ప్రార్ధన మెట్లు
ప్రార్ధన గదిలోనికి వెళ్ళి మోకరించి చేయవలసిన ప్రార్ధన పద్ధతి : మెట్లవారీగా దీనిలో పొందుపరచినాము.
- 1వ మెట్టు: మనోనిదానవు మెట్టు
చెడుగును, మంచిని మరువవలెను. సమస్తమును మరువవలెను. దేవుడు మనయెదుట ఉన్నాడని మాత్రము నమ్మవలెను. మన ధ్యానము పొడుగున ఆయన తలంపే ఉండవలెను. మనస్సును మరిదేనిమీదికిని వెళ్ళనీయరాదు. -
2వ మెట్టు: ఒవుదల మెట్టు
- 1) దేవుడిచ్చిన పది యాజ్ఞలు బైబిలులో ఉన్నవి. అవి తలంచుకొనినయెడల మనలో గల పాపములన్నియు జ్ఞాపకమువచ్చును. అవి దేవుని యెదుట ఒప్పుకొనవలెను. మనోవేదనను, కన్నీళ్ళును కలిగించుకొనవలెను. తలంపు, చూపు, వినికి, మాట, ప్రయత్నము, క్రియ వీటి మూలముగా జేసిన పాపములవలన దేవునిని దుఃఖ పెట్టితినిగదా అని దుఃఖీంపవలెను.
- 2) మనుష్యులకు విరోధముగా జేసిన పాపములు ఆ మనుష్యుల యెదుట ఒప్పుకొనవలెను, ఇవి దేవుని యెదుటను ఒప్పుకొనవలెను.
-
3వ మెట్టు: ప్రమాణవు మెట్టు
- 1) “నాకు తెలిసిన పాపములు ఇకమీదట చేయును. చేయకుండ ప్రయత్నించెదను” అని దేవుని ఎదుట ప్రమాణము చేయవలెను.
- 2) తీర్మానము : "దేవా! నీవు ఏది చెప్పితే అది చేయుదును నా ఇష్టప్రకారము కాదు నీ ఇష్టప్రకారమే చేయుదునని" దేవునికి మన తీర్మానము వినిపించవలెను.
- 3) వ్రతము : “ఎన్ని శోధనలు, ఎన్ని కష్టములు, ఎన్ని సందేహములు, ఎన్ని నిందలు, ఎన్ని ఆటంకములు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని నష్టములు, ఎన్ని క్రీస్తు విరోధ బోధలున్నను నిన్ను విడువను". ఇదే నా వ్రతము అని దేవుని యెదుట పలుకవలెను.
-
4వ మెట్టు: నమర్పణ మెట్టు
"తండ్రీ! నీవు నాకిచ్చిన వన్నియు నీకు సమర్పించుకొనుచున్నాను అనియు; అనగా నా శరీరము, నాఆత్మ, నాఆస్తి, నా సేవ, నా కష్టములు, నా జీవిత కాలము నీకు సమర్పించుకొనుచున్నాను అని దేవుని యెదుట చెప్పుకొనవలెను. -
5వ మెట్టు: విశ్వానవు మెట్టు
“దేవా! నా పాపములన్నియు క్షమించివేసినావు అనియు, నా ప్రమాణము, తీర్మానము, వ్రతము, సమస్తము అంగీకరించినావనియు” పూర్తిగా నమ్ముచున్నాను అని దేవుని యెదుట చెప్పుకొనవలెను. -
6వ మెట్టు: స్తుతి మెట్టు
"నా పాపములన్నియు క్షమించి వేసినావనియు, నా ప్రమాణము, తీర్మానము, వ్రతము, సమస్తము అంగీకరించినావనియు ఆనందించి, నిన్ను స్తుతించుచున్నాను" అని దేవుని యెదుట చెప్పుకొనవలెను. -
7వ మెట్టు: అంశ ప్రార్ధన మెట్టు
ఈ మెట్టుమీద నీ ఇష్టము వచ్చిన సంగతిని గురించి ప్రార్ధింపవచ్చును. ప్రార్ధనవాలు, బైబిలులోని అనుభవము, వాక్యబోధనాశక్తి, పాపమును గెల్చుబలము, ఆరోగ్యము, విద్య, ధనము, పరిశుద్ధాత్మ బాప్తిస్మము ఈ మొదలైన వాటిలో నీకు అవసరమైనదేదైనా ఉదహరించి అది దయచేయుమని ప్రార్ధింపవచ్చును. -
8వ మెట్టు: విశ్వాసపు మెట్టు
ఇదివరకు వచ్చిన విశ్వాసమెట్టు మీద క్షమాపణ దొరికినదని నమ్మినావు. ఈ విశ్వాసపు మెట్టుమీద ఏడవ మెట్టుమీద అడిగినది దొరికినదని నమ్మవలెను. -
9వ మెట్టు:
స్తుతి మెట్టు
ఇదివరకు వచ్చిన స్తుతి మెట్టుమీద క్షమాపణ దొరికినదని స్తుతించినావు గనుక ఈ స్తుతి మెట్టుమీద ఏడవ మెట్టుమీద అడిగినది దొరికినదని స్తుతించవలెను. -
10వ మెట్టు: కనిపెట్టు మెట్టు
ఈ మెట్టుమీద పై మెట్లు మీద ఉన్న ప్రార్ధనలు కట్టిపెట్టి ఊరకనెయుండుము, ప్రభువు నీ ప్రార్ధనలకు జవాబుగా ఏమి తలంపులు పుట్టించునో, వాటిని అందుకొనుటకొరకు కనిపెట్టవలెను.
షరా:- మీ ఇష్టము వచ్చిన సమయమందు, మీ ఇష్టము వచ్చినంతసేపు ఈ మెట్లమీద ఉండవచ్చును. తెలుగు క్రైస్తవ కీర్తనలలో, దైవజనులు బహుగా ప్రార్థించుటను గూర్చి వ్రాసిన 54వ కీర్తనను, ధ్యాన పూర్వకముగా పాడుకొనుము. అపుడు ఆత్మ తండ్రి కొరకు ఏలాగు వేడుకొనవలెనో, నీకు బోధపడును.