పరిశుద్ధాత్మ బిరుదులు



  1. ఆయన శాశ్వత దేవుడు (హెబ్రీ. 9:14)
  2. ఆయన సర్వవ్యాపియైన దేవుడు (కీర్తన. 139:7-13)
  3. ఆయన సర్వజ్ఞానియెన దేవుడు (కొరింథి. 2:10)
  4. ఆయన సర్వశక్తిగల దేవుడు (లూకా. 1:35; రోమా. 15:19)
  5. ఆయన మహిమాస్వరూపియైన ఆత్మ (1పేతురు 4:14)
  6. ఆయన నూతన జన్మకర్త (యోహాను 3:5-6; 1యోహాను 5:4
  7. ఆయన ఆవేశము కలిగించు దేవుడు (2 తిమోతి. 3:16; 2పేతురు. 2:21).
  8. ఆయన జ్ఞానమునకు మూలకర్త (యెషయా 11:2; యోహాను 14:26; 1కొరింధి. 12:8 యోహాను 16:13)
  9. ఆయన అద్భుతమైన శక్తికి మూలకర్త (మత్తయి. 12:28; లూకా. 11:20; కార్య. 19:11) రోమా. 15:19)
  10. ఆయన పనివారికి నియమించు దేవుడు (అపో॥ కార్య. 13:2-4 మత్తయి 9:38 కార్య. 20:28).
  11. ఆయన నువార్త ప్రకటన న్ధలముచూవు దేవుడు (కార్య. 16:6 7:10)
  12. ఆయన పరిశుద్దులలో నివసించు దేవుడు (యోహాను 14:17; 1కొరింథి. 3:16; 6:19; 14:25)
  13. ఆయన సంఘమునకు ఆదరణకర్తయైన దేవుడు (కార్య. 9:31; 2కొరింధి. 1:3)
  14. ఆయన సంఘమును పవిత్రపరచు దేవుడు (యెహెజ్కేలు 37:28 రోమా. 15:16)
  15. ఆయన సాక్ష్యమిచ్చు దేవుడు (హెబ్రీ. 10:5, 1యోహాను 5:9)
  16. ఆయన ఒప్పించు దేవుడు (యోహాను 16:8-11)
  17. ఆయన అదరణకర్తయైన దేవుడు (యోహాను 15:26)
  18. ఆయన సత్యస్వరూపియైన ఆత్మ (యోహాను 15:26)
  19. ఆయన తండ్రియొద్దనుండి బైలుదేరినవాడు (యోహాను 15:26)
  20. ఆయన క్రీస్తువల్ల అనుగ్రహింపబడినవాడు (యోహాను 15:26)
  21. ఆయన తండ్రివల్ల అనుగ్రహింపబడినవాడు (యోహాను 14:16)
  22. ఆయన క్రీస్తు విజ్ఞాపనవలన వచ్చినవాడు (యోహాను 14:16)
  23. ఆయన క్రీస్తు నామమున వచ్చినవాడు (యోహాను 14:16)
  24. ఆయన క్రీస్తువలన తండ్రియొద్దనుండి పంపబడినవాడు (యోహాను 15:26, 16:17)
  25. ఆయన సదా భక్తులలో నివసించువాడు (యోవాను 14:16)
  26. ఆయన పరిశుద్ధులకు ఎరుకైనవాడు (యోహాను 14:17)
  27. ఆయన పరిశుద్ధులకు బోధించువాడు (యోహాను 14:26)
  28. ఆయన క్రీస్తునుగూర్చి సాక్ష్యమిచ్చువాడు (యోహాను 15:26)
  29. ఆయన సంఘక్షేమకర్త (కార్య. 9:31)
  30. ఆయన దేవుని ప్రేమననుగ్రహించువాడు (రోమా. 5:3-5)
  31. ఆయన పరిశుద్ధులకు సంతోషము కలిగించువాడు (రోమా. 14:17 గలతీ. 5:22 1థెస్స. 1:6).
  32. ఆయన నిరీక్షణ కలిగించువాడు (రోమా 15:13; గలతీ. 5:5).
  33. ఆయన సృష్టిచేయువాడు (యోబు 33:4)
  34. ఆయన ప్రవక్తలద్వారా మాటలాడువాడు (కార్య. 1:16; 1పేతురు 11:11-12; 2పేతురు 1:21)