిపాలించుచున్నది. ఒక్కకొండే బలమైనదైతే యేడుకొండలు ఇంకా బలమైన రాజ్యము.

అయిదుగురు రాజులు కూలిరి అని వ్రాయబడి యున్నది గాని యింకా జరుగలేదు. ఇంగ్లీషు వారి పరిపాలనలో ఇండియా దేశములో 120 మంది రాజులుండిరి. ఈ రాజులు ఆకాలమందున్న చక్రవర్తులకు సహకారులు. అలాగే వేశ్య అను సంఘమునకు 7గురు రాజులుండిరి. వారిలో ఐదుగురు కూలిపోవుదురు. యిరువురు మాత్రమే యుందురు.ఇది అంతయు అంతిక్రీస్తుపరిపాలనయైయున్నది. ఇతనికి సహాయకారులుగా వచ్చినవరు పైవారైయున్నారు.

ప్రక 17:11; అంత్యక్రీస్తుక్రింద ఏడుగురు రాజులుందురు. అంతి క్రీస్తుతో కలిపిన యెడల ఎనిమిదవ రాజగును. ఇప్పుడుండినదియు లేనిదియునెన కౄరమృగము అనగా ఇతడు అంతిక్రీస్తే, ఈ లోకమందు జరుగు విషయములన్నియు పెండ్లికుమార్తె పరలోకమునుండి చూచుచుండును. అంతిక్రీస్తు వచ్చినప్పుడు పదిమంది రాజులను ఏర్పరచుకొనును వీరందరు యేకాభిప్రాయము కలిగిన వారై యున్నారు. పదిమంది రాజులును అంతిక్రీస్తును యేకాభిప్రాయము కలిగినవారై యున్నారు గనుక పని ఆదినములందు ముమ్మరముగా జరుగును.

వారు గొర్రెపిల్లతో యుద్ధము చేయుటకు వచ్చెదరు.

  • 1. ప్రభువులకు ప్రభువును
  • 2. రాజులకు రాజులును
  • 3. పిలువబడినవారిని కలిగినవారిని
  • 4. యేర్పర్చబడిన వారిని కలిగినవారిని
  • 5. నమ్మకమైన వారుగా యుద్ధము బాగుగచేయువారిని ప్రభువు యేర్పర్చుకొనును పిలువబడినవారు స్థిరముగానున్న వారే ఏర్పరచబడినవారును నమ్మకమైనవారుగా నుండి క్రీస్తుతోకూడ యేలుబడి చేయుదురు.

ప్రక 17: 15 జలములు = ప్రధమ వ్భక్తి జలములే = ప్రజలను ద్వ్తియావిభక్తి, జలములనగా ప్రజలు, జనసమూహము జనములనగా ఆయా భాషలు మాట్లాడువారైయున్నారు దిని అర్ధము అంతయు ఒక్కటే అనగా ప్రపంచములో నున్నవారందరు అని అర్ధము ప్రజలు అనగా లోకములోని వారందరిని ముభావముగా చెప్పుటెయున్నది. జనసమూహము అనగా ప్రజలు వందలుగాను వేలుగాను సమకూర్చబడినవారెయున్నారు. అన్ని దేశములలోను అన్ని రాష్ట్రములలో నున్నవారై యున్నారు. అన్ని దేశములలోను అనేక భాషలు మాటలాడు వారున్నారు.

ప్రక 17:16:1)
  • 1) ద్వేషించుట.
  • 2) దిక్కులేనిదానిగా చేయుట,
  • 3) దిగంబరిగా చేయుట
  • 4) దాని మాంసముభక్షించుట
  • 5) అగ్నితో కాల్చుట వీరు తప్పుసిద్ధాంతములను అవలంభించిన వేశ్య సంఘమునకు చెందినవారై యున్నారు.
  • 1. ద్వేషించుట:-వేశ్య స్త్రీవలే కనబడిన వేషధారణ సంఘములోని ద్వేషమును చూపించుచున్నది.
  • 2. దిక్కులేనిది-భూజనులైన వారి యొక్క హృదయములలో కొంత మనసాక్షి ఉన్నది. ఈ వేశ్య సంఘము బోధించునట్టి తప్పుడు సిద్ధాంతములను భూజనులలో యెవరునూ నేర్చుకోజాలరు.
  • 3. దిగంబరరత్వము _ తప్పనితెలిసికొన్న ఆఖరిలో లాభముండదు. తన స్థితి అంతయు తీసివేయబడినవి నిజ స్వరూపము బయట పడును. దిగంబరులైన వారు ఏరీతిగా సిగ్గునొందుదురో ఆరీతిగానే సిగ్గు తెలియును జలములు అనగా అనాదిలో దేవుడు జలములపై కూర్చుండెనని యున్నది. దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెనని వాక్యములో వ్రాయబడియున్నది ఆరీతిగానే ఈ వేశ్య జలములపై కూర్చుండెను.
  • 4. దానిమాంసము భక్షించి అని వ్రాయబడియున్నది దాని మాంసము అనగా దానికున్న బలమని అర్ధము. సమయమురాగా గొప్ప బలము కలిగిన అనగా ఏడు కొండల బలము కలిగిన ఈ స్త్రీ కున్న బలము నాశనమాయెను
  • 5. అగ్నిచేత బొత్తిగా దానిని కాల్చివేతురని యోహానువ్రాసెను బొత్తిగా అనగా అసలు లేకుండగా అంతవరకు అనేకులను హింసించిన ఆవేశ్య ఇప్పుడు నామరూపములు లేకుండా చేయబడెను.

ప్రక 17:17 దేవుని మాటలు నెరవేరువరకు వారు యేకాభిప్రాయము గలవారై తమ రాజ్యములను అనగా ఆరాజులు తమ రాజ్యమును మృగమునకు అప్పగించిరి అనగా అంతిక్రీస్తునకు అప్పగించిరి భూలోకమునందు రాకడలో సిద్ధపడిన పెండ్లికుమార్తె వరుసలోనివారు యేరీతిగా యేకాభిప్రాయము గలవారైయుంటారో ఆరితిగానే ఆరాజులును యేకాభిప్రాయము గలవారై యుండిరి, మనము దైవసానిధ్యములో యేరీతిగా కానుకలు అర్పించుచున్నామో ఆ రీతిగనే ఆ భూరాజులు తమ రాజ్యములను మృగము అనబడిన అంతిక్రీస్తునకు అప్పగించిరి. దేవుడు వారికి బుద్ధిపుట్టించెను అని వ్రాయబడియున్నది. భూరాజులు యేకాభిప్రాయము కలిగి తమరాజ్యములను అంతిక్రీస్తునకు అప్పగించుట అనునది దేవుడు వారికి పుట్టించిన అభిప్రాయమైయున్నది. ప్రభువు చరిత్రలో యూదా ఇస్కరియెతు పండ్రెండుగురు శిష్యులలో ఒకడై యున్నాడు వాడు ప్రభువును అప్పగించెను ఇది ప్రభువు వానికి పుట్టించిన బుద్దియైయున్నది. అట్టి బుద్ది లేకపోతే యూదా ఇస్కరియోతు ప్రభువును అప్పగించి యుండడు.

ఆ స్త్రీ భూరాజులను యేలు ఆమహ పట్టణమని యున్నది. ఇది రానైయున్న మహ పట్టణమునకు పోలికయై యుంటుంది.

Home