విమలాత్మ ప్రోక్షణము: ప్రశ్నలు-జవాబులు(46-50)



46. ప్రశ్న :- ఆ భాషల అర్ధము ఏమి?

జవాబు:- 1) అర్ధము చెప్పవలెనని వాక్యములోనే ఉన్నది. “భాషలు మాటలాడువాడు అర్ధము చెప్పు శక్తి కలుగుటకై ప్రార్ధన చేయవలెను” (1కొరింథి. 14:13).
2) సహోదరులారా! ఇప్పుడు మీలో ఏమి జరుగుచున్నది? మీరుకూడి వచ్చినప్పుడు ఒకడు ఒక కీర్తన పాడవలెనని యున్నాడు. మరియొకడు బోధింపవలెనని యున్నాడు. మరియొకడు తనకు బయలు పరచబడినది ప్రకటన చేయవలెనని యున్నాడు. మరియొకడు అర్ధము చెప్పవలెననియున్నాడు. మరియొకడు భాషతో మాటలాడవలెనని యున్నాడు సరే; సమస్తమును క్షేమాభివృద్ధి కలుగుటకై జరుగనియ్యుడి. భాషతో ఎవడైనను మాటలాడితే ఇద్దరు అవసరమైనయెడల ముగ్గురికి మించకుండ వంతుల చొప్పున మాటలాడవలెను. ఒకడు అర్ధము చెప్పవలెను. అర్ధము చెప్పువాడు లేనియెడల అతడు సంఘములో మౌనముగా నుండవలెనుగాని తనతోను, దేవునితోను మాటలాడుకొనవచ్చును (1కొరింథి. 14:26-28).

47. ప్రశ్న :- భాషలవల్ల ప్రయోజనమేమి?

జవాబు:- “నేను భాషతో ప్రార్ధన చేసినయెడల నా ఆత్మ ప్రార్ధన చేయునుగాని మనస్సు ఫలవంతముగా నుండదు. కాబట్టి ఆత్మతో ప్రార్ధన చేతును, మనస్సుతోను ప్రార్ధన చేతును. ఆత్మతో పాడుదును, మనస్సుతోను పాడుదును. లేనియెడల నీవు ఆత్మతో స్తోత్రము చేసినప్పుడు ఉపదేశము పొందనివాడు నీవు చెప్పుదానిని గ్రహింపలేడు గనుక నీవు కృతజ్ఞతాస్తుతులు చెల్లించునప్పుడు ఆమేన్ అని వాడేలాగు పలుకును? నీవైతే బాగుగానే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నావు గాని ఎదుటివాడు క్షేమాభివృద్ధి పొందడు. నేను మీయందరికంటె ఎక్కువగా భాషలతో మాటలాడు చున్నాను (1కొరింథి. 14:14-18.

48. ప్రశ్న :- ఈ వాక్యమువల్ల ఏమి తేలుచున్నది? భాషవల్ల ఏమి ప్రయోజనము?

జవాబు:- 1) భాషతో ప్రార్ధన జరుగును. ఇది ఆత్మ చేయు ప్రార్ధన ఇదియొక ప్రయోజనము. 2) ఆత్మస్తోత్రము చేయును. ఇదొక ప్రయోజనము. 3) భాషతో మాటలాడువాడు దేవునితో మాటలాడుచున్నాడు. ఇదొక ప్రయోజనము (1కొరింథి. 14:2).

49. ప్రశ్న :- అందరు ఒక్కసారి భాషలతో మాటలాడితే సంఘములో అల్లరిగా ఉండదా?

జవాబు:- అల్లరిలేకుండ మాటలాడగల ఏర్పాటు చేసికొనవలెను.
50. ప్రశ్న:- భాష అర్ధము తెలియనిదే ఏల మాటలాడవలెను?

జవాబు:-