విమలాత్మ ప్రోక్షణము: ప్రశ్నలు-జవాబులు(16-20)
16. ప్రశ్న :- ఇది జరిగినప్పుడు అక్కడ ఇతరులెవరైనా ఉన్నారా?
జవాబు:-
- 1) అనేకమందియున్నారు. “ఆ కాలమున ఆకాశము క్రిందనుండు ప్రతి జనములోనుండి వచ్చిన భక్తిగల యూదులు యెరూషలేములో కాపురముండిరి (అపో॥కార్య. 2:5).
- 2) ఈ శబ్దము కలుగగా జనులు గుంపులుగా కూడివచ్చిరి.
17. ప్రశ్న :- ఈ ప్రజలెవరు?
జవాబు:- లోకములో ఉన్న ప్రతి జనమునుండి ఈ పండుగకు వచ్చిన భక్తిగల యూదులు (అపో॥కార్య 2:5).
18. ప్రశ్న :- ఈ ప్రజలు ఈ బాప్తిస్మమును చూచి ఏమనుకొన్నారు?
జవాబు:- పరిశుద్ధాత్మ బాప్తిస్మము పొందినవారు సర్వభాషలతో మాటలాడుటచూచి
- 1) కలవరపడిరి,
- 2) విభ్రాంతి నొందిరి,
- 3) ఆశ్చర్యపడిరి. “ఈ శబ్దము కలుగగా జనులు గుంపులుగా కూడివచ్చి ప్రతి మనుష్యుడు తన తన స్వభాషతో వారు మాటలాడుట విని కలవరపడిరి. అంతట అందరు విభ్రాంతి నొంది ఆశ్చర్యపడిరి” (అపో॥కార్య॥ 2:6,7)
19. ప్రశ్న:- చూడవచ్చిన ఆ ప్రజలు ఏమని మాటలాడుకొనిరి?
జవాబు:-
- 1) “ఇదిగో మాటలాడుచున్న వీరందరు గలిలయులుకారా? మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశపు భాషతో వీరు మాటలాడుట మనము వినుచున్నామే; ఇదేమి?” అని మాటలాడుకొన్నారు (అపో॥కార్య2:7,8).
- 2) ఇది వనవాస కాలమందు ఇశ్రాయేలీయులు క్రొత్తగా ఆకాశమునుండి పడిన మన్నాను చూచి "ఇదేమి" అని పల్కినట్లున్నది (నిర్గమ. 16:15).
20. ప్రశ్న :- ఆ పండుగలో ఈ వింత చూచినటువంటి ప్రజలెవరు?
జవాబు:-
- 1) పార్తీయులు,
- 2) మాదీయులు,
- 3) ఎలామీయులు,
- 4) మెసపొతమియవారు,
- 5) యూదయవారు,
- 6) కప్పదొకియవారు,
- 7) పొంతువారు,
- 8) ఆసియవారు,
- 9) ప్రుగియవారు,
- 10) పంపులియవారు,
- 11) ఐగుప్తువారు,
- 12) లిబియా ప్రాంతములవారు,
- 13) రోమానుండి వచ్చినవారు,
- 14) యూదమత ప్రవిష్టులు,
- 15) క్రేతీయులు,
- 16) అరబ్బీయులు, (అపో॥కార్య॥ 29-11).