గ్రంథకర్త: యం. దేవదాసు అయ్యగారు
11. వినడా చార్టు
1. మానవుడు పుట్టకముందే అతనికి కావలసినవన్నియు ఉన్న భూమ్యాకాశములను, దేవదూతల లోకమును, కలుగజేసిన తండ్రి నీకు కావలసినవి ఇచ్చుటకై
- (1) నీ ప్రార్ధన వినడా?
- (2) అడుగక ముందు ఇచ్చిన తండ్రి అడిగిన తర్వాత ఇవ్వడా? ప్రార్ధన వినడా?
- (3) అడగండి ఇవ్వబడును మత్తయి 7:7 అని చెప్పిన తండ్రి తీరా అడిగేవరకు ఉండి ఇయ్యనని అనగలడా? వినడా?
- (4) నలుబది ఏండ్లు బజారులు సంతలు పంటపొలాలు లేని అడవిలో ఆరు లక్షల జనానికి ఆహారము పెట్టి కావలసినవి దయచేసిన తండ్రి నీకు దయచేయడా? నీ మొర వినడా?
- (5) ప్రార్ధిపని ఐదు వేలమందికి రొట్టెముక్కలు గావించి యోహాను 6:5-13 ఆకలి తీర్చిన తండ్రి నీకు తీర్చడా? వినడా?
- (6) ఏలీయా కాలములో 1రాజులు 17:15-16 కరువప్పుడు నూనె తరుగకుండ చేసిన తండ్రి నీకు ఏమి తక్కువ చేయుననుకొనుచున్నావు? నీ ఆకటిబాధ వినడా?
- (7) గాలి, వాన, ఎండ వీటికి దేవుడు మీవద్ద డబ్బు తీసుకొనుచున్నాడా? ఊరకనే తరచుగా ఇయ్యడము లేదా? తండ్రియైన తరువాత నీ అక్కరలు వినడా?
- 2.
- (1) సృష్టిని కలుగజేసినపుడు ఆ జాబితాలో జంతువులు, పక్షులు, మొక్కలు ఉన్నవిగాని జబ్బులనేవి లేవుగదా? అవి పాప పతనము తరువాత వచ్చినవి. తోటలో తాను వేయని కలుపు మొక్కలను తోటమాలి తీసివేసిన నీలోని జబ్బు ఆయన తీసివేయడా? నీ కన్నీటి స్వరము వినడా?
- “నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే” నిర్గమ. 15:26 అని ఆనాడు చెప్పిన తండ్రి నిన్ను ఎందుకు బాగుచేస్తాను? అని పలుకునా? ఎంత వెర్రివాడవు? ఆ మాట అనుటకు నోరు వచ్చునా? నీ రోగ ధ్వని వినడా?
- (3) దేవుడు ఒకప్పుడు ఒక అన్యుని చూచి అబ్రాహాము నీ కొరకు ప్రార్ధన చేయును అని చెప్పెను. ఆయన ప్రార్థించెను. ఆ అన్యుని ఇంటి వారందరు స్వస్థత నొందిరి. ఆది. 20:17 నీ కొరకు ఎంతమంది ప్రార్థించుచున్నారో ఆ అంతమంది ప్రార్ధన తండ్రి వినడా?
- (4) చూస్తేనే కాటు పోయినదట, చూడడమే కష్టమా? పాము కాటు విషము పోవుట ఎంత కష్టము? అయినను తండ్రి చూపును చూచి విషమును అంతర్దానము చేయగా వారు స్వస్థత నొందిరి. సంఖ్యా. 21:4-9 నీ ఆశ, పలుకు దృష్టి వినడా?
- (5) ప్రభువు (లూకా. 6:17-19) భూమిమీదికి వచ్చి అనేకమార్లు తన ప్రభావమువలన ఔషద సహాయము లేకుండా ఎంతోమంది రోగులను బాగుచేసినాడు కదా! దావీదు కుమారుడా! నన్ను కరుణింపుము మత్తయి 9:27 అను కేక విన్న తండ్రి నీ కేక వినడా? ధైర్యము తెచ్చుకొని నిలువబడుము.
- (6) సిలువమ్రానుమీద మన పాపములతోపాటు మన వ్యాధులనుకూడ ప్రభువు భరించెనని వ్రాయబడి యున్నది. యెషయా 53:4. ఆయనమీద నున్నప్పుడు మనమీదలేవు అని గ్రహింపవచ్చునుగదా! నీ ఆలాపన వినడా?
- 3.
- (1) నేను పాపిని:- నేను పాపిని: నేను పాపిని అని దుఃఖించుచున్న నీ దుఃఖమునకు ఆయన వినడా? నీ పాపములు రక్త వర్ణముగా నున్నప్పటికిని ధవళ వర్ణముగా చేసెదనని యెషయా ద్వారా వ్రాయించిన తండ్రి నీ మూలుగు వినడా? యెషయా 11:18
- (2) కుమారుడా నీ పాపములు క్షమింపబడి యున్నవని పక్షవాత రోగితో చెప్పిన తండ్రి నీతో పలుకడా? మార్కు 2:5. శబ్ధములేని అతని శబ్దము విన్న తండ్రి నీ మనో శబ్ధము వినడా?
- (3) నేను నీకు శిక్ష విధింపను యోహాను 8:11 అని పాపాత్మురాలైన స్త్రీతో చెప్పిన తండ్రి నీతో చెప్పుటకే గదా! ఆ మాట వ్రాయించినాడు? ఈ పాటికి నా శిక్ష తొలగించుము తండ్రీ అని నీవు చెప్పుకునే చెప్పుకొనుట వినడా?
- (4) నీ పాపములు నే నెన్నటికి జ్ఞాపకము తెచ్చుకొనను అని స్థిర వాక్యము సెలవిచ్చిన తండ్రి నీ పాపములు జ్ఞాపకము తెచ్చుకొని నీకు హాని చేయునా? నీ వాగ్దానాశయ ప్రార్ధన వినడా? యిర్మియా 31:34, హెబ్రీ. 8:12
- (5) నీ కష్టములను తొలగించడా? శిష్యులు తుఫాను ఆపదలో నున్నప్పుడు తొలగించలేదా? వారు వేసిన వెర్రి కేకలు ప్రభువు నిద్రలో నుండి వినలేదా? మీవి వినడా? మత్తయి 8:23-27
- (6) నీళ్ళమీద నడచి మునిగిపోవుచున్న పేతురుయొక్క ఆవద తొలగించలేదా? మత్తయి 14:31, ప్రభువా నన్న కరుణించుము అని నీవుచేయు నీ ప్రార్ధన మాత్రము ఆయన వినడా?
- 4.
- (1) శత్రు బాధను ఆయన నివారణ చేయడా? ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రము నొద్దకు రాగా శత్రువులు వెంటాడిరి. నిర్గమ 14:30 మోషే బహుగా మొఱ్ఱపెట్టెను. రక్షించినాడు గదా? నీ మొఱ్ఱ నీ పగవాని చేతిలోనుండి రక్షింప మీ ఆర్త ధ్వని వినడా?
- (2) లాబాను యాకోబును చంపుటకై పరుగెత్తుచుండగా దేవుడు స్వప్నమందు “జాగ్రత్త సుమీ” అని చెప్పి ఆపుచేయలేదా? ఆది. 31:24 యాకోబు ప్రార్థించినట్లు రికార్టులో లేదు, గాని దేవుడు పైనుండి లాబాను పరుగును చూచి హత్యను ఆపుచేసెను. నీ విషయములో అట్లు చేయడా? నిన్ను నీ ఆపదను చూచి, ఆపదనుబట్టి చెప్పబడని నీ కథ వినడా?
- (3) ఇతరుల మారుమనసు విషయమై మీరు ప్రార్థిస్తే వినడా? లూకా. 6:35లో నున్నమాట తండ్రికి చూపిస్తే వినడా? మీరైతే ఎట్టివారిని గూర్చియైనను నిరాశ చేసికొనవద్దు (Pray and work, Work and pray).
- 5.
- (1) సర్వ విషయములతో దేవుడు మన ప్రార్ధన తప్పక వినును. ఎందుచేతననగా, ఉందునని వాగ్ధాన మిచ్చినాడు. ఇంకా ఎందుచేతననగా, ఆయన దివ్యలక్షణములలో ఒక లక్షణము ప్రేమ, ఇంకా ఎందుచేతననగా తన కుమారుని ముఖము చూచును. ఇంకా ఎందుచేతననగా తన సృష్టి పాడైపోవుట తన కిష్టముండదు. ఇంకా ఎందుచేతననగా ఆయన మన తండ్రి గనుక వినడా?
- (2) దేవుడు కొన్ని ప్రార్ధనలు విని ఒక్కటి విననియెడల విశ్వాస నరుడు విన్నాడు అని అనునా? అన్నము పెట్టీ కూర వేయనియెడల బాటసారి నాకు ఫలానివారు విందు చేసినారు అని చెప్పునా? వినగల దేవుడు మిగులు లేకుండ వినడా?
- (3) కొందరి ప్రార్ధనలే విని, కొందరి ప్రార్ధనలు విననప్పుడు ఈ కొందరు, ఆ కొందరు కలిసి దేవుడు విన్నాడని చెప్పుకొందురా? చెప్పుకొనరు గనుక వినడా? దేవుడు అందిరిని రక్షించివేసి ఒక్క పాపినిగాని రక్షించనియెడల అతని గోల విననియెడల అతని పక్షముగా ప్రార్ధించినవారి ప్రాథేయత శబ్దము విననియెడల ఏమి జరుగును? దేవుడు తాను స్వయముగా బైబిలును, సంఘమును, నరావతారామును, సృష్టిని దైవ వ్యక్తిత్వమును కొట్టివేసినట్లే గనుక వినడా? అందరి ప్రార్ధనలు అన్ని ప్రార్ధనలు వినడా? (మరలా దేవుడే తన పని వెలుగు కలుగుగాకని చెప్పవలసి వచ్చును).
- 6.
- (1) అలాగైతే దేవుడు అనేకమంది ప్రార్ధనలు వినలేదని నాకు తెలుసును. ఎందుచేత అని ఒకరు అడుగవచ్చును. హృదయ శుద్ధిలేక, విశ్వాస బుద్ధిలేక, ఆత్మజీవన వృద్ధిలేక, దేవుని ప్రార్ధన నరుడు వినడా? నరుని ప్రార్ధన దేవుడు వినడా?
- (2) విశ్వాసుల ప్రార్ధన దేవుడు వినలేదని నేను అనేక బుజువులు చెప్పగలనని ఒకరు అనవచ్చు. ఏలయనగా ఆదిసంఘములో అన్యులు స్తెఫనును రాళ్ళు రువ్వి చంపిరి. యాకోబును కత్తితో చంపిరి. అనేకమంది భక్తులను కొట్టి, పొడిచి, కాల్చి, ఊపిరి కట్టి హతము చేసిరి. కాపాడుము చావు తప్పించుము అని వారు ప్రార్ధన చేయలేదా? దేవుడెందుకు తప్పించలేదు? దీనికి గొప్ప కారణమేమనగా: వారు హతసాక్షులు కావలెనని కోరుకొన్నారు. కావలెనని కోరుకొన్నాడు గాన వినడా?
- (3) వ్యాధి, కరువు, నింద, చిక్కులు, అన్యాయము ఈ మొదలైనవి విశ్వాసులలో అనేకమందికి కలిగియున్నవి ఎందుచేత? ఇది తప్పించుమని ప్రార్థించినారు గాని నీ చిత్తమని కూడ ప్రార్థించినారు. గనుక వారికి కొంత తాత్కాలిక నివారణ కలదు కాని పూర్ణ నివారణ కలుగదు. వీరు హతసాక్షులుకారు గాని దీర్ఘహతసాక్షులైయున్నారు. హతులైన హతసాక్షులు కారుగాని జీవించు హతసాక్షులైయున్నారు విన్నాడా? లేదా? వినడా?
- (4) కొందరికి కష్టములున్నను తీసివేయడు ఎందుచేత? తీసివేస్తే వారు ఆయనకు దక్కరు.
- (5) ఒకరు మనస్సాక్షి చెప్పినను గ్రంథములు చెప్పినను, సహమానవులు చెప్పినను, స్వప్నములు చెప్పినను వినరు. అతడు అలవాటుపడిన పాపమందే నివసించియుండును. అతని విషయమై విశ్వాసులు ప్రార్థించినను అతడు మారడు, అయితే దేవుడు అయితే వారి ప్రార్ధన విన్నట్టా? దేవుడొక పనిని చేయును. విశ్వాసి ప్రార్ధనలనుబట్టి అతనికి అనేక గడువులు దయచేయును. ఇదియే ప్రార్ధన వినుటయైయున్నది. మనకు తెలిసినంతవరకు అతడు మారు మనస్సు పొందడు. మరణము మొదలుకొని తీర్పువరకు గల సమయములో మారుమనసుపొందిన యెడల రక్షింపబడును. అది మనకు తెలియబడనంత మాత్రమున ప్రభువు మన విశ్వాస ప్రార్ధన వినలేదని చెప్పలేము. పాపి నరకమునకు వెళ్ళినయెడల తన స్వేచ్చను బట్టియే వెళ్ళును. నరక మనునది సాతానుకు, తన దూతలకును ఏర్పడినది. మనుష్యునికి కాదు. అందుచేత విశ్వాసి ప్రార్ధన దేవుడు విన్నట్టే! వినడా?
- (6) విశ్వాసికి అనేక కష్టములు వచ్చినను ప్రభువు తొలగింపడు. ఎందుచేత? ఆత్మీయ జీవితములో అభివృద్ధి పొందుటకు, కష్టములను సాధనములుగా వాడుకొనును, గనుక విశ్వాసి ప్రార్ధన దేవుడు వినీనట్టే, వినడా?
- (7) పాపికి అనేక కష్టములు రావచ్చును. అవి అతనిని మళ్ళించుటకే గాన విశ్వాసి ప్రార్ధన ప్రభువు ఆలకించెను వినడా?
- 7.
-
(1) నమ్ము ప్రతివానికి సమస్తము సాధ్యము అని ప్రభువు చెప్పెను మార్కు 9:23 మానవుడు నమ్మగలిగితే దేవుడతని
పక్షముగ
అన్ని
చేయగలడు. “నమ్ముట నీవల్లనైతే” అని దేవుడు చెప్పలేదా? నమ్మితే దేవుని మహిమ చూతువని ప్రభువు లాజరు సమాధివద్ద
చెప్పలేదా?
యోహా.
11:40 ఎప్పుడు నమ్మవలెను? నమ్ముటకు వీలులేనప్పుడే! యోహాను 11:40 ఇష్టము లేనప్పుడే! 2రాజులు 55:11-13
సబబుగా
లేనప్పుడే!
ఆది.
18:11-14 నెరవేర్పు కనబడనప్పుడే! 1రాజులు 18:43 ఇదే బైబిలు విశ్వాసము. విశ్వాసి తన విషయమై చేసిన ప్రార్ధన దేవుడు
వినక
మానడు.
అవి
అతనికి సుళువే. దీనికి మినహాయింపులు లేవు. మార్కు. 11:24నకు నేను సులోచనముల జోడు అని పేరు పెట్టినాను.
- (1) ప్రార్థించండి
- (2) నెరవేరదు
- (3) నమ్మివేయండి
- (4) అప్పుడు నెరవేరును.
- (3) పెద్ద పులి సమీపించెను. కుమారుని చేతిలో తుపాకి ఉన్నను జంకును చెట్టుమీద ఉన్న తండ్రి చేతిలో తుపాకి ఉన్నది, గాన జంకవద్దని చెప్పెను. కుమారుడు ఏది నమ్మవలెను? పులి వస్తున్నట్టు నమ్మవలెనా? తండ్రి చెప్పినది నమ్ముకొనవలెనా? తండ్రి తుపాకి వేయును. అది కుమారుని తెలియదు
- (4) గోడమీద బాలుడు చీకటిలోని తండ్రి సందిటిలోనికి దుమికిన కథ. ఇదే విశ్వాస బాలుని మనవి, లేక కోరిక నెరవేరినది, అలాగే విశ్వాసి ప్రార్ధనను దేవుడు వినడా?
- 8.
- (1) యోహాను 14:14 నా నామమందు మీరు ఏమి అడిగినను చేతును అని ప్రభువు వాగ్ధానమిచ్చెను. ఇది బైబిలులోని వాగ్ధానములో నున్నప్పటికిని మొదట వ్రాసికొనవలసినది ఏమి అను మాటను గుర్తించండి. ఫలానిది అడిగిన చేతును అనలేదు, ఏమి అడిగినను చేసెదనని వాగ్ధానమున్నది, గనుక ఇది మనకెంత గొప్ప పట్టు?
- (2) మనము ఊహింప గలిగినంతకంటె ఎక్కువ చేయగలడని ఎఫెసీ. 3:20,21లో నున్నది. అది ఎంత గొప్ప మాట?
- (3) విశ్వాసము గలవారి ప్రార్ధనలు దేవుడు నెరవేర్చినట్టు అనేక మేఘములవలె సాక్ష్యములుండగా వినడని ఎందు కనుగొనవలెను (లేక)? ఎందుకు అనుకొనవలెను? వినడా? హెబ్రీ. 12 అధ్యా॥
- (4) మనము నమ్మదగని వారమైనప్పటికి దేవుడు నమ్మదగినవాడు. గనుక మన ప్రార్ధన వినడా? 2తిమోతి 2:13.
- 9.
- (1) మన ప్రార్ధనకు ముందే సర్వ సృష్టిని కలుగజేసెను.
- (2) వాగ్ధానములతో నిండిన బైబిలు గ్రంథమును మనచేతి కందించెను.
- (3) అవి బోధించుటకు సంఘమును స్థాపించెను.
- (4) మన నిమిత్తమై ప్రార్ధించుటకు పరలోక వాస్తవ్యులను పెట్టెను. మనలను కాపాడుటకును ప్రార్థించుటకును
- (5) దేవదూతలను ఏర్పాటు చేసెను. మన నిమిత్తము విజ్ఞాపనలు చేయుటకై కుడిపార్వమున తన (6)
- కుమారుని నియమించెను. మన బలహీనతలలో మనకు సహాయము చేయుటకై మనలో తన
- (7) ఆత్మనుంచెను. నిరాశపడక ప్రార్థించండని మనలో
- (8) ప్రేరేపణ కలిగించెను. ఈ ఎనిమిది ఏర్పాటులు చేసిన తండ్రి మన ప్రార్ధన విన్నాడా?
- 10.
- (1) కయీను ప్రార్థన విన్నాడా? (చేసాడా?)
- (2) జలప్రళయ నాశనజనుల ప్రార్ధన విన్నాడా? (చేసినారా)
- (3) సొదొమ వారి ప్రార్ధన విన్నాడా? (జేసినారా?)
- (4) ఎఱ్ఱ సముద్రములో నశించిన “ఐగుప్తీయుల ప్రార్థన" విన్నాడా? (చేసినారా?)
- (5) అరణ్యములో రాలిపోయిన ఇశ్రాయేలీయుల ప్రార్ధన విన్నాడా? (చేసినారా?)
- (6) యూదా ఇస్కరియోతుయొక్క ప్రార్ధన విన్నాడా? (పేరుకైనా చేసినాడా?) ఏశావు ప్రార్ధన విన్నాడా? (చేసినాడు గాని చేయలేదు).
11. అపో॥కార్య॥ 9:11లో ఉన్నట్టు ఇదిగో అతడు ప్రార్ధన చేయుచున్నాడని లోకములో ఎవరినిగూర్చి చెప్పబడెనో అతని ప్రార్థన విన్నాడా? ఇతరులు చేయుచున్నవి కావు: పాపి స్వయముగా చేయుచున్న ప్రార్థన వినడా? పరజన ప్రార్ధన ఫలిత ప్రార్ధన. మూడి దొరగారు ఒక్కపాపి నిమిత్తము 50సం॥లు ప్రార్ధన చేసినారు. ఎంత ఓపిక? ఒక దైవజనుడు ప్రార్ధనోద్యోగ మేర్చరచుకొని ఎవరైనా మాట్లాడుటకు వస్తే నేను కొన్ని నిమిషములు మాట్లాడితే కొన్ని ఆత్మలు నాశనమగునని మాటలాడుట మానివేసేవారు. మరొక దైవజనుడు ఒక పుట వ్రాసిన పిమ్మట అద్దుట మాని ఆ సమయములో ప్రార్ధన చేసేవారు. వింటాడని విశ్వాసులు గోజులాడే స్త్రీవలె చేస్తుండగా వినడా?
- (1) తండ్రి గనుక
- (2) సృష్టి పాడౌను గనుక
- (3) ఆయనకే నష్టము గనుక
- (4) మనకు నష్టము గనుక వినడా? వినకపోతే ఆయన దైవత్వమును నరావతారమును కొట్టివేసికొన్నట్టే వినడా? వినకపోతే మరల వెలుగు కలుగును గాక అని అనవలెను, గనుక వినడా? అనగా మరల సృష్టిని కలుగజేసి నరావతారిగా వచ్చి చనిపోవలెను. వినుట కష్టమా? మరల చనిపోవుట కష్టమా?
బోధించుట నిజమైతే మీరు వినుట నిజమైతే ప్రార్ధించుట నిజమైతే, నమ్ముట నిజమైతే దేవుడు చేయుట కూడ నిజమే!