విమలాత్మ ప్రోక్షణము: ప్రశ్నలు-జవాబులు(26-30)



26. ప్రశ్న:- పేతురు సమాధాన ప్రసంగము ప్రజలలో ఏమి పని చేసినది?

జవాబు:- వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొనిరి (అపో॥కార్య॥ 2:37).

27. ప్రశ్న:- పేతురు మాటలు మనసున గుచ్చుకొన్నప్పుడు ప్రజలేమన్నారు?

జవాబు:- సహోదరులారా! మేము ఏమి చేతుము? అని అడిగిరి (అపో॥కార్య॥ 2:37).

28. ప్రశ్న:- ఎవరిని ఇట్లడిగిరి?

జవాబు:- పేతురును తక్కిన అపోస్తలులను (అపో॥కార్య॥ 2:37).

29. ప్రశ్న :- తక్కిన అపోస్తలులును ప్రసంగము చేసిరా?

జవాబు:- అపో॥కార్య॥ 2:14 చూడండి.

30. ప్రశ్న :- ప్రజలడిగిన ప్రశ్నకు పేతురేమి ఉత్తరము చెప్పెను?

జవాబు: -నీళ్ళ బాప్తిస్మము పొందవలెననియు, పరిశుద్ధాత్మ బాప్తిస్మము పొందవలెననియు, మూర్కులగు ఈ తరము వారికి వేరై రక్షణపొందుడనియు ఉత్తరము చెప్పెను. (అపో॥కార్య॥ 2:38-40).