సందేశము: ఫాదర్. ముంగమూరి దేవదాసు
రక్షణదారి ఆహ్వానము
బైబిలు పాఠము: యోహాను. 3:16.
వాక్యపేక్ష ప్రియులారా! వాక్యాహాన్వము అందుకొని వాక్యాకర్షణలోనికి వచ్చినవారలారా! వాక్యానంద సంపూర్ణత మీకు కలుగునుగాక! ఆమేన్.
ఉదయకాలము రాజవీధిలోని వర్తమానము విన్నాము. ఆ వర్తమానము అందరికిని. ఇప్పుడు ద్వారమువద్ద వర్తమానము నేర్చుకొందాము. ఇది అందరికి కాదు. ఏర్పాటు సంఘముయొక్క ద్వారము దగ్గర వర్తమానము. ఎవరైతే రాజవీధిలో వర్తమానము విని, ద్వారముదగ్గరకు వస్తారో వారికే ఈ వర్తమానము. అక్కడనుండి మందిరములోనికి పరిశుద్ధ స్థలములోనికి రావలెను. యోహాను 6:37; మత్త. 11 చివరిలో ఉన్నది. నాయొద్దకు వచ్చువానిని నేనెంత మాత్రమును త్రోసివేయను. రాజవీధిలోని వర్తమానము బహువచనము. ద్వారము దగ్గరి వర్తమానము ఏకవచనము. నేను పిలిచినాను గనుక త్రోసివేయను. ఇది ప్రతివారికి సంబంధించినది. ప్రభువు ద్వారము దగ్గర ద్వారపాలకుడుగా ఉన్నారు. నేనే మార్గమునైయున్నాను, నేనే ద్వారమునైయున్నాను. నా ద్వారా వస్తే గాని ఎవరును లోపలికి వచ్చుటకు వీలులేదు. ద్వారముమీద వ్రాత "నాయొద్దకు వచ్చువానిని..." యోహా. 3:16వ వచనము. ప్రతివాని నిమిత్తమును ఆ వాక్యము ఉన్నది. ప్రభువు సత్కార వాక్యములద్వారా ద్వారమందు దగ్గర నిలువబడి, వచ్చువారిని లోపలికి తీసికువచ్చేవారైయున్నారు. భోజనమైన తరువాత రాత్రివేళ నీకొదేము అనే పండితుడు ఆయన వద్దకు వచ్చినాడు.
ఒక్కడే వచ్చినను ఒక్కడవే వచ్చినావా! అని అనలేదు. ఆ ఒక్కనికే బోధించినారు. 10మంది వరకు ఆయన చూడరు. ఆ ఒక్కరు వచ్చినా వారిని లోపలికి ప్రవేశ పెట్టినారు. అందరూ, సమయము కొరకు, వీలుకొరకు కనిపెట్టుదురు. అయినను ప్రభువు వచ్చినవారిని చేర్చుకొనుచునే ఉండును. ద్వారపాలకుని పని కనిపెట్టేపని గనుక ఆయన ద్వారము తెరిచేయుంచుదురు. ఆయన సత్కరించుచునే ఉన్నారు. రెంటికి చిన్న భేదమున్నది. "భోజనమునకు అందరు రావలెను అని పిలిస్తే కొంతమంది రాకపోవచ్చు". కాని వచ్చినవారు సందేహించుటకు వీలులేదు. "అందరిని రమ్మని పిలిచినాను గాని నిన్ను రమ్మనలేదుగదా" అని అనరు. గనుక నీవును రావచ్చును. ఆయన అందరినీ చేర్చుకొనే తండ్రియై యున్నారు. రాజవీధిలో పిలిచే తండ్రి, ద్వారము దగ్గర సత్కరించే తండ్రి; ఒక్కరు వస్తే ఒక్కరికికూడ సమాధానముచెప్పి, లోపల ప్రవేశపెట్టే తండ్రి, ఎండవేళ దాహమైనప్పుడు ఒకరికే వర్తమానమిచ్చి ఒక్కరినే రక్షించినాడు. గ్రామములోనికి వెళ్ళి అందరిని తీసికొనిరాగా అందరిని రక్షించినాడు. 10మందితో రావడము మనకు బిడియము. అందరూ చూస్తే, పడతారుగనుక ఒక్కరే రావచ్చును.
2వ విషయము: "త్రోసివేయను". ఎవరైనా సరే, వస్తే, ఆయన ఆదరిస్తారు, చేర్చుకుంటారు. గనుక "నన్ను చేర్చుకొనరు" అని తలంచకూడదు. నాయొద్దకు వచ్చువారిని త్రోసివేయను. మిక్కిలి సంతోషకరమైన మాట చేర్చుకొందును. రాజవీధిలో బైలుదేరిన ఆయన పిలుపును అందుకొని, ఆహ్వానమును ద్వారా ద్వారము దగ్గరకు వచ్చినారు. గనుక త్రోసివేయరు. రమ్మంటే విని ఆనందించి వచ్చినాను, గానీ మధ్య సందేహములు పుట్టినాయి. "నీవు పాపివి, నిన్ను రమ్మన్నానా" అని అంటారా! అని భయవడుదురు గనుకనో త్రోసివేయనని చెప్పునారు. త్రోసివేసేవాడనైతే మీరున్న స్థలమునకు ఎందుకు వస్తాను? త్రోసివేసేవాడైతే అందరిని ఎందుకు పిలుస్తాను? మనము సందేహిస్తాము గనుక త్రోసివేయనన్నారు. తప్పిపోయిన కుమారుని సందేహించక చేర్చుకున్నారు. అదే తండ్రియొక్క రక్షణ. మానవులు ప్రభువును త్రోసివేయవచ్చు, వర్తమానములు త్రోసివేయవచ్చును, గానీ ప్రభువు వారిని త్రోసివేయలేదు. అందరి కొరకైన ఆహ్వాన వర్తమానము ఒక్కొక్క వర్తమానముగా ప్రత్యక్షమైనది. గనుక ఆనందింపవలసినదే. ఏకారణముచేతనైన త్రోసివేయడు. ఆది. 3: 15లో రక్షణ వాగ్ధానము ఉన్నది. యోహాను 3:16లో రక్షణ చరిత్ర తెలియపర్చినారు. ఆది సువార్త 3:15లో ఉన్నది. అందులోనే బైబిలంతా ఇమిడియున్నది. ఆది. 3:24లో బైటకు వెళ్ళిపొండనే మాట చెప్పినారు. ఏదేను తోటలోని సాదృశ్యము. మామిడి తోటలో ఉన్న ముసిడిచెట్టు పండును ఆ తోట యజమానుని కుమారుడు తినెను. అపుడు తండ్రి ఆ కుర్రవాని చేతులు కడిగి. ఇంటికి పంపి ఎప్పుడు ఇక తోటకు రావద్దు. నీకు కావల్సినవి నేనే తెస్తానని చెప్పిరి. ఎంత మంచిమాట! ప్రకటనలో ఏడేండ్ల శ్రమలో శ్రమానుభావశాలులు వస్తే, కోటానుకోట్లు రక్షించబడినవారుగా చేర్చుకొనబడినవారుగా ఉన్నారు అని ఉన్నది. కాబట్టి మనము మిక్కిలి సంతోషముగా ఉండవలెను. “ఆకాశము, భూమి గతించునుగాని నా మాటలు ఏమాత్రమును గతింపవు. నాయొద్దకు వచ్చువానిని నేను త్రోసివేయను”. ఏ మాత్రము దేనికైనా రావద్దు అనను, దేనినైనా త్రోసివేయను. త్రోసివేయటము ఒక క్రియ. సందేహము కూడదు.
దేనికైనా అనేది ఒక పలుకు. హాస్యమునకైనా త్రోసివేయను. గనుక మనము ఆయన దగ్గరకు వచ్చుటకు ఏమాత్రము సందేహింపకూడదు. రావలెనని ఉద్దేశ్యము కలిగినప్పుడు వచ్చి వేయవలసినది.
ఉదా: నా యొద్దకు వచ్చువానిని నేనెంత మాత్రము త్రోసివేయలేదు. నాయొద్దకు నా కుమారుడు వచ్చినాడు గనుక త్రోసివేయను. చిన్న కుమారుని కథలో అంతా చెడుగే ఉన్నది. కాని ఒక మంచి ఉన్నది. అదేమంటే ఆయన వద్దకు వచ్చుట. రావడము తండ్రికి ఇష్టమైన కార్యము. కుమారుడు వచ్చిన లక్షణముచూచి తండ్రి సంతోషించినారు. రావడమనేదే మంచి క్రియ. ఆ రావడమునుచూచి తండ్రి బహుగా సంతోషించినారు. ఎంత పాపియైన సరే. ప్రభువు వద్దకు వస్తే పాపి, కుమారుడుగా మారిపోవును.
- 1. త్రోసివేయను,
- 2. ప్రతివారు
- 3. నాయొద్దకు,
- 4. రావడమనే సుగుణము.
ఈ మహా దివ్య వాక్యమును మీ హృదయములందు ముద్రించు
కొందురుగాక!
ఉదా: వినబడే వర్తమానము త్రోసివేయను. అందరికేనా? కొందరికేనా? అని ప్రశ్న వస్తే జవాబు: ఒక్కొకరికి కూడా
అని
చెప్పవలెను. తండ్రియొద్దకు వచ్చు ధన్యత ఆత్మ తండ్రి చదువరులకు అనుగ్రహించును గాక! ఆమేన్.