విమలాత్మ ప్రోక్షణము: ప్రశ్నలు-జవాబులు(116-120)
116. ప్రశ్న :- ప్రభువు పరలోకమునకు వెళ్ళిన తరువాత శిష్యులు సువార్త పనిమీద ఎక్కడకును వెళ్ళలేదా?
జవాబు:- వెళ్ళలేదు. పరిశుద్ధాత్మ బాప్తిస్మము పొందువరకు వారు యెరూషలేములోనే యుండవలెనని ప్రభువు చెప్పెను. అటు తరువాత సువార్తపని (అపో॥కార్య॥ 1:8) నిమిత్తము వారు బయలుదేరిరి.
117ప్రశ్న :- నీళ్ళ బాప్తిస్మము పొందకమునుపు పరిశుద్ధాత్మ బాప్తిస్మము పొందగలరా?
జవాబు:- పొందగలరని తెలుసుకొనుటకు బైబిలులో ఒక కథ కలదు. కొర్నీలి ఇంటిలో అన్యులు కలరు. పేతురు వారికి వాక్యము బోధించెను. అప్పుడు వారిలో విశ్వాసము కలిగెను. వెంటనే వారు పరిశుద్ధాత్మ బాప్తిస్మము పొందిరి (అపో॥కార్య॥ 10:44). తర్వాత వారు నీళ్ళ బాప్తిస్మముకూడ పొందిరి (అపో॥కార్య॥ 10:47-48).
118. ప్రశ్న :- పరిశుద్ధాత్మ బాప్తిస్మము పొందని బోధకులిచ్చిన బాప్తిస్మములు, బాప్తిస్మములు కావనియు, సంస్కార భోజనాలు సంస్కార భోజనాలు కావనియు కొందరనుచున్నారు. దీనికేమి జవాబు?
జవాబు:- మేమనుట లేదు. ఒక శాఖవారంటున్నారు. ఆత్మస్నానము మాకు కాదని పొందనివారును; ఆత్మస్నాన న్ధాపన లేక, పొందియుండని పాతనిబంధన జనమును ఒకే తరగతిలోనికి వస్తారు. పొందని మనవారు ప్రభువు పని బాగా చేయడము లేదా? గొప్ప గొప్ప పనులు చేస్తున్నారుకదా! ఆత్మీయ జీవనాభివృద్ధి పొందుటలో క్రైస్తవులకు ఆదివార ఆరాధనా సమయములందు ఎంతోమేలైన ప్రసంగాలు చేస్తున్నారు. ప్రార్థనలుచేసి తమ కార్యములందు సఫలమగుచున్నారు. ఇంకా అనేకమైన ఉపకార కార్యములు చేస్తున్నారు. పరిశుద్ధాత్మ బాప్తిస్మము పొందకనే ఇట్టికార్యములు చేయగలుగుచుంటే పరిశుద్ధాత్మ బాప్తిస్మము పొందితే మరింత ఎక్కువ చేయగలరు గదా?
119. ప్రశ్న :- ఈ పుస్తకము ప్రచురించుటలో మీ ఉద్దేశమేమి?
జవాబు:- మిషనెరీలు, పాదుర్లు, వారి తరుపున యున్నవారు; పత్రికలు ద్వారాను, ప్రసంగ పీఠములమీద చేయు ప్రసంగముల ద్వారాను, మా కూటములను బహిరంగముగా సబబు లేకుండ దూషించుచున్నారు. అపవిత్రమైన మాటలతో ప్రసంగ పీఠములలో అవమానపరచుచున్నారు. వెలివేస్తామనియు, పనులలో నుండి తీసివేస్తామనియు బెదిరించుచున్నారు. ఈ ప్రకారముగా వారివల్ల మాకు హింసలు కలుగుచున్నవి. పూర్వము రోమను కధోలిక్కులవల్ల లూథరన్లకు హతసాక్ష్యము కలిగినది. నేడు లూథరనులవల్ల మాకు హింసలు కలుగుచున్నవి. వీటికైన ఒప్పుకొందముగాని ఈ సత్యమును ప్రచురింపకమానము. ఇది మా వ్రతము. మేము పాపులము, ఉన్నతవిద్య లేనివారము, వృద్ధులకున్న అనుభవము లేనివారము; ధనమైనను, ఆస్తియైనను లేనివారమనిచెప్పి ఈ పనిచేయుట మానక, చేసేటందుకు తెగించుచున్నాము. ఎందుకంటే ఈ పని జరగడము మమ్మును బట్టి కాదుగాని మమ్మును పిలిచిన ప్రభువునుబట్టి, ఆయన బలము చూచుకొని పని సాగిస్తున్నాము. మమ్మును ఎదిరించుచు, మామీద మోటు ప్రశ్నలు వేసేవారికి సమాధానము చెప్పుటకై ఈ పుస్తకమును వ్రాయుచున్నాము. మేము ప్రార్ధనా పూర్వకముగా ప్రభువును అడుగకుండ, ఏ చిన్న పనియు చెయుటలేదు. “నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి, హింసించి, మీమీద అబద్ధముగా చెడ్డ మాటలెల్ల పలుకునప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించుడి. పరలోకమందు మీ ఫలము అధికమగును. ఈలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి.” (మత్తయి. 5:11-12). ఇట్టి వాక్యములు జ్ఞాపకము తెచ్చుకొని బలము తెచ్చుకొనుచున్నాము. మేము చేసే పనికి ఫలితము కలిగినను, కలుగక పోయినను; అనేకమంది ఎదిరించినను, అనేక అడ్డములు వచ్చినను, హాని కలిగినను, నిందల పాలైనను, ఈ బోధనుగూర్చి మాలో కలిగిన మా అభిప్రాయమును మేము కొట్టివేసికొనము. బోధించకుండ ఉండము. ఎందుకంటే ఇది బైబిలులో ఉన్నది, ఉపయోగకరమైనది, సరియైనది.
120. ప్రశ్న :- సంఘ చరిత్రలో అప్పుడప్పుడు కొందరులేచి, కొన్ని బోధలు ప్రవేశపెట్టి, అనేకమందిని శిష్యులుగా చేసికొని, ఒక సంఘముగా ఏర్పడినారుగాని కొన్నాళ్ళకు అవి అంతరించిపోయినవి. మీ కూటములుకూడా అట్టివేగదా!
జవాబు:- బైబిలులో ఉన్న బోధకు మేము వ్యతిరేకముగా ఏమియు బోధించుటలేదు. గనుక “ఇది అంతరించిపోవునను భయము మాకులేదు”. మేము దురుద్దేశముతోగాని, ఎదిరించే మనస్సుతోగాని, కీర్తికోరే మనస్సుతోగాని, స్వాతిశయముతోగాని, ఎక్కువ తెలిసినవారమనిగాని, ఒకమిషను స్థాపించవలయునని గాని, ఈ బోధలు ప్రవేశపెట్టలేదు. నాలుగువందల ఏండ్ల క్రిందట డాక్టర్ మార్టిన్ లూథరు ప్రవేశపెట్టిన బోధలు అంతరించి పోయినవా? మేము బోధించే ఈ బోధలు పరీక్షింపవలయునని ఏ.ఇ.యల్.సి. ప్రతినిధులైన మాలోకొందరు ఏ.ఇ.యల్.సి. ప్రసిడెంటుగారైన డా! ఇ. న్యూఢార్ఫర్ గారికి గత సంవత్సరము అక్టోబర్లో రాజమండ్రిలో జరిగిన నభకు ఒక అర్జీ పెట్టకొన్నప్పటికిని, 1937 మే నెల వరకు ఏ విధమైన ఎండార్స్మెంటు ఇచ్చియుండలేదు. ఈ కారణముచేత ఈ పుస్తకమును ప్రచురించుచున్నాము. మరియు ఇన్విస్టిగేషను కమిటి వారికి అనగా పరిశీలన చేయువారికిది సహాయముగా నుండును.
న్యూఢార్ఫర్ దొరగారికి వ్రాసిన అర్జీ ఇదే
( A copy of the Letter Submitted)
To
The President of the A.E.L.C.
Convention,
RAJAHMUNDRY.
Sir,
We hear that in many places in our Lutheran
Field, on the Rajahmundry as well as Guntur
syrods, the Baptism with the Holy Spirit and speaking in tongues is being preached about. In the booklet called Sadhvishayamulu
(సద్విషయములు)
published by Mr. K. Vijayaratnam, Lutheran Mission,
Lakshmi varampet, Rajahmundry, it is said that
some hundreds of people have received the Baptism with the Holy Spirit.
In our opinion, it is high time that the position taken by these people should be frankly discussed in as-much as Mr. K. Vijayaratnam
is prepared to answer, on the basis of the Scriptures,
any question concerning his teaching, this problem may be soon brought before the Ministerium.
We are sorry to hear that the proposed ministerium
of this evening which had the gift of tongues as
one of its topics,, has been postponed to Thursday.
We advice that this whole question be taken
up by the Ministerium as early as possible and
brought to the generalbody for an open discussion
before it disperses.
Rajahmundry
19-10-36. Yours obediently,
1. N.E. Manoharam
2. N.D. Philipson
3. P. John Simon