మా కోరిక
తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ అను త్రియేక దేవుడగు ఏ తండ్రి ఈ సంగతులు మాకు బయలుపరచెనో, ఆ
త్రియేకుడగు
తండ్రియే తక్కినవారికికూడ వీటిని బయలుపరచవలెననే పూర్ణ వాంఛ మేము గలిగినవారమై, ఆయనయొక్క
త్రిగుణాశీర్వాదములతో
దీనిని సిద్ధపరచి మీమీయొద్దకు సాగనంపుచున్నాము.
ప్రత్యక్షకరుడైన ఆ అనాది దేవుడు ఈ
పుస్తకమును విశ్వాసులకు
విప్పి చూపించుచు; వారి హృదయములనుకూడ ఈ సంగతులు అందుకొనేటట్లు విప్పుచు;
రక్షణను గురించి తెలియనివారికి ఇది రక్షణను, రక్షణపొందిన వారికిది పరిశుద్ధాత్మయొక్క
కుమ్మరింపు మూలముగా
రావలసిన అభివృద్ధి స్థితిని కనపరచుటలో గొప్ప సాధనముగా ఉపయోగపర్చును గాక!
మా మనసులలోని
ఉద్దేశము మంచిదైనను,
వ్రాతలో పొరబాటులుయున్నయెడల చదువరులు మన్నింతురుగాక! ఈ పుస్తకములోని సంగతులు ఆలోచించుండని
మిమ్మును
బ్రతిమాలుకొనుచున్నాము.