సమయోచిత వాణి



క.   “పరమాత్మ భావతత్వము
లెరిగింపను హృదయశుద్ధి నెరిగింపను సు
స్థిరతర శాంతి నొసంగను
పరిశుద్ధాత్మను నుతించి ప్రార్ధనజేతున్”

“నాయొద్దనుండుట-కై యాత్మపంపిన
తండ్రి! -ప్రసిద్దమౌ - స్తవమునీకు
నాతో వసింపను - దాతనుబంపిన
తండ్రీ! వినోదమౌ - స్తవమునీకు
నాలోన నీయాత్మ - వాలంగ బంపిన
తండ్రీ! విశుద్ధమౌ - స్తవమునీకు
నాయాదరణమున - కై యాత్మనంపిన
తండ్రీ! ప్రకాశమౌ- స్తవమునీకు"

సర్వసత్యమునకు నడ్పి - సంగతులను
స్పష్టపర్చి వివిధములౌ - వరములిచ్చి
ఆత్మవర్తనకై యాత్మ - పంపినావు
తండ్రీ! సర్వదా సర్వత్ర - స్తవమునీకు”

ప్రస్తుతకాలములో అనేకమంది క్రైస్తవులు త్రిత్వములోని తండ్రియైన దేవుడు సృష్టికర్తయనియు, ఆయన పరభూలోకములను సృజించెననియు; కుమారుడైన యేసుప్రభువు పాపులకొరకు సిలువ మరణ, పునరుత్థానము పొందవలెననియు, ఆయనే సర్వలోక రక్షకుడనియు కొద్దియో, గొప్పయో చెప్పగలరు గాని ఆదరణ కర్తయైన పరిశుద్ధాత్మ తండ్రిని గురించి అపోస్తలుల కార్యములు 19:2లో చెప్పబడినట్లు, "పరిశుద్ధాత్మ యున్నాడన్న సంగతియె తెలియదు" అని చెప్పినవారివలె ఉన్నారు గనుక ఆయనను గురించి పూర్తిగా చెప్పలేరు. ఇట్టి అంశమును మన ఆంధ్ర క్రైస్తవులకొరకు సంక్షిప్తముగ వ్రాయుట అగత్యమని మాకు తోచుటవల్ల ఈ గ్రంథము వ్రాయడమైనది.


రాజమండ్రి వాస్తవ్యులైన యం. దేవదాసు అయ్యగారి ఉపదేశముద్వారా పరిశుద్ధాత్మ బాప్తిస్మమును గురించి నేర్చుకొని ఇట్టి పుస్తకమును వ్రాయగలిగితిమి. అందుకు ప్రభువునకు స్తోత్రమును, మహిమయు కలుగునుగాక!


ఆయన బసలోనికి మేము ముప్పదిమందిమి తరచుగా వెళ్ళి కొన్ని సంగతులను నేర్చుకొనేవారము. అయితే 1935వ సంవత్సరములో ఒక ప్రశ్న వేసినాము. “పరిశుద్ధాత్మ బాప్తిస్మమును గురించి మాకు ఎన్నడును బోధించలేదు, ఎందుచేత" అని ప్రశ్నించగా? అందుకాయన ఇది మన మిషన్ సిద్దాంతములలో లేదు గనుక నేను బోధించలేదు అని జవాబిచ్చినారు. "బైబిలులో ఉన్నదా?" అని మేము అడిగినాము, ఆయన ఉన్నదని చెప్పినారు. అలాగైతే అది మాకు పూర్తిగా వివరింపవలనినదని పట్టుపట్టినాము. అప్పుడు ఆయన బోధించినారు. మేము ప్రత్యేకమైన ప్రార్థన కూటములు పెట్టుకొని వాడుకలో పెట్టుకొన్నాము. మాలో చాలమందికి కుమ్మరింపు కలిగినది. భాషలు వచ్చినవి. అర్ధములు, దర్శనములు కలిగినవి. అప్పుడు ఈ సిద్ధాంతములు నిజమని దృఢమైనదిగాని పిశాచి తన పనిని చేయలేదని మాత్రము మేము చెప్పలేము.


ఈ బోధ మేమనుకొనని సమయమందు తెలుసు కొనవలెనని వేసిన ప్రశ్న మూలముగా దానంతట అదే బయటకు వచ్చినది. కాబట్టి ఇది దైవికమని మేము గ్రహించుచున్నాము. ఈ బోధ స్థలాంతరములందు బోధించుచున్న కె. విజయరత్నంగారు అప్పుడప్పుడు నేను పోగుచేసిన పుస్తకములోని అంశములను వరుసగా పెట్టుటలోను, అచ్చువేయించుటలోను చేసిన సహాయమునకు కృతజ్ఞుడనైయున్నాను.

పరిశుద్ధాత్మ బాప్తిస్మమును గురించిన బోధ పెంతెకొస్తు మిషను బోధ గనుక అంగీకరించకూడదని కొందరనుచున్నారు. ఇట్లు అనే సందడిలో పడిపోయి 'ఇది బైబిలు బోధ' అనే మాట మరచిపోవుచున్నారు. పొందవలసిన మహోపకారము మీరు పొందకుండ మీ అనుమానపు మాటే మీకద్దు. క్రైస్త్రవసంఘము పెంతెకొస్తునాడు పరిశుద్ధాత్మ బాప్తిస్మము మూలముగ జన్మించెను గనుక పెంతెకొస్తు మిషను కాదుగాని "పెంతెకొస్తు సంఘము" అని చెప్పుట సత్యమునకు దూరముకాదు. ఆదికాల క్రైస్తవమత సంఘారంభమందున్న పరిశుద్ధాత్మ బాప్తిస్మమును ఈ కాల సంఘము :

షరా:- చదువరులందరు ఈ పన్నెండు సలహాలను గమనించుచు, ఈ పుస్తకము చదువవలెనని నా కోరికయైయున్నది.


జూన్ 1937
N.D. ఫిలిప్సన్
ధవళేశ్వరం.