రాకడ ప్రార్ధనలు-స్తుతులు
Index
రాకడకు సిద్ధపడుట
-
1. బైబిలు అంతయును తెలిసికొనవలెను.
-
2. సువార్త పని ముగించి యుండవలెను, అనగా ఎవరికి చెప్పగలమో వారికి చెప్పియుండుట,
పత్రికాదులు మొదలైనవి పంచిపెట్టుట
-
3. చేయవలసిన ప్రార్ధనలన్నియు చేసి ముగించవలెను
-
4. ఇవ్వవలసిన చందాలన్నియు ఇచ్చివేయవలెను,
తీర్చవలసిన అప్పులన్నియు తీర్చివేయవలెను
-
5. తప్పులు ఒప్పుకొని ఇతరులతో సమాధాన పడవలెను
-
6. ఇదివరకు వ్రాసికొన్న నోట్సులు ఒక
పర్యాయము చూచు కొనవలెను,
కూటనాయకులు మెంబర్లకు ఒక పర్యాయము నోట్సు చదివి వినిపింపవలెను
-
7. చేయవలసినవి చేతునను తీర్మానము చేయవలెను
-
8. ఇదివరకు
నోట్సుమీదను, ఇతరుల ప్రార్ధనమీదను ఆనుకొన్న యెడల ఇప్పుడది మానివేయవలెను. మీకు మీరే ప్రార్థనాస్తుతులతో
కనిపెట్టవలయును.
వాక్యమును ఆధారము చేసికొని, ప్రభుయేసునందలి విశ్వాసముతో సిద్ధపడవలెను. రాకడను గురించి పత్రికలలోను, నోట్సులలోను
ఉండు
సంగతులన్నియు చదివియుండవలెను
-
9. మనము చేయుదుమనునవి చెప్పి చేయనియెడల, ప్రభువును తనపని ఎట్లు చేయునని నీవు చెప్పగలవు?
సిద్ధపడుటలో ఆలస్యము చేయగూడదు. నీవు వెళ్లి అలాగు చేయుమని ప్రభువు ఒక ధనికునితో చెప్పెను.
ప్రభువా! ఎవరు చేయవలెను? అని
అడుగనక్కరలేదు. గనుక ఎవరు చేయవలసినది వారు చేయవలెను. నాకు రాకడనుగూర్చి తెలియలేదు అని నీవు అందువేమో! తెలిసికొనక
పోవుట
ఎవరి తప్పు? నీవు రక్షింపబడిన తర్వాత ఎక్కువ సేవ చేసిన యెడల ఎక్కువ ఫలితము పొందుదువు గాని రాకడలో పాలెక్కడ? నీవు
ఎక్కువ
బైబిలు చదివిన యెడల ఎక్కువ జ్ఞానము పొందుదువు గాని రాకడలో పాలుయెక్కడ? నీవెక్కువ మందినిగూర్చి ప్రార్ధనచేసి యెడల,
ఎక్కువ
ఫలితము పొందుదువు గాని రాకడలో ఫలితము నీకు ఎక్కడ? ఎక్కువ సువార్త పనిచేసిన యెడల ఎక్కువ సువార్త ఫలితము పొందుదువు
గాని
రాకడలో
పాలెట్లుండును? ఎక్కువ చందావేసిన యెడల, దానికి ఫలితముగాని రాకడలో పాలెట్లుండును? రాకడకు సిద్ధపడితేనే రాకడలో
పాలుందును.
-
10. జలప్రళయము కథ, దానియేలు 2,7 అధ్యాయములు, ఏలీయా ఆరోహణము, హనోకు ఆరోహణము, మార్కు 13:32-37; వీటి వివరము బాగుగా
తెల్సుకొనవలెను.
రాకడనుగూర్చి ప్రభువు చెప్పిన మాటలు అపోస్తలుల మాటలు, పూర్తిగా నేర్చుకొనవలెను.
ప్రశ్నలు:
-
1. చదువరీ! క్రీస్తుప్రభువు త్వరగా వచ్చుననియు, అనగా ఆయన వచ్చుటకు ఆయనకేమియు అడ్డములు లేవని అర్ధమనియు,
గురుతులైన
తర్వాత ఆయన త్వరగా వచ్చుననియు గ్రహించినావా?
-
2. ఫలానప్పుడు వచ్చెదనని ప్రభువు తారీఖు చెప్పలేదు గనుక
ఎప్పుడుబడితే అప్పుడే ఆయన వచ్చునని గ్రహించినావా?
-
3. బహిరంగమైన గురుతులే కాదు, ప్రభువు నీకు స్వయముగా చెప్పిన గురుతు
గ్రహించినావా? అనగా నేను వచ్చు వేళ అయినదని ప్రభువు నీకు చెప్పుట గ్రహించినావా?
-
4. నీవు రక్షింపబడియున్నావని నీకు
నిశ్చయమేనా?
ఇదికూడ ప్రభువు నీకు చెప్పినాడా?
-
5. నీవు పరిశుద్ధాత్మ బాప్తిస్మము పొందినావని ప్రభువు నీకు చెప్పినాడా? ఇది నిశ్చయమేనా?
-
6. ఇంతకాలము సిద్ధముగా నుండి ఆయన వచ్చునప్పుడు చల్లబడెదవని నీకు తోచినదా?
-
7. చెప్పబడిన వారందరు అబద్ధ ప్రవక్తలు కారనియు,
బైబిలులో చెప్పబడిన అబద్ధ ప్రవక్త యేడేండ్లలో వచ్చుననియు, ఎవరుబడితే వారు అంతెక్రీస్తు కాదనియు, అతడు ఏడేండ్లలో
వచ్చుననియు
గుర్తించినావా?
-
8. అబద్ధ ప్రవక్తలైనను, అంతెక్రీస్తు యైనను; క్రీస్తుయొక్క దైవత్వము ఒప్పుకొనని వారికిని, లోకము యొక్క
ఆందోళన
చూచి రెండవరాకడ దగ్గరపడినదని చెప్పిన, ఇవన్ని 2000 సం॥ముల నుండి ఉన్నవేగాని, క్రొత్తవి కావు అని చెప్పు వారికిని,
గురుతులు
కొన్ని స్థలములలోనేగాని అన్ని స్థలములలో లేవనువారికిని, ఈ రీతిగా రాకడకు ఎదురు ప్రశ్నలు వేయువారికి జవాబులు
చెప్పగలవా?
-
9. నేను తప్పకుండ ఎత్తబడుదునను విశ్వాసమును బట్టి ఆనందించువారికిని, నేను రాకడ సంగతులన్నియు నేర్చుకొన్నాను గనుక
ఎత్తబడుదునని
చెప్పు వారికిని, నాయందు అభిమానముగల వారందరు నన్ను గురించి ప్రార్ధించుచున్నారు గనుక నేను ఎత్తబడుదునని తలంచు
వారికిని,
నేను
బాప్తిస్మము పొందినాను గనుక ఎత్తబడుదునని తృప్తిచెందు వారికిని, మనవలె ఇన్ని సంగతులు నేర్చుకొనక, సిద్ధపడక -
కేవలము
యేసు
ప్రభుని నమ్మిన వారిని ఆయన తీసికొని వెళ్ళును గనుక నన్నుకూడ తీసికొనివెళ్ళును అని పలుకు వారికిని, ఆయన రాకడను
గూర్చికూడ
సువార్త ప్రకటనలో చేర్చి ప్రకటించుచు అనేకమందిని నమ్మింపజేయుచున్నాను గనుక తప్పకుండ ఎత్తబడుదునని భ్రమపడు
వారికిని,
చెప్పు
జవాబు నీ దగ్గర నున్నాదా? ఇవన్నియు ఎత్తబడుటకు నిజమైన కారణములేనా? పై సంగతులు అనుకొనువారిని గురించియే,
పరిశుద్దాత్మకు విరోధమైన పాపమని హెబ్రీ 6:1-7వ॥లలో ప్రభువు చెప్పుచున్నారు.
-
10) ఎత్తబడుదునని, పైన చెప్పిన విధముగ
సంతోషించు
వారికి యెహెజ్కేలు 33:23-30లో ఉన్న సంగతిని గూర్చి జ్ఞాపకము చేసినావా?
-
11) ఎవరు వాక్యము విందురో, ఎవరు విని విశ్వసింతురో,
ఎవరు విశ్వసించిన ప్రకారము విధేయులై నడుచుకొందురో, ఎవరు విమలాత్మ
ప్రోక్షణము అనగా పరిశుద్దాత్మ బాప్తిస్మము
పొందుదురో,
ఎవరు
ఎత్తబడవలసిన నూతన యెరూషలేములో నుండు కాంతిని చూచుటకు భూలోకములోనే తర్ఫీదులగుదురో, ఎవరు యోహానువలె ఈ లోకములోనే
యేసుక్రీస్తు
ప్రభువుతో మిక్కిలి సహవాసము చేయుదురో; అట్టివారు ఎత్తబడుదురు.
-
12) అబద్ధ ప్రవక్తలు ఎవరు?
- ఎ) క్రీస్తు అక్కడ ఉన్నాడు, ఇక్కడ
ఉన్నాడు అని చెప్పువారు అబద్ధ ప్రవక్తలు. అలాగు అననివారిని చూచి కొందరు బోధకులు, ఇతర బోధకులను అబద్ధ
ప్రవక్తలని
చెప్పుచున్నారు. అట్లు ఇతరులను, అబద్ధ బోధకులు అనువారే అబద్ధ ప్రవక్తలు.
-
బి) చివరి రోజులలో అపహాసకులు వచ్చి, సృష్ట్యాది
మొదలు
ఇప్పటివరకు ఇట్లేయున్నది గనుక రాకడ ఇప్పుడని ఎట్లు చెప్పగలమని అనువారు అబద్ధ ప్రవక్తలు.
-
సి) రాకడ సమీపముగా లేదని గురుతులు
జరిగిన తరువాత కూడ ఎవరు అందురో, వారే అబద్ధ ప్రవక్తలు.
-
డి) రాకడను గురించి బోధించు వారిని చూచి, అది తప్పు అని ఎవరు
చెప్పుదురో వారే అబద్ధ ప్రవక్తలు.
-
13) కృపను లోకువ కట్టుట అనగానేమి? కొందరు - నాకు సిద్ధపడుట చాలా ఇష్టముగాని
ఆటంకములున్నవి, అయితే ప్రభువు నా ఆటంకములు తొలగించి నన్ను రాకడలో తీసికొని వెళ్ళునని తలంచుదురు. దేవుడు తన కృప
చొప్పున
చేర్చుకొన్నను, న్యాయమునుబట్టి శిక్ష వచ్చును. రాకడకు ముందు మనిషి కృపాకాలములో నుండును. ప్రభువు అనేకమైన
గడువులిచ్చును, ఈ
గడువులు త్రోసివేసినట్లయిన మనిషి న్యాయము దగ్గరకు వెళ్ళవలసి ఉండును. కృపలో మహిమ ఇవ్వబడినది గనుక మనిషి ఆ గడువును
వాడుకొనకపోయిన, న్యాయమువచ్చి రావలసిన మహిమ తీసివేయును.
-
14) ముద్రల, బూరల, శ్రమలు అయిన తర్వాత మహా భయంకర శ్రమలైన పాత్రల
శ్రమలకు
ముందు,
దేవుడు గొప్ప స్వరముతో, "నా ప్రజలారా! నా తట్టు తిరగండి" అనును, అనేకమంది తిరుగుదురు. అయితే ఆయనను ఎరిగినవారే కృపను
లోకువ
కట్టినవారు, వారే కృపను ద్వేషించినవారు, మారుమనస్సు లేనివారు. తల్లిదండ్రులను లోకువ కట్టువారు తమ పిల్లలే,
బయటివారు
కారు.
ఇతరులైతే ఎదిరింతురు. అలాగే దేవుని సంగతులు ఎరిగినవారే దేవుని లోకువ కట్టుదురు. నోవహు ఓడ మూయబడును, కృప
ఆగిపోవును.
తప్పిపోయిన కుమారుడు, తండ్రిని క్షమాపణ కోరుకొన్నాడు. విడిచిపెట్ట వలసినవి విడిచిపెట్టినాడు, పూర్తిగా
వచ్చివేసినాడు.
పూర్తిగా రావడము కుమారత్వమునకు సంబంధించినది గనుక తండ్రి కుమారునిగా చేర్చుకొనెను గాని దాసునిగా చేర్చుకొనలేదు.
ఎవరైనను
సిద్ధపడిన తర్వాతనే "అయోగ్యుడను" అనిన బాగుండును. గాని సిద్ధపడక ముందు ఆ మాట అనుట
బాగుండదు.