విమలాత్మ ప్రోక్షణము
Index
ఆత్మ స్నానాభిమానులకు మందలింపు
- I.
- 1) “కాబట్టి నేను మీతో చెప్పునదేమనగా,
మనుష్యులు చేయు ప్రతి పాపమును, దూషణయు వారికి క్షమింపబడును గాని ఆత్మ
విషయమైన దూషణకు
పాపక్షమాపణ లేదు”
(మత్తయి. 12:31-32).
- 2) “సమస్త పాపములును, మనుష్యులుచేయు దూషణలన్నియు
వారికి
క్షమింపబడునుగాని, పరిశుద్ధాత్మ
విషయము దూషణ చేయువాడెప్పుడును క్షమాపణ పొందక, నిత్య పాపము చేసినవాడై
యుండునని మీతో
నిశ్చయముగా
చెప్పుచున్నాను (మార్కు 3:28,29).
- 3) “మనుప్యకుమారునిమీద వ్యతిరేకముగా ఒక
మాట
పలుకు వానికి పాపక్షమాపణ కలుగునుగాని పరిశుద్ధాత్మను దూషించువానికి
క్షమాపణలేదు” (లూకా.
12:10). ఇవి
రక్షకుని వాక్యములు.
-
II. “ఒకసారి వెలిగింపబడి, పరలోకసంబంధమైన వరమును రుచిచూచి పరిశుద్ధాత్మలో పాలివారై
దేవుని దివ్యవాక్యమును, రాబోవు యుగసంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత
తప్పిపోయినవారు తమ విషయములో
దేవుని కుమారుని మరల సిలువవేయుచు బాహాటముగా అవమానపరచుచున్నారు. గనుక మారుమనస్సు పొందునట్లు
అట్టివారిని మరల
నూతనపరచుట అసాధ్యము. ఎట్లనగా, భూమి తనమీద తరచుగా కురియు వర్షమును త్రాగి ఎవరికొరకు
వ్యవసాయము చేయబడునో
వారికనుకూలమైన పైరులను ఫలించుచు దేవుని ఆశీర్వచనము పొందును. అయితే ముండ్ల తుప్పలును గచ్చ
తీగెలును దానిమీద
పెరిగినయెడల అది పనికిరాదని విసర్జింపబడి శాపము పొందతగిన దగును. తుదకది కాల్చివేయబడును”
(హెబ్రీ. 6:4-9) ఇవి
పౌలు మాటలు.
-
III. "వారు నీతిమార్గమును అనుభవపూర్వకముగా తెలిసికొని తమకప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్జనుండి
తొలగిపోవుట కంటె ఆ మార్గము అనుభవపూర్వకముగా తెలియకయుండుటయే వారికి మేలు. కుక్క తన వాంతికి
తిరిగినట్టును,
కడుగబడిన పంది బురదలో దొర్లుటకు మళ్ళినట్టును అను నిజమైన సామితె చొప్పున వీరికి
సంభవించెను".
(2పేతురు.
2:21, 22).