హెచ్చరిక



చేసిచూడండి:- ప్రభువునందు ప్రియులారా! పరిశుద్ధాత్మ బాప్తిస్మము అనే ఈ గొప్ప అంశమును గురించి బహు జాగ్రత్తగా ఆలోచించండి. మీరు ఉంటూ ఉన్న, మీరు వింటూ ఉన్న, ఉంటూ ఉన్న కూటములను ఆధారము చేసికొనక దేవుని వాక్యములో దీనిని గురించియున్న సంగతులను ఆధారము చేసికొనండి.
1) పరీక్ష - కూటముల వృత్తాంతములు బైబిలు వాక్యములకు సరిపోవుచున్నవో లేవో పరీక్షించండి. తొందరపడక శాంతించి దీర్ఘాలోచన చేయండి. కృప మీకు తోడై యుండునుగాక! సత్యసిద్ధాంతములను చూచి అసత్య సిద్ధాంతములని; అసత్య సిద్ధాంతములను చూచి సత్యసిద్దాంతములనియు పొరబడకండి. సంగతులను పూర్తిగా వినక ముందు ఇది తవ్పు అని తీర్మానించకండి. పరిశుద్ధాత్మ మీకిచ్చిన జ్ఞానమును, విశ్వాసమును బాగుగా వాడుకొనుచు సంగతులు తరచండి.
2) తృణీకారము:- పూర్తిగా పరీక్షించనిదె “ఇవి దయ్యాలకూటములు అటువంటి కూటములు” ఇటువంటి వారి కూటములు అని చెడ్డ పేర్లు పెట్టకండి. క్రీస్తు దయ్యము వట్టినవాడనియు సైతాను శక్తివల్లనె అద్భుతములు చేయువాడనియు ప్రభువుకు సైతము చెడ్డపేర్లు పెట్టిన యూదులు ఎంత పొరపాటుపడిరో జ్ఞాపకము తెచ్చుకొనండి.

చేసిచూడండి:-