రూతు సమర్పణ
(యం. దేవదాసు అయ్యగారి ఉపదేశములు)
తండ్రి: రూతు 1:16 కుమార: మత్తయి. 19:23-30; పరిశుద్ధాత్మ: ఎఫెసీ 2:18-22
రూతు హత్తుకొనియుండుట: - పరిశుద్ధదేశ ప్రయాణీకురాలితో రూతు హత్తుకొని యున్నది. యెహోవాను సేవించేవారియొద్దకు ఈమె వెళ్ళుచున్నది. ఎక్కడైతే ఆదరణ దొరుకుచున్నదో అక్కడకు వెళ్ళేవారిని ఆమె హత్తుకొనియున్నది. అట్లే భక్తులను హత్తుకొనియుంటే ఆ గుణములే మనకు దొరకును. రూతమ్మ చరిత్రలో రెండు సంగతులు కనబడుచున్నవి. మనము ఏమి తీర్మానము చేసికొనవలెనో ఆ తీర్మానము అనగా,
- 1) మళ్ళి పోవుచున్న అత్తగారితో వెళ్ళుట,
- 2) వెళ్ళిపోవుచున్న అక్క గారితో (ఓర్ప) వెళ్ళకపోవుట.
- (ఎ) అన్యుల దేశము వదలి వచ్చితిని,
- (బి) గనుక తిరిగి వెళ్ళను.
ఈ రెంటిలో ఏది గొప్పది? దేనికదే గొప్ప. పాతదేశము విడువవలెను. పరిశుద్ధ మార్గమున వెళ్ళవలెను. కొందరు అది విడువలేరు, గాని భక్తులతో ఉండవలెనని ఆశ. ఓర్ప ఎలుగెత్తి ఏడ్చినది. ముద్దుపెట్టుకొన్నది కాని వెళ్ళిపోయినది. పై రెండు మంచి పనులేగాని రూతు చేసిన వని చేయలేకపోయినది. అన్యులు కొన్ని అవలంభించగలరు గాని వారి మార్గము విడువలేక వెనుకకు తిరిగి వెళ్లెదరు. మీరు రోజూ మిటింగుకు రాగలరు! బోధ వినగలరు! కాని మీ అలవాటు మానరు. కనుక ఈ రెండు చేసి ప్రయోజనము లేదు. ఇదంతా ఊరు బయట కథ.
నయోమి తన కోడండ్రను రావద్దని బ్రతిమాలినదన్నమాట. అపుడు రూతు - “నన్ను రావద్దని, విడిచిపెట్టమని అనవద్దు” అన్నది. ఆలాగే మీరు వెళ్ళి తిరిగిపోయి, మీ పూజలు చేస్తే, పాదిరిగారు రేపటినుండి మీటింగుకు రావద్దనిన, మీరు వచ్చెదరా! మానెదరా! రూతు మానలేదు.
- 1) నీవు వెళ్ళుచోటికే వచ్చెదను,
- 2) నీవు నివసించు చోటనే నివసించెదను,
- 3) నీ జనమే నా జనము,
- 4) నీ దేవుడే నా దేవుడు,
- 5) నీవెక్కడ చనిపోతే నేను అక్కడ చనిపోయెదను,
- 6) ఎక్కడ పాతిపెట్టబడితే అక్కడ పాతిపెట్టబడెదను
- 7) మరణము తప్ప మరి ఏది నన్ను వేరుపరుపలేదు. అన్యులెవరైనా బోధకులదగ్గరకు వచ్చి, అటువంటి మాట అనగలరా? అనినను చేయగలరా?
- 8) హత్తుకొనియుండుట - ఇది క్రియ.
- 9) ఈ నిబంధనను, మధ్యనే వదలిన యెహోవా నాకు ఎంత కీడైనా చేయును గాక! అటువంటి గొప్ప మాట అనెను.
పై 8 సంగతులకు 9వది ముద్ర. ఇక విప్పుటకు వీలులేదు. It is like a postal seal on the stamps(అది తపాలా బిళ్ళలపై వేయబడిన లక్క ముద్రవలె ఉన్నది). ఈ 9వ సంగతి దేవుని దగ్గరకే వెళ్ళినది. (అన్యులలో కొందరు అన్ని వదలుకొని వచ్చి, మాకు ఏమి జరిగినా ఫరవాలేదు, మేము వెనుకకు తిరిగిపోము. తిరిగిపోయిన దేవుడే మమ్మును శిక్షించునుగాక! అని అనెడివారున్నారు). తీర్మానము ప్రకారముగా రూతమ్మ వెళ్ళవలెను. వెళ్ళకపోతే ఇదంతా సున్నా. తీర్మానము అయిన తరువాత వెళ్లి తీరవలెను.
రూతమ్మలో ఉన్న గొప్ప స్థితి:
- 1) తీర్మానము
- 2) ముద్ర
- 3) వెళ్లడము.
ఇట్టి తీర్మానము చేసినయెడల
మీరు పై 9వంటి వారగుదురు. ఓర్ప వెళ్ళిపోయినది. ఓర్ప ఒక శోధకురాలు, అన్యురాలు. ఓర్పవల్ల రూతమ్మ ఆకర్షింపబడలేదు. ఎవరైనా
క్రైస్తవులైతే, వారి బంధువులు ఏడ్చినా తిరిగి వెళ్లైదమనుకొందురు. అనగా వారి ఏడ్పువల్ల ఆకర్షింపబడుదురు. క్రైస్తవులైన
వారిని
ఇతర
అన్యులు శపించెదరు. అట్లుకాక రూతమ్మ తనను తానే శపించుకొన్నది. తాను తప్పకుండా స్థిరముగానున్నది కనుక ఆ శాపము తగలదు.
ఓర్పకు
ఇష్టమున్నది గానీ రాలేకపోయినది. అలాగే అన్యులకు క్రైస్తవమతములోనికి రావలెనని ఇష్టమేగానీ రాలేరు.
ఉదా: పిల్లవాడు
చెట్టుమీద
ఉన్న కోతిని రాయితో కొట్టినపుడు, ఆ కోతి తిరిగి పండుతో కొట్టగా, పిల్లవాడు ఆ పండు తీసికొని వెళ్ళినాడు. అలాగే అన్యులు
శపించిన అది మనకు దీవెనగానే ఉండును.
ప్రార్ధన:- దయగల తండ్రీ! ఆ నీ బిడ్డ ఊరిలోగాదు, గుడిలోకాదు దారిలోనే తీర్మానము చేసినది. అట్లే అందరు చేసికొనవలెను. పాడైన దేశమునుండి వజ్రమును లేపితివి. ఆమె వజ్రమై పరిశుద్ధ దేశమునకు వెళ్ళినది. అట్లు వీరిని చేయుమని త్వరగా రానైయున్న ప్రభువు నామమున వేడుకొనుచున్నాము. ఆమేన్.