గ్రంథకర్త: యం. దేవదాసు అయ్యగారు
15. విజ్ఞాపన చార్టు
సృష్టి కొరకైన ప్రార్ధన:-
1. దేవా! నీవు కలుగజేసిన సృష్టిలోని ప్రతి జీవిని, ప్రతి వస్తువును ప్రతి నిమిషము దీవించుచుండుము ఆమేన్ . యెష. 27:3.
2. నీవు కలుగజేసిన సృష్టంతటికి నరవాక్కులిచ్చి క్రీస్తుప్రభుని సమాచారము భూలోకంలో ఉన్న ఒక్కొక్కరికి స్వప్నములోను, దర్శనములోను అందించుము ఆమేన్.
3. దేవా! నీవు అన్ని ప్రార్ధనలు విన్నందుకు నీకు స్నోతములు. నీ లక్షణములు స్తోత్రములతోపాటు స్తోత్రములు జరిగించుకొనుము ఆమేన్.
1. నీవు మా తండ్రివని చనువుగా నీయొద్దకు వచ్చుచున్నాము మమ్మును అంగీకరించుము. ఆమేన్.
2. తండ్రీ! మా జన్మమునుబట్టియు, మా ప్రవర్తనను బట్టియు చూడగా నీయొద్దకు వచ్చుటకు మేము యోగ్యులము కాము. అయినను నీ కుమారుడైన యేసు ప్రభువునుబట్టి రానిచ్చుచున్నావు గనుక నీకు వందనములు ఆమేన్.
3. తండ్రీ! నీకు అసాధ్యమైనది ఏదియు లేదు? మత్త: 19:26. గనుక మేము ఎంత గడ్డయిన మనవి చేసినప్పటికిని నెరవేర్చగలవు. ఆమేన్.
4. తండ్రీ! నీ నామమునుబట్టి మేము ఏమి అడిగినను చేతునని వాగ్ధానమిచ్చినావు గనుక మా ప్రార్ధనలన్నియు ఆలకింతువని నిన్ను స్తుతించుచున్నాను. యోహాను 14:14 ఆమేన్.
5. తండ్రీ! మా అజ్ఞానము చొప్పున వేము కొన్ని అడగకపోయినను ఇయ్యగలవు అని నిన్ను స్తుతించుచున్నాము. అడిగిన వాటికంటే ఎక్కువ ఇచ్చెదవని నిన్ను స్తుతించుచున్నాము. ఎఫెసీ 3:20,21.
1. నృష్టి విషయము:- (1) సర్వలోక రక్షకా! మేము వ్రాసికొన్న భూగోళము అన్ని దేశములను సృష్టియంతటిని ప్రతి నిమిషము దీవించుచుండుము ఆమేన్. యెష. 27:8 ఆమేన్.
(2). జపానులోని విశ్వాసులయొక్క ఆత్మలను ఒక దినమందు లోకములోని ఒక్కొక్కరి దగ్గరకు స్వప్నములోనికైనను, దర్శనములోని కైనను తీసికొనివెళ్ళి వారిచేత క్రీస్తు ప్రభువుని గురించిన సమాచారము వినిపించుము. అలాగే అన్ని దేశములలోని విశ్వాసులచేత అందరకు దినములవరుస ననుసరించి సువార్తను వినిపించుము.
1. అలాగే విశ్వాసులయొక్క ఆత్మలను
2. అలాగే అవిశ్వాసులయొక్క ఆత్మలను తీసికొనివెళ్ళి సువార్త చెప్పించుము.
3. మిగతా సువార్తికులచేత పైరీతిగానే సువార్త చెప్పించుము.
4. పక్షులు, అడవి మృగములు గ్రామ మృగములు, కొండలు, దిబ్బలు, వృక్షములు, నేలధూళి ఇసుక, ఖనిజములు అనగా వెండి, రాగి, బంగారము, ఇత్తడి, సత్తు, ఇనుము, అభ్రకము, వజ్రము, రాళ్లు, ఈ మొదలైనవి మరియు సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు, వర్షము, గాలి, గాలిలోను, నీళ్లలోను, భూమిమీదను, భూమిలోనున్న పురుగులు మరియు నరులు తమయొక్క ఉపయోగము నిమిత్తము సృష్టించిన ఉపకార సాధనములు అనగా నీటిమీద ఉన్న పడవలు దోనెలు, స్టీమర్లు, తెప్పలు తెప్పకొయ్యలు మరియు నేలమీద తిరుగు ట్రయిన్లు, ఆస్పత్రిలోని సామాన్లు కంపెనీలలోని సామాన్లు బజారులోని సామాన్లు జట్కాలు, బండ్లు, సైకిళ్ళు మరియు లోగిళ్ళు, ఇండ్లలోని సామాన్లు, ఆస్పత్రిలోని సామానులు, కంపెనీలలోని సామానులు బజారులోని సామానులు, పొలములోని సామాన్లు, గాలిలోని విమానములు, కుమ్మరి కుండలు, కంచర దుకాణములలోని సామాన్లు, కంసాలుల సామాన్లు, చెప్పులు కుట్టువారి సామాన్లు, సాలీల సామాన్లు, చాకళ్ళ సామాన్లు వర్తకుల సామాన్లు, పుస్తకములు అచ్చు ఆఫీసులు ఇతర ఆఫీసులు, మంగలి సామాన్లు, యుద్ధ ఆయుధములు, నగలు మేదర్ల సామాన్లు, తాఫీ మేస్త్రీల సామాన్లు, ఉప్పర్ల సామాన్లు, ఎలెట్రిక్కు సామాన్లు, మిల్లులలోని సామాన్లు, ఫొటోగ్రాపుల గదులలోని సామాన్లు, సినిమాలు, మేజిక్ లాంతర్ల పటములు, విగ్రహములు ఎక్సరేలు టెలివిజన్ ఈ మొదలైనవి మీరు ఇంకా అనేకమైనవి చేర్చుకొనవచ్చును. ఇవన్నియు వీరందరును సువార్తికులే.
5. దేవదూతలు మోక్షలోక పరిశుద్ధులు, పాతాళములోనివారు, గాలి మేఘము, ఉరుము, మెరుపులు, వడగండ్లు, పిడుగులు వర్షమునకు సంబంధించిన నదులు, కాలువలు, చెరువులు, గుంటలు, సముద్రము, జలచరములు ఈ మొదలైనవి.
షరా:- ప్రతివాటివల్ల మేలు కీడు గలదు. గనుక మేలు కలిగించుమనియు కీడు తొలగించుమనియు ఈ ప్రకారముగా సర్వసృష్టిని దీవించుమని సువార్త చెప్పించుమనియు వేడుకొనవలెను.
ఒక పని:-
- 1. నీకు మగవాడు కనబడితే అయ్యా! నీవు ఎప్పటికైన ఇవాంజిలిస్టువై తీరవలెను. పాతాళములో ఉన్నా పరదైసులో ఉన్నా వచ్చి ఇవాంజిలిస్టుగా పనిచేయవలెను. తండ్రీ! ఇవి నెరవేర్చుము.
- 2. స్త్రీలు కనబడితే ఓ అమ్మా! ఎప్పటికైనా బైబిలు బోధకురాలివిగా నీవు మారవలెను. తండ్రీ! ఈమెను ఆ ఉద్యోగమునకు మార్చుము. పాపములో ఉన్నా సరే తప్పక జరుగుతుంది.
- 3. దారిలో ఒక జీవి కనబడితే ఓ గుర్రమా! ఓ ఎద్దూ! ఓ పక్షి , ఓ కోడిపెట్టా! నీవుకూడ కొన్నాళ్ళకు సువార్త పనివారుగా మారిపోవలెను. తండ్రీ! వీటిని ఆ పనికి తయారు చేయుము.
- 4. ఏ వస్తువైనా! మీకు కనపడితే నీవుకూడ ఎప్పటికైనా సువార్త పనిచేయవలెను. తండ్రీ! వీటిని అట్లు తయారుచేయుము.
షరా:- వీరందరు దేవునివల్ల ప్రతి నిమిషము దీవెన పొందుచున్నారు. గనుక ఈ మాత్రము సేవచేయలేరా? అని అడుగుడి.