అన్న చరిత్ర
(యం. దేవదాసు అయ్యగారి ఉపదేశములు)
తండ్రి: ఆది. 4:1-2; కుమార: లూకా 2:36-38 పరిశు: 1తిమోతి. 5:1-16.
ప్రార్ధన:- స్తోత్రార్హుడవైన ఓ తండ్రీ! నీ ఆలయమునందు సమావేశము కాగల కృప అనుగ్రహించినందుకు స్తోత్రములు. మేము మరలా నీ వాక్య వివరములను విచారించుకొననైయున్నాము గాన నీ ఆత్మ సహాయమునిమ్ము అప్పుడు నీ వాక్యములోని నిజసంగతులు గ్రహించగలము. నీ ఆత్యద్వారా మా మనస్సాక్షిని వెలిగించుము. అప్పుడు మాకు విశ్వానము కలుగును. మా విశ్వాసమును వెలిగించుము. అప్పుడు మాకు ప్రత్యక్షత కలుగును. నీ ఆత్మచేత మా ప్రయత్నమును వెలిగించుము. అప్పుడు మాకు నీ వాక్యాపేక్ష కలుగును. మరియు నీ వర్తమానము ఒక్కొక్కరికి అనుగ్రహించుము. నీ వాక్యధ్యానములో వ్యతిరేక సంగతులు రాకుండునట్లు సహాయపడుమని త్వరగా వస్తున్న ప్రభువుద్వారా వేడుకొంటున్నాము. ఆమేన్.
అన్న ఆషేరు గోత్రికురాలు. ఈమె పనూయేలు కుమార్తె, ప్రవక్త్రి ఉద్యోగము గలది. శిశువైన ప్రభువును దేవాలయమునకు తెచ్చినపుడు, ఆమెకూడ లోపలికి వచ్చినది. ఈమె ఉపవాసపరురాలు, ప్రార్ధనాపరురాలు. ఆమె నివాసము దేవాలయమే. ఈమె 84సం॥ల అనుభవము గలది. ఇశ్రాయేలుయొక్క విమోచనను గూర్చి కనిపెట్టువారితో ఈమె సహవాసము చేసెడిది. ఈమె ఉపవాసము చేసినదని, ప్రార్థించినదని బైబిలులో ఉన్నది. ఇవి రెండును రెండు గొప్పపనులు.
సృష్టియారంభమున నిలువబడిన స్త్రీ హవ్వ, నాలుగువేల సం॥లకు మరియొక స్త్రీ వచ్చెను. ఆమె ప్రభువు తల్లియైన మరియ. ఇప్పుడు హవ్వను గూర్చి అన్ననుగూర్చి తెలుసుకొందాము. పై ఇద్దరివలె (హవ్వ, మరియమ్మ), వీరిద్దరునూ (హవ్వ, అన్న) వ్యతిరేకమైన స్త్రీలు. అన్న అనేక ఉపవాస ప్రార్ధనలు చేసినది. ఈమె ఉపవాసానికి వెనుక ఉన్న 4 వేల సం॥లు క్రిందకు వెళ్ళితే అక్కడ హవ్వ ఉన్నది. హవ్వ, దేవుడు తినవద్దని చెప్పిన ఫలము తిన్నది. అది ఉపవాసముకాదు గాని తిండి. హవ్వ అపాయకరమైన కానిపండును తిన్నది; అన్న తిండి మానివేసినది! ఇద్దరికి ఎంత బేధము? మనకాలములోను తినకూడనివి తిని జబ్బులు తెచ్చుకొనేవారున్నారు. ఉపవాసముండకుండా, కొందరు అనేక ప్రార్ధనలు చేయుదురు. అయిననూ వారికి నెరవేర్పు త్వరగా ఉండదు. హవ్వ తిండి మెచ్చుకోదగినదికాదు. అన్న ఉపవాసము మెచ్చుకోదగినది. మనమును ఉపవాసము చేస్తే అన్నవలె ధన్యులౌతాము. ఒక రోజంతా ఉపవాసముండి ప్రార్ధన చేస్తే ఎన్నో సంగతులు మనకు బైలుపడును.
అన్న ముందు చేసిన పని ఉపవాసము, తరువాత చేసిన పని ప్రార్ధన. మధ్యలో చేసినపని ఇతరులతో మాట్లాడుట. రక్షకుడు వచ్చి మనలను విమోచించునని, రక్షకుని కొరకు ఎదురుచూచేవారితో ఆమె చెప్పినది. అవి
- 1) మంచిమాటలు,
- 2) ఆదరణ మాటలు,
- 3) సంతోషముగల మాటలు. తాను చెప్పదలచినవారితోనే ఆమె ఆ మాటలు చెప్పెను.
హవ్వ - 'నాకు సర్పము కనబడినది, పండు తినమన్నది, నీకు తెచ్చినానని' చెప్పకూడని మాటలు చెప్పింది. పిశాచి సంబంధమైన మాటలు, అపాయకరమైన మాటలు, పాపములో పడవేసే మాటలు చెప్పింది. అన్న అయితే రక్షణ మాటలు, విమోచన మాటలు, యోగ్యమైన మాటలు, ఉపయోగకరమైన మాటలు చెప్పెను. అలాగే మనమును మన మాటలలో మేలున్నదా? కీడున్నదా? అని ఆలోచించవలెను. హవ్వవలె ఉండకుండా, అన్నవలె మేలుకరముగా ఉండవలెను.
అన్న -
- 1) ఉపవాసము,
- 2) మేలుకరమైన సంభాషణ,
- 3) ఇతరులకు ప్రార్ధన నేర్చినది.
ఉపవాసము చేసిన విలువ, రేయింబవళ్ళు చేసిన విలువ, అన్న చేసిన అ ప్రార్ధనలో యున్నది. వెల కట్టాలంటే మన ప్రార్ధనకు ఏమి వెలకట్టగలము! అన్న ప్రార్ధనకు “ఉపవాసము, రాత్రింబగళ్ళు” అనే విలువ ఉన్నది. మనమును అన్న మాదిరి నేర్చుకొని ఆలాగు చేయవలెను. అన్న అయితే దేవుని సన్నిధిలో ఉపవాసముండి మనవులునూ, ప్రార్ధనలునూ చేసి జవాబులుపొంది, వాటిని ఇతరులకు చెప్పినది.
హవ్వ - దేవుని సన్నిధిలోనుండి పారిపోయినది. అంతకుముందు దేవుని సహవాసము చేసిన స్త్రీ, ఇప్పుడు పారిపోయినది. ఎంత దుస్థితి! అన్న పాత నిబంధనలోని కడవరి స్త్రీ క్రొత్త నిబంధనలోని మొదటి స్త్రీ. మనలో ఎంతమంది దేవుని సన్నిధిలోనుండి పారిపోతున్నాము? అన్నవలె దేవుని సన్నిధిలోకి వెళ్ళాలి గాని పారిపోకూడదు. మనమెంత ఎంత పాపులము! ఎంత అవిశ్వాసులము! ఎంత ఇష్టములేని వారమైనను బలవంతముగా నైనను, దేవుని సన్నిధికి వెళ్ళవలెను. గానీ హవ్వమ్మవలె చెట్టుచాటున దాగియుండేవారమై యుండకూడదు. మనము సన్నిధిలోనికి వెళ్ళితే
- 1) పాపము పోవును,
- 2) దేవునిమీద ఇష్టము కలుగును,
- 3) బలము కలుగును. ఆ కుటుంబీకురాలు అనగా భర్త ఉన్న హవ్వమ్మ ఈ పని చేయలేదు గాని భర్తలేని అన్నమ్మ ఈ గొప్ప పని చేయగలిగినది. పాప విషయములు విసర్జించి, అన్నమ్మ మాదిరి అన్ని విషయములలో అవలంభించిన యెడల దేవుని వలన మెప్పు పొందుదుము.
అన్నలోని నాలుగు విషయములు:-
ఇతరులతో మాట్లాడి ఆదరించుటనేది గొప్ప సేవయేగాని, ప్రార్ధించి ఉపవాసము చేయుటే అన్నిటికి మించిన సేవయని అనవచ్చును.
- 1) ఉపవాసము చేయుట,
- 2) ప్రార్ధించుట
- 3) ఉపవాసముండి పగలు ప్రార్ధనచేయుట,
- 4) ఉపవాసముండి రాత్రి ప్రార్ధనచేయుట.
ఈ నాలుగును గొప్ప సేవయై ఉన్నవి. “మనుష్యులను తమ పాపములనుండి లాగి, రక్షకునియొద్దకుచేర్చే సేవ కొరకై ఎక్కడికి వెళ్ళక సోమరిగా గుడిలో ఉపవాసముండి సేవచేయుచున్నావా! ప్రార్థిస్తున్నావా!” అని అన్నవలె చేయువారిని చూచి, నిందించే లోకపు మనుష్యులు ఉన్నారుకదా!
ఉపవాసము చేయుట, ప్రార్ధించుట ఆ గొప్ప సేవకంటే గొప్ప సేవ
- 1) దేవునిని నిందించుట,
- 2) మనుష్యులను నిందించుట,
- 3) సువార్త ప్రకటించుట; ఈ మూడు సేవలు అన్నమ్మ సేవకంటే తక్కువైన సేవే.
ప్రభువా! నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? సువార్త ప్రకటించలేదా? అని అడిగినవారి విషయములో; దయ్యములను వెళ్ళగొట్టి, అద్భుతములతో కూడిన సేవ చేసినవారిని అంత్యదినముల యందు ఆయన అంగీకరించలేదు. ప్రియులారా! సువార్త సేవ అనగా మనుష్యులను ఆదరించుట. దేవుని సేవించుటలో ఉండి ప్రార్థించక, ఉపవాసము చేయకపోతే, పై మూడును వెళ్ళిపోవును. దేవుని నన్నిధిలో బలము పొందకపోతే సైతానుని ఎదిరించలేము, దుష్టులైన మనుష్యులను ఎదిరించలేము. అన్న ఎంత ధన్యురాలు!
- 1) ఉపవాసముచేసిన స్త్రీ,
- 2) బోధించే స్త్రీ
- 3) ప్రార్ధించే స్త్రీ,
- 4) ప్రవక్త్రియైన స్త్రీ అని లూకా వ్రాసెను. ఈమె ఏ పుస్తకములు వ్రాసినది! గాని ఈమె గొప్ప ప్రవక్త్రి.
అన్న చేసిన పనులు:-
- 1) ఉపవాసప్రార్థన,
- 2) ప్రార్ధన ప్రార్ధన,
- ౩) స్తుతి ప్రార్ధన,
- 4) సువార్త పని,
- 5) బైబిలు చదువుట.
పై మూడు దేవుని సన్నిధిలోనివి. చివరి రెండు వెలుపల చేయవలసినవి. 80 సం॥ల వయస్సులో పై నాలుగు గుణములు గల అన్నమ్మ, పాత నిబంధనయొక్క చివరి కాలములో మరియు క్రొత్త నిబంధనయొక్క మొదటిలో అనగా ప్రభువు మొదటి రాకడలో నిలువబడి, పై నాలుగు సంగతులు చెప్పుచున్నది. మొదటి రాకడ మొదలు రెండవరాకడ వరకు మనము ఉన్నాము, అనగా ఈ (when edited, 2024వ) సం॥ము వరకు ఉన్నాము. ఆమె మొదటిరాకడ స్త్రీయైతే మనము రెండవరాకడ (సంఘ స్త్రీ) జనమై యున్నాము.
అన్న మనకు నేర్పు పాఠము:-
మొదటిగా మొదటిరాకకు ఆమె కనిపెట్టగా, ఆమె నిరీక్షణ నెరవేరెను. అలాగే మనమును కనిపెట్టుచున్నాము గనుక
మన
నిరీక్షణకూడ తప్పక నెరవేరును. ఏ విధముగా నెరవేరును? ఒక ముసలాయన, ఒక ముసలమ్మ ఉన్నారు. ఆ ముసలాయన (సుమెయోను)
సలాము చెప్పి
వెళ్ళి చనిపోయెను. ప్రభువును చూచి చనిపోయెను. అయితే, ఆమె చనిపోయినట్లు రికార్డులోలేదు.
- 1) సుమెయోను మృతుల గుంపునకు గుర్తు,
-
2) అన్న సజీవుల గుంపునకు గుర్తు. రేపు ప్రభువు వచ్చినప్పుడు ఆదాము మొదలుకొని రేప్చర్ వరకు
చనిపోయినవారికి, సుమెయోను
సూచనగా
ఉన్నాడు. సజీవులకు అన్న సూచనగా ఉన్నది. మృతులైన వారితో కలవక, పెండ్లికుమార్తె వరుసలోని సజీవులు రెండవ
రాకడవరకు
ఉందురని
లూకా
చెప్పుచున్నాడు. మొదట మృతులు తరువాత, సజీవులు మేఘములోనికి వచ్చెదరు. మనము ఏదో ఒక గుంపులోనికి తయారు
కావలెను. మనము
ఎన్ని
శ్రమలున్ననూ, ఊగులాడుచునైనా బిగబట్టుకుంటే సజీవులగుంవునకు తయారుకాగలము. వయస్సు చాలకపోతే మృతుల గుంపులో
ఉండండి.
- (1) సజీవులు,
- (2) మృతులు రేపు రాకడలో పాల్గొందురు.
వీరు పెండ్లికుమార్తెగా రాకడలో వెళ్ళుదురు. నేనింకా చెప్పుచున్నాను. అట్టి రాకడకు ఎందరెందరు సిద్ధముకాగలరో!
యెరూషలేములోనున్న దేవాలయములోనికి ప్రభువుని తీసికొని వచ్చినప్పుడు, అన్న సుమెయోనులు లోపలికి వచ్చిరి. వారు వచ్చినప్పుడు దేవాలయములో మొదటిరాక రక్షకుడున్నాడు. మొదటి రాకడలో
- 1) బేబీ (శిశువైన యేసు) గుడిలో ఉన్నాడు. రెండవ రాకడలో
- 2) పెండ్లికుమారుడైన ప్రభువు మేఘములో ఉన్నారు.
వారు గుడిలోనికి పోయిరి. అలాగే మనము మేఘములోనికి పోవలెను.
క్రొత్త సంగతి: అన్న చరిత్రలో ఆమె 7
సం॥లు కుటుంబీకురాలుగాను, 84 సం॥లు వితంతువుగాను ఉండెను. అది చాలా
విచారకరమైన సంగతి. 7సం॥లు లోకసంబంధమైన మంచితనము దేవుడు ఆమెకు ఏర్పర్చెను. లోకములోని మంచి 7సం॥లు గలదు,
84సం॥లు
దేవాలయములోని
మంచి కలదు. ఇది ఆమె ఆత్మీయజీవితము. మొదటిదైన లోకజీవితములో లోకములోని సజ్జనులతో కలిసియుండుట. ఆత్మీయ జీవితము
అనగా
పరిశుద్దులతో, దూతలతో, దేవునితో కలసియుండుట. ఈ 84 సం॥ములలో, ఆ మొదటి 7 సం॥ములు అంతా మంచివి కావు గాని
అంతకన్నా ఎక్కువ
మంచి
స్థితిలో మిగిలిన సం॥లలో గలదు. లోక జీవితము మంచిది గాని తరువాతి జీవితము ఇంకా చాలా ఎక్కువ మంచిది. అది 12
రెట్లు
గొప్పది. ఈ
గొప్ప దీవెన మీకందరకూ కలుగునుగాక! ఆమేన్.