పరిశుద్ధాత్మ బాప్తిస్మమును గూర్చిన ప్రవచనములు
- 1. "పైనుండి మనమీద ఆత్మ కుమ్మరింపబడువరకు నగరి విడువబడును. జన సమూహముగల పట్టణము విడువబడును. కొండయు కాపరుల గోపురమును ఎల్లకాలము గుహలుగా ఉండును. అవి అడవి గాడిదలకు ఇష్టమైన చోట్లుగాను, మందలుమేయు భూమిగాను ఉండును. పైనుండి ఆత్మ మనమీద కుమ్మరింపబడగా అరణ్యము ఫలభరితమైన భూమిగాను, ఫలభరితమైన భూమి వృక్ష వనముగాను ఎంచబడును. అప్పుడు న్యాయము అరణ్యములో నివసించును. ఫలభరితమైన భూమిలో నీతి దిగును. నీతి సమాధానము కలుగజేయును. నీతివలన నిత్యమును నిమ్మళము, నిబ్బరము కలుగును. అప్పుడు నా జనులు విశ్రమ స్థలమునందును, ఆశ్రయ స్థానములయందును, సుఖకరమైన నివాసములయందును నివసించెదరు". యెషయా. 32:14-17
- 2. "అప్పుడు ఇశ్రాయేలీయులమీద నేను నా ఆత్మను కుమ్మరించెదను గనుక నేనికను వారికి పరాజ్ముఖుడనైయుండను. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు" యెహెజ్కేలు 39:29.
- 3. తర్వాత నేను సర్వజనులమీద నా ఆత్మను కుమ్మరింతును, మీ కుమారులును మీ కుమార్తెలును ప్రవచనములు చెప్పుదురు. మీ ముసలివారు కలలుకందురు. మీ యవ్వనస్థులు దర్శనములు చూతురు. ఆ దినములలో నేను పనివారిమీదను పనికత్తెలమీదను నా ఆత్మను కుమ్మరింతును. యోవేలు. 2:28,29.
- 4. "దావీదు సంతతివారిమీదను యెరూషలేము నివాసులమీదను కరుణనొందించు ఆత్మను, విజ్ఞాపనచేయు ఆత్మను నేను కుమ్మరింపగా వారు తాము పొడిచిన నామీద దృష్టియుంచి ఒకడు తన ఏక కుమారుని విషయమై దుఃఖించినట్లు, తన జ్యేష్టపుత్రుని విషయమై యొకడు ప్రలాపించునట్లు, అతని విషయమై దుఃఖించుచు ప్రలాపింతురు". జెకర్యా. 12:10.
-
5.
- 1) "మారుమనస్సు నిమిత్తము నేను నీళ్ళలో మీకు బాప్తిస్మ మిచ్చుచున్నాను. అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటె శక్తిమంతుడు. ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడనుకాను. ఆయన పరిశుద్ధాత్మలోను, అగ్నితోను మీకు బాప్తిస్మమిచ్చును”. మత్తయి. 3:11.
- 2) “నేను నీళ్ళలో మీకు బాప్తిస్మమిచ్చితిని గాని ఆయన పరిశుద్ధాత్మలో మీకు బాప్తిస్మమిచ్చును”. మార్కు 1:8.
- 3) “నేను నీళ్ళలో మీకు బాప్తిస్మమిచ్చుచున్నాను. అయితే నాకంటె శక్తిమంతుడొకడు వచ్చుచున్నాడు. ఆయన చెప్పుల వారును విప్పుటకు నేను పాత్రుడనుకాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిస్మమిచ్చును”. (లూకా. 3:16 ఇవి స్నానికుడైన యోహాను మాటలు).
- 6. “మీరు యెరూషలేమునుండి వెళ్ళక నా వలన వినిన తండ్రియొక్క వాగ్ధానముకొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్ళతో బాప్తిస్మమిచ్చెనుగాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందెదరు”. (అపో॥కార్య. 1:4-5 ఇవి ప్రభువు మాటలు).
బైబిలులో పెంతెకొస్తు పండుగనుగూర్చి బహు విపులముగా వ్రాయబడిన
అపోస్తలుల కార్యముల
గ్రంథములోని 2వ అధ్యాయమంతయు ఇక్కడ ధ్యానపూర్వకముగా చదువవలెను.
బైబిలులోని 1కొరింథి 14వ అధ్యాయము తప్పక చదువవలెను.
బైబిలులోని 1కొరింథి 14వ అధ్యాయము తప్పక చదువవలెను.
అటు పిమ్మట అపోస్తలుడైన పౌలు ఆత్మవరములను గూర్చి, ఆత్మ వరములను వాడుకొను విధానమును గూర్చి, ఆత్మ వరముల విషయములో తీసికొనవలసిన జాగ్రత్తలను గూర్చి పాటించవలసిన క్రమములనుగూర్చి కలిగి ఉండవలసిన విశేషమైన మౌనమునుగూర్చి వివరముగా వ్రాసిన 1కొరింథి. 14వ అధ్యా॥ ఇక్కడ తప్పక చదువవలెను.