గ్రంథకర్త: యం. దేవదాసు అయ్యగారు
5. యేసుక్రీస్తు ప్రభువు మహిమ
1.
- 1) యేసుక్రీస్తు తప్ప మరొక రక్షకుడులేడు. అపో॥ 4:12,
- 2) ఆయన అనాది దేవుడు, కొలస్స. 1:15-17, ఎఫెసీ. 1:6, 1పేతు. 1:20,
- 3) ఆయన జన్మమునకు పూర్వమే ఆయనను గురించి బైబిలులో ముందే వ్రాయబడినది. యెష. 7:14 9:6, యిర్మి 23:5-6,
- 4) కన్యక గర్భమందు జన్మించెను. మత్త. 11:18-25,
- 5) మోక్షలోకపు దూతలు జన్మవార్త తీసుకొని వచ్చిరి. లూకా. 2:8-14,
- 6) తల్లిదండ్రులకు లోబడుట. లూకా. 2:50-51,
- 7) ఏ పాపములేని అసలైన గొప్ప మనుష్యుడు. యోహా. 8:46,
- 8) అసలైన దేవుడు యోహా. 20:26-28, అపో॥ 20:28, రోమా. 9:5, తీతు. 2:13, 1యోహా. 5:20, కొలస్స. 1:15-17,
- 9) సమస్త ధర్మములు ఉపదేశించెను. మత్త. 5,6,7 అధ్యాయములు; యోహాను 7:46,
- 10) సైతానును మొట్టమొదటే జయించెను. మత్త. 4:1-11.
- 11) పాపములను చెకపెక (Fierceness; to trouble) ఓడగొట్టెను. హెబ్రీ. 9:26,
- 12) కీడులన్నింటిని ఆనవాలు లేకుండా ధ్వంసము చేసెను. 1పేతు. 2:24
- 13) మానవుల కష్టములన్నింటిని తొలగించెను. మత్త. 3:12.
- 14) మానవులకు ఏ ఉపకారములు అవసరమో అవి చేసెను. యోహా. 2:1-11.
- 15) మానవులు ఆయనను తెలిసికొనుటకు వారితో కలసి ఉండెను. వనవాసము, పెండ్లి భోజనము, ప్రజల ఆకలి, మరణము, బస, చేయవలసిన ప్రయాణము, పండుగ, దేవాలయ, ఏకాంత ప్రార్ధన సమయములలో నుండెను.
- 16) దేవుని, మనుష్యుని పూర్ణమనస్సుతో ప్రేమించెను. లూకా. 10:27,
- 17) గవర్నమెంటుకు పన్ను దేవునికి కానుక చెల్లించవలెను. మత్త. 22:21,
- 18) యూదుల సంఘములోని లోటుపాటులను సవరణ చేసెను, మత్త. 23 అధ్యాయము.
- 19) ప్రతి మనిషికిని రక్షకుడైయున్నాడు యోహాను 3:17.
- 20) సర్వలోక రక్షకుడు. మత్త. 40:17, యోహా. 12:32, మార్కు 16:15.
- 21) ఆయన సృష్టిమీద అధికారియైన దేవుడు. మత్త. 8:27, యోహా. 2:1-14, 6:1-14.
- 22) మూడు ముఖ్య సమయములలో తనలోని దైవకాంతిని చూపించెను. మత్త. 17:2, మార్కు 10:32, యోహా. 18:6,
- 23) రోగులను మందులేకుండా తన ప్రభావముతో బాగుచేసెను. లూకా. 6:19,
- 24) భూతములను వెళ్ళగొట్టెను. మార్కు 5:1-20.
- 25) మృతులను బ్రతికించెను. లూకా. 7:13-15.
- 26) ప్రజల యెడల జాలిపరుడు. మత్త. 9:34-38.
- 27) పాపపరిహారకుడు, మార్కు 2:5, యోహా. 20:23,
- 28)తనను చంపుచున్న శత్రువులను క్షమించెను. లూకా. 23:34,
- 29) సర్వలోక పాపపరిహారమునకై రక్తము ధారపోసెను. 1పేతు. 1:19.
- 30) తన ఇష్టప్రకారము హతుడయ్యెను. యోహా. 10:18,
- 31) సమస్త వేదనలను సహించుట వల్ల జయించెను. హెబ్రీ. 5:7.
- 32) సమాధిలో నుండి బయటికి వచ్చివేయుట వలన రెండవమారు జయించెను. అపో! 1:3.
- 33) మానవుని మూడు మరణములను ప్రభువు మరణము వలన జయించెను. ప్రక. 1:18. లూకా. 20:38, ప్రక. 3:1, ప్రక. 20:6, ప్రక. 18:8,
- 34) మోక్షమునకు ఆరోహణుడాయెను. అపో॥ 1:9,
- 35) ఆయన మోక్షమునకు వెళ్ళినను మనతోనే ఉన్నారు. మత్త. 28:20,
- 36) రెండవసారి వచ్చి తన సంఘమును తీసుకొని వెళ్ళును. 1థెస్స. 4:13-16.
- 37) మహామహిమ రాజు. లూకా. 1:33, 1తిమో. 6:15, ప్రక. 19:16, ప్రక. 20:4-6.
- 38) ప్రభువుతో సదాకాలము మోక్షమునందు ఉందుము. కీర్త. 23:6, 1థెస్స. 4:17.
2. ప్రభువు సర్వములో సర్వమై యున్నాడు
- ప్రభువు విశ్వాసులకు అన్నింటికంటే ఎక్కువ మనోహరుడు.
- 2. శిల్పికి ముఖ్యమైన మూలరాయి.
- 3. జ్యోతిశాస్త్రజ్ఞులకు నీతి సూర్యుడు.
- 4. రొట్టెల వర్తకునికి జీవపురొట్టె.
- 5. ఖజానాదారునికి వెండి, బంగారు నాణేములైయున్నాడు.
- 6. ఇండ్లు కట్టువానికి ముఖ్యమైన పునాది.
- 7. వడ్రంగికి ఇంటికి ద్వారము.
- 8. వైద్యులకు వైద్యుడు.
- 9. విద్యాపరులకు గొప్ప విద్యాపరుడు.
- 10. వ్యవసాయ దారునికి విత్తువాడు పంట యజమాని.
- 11. పుష్పాపేక్షులకు షారోను పుష్పముల లోయలో నున్న పద్మము.
- 12. భూగర్భ శాస్తులకు బండ
- 13. తోటమాలికి నిజమైన ద్రాక్షచెట్టు
- 14. ఆభరణ వర్తకుల గొప్ప వెలగల ముత్యము
- 15. వకీలునకు ఆలోచనకర్తయు, శాసనకర్తయు మన పక్షముగా వాదించువాడు.
- 16. ప్రతివాది పతికి మహాసంతోష కరమైన సువర్తమానము.
- 17. మహోపకారునికి విలువైన బహుమానము
- 18. తత్వశాస్త్రజ్ఞునికి విలువైన జ్ఞానమైయున్నాడు.
- 19. రైలు ప్రయాణస్తునికి నూతన జీవమార్గము.
- 20. రాతి పనివానికి జీవపురాయి
- 21. సేవకునికి మంచి యజమానుడు.
- 22. దుఃఖ చిత్తునకు నిరీక్షణ ఆదరణకర్త
- 23. ఆత్మీయ జీవనపరునికి మాదిరిగల జీవనకారి
- 24. నరమాత్రులకు మాదిరిగల జీవనకారి
- 25. దైవదర్శకులకు దేవుడు
- 26. నిస్సత్తువ గలవారికి దీపము
- 27. మరణించిన వ్యక్తులకు పునరుత్ధానమైయున్నాడు.
- 28. పిల్లలకు తల్లిదండ్రులకు లోబడే బాలుడైయున్నాడు.
- 29. సత్ ప్రవర్తన గలవారికి మాదిరిగల యౌవనుడు
- 30. యుద్ధభటులకు సైతానును గెలిచిన భటుడు.
- 31. సత్యమును తెలిసికొనగోరువారికి సత్యమైయున్నాడు.
- 32. న్యాయము దొరకనివారికి న్యాయమైన న్యాయవాది
- 33. పెండ్లి కుమార్తె కంటికి ఆయన మనోహరుడైయున్నాడు అనగా పెండ్లికుమారుడై ఉన్నాడు.
3. క్రీస్తు ప్రభువుయొక్క బిరుదులు
- 1)అల్భ, ఓమెగ, ప్రక. 1:8. 22:13
- 2) అధిపతి మత్త. 2:5.
- 3) అన్నిటికి బాధ్యుడు హెబ్రీ. 1:2.
- 4) అందరికి ప్రభువు అపో! 10:36.
- 5) ఆమెన్ ప్రక. 3:14.
- 6) ఆత్మల కాపరియు అధ్యక్షుడు 1పేతు. 2:25.
- 7) ఆశ్చర్యకరుడు ఆలోచన కర్తయును శక్తిమంతుడైన దేవుడు యెష. 9:6.
- 8) ఇమ్మానుయేలు యెష. 7:14, 8:8, మత్త. 1:23.
- 9) కాపరుల ప్రధాని. 1పేతు. 5:4.
- 10) గొర్రెపిల్ల యోహా. 1:29,36. ప్రక. 5:6,12, 13:8, 21:22-27, 22:3.
- 11) జీవపు వాక్యము. 1యోహా. 1:1-5.
- 12) జీవాధిపతి అపో! 3:15.
- 13) దావీదు వేరు చిగురు యిర్మి 23:5, ప్రక. 5:5, 22:16.
- 14) దావీదు కుమారుడు: మత్త. 9:27, మార్కు 10:47, లూకా. 18:38.
- 15) దేవుని వాక్యము: ప్రక. 19:13.
- 16) నజరేయుడు. మత్త. 2:23.
- 17) నమ్మకమైన సాక్షి. ప్రక. 1:5.
- 18) నీతిసూర్యుడు. మలాకీ. 4:2.
- 19) పరిశుద్ధుడు. కీర్తన. 16:10.
- 20) పునరుత్ధానమును జీవమును యో. 11:25.
- 21) మంచికాపరి. యోహా. 10:14.
- 22) నిత్యముగా నున్న తండ్రి. యెష. 9:6.
- 23) దేవుడు యోహా. 10:28.
- 24) నీతిమంతుడు అపో! 7:52.
- 25) నేనుండు వాడను యోహా. 8:58.
- 26) ప్రధాన యాజకుడు. హెబ్రీ. 3:1.
- 27) ప్రభువులకు ప్రభువు రాజులకు రాజు. 1తిమో. 6:15.
- 28) ప్రయాణముయొక్క దూత. మలాకీ. 3:1.
- 29) ప్రవక్త లూకా. 24:19.
- 30) భూరాజులకు అధిపతి. ప్రక. 1:5.
- 31) మధ్యవర్తి. 1తిమో. 2:5.
- 32) మనకు నీతియైన యెహోవా. యిర్మి 23:6.
- 33) మనుష్య కుమారుడు. యోహా. 5:27.
- 34) మహిమగల ప్రభువు 1కొరింధి. 2:8.
- 35) మార్గము, సత్యము, జీవము. యోహా. 14:6.
- 36) మూలకు తలరాయి. యెష. 28:16.
- 37) మెస్సియా దాని. 9:25,
- 38) మొదటి, కడపటివాడను. ప్రక. 1:18
- 39) యాకోబుయొక్క బలవంతుడు
- 40) యేసు అనగా రక్షకుడు. లూకా. 1:31.
- 41) క్రీస్తు అనగా అభిషిక్తుడు. లూకా. 2:11.
- 41) యేసుక్రీస్తు అనగా రక్షించుటకు అభిషేకము పొందినవాడు.
- 42) క్రీస్తు యేసు అనగా అభిషిక్తుదైన రక్షకుడు
- 43) అబ్రాహాము కుమారుడు. మత్త. 1:1.
- 44) మరియమ్మ కుమారుడు. లూకా. 2:7.
- 45) యోసేపు కుమారుడు. మత్త. 1:21.
- 46) మనుష్య కుమారుడు. మార్కు 10:45.
- 47) కుమారుడు. యెష. 9:6.
- 48) సర్వోన్నతుని కుమారుడు. లూకా. 1:32.
- 49) శ్రీ భగవంతుని కుమారుడు. మార్కు 14:61.
- 50) పెండ్లి కుమారుడు. మత్త. 25:1,
- 51) దేవుని కుమారుడు, అద్వితీయ కుమారుడు, జనతైక కుమారుడు. యోహా. 3:16.
- 52) వడ్లవాని కుమారుడు. మార్కు 6:3.
- 53) యూదా గోత్రపు సింహము ప్రక. 5:5.
- 54) వేకువచుక్క ప్రక. 22:16.
- 55) కడపటి ఆదాము 1ేకొరింథి. 15:45.
- 56) రెండవ మనుష్యుడు. 1కొరింథి. 15:47.
- 57) యూదులకు రాజు మత్త. 2:2.
- 58) సృష్టికర్త ఆది. 1:2. రక్షణ కర్త మత్త. 1:21. ఆదరణకర్త 1యోహాను 2:1.
- 59) శాసనకర్త యాకోబు 4:12.
- 60) దీవెనకర్త. లూకా. 24:50,51.
- 61) రిక్తుడు. ఫిలిప్పీ. 2:7.
- 62) దేవస్వరూపి. ఫిలిప్పీ. 2:6.
- 63) దాసస్వరూపి. ఫిలి. 2:7.
- 64) ఆదిసంభూతుడు. యోహా. 1:5.
- 65) సజీవుడు ప్రక. 1:18.
- 66)నిత్యము జీవించువాడు ప్రక. 1:18.
- 67) సర్వాధికారి. మత్త. 28:18.
- 68) యాజకుడు. హెబ్రీ. 5:10.
- 69) యెహోవా దూత.
- 70) అందరికి ప్రభువైన దేవుడు లూకా. 1:32.
- 71) నీతిమంతుడు. మత్త. 27:24.
- 72) బోధకుడు. లూకా. 10:25.
- 73) స్నేహితుడు. యోహా. 15:14.
- 74) సోదరుడు. మత్త. 12:50.
- 75) పరిచారకుడు. మార్కు 10:45.
- 76) దేవనరుడు. 1తిమో. 2:5
- 77) మహా దేవుడు. తీతు 2:13
- 78) నిజమైన దేవుడు. 1యోహా. 5:20.
- 79) అందరికి తండ్రియైన దేవుడు. ఎఫెసీ. 4:6.
- 80) ఆయన అందరికన్న పైగా ఉన్నవాడు. ఎఫెసీ. 4:6.
దేవునియొక్క ఆయా పనులనుబట్టి పేరులు కలిగినవి. ప్రభువునకు 500 పేర్లు కలవు. ఇవన్నియు వ్రాయుటకు సమయము, స్థలములేదు. దైవగ్రంథ మంతయు చదివి ప్రభువు పేర్లను గుర్తించండి.
4. క్రీస్తు యేసును - ఆయన ప్రజలు
- 1. మనము ఆరోహణమగునట్లుగా ఆయన అవరోహణమాయెను యోహా. 14:3.
- 2) మనము ఐశ్వర్యవంతు లగునట్లుగా ఆయన పేదవాడాయెను. 2కొరింథి. 8:9. యాకో. 2:5.
- 3) మనము ఆత్మజన్మ మొందునట్లుగా ఆయన శరీర జన్మమొందెను. యోహా. 1:14, 13:2.
- 4) మనము కువమారులముగా స్వీకరింప బడుటకు ఆయన సేవకుడాయెను. ఫిలీ. 2:7, గలతీ. 4:6,7.
- 5) పరమందు మనకు నివాసము దొరుకుటకు ఇహమందు నివాసము లేనివాడుగా యుండెను మత్త. 8:20, యోహా. 14:2.
- 6) మనము పోషింపబడునట్లుగా ఆయన ఆకలిగొనెను. మత్త. 4:2, యోహా. 6:50.
- 7) మనకు నిత్యజీవజలమనుగ్రహించుటకు ఆయన దప్పిగొనెను. యోహా. 19:28, యెష. 12:3.
- 8) మనకు విశ్రాంతి లభించునట్లుగా ఆయన అలసట నొందెను.
- 9) మనకు నీతివస్తమనుగ్రహించుటకు ఆయన వస్త్రహీనుడాయెను. మత్త. 27:28, రోమా. 3:32.
- 10) మనము ఆయనయందు నిలిచియుండునట్లు ఆయన విడువబడెను. మత్త. 27:46, హెబ్రీ. 13:5.
- 11) మనము ఆనందించునట్లుగా ఆయన దుఃఖాక్రాంతుడాయెను. యెష. 53. ఫిలిప్పీ. 44.
- 12) మనలను స్వతంత్రులుగా చేయుటకు ఆయన బంధింపబడినవాడెయెను. యోహా. 8:32,36.
- 13) మనము నీతిమంతులముగా తీర్చబడుటకు ఆయన మనకోసము పాపిగా చేయబడెను 2కొరింధి. 5:21.
- 14) మనము జీవించునట్లుగా ఆయన మృతుడాయెను. యోహా. 19:33.
- 15) మనము ఆరోహణమగుటకు ఆయన తిరిగి రానైయున్నాడు. 1థెస్స. 4:13-17.