గ్రంథకర్త: యం. దేవదాసు అయ్యగారు

6. సంఘ మహిమ



పద్యములు:-


సీ॥అన్నవస్త్రాదులు - ఆశ్రయస్థానాలు
ఏర్పాటుచేసిన - దే మతంబు
మనుజులన్ భక్షించు - మనుజులన్ మార్చుట
కేర్పాటు చేసిన - దే మతంబు
దేశదేశాలలో - దేవవాక్యము చాట
నేర్పాటుచేసిన - దే మతంబు
విద్యనాగరికత - వివిధవృత్తులు నేర్ప
నేర్పాటుచేసిన - దే మతంబు


తే॥గీ॥ అంటు మాప ప్రయత్నించె వై - ద్యంబుచేయు
సాలలనుబెట్టె బైబిలు - సర్వభాష
లకును మార్చె క్రైస్తవ మత - మొకటె యిట్టి
మంచిపని చేయునది దైవ - మతముగాదె


సీ॥ కులభేదమెంచక - కులములన్నిటిలోని
మనుజులన్ దరిచేర్చు - మతమదేది
పరమతస్తుల బిల్చి - పరమతంబిదే
మళ్ళుడంచునుజెప్పు - మతమదేది
క్రైస్తవేతర మత - గ్రంథముల్ ప్రచురించి
మతపరీక్షకు బెట్టు - మతమదేది
క్రైస్తవులకు లోట్లు - కలిగినన్ క్రీస్తుని
మహిమ వెల్లడిచేయు - మతమదేది


తే॥గీ॥ ఆదివారమారాధన - ఆచరించు
వ్రతము కల్గివాక్యము విను - మతమదేది
అన్ని దేశాలకై వచ్చి - యున్నమతము
మహినిచుట్టిన క్రైస్తవ - మతముకాదే.