విమలాత్మ ప్రోక్షణము
Index
పరిశుద్ధాత్మ బాప్తిస్మ చరిత్ర సంగ్రహము
- 1. ప్రవచనములు:-
- 1) “నేను సర్వజనులమీద నా ఆత్మను కుమ్మరింతును” అని దేవుడు యోవేలు
అను దీర్ఘదర్శికి చెప్పెను.
- 2) యేసుక్రీస్తు ప్రభువు పరిశుద్ధాత్మ
బాప్తిస్మ మిచ్చునని,
తత్సమకాలికుడైన
యోహాను అను నొక మహర్షి ప్రకటించెను.
- 3) కొద్ది దినములలో మీరు పరిశుద్ధాత్మ
బాప్తిస్మము
పొందెదరు అని
క్రీస్తు ప్రభువు తన శిష్యులతో చెప్పెను.
-
2. ప్రవచనముల నెరవేర్పు:- నూట ఇరువదిమంది క్రీస్తు విశ్వాసులు
యెరూషలేము అను యూదుల పట్టణమున పదిరోజులు ప్రార్థన కూటము పెట్టుకొని ప్రార్ధించుచు
కనిపెట్టుచుండగా దైవాత్మ
వారిమీదికి వచ్చి దిగెను. ఈ కార్యమునకే పరిశుద్ధాత్మ బాప్తిస్మమని వేరు. దీనినే ఆత్మ
కుమ్మరింపు,
పరిశుద్ధాత్మాభిషేకము అనికూడ అందురు. అందుచేత వారందరు పరిశుద్ధాత్మ పరిపూర్ణులైరి. అప్పుడు
వారికి సర్వదేశముల
భాషలతో మాటలాడగల వరము లభించెను.
-
3. నెరవేర్పు రోజు:- ఇది జరిగినరోజు యూదులకు
పెంతెకొస్తు పండుగరోజు. అయితే అది క్రీస్తు జనమునకు పరిశుద్ధాత్మ పండుగైనది. పెంతెకొస్తు
పండుగకు సర్వలోక
ప్రాంతములనుండి వచ్చియుండి, తమకు తెలియకుండ ప్రతి జనాంగ ప్రతినిధులుగా నేర్పడినవారు ఈ
చిత్రమును చూచి చాలా
ఆశ్చర్యపడిరి. క్రీస్తు భక్తులు వారివారి భాషలలో క్రీస్తుమతము బోధించిరి. ఆ బోధ విన్నవారిలో
మూడు వేలమంది
క్రైస్తవ మతమున ప్రవేశించిరి. ఆవేళ క్రీస్తుమత సంఘ జన్మదినమాయెను. అదివరకున్న మతము యూదుల
మతము. క్రీస్తు
వచ్చునని నిరీక్షించినది యూదుల మతము. యూదులు నిరీక్షించిన క్రీస్తు వచ్చెనని బోధించునది
క్రైస్తవమతము.
అందుచేత యూదులందరు క్రైస్తవులై పోవలసినదెగాని కాలేదు. ఆ నూట ఇరువదిమంది పరిశుద్ధాత్మ
బాప్తిస్మమొంది
ఎన్నడును నేర్చుకొనని భాషలతో దైవమహత్కార్యములను వివరించుచుండగా కొందరు ఆనందింపక, వీరు
క్రొత్త మద్యముతో
నిండియున్నారని అపహాస్యము చేసిరి. అప్పుడు పేతురను నొక దైవజనుడు సంగతులు తేటగా విశదపరచెను.
పరిశుద్ధాత్మ
బాప్తిస్మమును పొందగోరువారు మొదట మారుమనస్సు పొందవలెననియు తరువాత నీళ్ళ బాప్తిస్మము
నొందవలెననియు అప్పుడు
పరిశుద్ధాత్మ దానము కలుగుననియు పేతురు చెప్పెను. ఇదివరకు చెప్పినట్లు అప్పుడే 3000 మంది
క్రైస్తవులైరి.
-
4.
నేటి నెరవేర్పు:- పరిశుద్ధాత్మ బాప్తిస్మము సర్వజనులకు అని యోవేలు ప్రవచించిన
మాటనుబట్టియు,
“ఈ
వాగ్ధానము మీకును, మీ పిల్లలకును, దూరస్తులందరికిని అనగా ప్రభువైన మన దేవుడు తనయొద్దకు
పిలిచిన వారికందరికిని చెందును” అని పేతురు చెప్పిన మాటనుబట్టియు చూడగా పరిశుద్ధాత్మ
బాప్తిస్మము అందరికిని
అని స్పష్టమగుచున్నది. పరిశుద్ధాత్మను అందరికి అనుగ్రహింతునని దేవుడిచ్చిన వాగ్ధానమెప్పుడు
ప్రజలలో పూర్తిగా
నెరవేరును? అందరును వాగ్ధానము తెలినికొని యేసు ప్రభుని నమ్మి, ఆత్మ స్నానమొందినప్పుడే.
దేవుడిచ్చు దానములలో
కొన్నిటి తట్టు చేయిచాపు నీవు పరిశుద్ధాత్మ బాప్తిస్మము తట్టు ఎందుకు చేయిచాపవో! ఇది
తక్కినవైన దానములకంటె
తక్కువ దానమా? నేటి సంఘవృత్తాంతములు చదివిన యెడల అనేకమంది మన కాలములోకూడ పరిశుద్ధాత్మ
బాప్తిస్మము
పొందుచున్నట్లు తెలియగలదు.