7వ అధ్యాయము - (Saved one Tribulation)

పరిచయము

4. దిక్కులు దూతలు
  • భూమి
  • సముద్రము
  • చెట్టు



గాలిని పట్టుకొనిరి
ముద్రదూత (సజీవదేవుని)
From East
  • ఎ. భూమికైన
  • బి. సముద్రము కైన
  • సి. చెట్టు కైన



హానిచేయనిది
4. గురితో : N.B : దేవుడు దాసుల నొసళ్ళు ముద్రించువరకు
ముద్రింప బడినవారు 144 వేలు
యూదా గోత్రములు - 12 వేలు
రూబేను - 12వేలు
గాదు - 12 వేలు
ఆషేరు - 12 వేలు
నఫ్తాలి - 12వేలు
మనస్షే - 12 వేలు
షిమ్యోను - 12 వేలు
లేవి - 12వేలు
ఇశ్శాఖారు - 12వేలు
జెబులూను - 12వేలు
యోసేపు - 12 వేలు
బెన్యామీను - 12 వేలు
II. Refrence according to their Birth (Gen. 29)



లేయా
  • 1. రూబేను (దేవుదు నా శ్రమను చూచెను)
  • 2. షిమ్యోను (నేను ద్వషింపబడినది దేవుడు విన్నడు)
  • 3. లేవి (నా పెనిమిటి నన్ను హత్తుకొనును)
  • 4. యూదా (దేవుని స్తుతింతు)


బిల్వా
  • 5. దాను (దేవుడు నాకు తీర్పు చేసెను. మొరవినెను)
  • 6. నఫ్తాలి (దేవునికృపకై పోరాడి గెల్చితిని)


జిల్పా
  • 7. గాదు (నా అదృష్టము)
  • 8. ఆ షేరు (నా భాగ్యముచే నా కుమార్తెలు నన్ను భాగ్యవంతులందురు)


లేయా
  • 9. ఇశ్శాఖారు (దేవుడు నాకు ప్రతిఫలమిచ్చెను)
  • 10. జెబూలూను (దేవుడు నాకు మంచి యినామిచ్చెను)


రాయేలు
  • 11. యోసేపు
  • 12. బెన్యామీను


(దేవుడు నా నిందను తొలగించెను)

అసంఖ్యా సమూహము

  • ప్రతిజనము
  • ప్రతివంశము
  • ప్రజలు
  • భాషలవారు
Gen. 49 Blessimngs DeuT 33
1. రూ - - 1 రూ
2. షి - - ?
3. లే - - 3 లే
4. యూ - - 2 యూ
7. దా - - 11 దా
9. న - - 12 న
8. గాదు - - 10 గా
9. ఆ - - 13 ఆ
6. ఇ - - 9 ఇ
5. జె - - 8 జె
10. యో - - 5 యో
11. జె - - 4 బె
4 ఎఫ్రాయీము
7 మనస్షే
  • ధవళ వస్త్రధారులు
  • ఖర్జూరపు మట్టలు పట్టుకొని
  • సిం హాసనము ఎదుటనిల్చి
  • గొర్రెపిల్ల ఎదుటనిల్చి



స్తోత్రము దేవునికి గొర్రెపిల్లకు
    దూతలు నిల్చిరి
  • ఎ. సిం హాసనము చుట్టు బి. పెద్దల చుట్టు
  • సి. నాల్గుజీవుల చుట్టు

వారు (సాష్టాంగపడి)

ఆమేన్ మా దేవునికి

  • ఎ. స్తొత్రము బి. మహిమ సి. జ్ఞానము డి. కృత్తజ్ఞతస్తుతి
  • ఇ. ఘనత ఎఫ్. శక్తి గి. బలము ఆమెన్
    ఒక పెద్ద (With john)
  • ఎ. ధవళ వస్త్రధారులు ఎవరు ?
  • బి. ఎక్కడనుండి వచ్చిరి?

నేను
అయ్యా నీకే తెల్సును

    పెద్ద:
  • ఎ. మహాశ్రమపడి వచ్చిరి
  • బి. గొర్రెపిల్ల రక్తములో ఉదుకుకొనిరి
  • సి. దేవుని గద్దె ఎదుట (దివారాత్రులు గుడిలో సేవించు చున్నారు).
  • డి. ఆసీనుడు తన డేరా కప్పును
  • ఇ. వారికి ఆకలిదప్పికయు ఉండదు
  • ఎఫ్. ఎండ, వడ తగలదు
  • జి. గొర్రెపిల్ల గద్దెమధ్య : జీవజలబుగ్గ నడిపించును.
    • 1) 7వ అధ్యాయమునకు వేదాంతులిచ్చిన బిరుదు కృపాధ్యాయము
    • 2) సైతాను దృష్టి ద్వేషాలోధ్యాయము
    • 3) మానవుల దృష్టిలో శ్రమాధ్యాయము

7వ అధ్యాయము

సాతానుకు సంతొషము 7వ అధ్యాయములో యూదులు, అన్యులు దాటిపోయినందుకు చింత 7 సం||ల శ్రమలలో సాతాను ఎంతకు యుక్తిపన్ని శ్రమపరవ్హినను దేవుడు ప్రజలను యుక్తిగా రక్షించెను. ఈ అధ్యాయములో రక్షింపబడినవారిని శ్రమకాల పరిశుద్ధులు అందురు. ఇది తండ్రి వీరి కన్నీటిని తుడిచే అధ్యాయము. 7 ముద్రలలో 6ముద్రలు అయిపోయినవి. 7వ ముద్ర తరువాత బూరల శ్రమలు వచ్చును. ఇవి యెక్కువయిన శ్రమలు యోహాను నూరు సం|| లు కలవాడై నలిగిపోయి చచ్చినవాని వలె వృద్దుడైయున్న యోహాను మీద ప్రభువు కనికరముచూపి 7వ ముద్రను ఆపెను. స్వజనులను గూర్చిన సంతోషముతో యోహాను ఉన్నప్పుడు దూతలు వచ్చి ముద్రలు వేసి 7వ అధ్యాయమును యోహానుకు చూపెను.

4 దిక్కుల దూతలు:- 6వ అధ్యాయంలో 6వ ముద్ర అంతము. 7వ అధ్యాయంలో 7వ ముద్ర ఉండవలసినది గాని అట్లులేదు. ఏడవముద్ర పరలోకములో విప్పబడును. ముద్రల శ్రమలకంటే బూరల శ్రమలు ఎక్కువ. 7వ ముద్ర ఆరంభించకముందు, మొదటిబూర ఆరంభించకముందు, నలుగురు దూతలు నాలుగువైపుల నిలబడి యున్నారు. వారు నేలమీద సముద్రము మీద చెట్లమీద, గాలి వీచకుండ చేయుటకు నిలువబడియుండిరి. ఎందుచేత? భూమి మొదట వచ్చినది. శిక్ష అయినా, రక్ష అయినా మొదట భూమిమీదకు రావలెను. భూమిపై నరులున్నారు గనుక 7వ ముద్ర విప్పవద్దు. కొంతసేపు ఆగండి. అన్నట్లుగా ఆ దూతలు ఉన్నారు. ఎందుకనగా తాను ఏర్పర్చుకొన్న వారిని అనగా 1వ ముద్ర నుండి 6వ ముద్రవరకు ఎందరు ఏర్పరచబడిరో వారిని దూతలు ప్రోగుచేసి (మత్తయి 24:3) వీరిని ఆశ్రయ స్థానమునకు తీసికొనిపోవువరకు నిలువబడిరి. వారిని భద్రపరచకపోతే తిరిగి పాపములో పడిపోవుదురు.

2) తూర్పు:- సజీవుడగు దేవుని ముద్రగలదూత:- తూర్పు నుండి వచ్చెను. తూర్పు దిశకుగల ప్రాముఖ్యత

  • 1) ఏదేను తోటను దేవుడు తూర్పున నిర్మించెను. (ఆది 2:8)
  • 2) ప్రభువు జన్మించినపుడు తూర్పున నక్షత్రము పుట్టెను.
  • 3) తూర్పు నుండి జ్ఞానులు వచ్చి ప్రభువును దర్శించిరి. మహిమ ఎప్పుడూ తూర్పునుండే వచ్చును.
  • 4) సూర్యోదయ కాంతికూడ తూర్పునుండే కలుగును. 5) ప్రభువు సమాధినుండి తెల్లవారుఝామున లేచెను.
  • 6) క్రైస్తవ దేవాలయములో అల్టెర్ తూర్పు వైపున నుండును.
  • 7) రెండవమారు ప్రభువు తూర్పునుండే వచ్చునని సంఘముయొక్క ముఖము ఆరాధనలో తూర్పువైపునకే ఉండును.
  • 8) మృతులైనవారి తల పడమరవైపునకు ఉంచి సమాధిచేయుదురు. ఎందుకనగా ప్రభువు తూర్పునుండి వచ్చును గనుక సమాధులలోని వారు లేచినప్పుడు మొదటిగా వారు ప్రభువును చూచుటకు.

3) సజీవుడగు దేవుని ముద్రగల దూత హానిచేయుటకై వచ్చిన నగురు దూతలతో :- మా దేవుని దాసుల నొసళ్ళయందు ముద్రించువరకు హానిచేయవద్దు. మారుమనస్సు పొందిన వారిని దేవదూతలు ముద్రింతురు. పెండ్లికుమార్తెగా సిద్ధపడిన వారికి ఇప్పుడు ముద్రలుండును. ఇవి దర్శనము గల వారికే కనబడును. సంపూర్ణముగా తయారయితే మనకు ముద్ర ఉండును. దేవుని ముద్ర మారుమనస్సు పొందినవారి మీద ఉండుట చూచి యోహాను మిక్కిలి సంతోషించును. శ్రమకాలములో దేవుని ముద్ర గలవారికి దాసులని పేరు. వీరికి కిరీటములుండవు. ఇప్పుడు భూలోకములోనున్న పెండ్లికుమార్తెకు హారముగా యిస్తారు. నీవు వచ్చివేయుము. తక్కినవారు శ్రమలలో రక్షింపబడుదురు అని పెండ్లికుమార్తె యొక్క కన్నీటిని తుడిచివేయును.

ముద్ర:- భక్తుల హృదయములందలి దైవమహిమ వారి నొసళ్ళమీద ప్రకాశించును. యిదే ముద్ర. ముద్ర హక్కునకు గుర్తు (ఎఫెస్సీ 1:13) రోడ్లపై గవర్నమెంటు ముద్రగల రాళ్ళను తీసివేయుటకు యెవరికి అధికారము లేదు. అలాగే దేవుని ముద్రగల వారిని అంతిక్రీస్తు అనుచరులు యేమియు చేయలేరు. దానియేలు గ్రంధములో కాలాంతము వరకు యీ సంగతులు ముద్రవేయబడినవి.

    కాలములు రెండు
  • 1) అబ్రహాము నుండి యేసుక్రీస్తువరకు
  • 2) క్రీస్తు ప్రభువు నుండి రెండవ రాకడ వరకు ఇప్పుడు కాలాంతము వచ్చియున్నది గనుక ప్రకటన గ్రంధము విప్పబడినది.
దేవదూతలకు హృదయస్థితి బాగుగా తెలియును. గనుక ముద్రవేయుటకు వారికి హక్కు ఉన్నది. శ్రమకాలములో సిద్ధపడిన వారికి దాసులనిపేరు. అంతిక్రీస్తు ముద్రకలవారు భూమిపై తమ యిష్టము వచ్చినట్లు తిరుగ వచ్చును. కొనవచ్చును, అమ్మవచ్చును. అంతా సౌఖ్యమే దేవుని ముద్ర ఉన్నవారు అమ్ముటకుగాని, కొనుటకుగాని వీలులేదు. ముద్రింపబడినవారు రెండు జనాంగములు.
  • 1) యూదులు,
  • 2) అన్యులు,
యోహాను యూదుల సంఖ్య 144 వేలు గనుక వ్రాసెను. అన్యులసంఖ్య కోటానుకోట్లు గనుక లెక్కపెట్టిటకు అసౌధ్యము గనుక లెక్క పెట్టలేదు. యోహానుకు దేవదూతలు ఆ లెక్క చెప్పినను యోహానుకు తెలియదు ఎందుకనగా ఆ సంఖ్య కోటానుకోట్లు ఉన్నది గనుక.

ప్రకటన 7వ అధ్యాయమునందు ఏడేండ్ల శ్రమకాలమందు రక్షింపబడిన 114 వేల మంది యూదా జనాంగములోని 2 గోత్రములలో ముద్రింపబడిన వారి జాబితా జన్మమునుబట్టి వరుసగా పన్నిద్దరి పేర్లు ఆది 29, 30 అధ్యాయలలో కలదు. 49 అధ్యా||లో వారి యొక్క ఆశీర్వచనములు కలవు. ద్వితి 33 అధ్యా||లో వారి అశ్శీర్వచనములు జన్మమునుబట్టి ఉన్న వరుసలేదు.

ఈ పన్నెండు గోత్రములయొక్క జనాభాలెక్క మొదట జన్మమునుబట్టి ఉన్నది. తరువాత చూచినవారి జన్మమునుబట్టి కాదుగాని ఆత్మీయ జీవనస్థితినిబట్టి ఉన్నది. తరువాత చూచినవారి జన్మమునుబట్టి కాదుగాని ఆత్మీయ జీవనస్థితినిబట్టి ఉన్నట్లు కనబడుచున్నది. పతనిబంధనలో రూబేను పేరు మొదట కలదు. ప్రకటన గ్రంధములో రూబేను పేరు రెండవదిగా వచ్చినది. ఎందుకనగా రూబేను పొరపాటులో పడెను. అయినను దిద్దుకొన్నందున మొదటి పేరు పోయి రెండవపేరు వచ్చినది. ఇప్పుడు కూడ అంతే. సేవ, విశ్వాసము, స్తుతి, మొదలగువాటిలో మొదటిగానుండి పడిపోయిన యెడల వరుస తప్పును యూదా జన్మమునుబట్టి 4వ వాడు లోపములోపడి, తాను దిద్దుకొని తయారయిన స్థితిని బట్టి ప్రకటనలో మొదటివాడుగా చెప్పబడెను. ఆ. కాం. 49 అధ్యా||లో యోసేపు గోత్రము ఈ గోత్రముల వరుసలో నున్నది గాని తన తండ్రియగు యాకోబు యోసేపు కుమారులను దీవించుటను బట్టి యోసేపు గోత్రమునకు మనస్షే , ఎఫ్రాయీము గోత్రములు 12 గోత్రములలోనికి వచ్చినవి. ఎఫ్రాయిము పాపములో ఉండి లేవలేదు గాన ఆ పేరు తిరిగి యోసేపు గోత్రమునకు వచ్చినది గనుక ప్రకటన 7వ అధ్యాయ||లో మనస్షే. యోసేపు గోత్రములు సంఖ్య చూడగలము.

దాను:- త్రోవలో సర్పముగాను, దారిలో కట్లపాముగాను ఉండునని ఆది 49: 17లో యాకోబు పలికెను. దాను సిం హపు పిల్లయని మోషే ద్వితి 33: 22 లో పలికెను. ఈ గోత్రమువారు విగ్రహారాధనకు మొదటి వారైరి న్యాయాధి 18:30, 31లో నున్నది. అందువలన 12గోత్రములలో నుండి యీ గోత్రము తీసివేయబడినది అని ప్రకటన 7వ అధ్యాయము నందు కనబడుచున్నది. దాను గోత్రమునుండి యేసుక్రీస్తు విరోధి వచ్చునని యూదులు పారంపర్యములలో చెప్పబడియున్నది అను సంగతిని బైబిలు నిఘంYటువునందు కలదు. దాసు దారిలో సర్పముగానుండి గుర్రపు మడిమను కరచును ఎక్కువాడు వెనుకకుపడును (ఆది 49:17) ఇది 7 సం||ల శ్రమకాలములో జరుగును ఇప్పుడు రాకకొరకు సిద్దపడువారికి కూడ యీలాగు జరుగును ఎందువల్ల? అంతిక్రీస్తు ఆత్మ యిప్పుడు కూడ పనిచేయుచున్నది (1 యోహాను 4:3)

    రెండు రకముల సంతోషములు:
  • 1) ముందు యూదులు ఏర్పరచబడిరి.
  • 2) తరువాత అన్యులు యేర్పరచబడిరి.
యోహాను జనాంగము యూదులు గనుక స్వజనమును గూర్చి సంతోషించెను. ధవళ వస్త్రములు ధరించినవారు, అనగా తెల్లని వస్త్రములు, గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములు ఉతుకుకొని తెలుపుచేసికొనిరి. వీరు పెండ్లికుమార్తె వెళ్ళిపోయిన తరువాత 7సం||ల శ్రమాగ్నిలో పుటము వేయబడి శుద్ధిచేయబడినవారు. తెల్లని వస్త్రములు ధరించిరి. 6 ముద్రలు ముగించు వరకు శ్రమలున్నవి. దానిలో తయారగువారు యీ ధవళ వస్త్రధారులు అనగా నీతివచ్చెను. రక్తములో ఉదికిన యెరుపుగా నుండవలెను. సిలువపై కారిన రక్తము ఎర్రగానున్నది.ఇపుడది జీవము, ప్రభావము, గనుక తెల్లగానున్నది.

ఖర్జూరపు మట్టలు:- ఇవి జయమునకు సూచన అంతిక్రీస్తునకును వారికిని కలిగిన పోరాటము వీరికి జయము కలిగినది శ్రమలలో వాడిపోక దిట్టముగా నున్నారు. శ్రమల వలన కలిగిన ఎండకు మాడలేదు. వాడలేదు. మట్టల ఆకులు ఎందలేదు. పైగా పచ్చగానే ఉన్నవి. ఇది అంతిక్రీస్తు మీద జయమునకు గుర్తు అతనిమీద జయములేకపోతే శ్రమలు తప్పించుకొనలేరు గనుక అంతిక్రీస్తు మీద జయము. తరువాత శ్రమలమీద జయము, ప్రభువు గార్ధభాసీనుడై వచ్చినపుడు పిల్లలు మట్టలు పట్టుకొనిరి. దాని అర్ధము పిల్లలకు తెలియదు మనము సాతానుమీద జయము పొందుట ముఖ్యమా? లేక దాని శ్రమలమీదనా? సాతానుమీదనే, పచ్చని ఆకు వారికెప్పుద్సు జయమే, మరల అపజయమురాదు. ఈ లోకములోని భక్తులకు ఒకనాడు జయము మరియొకనాడు అపజయము ఉండును. అయితే ఈ అధ్యాయములోని వారికి అపజయము లేదు. గనుక నాకెప్పుడు జయమే వారు సాతాను దగ్గరకు, శ్రమల దగ్గరకు, లోకము దగ్గరకురారు. గనుక వారికి అపజయమనునది లేనే లేదనుటకు గుర్తు పచ్చదనము.

    7వ అధ్యాయంలోని వారు:-
  • 1) రక్షితులు
  • 2) విమోచితులు
  • 3) శ్రమకాల పరిశుద్ధులు (Tribulation Saints)
  • అని పేర్లు.

సిం హాసనము యెదుట, గొర్రెపిల్ల యెదుట నిలిచిరి. 14వ అధ్యాయ||లో

  • 1) సిం హాసనము యెదుటను,
  • 2) నాలుగు జీవులయ్దెదుటను,
  • 3) పెద్దల యెదుటను పెండ్లికుమార్తె యెదుట నిలిచిరి.

సిం హాసనాసీనుడైన మా దేవునికి, గొర్రెపిల్లకును, మా రక్షణకై స్తొత్రమని మహాశబ్ధముతో యెలుగెత్తి చెప్పిరి: దేవదూతలందరు సిం హాసనము చుట్టును, పెద్దలచుట్టును, ఆ నాలుగు జీవుల చుట్టును నిలువబడియుండిరి. వారు శ్రమకాలమునుండి వెళ్ళిన శ్రమకాల పరిశుద్దులు, సిం హాసనము యెదుట షాష్టాంగపడి "ఆమెన్" అనిరి.

ఆమెన్:- వారు జరుగకముందే, ప్రార్ధన ప్రారంభింపకముందేఆమెన్ అని అందురు. ఆమెన్ అనగా ఓ ప్రభువా! అని అర్ధము. మార్కు 11:24 నందు జరుగకముందే జరిగినది నమ్మవలెను జరుగకముందే "ఆమెన్" అనెను. ప్రతివచనముయొక్క ప్రార్ధన చివర ఆమెన్ అనవచ్చును. కథ జరుగకముందే నెరవేరినది గాన ఆమెన్. ఆయనే ఆమెన్ గనుక నెరవేర్పు ప్రతివాక్యము చివర న్యాయము చొప్పున సబబుగా, ఎప్పుడూ ఆమెన్ అనవచ్చును. రేప్చర్ సమయమందు ఆమెన్ అనవచ్చును పిదపకూడ ఆమెన్ అనవచ్చును. గట్టి విశ్వాసముగలవారు ఆమెన్ అనవచ్చును గాని ఏమో! అనువారు జరుగునో, లేదో అనువారు పని జరిగినది పిమ్మటను, జరుగక ముందును ఆమెన్ అనవచ్చును. ఆమెన్ అనునది దేవదూతలభాష తెలుగులో తథాస్థు లేక కలుగును గాక అని చెప్పి తరువాత యుగయుగముల వరకు మా దేవునికి స్తోత్రమును, మహిమయు, జ్ఞానమును కృతజ్ఞతాస్తుతియు, ఘనతయు, శక్తియు, బలమును కలుగునుగాకని చెప్పుచు, దేవునికి నమస్కారము చేసిరి. ఆమెన్. పెద్దలలో ఒకరు తెల్లని వస్త్రములు ధరించిన వీరెవరు? అని యోహానుగారిని ప్రశ్నించగా అయ్యా! అది నీకే తెలియునని యోహానుగారు అనెను. ఈ ప్రశ్న యోహాను అడుగవలసినది గాని పెద్దలలో ఒకరు అడిగిరి యోహానులోనున్న ప్రశ్నను పెద్దది కాబట్టి యీ ప్రకారముగా చెప్పెను వీరు మహాశ్రమనుండి వచ్చినవారు గొర్రెపిల్ల యొక్క రక్తములో తమ వస్త్రములను ఉతుకుకొని వాటిని తెలుపు చేసికొనిరని జవాబిచ్చెను. సిం హాసనము యెదుటనున్న గుంపు వీరే (వీరే 6 ముద్రల శ్రమకాలములో తయారయిన ధవళ వస్త్రధారులు) పరలోకములోనికి వెళ్ళిన తరువాత ప్రశ్నలు లేవు. యే ప్రశ్నయైన భూమిమీద ఉండగానే అడుగుట. పరమునకు వెళ్ళిన తరువాత

  • 1) మహిమ
  • 2) ప్రత్యక్షత,
  • 3) నిత్యత్వము కాంతి ఉండును.
గొప్ప సంతొషముండును. ప్రశ్నలుండవు.

    ప్రశ్నలెన్ని రకములు ?
  • 1) అనుమానముతో అడుగునవి
  • 2) తెలిసికొనుటకు అడుగునవి

  • 1) జకర్యా అనుమానముతో అడిగెను
  • 1) శారా అనుమానముతో నవ్వెను
  • 2) మరియ తెలిసికొనుటకు అడిగెను.
  • 2) అబ్రహాము దేవునికి అసాధ్యమైనది లేదని నమ్మినవ్వెను.

కొంతమంది నమ్మి తెలియక సంతోషముగా అడుగుదురు. అనుమానముతో , అవిశ్వాసముతో అడిగిన అది ప్రభువునకు ఆయాసకరము గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉతుకుకొని తెలుపు చేసికొనిరి. అందువలన దేవుని సిం హాసనము ఎదుట ఉండి రాత్రిబళ్ళు అయన ఆలయములో ఆయనను సేవించుచున్నారు.

సిం హాసనాసీనుడైనవాడే తన గుడారము వారిమీద కప్పును. అనగా వారికి నెమ్మది, ఆదరణ, సమాధానము ఉండును. గుడారము కప్పినందున వారికి ఆకలియెనను, దాహమైనను సూర్యుని యెండయైనను, యే వడగాలిఉయైనను తగులదు శ్రమకాలములో పై నాలుగు అనుభవించిరి, గాని యిప్పుడు అవి వారికి లేవు భూలోకములో తుఫానప్పుడు కొందరు ఒక ఆశ్రయపురములోనికి వెళ్ళిరి. అయితే ఆ ఆశ్రయపురము అందరికి చాలనందున కొందరు చనిపోయిరి. భయపడకండి ఇట్టి ఆపదలు భూలోకములో ఉన్నవిగాని పరమందులేవు అని తెలియపరచుటకు ఆయన వారిమీద గుడారము కప్పెను. మోషే కాలములోని యిశ్రాయేలీయులకు గుడారములతో నుండుట అలవాటు గనుక ఆ గుడార ఆశ్రయము యెరిగిన వారిమీద శ్రమకాలములో రక్షించబడిన 144 వేల మంది యూదులమీద ఆయన గుడారము కప్పెను.

సిం హాసన మధ్య మందుండు గొర్రె పిల్ల వారికి కాపరివై జీవజలముల బుగ్గల యొద్దకు వారిని నడిపించును:- ఈ గొర్రెపిల్ల

  • 1) రక్షించే గొర్రెపిల్ల
  • 2) ఆదరించే గొర్రెపిల్ల
  • 3) జీవజలముల బుగ్గలయొద్దకు నడిపించే గొర్రెపిల్ల
  • 4) కాపరియైన గొర్రెపిల్ల.
జీవజలముల బుగ్గలయొద్దకు అనగా శాంతి జలముల యొద్దకు నడిపించును. ఇది యూదులకు పాతవిషయమే. (కీర్తనలు 23:2) ఈ గొర్రెపిల్ల ఊరెడి నీటిబుగ్గగా నుండెను. (యోహాను 4:14).

దేవుడే వారికన్నులనుండి ప్రతిబాష్ప బిందువును తుడిచి వేయును

పెండ్లికుమార్తె పై అంతస్థులో సిం హాసనముపై కూర్చుండెను. ఈ శ్రమకాల రక్షితులు పెండ్లికుమార్తె అంతస్థును పోగొట్టుకొని మేము ఆ అంతస్థును సంపాదించుకొనలేక పోతిమని దుఃఖపడి కన్నీరుకార్చుచున్నందున దేవుడే వారిని ఆదరించుటకుగాను కన్నీళ్ళుతుడిచెను. లోకములో ఒకవరుని ప్రేమించిన యిద్దరు కన్యకలున్నారు. ఒక ఆమె ఆ వరుని వివాహము చేసికొన్నది. ఇంకొక ఆమె వివాహము చేసికొనలేదు. పెండ్లికుమారుడు, పెండ్లి కుమార్తె పెండ్లికార్డు పంపుదురు గాని ఆమె పెండ్లికి రాలేదు. తండ్రివచ్చి పిలిచినను పెండ్లికి రాలేదు. అప్పుడు తండ్రి అమ్మా! నిన్ను వివాహము చేసికొనుట ఏర్పాటుకాదు అని చెప్పి తండ్రి కన్నీరు తుడువగానే అప్పుడు ఆమెకు ఆదరణ వచ్చును. తండ్రి వచ్చి ఆమె కన్నీరు తుడుచునుగాని పెండ్లికుమారుడు వచ్చి ఆమె కన్నీరు తుడువడు గనుకనే శ్రమకాలములో గుడారముతో కప్పబడిన భక్తుల కన్నీటిని తండ్రి తుడిచెనని వ్రాయబడియున్నది.

పెండ్లికుమారుడైన క్రీస్తు ప్రభువును పెండ్లిచేసికొనుటకు తయారగుచున్న యిద్దరు కన్యకలు గలరు. వారిలో సిద్దమయియున్న కన్యకను వరుడు పెండ్లిచేసికొనెను. అనగా వధువు సంఘమునకు పూర్తిగా తయారయిన వధువును పెండ్లిచేసికొనెను. వధువు సంఘమునకు తయారుకాని కన్యక కూడ పెండ్లికుమారుని పెండ్లిచేసికొనవలెనను ఆశ ఉన్నది గాని తయారుకాని యీ కన్యకను పెండ్లికుమారుడైన ప్రభువు పెండ్లిచేసికొనలేదు వారే ఏడేండ్ల శ్రమ కాలములో రక్షింపబడిన కన్యకయైయున్నది. ఈ కన్యకను పెండ్లిచేసికొననందున కన్నీరు కార్చుచుండెను. పెండ్లికుమారుడైన ప్రభువువచ్చి యీమె కన్నీటిని తుడువరుగాని తండ్రుయైన దేవుడు యీ కన్యక యొద్దకు వచ్చి అమ్మా! నిన్ను వివాహముచేసికొనుట ఏర్పాటు కాదు గనుక పెండ్లిచేసికొనలేదు అని చెప్పి ఆమె కన్నీటిని తుడుచును ఇదే దేవుడు అనగా తండ్రి కన్నీటిని తుడుచుట.

Home