బైబిలు మిషను వారును, రాకడ విశ్వాసులును చేయవలసిన ప్రమాణములు
(సూచన: ఇవి చదువుట లేదా వినుట ప్రమాణము కాదు, ప్రమాణము చేయువారు గమనికలను, సలహాలను పాటించి
దైవసన్నిధిలో చేయుటయే
ప్రమాణము)
-
1) సంఘారోహణమునకు సిద్ధపడుదునని త్రిత్వదేవుని ఎదుటను, పరిశుద్దులందరి ఎదుటను, దైవజనుని ఎదుటను నేను ప్రమాణము
చేయుచున్నాను.
-
2) సంఘారోహణము త్వరలో జరగనైయున్నదని నమ్ముచు ప్రమాణము చేయుచున్నాను.
-
3) బైబిలు మిషను సిద్ధాంతములకు పూర్తిగా లోబడుదునని వాగ్ధానము చేయుచు ప్రమాణము చేయుచున్నాను.
-
4) సంఘారోహణ వృద్ధికి ప్రయాసపడుచు, నా పనిని, నా జీవితమును వాడుదునని ప్రమాణము చేయుచున్నాను.
-
5) శ్రమ, కరువు, ఖడ్గము, నింద, అవమానము మొదలైన వాటికి భయపడక, హత సాక్ష్యము కొరకు నిలబడుదునని ప్రమాణము చేయుచున్నాను.
-
6) ఏ మతము వారుగాని, ఏ జాతి వారుగాని, ఏ జనము వారుగాని కనబడినప్పుడు, నేను రాకడ వర్తమానము చెప్పుదునని ప్రమాణము
చేయుచున్నాను.
-
7) అన్యుల, అవిశ్వాసుల సహవాసమును చూచి, విశ్వాసుల యొక్కయు, దేవుని యొక్కయు సహవాసము చేయుచున్నాను.
-
8) అందరితోను సమాధానముగా యుందునని ప్రమాణము చేయుచున్నాను.
-
9) రాకడ వాగ్ధానము నిలువబెట్టుదునని ప్రమాణము చేయుచున్నాను.
-
10) రాకడ పాటలు, రాకడ ధ్యానములు, రాకడ ప్రార్ధనలు, రాకడ చందా ఇచ్చుచు, దినమునకు ఒకగంటయైన సన్నిధి చేసెదనని ప్రమాణము
చేయుచున్నాను.
-
11) నేడును దేవుడు కనబడును, మాటలాడునని ఇతరుల ఎదుట ఒప్పుకొందునని, ప్రమాణము చేయుచున్నాను.
-
12) నీకును, సన్నిధికిని ప్రతి విషయములోను, సంపూర్ణముగా లోబడుదునని నేను ప్రమాణము చేయుచున్నాను. ఆమెన్. మరనాత.
రెండవ రాకడ
యేసు ప్రభువు
వచ్చుచున్నా - రిదిగో వినరండి =
పూర్వ
- దోసకారులు చంపిరి బ్రతికెను - దొడ్డ నరుడై వచ్చునండి ॥యేసు॥