ఎస్తేరు కథ
(యం. దేవదాసు అయ్యగారి ఉపదేశములు)
తండ్రి: ఎస్తేరు. 1:1-9; కుమార: మత్తయి 24:41; పరిశు: 2కొరింధీ 2:14.
దేవుడు ఇశ్రాయేలీయులకు తన కృపను అనేక విధములుగా కనుపర్చినప్పటికినీ వారు ఆయనమీద అనేక మారులు తిరుగుబాటు చేసినందున ఆయన వారిని శిక్షించెను. వారిని పదేపదే శిక్షించిన పిదప చివరకు వారిని చెరలోనికి పంపి బానిసలుగా చేసెను. ఈలాగు బానిసలుగా పర్షియా దేశమునకు కొనిపోబడిన వారిలో మొర్దెకై ఉండెను. ఈయనే ఎస్తేరును పెంచి పెద్దచేసెను. దైవసంకల్పమునుబట్టి ఎస్తేరు అహష్వేరోషు రాజుయొక్క భార్య ఆయెను. ఈ పర్షియా చక్రవర్తి 127 రాజ్యములను పరిపాలించెను. హిందూదేశము మొదలుకొని కూషు వరకు ఉన్న దేశములన్నిటిని ఏలెను.
ఇండియా (హిందూదేశము) పేరు ఎస్తేరు గ్రంథములో తప్ప మరి ఎక్కడను బైబిలులో కనబడదు. అహష్వేరోషు గ్రీకు దేశముమీదికి దండెత్తి దానిమీద జయము పొందినందున, ఆ సంతోషమును తెలియపర్చుటకు గొప్ప విందు గావించి తన రాజ్యములోని సంస్థానాధిపతులనందరిని ఆ విందుకు పిలిచెను. అప్పుడు ఇండియా నుండి కూడ అధిపతులు ఆ విందునకు వెళ్ళిరి. ఆ విందు బహు ఘనముగా జరిగినందున రాజు, తన రాణియైన వష్తి యొక్క సౌందర్యమును అందరకూ చూపించదలచెను. కానీ వష్తి నిరాకరించినందున, రాజు ఆమెను రాణిగా తొలగించి, ఎస్తేరును రాణిగా చేసెను. అయితే, యూదుడైన మొర్దెకై తనను గౌరవించనందున, మంత్రియైన హమాను యూదుల - నందరిని చంపుటకు తాకీదులు వ్రాసి, రాజుముద్ర వేయించెను. ఎస్తేరునందు రాజుకు మిక్కుటమైన ప్రేమయుండెను. దైవసంకల్పమునుబట్టి రాజు మొర్దెకైను తన సన్నిధిని ఘనపరచెను. మిమ్ములను చంపుటకు వచ్చిన వారిని మీరే చంపుడని రాజు ఆజ్ఞ చేసెను. ఈ విషయములో ఎస్తేరు మూడు దినములు ఉపవాసము చేసెను. యూదులు తమ శత్రువులలో 7,500మందిని చంపివేసిరి. ఈలాగు ఎస్తేరు వలన యూదులు రక్షింపబడిరి.
ఈ గ్రంథములో దేవుని పేరు లేదు గాని దేవుని సహాయమున్నది. ఆలాగే ఆయన మనకు కనబడకపోయినా రహస్యముగా సహాయము చేస్తూయున్నాడని దీనివలన గ్రాహ్యమగుచున్నది. ఒక స్త్రీ వలన అనేకమంది బ్రతికిరి. అహష్వేరోషు తన రాజ్యమహిమ చూపుటకు విందు చేయించెను. యేసుక్రీస్తు యువరాజు. భూలోకములో ఆయనకు సంఘమున్నది. అహష్వేరోషు వష్తిని విడిచినట్లుగా, క్రీస్తు ప్రభువు తన్ను అంగీకరించని వారిని ఈ లోకములోనే విడిచిపెట్టును. ఉపవాస ప్రార్ధనలతో తయారైన ఎస్తేరును రాజు ఏలాగు చేర్చుకొనెనో, ఆలాగు సిద్ధపడిన వారిని; పిలిప్పును ఆత్మ కొనిపోయిన రీతిని ప్రభువు పరలోకమునకు కొంచుపోవును. వష్తివలె నామక క్రైస్తవులు విడువబడుదురు. ప్రస్తుతము ఈ సిద్ధపడే పని భూలోకమందే జరుగుచున్నది. ఇద్దరు తిరగలి విసరుచుందురు. ఒకరు కొనిపోబడును, మరొకరు విడిచిపెట్టబడును. అనగా సిద్ధముగా ఉన్నవారు వెళ్ళిపోవుదురు, సిద్ధపడకుండా విసరువారు విడిచిపెట్టబడుదురు. సిద్ధపడకుండా తిరుగలి విసరువారు “ప్రభువు వచ్చినప్పుడు సిద్ధపడలేమా!” అని అనుకొందురు. వష్తిరాణి గుంపువారు ఇక్కడనే ఉందురు. వీరే పిలువబడిన వారు. ఈలాగు పిలువబడినవారు అనేకులు, ఏర్పర్చబడినవారు కొందరే (మత్తయి 24:41).
ఎస్తేరు రాణి వంశమువారు ఎవరనగా,
- 1. బైబిలు బాగుగా చదివినవారు,
- 2. ప్రార్ధన బాగా చేసినవారు,
- 3. సేవ బాగా చేసినవారు,
- 4. శ్రమలు బాగా అనుభవించిన వారే పెండ్లికుమార్తెగా సిద్ధపడి ఎస్తేరురాణి అంతస్థులో ఉండగలరు.
- 1) రాణీగా నుండుటకు ఎస్తేరు రాజునొద్దకు వచ్చెను.
- 2) ఎస్తేరు రాణిగా సిద్ధపడుటకు అనగా ఆమెను పెండ్లికుమార్తెగా తయారు చేయుటకు సహాయకారులగు స్త్రీలను, కావలసిన ఆభరణములను, వస్తువులను రాజు ఇచ్చెను.
ఎస్తేరు 12 నెలలు సిద్ధపడిన మీదట అప్పుడు పెండ్లి అయినది. హేగే ఈమెను రెండు రకములైన వస్తువులతో రాణిగా సిద్ధము చేసెను. అవి
- 1) చేదు వస్తువులు
- 2) సువాసన వస్తువులు.
- 1. చేదు వన్తువుల వివరము: చేదు సిలువకు గుర్తు. (సిలువ మీద యేసుప్రభువుకు చేదు చిరకానిచ్చిరి), ఈ చేదు, సిలువమీద ఆయన పొందిన శ్రమలకు సాదృశ్యముగా ఉన్నది. ఎన్ని నిందలు వచ్చినా, కలత లేకుండా సహించవలెను. ఇవి పెండ్లికుమార్తెకు తప్పనిసరిగా నుండవలెను.
-
2. సువాసన వివరము:- సువాసన అనగా రహస్యముగా కూడుకొనుట. ఈ సువాసన మనము రహస్యముగా ప్రభువు సహవాసములో గడుపు
సమయమునకు
సాదృశ్యముగా ఉన్నది. సువాసన ఏలాగు సుగంధ ద్రవ్యములనుండి వచ్చునో, ఆలాగే ఆయన దివ్య లక్షణములను బట్టి
పెండ్లికుమార్తెకు
సువాసన, సొగసు వచ్చును. సువాసన ఏలాగున బయటకు కనబడదో, ఆలాగే క్రీస్తుతో రహస్య సహవాసము చేయు వధువు సిద్ధబాటు
బయటకు కనబడదు.
ఈలాగు పెండ్లికుమార్తె ఆయన లక్షణములను రహస్యముగా తన అనుభవములోనికి తెచ్చుకొనుచు, సిద్ధపడుచుండును.
పెండ్లికుమార్తెగా
సిద్ధపడువారు ఆత్మ బాప్తిస్మమును పొందవలెను. అనగా ఈ మానవాత్మను, దైవాత్మతో ఏకము చేసికొని పరిశుద్దాత్ముని
రూపమును ధరించు
కొనవలెను.
సాధుసుందర్ సింగ్ గారు వ్రాసినట్లు “బొగ్గును ఎంత కడిగిననూ దాని నలుపును తొలగించుట అసాధ్యము. అయితే అది కాల్చబడినపుడు దాని నలుపు మాయమైపోవుచున్నది. అలాగే పాపి పరిశుద్దాత్మను పొందినపుడు అనగా అగ్ని బాప్తిస్మము పొందినపుడు, పాపము అను నలుపంతయు తొలగించబడుచున్నది. బొగ్గులోని అగ్నివలె పరిశుద్ధాత్ముడు మనలో నివసించుచుండును; ఆయన చెప్పిన అనుభవము ఇప్పుడే నెరవేరుచున్నది. అదే ఇప్పుడు మనలో జరుగుచున్నది.
(1) రాజు వష్తిరాణీని చంపుటకు ఒప్పుకొనలేదు, (2) పెండ్లికుమార్తెయైన ఎస్తేరును పోగొట్టుకొనలేదు. గాని వష్తిని, మంత్రియైన హమానును పోగొట్టుకొనెను. అలాగే ప్రభువుకూడ పెండ్లికుమార్తెను అనగా పరిశుద్ధ సంఘమును (కీర్తన 22:30,31), (దానియేలు 12:3) పోగొట్టుకొనడు. ఎస్తేరుకు తూర్పు దేశపు నక్షత్రమని పేరు. దానియేలు 12:3లో ఉన్నట్లు, పెండ్లికుమార్తె వరుసలోనివారు నక్షత్రములవలెనుందురు. రాజు వష్తిని చంపలేదు. ఆలాగే క్రీస్తుప్రభువు నామక క్రైస్తవులను నశింపచేయక, వారిని 7 సం॥ల శిక్షకు అప్పగించును. ఎస్తేరు గ్రంథములో అహష్వేరోషు రాజుపేరు 187సార్లున్నది. గాని దేవుని పేరు ఈ గ్రంథమందు ఒక మారైనను లేదు. కారణమేమనగా దేవుడు ఈ గ్రంథమందంతటనూ రహస్యముగా ఉండి తన పని జరిగించుచుండెను.
నిర్గమ కాండములో ఆయన “చాటునుండి మాట్లాడెను” అని ఉన్నది.
ఉదా: పొదచాటునుండి మోషేతో మాట్లాడుట, మేఘములోనుండి
ఇశ్రాయేలీయులతో
మాట్లాడుట. బైబిలులోని మిగిలిన పుస్తకములలోకూడ ఆయన చాటు చేసికొని మాట్లాడినట్లు వ్రాయబడియున్నది. అనగా మన
కష్టనష్టములలో
దేవుడు చాటునుండి సహాయము చేసియున్నాడు” అని మనము అనుకొనవలెను. అలాగే ఇక్కడ యూదులమీదకు వచ్చిన కష్టములో, ఆయన
చాటునుండి
వారిని
ఆదుకొనెను. అందుకు యూదులు పూదీము పండుగ ఆచరించి ఒకరికొకరు బహుమతులు పంపుకొన్నట్లు, మనమును ప్రస్తుతము
క్రిస్మస్ కాలములో
బహుమతులు పంపుకొనుచున్నాము.
ఎస్తేరు గుంపువారు చేయు ఆలోచన:-
- 1) బానిసనగు నన్ను రాజు ఎన్నుకొనునా? (ఇక్కడ అనుమానము లేదుగాని వినయము ఉన్నది).
- 2) బానిస అని తెలిసిన యెడల కత్తివాత తప్పదు.
- ౩) అయినను మనము ఏర్పర్చబడిన జనాంగము గనుక ధైర్యము తెచ్చుకొనెదము. ఈ రీతిగా ఆలోచించువారు పెండ్లికుమార్తె వరుసలో ఉండగలరు. "కత్తి తప్పుదు" అని తెలిసిననూ, సందేహించక ధైర్యముగా ఉండువాడు రాకడలో ఎత్తబడుదురు.
- 1) ప్రభువు నన్ను పెండ్లికుమార్తె వరుసలో చేర్చునా! (అనుమానము, సందేహము).
- 2) పెండ్లివస్త్రము ధరించుకొనని నీవు ఇక్కడకు ఎందుకు వచ్చినావు అని ప్రభువు అంటారేమోనని వీరు తలంచుదురు.
మత్తయి 22:12లో నున్నట్లుగా వీరు ఈ పెండ్లికుమార్తె వరుసలోనికి వచ్చుటకు సందేహింతురు గనుక వీరు రాకడలో ఎగిరి వెళ్ళలేరు. సందేహించువారు వష్తివలె విడిచిపెట్టబడుదురు. ఎస్తేరు వలె ధైర్యముగానుండి, వరుని ఎదుర్కొను భాగ్యము ప్రభువు ఈ పందిరిలో చేరినవారికి దయచేయునుగాక. ఆమేన్.