గ్రంథకర్త: యం. దేవదాసు అయ్యగారు

3. దైవసన్నిధి చార్టు



యోబు 4:2, యిర్మియా. 32:27, మత్త. 7:7, 6:6, యోహాను 6:37, మార్కు 11:24, లూకా. 18:7,8, రోమా 8:32, రోమా 8:26,28, మత్తయి 19:26, యోహాను 11:14, ఎఫెసీ 3:20,21, ఫిలిప్పీ 4:6, 2తిమోతి 6:17.


1) దైవవాగ్థానములు స్మరించు క్రమము:-

ఓ దేవా! తండ్రీ నీ నామ మహిమను అనుభవించుటకై మమ్మును కలుగజేసిన నీకు అనేక స్తోత్రములు, అన్ని అనుగ్రహ దానములగు భూమ్యాకాశముల నిమిత్తమై వందనములు.


నిత్యము నిన్ను స్తుతించుచు మాకు కావలి బంటులుగా నున్న దేవదూతల నిమిత్తమై మీకు స్తుతులు. మాకొరకు అన్నిచేసిపెట్టి ఆయనతో సమానముగా ప్రేమించిన నీ ప్రియ కుమారుడైన క్రీస్తు ప్రభువు నిమిత్తమై నీకు స్తుతులు, మాలోను, మాతోను ఉండి మమ్మును మహిమ రాకడకు ఆయత్తపరచుచున్న పావనాత్మ నిమిత్తమై నమస్కారములు. నీ దివ్య లక్షణముల రూపమును అనాదినుండి అనంతము వరకు మా కొరకై చేయుచున్న రక్షణ కార్యక్రమము అన్ని లోకములలో మా కొరకు ఉంచిన భాగ్యములను, పాపములను, పరిశుద్ధతను, మా కన్నులకు కనపరచు రాజగ్రంథమైన బైబిలు గ్రంథము నిమిత్తము ప్రణుతులు. మేము నిత్యము నీతో జీవించుటకై మాకొరకు సిద్ధపరచిన మహిమ మోక్షము నిమిత్తము స్తోత్రములు. నిన్ను నీవు మాకై యిచ్చిన సమస్త దానములను లోకమునకు చూపుచు తెలియజేయుచున్న క్రైస్తవ సంఘము నిమిత్తము వందనములు. పైనున్న సమస్త దానములను మేమందుకొనుటకును, అనుభవించుటకును ఆనందించుటకును, మాకు అనుగ్రహించిన భూలోక దైవసన్నిధి సహవాసము నిమిత్తమై మీకు మా హృదయపూర్వక వందనములు.


2) ప్రార్ధన క్రమము:-

(3) కనిపెట్టు క్రమము:- (4) కనిపెట్టుటవలన తొలగు కీడులు:- (5) కనిపెట్టు సమయమున కలుగు భాగ్యములు:-

పూర్వికులైన ప్రవక్తలు దేవుని సన్నిధిలో ఎంతోసేపు కనిపెట్టుటవలన గొప్ప గొప్ప ప్రవచన గ్రంథములను వ్రాయగలిగిరి. దేవుని అభిప్రాయములు తెలుసుకొన గలిగిరి, కనిపెట్టిన పిమ్మట ప్రార్థించినాము అను సంతోషమే గాక దేవుడు జవాబు యిచ్చినాడు అను సంతోషము కూడ కలిగెడిది. ప్రార్ధనలో కనిపెట్టు వాడుక సంఘములో సంఘ నాయకులు ప్రవేశపెట్టిన యెడల సంఘముయొక్క విశ్వాసము ఆనందము ఎంతో వృద్ధియగును. అన్నియు పరిష్కారమగును. కఠిన ప్రశ్నలన్నింటికిని జవాబు దొరుకును. ప్రభువు రాక మిగుల సమీపమని నమ్మువారు సిద్ధపడుటకు కనిపెట్టు సమయమొక గొప్ప సాధనమని మా తాత్పర్యము కనిపెట్టు గంట సర్వ మతముల వారికిని భక్తులకును, నాస్తికులకును, మానవ జన్మమెత్తిన ప్రతి వారికిని ఉపయోగమే. ఈ విధముగా అనేక భాగ్యములు కలుగును. ఎన్ని భాగ్యములో వివరింపలేము. మేము వ్రాసినవి తక్కువైనను, మీ అనుభవములో ఎక్కువ గ్రహింపగలరు.


(బి) దైవ ప్రత్యక్షత:-

6) దైవసన్నిధి క్రమము:-


దేవా! నాకు కనబడుము. నాతో మాట్లాడుము.
అందరికి కనబడుము. అందరితోను మాట్లాడుము.

అందరికి నీ విషయములు తెలియజేయుము. నా ప్రశ్నలకు జవాబులు చెప్పండి అని మరియొక మారు ప్రార్థించండి. అప్పుడు ఏమి జరుగునో కనిపెట్టండి. క్రైస్తవులలో కొందరు ప్రతిదినము కొంతసేపు దైవధ్యానములో ఉండవలసిన మీటింగు పెట్టుకొనుచున్నారు. ఆ మీటింగులోనికి

షరా:- బైబిలులోని వాక్యముల అర్ధములు క్రీస్తుప్రభువు చెప్పును. ఇది దైవపూజయైయున్నది. ఇద్దరు, ముగ్గురు నా నామమున ఎక్కడ కూడికొనియుందురో అక్కడ నేను ఉందునని ప్రభువు చెప్పినమాట మాకు ఆధారము. క్రీస్తుప్రభువు ఏదైనా చూపవచ్చును. మీరు కోరినప్పుడెల్ల సంస్కారపు భోజనము వడ్దించును. బైబిలులోని విశ్వాసులకు ఆయన కనపడిన విధముగానే నేడును విశ్వాసులకు కనబడును. ఒకానొకప్పుడు అవిశ్వానులకు కూడ కనబడి మాటలాడును. లోకములోనున్న ఏ మతస్తులైనను సన్నిధికూటము పెట్టుకొనవలెనని మా కోరిక. క్రీస్తుపేరు ఇష్టము లేనివారు ఓ దేవా! సృష్టికర్తా! మాకు కనబడి మాటలాడుమని ప్రార్ధింపవచ్చును.


7) సన్నిధి వన్నె:


నిర్గమ. 25:30, 33:14, లేవీ. 22:3, సంఖ్యా. 4:7, యోబు 1:12, దా॥కీర్తనలు 16:11, 95:2, 139:7, యెషయా 63:9, యెహె. 32:26, నహూము 1:5, లూకా. 13:26, 2థెస్స. 1:2.


సింహాసనము:-


నిర్గమ. 33:15, 1దిన. 16:27, 2దిన. 33:12, యోబు 2:7, 23:15, దా॥కీర్తనలు 17:2, 31:20, 68:2, 68:8,12, లేవీ. 24:5-9, దా॥కీర్త. 140:13, యెష. 19:1, 64:1,3. యిర్మి 5:22, యోనా. 1:3,10, జెఫన్యా 1:7, లూకా. 1:19, కొరింథి. 1:9, హెబ్రీ. 9:24, యూదా 1:24 1సమూ. 21:6, మత్త. 12:24, మత్త. 18:10.