విమలాత్మ ప్రోక్షణము
Index
విమలాత్మ ప్రోక్షణము
గ్రంథకర్త యం. దేవదాసు అయ్యగారు
ఆత్మ బాప్తిస్మము
“అయితే ఆత్మపూర్ణులై యుండుడి ఒకనినొకడు కీర్తనలతోను, సంగీతములతోను, ఆత్మసంబంధమైన
పాటలతోను హెచ్చరించుచు, మీ హృదయములలో ప్రభువునుగూర్చి పాడుచు, కీర్తించుచు, మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట
సమస్తమునుగూర్చి తండ్రియైన దేవునికి ఎల్లప్పుడును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందలి భయముతో
ఒకనికొకడు లోబడియుండుడి” ఎఫెసీ. 5:18-21.
పరిశుద్ధాత్మ బాప్తిస్మ చరిత్ర
- 1. “మనుష్యులందరిమీద నా ఆత్మను
కుమ్మరించెదను” (అపో॥కార్య॥ 2:17).
-
2. “ఆత్మను ఆర్పకుడి” 1థెస్స. 5:19.
-
3. “మీరందరు భాషలతో మాటలాడవలెనని
కోరుచున్నాను”. కొరింథి. 14:5.
-
4. “భాషతో మాటలాడువాడు మనుష్యులతో కాదు దేవునితో మాటలాడుచున్నాడు.
మనుష్యుడెవడును గ్రహించడు గాని అతడు ఆత్మవలన మర్మములను పలుకుచున్నాడు”. 1కొరింధి. 14:2.
-
5.
“భాషలతో
మాటలాడుట ఆటంకపరచకుడి” 1కొరింధి. 14:40.
ఈ పుస్తక సంగ్రహము
- 1. పరిశుద్ధాత్మ బాప్తిస్మము అందరికి అని
బైబిలులో నున్నది.
-
2. పరిశుద్ధాత్మ బాప్తిస్మము పొందినవారికి భూలోక భాష
వచ్చినట్లు బైబిలులోనున్నది.
-
౩. పరిశుద్ధాత్మ బాప్తిస్మము పొందినవారికి పరలోక భాష వచ్చినట్టు
బైబిలులోనున్నది.
-
4. అందరు భాషలతో మాట్లాడవలెనని బైబిలులో నున్నది.
-
5. భాష వచ్చినవారు అర్ధముకొరకు
ప్రార్ధించవలెనని బైబిలులో నున్నది.
-
6. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామమున సంఘాధ్యక్షులు ఇచ్చే నీళ్ళ
బాప్తిస్మము వేరైనట్లును పరిశుద్ధాత్మతో యేసు ప్రభువు ఇచ్చే పరిశుద్ధాత్మ బాప్తీస్మము
వేరైనట్లును బైబిలులో
కనబడుచున్నది. కాబట్టి త్రియేక దేవ నామమున నీళ్ళ బాప్తిస్మము పొందినవారు తర్వాత
వరితుద్ధాత్మ
బాప్తిస్మము
గూర్చిన సంగతులన్నియు వూర్తిగా నేర్చుకొని అదికూడ పొందవలెను.
-
7. నీళ్ళ బాప్తిస్మము పొందడములోనే
పరిశుద్ధాత్మ బాప్తిస్మము పొందడముకూడ ఉన్నదని కొందరు అభిప్రాయ పడుచున్నారు. దీనికి బైబిలులో
ఆధారములేదు.