21వ అధ్యాయము - New Things

పరిచయము

క్రొత్త ఆకాశము

క్రొత్త భూమి

N.B : గతించె

  • 1. ఆకాశము
  • 2. భూమి
  • 3. సముద్రము

నూతన యెరూషలేము

  • 1. ఆ పరిశుద్ధ పట్టణము
  • సిద్ధపడి 2. అలంకృత పెండ్లికుమార్తె
  • 3. దేవునినుండి వచ్చె

సిం హాసన స్వర్మ:

  • 1. దేవుని వాసము - నరులతో
  • 2. దేవుడు వారితో కాపురం చేయును
  • 3. వారాయనవారు
  • 4. దేవుడు వారికి తోడై
  • 5. దేవుడు వారి కన్నీరు తుడుచును
  • 6. + ఉండదు (మరణము)
  • 7. దుఃఖం
  • ఏడ్పు
  • వేదన



ఉండదు

8. మొదటివి గతించె

అసీనుడు :

  • 1. అన్ని నూతనపర్చుచున్నాను
  • 2. ఈ మాటలు
  • ఎ) నమ్మకం
  • బి) నిజం


వ్రాయుము
3.
  • 1) సమాప్తం
  • 2) నేనె :
    • ఎ) అల్ప = ఆది ఎచ్) ఓమెగ = అంతము
  • 3) అనుగ్రహించు
    • ఎ) జీవజలం బి) ఉచితం
  • N.B :
    • ఎ) ఫలితం జయశాలి స్వతంత్రించు
    • బి) నేను దేవుడు
    • సి) అతడు - కుమారుడు

రెండవ మరణము





  • గుండము
  • అగ్నిగంధకం
  • ఎ) పిరికివారు
  • బి) అవిశ్వాసులు
  • సి) అసహ్యులు
  • డి) నరహంతలులు
  • ఇ) వ్యభిచారులు
  • ఎఫ్) మాంత్రికులు
  • జి) విగ్రహరాధికులు
  • ఎచ్) అబద్ధికులు

దూత: 7 పాత్రలు -- ఒకరు

N.B : బంగారు కొలకర్ర

  • ఎ) రమ్ము
  • బి) పెండ్లికుమార్తెను చూపెదను

N.B : ఎత్తు కొండకు కొనిపోయి

  • పెండ్లికుమార్తె
  • = పట్టణము

N.B : వెలుగు = సూర్యకాంత

అమూల్య రత్నం

పట్టణ వివరములు

ఎత్తైన ప్రాకారము + 12 గుమ్మములు

revelation 21
revelation 21

ప్రాకారం : సూర్య కాంతం

పట్న = స్ఫటిక బంగారు

పునాదురు = రత్న

  • 1. సూర్యకాంతం
  • 2. నీలము
  • 3. యుమునా
  • 4. పచ్చ
  • 5. వైడూర్యం
  • 6. కెంపు
  • 7. సువర్ణరత్నం
  • 8. గోధేకం
  • 9. పుస్యరాగం
  • 10. సువర్ణసునీయం
  • 11. అప్ద్మరాగము
  • 12. సుగంధం
revelation 21
N.B :
  • 1. జనములు - వెల్గులో తిరుగుదురు
  • 2. భూరాజులు - తమ మహిమను ఘనతను తెత్తురు
  • 3. జీవ గ్రంధంబులోనివారె ప్రవేశింతురు

క్రొత్త భూమ్యాకాశములు

ప్రక 21:1 :- అంతట నేను క్రొత్త ఆకాశమును, క్రొత్త భూమిని చూచితిని మొదటి ఆకాశము, భూమి గతించెను. సముద్రము యిక లేదు.

ప్రకటన వ్రాయుచున్న యోహాను ఆకాశము, పాతాళలోకము వెయ్యేండ్ల పరిపాలన, సజీవుల తీర్పు, గోగుమాగోగులు మున్నగు వాటినన్నిటిని చూచెను. ఇదివరకు పాత ఆకాశమును, భూమిని చూచెను. ఇప్పుడు క్రొత్తవి కనబడుచున్నవి వానిని చూడవలెను. కండ్లకు వ్రాయుచున్న చేతికి పని చెప్పబోవుచున్నాడు. పని. సూర్య, చంద్ర, నక్షత్రాదులు, భూమి, సృష్టి యివి అన్నియు భూకంపముల వలన తుఫానుల వలన నాశనమైపోయినదని చెప్పుటకు పాతవి గతించి పోయినవని వ్రాసెను. పాత ఆకాశము, పాతభూమి గతించిపోయెను. గనుక మనిషిని శ్రమపెట్టునవి యికలేవు. సముద్రము గతించెననగా లోకములో గంధర గోళములు గతించెను. శ్రమల కెరటాలు ప్రజలకు లేవు. ఆకాశము, భూమి, సముద్రము యిక ఉండదు. వటివల్ల వచ్చు హాని పోయినది. ఇవి అన్నియు యోహాను కండ్లకు పని. చేతిపని, మెదడు పని పోయి ప్రభువు దగ్గరకు వెళ్ళెను.

తల - ఆకాశము

ఉదరము - భూమి

కాళ్ళు - పాతాళము

ఈ మూడు భాగములు మనిషిలోనివి. ఇప్పుడు యోహానునకు యివి పోయెను. అలాగే రేపు ఈ మూడు భాగములు మనిషిలోనివికాడ పోవును __

  • 1) ఊర్ధ్వలోకము అనగా పై లోకము
  • 2) అధోలోకము అనగా పాతాళ లోకము.

గొప్ప ప్రత్యక్షతలు పొందిన ముగ్గురు భక్తులున్నారు -

  • 1) 40 దినములు ఉపవాసముండి వరము సంపాదించిన మోషే ఇప్పుడలాగు ఎవరు ఉండలేరు.
  • 2) ప్రభుని శిష్యుడైన యోహాను.
  • 3) అపోస్తలుడైన పౌలు. ఈ ముగ్గురు కూడ ప్రత్యక్షతలో వరపుత్రులు.
పౌలుకన్న శిష్యుడైన యోహాను గొప్పవాడు. ఎందుకనిన ప్రకటనలోని విషయములన్నియు చీచి వ్రాయకలిగెను. ప్రక 21:2. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్తకొరకు అలంకరింపబడిన పెండ్లికుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యెదుట నుండి దిగివచ్చెను.

ఇప్పుడు యోహాను క్రొత్త సంగతిని చూడబోవుచున్నాడు.
  • 1) నూతనమైనది
  • 2) యెరూషలేము
  • 3) పరిశుద్ధ పట్టణము
  • 4) పెండ్లికుమార్తె ఈ మూడు యెరూషలేములకు క్రొత్త భూమి, క్రొత్త ఆకాశము ఏర్పడినది
  • 1) పాలస్తీనాలోని యెరూషలేము
  • 2) వెయ్యేండ్లలోని యెరూషలేము
  • 3) నూతన యెరూషలేము.

పెండ్లికుమార్తె తన భర్తకొరకు అలంకరించుకొన్నది పెండ్లికుమార్తె సిద్ధపడవలెను. సిద్ధపడుట అనునది సుళువే. పెండ్లికుమారుడు నూతన యెరూషలేములో నున్నాడు. అట్టి పెండ్లికుమారునితో నుండుటకు ప్రభువునకు కలిగిన గుణములతో అలమకరించుకొనవలెను. భూలోకములోని పెండ్లికుమార్తె తల్లిదండ్రు లిచ్చు నగలతో అంలంకరించుకొనవలెను. అలాగే పెండ్లికుమారుడిచ్చు నగలతో అలంకరించుకొనవలెను. పరలోకపు పెండ్లికుమార్తె ప్రభువు యిచ్చు ఆభరణములతో అలంకరించుకొనును. పరలోకపు ఆభరణములకు ముంగుర్తుగా పెండ్లికుమార్తె భూలోకపు ఆభరణములు ధరించుకొనును. పెండ్లికుమార్తె పరలోకపు తండ్రియొద్దనుండి దిగివచ్చెను. పెండ్లి అవ్వక మునుపు పెండ్లికుమార్తె తల్లియొద్ద నివశించును. పెండ్లయిన పిదప పెండ్లికుమారునితో ఉండును.

ప్రక 21:3. ఇదిగో దేవుని నివాసము మనుష్యులతో కూడ నున్నది. ఆయన వారితో కాపురముండును. వారాయన ప్రజలైయుందురు,

  • 1) నివాసము - వచ్చి ఉండును.
  • 2) కాపురము - బ్రతికి ఉండును.
  • 3) ప్రజలై యుండుట - హక్కై ఉండుట

పెండ్లికుమార్తెపై సకల విధములైన హక్కు ప్రభువ్నకున్నది. భూలోక వాస్తవ్యులపై హక్కులేదు. సంఘము అనే పెండ్లికుమార్తె పెండ్లి కుమారుడైన ప్రభువు ఇచ్చు ఆభరణములను ధరించుకొనును. భూలోకములోని పెండ్లికుమార్తె పెండ్లికుమార్తె పెండ్లి పిదప పెండ్లికుమారునియొద్దకు వెళ్ళును. వీరు ఇరువురు కలిసి కట్టిన ఇంటికి పెండ్లికుమారుని తండ్రిపేరు పెట్టును. పెండ్లి కుమారుని తండ్రి వీరిరువురికి సహాయము చేయును. అలాగే వీరు యిరువురు పరలోక తండ్రియొక్క హక్కుగా ఉందురు.

ప్రక 21:4. ఆయన వారి కన్నుల ప్రతి భాష్ప బిందువును తుడిచి వేయును. మరణమైనను, దుఃఖమైనను, ఏడ్పైనను, వేదననైనను ఇక ఉండదు.

పెండ్లికుమార్తె అంతస్థులో ఏడుమెట్లున్నవి. మొదటిమెట్టు లవోదికయ చివరిమెట్టు ఏఫెసు. చివరి మెట్టులోనున్నవారు చివరి మెట్టులో ఉన్నాను అని కన్నీరు పెట్టుదురు. ఆ తలంపు లేకుండగా ఆదరణకొరకు ప్రభువే వారి కన్నీళ్ళు తుడిచివేయును. అయ్యా ఈ చివరి మెట్టులో ఉన్నాననే తలంపే కన్నీళ్ళు.

  • 1) మరణము
  • 2) దుఃఖము
  • 3) ఏడ్పు
  • 4) వేదన

మరణము అనునది తెలియదు. దుఃఖము పైకి కనబడకుండా కృంగుట ఏడ్పు అనగా కన్నీరు. వీటినిబట్టి వేదన ఉండును పరలోకములో ఇవి అన్నియు లేవు. పరలోకమునుండి ఒక శుభవార్త తెలియవచ్చెను. స్వరము ద్వారా వినబడెను. మొదటివి పాతవి యేవియును ఉండవు అని వినబడెను.

ప్రార్ధన:- దయగల ప్రభువా! లోకములోని ప్రతిదినము ఒకనూతన వర్తమానము అందించుచున్నది. భూమి పుట్టినది మొదలు అన్ని దినములు ఏదో ఒక క్రొత్త సంగతి, క్రొత్త సుఖము, క్రొత్త కష్టము, క్రొత్త జంతువు, క్రొత్త చెట్టు తెచ్చుచున్నది అలాగుననే పెండ్లికుమార్తె క్రొత్త సంగతులు తెలియజేయును నీ సంఘము లోకములో ఉన్న ప్రజలకు జవాబు చెప్పె కృప దయచేయుము. ||ఆమెన్||

ప్రక 21:5, ఇదిగో సమస్తమును నూతనమైనదిగా చేయుచున్నాను. మరియు ఈ మాటలు నమ్మకమును, నిజమునైయున్నది. గనుక వ్రాయుమని చెప్పెను.

సమస్తమును నూతనమైనవిగా చేయుట అనగా ఇదివరకు పాతవి ఉండెను. ఈ పాతది ఆదాము పండు తిన్నప్పటినుండి ఉన్నవి. సృష్టిలోని అన్నియు క్రొత్తవే. పాపము ప్రవేశించినప్పటినుండి క్రొత్తవి యేసుప్రభువు ఈ మాటలు చెప్పి పాతవన్ని పరిహారము చేయును. నూతనమై ప్రవేశపెట్టును. ఏదేను తోటలో దేవుడు నూతనమైన వాటిని ప్రవేశపెట్టును అప్పుడు సైతాను పాపము ప్రవేశపెట్టెను. ఇవి వెయ్యేండ్లవరకు ఉండును. తరువాత ప్రభువు క్రొత్తవి ప్రవేశపెట్టును. అట్టిపనిచేయుటకు ప్రభువు సిద్ధముగా నున్నాడు.

  • 1) క్రొత్తవి ప్రవేశపెట్టేది ప్రభువు
  • 2) పాతవి ప్రవేశపెట్టేవి సాతానుడు
  • 3) పాతవి లేకుండా చేసి ప్రభువే క్రొత్తవి ప్రవేశపెట్టును.

ఈ అధ్యామములో యేసుప్రభువు పాతగిలిన పరిస్థితిని పరిహారము చేసి క్రొత్తవిగా చేయును

ఉదా:- భూమి పాతగిలెను అందున్న పాతవి అన్నియు తీసివేయ బడును. భూమి, భూమిగానే ఉండదుగాని పాతవి తీసివేయబడును. సూర్యుడు ఉండును దానిలోనిది పాతవిపోయి నూతనమైనదిగా మార్చబడును. నీరు ఉండును. అందులోనివి కానిదంతయు తీసివేయబడును. మనుష్యులు, మనుష్యులుగా నుందురుగాని మృగములుగా చేయబడరు. మృగములు వృక్షములుగా చేయబడవు సృష్టి అంతయు అలాగుననే ఉంచి నూతనమైనవిగా చేయబడును. మానవ శరీరము నూతనమైనవిగా మార్చబడును. బైబిలులో క్షయమైయ్యె దేహమున్నది. నూతన సృష్టిలో ఇది అక్షయతను ధరించుకొనును ఇట్టిపని ప్రభువు తప్ప యెవరును చేయలేరు.

సమస్తము అనగా రెండు అర్ధములున్నవి. పెంటమీద ఉన్న చెత్తకుండ సమస్తము అనే పరిధిలోనికి వచ్చినది. దోమలు, చీమలు, ముండ్లు ఇవన్నియు సమస్తము లోనికే వచ్చును గాని ప్రభువు చెప్పినది అది మాత్రమే కాదు.

  • 1) ఆయన కలుగ జేసినది మాత్రము నూతనముగా చేయును. యేసుప్రభువు ఆదిలో చేసినది పాతగిలినందువల్ల ఇప్పుడు నూతనముగా చేయును.
  • 2) పై జాబితాను ఆయన నాశనము చేయును, పాతవి ఇక ఉండబోవు అవి జ్ఞాపకమునకు కూడా రావు.

యేసు ప్రభువు చెప్పినవి నమ్మకములును, సత్యములునై యున్నవి. ఈ రెండు మాటలు యోహాను వ్రాసెను. నమ్మదగినవి అని అంటే చాలు సత్యములును అయియున్నవి అని వ్రాయబడెను. ఈరెండు పదములు అనేకమంది పలుకుదురు గనుక ప్రభువుకూడ చెప్పెను. ఎవరైతే నమ్ముదురో వారు ఎల్లప్పుడు విశ్వాసులుకూడ యేసుప్రభువు చెప్పినవన్నియు నిజమా అని తలంచెదరు. వారికి వచ్చే సందేహము తొలగిపోవునట్లు ప్రభువు ఈ మాటలు వ్రాయించుటలో ప్రభువు మనలను సిద్ధపర్చుచున్నారు. ప్రతి భక్తునికి ఆఖరు గడియలో ఇది నిజమా అనే శోధన వచ్చుచుండును. అందుకే నిశ్చయతను తెలియజేయుటకు ప్రభువు యిలాగు వ్రాయించెను. ఆదికాలములోనే సాతానుడు ఆదాము, అవ్వలకు ఇది అంతా నిజమా అని ప్రశ్నవేసెను.

  • 1) వీరు చావనే చావరు
  • 2) దేవునివలె యుందురు
  • 3) మీరాలాగు ఉందురని దేవునికి తెలుసు

అని ఈ మూడు మాటలుచెప్పి దేవుడు చెప్పినవి నమ్మదగినవి కావు అని సాతానుడు ఆదాము అవ్వలను మోసపుచ్చెను. అందుకే ఇప్పుడు దేవుడు నేను చెప్పినది నిశ్చయము నమ్మదగినదియునై యున్నవని తెలియజేసెను.

ప్రక 21:6. మరియు ఆయన నాతో ఇట్లు అనెను. సమాప్తమైనవి నేనే అల్ఫాయు ఓమెగయు, దప్పికగొనువానికి జీవజలముల బుగ్గలోని జలమును నేను ఉచితముగా నిత్తును.

ఇదిగో, మరియు అను ఈ రెండు మాటలు వచ్చినపుడు ప్రభువు యోహానునకు క్రొత్తసంగతులు తెలియజేయునని అర్ధమిచ్చుచున్నది. ప్రభువు నమ్మకమైనవి నిజమైనవి అని ఈ రెండు మాటలు చెప్పినవెంటనే మరియు అని యోహానుతో చ్హెప్పెను. ఎందుకంటే యోహాను వృద్ధుడు, బలహీనుడు త్వరిత గతిన వ్రాయలేనివాడు. యోహాను గ్రుక్క త్రిప్పుకొనుటకు మరియు అని వ్రాసిరి. వ్రాయుచున్న యోహాను మరల మరల ప్రశ్న వేయనక్కరలేకుండా ఆగి చెప్పెను గనుక మరియు అనుమాట వ్రాసెను. సాధారణముగా వృద్ధుడు తమకున్న బలహీనతలనుబట్టి మరల అడుగుదురు. అది లేకుండగనే మరియు అని కొంత సమయము అని ప్రభువు తెలియజేసెను. అలాగుననే నేను అల్ఫాయు ఓమెగయు అని చెప్పెను. ఈ మాట అనగా ఆదియును అంతమును అను ఈ మాట ప్రకటన 1వ అ. లో కూడ ఉన్నది. అల్ఫా అనునది గ్రీకు భాషలో మొదటిమాట ఓనెగ అనునది చివరిమాట ప్రభువు యోహానునకు హెబ్రీ భాషలో తెలియజేయలేదుగాని గ్రీకుభాషలో తెలిపెను. ఆదియు అంతము అనే మాట తొందరగా చెప్పిన యోహాను తన వ్రాతలో వ్రాయడేమో అని ప్రభువు నిధానముగా తెలియజేసెను. ఒకవేళ వ్రాయకపోతే సంఘము వెనుకబడును అది ప్రభువునకే లోటు బడిలో పిల్లలు మొదటిసారి ఏదైన చెప్పినప్పుడు పిల్లలకు అర్ధము కాక పోతే పంతులుగారు మరల చెప్పును. అలాగే ప్రభువు యోహానునకు మరల చెప్పెను. మొదటి అధ్యాయములో ఉన్న ఈ ఆది, అంతము అనుమాట మరల 21వ అధ్యాయములో కూడ చెప్పుచున్నారు. అల్ఫా ఓమెగా అను ఈ రెండు అక్షరములు యోహానునకు తెలియును గనుక మొదటివాడను కడపటివాడను ప్రభువే అని తెలిసికొనెను. యేసు ప్రభువు మొదట, మధ్య, చివర ఉండువాడై యున్నాడని యోహాను అర్ధము చేసికొనెను. బడిలోని పిల్లలందరు పాటములు సంపూర్తి అయిన పిమ్మట మరల తిరిగి ఒకమారు చదువుకొందురు. దీనినే రివైజ్ అని అందురు. యోహాను మరిచిపోవునేమో అని ప్రభువు చెప్పెను. యేసుప్రభువు మహా, మహోపాధ్యాయుడు. ఈ అధ్యాయములో వ్రాయుటకు ముఖ్య ఉద్ధేశ్యము. వర్తమాన, భూత, భవిష్యత్ కాలములలో ఉండేవాడని ముఖ్య ఉద్ధేశ్యము. వర్తమాన, భూత, భవిష్యత్ కాలములో ఉండేవాడని అర్ధమిచ్చుచున్నది.

భూలోకము నందు నీరు ఉచితముగా ఇచ్చెదరుగాని, అన్నము ఉచితముగా నివ్వరు. వేసవికాలములో ఉచిత చలివేంద్రములు ఏర్పాటు చేయుదురు. అలాగే మనమును సువార్తను ఉచితముగా పంచిపెట్టవలెను. నీటి బుగ్గ, దప్పిక, ఉచితముగా ఇచ్చుట అను మాటకు ఇచ్చట వ్రాయబడి యున్నవి. యోహాను సువార్త 4వ అధ్యాయములో ప్రభువు సమర్య స్త్రీతో ఈ నీళ్ళు అక్క్డ ఉండవు ఇక్కడ ఇచ్చట ఉండుననుగాని అచ్చట ఇచ్చట అనేది ఉండదు అనెను.

ఈ నీళ్ళు, ఈ దప్పిక, ఇచ్చట ఈ లోకానికి కొంతకాలమేగాని పరలోకమునకు ఇది పనికిరావు. ఇక్కడ అనుగ్రహించేవన్నియు ఈ లోకములో జీవాంతము వరకు పనికివచ్చును. అక్కద వేరేది ఉండును.

చిన్న పిల్లలు ఏదైన విందులో కూర్చున్నప్పుడు పలహారములు వడ్డించగా ఇంకా ఏవిన వడ్డించెదరేమో అని పైకి చూచెదరు. ఆకలిగా ఉన్నప్పుడు ఆహారము తిందురు. ఫలహార వడ్డించు విషయమై కోరికయుండును. అదియుకూడ ఆకలిలో ఒక భాగము. అలాగే దాహము ఉన్నప్పుడు నీళ్ళు త్రాగినను మరి యెక్కువ త్రాగుటకు ఆశింతురు. మరియు అది దాహములోని ఒక భాగము

సమరయ స్త్రీతో ప్రభువు నేను ఇచ్చు నీళ్ళు అని అన్నారు. ఈ నీళ్ళు పరలోకములో ప్రభువు మనకిచ్చును. మనము పరలోకమునకు వెళ్ళిన పిమ్మట అక్కడ నీరు త్రాగిన ఇక యెన్నటికిని దప్పిక కలుగును. పరలోకమునకు ఏ సమయమునందు వెళ్ళుదుమో అప్పటినుండి మనకు దప్పిక కలుగదు. పరలోకములో ఒకవేళ దాహము వేసిన ఆ దాహము ఈ దాహమువంటిది కాదు. పరలోకములో సమయము అనేది లేదు కాని బోధ పడేటందుకు చెప్పుదురు. మనము పరలోకమునకు వెళ్ళునప్పుడు నీళ్ళు త్రాగుదుము. రెండవ రోజు నీరు త్రాగుటకు ఉండదు మొదటి దినము త్రాగిన నీరు అనంతకాలము సరిపోవును. సమరయ స్త్రీతో ప్రభువు సంభాషించగా నేనే మెస్స్య్యా అని తెలియజేయగానే ఆ సమరయ స్త్రీకి అప్పుడే దప్పిల తీరినది. నీళ్ళు ఇచ్చుట ఇక్కడే గాని దప్పిక తీరుట అక్కడే. దాహము వేసినప్పుడల్ల ఎలాగు నీరు త్రాగుదుమో ఆ ప్రకారముగానే ప్రభువు ఇచ్చిన జీవజలమును అనంతకాలము అనుభవించుచుందుము. అనంతకాలము జీవ జలము కావలెననీనుటయే అవసరము. అనంతకాల జలము, అనంతకాల అనుభవము, అనంతకాలము సంతోషము అనుభవించుచునే యుందుము.

ఇక్కడ నీళ్ళ గల మనిషి జీవితకాల మంతయు ఎలాగు నీరు అనుగ్రయించుచుండునో అలాగుననే పరలోకములోను జీవజలము అనుభవించుచుండును. అనంతకాలము సంతోషముతో అనుభవించుచుందుము. సమరయ స్త్రీ నీటికొరకు బావియొద్దకు వెళ్ళినది. ఆ బావి మనుష్యులు త్రవ్విరి మనుష్యుల కష్టార్జితము వలన యిచ్చునది. ఈ లోక నీరు ప్రభువు కష్టార్జితము వలన యిచ్చునది ఉచితజలము, అదే జీవ జలము.

పరలోకములో -
  • 1) ప్రభువు సహవాసము
  • 2) పరిశుద్ధుల సహవాసము
  • 3 దేవుని మహిమ
  • 4) త్రిత్వ సహవాసము
  • 5) అనంత మహిమ
  • 6) ఈ లోకములో అనుభవించని సౌఖ్యము.
వీటిని బట్టి పరలోకములో సంతోషము కలుగును. సంతుష్టి కలుగును. అలాగే వాటినిబట్టి అనుభవము కలుగును. అదే జీవజలము,

జీవజలము ఏలాగు ఉండునో తెలియదుగాని దానిని అనుభవించుచుందుము. సమరయ స్త్రీకి రక్షకుని కలిగినది. నేనే ఆ రక్షకుడను అని చెప్పగా కనుగొన్న ఆస్త్రీ ఊరిలోనికి పరుగెత్తుకొని పోయెను. రక్షణ పొందెను. రక్షకునుగూర్చి తెలిసికొన్న పిదప రక్షణ వచ్చును. సమరయస్త్రీకి ప్రభువు ఆమె పాపములను తెలియజేసెను.

తమ పాపములనుగూర్చి ప్రభువు జ్ఞాపకము చేయగా ఆమెకు తన పాపము తెలిసెను. ముందు ఆమెకు తెలియును గాని తెలియదు. ముందు ఆమెకు రక్షకుడు వచ్చెనని తెలియదు గాని రక్షకుడు వచ్చునను నిరీక్షణ ఉన్నది. ఇప్పుడు రక్షణ అనుభవించి యున్నది అలాగే భూలోకములో మనమున్నప్పుడు పరలోకమహిమ తెలియునుగాని అక్కడకు వెళ్ళి అన్ని చూచినప్పుడు ఇంత ఉన్నదని తెలియదని వాటిని అనుభవించుదురు. ఇవన్నియు అనుభవించుటయే దప్పిక తీరినట్లుండును.

జీవజలమనగా అంతము లేనిది. గనుక జీవజలము యోహాను 4వ అధ్యాయములోను ప్రకటన 21వ అధ్యాయములోను నేను యివ్వగలనని ప్రభువు చెప్పెను. ప్రభువు జీవమైయున్నాడు గనుక జీవము, జీవజలము, జీవలోకము సంతృష్టి అంతయు ఇవ్వగలరు. ముందు నా మనసు దేవుని కప్పగింతు-నందరి నస్మత్తు-ల్యముగా ప్రేమింతున్-సందేహ రాహిత్య-సరణిలో నిల్తు-పొందబోడి ముక్తి- భువి యందె గాంతు ||నానందమగు||

సమరయ స్త్రీ తాను పొంద బోయె ముక్తి భువుయందే భూలోకములోనే అనుభవించియున్నది. రక్షణ, మోక్షము ఆమెలోనికి వచ్చియున్నది.

తే|| గీ|| ఆవగింజంత విశ్వాస | మమరియున్న
కొండ కదిలి సముద్రాన | కూలిపడును
ఆవగింజంత చిరుపాప | మంటియున్న
వధువు సంఘములోనికి | వచ్చుటెట్లు

రక్షణ పొందే స్థితిలో ఉన్న యెడల మోక్షమునకు వెళ్ళే వాలుతో ఉన్నామని చెప్పుకొనగలము. పాప స్థితిలోనే ఉంటే మోక్షమునకు వెళ్ళే వాలు లేదని అనుకొనవలెను. పాపము విడిచిపెట్టి చిన్న స్వవచేసిన దానికి విలువ ఉన్నది. ఒకరు ఎన్ని సంవత్సరములనుండి సేవచేసియున్నాను. ఒక్కరైనా ఒక్క మేకపిల్లనైనా నాకివ్వలేదనెను. ఈ మాటలోనే తన సేవయొక్క విలువ పోయినది. సేవయే గాని విలువలేని సేవ అయినది. తప్పిపోయిన కుమారుని చరిత్రలో పెద్దకుమారుడు తమ్మునికి అన్ని చేసిరి నాకు చేయలేదే అని అనుకొనుట నేరము. ప్రభుని శిష్యులు 12మంది 5000 వేల మందికి ఆహారము పంచిపెట్టియున్నారు. అందులో ఒక్కడైన ఇస్కరియోతు యూదాకూడా ఆహరమును పంచెను. యూదా పంచగా తిన్నవానికి ఆకలి తీరినదిగాని పంచిన ఇస్కరియోతు యూదాకు ఆకలి తీరలేదు. అలాగే సేవవల్ల ఆకలి తీరని సేవకులున్నారు వాక్యమును పంచగా విన్న విశ్వాసుల యొక్క ఆకలి తీరును. పాపములు విడిచిపెట్టి సేవచేసినప్పుడే అకలి తీరును అప్పుడు సేవకునికి బోధ విన్నవానికి ఆకలి తీరును.

రక్షణ తెలుసుకొన్న విశ్వాసి, విశ్వాసములో బలపడి ఎదుగవలెనంటే ఆది కాండము నుండి ప్రకటన గ్రంధము వరకు బాగుగా చదువవలెను. మనుష్యుల దయ యందును దేవుని దయయందును జ్ఞానమందును వృద్ధి పొందుటయే దీని భావము. బైబిలు వివరించుటకు బోధకులు ఉన్నారు. జ్ఞానమందు ఎదుగుటకు వాక్యము ఉన్నది. బోధకులు, బైబిలు, పశ్చాత్తాపము, వివరము వీటన్నిటిలొ ఏదియు కొట్టివేయలేము. కొందరు వివరము తెలిసికొనుటకు యిష్టములేక మేము రక్షణ పొందియున్నాము. అని మీరు చెప్పునది మాకు అక్క్రలేదందురు. మత్తయి సువార్త 4వ అ. లో సైతాను ప్రభువు కొండ మీదకు తీసుకొని వెళ్ళితే అక్కడకు ప్రభువు వెళ్ళిరి. ప్రభువు ఎందుకు వెళ్ళిరి? ఇక్కడ మనిషి చేతిలో కర్రవున్నది. దురముగా పాము కనబడుచున్నది చేతిలో కర్రౌన్న మనిషి పాము ఉన్న దగ్గరకు వెళ్ళితేనే తప్ప పామును కొట్టలేడు. అందుకే ప్రభువు సైతాను యొద్దకు వెళ్ళి వాక్యముతో సైతానును జయించెను.

  • 1) ఇదిగో
  • 2) అప్పుడు
  • 3) మరియు

అను ఈ మాటలు తరచుగా బైబిలునందు వాడబడినవి. ఏదైన ఒక క్రొత్త సంగతి చెప్పబోవునప్పుడు ఈ మాటలు వ్రాయబడియున్నవి. అందులో బలమైనది ఇదిగో అను మాట ప్రభువు యోహానుతో వ్రాయుము అని చెప్పెను. వ్రాతలలో పడక పోయిన యెడల దేవుని వాక్యమునకు విలువలేదు. ఆదికామడము నుండి ప్రకటన గ్రంధము వరకు వ్రాయకపోతే బైబిలునకు విలువలేదు. వ్రాతలో లేనియెడల సైతానుకు లోకువ. సమయము వచ్చునప్పుడు ఎక్కడ వ్రాయబడి యున్నది అని ప్రశ్నవేయును. అందుకే ప్రభువు సాతానును వాక్యముతో ఎదిరించెను. మనుషులకు నచ్చజెప్పుటక్కై వ్రాతలో పెట్టెను. మనుష్యులు ప్రార్ధన చేయునప్పుడు వ్రాయబడిన వాగ్ధానములు ఎత్తి ప్రార్ధించుటకై వ్రాయించెను. మాకు అన్ని కష్టములే అని విశ్వాసులు అనుకొనకుండగా వ్రాయించెను. మనస్సాక్షికి పలాన చోట వాక్యములో ఇలాగు వ్రాయబడియున్నదని తెలియజేయుటకును నిరాశ పడవద్దని మనకు ఆదరణ చెప్పుటకును వ్రాయించెను. పలుకబడిన వాక్యము వ్రాయబడినందున మార్చుటకు ఎవరికి వీలుకాదు. ఒకవేళ ప్రకటన గ్రంధములోని వ్రాయబడిన మాటలు మార్చిన ప్రకటన గ్రంధములోని తెగుళ్ళు వారికి సంభవించును.

మత్తయి 4వ అ||లో ప్రభువును శోధించుచున్న సాతానుతో వ్రాయబడి యున్నదని దాని ప్రశ్నకు విరుగుడు చెప్పెను గనుక సాతానుడు పారిపోయెను. వ్రాయబడిన దానిని బట్టి కోర్ట్లులో కేసుజరుగును. క్రైస్తవ మతము న్యాయశాస్త్రము కాదు. ఇది ప్రేమ శాస్త్రమని ఒక జడ్జిగారు నిర్వచనము చెప్పిరి. మరొకరు బైబిలు గ్రంధమును సైతానుడు నాశనము చేసిన పరవాలేదు. ఎందుకంటే బైబిలు గ్రంధములోని అనేక మాటలు ఇతర పుస్తకములలో వ్రాయబడి యున్నది గనుక వాటినన్నింటిని సమకూర్చి మరలా వ్రాయగలమని పలికిరి.

  • 1) మనస్సాక్షి మీద
  • 2) రాతి మీద
  • 3) బెరడులు మీద
  • 4) అరటి బోది మీద
  • 5) చర్మము మీద
  • 6) రెక్కలు మీద
  • 7) ఆకులు మీద
  • 8) రాళ్ళమీద
  • 9) కాగితము మీద వ్రాయబడియున్నది.
మనస్సాక్షి నుండి కాగితమువరకు బైబిలు గ్రంధములోని విషయములువ్రాయబడెను.
  • 1) సైతానుడు బైబిలు ఎవరికి దొరకకుండ చేయగోరుచున్నాడు.
  • 2) ప్రకటన గ్రంధము ఎవరికి దొరకకుండా చేయబోవుచున్నాడు
  • 3) ప్రకటన గ్రంధ వివరములుగల నోట్సు ఎవరికి దొరకకుండా చేయబోవుచున్నాడు.
  • 4) ప్రకటనగ్రంధ వ్యఖ్యానాలు చెప్పేవారిని భూమిమీద లేకుండ చేయుటకు చూచుచున్నాడు. ఈ విధముగా సైతాను వీటిని నాశనము చేయ చూచుచున్నాడు.

ప్రక. 21:7. జయించువాడు వీటిని స్వతంత్రించు కొనును. నేను అతనికి దేవుడనై యుందును. అతడు నాకు కుమారుడై యుండును.

నీటిబుగ్గ, నీరు, ఊరుట, నిత్య జీవము మున్నగునవి ఈ అధ్యాయములో చూచియున్నాము. వానిని అను భ వించుటకు ఈ లోకమును జయించుట ముఖ్యము. జయించువారు వీటిని స్వతంత్రిచుకొనును. నేను తండ్రిని నీవు నా కుమారుడవు అని ఆయనకును పరిశుద్ధులకును ఉన్న సంబంధము ప్రభువు బయలు పరచెను.

ఎవరు వెళ్ళరు

ప్రక. 21:8, పిరికివాడును, అవిశ్వాసులును, అసహ్యులును, నరహంతకులును, వ్యభిచారులును, మాత్రికులను, విగ్రహారాధికులును, అబద్దికులు అందరును అగ్ని గంధకముతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణము.

పై ఉదహరించిన ఎనిమిది తరగతులు వారు దేవుని రాజ్యములో ప్రవేశింపలేరు.

  • 1) పిరికివారు: ఈ లోకములో దేవునిని ఒప్పుకొనుటకు ధైర్యము లేని పిరికివారు మోక్షమునకు వెళ్ళలేరు. ప్రభువునిగూర్చి సాక్ష్యము నిచ్చుటకు, భక్తిగా నుండుటకు, న్యాయ సాక్ష్యమిచ్చుటకు పిరికితనము పనికిరాదు. శోధన వచ్చిన జయించుటకు నిశ్చయించుటకు నిశ్చయించుకొనవలెను.
    ఉదా:- లోకములోని ధనవంతులైన వారికి భయపడి పేదవారి పక్షముగా న్యాయ సాక్ష్యము ఇవ్వకపోవడము పిరికితనము. అట్టిది ఉండకూడదు.
  • 2) వీరి చర్యలు అపనమ్మిక, పరలోకముమీద దేవుని మీద, బైబిలుమీద తుదకు నరకము మీదకూడా నమ్మిక ఉండదు. వారి యందు వారికే నమ్మకము ఉండదు.
  • 3) అసహ్యులు: విగ్రహారాధనయొద్ద జరిగే అసహ్యకరమైన పనులలో ఏకీభవించువారు అసహ్యులు.
    ఉదా:- ఊరిలోనివారు విగ్రహములయొద్ద ఆరాధనచేసి అన్నము వండి ఎన్నిరోజులు పండుగ జరిగింతురో అన్ని రోజులు ఆ మొదట పోసిన అన్నములోనే మరలా వండిపోసి తినుదురు. ఇది దేవుని ప్రసాదమని పాపాచారములలో పాల్గొనెదరు. ఇట్టివారు అసహ్యుయులు.
  • 4) నరహంతకులు : కడుపుకు మించి ఎక్కువగా తినుట, శక్తిలేక గంజి త్రాగుట, వ్యాధివస్తే మందు వేసికొనకుండా చావు నాశించుట, ఇతరులను చంపుట, తన్ను తనను చంపుకొనుట, కోపము, పగ సాధించుట యివన్నియు నరహత్యే.
  • 5) వ్యభిచారము:- భార్య భర్తల కలహము, కొట్టుట, తిట్టుకొనుట, పరస్త్రీ వ్యామోహము మొ||నవి. కలిగియుండు వారు వ్యభిచారులు.
  • 6) మాంత్రికులు: మంత్రాలు చెప్పించుకొనుట, శకునముచూచుట మున్నగునవి. ఇట్టివి మోషే కాలములో యెక్కువగా ఉండెను.
  • 7) విగ్రహారాధికులు: పాలేరు యజమానికి ఎల్లప్పుడు మ్రొక్కుట పంతులుగారే దేవుడని అనుకొనుట, దేవునికన్న ఎక్కువగా తనను, తనవారిని ప్రేమించుట లోకములోని వస్తువులను అత్యధికముగా ప్రేమించుట, కష్టములను బట్టి ఎరుగక మతములోనికి వచ్చెనని చెప్పుట, దేవునియెడల బొంకుట, ఇవన్నియు అబద్ధికులకు సంబంధించినవే.

పై ఎనిమిది రకములైన పాపములు మనలో ఉన్నయెడల లేక వానిలో ఒకటైన ఉన్నయెడల మారునసూ లేనట్లే, రక్షణ లేనట్లె, మోక్షము లేనట్లె, పెండ్లికుమార్తె వరుస లేనట్లే.

  • 1) వాతము
  • 2) పైత్యము
  • 3) శ్లేషము
  • 4) మేహము ఈ నాలుగు రకముల వ్యాధులవల్ల మనిషికి కీడు.

మేహము వల్ల ఉడుకు, త్రేనుపులు వల్ల పైత్యము, జలుబువల్ల శ్లేషము, శరీర బాధలువల్ల వాతము. మనము ఒక పాపమును తీసివేసికొనలేక పోవుట మరొక పాపము అగును. తీసివేసికొనుట కిషముండి తీసివేసికొనలేక మరొకరి సహాయము కోరుకొనుతయే పాపపరిహారము. కొందరికి పాపము ఉన్నదని తెలియును. కొందరికి పాపమున్ననుదని ఇంకొకరు వచ్చి చెప్పినయెడల తెలియును. అప్పుడు వారు తీసివేసికొనగలరు.

ధనవంతుడు దేవుని రాజ్యములో ప్రవేశించుటకంటే ఒంటె సూది బెజ్జములో దూరుట సులభము. అనగా ధన్యుడు దేవుని రాజ్యములో ప్రవేశించుట దుర్లభము యెరూషలేము చుట్టు ప్రాకారము ఉండెడిది. నాలుగు ప్రక్కల ఇనుప తలుపులు ఉండేవి వాటిని తీయవలెనంటే మనుష్యులు తీయలేరు గాని ఏనుగులే తీయవలసియుండును. ఎదురుగ పెద్ద గుమ్మమములు ఉండేవి. వెనుక భాగమునందు చిన్న గుమ్మములుండేవి. పాకీవారు ఈ గుమ్మముగుండా చెత్త పారవేయుదురు. ఒంటెలపై యెరుషలేము లోపలికి సరుకులతో వెళ్ళువారు ఈ చిన్న గుమ్మములలో గుండా ప్రవేశించుట కష్టము ఆ చిన్న గుమ్మమునకే సూది బెజ్జమని పేరుపెట్టిరి.

పై చూపబడిన ఎనిమిది విధములైన పాపములు మోషే ధర్మశాస్త్రమునకు సంబంధించినవే. సీనాయి పర్వతము మీద మోషే పది ఆజ్ఞలుగల రెండు పలకలను తీసికొనెను. కొండపై మోషే మధ్య భాగమున యెహోషువా ఉన్నారు. ఇంకా క్రింద అహరోనును ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు. కొండపై నున్న మోషే యెహోషువా యొద్దకు దిగిరాగ ఇశ్రాయేలు ప్రజలు సందడి వినబడెను. మోషే కోపముతో మండిపడి ఆ పలకలు పడవేసెను. అది పగిలిపోయెను. దేవుడు వ్రాసిన మొదటి ఆజ్ఞలోనే విగ్రహారాధన కూడదని తెలియజేయబడగ క్రిందనున్న ప్రజలు అదే చేయుచుండిరి. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశములో విగ్రహరాధన చూసిరి. వారి నైజములో అదే ఉన్నది. అదే ఇక్కడ చేసిరి. ఐగుప్తుదేశములో ఇశ్రాయేలీయులకు విగ్రహారాధన చేయుటకు అవకాశము లేనందున అక్కడ చేయలేకపోయిరి. లేని యెడల అక్కడే చేసియుందురు.

ఏదేను తోటలో మొదట దేవుడు మనిషికి మనస్సాక్షి ఇచ్చినపుడు ఆజ్ఞలు వ్రాసిరి. అది వారు గైకొనలేదు. గనుక రెండవసారి పలకపై వ్రాసి దేవుడు ఆజ్ఞలను వారికి ఇచ్చెను. ఏదేనులో ఒక కాంతి ఆదాము, అవ్వలకు దేవుడిచ్చెను. తినవద్దు అన్న పండు వారు తిన్నారు. తిన్నారు అన్న దానిలోనే పది ఆజ్ఞలు ఇమిడి యున్నవి. అగ్ని, గంధకము అనునవి "సొదొమ గొమరాలకు" సంబంధించిన విషయములు. మనస్సాక్షి రెండు విధములు ఒకటి మన ఇష్టము ,రెండు మనస్సాక్షి యిష్టము, ఎనిమిది పాపములున్నను పది ఉన్నట్లే, పది పాపములు ఉండి అగ్ని గంధకము యొద్దకు వచ్చి యున్నాము. ఇచ్చటనుండి ఏదేను వనము వరకు వచ్చియున్నాము. దీనిభావమే రెండవ మరణము. ఇట్టివారు అగ్ని గంధకములో మండు ధూపములో పడవేయబడుదురు. అందరును శరీర మరణమునే చూచుచున్నారు. దీనివల్ల నష్టము లేదుగాని భయంకరమైనది రెండవ మరణము.

  • 1) చూచుచు ఉండుట
  • 2) ప్రాణముతోనే ఉండి మరణము పొందుచు ఉండుట దీనినే అగ్ని ఆరదు , పురుగు చావదని వ్రాసినారు.

ఉదా:- శ్రమలో ఉన్నవారు నాకు చావంత శ్రమ వచ్చింది అని అందురు.

అగ్ని గంధకములు ఆది.కా. 19అ||లో కనబడుచున్నది. అందులో అయిదు పట్టణములు ఉన్నవి. దేవుడు నాలుగు పట్టణములను నశనముచేసి "సొదొమను" అగ్ని గంధకముతో నాశనము చేసెనని వ్రాయబడి ఉన్నది. ఈ ఎనిమిదవ వచనములో చివరి భాగమున అగ్ని గంధకమని వ్రాయబడి యున్నది. అగ్ని ఉన్నయెడల ఇల్లు కాలును, గంధకము ఉన్నయెడల అగ్ని నిలబడిపోవును. గనుక అదోలోకమునకు దిగిపోవును అగ్నివల్ల నాశనము గంధకమువల్ల గొప్ప నాశనము. ఇవి రెండు భయంకరమైన నాశనములు.

క్రొత్త యెరూషలేం

ప్రక 21:9. ఇటు రమ్ము పెండ్లికుమర్తెను అనగా గొర్రెపిల్లయొక్క భార్యను నీకు చూపెదను.

  • 1) పరలోకములో నూతన యెరూషలేము ఉన్నది.
  • 2) పరలోకములో పెండ్లికుమార్తె ఉన్నది.
  • 3) పరలోకములో గొర్రెపిల్లయొక్క భార్య ఉన్నది.

నూతన యెరూషలేము అనగా పెండ్లికుమార్తె. పెండ్లికుమార్తె అనగా గొర్రెపిల్లయొక్క భార్య. నూతన యెరూషలేము అనగా వధువు సంఘము. వధువు సంఘమనగా దేవునియొద్ద మిక్కిలి ఉన్నతమైన స్థలము వద్ద ఉండవబోయే భక్తుల సమూహము. వీరు మోక్షములో దేవుని సిం హాసనమువద్ద ఉందురు.

శిష్యుడైన యోహాను ఖైదీగా లంకలో ఆత్మపరవశుడై ప్రార్ధనలో ఉండెను. కనిపెట్టు మెట్టులో ఉండెను. యోహాను శరీర వశములో లేడు దానినే పరవశత అందురు. తాను ఈలోకములో లేడు తాను ఏమైయున్నాడో తనకే తెలియదు. ఆత్మ వశములో ఉండెను.

  • 1) శరీరము
  • 2) ప్రాణము
  • 3) జ్ఞానశక్తి పరవశతలో ఉన్నప్పుడు ఈ మూడును కట్టివేయబడును
యోహానునకు ఈ మూడును కట్టివేయబడెను. రమ్ము అని పిలుపురాగానే ఆయన ఆత్మ వినెను. గొర్రెపిల్ల భార్య చూపించెదను అనుమాత వినవచ్చెను.

ప్రక. 21:10. ఆత్మవశుడనైయున్న నన్ను ఎత్తైన గొప్ప పర్వతము మీదకు రమ్మని పిలిచెను. ఈ కొండ పరలోకములో ఉన్న సీనాయి కొండ. ఈ వాక్యమునుబట్టి పరలోకములో కొండలు ఉండునని తెలిసికొనుచున్నాము. ఇవి మహిమ కొండలు. కొండలు నల్లగా కనబడును. పరలోకపు కొండ నలుపు కాదుగాని తెలుపే. మనము నది ఒడ్డున ఉన్నప్పుడు ఒడ్డులో నీరు తెల్లగా నుండును. లోతుగా వెళ్ళినప్పుడు ఆ నీరు నల్లగా కనబడును. ఇక్కడ నలుపు అనగా తెలుపు అని అర్ధమిచ్చుచున్నది. అలాగే పరలోకమదున్న ఆ కొండ తెల్లగా ఉండును.

  • 1) నూతన యెరూషలేము
  • 2) గొర్రెపిల్ల భార్య
  • 3) పెండ్లికుమార్తె
  • 4) వధువు సంఘము
  • 5) పరిశుద్ధ పటణము.
ఈ ఐదు మాటలయొక్క అర్ధము పెండ్లికుమార్తె. యోహాను ఆ కొండ మీదకు ఎక్కి వెళ్ళినాడు. అనగా మహిమలో అంతస్థులో యెదిగినాడని తెలియుచున్నది.
  • 1) శరీరమును
  • 2) లోకమును
  • 3) సాతానును యోహాను జయించెను.

ఈ మూడు యెక్కుటకు సాతాను ఆటంకము. విశ్వాసులు, విశ్వాసములో దినదినము యెదుగుచు వాటిని జయించినయెడల యెక్కగలము గనుక క్రైస్తవులు పైరీతిగా యెదుగవలెను.

ప్రక 21:12. ఆ పట్టణమునకు ఆ పట్టణమునకు యెత్తైన ప్రాకారములును పండ్రెండు గుమ్మములుండును. పన్నెండు గోత్రములు నామములు ఆ గుమ్మముల మీద వ్రాయబడి ఉన్నవి.

యోహాను భూమిమీదనుండి యెక్కిపోయెను. దేవుని యొద్ద నుండి పరిశుద్ధ పట్టణము దిగివచ్చుట చూచెను.

  • 1) దేవుని ఆజ్ఞలు నెరవేర్చుటకు సీనాయికొండ
  • 2) శ్రమలు అనుభవించుటకు కల్వరికొండ
  • 3) బోధ వినుటకు ఒలీవల కొండ
  • 4) మహిమ లోనికి యెదుగుటకు ఇంకా పరలోకమునకు యెక్కి వెళ్ళలేదు.

పరలోకమునుండి పెండికుమార్తె దిగివచ్చుచుండెను. ఆమె దేవుని మహింలో ధగధగ మెరయు చుండెను. ఆ పట్టణము యెత్తైనది. అది ప్రాకారముగలది. దానికి పన్నెండు గుమ్మములు ఉన్నవి. దానియొద్ద పన్నిద్దరు దేవదూతలున్నారు. ఆ పండ్రెండు గుమ్మాలకు పండెండు గోత్ర కర్తల పేర్లు ఉన్నవి. ఇవి యోహానుకు కనబడెను.

ఇశ్రాయేలీయులు యెరుషలేమునకు రాకమునుపు సీనాయి పర్వత అరణ్యమందు గుడారములు వేసిరి. గుడారములు చుట్టు ఉండగా మధ్య ఆరధన జరుగు ప్రత్యక్ష గుడారము ఉండెను. ఒక్కొక్క ప్రక్క మూడు గోత్రముల గుడారముల చొప్పున నాలుగు దిక్కులకు పండెండు గోత్రముల గుడారములు ఉండెను. ఈ గుడారములు ఇశ్రాయేలీయులకు సరిహద్దులై యున్నవి. పరలోక ప్రాకారమునకు గుమ్మలచుట్టు ఉండుటకు యేర్పాటు చేయబడిన ఈ గుడారాలు ముగుర్తై యున్నవి.

పండ్రెండు మంది అపోస్తులులు సంఘ స్థాపకులు గనుక పట్టణము యొక్క పండెండు పునాదులుగా నున్నారు. మొదట ప్రభువునుగూర్చి తెలిసికొనుటకు పాతనిబంధనలలో గోత్ర కర్తలు ఉన్నారు. వారు పాత నిబంధన ప్రతినిధులు.

ప్రక. 21:16. ఆ పట్టణము చచౌకమైనది.

దూతల చెతిలో కొలకర్ర ఉన్నది చచౌక మైనదనగా ఎగుడు దిగుడు లేనిదై యున్నదని, తెలియుచున్నది. అన్ని సమానముగా దేవుడు ఇచ్చిన కొలత, అంతయు సమానమని అర్ధము. ఆ స్థలము 1500 మైళ్ళ స్థలము ఈ స్థలమును పెండ్లికుమార్తె పరలోకములో ఆక్రమించుకొని ఉన్నది. ఒక మనిషి కూర్చుండుటకు అర్ధగజము చాలును. ఆ చొప్పున 1500 మైళ్ళ స్థలములో ఎందరు కూర్చుందురో మనము తలంచవలెను. అందు కోట్లకొలది కూర్చునియుందురు.

ప్రక. 21:17. అతడు ప్రకారమును కొలవగా 144 మూరలైనది. పొడవు, ఎత్తు, వెడల్పు, అంతయు ఒక్కటే. అనగా పెండ్లికుమార్తె సమానమైన అనుభవము కలిగియుండును.

ప్రక. 21:19. ఆ పట్టణపు ప్రాకారపు పునాదులు అమూల్యమైన నానావిధ రత్నములతో అలంకరింపబడి యుండెను.

ఆ పట్టణము సూర్యకాంతముతో కట్టబడెను. అది స్వచ్చమైనది. శుద్ద సువర్ణముగా నుండెను. ప్రాకారము అలంకారమే, నానావిధ రాళ్ళతో అలంకారముగా నుండెను.

యోహాను సువార్త 11వ అధ్యాయములో నీవు ఉంటే నాతమ్ముడు చావకుండెను అని మార్త యేసుపై నిందమోపెను. ఈమె ప్రభువునందు చాలా భక్తిగల స్త్రీ గనుక అంత నిందవేసినది. ఇన్నాళ్ళనుండి నాతో ఉన్న నీవు ఇది యెరుగవా అని పిలుపుతో ప్రభువు పలికెను. గ్లాసులో నీళ్ళుపోసి ఇంద్రధనస్సు రంగులు సుళువుగా చూడగలము. ఒక్క రంగులోనే ఏడు రంగులు కనబడును. అలాగే ఈ పండ్రెండు రాళ్ళ కాంతి యేసుప్రభువు యొక్క మహిమకు గుర్తైయున్నది. ఎఫెసు సంఘముకంటే స్మర్ణ యెక్కువ. అలాగే ఒక దాని కన్న మరొకదాని మహిమ యెక్కువ 1కొరింథి 15వ అ||లో వేరు వేరు మహిమలు కలవు. అలాగే సంఘములయొక్క మహిమలో తేడాలున్నవి. అలాగే పండ్రెండు రాళ్ళ యొక్క కాంతి వేరువేరుగా నుండును. ఈ కాంతి గుమ్మములలోను పునాదులలోను ఉన్నవి. యెక్కువ మహిమ సంపాదించుకొనవలెనంటే ఎక్కువ కష్టములు అనుభవింపవలెను.

ముత్యము: ముత్యపు చిప్ప సముద్రములో ఉండును. అందులో మాంసము ఉండును. సముద్రములోని ఇసుక ముత్యమునకు అంటుకొనును ముత్యము ఇసుకను రుద్దుకొనెను. అప్పుడు ముత్యపు చిప్ప బయటకు వచ్చును.

ఒక గంగాళము ఉన్నది దానికి రంధ్రము లున్నవి. అందులో బెంచీలు ఉండును. రంధ్రమునుండి గొలుసు ఉండును. పైనున్నవారు గొలుసును దించగా గంగాళము క్రిందకు దిగును. అందులో లెత్ ఉండును అది తిన్నగా ముత్యము ఉన్న గొయ్యిలోనికి వెళ్ళును. గంగాళములో బెంచీలపైనున్న మనుష్యులు బిందెలలో పట్టుకొని వెళ్ళును. గంగాళములో బెంచీలపైనున్న మనుష్యులు బిందెలలో పట్టుకొని ఆ ముత్యములను సంచిలో వేసికొందురు. యెన్ని దొరికిన అన్ని సంచిలో వేసికొందురు. మత్తయి సువార్తలో ముత్యాల వర్తకుని గూర్చిన ఉపమానము ప్రభువు చెప్పెను. (మత్తయి 13:45).

పాతనిబంధన కాలములో బలి హేబేలుతో ప్రారంభమాయెను. తరువాత అబ్రహాము ఇస్సాకును బలిగా నర్పించుటకు దేవుడు కోరెను. మోషే కాలములో బలి నిమిత్తమైన నిబంధనలు ఏర్పడెను. ఆఖరుబలి యేసుప్రభువే; ప్రభువుతో బలి ముగింపు ఆయెను. పశువులను బలివేయునప్పుడు వాటికి బహు బాధ కలుగును. మన నిమిత్తమై ప్రభువు సిలువ వేయబడినప్పుడు చలా బాధ నొందెను. పాత నిబంధన బలులు క్రీస్తునకు ముగుర్తైయున్నది పాత నిబంధనలో జంతువులు ఏ ప్రకారంగా చాలా బాధ పడెనో అలాగుననే క్రీస్తు ప్రభువు కూడా సిలువలో బాధనొందెను. ఆయన పడిన బాధవల్ల ముత్యములు తయారయ్యెను. పాతనిబంధన గ్రంధము యెంత పురాతనమైనదైన అది పునాదికాదు. పాత నిబంధన. క్రొత్త నిబంధనకు ముంగుర్తై యున్నది గనుక మొదటిది క్రొత్త నిబంధనయే. మండల దినములలో బోధకులు ఈ యాగములన్నియు వివరించి చెప్పిన బాగుండును. యెంతో శ్రమ పడితేనే తప్ప ముత్యములు దొరకవు. శిష్యులు సువార్త ప్రచారములో శ్రమపడిరి గనుక వారికి మహిమ దొరికెను. ముత్యమనగా శ్రమ.

ప్రక.: 21:21. పట్టణపు రాజవీధి శుద్ధ సువర్ణమయమై స్వచ్ఛమిన స్ఫటికమును పోలియున్నది.

రాజులు వేసే బాటలకు రాజవీధి అందురు. క్రైస్తవుల మతము రాజ మతము. క్రైస్తవుల మతములో రాజులు ఉన్నారు. చిక్కులు వచ్చిన రాజులందరు యేకమగుదురు. ఈ రాజవీధి మనుష్యులువేసిన వీధికాదు. ప్రభువే స్వయముగా ఈబాట వేసెను. ఈ బాట మోక్షమునకు నడిపించును. లోకములోని ఉన్న మార్గములు నానావిధములుగా ఉన్నవి. ఇవి మనుష్యులను భ్రమపరచి యే గుహలోనో ఉన్న పులి నోటిలోనికి నడిపించును. ప్రభువు వేసిన బాటయితే శుద్ధ సువర్ణమయమై ఉండును. ఈ రాజవీధులు స్వచ్ఛముగా ఉండును. బురద, చెత్త, బంధ ఉండదు.

ప్రక: 21:22. దానిలో యే దేవాలయము నాకు కనబడలేదు గొఱ్ఱె పిల్లయే దానికి దేవాలయమై యున్నారు.

దేవాలయమును గూర్చి హగ్గయి యెక్కువగా వ్రాసెను. ప్రతి ఊరిలోను దేవాలయములు ఉండవలెను. నేను మీలోను, మీరు నాలోను ఏకమై యుందురని ప్రభువు పలికెను. ఇదే ప్రకటన వాక్యములోని దేవాలయములయొక్క అర్ధము. అన్యులు, క్రైస్తవులు, యూదులు అనేక దేవాలయములను కట్టుచున్నారు. కాని ఆ దేవాలయములు ఈ దేవాలయము వంటిది కాదు.

  • 1) భూలోకములో హృదయమనే దేవాలయములో
  • 2) అసలైన దేవాలయములో
  • 3) పరలోకములోనున్న దేవాలయములో ప్రభువును మనము ఆరాధించుచున్నాము.
ప్రభువు సర్వాధికారియును దేవుడునైయున్నాడు ఆయనే ఆలయముకూడ అయ్యున్నాడు. ప్రభువు మనిషియు దేవుడునై యున్నాడు మన హృదయములలోనుండి ఆయనను ఆరాధింపవలెనను తలంపున్నందున ఆయనను ఆరాధించుచున్నాము. దేవాలయములోను దేవాలయము ఉన్నది.
  • 1) హృదయ దేవాలయము
  • 2) నిర్మిత దేవాలయము
  • 3) అదే దేవాలయమై ఉన్నది. అసలు దేవుడు దేవాలయమై యున్నాడు.
  • 1) హృదయములో
  • 2) నిర్మిత దేవాలయములో
  • 3) దేవునిలో ఆరాధన ఉండును.

నాలో మీరు మీలో నేనును ఉందునని ప్రభువు అనెను. అది పరలోకములోనికి వెళ్ళిన పిదప గ్రహింపగలము. ఇద్దరు, ముగ్గురు కూడి ఆరాధించె దానిని ఇద్దరి ముగ్గురి దేవాలయము అందురు. ఒకరు చేసేవి ఒకరు ఉన్న ఆలయము. పరలోకములో అదే దేవాలయమునకు వెళ్ళకముందు

  • 1) హృదయములో
  • 2) దేవాలయములో ఎక్కడబడితే అక్కడ ఆరాధించుదము. పరలోక ఆరాధనలో ఏకీభవించుట నిత్యారాధన.

ప్రక:21:23. పట్టణములో ప్రకాశించుటకు సూర్యుడైనను, చంద్రుడైనను అక్కరలేదు. గొఱ్ఱెపిల్లయే దానికి దిపము.

ఆ పట్టణమునందు వెలిగిచ్చుటకై గొఱ్ఱెపిల్లయే దీపమైయున్నది. దేవాలయములో వెలిగించుటకై దీపము అవసరము. దేవాలయములో ఆరాధించుటకై వెలుగు అవసరము. పగటిలో సూర్యునివల్లను, రాత్రిలో చంద్రుని వలనను మనకు వెలుగు అవస్రము. సూర్య, చంద్ర, నక్షత్రాదులు, దీపములు అన్నియు ఇక్కడికి అవస్రము. ఇవి పరలోకమునందు అవసరము లేదు. కాగడ, మైనపువత్తి కాంతి అక్కరలేదు.

రవితోను కుముదబాం - ధవుతోను మఱి దేప- చవితోను దాని
కవ-సర మింతలేదు= అవిరతమున గ్రీసు-డందుండు ప్రభతో
సం-స్తవమై వైభవమై యు-త్సవమై వెల్గుచునుండు ||పరిశుద్ధి||

రవి అనగా సూర్యుడు, కుముద బాధవ అనగా చంద్ర, నక్షత్రాదులు. అవిరతయు అనగా ఎల్లప్పుడు ప్రభువే ప్రకాశించును. సంస్తవమై అనగా ఆయన నేర్పించుకొనువాడు. వైభవమై అనగా ప్రకాశించుచు, యుత్సవమై అనగా ఆనందముగా.

గొఱ్ఱెపిల్లయే దానికి దీపము. గొఱ్ఱెపిల్లగా కనబడుట. గొఱ్ఱెపిల్ల దీపముగా నున్నారు. ప్రభువు వెలుగైయున్నారు. కొండమీద ప్రసంగముచేసిన ప్రభువు నేను లోకమునకు వెలుగైయున్నానని పలికెను.

ప్రక: 21:24. జనములు దాని వెలుగునందు సంచరింతురు, భూరాజులు తమ మహిమను దానిలోనికి తీసికొని వత్తురు.

భూలోకములోని ప్రజలు పగటికాలములో స్వేచ్చగా తిరుగునట్లుగా పరలోకములో ఎల్లప్పుడును వెలుగుగా ఉండును గనుక ప్రజలు స్వేచ్చగా తిరుగుదురు. జనములు అనగా మనమే. అనగా అన్ని ఖండములవారు, అన్ని భాషలు మాటలాడువారు, రక్షింపబడినవారు సంచరించుదురు. అన్ని జాతులలోని రక్షితులు పరలోకమునకు వెళ్ళగలరు. పరలోకమునందు సేచ్చగా సంచరింతురు.

ఉదా:- భూలోక దేవాలయమునకు అన్ని జాతులవారు బేధము లేకుండగా వెళ్ళినట్లు అన్ని జాతులలో నుండి రక్షింపబడినవారు మాత్రమే ఆ వెలుగులో సంచరించెదరు. ఆవగింజంత చిరుపాపము లేకుండ వధువు సంఘమునకు సిద్ధపడవలెను. అప్పుడే ఆ వెలుగులో సంచరించగలము. గొఱ్ఱెపిల్ల అను వెలుగు ప్రభువునకే చెందును. భూలోకమునందు సిలువ మ్రానుపై ప్రభువు వధింపబడెను గనుక ఈ వెలుగు వచ్చెను. ఆయన దేవుడైనను మన నిమిత్తమై మనిషై పాపములు పరిహరించు నిమిత్తమై యజ్ఞమైనారు.

  • 1) ఆయన దేవుడైయున్నాడు
  • 2) ఆయన మనిషై యున్నాడు
  • 3) గొఱ్ఱెపిల్లయెయున్నాడు.
గొఱ్ఱెపిల్ల రూపము నేటి దినమందు ద్వార బంధములపై వెసికొనుచున్నారు. గొల్లవాని రూపము తలుపులు మీద వేసి కొనుచున్నారు. గొర్రెపిల్లను ఎత్తుకున్న గొల్లవాని రూపమును వేసికొనుచున్నారు. గొఱ్ఱెపిల్ల సంఘమునకు గుర్తైయున్నది.

ప్రక: 21:25. అక్కడ రాత్రి లేనందున దాని గుమ్మములు పగటివేళ వేయబడవు.

పరలోకము నందు ఎల్లప్పుడు పగలే యుండును. సముద్రము ఉండదు. పాపాంధకార రాత్రి యుండదు. రాత్రి అనేది ఉండదు. పగలు, చీకటి ఉండదు. అప్పుడు ఉండే ఆ కాంతి ఇప్పుడు మనము చూడలేము. అవి యెట్లుండునో మనకు తెలియదు. గ్రహించలేము ఆ కాంతికి ఈ లోకమందున ఏకాంతినైన పోల్చి ఈలాగు ఉండునని చెప్పలేము. దర్శనములలో ఉండే మహిమకన్న కొన్ని కోట్ల రెట్లు అధికముగా నుండును. పగలు భూప్రజలందరికేగాని మహిమ అందరికి కాదు. ఈలోకములోని పగలు సూర్యునితో చేయబడినది. పరలోకములోని పగలు మహిమ కాంతితో చేయబడెను. ఆ పగటి కొరకు ఈ పగటివేళ సిద్ధపడవలయును (రోమా 13:12) (యెషయా 16:1-3) రాత్రి దైవజనులకు పగలుగానే ఉండును. రాత్రులలో ఉపవాసము ఉండువారికి పరలోకపు కాంతి ప్రకాశించుచుండును.

దేవాలయమునకు మనవద్ద ఉన్నట్లు కానుకగా తీసికొని వెళ్ళినవానిని చనిపోయిన భక్తులు పరలోకమునకు కానుకలు తీసికొని వెళ్ళుదురు. వారి శరీరము యిచ్చట ఉండును. ఆత్మకనుకలు తీసికొని వెళ్ళుదురు భూరాజులు తమ మహిమను కానుకలుగా లెత్తురు. ప్రజలు తమ మహిమను, ఘనతను తీసికొని వెళ్ళుదురు. భూలోకములో ఉన్న రాజులకు రాజ్యము అప్పగించెను. ఆదేశ-లో జనములున్నారు వీరు రాజును తండ్రివలె ప్రేమింపవలెను. ప్రజలను రాజు బాగుగా పరిపాలించినందున ప్రజలు మెచ్చుకొన్నా ప్రజల ఆ మెప్పే మహిమ అందురు. ప్రజలు తమ రాజును గూర్చి సాక్ష్యమిచ్చెదరు. ఆయన మహిమనుగూర్చి తెలియజేయుదురు. అన్నదానముచేసి సత్రములు కట్టించి, బీదలను పోషించి ధర్మపాలనచేసిరని మెచ్చుకొందురు. ఇది మెప్పు మెప్పె మహిమ, మహిమే మెప్పు. ఘనత మహిమే.

ఒక రాజు గారు ఉన్నారు. ప్రజలను కష్టపెట్టి కొన్ని సంవత్సరములు యేలి దుష్టపాలనచేసి చనిపోయినాడు. చనిపోయిన రాజునుచూచి "చనిపోతుయేమి తీసికొని వెళ్ళినాడు" అని అందురు. ఇది మెప్పుకాదు.

ప్రక:2:26. జనములు తమ మహిమను, ఘనతను దానిలోనికి తీసుకొని వచ్చెదరు.

పాట ముగింపులో చెణుకులు పెట్టుట ఇండియా దేశ ప్రజల గొప్ప తనము. కానుకలు అర్పించునప్పుడు వచ్చిన రాగములు పాడుచు చెణుకులు సంపాదించి కానుకలుగా అర్పించుదురు. భూలోకములోని ఈ పాటలన్నియు పరలోకములోనికి వెళ్ళును. తెలుగు, ఇంగ్లీషు, అరవము, మళయాళము మున్నగు భాషలలోని కీర్తనలు రాగాలు చెణుకులు పరలోకమునకు వెళ్ళును. ఈ లోకములో మనము నేర్చుకొనిపాడేవి, సేవలో పాడునవి పరలోకమునకు వెళ్ళును. భక్తులైన కవీశ్వర్లు కట్టిన పాటలన్నియు పరలోకమునకు వచ్చును. ఇప్పుడు మనము పాడు కీర్తనలన్నియు వెయ్యేండ్ల పరిపాలనలో అచ్చువేసి పంచిపెట్టెదరు. చిన్నప్పుడు పాడిన కీర్తనలు మనము మరచిపోయిన అక్కడ ఉండును. మహిమ అనగా వరములు. వరములవల్ల చేసిన పనులనుబట్టి ఘనత కలుగును. ప్రభువా! భూలోకములో సంఘములను స్థాపించి వాటి మధ్య పనిచేసి కీర్తి సంపాదించుకొన్నాము. ఇది నాచేత నీవు చేయించిన పని గనుక నీకు స్తోత్రములు అని ప్రజలు తమకున్న ఘనతను కానుకగా సమర్పించెదరు. మిక్కిలి పాపాత్ములు ఘనులై కానుకలు తెచ్చెదరు. యే మనుష్యుని గూర్చి యైనను నిరాశ చెందకూడదు (లూకా 6:35)

మిక్కిలి దుర్మార్గులైన వారుకూడ ఇప్పుడు న్యాధిపతులైయున్నారు.

  • 1) దేవుడు మానవులకు యిచ్చిన వరములలో ఒక్కవరమైన విడువబడదు.
  • 2) దేవుడు మానవులద్వారా చేయించిన పనులలో ఒక్క పనియైన విడువబడదు.
  • 3) దేవుడు మానవులకు ఇచ్చిన ఘనతలలో ఒక్క ఘనతయైన విడువబడదు.
    • 1) లోక సంబంధమైన కీర్తి - పరలోక సంబంధమైన కీర్తి.
    • 2) లోక సంబంధమైన ఘనత - పరలోక సంబంధమైన ఘనత.
    • 3) లోక సంబంధమైన గుణములు - పరలోక సంబంధమైన గుణములు.
    • 4) లోక సంబంధమైన పనులు - పరలోక సంబంధమైన పనులు.

ఇవి పరలోకములోనికి వచ్చును. ఒక మనిషి ప్రభువా నాకింతవరకే ఉన్నది ఇదే తెచ్చినాను అనగా ప్రభువు పరవాలేదు అని అందుకొని ఆదరించును.

మహా గొప్ప మహిమ:- వస్తు ప్రదర్శన దినమని ఆ కానుకల దినమునకు పేరు. ప్రదర్శించుట ఒక్క దినమే గాని ఉండుట యెల్లకాలము ఉండును. ప్రభువు ఇచ్చినప్పుడు బహుమానముల దినము. నేను యింత ఇచ్చినాను నీవు మరింత సంపాదించినావని ప్రభువు బహుమానము ఇచ్చును.

వరములు:-
  • 1) దర్శన వరము.
  • 2) భాషావరము
  • 3) అర్ధము చెప్పు వరము
  • 4) స్వప్నవరము
  • 5) స్వస్థపర్చు వరము
  • 6) ప్రార్ధనా వరము
  • 7) స్తుతివరము
  • 8) రాగాల వరము
  • 9) ఈ వరములన్ని కలవారు
తమ కానుకలు పరలోకమునకు తెచ్చెదరు మనము పరలోకమునకు వెళ్ళినప్పుడు యెన్నడు చూడనివారిని,

యెన్నడు విననివారిని అక్కడ చూచెదము. అన్ని భాషలవారు అన్ని జాతులవారు, అన్ని మతములవారు, అన్ని దేశములలోనివారు మారుమనస్సు పొందిన అక్కడకు వచ్చెదరు.

ప్రక: 21:27 గొర్రెపిల్లయొక్క జీవగ్రంధమందు వ్రాయబడినవారే దానిలో ప్రవేశించుదురుగాని నిషిద్ధమైన దేదైనను అసహ్యమైన దానిని, అబద్ధమైన దానిని జరిగించు వాడైనను దానిలోనికి ప్రవేశింపనే ప్రవేశింపడు.

నిషిద్ధమైనది :- అక్కరలేనిది, చేయకూడనిది, రాకూడనిది. తలపెట్టకూడనిది, అనకూడనిది, కూడనిది అని మనము దేవుడు వద్దు అనేది యేదియు వాటిలో యేది కలిగినవారైన పరలోకమునకు రారు.

అసహ్యమైనది :- విగ్రహారాధన, అర్పితములలో ఉండునవి. అసహ్యమైనది.

కలి:- స్మశాన భూమిలో అన్నము, కూర కలిపి ముద్దలు పెట్టించుకొని తినుట. అపవిత్రమైన స్మశానభూమిలో తినే తిండిని "కలి" అందురు. ఇట్టిది అసహ్యమైనది.

పెండ్లికుమార్తె దినదినము తన పొరబాట్లను కడుగుకొనవలెను. పాత ఆదాము దినదినము మునిగిపోవలెను క్రొత్త ఆదాము అనుదినము లేవవలెను అని డ్|| మార్టిన్ లూథరుగారు వ్రాసిరి. కాబట్టి పెండ్లికుమార్తె అనుదినము కడుగబడవలెను. పేతురు యెన్ని మార్లు నా సహోదరుని క్షమింపవలెను ఏడుమార్లు మట్టుకా అని ప్రభువును ప్రశ్నించెను. అందుకు ప్రభువు యేడుమార్లు కాదుగాని డెబ్బై యేడుమార్లు మట్టుకు అని జవాబు ఇచ్చెను. అనగా యెల్లప్పుడు అని దీని భావమైయున్నది. మనిషి యెప్పుడైతే నాది పొరపాటు అని ఒప్పుకొనునో అతడే విశ్వాసి. అవిశ్వాసి నాది పొరపాటు కాదు అని తన తప్పును యెప్పుడును ఒప్పుకొనడు. తన తప్పును సమర్ధించుకొనుటకే చూచును.

అబద్ధమైనది - ఇది అబద్ధములు ఆడుట కాదు. బోధలో అబద్ధములుంటే అది అబద్దమైనది. సత్యబోధ చేసినవారిని అబద్ధ బోధకులని చెప్పెదరు. అట్టిది అబద్ధమైనది అని వ్రాయబడినది.

ఉదా:- మగశిశువు అనగా పెండ్లికుమార్తె అని అందురు. దీనినే కొందరు అబద్ద బోధ అందురు. ఇట్టివారు అబద్ధికులు అబద్ధములు చెప్పువారు అబద్ధము జరిగించేవారును పరలోకములో ప్రవేశింపలేరు.

Home