మిషనువారికి సలహాలు
- 1. పరిశుద్ధాత్మ
బాప్తిస్మము:- ఇది అందరకు అని అపో! కార్య॥ 2:39వ వచనములో నున్నది.
- 2. నీళ్ళ బాప్తిస్మములో తండ్రి,
కుమారులతోపాటు పరిశుద్ధాత్మను కలిగియుండుట వేరు. తదనంతరము పరిశుద్ధాత్మ
బాప్తిస్మము
పొందుటవేరు.
-
3. పరలోక
భాషలు మాట్లాడుట అనువరము: దీనిని గూర్చి విపులముగా 1కొరింథి. 14వ అధ్యాయములో
నున్నది.
-
4. భూలోక భాషావరము (భూలోక భాషావరము దేవుడు ఇయ్యగలడు. అపో॥కార్య॥ 2వ
అధ్యాయము).
-
5.
దర్శనవరము:- పరిశుద్ధాత్మ బాప్తిస్మము గూర్చి యోవేలు 2:28లో నున్న
వాక్యములలో దర్శనములను
గూర్చి యున్నది.
దేవుడు పూర్వకాలమునందు భక్తులకు దర్శనమిచ్చి, స్వరముతో మాట్లాడి వ్రాసి
చూపించెను.
స్వప్నములో కనబడి
మాటలాడెను.
-
6. దయ్యములను వెళ్ళగొట్టుట.
-
7. రోగులను బాగుచేయుట : ఔషదములులేకుండగనే యేసు నామమున ప్రార్థించి
రోగులను బాగుచేయుట.
-
8. క్రీస్తుయొక్క రాకడ మిక్కిలి సమీపములో ఉన్నదని గురుతులవల్ల
తెలియుచున్నదని
గుర్తించుట.
-
9. ప్రకటన గ్రంథము, పరమగీతము, ఎస్తేరుగంథములను ప్రభువు రాకడ సంబంధముగా
వివరించుట.
షరా:- ఏ
వరమైనను, మనుష్యులయొక్క అవసరమును బట్టియు, మనుష్యులయొక్క హృదయస్థితినిబట్టియు అనుగ్రహింప
బడును.