విమలాత్మ ప్రోక్షణము: ప్రశ్నలు-జవాబులు(1-5)



1. ప్రశ్న :- పరిశుద్ధాత్మ బాప్తిస్మము అనుమాట బైబిలులోని ఏ వాక్యములలోనుండి తీసినమాట?

జవాబు : మత్త. 3:11 మార్కు 1:8 లూకా. 3:16 అను వాక్యములలోనుండి తీసినమాట.
  1. “మారుమనస్సు నిమిత్తము నేను నీళ్ళలో మీకు బాప్తిస్మ మిచ్చుచున్నాను. అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటె శక్తిమంతుడు. ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడనుకాను. ఆయన పరిశుద్ధాత్మలోను, అగ్నితోను మీకు బాప్తిస్మమిచ్చును.” (మత్తయి. 3:11).
  2. “నేను నీళ్ళలో మీకు బాప్తిస్మమిచ్చితిని గాని ఆయన పరిశుద్ధాత్మలో మీకు బాప్తిస్మమిచ్చును” (మార్కు 1:8).
  3. “నేను నీళ్ళలో మీకు బాప్తిస్మ మిచ్చుచున్నాను అయితే నాకంటె శక్తిమంతుడు ఒకడు వచ్చుచున్నాడు. ఆయన చెప్పులవారును విప్పుటకు నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిస్మ మిచ్చును” (లూకా. 3:16). ఇవి యోహాను మాటలు.

2. ప్రశ్న :- పరిశుద్ధాత్మ బాప్తిస్మము అనుమాటకు బైబిలులో ఇతర నామములు గలవా?

జవాబు : కలవు.
  1. పరిశుద్ధాత్మాభిషేకము “దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను, శక్తితోను అభిషేకించెనను నదియే (కార్య. 10:38).
  2. పరిశుద్ధాత్మ కుమ్మరింపు:
    • మొదటి వచనము. ఆలకించుడి నా ఆత్మను మీమీద కుమ్మరింతును” (సామెతలు. 1:28)
    • రెండవ వచనము. “నీ సంతతిమీద నా ఆత్మను కుమ్మరించెదను” (యెషయా. 44:3).
    • మూడవ వచనము: “పైనుండి ఆత్మ మనమీద కుమ్మరింపబడగా... ఫలభరితమైన భూమి వృక్షవనముగా ఉండును. (యెషయా. 32:13-15).
    • నాల్గవ వచనము: “అప్పుడు ఇశ్రాయేలీయులమీద నేను నా ఆత్మను కుమ్మరించెదను గనుక నేనికను పరాజ్ముఖుడనై యుండను.” (యెహెజ్కేలు 39:29).
    • ఐదవ వచనము: “నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరించెదను. మీ కుమారులును, మీ కుమార్తెలును ప్రవచనములు చెప్పుదురు. మీ ముసలివారు కలలుకందురు. మీ యౌవనస్థులు దర్శనములు చూతురు. ఆ దినములలో నేను పనివారిమీదను, పనికత్తెలమీదను నా ఆత్మను కుమ్మరింతును.” (యోవేలు. 2:28,29)
    • ఆరవ వచనము: “దావీదు సంతతి వారిమీదను, యెరూషలేము నివాసుల మీదను, కరుణనొందించు ఆత్మను, విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా, వారు తాము పొడిచిన నామీద దృష్టియుంచి, యొకడు తన ఏక కుమారుని విషయమై దుఃఖించునట్లు, తన జ్యేష్టపుత్రుని విషయమై యొకడు ప్రలాపించునట్లు, అతని విషయమై దుఃఖించుచు ప్రలాపింతురు.” (జెకర్యా. 12:10)
    • ఏడవ వచనము: “అంత్య దినములయందు నేను మనుష్యులందరిమీద నా ఆత్మను కుమ్మరించెదను. మీ కుమారులును, మీ కుమార్తెలును ప్రవచించెదరు. మీ యౌవనులకు దర్శనములు కలుగును. మీ వృద్ధులు కలలు కందురు. ఆ దినములలో నా దాసులమీదను, నా దాసురాండ్లమీదను నా ఆత్మను కుమ్మరించెదను గనుక వారు ప్రవచించెదరు.” (అపో.కార్య. 2:17-18).
    • ఎనిమిదవ వచనము: “మనము నీతిని అనుసరించి చేసిన క్రియలమూలముగా కాక, తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను, పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను, మనలను రక్షించెను. మనమాయన కృపవలన నీతిమంతులమని తీర్చబడి, నిత్యజీవమునుగూర్చిన నిరీక్షణనుబట్టి, దానికి వారసులమగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తుద్వారా ఆయన మనమీద సమృద్ధిగా కుమ్మరించెను.” (తీతు. 3:5-70).
  3. ఆత్మబాప్తిస్మము:- “యూదులమైనను, హెల్లేనీయుల మైనను, దాసులమైనను, స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరములోనికి, ఒక్క ఆత్మయందే బాప్తిస్మము పొందితిమి. మనమందరము ఒక్క ఆత్మను పానము చేసినవారమైతిమి.” (1కొరింధి. 12:13). పరిశుద్ధాత్మాభిషేకము, పరిశుద్ధాత్మ కుమ్మరింపు, ఆత్మబాప్తిస్మము ఇవి పరిశుద్ధాత్మ బాప్తిస్మముయొక్కపేర్లు (మత్తయి. 3:16).

3. ప్రశ్న :- ఏడవ వచనములో నుదహరించిన అంత్య దినములలో అను మాటకర్ధమేమి?

జవాబు:-
4. ప్రశ్న :- పరిశుద్ధాత్మ బాప్తిస్మము మొదటిసారి ఎప్పుడు కలిగినది?

జవాబు:- ఈ భూమిమీద క్రీస్తుపభువుయొక్క రక్షణకార్యము సంపూర్తియైన పిమ్మట ఆయన పరలోకమునకు వెళ్ళిన తరువాత, ఈ బాప్తిస్మము మొదటిసారి పాతనిబంధన ప్రజలైన యూదులు పెంతెకొస్తు పండుగ చేసికొన్నప్పుడు కలిగినది. గనుక ఈ పరిశుద్ధాత్మ బాప్తిస్మము క్రైస్తవ సంఘముయొక్క బాప్తిస్మమనియు, యూదుల మతసంబంధమైన బాప్తిస్మము కాదనియు ఇందువల్ల తీర్మానమగుచున్నది.

5. ప్రశ్న :- అయితే పరిశుద్ధాత్మ బాప్తిస్మమునుగూర్చి పాతనిబంధనలో లేదా ఏమి?

జవాబు:- అది ప్రవచన రూపముగా ఉన్నది. అనగా ఇకముందునకు జరుగునని ఉన్నది. పాత నిబంధన కాలపువారు పొందినట్లు లేదు.
సామె. 1:23; యెష. 32:13-15 యెష 44:3; యెహెజ్కే 39:29; యోవేలు. 2:28-29; జెకర్యా. 12:10. పూర్తి వాక్యముల కొరకు రెండవ ప్రశ్న జవాబులోని రెండవ భాగము చూడండి.