విమలాత్మ ప్రోక్షణము: ప్రశ్నలు-జవాబులు(11-15)
11. ప్రశ్న :- ఇది ఎచ్చట జరిగినది?
జవాబు: యెరూషలేములో జరిగినది.
12. ప్రశ్న :- ఈ నూట ఇరువదిమంది కూటము యెరూషలేములో ఎక్కడ జరిగినది?
జవాబు : ఒక మేడ గదిలో జరిగినది (అ॥కార్య. 1:13).
13. ప్రశ్న :- ఏమి చేసినందువల్ల పరిశుద్ధాత్మ బాప్తిస్మము పొందిరి?
జవాబు:-
- 1) వారు తండ్రియొక్క వాగ్ధానముకొరకు కనిపెట్టుటవల్లనే. “మీరు యెరూషలేమునుండి వెళ్ళక, నావలన వినిన తండ్రియొక్క వాగ్ధానముకొరకు కనిపెట్టుడి” అని ప్రభువు చెప్పలేదా! (అపో॥కార్య. 1:4). వారు పరిశుద్ధాత్మను పొందువరకు యెరూషలేము విడువలేదు. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చునప్పుడు మీరు శక్తి నొందెదరు. గనుక మీరు యెరూషలేములోను యూదయ, సమరయ దేశములయందంతటను, భూదిగంతముల వరకును, నాకు సాక్షులైయుందురు” అని కూడ ప్రభువు చెప్పెను గదా!(అపో॥కార్య॥ 1:8).
- 2) వారు ఎడతెగక ప్రార్థనలో నున్నందువలన పరిశుద్ధాత్మను పొందిరి. “యెడతెగక ప్రార్ధన చేయుచుండిరి” అని అపో॥కార్య॥ 1:14లో ఉన్నది.
- 3) వారు ఏకభావముగలవారైనందువల్ల. “ఏక మనస్సుతో, ఎదతెగక ప్రార్ధన చేయుచుండిరి.” అని అపో॥కార్య. 1:14లో ఉన్నది.
- 4) వారు అందరు ఒకచోట కూడియుండుటవల్ల. ”పెంతెకొస్తను పండుగ దినము వచ్చినప్పుడు అందరు ఒకచోట కూడియుండిరి” అని అపో॥కార్య. 2:1లో ఉన్నది. కనిపెట్టచు, యెడతెగక ప్రార్ధనచేయుచు, ఏకభావము కలిగియున్నప్పుడు వారికి బాప్తిస్మము లభించెను. మనమును ఆ పద్ధతులే అవలంభించుదుము.
14ప్రశ్న :- పరిశుద్ధాత్మ బాప్తిస్మకాలమప్పుడు కనబడిన గురుతులేవి?
జవాబు :
- 1) ధ్వని ఒక గురుతు. ఆ ధ్వని వేగముగా వీచు బలమైన గాలి ధ్వనివలె ఉండెను. అది ఆకాశమునుండి అకస్మాత్ముగా కలిగెను. అది ఇల్లంతయు వ్యాపించెను.
- 2) అగ్నిజ్వాలలవంటి నాలుకలు రెండవగుర్తు. అవి ఒక్కొక్మరిమీద వ్రాలెను.
15. ప్రశ్న :- పరిశుద్ధాత్మ బాప్తిస్మము కలుగగా వారికేమి సంభవించెను?
జవాబు: 1) వారందరు పరిశుద్ధాత్మతో నిండినవారైరి. 2) వారు అన్యభాషలతో మాటలాడిరి.