ముగింపు



ముగింపు

పరిశుద్ధాత్మ బాప్తిస్మము గురించి మాకు జ్ఞాపకము వచ్చినన్ని సంగతులు బాహాటముగా చెప్పనూ చెప్పినాము. ఇదివరకు పుస్తకములలోను, ఇంటిలోను వ్రాయనూ వ్రాసినాము. మా పూచీ అయిపోయింది. తర్వాత మీ ఇష్టము ఇంకను మిగిలియున్నది మీ పూచీయేగదా!

సత్య ప్రత్యక్షత కొరకైన ప్రార్ధన

దేవా! పరిశుద్ధాత్మ బాపిస్మమును గురించి ఒక్కొక్కరు ఒక్కొక్క విధముగా చెప్పుచున్నారు. సత్యమేదో అదే నా మనస్సునకు తెలియపరచి ఆ సత్యమును అవలంభించుటకు నాకు శక్తి దయచేయుమని నీ కుమారుని ద్వారా వేడుకొనుచున్నాను. ఆమేన్. ఈ బోధ విషయములో అనుమానముగలవారు పై ప్రార్థన చేసిన యెడల ప్రభువు వారికి పరిపూర్ణ సత్యము తప్పక బయలుపరచును.