గ్రంథకర్త: యం. దేవదాసు అయ్యగారు
2. ప్రార్ధన మెట్లు
7 | కనిపెట్టుట | ||||||
6 | స్తుతి | ||||||
5 | అంశ ప్రార్ధన | ||||||
4 | సమర్పణ | ||||||
3 | తీర్మానము | ||||||
2 | పాపపు టొప్పుదల | ||||||
1 | మనో నిదానము |
1. మనో నిదానము:-
- 1. చెడ్డ విషయములు మరచిపోవలెను.
- 2. మంచి విషయములుకూడ మరువవలెను.
- 3. రాబోవు సంగతులు మరువవలయును.
- 4. గతకాల విషయములు మరువవలెను.
- 5. క్రీస్తు ప్రభువునే జ్ఞాపకమునకు తెచ్చుకొనవలెను.
- 6. విశ్వాసము, స్తుతి కీర్తనలు 57:7, 86:11, హెబ్రీ. 12:2-3, యోహాను 5:19-20, దాని. 9:3, మత్త. 14:28-31.
- 1. నీవు అపరాధము చేసిన నరుల యొద్ద నీ పాపములను ఒప్పుకొనవలెను
- 2. దేవుని యొద్ద నీ పాపములను ఒప్పుకొనవలెను
- 3. పది యాజ్ఞలనుబట్టి ఒప్పుకొనవలెను.
- 4. జంతువులయెడల గల నిర్దయనుబట్టి
- 5. చేయవలసిన విధులు మానుట.
- 6. చేయకూడనివి చేయుట.
- 7. నీ అయోగ్యత
- 8. వస్తువులు సరిగా వాడకపోవుటనుబట్టి
- 9. దుష్ట స్వప్నముల, తప్పుడు దర్శనముల బలహీనత.
- 10. తలంపులోని
- 11. చూపులోని
- 12. వినుటలోని
- 18. ప్రయత్నములోని
- 14. క్రియలోని
- 15. విసుగుదల, కోపము, అసూయ, అవిశ్వాసము, తొందరపడుట, అధైర్యము, పిరికితనము, నిరాశ, సోమరితనము, తిండిబోతుతనము, త్రాగుడు, ధనాపేక్ష పిసినితనము, పరజన సంపాదనాపేక్ష్య ఈ మొదలగు పాపములన్నియు దేవుని ఎదుట ఒప్పుకొనవలెను.
- 16. విశ్వాసము, స్తుతి, ఎజ్రా. 10:1; కీర్తన. 32:1, కీర్తన. 5:10-12, 1యోహాను 1:7-9.
- 1. చెడుగు మానెదను.
- 2. మంచినే చేయుదును
- 3. విధులను నెరవేర్తును.
- 4. కష్టములో నిన్నే స్తుతింతును.
- 5. ప్రార్ధన నెరవేరనప్పుడు స్తుతింతును.
- 6. బైబిలు నేర్చుకొందును.
- 7. ప్రార్ధన ధ్యానము మానను.
- 8. సువార్తను బోధింతును.
- 9. చందా వేతును.
- 10. మనుష్యుల దయయందును, దేవుని దయయందును పెరుగుదును.
- 11. లేనిపోని కోరికలను కోరను అని ఇట్లు నిశ్చయించుకొనవలయును.
- 12. విశ్వాసము, స్తుతి: రూతు 1:17, నెహెమ్యా. 10:28-32, దానియేలు 3:16,18; ఆది. 32:26, కీర్త. 119:102, హబక్కూకు. 3:17.
- 1. దేవా! నీ చిత్తము
- 2. నా చిత్తముకాదు
- 3. నా యాత్మను, నా మనసును, నా శరీరమును, నా కలిమిని, నాలోపములను, నా కోరికలను నా సేవను మొదలగువాటినన్నిటిని నీకర్పించుచున్నాను అని ఇట్లు చెప్పవలెను.
- 4. విశ్వాసము, స్తుతి, ఆది.22:10,11,న్యాయా. 11:34-36, 1సమూ. 1:27-28, రోమా. 12:1.
- ఇక్కడ నీ ఇష్టము వచ్చిన సంగతినిగూర్చి ప్రార్ధించుకొనవచ్చును.
- 2. నా నామమున మీరు నన్ను ఏమి అడిగినను నేను చేతును. విసుగక నిత్యము ప్రార్ధన చేయవలెనని ప్రభువు చెప్పెను.
- 3. ఎంత చిన్న సంగతియైనను ఎంచుకొణ ప్రార్థింపవచ్చును. వెనుకకు తీయవద్దు. ఓ విశ్వాసము, స్తుతి, యెష. 65:24, మత్త, 6:6, 7:7 లూకా. 11:9, 18:1 యోహాను 14:14, హెబ్రీ. 11:6.
- 1. దైవవ్యక్తి
- 2. జీవము
- 3. ప్రేమ
- 4. న్యాయము
- 5. శక్తి
- 6. జ్ఞానము
- 7. పరిశుద్ధత
- 8. స్వతంత్రత
- 9. సర్వవ్యాపకత్వము
- 10. త్రెకస్థితి
- 11. రక్షణ దానము (దూతలకు, నరులకు)
షరా:- ఇవన్నియు అనాది లక్షణములును, అనంతలక్షణములునై యున్నవి. గనుక వీటిని పూర్తిగా ఎవరును వివరింపజాలరు.
దైవలక్షణములు:- కీర్త. 119:164, యెష. 6:8, ప్రక. 4:8-11, 5:12-14
ఉపకారములకొరకు స్తుతి:- కీర్తన. 103:2 ఆకాశము, భూమి దేవదూతలు, బైబిలు, క్రీస్తుప్రభువు, పరిశుద్ధాత్మ, సంఘము, మోక్షము.
అపకార నివారణ స్తుతి:- అన్ని గండములనుండి తప్పించి నందుకు కీర్తన. 107:19-21.
7. కనిపెట్టుట:-
- 1. అన్ని మెట్లమీద దేవునితో మాట్లాడిన నీవు ఈ మెట్టుమీద నీతో దేవుని మాటలాడనీయవలెను.
- 2. నీవు మునివలె నిశ్శబ్దముగా ఉండవలెను. నీ ప్రార్థనా స్తుతులు, పాటలు చదువులు ఆలోచనలు కట్టివేయవలెను. సమూయేలు చెప్పినట్లు దేవా! నీవు ఏమి చెప్పుదువో నేను విందునని చెప్పవలెను (1సమూ. 3:1-10)
- 3. నీవు ఈ మెట్టుమీద నున్నప్పుడు తండ్రి నీ మనస్సులో మంచి మంచి తలంపులు పుట్టించును, లేదా నీకు దర్శనమిచ్చి చెప్పవలసినవి చెప్పును. నీ కఠినమైన ప్రశ్నలన్నింటికి యిక్కడనే జవాబు దొరుకును.
- 4. ఒకవేళ నీకు ఏమి తెలియబడకపోయిన ఇంతసేపు దేవుని సన్నిధిలో ఉండగల భాగ్యము దొరికినది, అంతే చాలును అని ఆనందింపవలెను.
- 5. అన్ని మెట్లమీద సంగతులు ఈ మెట్టుమీద పరిష్కారమగును.
- 6. విశ్వాసము, స్తుతి: కీర్తన. 3:7, 65:1, 123:2, యెష. 40:31, 64:4, అపో॥॥కార్య॥ 1:4 యెష. 8:17, లూకా. 2:25, 12:36, రోమా. 8:25.
- 1. దర్శనము:- యెహె. 1:1, అపో॥కార్య 9:10, ఎఫెసు 3:3.
- 2. స్వరము:- 1సమూ. 3:10, అపో॥॥కార్య॥ 9:3-4,
- 3. వ్రాత:- 1దిన. 28:19, దాని. 5:5-27.
- 4. స్వప్నము:- ఆది. 37:7-11, కీర్త, 37:7, యెష. 40:31, మత్త. 2:12-13.
- 5. ఊహ:- నెహెమ్యా.. 2:12, అపో॥కార్య॥ 15:28-29.