విమలాత్మ ప్రోక్షణము: ప్రశ్నలు-జవాబులు(141-145)



141. ప్రశ్న :- మరి ఎట్లు ప్రార్ధన చేయమంటారు?

జవాబు:- పాపము లొప్పుకొన్న తర్వాత, పూర్ణ సమర్పణయైన పిమ్మట, దైవ సన్నిధానమున మిగుల నెమ్మదిగా కూర్చుండి, సంతోషముతో ప్రార్ధించుచు, విశ్వాసమును వృద్ధి చేసికొనుచు, ఓపికతో కనిపెట్టినయెడల ఆత్మస్నానము దొరకక మానదు. దైవాత్మ కొరకు వెళ్ళేవారు, దురాత్మ పుట్టించే తలంపులకు ఎందుకు సందియ్యవలెను? ఎంత సంతోషిస్తే అంత త్వరగా కుమ్మరింపువచ్చును, "ఇంకారాలేదు" అను తలంపుతో తలనొప్పి తెచ్చుకొనవద్దు. ప్రార్ధనలో పడి, గృహ కృత్యముల యెడల ఆశ్రద్ధ గలిగయుండవద్దు.

142. ప్రశ్న :- ప్రవర్తన బాగా ఉంటే చాలదా? ఈ ప్రార్ధనలన్నీ ఎందుకు?

జవాబు:- ఇవి లేకపోతే, సత్ప్ర వర్తన ఎట్లు రాగలదు?

143. ప్రశ్న :- "రోగులు బాగుపడుచున్నారు" అనే ఇట్టి మాటలు ప్రచురించడమువల్ల తమనుగురించి గొప్పగా చెప్పుకోవడముగాదా? ఇది సరియా?

జవాబు:- మిషనెరీలు, మిషను పనివారు తాము చేసే పనుల రిపోర్టును పుస్తకములలోను, పత్రికలలోను ప్రచురించడం లేదా? అపోస్తలుల కార్యముల గ్రంథము మిషను రిపోర్టు పుస్తకమని మీకెప్పుడును తోచలేదా?

144ప్రశ్న :- కొందరు గొప్ప ప్రేరేపణ కలిగి కలిగి చప్పున చల్లారి పోవుచున్నారు. ఎందుచేత?

జవాబు:-
145. ప్రశ్న :- ఆక్సుఫోర్డ్ గ్రూప్ (Oxford Group) అనగా బాహాటంగా పాపాలొప్పుకొనే మీటింగులు వాక్యానుసారముగా లేవని వాదించిన మిషనెరీలు వాటిని ఆపుచేయనేలేదు, మరి మీ మీటింగులు వారు ఎందుకు ఆపుచేస్తారు?

జవాబు:- అవి మిషనెరీలే ఆరంభించిరి. ఇవి మనవారు ఆరంభించిరి.